Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అపొస్తలుల కార్యాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    49—పౌలు రాసిన చివరి ఉత్తరం

    పౌలు కైసరు న్యాయస్థానం నుంచి తన ఖైదు గతిలోకి తిరిగివచ్చాడు. తనకు కాస్త విరామం మాత్రమే లభించిందని గుర్తించాడు. శత్రువులు తన మరణాన్ని చూస్తేగాని విశ్రమించరని పౌలుకి తెలుసు. కాగా కొంతకాలం సత్యం విజయం సాధించిందని కూడా అతనికి తెలుసు. విస్తార జన సమూహాలు సిలువనుపొంది తిరిగి లేచిన రక్షకుణ్ని గూర్చి తాను ప్రసంగిస్తుంటే వినటమే పౌలుకి గొప్ప విజయం. ఆ రోజు ఒక కార్యారంభం జరిగింది. అది బలం పుంజుకొని వృద్ధి చెందాల్సివుంది. నీరో సహా క్రీస్తు విరోధులెందరు అడ్డుకోవాలని నాశనం చెయ్యాలని ప్రయత్నించినా ఆ కార్యం ఆగదు.AATel 357.1

    చీకటిగావున్న తన చెరసాల గదిలో కూర్చుని, నీరో చెప్పిన ఒక్కమాటతో లేక అతడు చేసిన ఒక్క సైగతో తనకు చావుతథ్యమని ఎరిగి పౌలు తిమోతిని గురించి తలంచి అతణ్ని పిలిపించుకోవాలని నిర్ధారించుకున్నాడు. పౌలు తిమోతిల మధ్య బలీయమైన మమతాను బంధం ఉంది. క్రైస్తవ మతాన్ని స్వీకరించినప్పటి మంచి తిమోతి పౌలు సువార్త సేవలోను బాధలు శ్రమలలోను పాలుపంచుకున్నాడు. వారిద్దరి స్నేహం బలీయమైన పవిత్రమైన బంధంగా రూపొందింది. అది ఒక కుమారుడు తాను అమితంగా ప్రేమిస్తూ గౌరవిస్తున్న తండ్రిపట్ల చూపే ప్రేమగా మారింది. వృద్ధుడైన పౌలుకి తిమోతికి మధ్యవున్న ఆత్మీయత అలాంటిది.AATel 357.2

    చిన్న ఆసియా నుంచి రోము చేరుకోటానికి సానుకూల పరిస్థితుల్లో తిమోతికి కొన్ని నూసాలు పడ్తుంది. తన ప్రాణం ఎప్పుడు పోతుందో పౌలుకు నిశ్చితంగా తెలియదు. తిమోతి వచ్చేసరికి తాను బతికివుండనేమో అని పౌలు భయపడ్డాడు. యువకుడైన తిమోతికి అప్పగించిన బాధ్యత చాలా గొప్పది. ఆలస్యం లేకుండా రమ్మని ఆర్ధిస్తూనే తాను జీవించివుండగా అందించలేనని భావించిన తన మరణ సందేశాన్ని లేఖరికి చెప్పిరాయించాడు. సువార్త పరంగా తన కుమారుడైన తిమోతి పట్ల, అతడు సువార్త పరిచర్యచేస్తున్న సంఘంపట్ల పౌలు ఆత్మ ప్రేమానురాగాలతో కూడిన ఆందోళనతో నిండింది. తనకు ట్రుస్టుగా అందించిన పవిత్ర విశ్వాసమనే నిధి విషయంలో నమ్మకంగా ఉండటం ప్రాముఖ్యమని తిమోతికి ఉద్బోధించటానికి : పౌలు ప్రయత్నించాడు.AATel 357.3

    ఈ అభినందనంతో పౌలు తన ఉత్తరాన్ని ప్రారంభించాడు: “క్రీస్తు యేసునందున్న నీ జీవమును గూర్చిన వాగ్దానమునుబట్టి దేవుని చిత్తమువలన క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. కనికరమును సమాధానమును కలుగునుగాక. నా ప్రార్ధనయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసికొనుచు.... నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని యెడల కృతజ్ఞుడనైయున్నాను”.AATel 358.1

    అనంతరం విశ్వాసం విషయంలో స్థిరంగా దృఢంగా ఉండాల్సిందిగా పౌలు తిమోతికి విజ్ఞప్తి చేశాడు. ఇలా రాశాడు, “ఆ హేతువుచేత నా హస్త నిక్షేపము వలన నీకు కలిగిన దేవుని కృపావరము (ప్రజ్వలింపజేయవలెనని నీకు జ్ఞాపకము చేయు చున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే యిచ్చెనుగాని పిరికితనముగల ఆత్మనియ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చియైనను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చియైనను సిగ్గుపడక దేవుని శక్తినిబట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై యుండుము”. ” జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి” తెచ్చిన ప్రభువు శక్తిని గూర్చి ప్రచురించటానికి ఆయన తనను “పరిశుద్ధమైన పిలుపుతో” పిలిచాడని మర్చిపోవద్దని తిమోతికి పౌలు ఉద్బోధించాడు. ” ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడనుగాను, అపొస్తలుడనుగాను, బోధకుడుగాను నియమింప బడితిని” అని పౌలు అన్నాడు.AATel 358.2

    తన సుదీర్ఘ సేవాకాలంలో రక్షకుని పట్ల తన విశ్వసనీయత విషయంలో పౌలు ఎన్నడూ తడబడలేదు. ఆగ్రహోదగ్రులైన పరిసయ్యుల ముందుగాని లేక రోము అధికారులముందుగాని; ఉగ్రులైన లుస్త్ర జనసమూహం ముందుగాని; మాసిదోనియలో ఖైదులోని మారుమనసు పొందిన ఖైదీల ముందుగాని; పగిలిపోయిన ఓడలోవున్న భయభ్రాంతులైన నావికుల్తో మాట్లాడున్నప్పుడుగాని లేదా నీరో ముందు ఒంటిగా నిలబడి స్వీయప్రాణం కోసం విజ్ఞాపన చేస్తున్నప్పుడుగాని తాను చేస్తున్న సువార్త పరిచర్యనుగూర్చి పౌలు ఎన్నడూ సిగ్గుపడలేదు. ఒకప్పుడు తాను ద్వేషించిన క్రీస్తును సేవించటమే తన క్రైస్తవ జీవిత పరమావధి, పరమార్థం. ఈ లక్ష్యం నుంచి అతణ్ని ఎలాంటి వ్యతిరేకతే గాని ఎలాంటి చిత్ర హిం సేగాని మరల్చలేకపోయింది. కృషివలన బలోపేతమైన అతడి విశ్వాసం త్యాగం సాధించిన పవిత్రత పౌలుని ఉద్ధరించి బలపర్చాయి.AATel 358.3

    పౌలింకా ఇలా అన్నాడు, “నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము, నీవు అనేక సాక్షులయెదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యముగల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము. క్రీస్తుయేసు యొక్క మంచి సైనికునివలె నాతో కూడ శ్రమను అనుభవించుము.” AATel 358.4

    యథార్ధమైన దైవ సేవకుడు శ్రమల్ని తప్పించుకోడు. బాధ్యతల్ని పక్కన పెట్టడు. దైవ శక్తికోసం చిత్తశుద్ధితో అన్వేషించే వారిని ఎన్నడూ ఆశాభంగపర్చని మూలం నుంచి అతడు శక్తిని పొందుతాడు. ఆ శక్తి శోధనను ఎదుర్కొని జయించటానికి అతడికి సామర్థ్యం చేకూర్చి దేవుడు నియమించిన విధుల్ని నెరవేర్చటానికి చేయూత నిస్తుంది. అతడు పొందే కృపా స్వభావం దేవున్ని ఆయన కుమారుని అవగాహన చేసుకోటానికి అతడి సామర్ధ్యాన్ని విస్తృతపర్చుతుంది. రక్షకునికి ఇష్టమైన సేవ చేయటానికి అతని ఆత్మ తహతహ లాడుంది. అతడు క్రైస్తవ జీవన మార్గంలో పురోగమించే కొద్దీ “క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతు” డవుతాడు. తాను విన్నసంగతుల విషయంలో నమ్మకమైన సాక్షిగా ఉండటానికి ఈ కృప అతడికి శక్తినిస్తుంది. దేవుని వద్దనుంచి తాను పొందిన జ్ఞానాన్ని తృణీకరించటంగాని నిర్లక్ష్యం చెయ్యటంగాని చెయ్యక దాన్ని ఇతరులకు బోధించేందుకుగాను నమ్మకమైన మనుషులకు దాన్ని అప్పగిస్తాడు.AATel 359.1

    తిమోతికి రాసిన ఈ చివరి ఉత్తరంలో ఈ యువ సువార్త సేవకుడి ముందు పౌలు సమున్నతాశయాన్ని నిలిపి క్రీస్తు పరిచారకుడిగా తన విధుల్ని వివరిస్తున్నాడు. పౌలు ఇలా రాశాడు, “దేవునికి యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్య వాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకొనుటకు జాగ్రత్తపడుము.” “నీవు యౌవనేచ్చల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని యెరిగి అట్టివారిని విసర్జించుము. సత్వము విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడొకవేళ ఎదురాడు వారికి మారుమనస్సు దయచేయును.”AATel 359.2

    అబద్ధ బోధకులు సంఘంలోకి ప్రవేశించటానికి ప్రయత్నిస్తారని వారిని గురించి అప్రమత్తంగా ఉండటం అవసరమని అపొస్తలుడు తిమోతిని హెచ్చరించాడు. పౌలిలా అన్నాడు. “అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలయనగా మనుష్యులు స్వార ప్రియులు ధనా పేక్షులు బింకము లాడువారు అహంకారులు దూషకులు తలిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞతలేని వారు అపవిత్రులు.... పైకి భక్తిగల వారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు”.AATel 359.3

    “అయితే దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తాము మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు. క్రీస్తుయేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు.... దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్షచేయుట కును ప్రయోజనకరమై యున్నది.” లోకంలో వున్న దుర్మార్గత పై జయప్రదంగా పోరాటం సాగించటానికి దేవుడు ఎన్నోసాధనాల్ని ఏర్పాటుచేశాడు. ఈ పోరాటానికి మనకు ఆయుధాలు సమకూర్చే ఆయుధాగారం బైబిలు. మనం సత్యంతో నడుంబిగించుకోవాలి. నీతి అనే కవచం ధరించాలి. ఆత్మఖడ్గంతో అనగా దైవ వాక్యంతో మనం పాపం సృష్టించే ప్రతిబంధకాల్ని చిక్కుల్ని ఛేదించుకుంటూ పూరోగమించాల్సి ఉన్నాం.AATel 359.4

    సంఘం ముందు గొప్ప ఆపత్కాలమున్నదని పౌలుకు తెలుసు. సంఘ నాయకులుగా బాధ్యతలు వహిస్తున్న వారు నమ్మకమైన సేవచేయాల్సి ఉంటుందని అతనికి తెలుసు. అందుకే తిమోతికి ఇలా రాశాడు, “దేవుని యెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుము బుద్ధి చెప్పుము.”AATel 360.1

    ఉత్సాహవంతుడు నిజాయితీపరుడు అయిన తిమోతికి దైవవిధిగా వచ్చిన ఈ ?..భీర బాధ్యత సువార్త సేవకుడికి దఖలుపడ్డ బాధ్యత, సేవ ఎంతో గురుతర మైంది ప్రాముఖ్యమైంది అనటానికి బలీయమైన సాక్ష్యం. తిమోతిని దేవుని ధర్మాసనం ముందుకి పిలిచి, మానవ సూక్తులు సంప్రదాయాలు కాక వాక్యం బోధించమని; పెద్ద సమావేశాల్లోను, చిన్నచిన్న వ్యక్తిగత గుంపుల్లోను, మార్గం పక్కన, చలిమంటల పక్కన, స్నేహితులకు విరోధులకు, భద్రతవున్న సమయంలోను కషాలు అపాయాలు పొంచివున్న తరుణంలోను, నిందలకు నష్టాలకు గురిఅయిన సమయంలోను సాక్ష్యం చెప్పటానికి సిద్ధంగావుండాలని పౌలు ఉపదేశించాడు.AATel 360.2

    మృదు స్వభావి, ఇట్టే మెత్తబడే తత్వంగల తిమోతి తన సేవలోని ముఖ్యమైన భాగాన్ని నిర్లక్ష్యం చెయ్యవచ్చునన్న భయంతో పాపాన్ని మందలించటంలో నమ్మకంగా ఉండాలని, తీవ్రమైన దుర్మార్గతను నిశితంగా ఖండించటంలో వెనకాడవద్దని పౌలు హితవు పలికాడు. ఆ పనిని “దీర్ఘశాంతముతో ఉపదేశించుచు... బుది” చెప్పాలని చెప్పాడు. అతడు క్రీస్తు ఓర్పును ప్రేమను ప్రదర్శించాలని దైవ వాక్యంలోని సత్యాల్ని వివరించి వాటి ప్రకారం తన గద్దింపుల్ని అమలుపర్చాలని చెప్పాడు.AATel 360.3

    పాపాన్ని ద్వేషించి ఖండించటం, అదే సమయంలో పాపిపట్ల దయ కనికరాలు ప్రదర్శిచటం ఏమంత సులువైన పనికాదు. హృదయశుద్ధిని పవిత్ర జీవితాన్ని సాధించటంలో మన కృషి ఎంత తీవ్రంగా ఉంటే, పాపం అంత ప్రమాదకరమైనదన్న గుర్తింపు మనకు కలుగుతుంది. సన్మార్గంలో చిన్న వంకర కూడా ఉండరాదన్న తీర్మానం మనం అంత నిర్దిష్టంగా మనం చేసుకోటం జరుగుతుంది. తప్పిదస్తుడిపట్ల అతిగా కాఠిన్యం ప్రదర్శించకుండా జాగ్రత్తపడాలి. అలాగని పాపం అతి నీచమైందన్న విషయాన్ని మర్చిపోయేటంత నిర్లిప్తంగా ఉండకూడదు. పొరపాటులో ఉన్నవారి పట్ల క్రీస్తు మాదిరి సహనం ప్రేమ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేరస్తుడి నేరంపట్ల వల్లమాలిన సహనం చూపే ప్రమాదం ఉంది. అందువల్ల అతడు తనకు మందలింపు అవసరం లేదని భావించి, దాన్ని అనవసర రాద్దాంతంగాను అన్యాయం గాను కొట్టిపారేసే ప్రమాదం ఉంది.AATel 360.4

    సువార్త సేవకులు అపరాధులపట్ల చూపే సహనం పాపాల్ని సహించేంతగాను వాటిలో పాలు పంచుకునేంతగాను దిగజార్చ కొన్నిసార్లు గొప్ప విఘాతం కలిగిస్తుంది. ఈ రకంగా దేవుడు దేన్నయితే ఖండిస్తాడో దాన్ని అంగీకరించటానికి, సమర్థించ టానికి వారిని సాతాను నడిపిస్తాడు. కొంతకాలం అయిన తర్వాత వారు ఆధ్యాత్మికంగా అంధులై తాము ఎవర్ని మందలించాలని దేవుడు ఆజ్ఞాపిస్తాడో వారినే ప్రశంసిస్తారు.AATel 361.1

    మానవ జ్ఞానం వల్ల కలిగిన దురహంకారంవల్ల, పరిశుద్దాత్మ ప్రభావాన్ని ధిక్కారించటంవల్ల, దైవవాక్యంలోని సత్యాలపట్ల నిరాసక్తతవల్ల క్రైస్తవులుగా చెప్పుకొని ఇతరులకు నేర్పటానికి సమర్థులమని భావించే అనేకులు దైవ విధుల ఆచరణకు దూరంగా ఉంటారు. పౌలు తిమోతితో ఇలా అంటున్నాడు, ” జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయదురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగుచేసుకొని సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును.”AATel 361.2

    అపొస్తలుడు ఇక్కడ బాహాటంగా భక్తిహీనులైన వారిని గురించి ప్రస్తావించటం లేదు. ఇష్టాన్ని అభిరుచిని మార్గదర్శకంగా అంగీకరించి తద్వారా స్వార్థానికి దాసులయ్యే నామమాత్రపు క్రైస్తవుల గురించి ప్రస్తావిస్తున్నాడు. అలాంటి వారు తమ పాపాల్ని ఏ సిద్ధాంతాలు ఖండించవో లేదా తమ లోక భోగాల్ని ఏ సిద్ధాంతాలు ఖండించవో వాటిని అంగీకరించటానికి సిద్ధంగా ఉంటారు. నమ్మకమైన క్రీస్తు సేవకుల మాటలు వారికి బాధ కలిగిస్తాయి. తమపై ప్రశంసలు పొగడ్తలు కురిపించే బోధకుల్నేవారు ఎంపిక చేసుకుంటారు. బోధకులమని చెప్పుకునేవారిలో కొందరు దైవవాక్యం బోధించే బదులు మానవ సూక్తుల్ని భావాల్ని బోధిస్తారు. తమకు దేవుడప్పగించిన నిధికి అపచారం చేస్తూ ఆధ్యాత్మిక మార్గనిర్దేశానికి తమమీద ఆధారపడ్డవారిని అపమార్గం పట్టిస్తారు.AATel 361.3

    తన పరిశుద్ధ ధర్మశాస్త్రంలో దేవుడు సంపూర్ణ జీవిత నియమాన్ని రూపొందించాడు. చిన్నవత్తు చిన్న పొల్లు విషయంలో కూడా మార్పులేని ఈ ధర్మశాస్త్ర విధులు లోకం అంతమొందేవరకూ మానవులు ఆచరించాల్సిన విధులని దేవుడు ఆజ్ఞాపించాడు. ధర్మశాస్త్రాన్ని ఘనపర్చి గొప్ప చెయ్యటానికి క్రీస్తు లోకానికి వచ్చాడు. దేవుని పట్ల ప్రేమ మానవుడిపట్ల ప్రేమ అన్న విస్తృతమైన పునాది పై అది ఆనుకొని ఉన్నదని దాని ధర్మవిధులకు లోబడి నివసించటం మానవుడి విధి అని ప్రభువు చూపించాడు. ధర్మశాస్త్రానికి లోబడి జీవించటమంటే ఏంటో ఆయన లోకంలో జీవించి చూపించాడు. ధర్మశాస్త్ర విధులు బాహ్యక్రియల్ని అధిగమించి ఉంటూ హృదయాలోచనల్ని కోరికల్ని పరిగణనలోకి తీసుకుంటాయని కొండమీది ప్రసంగంలో ప్రభువు వెల్లడించాడు.AATel 361.4

    ధర్మశాస్త్ర విధేయత “భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను” విసర్జించటానికి “ఈ లోకములో స్వస్థబుద్ధితోను, నీతితోను, భక్తితోను” బతకటానికి నడిపిస్తుంది. తీతుకు 2:12. అయితే నీతికి బద్ద విరోధి అయిన సాతాను లోకాన్ని చెరపట్టి ధర్మశాస్త్రాన్ని నిర్మూలించటానికి స్త్రీలను పురుషుల్ని నడిపిస్తున్నాడు. పౌలు చూసినట్లు, వేల ప్రజలు దైవవాక్యంలోని స్పష్టమైన సత్యాలనుంచి తొలగిపోయి తాము కోరుకుంటున్న అసత్య కథల్ని గాధల్ని బోధించటానికి బోధ కుల్ని ఎంపికచేసుకుంటున్నారు. బోధకుల్లోను ప్రజల్లోను అనేకమంది దైవ ధర్మశాస్త్రాన్ని కాళ్లతో తొక్కుతున్నారు. ఈ విధంగా ప్రజలు సృష్టికర్తను కించపర్చుతున్నారు. తన పథకాలు జయప్రదంగా అమలవుతున్నందుకు సాతాను నవ్వుకుంటున్నాడు.AATel 362.1

    దైవ ధర్మశాస్త్రం పట్ల ధిక్కార స్వభావం పెరగటంతో మతం పట్ల అనాసక్తి పెరుగుతుంది. అహంభావం, వినోదాల పట్ల ఆసక్తి, తల్లిదండ్రులపట్ల అవిధేయత, స్వార్ధాశలు రాజ్యమేలాయి. ఆందోళనకరమైన ఈ చెడుగుల్ని సరిచెయ్యటానికి ఏమి చెయ్యాలి అని ఆలోచనాపరులు ప్రశ్నిస్తున్నారు. సమాధానం పౌలు తిమోతికిచ్చిన హితోపదేశంలో ఉంది, “వాక్యమును ప్రకటించుము.” కార్యాచరణకు సురక్షితమైన సూత్రాలు బైబిలులోనే ఉన్నాయి. బైబిలు దేవుని చిత్తానికి నకలు. ప్రటితమైన దైవ వివేకం. జీవిత సమస్యలపై అది మానవులకు అవగాహననిస్తుంది. దాని సుత్రాల్ని పాటించేవారందరికి అది నిర్దుష్టమైన మార్గదర్శి అవుతుంది. వృధా ప్రయత్నాలతో వారి జీవితాలు వ్యర్థంకాకుండా అది కాపాడుతుంది.AATel 362.2

    దేవుడు తన చిత్రాన్ని బయలు పర్చుతాడు. ఆయన వచించిన దాన్ని మానవుడు ప్రశ్నించటం బుద్దిహీనం. అనంత జ్ఞాని పలికిన తర్వాత మానవుడు పరిష్కరించ టానికి సందేహాలుండవు. మానవుడు సర్దుబాట్లు చెయ్యటానికి చిన్న అవకాశం కూడా ఉండదు. మానవుడు చేయాల్సిందల్లా ప్రకటితమైన దేవుని చిత్తాన్ని చిత్తశుద్ధితో అంగీకరించటమే.AATel 362.3

    జ్ఞానం, మనస్సాక్షి తాలూకు అత్యున్నత ఆజ్ఞ విధేయతే. పౌలు తన ఆదేశాన్ని ఇలా కొనసాగించాడు: ” నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము. నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము.” పౌలు తన పరుగును తుద ముటించటానికి సిద్ధం గా ఉన్నాడు. తన స్థానంలో తిమోతి పనిచేయాలన్నది పౌలు కోరిక. కల్పనా కథలు తప్పుడు సిద్ధాంతాలు ఇతర మార్గాల ద్వారా సామాన్యమైన స్పష్టమైన సువార్త నుంచి సంఘాన్ని మళ్లించి అపవాది వారిని తప్పుదారి పట్టించకుండా తిమోతి కాపాడాలని పౌలు ఆకాంక్షించాడు. తాను పూర్తిగా దేవుని సేవకు అంకితం కాకుండా అడ్డుతగిలే సమస్త లౌకిక వ్యాపారాల్ని వ్యాపకాల్ని త్యజించాల్సిందిగా పౌలు తిమోతికి ఉద్బోధించాడు. దేవునికి నమ్మకంగా ఉండటంవల్ల తాను వ్యతిరేకతకు నిందకు హింసకు గురికావచ్చునని అప్పుడు వాటిని ఆనందంగా భరించాల్సిందని, క్రీస్తు ఎవరికోసం మరణించాడో ఆ ప్రజలకు మేలు చేయటంలో శాయశక్తులా పాటుపడి తద్వారా తన పరిచర్యను సంపూర్ణం చేయాల్సిందని తిమోతికి చెప్పాడు.AATel 362.4

    పౌలు తాను బోధించిన సత్యాల ప్రకారం జీవించాడు. ఇందులోనే అతని శక్తి ఉంది. తన బాధ్యతను గూర్చిన ఆలోచనే అతడి మనసంతా నిండింది. కనుక న్యాయం కనికరం సత్యానికి నిధి అయిన ఆ ప్రభువుతో సంప్రదిస్తూ కలిసి పనిచేశాడు. క్రీస్తు సేవలో లాగే, విరుద్ధంగా ఉన్నలోకంలో దుర్మార్థతతో తన పోరాటాల్లో కూడా వ్యతిరేకిస్తున్న శత్రువుల నడుమ అతడు ముందుకు సాగాడు.AATel 363.1

    అపాయకరమైన ఈ దినాల్లో పౌలు మాదిరిగా తమ్మును తాము ప్రయోజకులుగా తీర్చిదిద్దుకుని దైవ విషయాల్లో మంచి అనుభవం గడించి, ఉత్సాహంతోను ఉద్రేకంతోను నిండిన కార్యకర్తల సైన్యం సంఘానికి ఎంతో అవసరం. శుద్ధిపొందిన త్యాగధనులైన మనుషులు; శ్రమల్ని బాధ్యతల్ని తప్పించుకోని మనుషులు; ధైర్యశాలురు యధార్ధవంతులు అయిన మనుషులు: ఎవరి హృదయాల్లో క్రీస్తు “మహిమ నిరీక్షణ”గా ఉంటాడో ఆ మనుషులు; పరిశుద్ధ అగ్ని స్పృశించిన పెదాలతో “వాక్యమును ప్రకటించు” మనుషులు అవసరం. అలాంటి మనుషులు కొరవడినందు వల్ల దేవుని సేవ క్షీణిస్తున్నది. ఘోర తప్పిదాలు ప్రాణాంతక విషంలా మానవ సమాజంలో ఎక్కువమంది నైతికతను హరించి వారి నిరీక్షణల్ని భగ్నం చేస్తున్నాయి.AATel 363.2

    సత్యధ్వజాన్ని నమ్మకంగా మోసి అలసిపోయిన కార్యకర్తలు సత్యం కోసం తమ ప్రాణాల్ని అర్పిస్తుండగా వారి స్థానాన్ని ఆక్రమించటానికి ఎవరు ముందుకు వస్తారు? మన యువకులు పరిశుద్ద నిధిని తమ తండ్రుల చేతుల్లోనుంచి స్వీకరిస్తారా? నమ్మకంగా విశ్వాసంగా సేవచేసిన వారు మరణం ద్వారా ఖాళీ చేసిన స్థానాల్ని ఆక్రమించటానికి వారు సిద్ధపడుతున్నారా? అపొస్తలుడిచ్చిన దైవాజ్ఞను ఎవరు ఆచరిస్తారు? స్వార్థాన్ని రెచ్చగొడూ, యువతను ఆకట్టుకునే ఆశను చూపిస్తూ ఉన్న పరిస్థితుల నడుమ విధి నిర్వహణకు వచ్చే పిలుపుకు సానుకూలంగా స్పందించేవారున్నారా?AATel 363.3

    ఆయా వ్యక్తులకు వ్యక్తిగత వర్తమానాలతో పౌలు తన ఉత్తరాన్ని ముగించాడు. తిమోతి వచ్చి తనను కలుసుకోవలసిందని సాధ్యపడితే చలికాలం ప్రారంభానికి ముందే రావలసిందని పౌలు మరోసారి అభ్యర్థించాడు. మిత్రులు తనను విడిచి పెట్టి వెళ్ళిపోవటం వల్ల తనకు ఏర్పడ్డ ఒంటరితనాన్ని గురించి, తప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చిన కొందరి లోటును గురించి ప్రస్తావించాడు. ఎఫెసులోని సంఘానికి తన సేవల అవసరం ఎంతో ఉన్నందున తిమోతి రావటానికి సందేహిస్తాడేమోనన్న భయం చొప్పున తన స్థానే సేవ చెయ్యటానికి తుకికును పంపానని పౌలు తెలిపాడు.AATel 363.4

    నీరో ముందు తన విచారణ దృశ్యాన్ని గురించి, సహోదరులు తనను విడి పెట్టి వెళ్లిపోవటాన్ని గురించి, నిబంధనను నెరవేర్చే దేవుని కృప తనను బలోపేతం చెయ్యటం గురించి ప్రస్తావించిన తర్వాత, సహాయ కాపరులు నేలకూలినప్పటికీ ఏ ప్రధాన కాపరి తన మందను పోషిస్తాడో ఆ ప్రభువుకి తిమోతిని సమర్పిస్తూ పౌలు తన ఉత్తరాన్ని ముగించాడు.AATel 364.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents