Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అపొస్తలుల కార్యాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    41—“ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే”

    పౌలు కైసరుకు విజ్ఞప్తి చేసుకున్నాడు. కనుక పౌలును రోముకు పంపటం తప్ప ఫేస్తుకి మార్గాంతరం లేదు. అయితే తగిన ఓడ దొరకటానికి కొంత కాలం పట్టింది. పౌలుతో పాటు ఇతర ఖైదీల్ని పంపాల్సి ఉన్నందున వారి కేసుల పరిగణన కూడా ఆలస్యానికి కారణమయ్యింది. తన విశ్వాసానికి కారణాల్ని కైసరయలోని ప్రముఖ వ్యక్తుల ముందు, హేరోదుల్లో చివరివాడైన రెండో అగ్రిప్పరాజు ముందు వివరించటానికి ఈ వ్యవధి పౌలుకి అవకాశాన్నిచ్చింది.AATel 308.1

    “కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు బెర్నీకేయు ఫేస్తు దర్శనము చేసికొనుటకు కైసరయకు వచ్చిరి. ఏమనగా - ఫేలిక్సు విడిచి పెట్టిపోయిన యొక ఖైదీయున్నాడు. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులును యూదుల పెద్దలును అతనిమీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలెనని వేడుకొనిరి.” ఖైదీ కైసరుకు విజ్ఞప్తి చెయ్యటానికి దారితీసిన పరిస్థితుల్ని తెలిపాడు. లోగడ తనముందు విచారణ జరిగిందని యూదులు అతని మీద తాననుకొన్న నేరాలేమో మోపలేదని కాని “తమ మతమును గూర్చియు, చనిపోయిన యేసు అను ఒకని గూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను. ఆ యేసు బ్రతికియున్నాడని పౌలు చెప్పెను.” అని తెలిపాడు.AATel 308.2

    ఫేస్తు తన కథను చెప్పినప్పుడు అగ్రిప్పకు ఆసక్తి కలిగి ఇలా అన్నాడు, ” ఆ మనుష్యుడు చెప్పుకొనునది నేనును వినగోరుచున్నాను.” అగ్రిప్ప కోరిక మేరకు మర్నాటికి ఒక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. “కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నీకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి, సహస్రాధిపతితోను పట్టణమందలి ప్రముఖులతోను అధికార మందిరములో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞనియ్యగా పౌలు తేబడెను.”AATel 308.3

    తన సందర్శకుల గౌరవార్థం ఈ సందర్భాన్ని ఓ బ్రహ్మాండమైన ప్రదర్శనగా చెయ్యాలని ఫేస్తు ఉద్దేశించాడు. న్యాయాధికారి అతడి అతిథుల విలువైన దుస్తులు, సైనికుల ఖడ్గాలు, సైన్యాధిపతుల ధగధగ మెరిసే యుద్ధకవచాలతో ఆ దృశ్యం కన్నుల విందు గొల్పింది.AATel 309.1

    సంకెళ్లతో ఉన్న పౌలు ఇప్పుడు సభముందు నిలిచి ఉన్నాడు. ఈ దృశ్యం ఎంత వ్యత్యాసంగా కనిపిస్తుంది! అగ్రిప్ప బెర్నీకేలకు అధికారం హోదా ఉన్నాయి. అందువల్ల వారిని లోకం గౌరవిస్తుంది. అయితే దేవుడు గౌరవించే గుణగణాలు ప్రవర్తన వారిలో లోపించాయి. వారు ఆయన ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినవారు. వారి హృదయం జీవితం దుర్నీతిమయం. వారి క్రియాసరళి దేవునికి హేయం.AATel 309.2

    తనను కావలికాస్తున్న సైనికుడికి గొలుసులతో బంధితుడై ఉన్న ఈ వృద్ధ ఖైదీ ఆకృతిలో ప్రపంచం నివాళులర్పించటానికి హేతువేమిలేదు. అయినా ఆస్తి అంతస్తు లేనట్లు కనిపిస్తున్న క్రీస్తు పై తన విశ్వాసం కారణంగా ఖైదీగా ఉన్న ఈ వ్యక్తిపట్ల పరలోకమంతా ఆసక్తి కలిగివుంది. అతని సహాయకులు దేవదూతలు. ఈ దేవదూతల్లో ఒక్క దూత ప్రభావం ప్రకాశించటం జరిగితే ఆ రాజవంశీయుల ఆడంబరం, అహంకారం మాయమయ్యేవి. క్రీస్తు సమాధివద్ద రోమా భటుల మాదిరిగా రాజు ఆ స్థానికులు నేలకూలేవారు.AATel 309.3

    ఫేస్తు ఈ మాటలతో పౌలును సభముందు నిలిపాడు: ” అగ్రిప్ప రాజా, యిక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనుష్యుని చూచుచున్నారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరును - వీడు ఇక బ్రదుకతగడని కేకలు వేయుచు అతని మీద నాతో మనవి చేసికొనిరి. ఇతడు మరణమునకు తగినదేమియు చేయలేదని నేను గ్రహించి, యితడు చక్రవర్తి యెదుట చెప్పుకొందునని అనినందున ఇతని పంప నిశ్చయించియున్నాను. ఇతనిగూర్చి మన యేలినవారి పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది, ఏమియులేదు గనుక విచారణయైన తరువాత వ్రాయుటకు ఏమైనను నాకు దొరకవచ్చునని మీ యందరియెదుటికిని, అగ్రిప్పరాజా, ముఖ్యముగా మీ యెదుటికిని, ఇతని రప్పించి యున్నాను. ఖయిదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండ అతని పంపుట యుక్తముకాదని నాకు తోచుచున్నది.” AATel 309.4

    అగ్రిప్పరాజు ఇప్పుడు మాట్లాడటానికి పౌలుకు అనుమతినిచ్చాడు. తన శ్రోతల తళుకు బెళుకుల్ని బట్టిగాని ఉన్నత హోదాని అంతస్తుని బట్టిగాని అపొస్తలుడు తికమకపడలేదు. లౌకికమైన భాగ్యగాలు అంతస్తులు ఎంత నిరర్ధకమైనవో అతనికి తెలుసు. సంబంధిత భాగ్యం అధికారం తన ధైర్యాన్ని దెబ్బతియ్యలేవు. తన ఆత్మ నిగ్రహాన్ని హరించలేవు.AATel 309.5

    “అగ్రిప్ప రాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగినవారు గనుక యూదులు నామీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేడు తమరియెదుట సమాధానము చెప్పుకొనబోవు చున్నందుకు నేను ధన్యుడననియనుకొనుచున్నాను. తాల్మితో నా మనవి వినవలెనని వేడుకొనుచున్నాను” అన్నాడు.AATel 310.1

    పౌలు తన మతపరమైన మార్పును గురించిన చరిత్రను వివరించాడు. మొండి అవిశ్వాసం నుంచి నజరేయుడైన యేసును లోక రక్షకుడుగా విశ్వసించటం వరకూ తన కధను చెప్పాడు. తన పరలోక దర్శనాన్ని వర్ణించాడు. ముందు అది తనను భయకంపితుణ్ణి చేసిందని తర్వాత అది గొప్ప ఆదరణకు మూలమయ్యిందని అనగా దేవుని మహిమ ప్రదర్శితమయ్యిందని, ఆ మహిమ మధ్య తాను ఎవరిని తృణీకరించి ద్వేషించి ఎవరి అనుచరుల్ని నిర్మూలించటానికి ప్రయత్నించాడో ఆ ప్రభువు సింహాసనాసీనుడై ఉండటం చూశానని చెప్పాడు. ఆ క్షణం నుంచి పౌలు ఒక నూతన వ్యక్తి అయ్యాడు. యేసుని యధార్ధంగా విశ్వసించాడు. ఆ మార్పు దైవ కృప ప్రభావంవల్ల కలిగింది.AATel 310.2

    భూమిపై క్రీస్తు జీవితానికి సంబంధించిన సంఘటనల్ని స్పష్టంగాను శక్తిమంతం గాను పౌలు అగ్రిప్సముందు వివరించాడు. ప్రవచనం పేర్కొంటున్న మెస్సీయా నజరేయుడైన యేసుగా వచ్చాడని సాక్ష్యమిచ్చాడు. మెస్సీయా మానవుల మధ్య నరుడుగా అవతరిస్తాడని పాత నిబంధన ప్రవచనం ఎలా చెబుతున్నదో, మోషే ప్రవక్తలు పేర్కొన్న వివరాలన్నీ యేసు జీవితంలో ఎలా నెరవేరాయో పౌలు వివరించాడు. నశించిన ప్రపంచాన్ని విమోచించేందుకోసం దేవుని కుమారుడు సిలువను పొంది సిగ్గును భరించి మరణం పై సమాధిపై విజయుడై పరలోకానికి వెళ్ళాడు అని చెప్పాడు.AATel 310.3

    క్రీస్తు మృతుల్లోనుంచి లేచాడని ఎందుకు నమ్మరు? అని పౌలు వాదించాడు. ఒకప్పుడు అది తనకు కూడా అలాగే కనిపించింది. అయితే తాను చూసిన దాన్ని తాను విన్నదాన్ని అతడు నమ్మకుండా ఎలా ఉండగలడు? దమస్కు పట్టణ ద్వారం వద్ద అతడు సిలువను పొంది తిరిగిలేచిన క్రీస్తును వాస్తవంగా చూశాడు. ఆయన యెరూషలేము వీధుల్లో నడిచిన, కల్వరి మెట్టపై మరణించిన, మరణం వేసిన సంకెళ్లను బద్దలు కొట్టిన, పరలోకానికి ఎగసిన క్రీస్తే, పేతురు, యాకోబు, యోహానులు లేక తక్కిన శిష్యులు ఆయన్ను ఎలా చూశారో అలాగే పౌలు కూడా చూశాడు ఆయనతో నడిచాడు. సమాధి నుంచి లేచిన రక్షకుని సువార్త ప్రకటించమని ఆ స్వరం ఆదేశించింది. దానికి లోబడకుండా అతడెలా ఉండగలడు? దమస్కులో, యెరూషలేములో, యూదయ అంతటిలో, దూరప్రాంతాల్లో సిలువను పొందిన యేసునుగూర్చి అతడు సాక్ష్యమిచ్చాడు. అన్ని తరగతుల ప్రజలు “మారు మనస్సుపొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సుకు తగిన క్రియలు చేయవలెనని” ప్రకటించాడు.AATel 310.4

    అపొస్తలుడిలా అంటున్నాడు, “ఈ హేతువుచేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి. అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటివరకు నిలిచియుంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుతానము పొందువారిలో మొదటివాడగుటచేత, ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలును మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమియు చెప్పక, అల్పులకును ఘనులకును సాక్ష్యమిచ్చు చుంటిని.”AATel 311.1

    అద్భుతమైన తన అనుభవాల్ని పౌలు చెప్పుతుండగా ఆ సభలోని వారందరూ ఆసక్తిగా విన్నారు. అపొస్తలుడు తనకు అతిప్రియమైన అంశంపై మాట్లాడున్నాడు. విన్నవారెవ్వరూ అతని మాటల్ని శంకించలేరు. పౌలు అలా అనర్గళంగా మాట్లాడున్న తరుణంలో ఫేస్తు అడ్డు తగిలి ఇలా బిగ్గరగా అన్నాడు, “పౌలా, నీవు వెట్టివాడవు, అతివిద్య వలన నీకు వెఱ్ఱపుట్టినది.”AATel 311.2

    అపొస్తలుడి సమాధానం ఇది, “మహాఘనత వహించిన ఫేస్తూ, నేను వెట్టివాడను కానుగాని సత్యములను స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను, రాజు ఈ సంగతులెరుగును గనుక అతని యెదుట నేను ధైర్యముగా మాటలాడుచున్నాను. వాటిలో ఒకటియు అతనికి మరుగైయుండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది యొక మూలను జరిగిన కార్యము కాదు.” అంతట అగ్రిప్ప పక్కకు తిరిగి, “అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేనెరుగుదును.” అన్నాడు.AATel 311.3

    అగ్రిప్ప తీవ్ర అలజడికి గురై కాసేపు పరిసరాల్నీ తన హోదాను మర్చిపోయాడు. తాను విన్న సత్యాల స్పహ మాత్రమే కలిగి, దేవుని రాయబారిగా తన ముందు నిలబడివున్న సామాన్య ఖైదీని మాత్రమే చూస్తూ అప్రయత్నంగా, “ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే” అన్నాడు.AATel 311.4

    చిత్తశుద్ధితో అపొస్తలుడిలా సమాధానమిచ్చాడు, ” సులభముగానో దుర్లభముగానో, తమరు మాత్రము కాదు. నేడు మాట వినువారందరును” “నావలె ఉండునట్లు దేవుడను గ్రహించుగాక” “ఈ బంధకములు తప్ప” అన్నాడు బేడీలున్న చేతులు పైకెత్తుతూ.AATel 311.5

    ఫేస్తు, అగ్రిప్ప, బెర్నీకే న్యాయంగా పౌలు ధరించిన సంకెళ్ళు ధరించవచ్చు. వారందరూ ఘోరనేరాలకు పాల్పడ్డవారే. ఈ నేరస్తులు ఆ దినం క్రీస్తు ద్వారా లభ్యమయ్యే రక్షణను గూర్చి విన్నారు. వాగ్దాత్త కృపను రక్షణను అందుకోటానికి కనీసం ఒక వ్యక్తి దాదాపు అంగీకరించాడు. అయితే అగ్రిప్ప అర్పితమైన కృపను తోసిపుచ్చాడు. సిలువ పొందిన విమోచకుని సిలువను నిరాకరించాడు.AATel 311.6

    రాజు కోరిక తీరింది. తన ఆసనం నుంచి పైకి లేచి సమావేశం సమాప్తమయ్యిందని సైగ చేశాడు. వెళ్ళిపోయేటప్పుడు “ఈ మనుష్యుడు మరణమునకైనను బంధకములకైనను తగినదేమియు చేయలేదని” తమలో తాము మాట్లాడుకున్నారు.AATel 312.1

    అగ్రిప్ప యూదుడైనా పరిసయ్యుల మత దురభిమాన్ని ద్వేషాన్ని పంచుకోలేదు. “ఈ మనుష్యుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అననియెడల ఇతనిని విడుదల చేయవచ్చును” అని ఫేసుతో అన్నాడు. కాని ఆకేసు ఉన్నత న్యాయస్థానానికి పంపటానికి విజ్ఞప్తి జరిగింది కాబట్టి అది ఇప్పుడు ఫేస్తు లేదా అగ్రిప్ప పరిధిని అధిగమించింది.AATel 312.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents