Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అపొస్తలుల కార్యాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    6—గుడి గుమ్మం వద్ద

    క్రీస్తు శిష్యులకు తమ అసమర్థత గురించి బాగా తెలుసు. కనుక వినయంతో ప్రార్థనతో వారు తమ బలహీనతను ఆయన బలంతోను, తమ అజ్ఞానాన్ని ఆయన జ్ఞానంతోను, తమ అయోగ్యతను ఆయన నీతితోను, తమ పేదరికాన్ని ఆయన అనంత భాగ్యంతోను జతపర్చారు. ఇలా బలాన్ని సామర్ధ్యాన్ని పొంది ప్రభువు సేవకు ముందడుగు వేయడానికి వారు వెనకాడలేదు.AATel 42.1

    పరిశుద్ధాత్మ దిగివచ్చిన కొద్దికాలం అనంతరం, సామూహిక ప్రార్థనల తర్వాత ఆరాధన నిమిత్తం దేవాలయానికి వెళ్తున్న తరుణంలో పేతురు యోహానులు శృంగారమనే దేవాలయ ద్వారం వద్ద ఒక కుంటివాణ్ణి చూశారు. అతడి వయస్సు నలబై సంవత్సారాలు. పుట్టినప్పటినుంచి అతడి జీవితం బాధతో నిండింది. దురదృష్ట వంతుడైన ఈ అవిటివాడు చాలాకాలంగా యేసును చూడాలని స్వస్త పొందాలని ఆశించాడు. అయినా అతడు అసహాయుడు. మహావైద్యుడు యేసు సేవారంగానికి ఇతడు ఎంతో దూరంలో ఉన్నాడు. చివరికి అతడి మొరవిని కొందరు స్నేహితులు అతణ్ణి దేవాలయం గుమ్మం వద్దకు మోసుకు వెళ్లారు. గుడిగుమ్మం వద్దకు వెళ్లాక తాను ఎవరి మీద ఆశలు పెట్టుకొన్నాడో ఆ ప్రభువు క్రూర మరణానికి గురి అయ్యాడని తెలుసుకొన్నాడు. AATel 42.2

    యేసు స్వస్తపర్చుతాడని అతను ఎంతకాలం ఎదురుచూశాడో తెలిసినవారు అతడి ఆశాభంగం చూసి నొచ్చుకొన్నారు. సానుభూతితో నిండి వారు అతణ్ని ప్రతీ దినం దేవాలయం వద్దకు మోసుకు వచ్చేవారు. ఆ దారిన పోయేవారు తనకు ధర్మం చేస్తే దానితో అతడు జీవితం వెళ్లదీస్తాడన్న వారి భావన. పేతురు యోహానులు ఆ దారిన వెళ్తుండగా అతను భిక్షమడిగాడు. శిష్యులు అతడివంక దయగా చూశారు. అప్పుడు పేతురు ఇలా అన్నాడు : “మా తట్టు చూడుము... వాడు వారి యొద్ద ఏమైన దొరుకునని కని పెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు - వెండి బంగారములు నాయొద్ద లేవు” అన్నాడు. పేతురు ఇలా తన పేదరికాన్ని ప్రకటించుకొన్నప్పుడు ఆ కుంటివాడి గుండె నీరైపోయింది. అయితే అపొస్తలుడిలా అంటున్నప్పుడు నిరీక్షణతో అతడి ముఖం నిగనిగలాడింది, “కాని నాకు కలిగినవే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి” వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడ దేవాలయములోనికి వెళ్లెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరు చూచి శృంగారమను దేవాలయపు ద్వారము నొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి.”AATel 42.3

    “వాడు పేతురుసు యోహానును పట్టుకొని యుండగా, ప్రజలందరు విస్మయమొంది సొలోమోనుదను మంటపములో ఉన్నవారి యొద్దకు గుంపుగా పరుగెత్తి వచ్చిరి.” యేసు చేసిన సూచక క్రియలవంటి వాటినే శిష్యులూ చేయడం చూసి ప్రజలు విస్మయం చెందారు. ఇక్కడైతే నలబై సంవత్సరాలుగా నిస్సహాయ స్థితిలో ఉన్న కుంటివాడు ఎలాంటి సమస్యా లేకుండా తన అవయవాల్ని ఉపయోగిస్తూ యేసుని నమ్ముతూ ఉత్సాహంగా ఉద్రేకంగా ఉన్నాడు.AATel 43.1

    విస్మయం చెందుతున్న ప్రజల్ని చూసి పేతురిలా అన్నాడు, “మీరు వీని విషయమై యెందుకు ఆశ్యర్యపడుచున్నారు ? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినటుగా మీరెందుకు మాతట్టు తేరి చూచుచున్నారు ?” మృతుల్లో నుంచి దేవుడు లేపిన నజరేయుడైన యేసు శక్తి చేత ఆయన నామమున ఆస్వస్తత జరిగిందని పేతురు స్పష్టం చేశాడు. “ఆయన నామమందలి విశ్వాసమూలముగా ఆయన నామమే మీరు చూచి యెరిగియున్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి యెదుట వీనికి ఈ పూర్ణస్వస్థత కలుగజేసెను,” అన్నాడు అపొస్తలుడు.AATel 43.2

    జీవాధిపతి అయిన యేసును నిరాకరించి చంపడం ద్వారా యూదులు చేసిన మహా పాపం గురించి అపొస్తలులు స్పష్టంగా మాట్లాడారు. అయినా వారిని నిస్పృహకు గురిచేయకుండా ఆచితూచి మాట్లాడారు. పేతురు వారితో ఇలా అన్నాడు : “మీరు పరిశుద్ధుడును నీతిమంతుడనైన వానిని నిరాకరించి, నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. వారు జీవాధిపతిని చంపితిరిగాని దేవుడు ఆయనను మృతులలో నుండి లే పెను, అందుకు మేము సాక్షులము”. “సహోదరు లారా, మీరును మీ అధికారులును తెలియక చేసితిరని నాకు తెలియును. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తలనోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఈలాగు నేరవేర్చెను.” మారుమనసు పొంది దేవుని తట్టు తిరగమంటూ తమను పరిశుద్ధాత్మ పిలుస్తున్నాడని పేతురు వారితో చెప్పాడు. తాము సిలువవేసిన ఆ ప్రభువు కృపద్వారా తప్ప మరేవిధంగానూ తమకు రక్షణ కలగదని ఘంటా కంఠంగా వారితో చెప్పాడు. ఆయన మీద విశ్వాసం ద్వారా మాత్రమే తమకు పాపక్షమ కలుగుతుందని కుండబద్దలుకొట్టాడు.AATel 43.3

    “మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సునొంది తిరుగుడి”.AATel 44.1

    “ఆ ప్రవక్తల కును, దేవుడు అబ్రహాముతో - నీ సంతానమందు భూలోకవంశము లన్నియు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును, మీరు వారసులైయున్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని దాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మునాశీర్వదించుటకు ఆయనను మొదట మీయొద్దకు పంపెనని చెప్పెను.”AATel 44.2

    శిష్యులు క్రీస్తు పునరుత్థానాన్ని గూర్చి ఇలా బోధించారు. విన్నవారిలో అనేకులు ఈ సాక్ష్యం కోసం వేచి ఉన్నారు. అది విన్నాక విశ్వసించారు. ఆ సాక్ష్యం క్రీస్తు మాటల్ని వారి మనసుల్లో ముద్రవేసింది. వారు విశ్వసించి సువార్తనంగీకరించిన వారిలో చేరారు. రక్షకుడు విత్తిన విత్తనం మొలిచి ఫలాలు ఫలించింది.AATel 44.3

    శిష్యులు ప్రజలతో మాట్లాడుతుండగా “యాజకులును దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులును వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరిపడి వారి మీదికి వచ్చిరి”.AATel 44.4

    రోమా భటుడు నిద్రపోతుండగా శిష్యులు క్రీస్తు దేహాన్ని ఎత్తుకుపోయారన్న అబద్ద వార్తను క్రీస్తు పునరుత్థానం తర్వాత యాజకులు ప్రచారం చేశారు. తాము హత్యచేసిన వ్యక్తి తిరిగి లేచాడని బోధిస్తున్న పేతురు యోహానులతో యాజకులు అసంతుృప్తి చెందడంలో ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా సద్దూకయ్యులు తీవ్ర ఉద్రిక్తతకు లోనయ్యారు. తమకు ప్రియమైన సిద్ధాంతం ప్రమాదంలో ఉందని తమ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని వారు భావించారు.AATel 44.5

    కొత్త విశ్వాసాన్ని అంగీకరించిన విశ్వాసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. ఈ బోధకులు బోధల్ని అడ్డు అదుపులేకుండా కొనసాగనిస్తే క్రీస్తు లోకంలో ఉన్నప్పటికన్నా ఇప్పుడు తమ ప్రభావం మరెక్కువ దెప్పతింటుందని పరిసయ్యులూ, సదూకయ్యులూ ఆందోళన చెందారు. అందుచేత ఆలయ అధిపతి సదూకయ్వుల మద్దతుతో పేతురుని, యోహానుని బంధించి ఆదినం పరీక్షించడానికి ఆలస్యమయింది. గనుక వారిని చెరసాలలో వేశాడు. AATel 44.6

    క్రీస్తు మృతులో నుంచి లేచాడన్న సత్యాన్ని శిష్యుల విరోధులు ఒప్పుకుతీరాలి. వారి ముందున్నది సందేహానికి ఆస్కారంలేని నిదర్శనం. అయినా వారు తమ హృదయాల్ని కఠినపర్చుకొని యేసుని చంపడంలో తమ నికృష్ట క్రియనుగూర్చి పశ్చాత్తాప పడటానికి నిరాకరించారు. అపొస్తలులు దైవావేశం కింద బోధిస్తూ వ్యవహరిస్తున్నట్లు తెలిపే నిదర్శనం కోకొల్లలుగా ఉన్నప్పటికీ యూదునేతలు సత్యవర్తమానాన్ని బలంగా ప్రతిఘటించారు. వారు భావించిన తీరులో క్రీస్తు రాలేదు. కొన్ని సందర్భాలలో ఆయన దైవకుమారుడన్న నమ్మకం వారికి కలిగినా ఆ మనోగతాన్ని పక్కన బెట్టి క్రీస్తును సిలువ వేశారు. కృపగల దేవుడు వారికి అదనపు నిదర్శనాన్నిచ్చాడు. తన పక్కకు మర్లడానికి ఇప్పుడు మరో అవకాశం దేవుడిచ్చాడు. తాము జీవాధిపతిని చంపారని చెప్పడానికి ఆయన శిష్యుల్ని పంపించాడు. పశ్చాత్తాపపడడానికి వారికి ఈ ఆరోపణ ద్వారా మరో పిలుపునిచ్చాడు. తమ స్వనీతిలో భద్రంగా ఉన్నామని భావిస్తూ యూదుమత ప్రబోధకులు తాము క్రీస్తును సిలువవేసి చంపారని ఆరోపిస్తున్న అపొస్తలులు పరిశుద్దాత్మ వలన మాట్లాడున్నట్లు ఒప్పుకోడానికి నిరాకరించారు.AATel 44.7

    క్రీస్తును వ్యతిరేకించడమే విధానంగా పెట్టుకొన్న యాజకుల ప్రతీ క్రియ ఆవిధానం కొనసాగింపుకు ప్రేరణ నిచ్చింది. వారి మూర్ఖత్వం పెచ్చు పెరిగింది. వారు రక్షణకు దూరం కావడం తమకై తాము దేవునికి లొంగిపోలేకపోయినందుకు కాదు. లొంగిపోగలిగి ఉండి లొంగిపోనందుకు. వారు దైవకుమారుని చంపి అపరాధులు మరణపాత్రులు అయినందుకు కాదు వారు దేవునికి వ్యతిరేకంగా మోహరించి యుద్ధానికి దిగినందుకు. వారు సర్వదా వెలుగును నిరాకరించి పరిశుద్ధాత్మ స్వరాన్ని అణచివేశారు. అవిధేయ ప్రజల్ని అదుపుచేసే ప్రభావం వారిలో పనిచేసింది. అందువల్ల వారు దైవసేవ చేస్తున్న ప్రజల్ని హింసించారు. దేవునికి వ్యతిరేకంగాను, తన సేవకులు ప్రకటించడానికి ఆయన ఇచ్చిన సందేశానికి వ్యతిరేకంగాను జరిగే ప్రతీ క్రియ దుర్బుద్ధితో కూడిన వారి తిరుగుబాటును బలపర్చింది. పశ్చాత్తాపం పొందడానికి ప్రతీ దినం నిరాకరించడంలో యూదు నేతలు తమ తిరుగుబాటును తాజాగా చేపట్టి తద్వారా తాము విత్తిన పంటనే కోయడానికి ఆయత్తమయ్యారు. పశ్చాత్తాపంలేని పాపుల పట్ల దేవుని కోపం రేగడానికి కారణం కేవలం వారు చేసిన పాపాలే కాదుగాని పశ్చాత్తాపానికి పిలుపు వచ్చినప్పుడు వారు తమ ప్రతిఘటన ధోరణి కొనసాగించి తమకు వస్తున్న వెలుగును తోసిపుచ్చి గత పాపాల్నే మళ్ళీ మళ్ళీ చేయడానికి పూనుకోడం. యూదు నాయకులు పాపాన్ని ఒప్పుకొనజేసే పరిశుద్ధాత్మ శక్తికి లొంగి ఉంటే వారికి క్షమాపణ లభించేది. లొంగకుండ మూర్ఖంగా ఉండడానికి వారు కృతనిశ్చయులై ఉన్నారు. అదేవిధంగా పాపి తన ప్రతిఘటనను కొనసాగించడం ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావ పరిధి నుంచి తన్నుతాను బహిష్కరించుకొంటాడు.AATel 45.1

    కుంటివాడి స్వస్థత జరిగిన మర్నాడు తక్కిన ఆలయ అధికారులతో కలిసి అన్న కయపలు విచారణ ప్రక్రియకు సమావేశమయ్యారు. వారి ముందు ఖైదీల్ని హాజరుపర్చారు. ఆ గదిలోనే అక్కడ సమావేశమై ఉన్న కొందరి సమక్షంలోనే తన ప్రభువుని ఎరగనని పేతురు బొంకాడు. తన సొంత విచారణ నిమిత్తం అక్కడ నిలిచి ఉండగా ఆ దృశ్యం పేతురు మనసులో మెదిలింది. తన పిరికి తనం నుంచి విడుదల పొందడానికి పేతురుకి ఇప్పుడు అవకాశం వచ్చింది. ప్రభువు విచారణ సభలో పేతురు నిర్వహించిన పాత్ర జ్ఞాపకమున్నవారు ఇప్పుడు తనను ఖైదులో వేస్తామని చంపుతామని వస్తున్న బెదిరింపులకు పేతురు జడిసి మాట్లాడకుండా ఉంటాడని భావించారు. అయితే క్రీస్తు అత్యవసర సమయంలో ఆయనను ఎరగనని బొంకిన ఆ పేతురు ఉద్వేగానికి ఆత్మవిశ్వాసానికి లోనై ప్రవర్తించిన పేతురు. ఇప్పుడు విచారణకు సన్ హెడ్రన్ సభముందు హాజరైన పేతురు ఎంతో వ్యత్యాసమైన పేతురు. తాను తప్పటడుగు వేసిన ఘడియ నుంచి పేతురు మార్పు పొందాడు. ఇక అతడు గర్వంగా ప్రగల్భాలు పలికే వ్యక్తి కాడు. ఇప్పుడతడు అణకువ నిరాడంబరత గల వ్యక్తి. పేతురు పరిశుద్దాత్మ నింపుదల పొందాడు. ఒకప్పుడు తాను ఎరగనని బొంకిన యేసు నామాన్ని గౌరవించడం ద్వారా పేతురు తన భ్రష్టత మచ్చను తొలగించు కోడానికి తీర్మానించుకొన్నాడు. ఇంతవరకు యాజకులు సిలువను గురించిగాని క్రీస్తు పునరుత్థానం గురించి గాని మాట్లాడలేదు. కాని ఇప్పుడు తాము ఆ కుంటివాణ్ని ఎలా స్వస్తపర్చారని తమ విధి నిర్వహణలో భాగంగా యాజకులు నింధితుల్ని ప్రశ్నించారు. “మీరు ఏ బలముచేత ఏ నామమును బట్టి దీనిని చేసితిరి? అని ప్రశ్నించారు.AATel 45.2

    పరిశుద్ధ ధైర్యంతోను పరిశుద్ధాత్మ శక్తితోను పేతురు ఇలా ప్రకటించాడు : “మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసికొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్తత పొంది మీ యెదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన వారు తృణీకరించిన రాయి ఆయనే : ఆ రాయి మూలకు తలరాయి ఆయెను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు ; ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యలలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము.”AATel 46.1

    ‘ ధైర్యమైన ఈ వాదం యూదు నాయకుల్ని ఆశ్చర్యపర్చింది. నెన్ హెడ్రన్ సభముందుకు వచ్చినప్పుడు శిష్యులు భయకంపితులై తికమకపడి లొంగిపోతారని వారు భావించారు. వాస్తవానికి, ఈ సాక్షులు క్రీస్తు మాట్లాడినట్లే ఎదుటివారిని ఒప్పించే శక్తితో ప్రత్యర్థుల్ని పలకనీయని రీతిగా మాట్లాడారు. క్రీస్తు గురించి ఈ విధంగా ఉద్ఘాటించినప్పుడు పేతురు ముఖంలో భయమన్నది కనిపించలేదు : “ఇల్లు కట్టువారైన వారు తృణీకరించిన రాయి అయనే ; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను”.AATel 46.2

    ఇక్కడ పేతరు ఉవయోగించిన భాషాలంకారం యాజకులకు సుపరిచితమే. తృణీకరించిన ఆ రాయి గురించి ప్రవక్తలు మాట్లాడారు. ఒక సందర్భంలో యాజకులు పెద్దలతో మాట్లాడూ క్రీస్తే ఇలా అన్నాడు : “ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువు వలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అనుమాట మీరు లేఖనములలో ఎన్నడును చదువలేదా ? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనుల కియ్యబడునని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవునుగాని అది ఎవని మిద పడునో వానిని నలిచేయును” మత్తయి 21:42-44.AATel 46.3

    అపొస్తలులు జంకు కొంకు లేకుండా మాట్లాడడం విన్న యాజకులు “వారు యేసుతో కూడ ఉండినవారని గుర్తెరిగిరి”.AATel 47.1

    క్రీస్తు రూపాంతరం అనంతరం అద్భుతమైన ఆ దృశం చివరలో శిష్యుల గురించి “వారు కన్నులెత్తి చూడగా, యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు” అని రాయబడింది. మత్తయి 17:8. తొలి దినాల సంఘ జీవిత చరిత్రలో కనిపించిన శక్తి రహస్యం “యేసు తప్ప” అన్న మాటల్లో ఉన్నది. క్రీస్తు మాటలు మొదటగా విన్నప్పుడు శిష్యులు తమ అవసరాన్ని గుర్తించారు. వారు ఆయనను వెదకారు, కనుగొన్నారు, వెంబడించారు. ఆయనతో వారు దేవాలయంలో, భోజనం బల్లవద్ద, పర్వతాల పక్క, పొలాల్లో ఉన్నారు. ఉపాధ్యాయుడితో విద్యార్థులులా వారు ఆయనతో ఉండి నిత్యసత్యాల పాఠాలు నేర్చుకొన్నారు. -AATel 47.2

    రక్షకుని ఆరోహణానంతరం ప్రేమసత్యాలతో నిండిన దైవ సన్నిధి వారితో కొనసాగింది. అది వ్యక్తిగత సన్నిధి. తమతో నడిచిన మాట్లాడిన ప్రార్థించిన రక్షకుడు తమకు నిరీక్షణను ఆదరణను కరిగించిన ప్రభువు సమాధాన వర్తమానం ఆయన పెదాలపై ఉంటుండగానే వారి మధ్యనుంచి పరలోకానికి ఆరోహణమయ్యాడు. తనకోసం వేచి ఉన్న దేవదూతల రధం ఆయన ఎక్కే తరుణంలో, “ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను” అన్న ఆయన మాటలు గుర్తుకు వచ్చాయి. మత్తయి 28:20. మానవ రూపంలోనే ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. తమ మిత్రుడు రక్షకుడుగా దైవ సింహాసనం ముందు ఆయన ఉన్నాడని, ఆయన సానుభూతి తమపట్ల, ఏమి మారలేదని, బాధలు పడున్న మానవులలో ఒకడిగా తన్నుతాను నిత్యం పరిగణించుకొంటాడని వారికి తెలుసు. తాను విమోచించిన ప్రజల రక్షణకు తాను చెల్లించిన మూల్వానికి నిదర్శనంగా గాయపడ తన చేతులు పాదాలు చూపిస్తూ తండ్రి ముందు తన రకపు విలువను సమర్పించాడని వారికి తెలుసు. ఆయన నిమిత్తం నిందభరించడానికి ఈ తలంపు వారిని వ్యక్తిగతంగా బలపర్చింది. ఆయన తమతో ఉన్నప్పటికన్న ఇప్పుడు ఆయనతో వారి ఏకత్వం మరింత పటిష్టంగా ఉన్నది. అంతరంగంలో నివసిస్తున్న క్రీస్తు వెలుగు, ప్రేమ, శక్తి వారి ద్వారా ప్రకాశించాయి. వారిని గమనిస్తున్న మనుషులు ఆశ్చర్యపడ్డారు.AATel 47.3

    తనకు మద్దతుగా పేతురు పలికిన మాటలపై క్రీస్తు ఆమోద ముద్ర వేశాడు. అందుకు సాక్ష్యంగా అద్భుతకార్యంవల్ల స్వస్థత పొందిన వ్యక్తి పేతురు పక్కన నిలబడి ఉన్నాడు. కొద్దిసేపటి క్రితం నిస్సహాయుడయి ఉండి ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో నిలిచిన ఈ వ్యక్తి దృశ్యం పేతురు మాటలకు గొప్ప విలువ నిచ్చింది. యాజకులు అధికారులు అవాక్కయ్యారు. వారు పేతురు మాటల్ని ఖడించలేకపోయారు. అయినప్పటికీ శిష్యుల బోధను ఆపడానికి వారు కృతనిశ్చయంతో ఉన్నారు. క్రీస్తు లాజరుని లేపిన మహత్కార్యం ఆయనను ఆయన అద్భుత కార్యాల్ని అంతం చేయాలన్న యాజకుల తీర్మానానికి దారి తీసింది. ఆయన చేస్తున్న అద్భుత కార్యాలు ప్రజలపై యాజకుల ప్రభావాన్ని నాశనం చేస్తున్నాయి. వారు ఆయనను సిలువవేసి చంపారు. కాని ఆయన నామాన సూచక క్రియలు జరగటాన్ని ఆపలేకపోయారని లేదా ఆయన బోధించిన సత్యాన్ని ప్రకటించటానికి తెరదించలోకపోయారని ఇది నిరూపిస్తున్నది. కుంటివాడి స్వస్తత, అపొస్తలుల బోధలు యెరూషలేములో అప్పటికే గొప్ప సంచలనం రేపుతున్నాయి.AATel 48.1

    తాము సంప్రదించుకోవాల్సి ఉందని వారిని తిరిగి ఖైదులోకి తీసుకువెళ్ల వలసిందని తమ ఆందోళనను కప్పిపుచ్చుకోడానికే, యాజకులు అధికారులు ఆదేశించారు. ఆ కుంటివాడు స్వస్తత పొందలేదనడం వ్యర్థమని వారంతా అంగీకరిం చారు. ఆ అద్భుత కార్యాన్ని అబద్ధాలతో కప్పిపుచ్చటానికి వారు ప్రయత్నించేవారే కాని అది అసాధ్యమనిపించింది. ఎందుకంటే ఎంతో మంది ప్రజల ముందు పట్టపగలు అది జరిగింది. వేలాదిమందికి అది తెలిసింది కూడా. శిష్యుల కార్యకలాపాలకు తెరపడకుంటే యేసు అనుచరుల సంఖ్య పెరిగిపోతుందని వారు ఆందోళన చెందారు. తర్వాత తమకు పరాభవం జరుగుతుందని భావించారు. ఎందుకంటే దైవకుమారుని మరణం విషయంలో వారు అపరాధులు.AATel 48.2

    శిష్యుల్ని హతమార్చడం తమ ఉద్దేశమైనా క్రీస్తు గురించి మాట్లాడడం గాని ఉపన్యసించడంగాని చేస్తే కఠిన శిక్షకు గురి అవుతారని బెదిరించడానికి మించి వారికి ఏమి హాని చేయడానికి యాజకులు సాహసించలేదు. వారిని మళ్లీ సెన్ హెడ్రన్ సభముందుకి రప్పించి క్రీస్తు నామంలో మాట్లాడడం గాని ప్రసంగించడంగాని చేయకూడదని హెచ్చరించారు. అయితే పేతురు యోహాన్లు ఇచ్చిన సమాధానం ఇది : “దేవుని మాట వినుటకంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా ? మీరే చెప్పుడి ; మేము కన్నవాటిని ఎన్నవాటిని చెప్పకయుండలేము”.AATel 48.3

    తమ పవిత్రమైన పిలుపుకు నమ్మకంగా ఉన్నందుకు ఈ అపోస్తలులను యాజకులు ఆనందంగా శిక్షించేవారే కాని వారు ప్రజలకు భయపడ్డారు: “ప్రజలందరు జరిగిన దానిని గూర్చి దేవుని మహిమ పరచుచుండిరి”. కనుక పదేపదే బెదిరింపులు నిషేధాజ్ఞలు జారీచేసివారు అపొస్తలుల్ని విడుదల చేశారు.AATel 48.4

    పేతురు యోహానులు ఖైదీలు కాగా యూదుల దురుద్దేశాల్ని ఎరిగిన శిష్యులు తమ సహోదరులకోసం ఎడతెగకుండా ప్రార్థించారు. వారు క్రీస్తు పట్ల ప్రదర్శించిన క్రూరత్వం వీరిపట్ల కూడా ప్రదర్శించ వచ్చునని శిష్యులు భయపడ్డారు. అపొస్తలులు విడుదల పొందిన వెంటనే మిగిలిన శిష్యుల్ని కలుసుకొని తమ విచారణ ఫలితం గురించి నివేదించారు. అడి విశ్వాసులకు అమితానందం కలిగించింది. “వారు యేక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొటి పెట్టిరి - నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు. అన్యజనులు ఏల అల్లరి చేసిరి ? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి ? ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులును ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితిని. ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో, వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనములతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడికొనిరి.AATel 49.1

    “ప్రభువా, ఈ సమయమునందు వారి బెదరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును, నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి యుండగా, నీ దాసులు వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము”.AATel 49.2

    సువార్త పరిచర్య నిర్వహించడానికి తమకు ఇతోధిక శక్తిని అనుగ్రహించమని శిష్యులు ప్రార్థించారు. ఎందుకంటే లోకంలో ఉన్నప్పుడు క్రీస్తుకు ఎదురైన తీవ్ర వ్యతిరేకతే తమకూ ఎదురౌతుందని వారు గ్రహించారు. వారి సంయుక్త ప్రార్థనలు పరలోకానికి వెళ్తుండగానే వాటికి జవాబు దిగివచ్చింది. వారు సమావేశమైన స్థలం కంపించింది. నూతనంగా వారికి పరిశుద్ధాత్మ వరం దఖలుపడింది. ధైర్యంతో నిండిన హృదయాలతో యెరూషలేములో దేవుని వాక్యాన్ని చాటించడానికి వెళ్లారు. “అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి”. దేవుడు వారి సేవను వృద్ధిపర్చాడు.AATel 49.3

    యేసు నామాన ఇక ఏ మాత్రం మాట్లాడవద్దన్న యాజకుల ఆదేశానికి సమాధానంగా, “దేవుని మాట వినుటకంటే నా మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా ? మీరే చెప్పుడి” అన్నప్పుడు శిష్యులు ఏ సూత్రానికి నిర్భయంగా నిలిచారో దిద్దుబాటు కాలంలో సువార్త పక్షంగా పోరాడినవారు అదే సూత్రానికి నిబద్దులై నిలిచారు. 1529 లో స్పయిర్స్ నగరంలో డయట్ సభకు జర్మను యువరాజులు సమావేశమైనప్పుడు మత స్వతంత్రతను నియంత్రిస్తూ దిద్దుబాటు సిద్ధాంతాల ప్రచారాన్ని నిషేధిస్తూ చక్రవర్తి శాసనం జారీ అయ్యింది. లోక ప్రజల నిరీక్షణ దీపం ఆరిపోడానికి సిద్ధంగా ఉంది. యువరాజులు ఆశాసనాన్ని అంగీకరిస్తారా ? ఇంకా చీకటిలో కొట్టిమిట్టాడుతున్న లక్షలాది ప్రజలు సువార్త వెలుగు చూడకుండా చీకటిలోనే మిగిలిపోవాలా ? లోక ప్రజలకు సంబంధించిన తీవ్ర అంశాలు ప్రమాదంలో ఉన్నాయి. సంస్కరణల విశ్వాసాన్ని అంగీకరించినవారు సమావేశమయ్యారు. వారు ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని తీర్మానించారు. “ఈ శాసనాన్ని విసర్జిద్దాం. మనస్సాక్షి విషయంలో అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి విలువలేదు.” -మళ్ డి ఆబినీ, హిస్టరి ఆఫ్ ది రిఫర్ మేషన్, పుస్త 13, అధ్యా 5.AATel 49.4

    నేడు మనం ఈ సూత్రాన్ని అనుసరించాలి. సువార్త సంఘ సంస్థాపకులు, ఆతర్వాతి యుగాల్లో దేవునికి సాక్షులుగా నిలిచినవారు ఎత్తిపట్టుకొన్న సువార్త మత స్వేచ్ఛ ధ్వజం ఈ తుది సంఘర్షణలో మనకు అప్పగించబడింది. దేవుడు తన వాక్య జ్ఞానాన్ని ఎవరికి అనుగ్రహించాడో వారిపై ఈ మహా వరదానానికి సంబంధిం చిన బాధ్యత ఉన్నది. ఈ వాక్యాన్ని మనం అత్యున్నతాధికారంగా అంగీకరించాలి. మానవ ప్రభుత్వం దేవుని నియామకం అని ఉచిత పరిధిలో దానికి విధేయత చూపడం మన పవిత్ర విధి అని మనం బోధించాలి. అయినా దాని విధులు దైవ విధులకు విరుద్ధంగా ఉన్నప్పుడు మానవుడికి కాక దేవునికి విదేయులం కావాలి. దైవ వాక్యాన్ని మానవ శాసనాలకన్న ఉన్నతమైన దానిగా పరిగణించాలి. “ప్రభువు సెలవిస్తున్నాడు” అన్నది రద్దుచేసి “సంఘం సెలవిస్తున్నది” లేదా “ప్రభుత్వం సెలవిస్తున్నది” అన్నదాన్ని పాటించకూడదు. లోకరాజుల మకుటాలకు పైగా క్రీస్తురాజు కిరీటాన్నుంచాలి.AATel 50.1

    మనం అధికారాలను ధిక్కరించనవసరం లేదు. రికార్డుల్లో మనమాటలు రాతలు చట్ట వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపించకుండా ఉండేందుకు మాటల విషయంలోను రాతల విషయంలోను మనం ఆచితూచి వ్యవహరించాలి. అనవసరంగా మన మార్గాన్ని మూసివేసే మాటలు మాట్లాడడంగాని పనులు చేయడంగాని జరగకూడదు. మనకు అప్పగించబడ్డ సత్యాల్ని ప్రకటిస్తూ క్రీస్తు నామంలో మనం ముందుకు సాగాలి. ఈ పని చేయకుండా మనుషులు మనకు అడుతగిలినప్పుడు నాడు అపొస్తలులు చెప్పినట్లు మనం కూడా చెప్పాలి : “దేవుని మాట వినుటకంటే మీమాట వినుట దేవుని దృష్టికి న్యాయమా ? మీరే చెప్పుడి. పము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యిండలేము.”AATel 50.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents