Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అపొస్తలుల కార్యాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    55—కృపద్వారా మార్పు

    శిష్యుడు యోహాను జీవితంలో వాస్తవిక పరిశుద్ధత మూర్తీభవించింది. క్రీస్తుతో తన సన్నిహిత సహవాస సంవత్సరాల్లో రక్షకుడు అతనికి హెచ్చరికలు సూచనలు తరచుగా చేసేవాడు. ఈ హెచ్చరికల్ని గద్దింపుల్ని అతడు అంగీకరించాడు. ఆ పరిశుద్ధుని ప్రవర్తన తనకు ప్రదర్శితమయ్యే కొద్దీ యోహాను తన సొంలోటుపాట్లును గుర్తించి వినయమనస్కుడయ్యాడు. తన దుడుకుతనం దౌర్జన్యస్వభావానికి భిన్నంగా ఉన్న యేసు దయాగుణాన్ని సహనశీలాన్ని దిన సి. చూశాడు. దీన మనసును గూర్చి ఓర్పును గూర్చి ఆయన బోథించి నలు విన్నాడు. ఏనాటి కానాడు అతని హృదయం ప్రభువుకు ఆకర్షిత మౌతూ ని, చివరికి ప్రభవుపట్ల తన ప్రేమలో స్వార్థాన్ని మర్చిపోయాడు. దేవుని కుమారుడైన యేసులో అనుదినం తాను చూసిన శక్తి, కరుణ, ఔన్నత్యం, సాత్వికం, బలం, ఓర్పు అతని హృదయాన్ని గౌరవాభిమానాలతో నింపాయి. ఆగ్రహం, అత్యాశతో కూడిన తన మనఃప్రవృత్తిని పరివర్తన కలిగించే క్రీస్తు శక్తికి సమర్పించుకున్నాడు. దివ్య ప్రేమ అతని ప్రవర్తనలో మార్పు కలిగించింది.AATel 400.1

    యోహాను జీవితంలో చోటుచేసుకున్న పరిశుద్ధతకు భిన్నంగా ఉంది తన తోటి శిష్యుడు యూదా అనుభవం. తోటి శిష్యుడిలాగే యూదా క్రీస్తు శిష్యుణ్నని చెప్పుకున్నాడు. కాని అతడి దైవభక్తి నేతిబీరలోని నెయ్యి చందం. క్రీస్తు ప్రవర్తన సౌందర్యాన్ని యూదా అభినందించలేదనలేం. రక్షకుని మాటలు విన్నప్పుడు అతడికి నమ్మకం పుట్టేది. కాని అతడు తన్నుతాను తగ్గించుకోలేదు, తన పాపాల్ని ఒప్పుకోనూ లేదు. ఆ దివ్య ప్రభావాన్ని ప్రతిఘటించటం ద్వారా అతడు తాను ప్రేమిస్తున్నట్లు చెప్పుకుంటున్న ప్రభువును కించపర్చాడు. యోహాను తన లోపాల్ని అధిగమించటానికి తీవ్ర పోరాటం సల్పాడు. అయితే యూదా తన అంతరాత్మ నోరు నొక్కేసి శోధనకు లొంగిపోయాడు. పర్యవసానంగా తన దురభ్యాసాలు అతడి పై పట్టుబిగించాయి. క్రీస్తు బోధించిన సత్యాల ఆచరణ అతడి కోరికలు ఉద్దేశాలకు విరుద్ధంగా ఉన్నాయి. కనుక దైవ జ్ఞానాన్ని పొందేందుకోసం తన ఉద్దేశాల్ని ఆశయాల్ని వదులుకోలేక పోయాడు. వెలుగులో నడిచే బదులు చీకటిలో నడవటానికి ఎంపిక చేసునున్నాడు. దుష్ట కోరికలు, పేరాశ, ప్రతీకారేచ్ఛ, చీకటి తలంపుల్ని పెంచుకుని తుదకు సాతాను అదుపుకూ నియంత్రణకూ పూర్తిగా లొంగిపోయాడు.AATel 400.2

    క్రీస్తు అనుచరులుగా చెప్పుకునే వారికి యోహాను యూదాలు ప్రతినిధులు, ఈ శిష్యులిద్దరూ దైవాదర్శాన్ని అధ్యయనం చేసి దాన్ని అనుసరించటానికి ఒకే రకమైన అవకాశాలు పొందారు. ఇద్దరూ యేసుకు సన్నిహితులే. ఇద్దరూ ఆయన బోధలు వినే ఆధిక్యత ఉన్నవారే. ఇద్దరికీ తీవ్రమైన ప్రవర్తన దోషాలున్నాయి. ప్రవర్తనను మార్చే దైవ కృప పొందటానికి ఇద్దరికీ సమానావకాశాలున్నాయి. అయితే, ఒకడు యేసు బోధను వినయమనసుతో స్వీకరించగా, ఒకడు వాక్యాన్ని వినేవాడేగాని అనుసరించేవాడు కాడని వెల్లడి చేసుకున్నాడు. ఒకడు స్వార్థాన్ని రోజుకు రోజు చంపుకుని పాపాన్ని జయించి సత్యంవలన పరిశుద్ధుడయ్యాడు. తక్కినవాడు కృప కలుగజేసే మార్పును ప్రతిఘటించి, స్వార్థాశలు కోరికలు తీర్చుకుని సాతానుకు బానిస అయ్యాడు.AATel 401.1

    యోహానులో కనిపించిన ప్రవర్తన మార్పు వంటి మార్పు క్రీస్తుతో సహవాస ఫలం. ఒక వ్యక్తి జీవితంలో తీవ్రమైన లోపాలుండవచ్చు. అయినా అతడు క్రీస్తుకు నిజమైన శిష్యుడైనప్పుడు దైవకృపాశక్తి అతనిలో మార్పు తెచ్చి అతణ్ని పరిశుద్ధుడు - చేస్తుంది. ప్రభువు మహిమను అద్దంలో లాగు వీక్షిస్తూ అతడు మహిమనుంచి అధిక మహిమకు మార్పుచెంది కడకు తాను ఆరాధించే ఆ ప్రభువు పోలిక సంతరించు కుంటాడు.AATel 401.2

    యోహాను పరిశుద్ధతను బోధించిన బోధకుడు. సంఘానికి తాను రాసిన లేఖల్లో క్రైస్తవుల ప్రవర్తనకు నిర్దుష్టమైన నియమాలు రూపొందించాడు. అతడు ఇలా రాశాడు, “ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడైయున్నట్టుగా తన్నుతాను పవిత్రునిగా చేసికొనును.” “ఆయన యందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొన బద్దుడైయున్నాడు.” 1 యోహాను 3:3; 2:6. క్రైస్తవుడు హృదయంలోను జీవితంలోను పవిత్రంగా ఉండాలని అతడు ప్రబోధించాడు. ఆ మతాన్ని ఆచరించకుండా క్రైస్తవుణ్నని చెప్పుకోటంతో తృప్తి చెందకూడదు. తన పరిధిలో దేవుడు పరిశుద్ధుడై ఉన్నట్లు పాపమానవుడు, క్రీస్తు పై విశ్వాసమూలంగా, తన పరిధిలో పరిశుద్ధుడై ఉండాలి.AATel 401.3

    “మీరు పరిశుద్ధులగుటయే... దేవుని చిత్తము” అని అపొస్తలుడు పౌలు రాశాడు. 1 థెస్స 4:3. తన ప్రజలతో దేవుస్ వ్యవహరణలన్నిటిలోను సంఘ పరిశుద్ధతే ఆయన లక్ష్యం. వారు పరిశుద్ధులుగా జీవించేందుకు ఆయన వారిని తన నిత్యకాలం నుంచి ఎంచుకున్నాడు. కొరగాని స్వార్థాశల్ని విడిచి పెట్టి, సత్యానికి విధేయులై నివసించటం ద్వారా వారు పరిశుద్ధులయ్యేందుకు వారికోసం మరణించటానికి ఆయన తన కుమారుణ్ని త్యాగం చేశాడు. వారి నుంచి ఆయన కోరుతున్నది వ్యక్తిగత సేవ, వ్యక్తిగత సమర్పణ. ఆయనను విశ్వసిస్తున్నట్లు చెప్పుకొనేవారు ఆయన పోలికను కాపాడుకుని ఆయన ఆత్మ నియంత్రణ కింద ఉన్నప్పుడే దేవున్ని ఘనపర్చగలరు. అప్పుడు రక్షకునికి సాక్షులుగా దైవకృప తమకు చేసిన దేమిటో వారు వెల్లడిచేయవచ్చు.AATel 401.4

    ప్రేమ సూత్రం చర్య ద్వారా వాస్తవమైన పరిశుద్ధత వస్తుంది. “దేవుడు ప్రేమాస్వరూపియైచున్నాడు: ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు.” 1 యోహాను 4:16. క్రీస్తు ఎవని హృదయంలో నివసిస్తాడో అతడు అనుభవపూర్వక భక్తిని కనపర్చుతాడు. స్వచ్చమైన సిద్ధాంతం నీతిక్రియలతో మిళితమౌతుంది. పారలౌకిక నియమాలు పరిశుద్ధాచారాలతో మిళితమౌతాయి.AATel 402.1

    పరిశుద్ధులు కావాలని ఆశించేవారు మొదటగా ఆత్మ త్యాగమంటే ఏంటో తెలుసుకోవాలి. క్రీస్తు సిలువ “అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము” వేలాడే కేంద్ర స్తంభం. “ఎవడైనను నన్ను వెంబడింపగోరినియెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను” అంటున్నాడు క్రీస్తు. 2 కొరిథీ 4:18, మత్తయి 16:24. తోటి మానవుల పట్ల మన ప్రేమ సువాసనే దేవుని పట్ల మన ప్రేమను వెల్లడిచేస్తుంది. ఓర్పుతో చేసే సేవ ఆత్మకు విశ్రాంతినిస్తుంది. నిరాడంబరంగా, శ్రద్ధగా నమ్మకంగా చేసే శ్రమ మూలంగానే ఇశ్రాయేలు క్షేమాభివృద్ధి సాధ్యపడుతుంది. క్రీస్తు మార్గాన్ని అనురించటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని దేవుడు ఆదుకొని బలపర్చుతాడు.AATel 402.2

    పరిశుద్ధత అన్నది ఒక క్షణంలోనో, ఒక గంటలోనో, ఒక రోజులోనో జరిగే పనికాదు. అది జీవితకాలమంతా సాగే ప్రక్రియ. ఓ ఆనంద ఘడియలో మనసులో మెదిలే భావోద్వేగం వల్ల అది కలగదు. కాని అది నిత్యం పాపానికి మరణించటం నిత్యం క్రీస్తుకోసం జీవించటం ఫలితంగా రూపొందుతుంది. అప్పుడప్పుడు అరకొర ప్రయత్మం చేయటం ద్వారా తప్పుల్ని సవరించటం, ప్రవర్తనలో దిద్దుబాటు సాధించటం జరగదు. సుదీర్ఘమైన, పట్టుదలతో కూడిన కృషి, కఠిన క్రమశిక్షణ, తీవ్ర సంఘర్షణ ద్వారానే మనం జయించగలుగుతాం. పోరాటం మరుసటిరోజు ఎంతబలంగా ఉంటుందో ఈ రోజు తెలియదు. సౌతాను ఆధిపత్యం సాగినంత కాలం మనం స్వార్ధాన్ని జయించాల్సి ఉంటుంది. చిక్కులు పెట్టే పాపాల్ని జయించాల్సి ఉంటుంది. ప్రాణం ఉన్నంతకాలం నిలిచేందుకు స్థలం ఉండదు. ఒక చోటుకి చేరి సంపూర్తిగా సాధించాను అనటానికి లేదు. జీవితమంతా విధేయ జీవిత ఫలమే పరిశుద్ధత,AATel 402.3

    తాము పాపరహితులమని అపొస్తలులుగాని ప్రవక్తలుగాని చెప్పలేదు. దేవునికి అతి సమీపంగా జీవించిన వ్యక్తులు, తెలిసి ఒక తప్పుడు పని చేసేకన్నా ప్రాణాన్నే త్యాగం చేసే వ్యక్తులు, దివ్య జ్ఞానాన్ని శక్తిని ఇచ్చి దేవుడే గొరవించిన వ్యక్తులు, తాము పాపస్వభావం గలవారమని ఒప్పుకున్నారు. వారు తమ్మును తాము నమ్ముకోలేదు. తమకు నీతి ఉన్నదని చెప్పుకోలేదు. వారు క్రీస్తు నీతిని పూర్తిగా నమ్ముకున్నారు.AATel 403.1

    క్రీస్తును వీక్షించేవారందరూ ఇలాగే ఆయన్ను విశ్వసిస్తారు. క్రీస్తుకి మనం ఎంత దగ్గరగా వస్తే ఆయన ప్రవర్తన పవిత్రతను అంత స్పష్టంగా చూడగలుగుతాం. పాపం తాలూకు నీచత్వాన్ని అంత స్పష్టంగా గ్రహిస్తాం. అంతగా మనల్ని మనం తగ్గించుకుంటాం. ఆత్మ దేవున్ని చేరటానికి నిత్యం కృషి చేస్తుంది. యధార్థమైన, హృదయాన్ని బద్దలుకొట్టే పాపపు ఒప్పుకోలు నిత్యమూ ఉంటుంది. దేవుని ముందు దీనమనసుతో విజ్ఞాపన ఉంటుంది. మన క్రైస్తవానుభవంలో ప్రతీ ముందడుగు వద్ద మన పశ్చాత్తాపం గాఢమౌతుంది. ఆయనలోనే మన సమృద్ధత ఉందని గుర్తించి ఈ అపొస్తలుడిలా మనం ఈ ఒప్పుకోలు చెయ్యాలి: “నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును.” “మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమగును గాక; దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువవేయబడియున్నాము.” రోమా 7:18, గలతీ 6:14.AATel 403.2

    దైవ ప్రజల పరిశుద్ధపోరాటాల చరిత్రను దాఖలాలు చేసే దూతలు లిఖించాలి. వారి ప్రార్థనల్ని కన్నీటిని గూర్చి లిఖించాలి. కాని ‘నేను పాపరహితుణ్ని; నేను పరిశుద్ధుణ్ని” అని పలుకుతూ ఎవరూ దేవున్ని అవమానపర్చకుందురుగాక. పరిశుద్ధత పొందినవారి నోటివెంట అట్టి దురభిమానపు మాటలు రావు.AATel 403.3

    అపొస్తలుడు పౌలు మూడో ఆకాశానికి ఎగసి అక్కడి చెప్పశక్యం కాని సంగతులు చూశాడు, విన్నాడు. అయినా అతిశయం ఏమిలేని అతని మాటలివి: “ఇది వరకే నేను గెలిచితిననియైనను, ఇదివరకే సంపూర్ణస్థితి పొందితిననియైనను నేను అనుకొనుటలేదు గాని నేను దేని నిమత్తము క్రీస్తు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను.” ఫిలిప్పీ 3:12. పౌలు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి సాధించిన విజయాల్ని గూర్చి పరలోక దూతలు . రాయుదురుగాక. పరలోకం దిశగా పట్టుదలతో నిండిన అతని ప్రస్థానం విషయంలోను, దానికి కలిగే బహుమానాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కినవాటన్నింటిని వ్యర్థం అని పరిగణించే విషయంలోను పరలోకం ఆనందించునుగాక. అతని విజయాల కధనాన్ని వినిపించటానికి దేవ దూతలు ముచ్చటపడ్డారు. కాని పౌలు తాను సాధించిన విజయాల నిమిత్తం అతిశయపడటం లేదు. నిత్యజీవ కిరీటం కోసం పోరాటంలో ముందుకు సాగే తరుణంలో క్రీస్తు ప్రతీ అనుచరుడి వైఖరీ పౌలు వైఖరిలా ఉండాలి.AATel 403.4

    పరిశుద్ధత గురించి గొప్పలు చెప్పుకునేవారు దైవ ధర్మశాస్త్రం అనే అద్దంలోకి చూడాలి. ధర్మశాస్త్రం దీర్ఘకాలిక విధుల్ని వారు పరిశీలించి, హృదయాలోచనల్ని, ఉద్దేశాల్ని గ్రహించేదానిగా దాని పనిని అవగాహన చేసుకున్నప్పుడు తాము పాపరహితులమని చెప్పుకుని అతిశయించరు. ఇతరులతో తనను కూడా కలుపుకుని యోహానిలా అంటున్నాడు, “మనము పాపములేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనము మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్యముండదు.” “మనము పాపము చేయలేదని చెప్పుకొనిన యెడల, ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు.” “మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.” 1 యోహాను 1:8,10,9.AATel 404.1

    దేవుని ఆజ్ఞల్ని ఆచరించటానికి నిరాకరిస్తూ తాము పరిశుద్ధులమని, తాము పూర్తిగా దేవునికి అంకితమైన వారమని, దేవుని ప్రవచనాల పై తమకు హక్కున్నదని చెప్పేవారు ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని అతిక్రమించే వీరు దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేసినదంతా తమకు చెందుతుందని చెబుతారు. ఇది కేవలం వారి ఊహ మాత్రమే ఎందుకంటే దేవుని పట్ల నిజమైన ప్రేమ ఉంటే అది ఆయన ఆజ్ఞల్ని గైకోటంలో వెల్లడవుతుందని యోహాను చెబుతున్నాడు. సత్యాన్ని గూర్చిన సిద్ధాంతాన్ని నమ్మటం, క్రీస్తు పై విశ్వాసముందని చెప్పటం, క్రీస్తు వంచకుడు కొడని నమ్మటం, బైబిలు బోధించే మతం చమత్కారంగా అల్లిన కధకాదని నమ్మటం మాత్రమే చాలదు. యోహానిలా అంటున్నాడు, “ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు. వానిలో సత్యములేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా సంపూర్ణ మాయెను... మన మాయనయందున్నామని దీనివలన తెలిసికొనుచున్నాము.” “ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయనయందు నిలిచియుండును. ఆయన వానియందు నిలిచియుండును.” 1 యోహాను 2:4,5; 3:24.AATel 404.2

    రక్షణను విధేయతవలన పొందాల్సి ఉందని యోహాను బోధించలేదు. విధేయత విశ్వాసం, ప్రేమ ఫలమని బోధించాడు. యోహానిలా అన్నాడు, “పాపములను తీసివేయుటకై ఆయన ప్రతక్ష్యమాయెనని మీకు తెలియును; ఆయనయందు పాపమేమియులేదు. ఆయనయందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు. పాపము చేయువాడెవడును ఆయనను చూడనులేదు ఎరుగనులేదు.” 1 యోహాను 3:5,6. మనం క్రీస్తులో నిలిచి ఉంటే, మన హృదయంలో దైవ ప్రేమ ఉంటే, మన మనోభావాలు, మన ఆలోచనలు, మన క్రియలు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉంటాయి. పరిశుద్ధుని హృదయం దైవధర్మశాస్త్ర సూత్రాల్ని అనుసరించి మసులుకుంటుంది.AATel 404.3

    అనేకులు దైవాజ్ఞల్ని గైకోటానికి ప్రయత్నిస్తూ శాంతి ఆనందాలు లేకుండా మనుగడ సాగిస్తుంటారు. వారి అనుభవంలోని ఈలోటు విశ్వాసం కొరవడినందువల్ల కలిగిన ఫలితమే. ఉప్పు నేల పైనో నీళ్లులేని ఎడాలిలోనో ఉన్నట్లు నడుస్తారు వారు. వారు ఎక్కువ పొందగలిగినప్పుడు అంతంత మాత్రమే పొందుతారు. ఎందుకంటే దేవుని వాగ్దానాలకు పరిమితులు లేవు. సత్యాన్ని ఆచరించటం ద్వారా కలిగే పరిశుద్ధతను అలాంటి మనుషులు నిర్దుష్టంగా సూచించలేరు. తన కుమారులు కుమార్తెలు అందరూ సంతోషంగా, సమాధానంగా, విధేయంగా నివసించాలని ప్రభువు కోరుతున్నాడు. విశ్వాసాన్ని ఆచరణలో పెట్టటం ద్వారా విశ్వాసి ఈ దీవెనల్సి పొందగలుగుతాడు. విశ్వాసమూలంగా ప్రవర్తనలోని ప్రతీలోటు భర్తీ అవుతుంది, ప్రతీ అపవిత్రత శుద్ధి అవుతుంది, ప్రతీ పొరపాటు సరి అవుతుంది. శ్రేష్టమైన ప్రతీ గుణం వృద్ధి చెందుతుంది.AATel 405.1

    పాపంతో సంఘర్షణలోను క్రైస్తవ ప్రవర్తన అభివృద్ధిలోను విజయానికి దేవుడు ఏర్పాటు చేసిన సాధనం ప్రార్థన. విశ్వాస ప్రార్థనకు జవాబుగా వచ్చే దైవ ప్రభావాలవల్ల విజ్ఞాపకుడు అర్థించేవన్నీ అతడి ఆత్మలో నెరవేరాయి. పాప క్షమాపణ కోసం, పరిశుద్ధాత్మ కోసం, క్రీస్తు మనసులాంటి మనసుకోసం, ప్రభువు సేవచెయ్యటానికి వివేకం, శక్తి కోసం, ఆయన వాగ్దానం చేసిన ఏదైనా వరం కోసం మనం ప్రార్థించవచ్చు. “మీకు దొరకును” అన్నది ఆయన వాగ్దానం.AATel 405.2

    పర్వతం పై దేవునితో ఉన్న సమయంలో ఆయన మహిమకు నివాస స్థలం కానున్న ఆ అద్భుత నిర్మాణం మాదిరిని మోషే వీక్షించాడు. పర్వతం పై దేవునితో ఉన్న తరుణంలో అనగా రహస్య ప్రార్థన స్థలంలో ఆయన మహిమాన్విత ఆదర్శంపై మనం ధ్యానించాలి. అన్ని యుగాల్లోను పరలోకంతో సంప్రదింపుల ద్వారా తన కృపా సిద్ధాంతాల్ని తన బిడ్డల మనసులకు క్రమక్రమంగా బయలుపర్చటం ద్వారా వారి విషయమైన తన సంకల్పాల్ని దేవుడు నెరవేర్చుతూ వచ్చాడు. “ఉదయము తప్పక వచ్చురీతిని ఆయన ఉదయించును.” హోషేయ 6:3. తనను జ్ఞానంతో దేవుడు నింపగల తావులో తన్నుతాను నిలుపుకున్న వ్యక్తి పాక్షికంగా చీకటి కప్పి ఉన్న ఉదయంలోనుంచి మధ్యాహ్న ప్రచండ కాంతిలోకి పురోగమిస్తాడు.AATel 405.3

    వాస్తవికమైన పరిశుద్ధత అంటే పరిపూర్ణ ప్రేమ, పరిపూర్ణ విధేయత, దేవుని చిత్తానికి పరిపూర్ణ నిబద్ధత. సత్యానికి విధేయులమై ఉండటం ద్వారా మనం దేవుని దృష్టికి పరిశుద్ధులమై ఉండాలి. సజీవ దేవున్ని సేవించేందుకు మస్సాక్షిని మృత క్రియలనుంచి ప్రక్షాళన చేసుకోవాలి. మనమింకా పరిపూర్ణులం కాము. అయినా స్వార్థం, పాపం బంధకాలను తెంచుకుని పరిపూర్ణత సాధనకు ముందుకు సాగటం మన ఆధిక్యత. గొప్ప అవకాశాలు ఉన్నతమైన పరిశుద్ధమైన సాధనలు అంతరికీ అందుబాటులో ఉన్నాయి.AATel 405.4

    లోకంలో ఈయుగంలో అనేకమంది భక్తి జీవితం విషయంలో ఏమంత అభివృద్ధి సాధించకపోవటానికి కారణం దేవుని చిత్తం అంటే వారు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించటమని భావించటమే. వీరికి స్వార్ధంతో పేచీలేమీ ఉండవు. స్వార్థాశలు వినోదాలు సుఖభోగాలతో పోరాటంలో కొంతకాలం విజయం సాధిస్తున్న వారు కొందరున్నారు. వారు చిత్తశుద్ధి నిజాయితీ గలవారు. కాని దీర్ఘకాలిక కృషితో, అనుదినం మరణించాల్సి రావటంతో, అవిశ్రాంత శ్రమతో వారు విసుగుచెందుతారు. సోమరితనం ఆకర్షణీయంగా ఉంటుంది. స్వార్థాన్ని సిలువవేయటం కిట్టదు. నిద్రమత్తుతో బరువైన కళ్లు మూసుకొని శోధనను ప్రతిఘటించే బదులు వారు దాని వశంలోకి జారుకుంటారు.AATel 406.1

    దైవ వాక్యాదేశాలు దుష్టత్వంతో రాజీ టు పెట్టటం లేదు. మనుషులందరినీ తన వద్దకు చేర్చుకొనేందుకోసం దైవ కుమారుడు లోకంలోకి వచ్చాడు. లోకాన్ని నిద్రపుచ్చటానికి ఆయన రాలేదు. చివరకు దేవుని పరిశుద్ధ పట్టణం గుమ్మాల వద్దకు ప్రయాణం చేయాల్సినవారు నడిచే ఇరుకు మార్గాన్ని చూపించటానికి ఆయన వచ్చాడు. ఆయన నడిపించే మార్గాన్నే ఆయన బిడ్డలు అనుసరించాలి. సుఖాల్ని స్వార్థాశల్ని ఎంతగా త్యాగం చెయ్యాల్సి వచ్చినా, ఎంతటి మూల్యం చెల్లించాల్సి వచ్చినా, ఎంతటి బాధ అనుభలించాల్సి వచ్చినా స్వార్థంతో వారు అవిశ్రాంత సమరం సాగించాలి.AATel 406.2

    మనుషులు దేవునికి అర్పించగల ఉత్తమమైన స్తుతి దేవుని కార్యనిర్వహణకు అంకితమైన సాధనాలుగా వ్యవహరించటం. కాలం వేగంగా గతించిపోతుంది. దేవునికి చెందేదాన్ని మనం అట్టి పెట్టుకోకుందుము గాక. ఆయనకు ఇవ్వాల్సిన దాన్ని అట్టి పెట్టుకుని నాశనాన్ని మీదికి తెచ్చుకోకుండా ఉందుముగాక. ఆయన కోరుతున్నది పూర్ణహృదయం. దాన్ని ఆయనకు సమర్పించండి. అది ఆయనదే. సృష్టిమూలంగాను విమోచన మూలంగాను అది ఆయనదే. ఆయన మీ మనసును కోరుతున్నాడు. అది ఆయనకివ్వండి. అది ఆయనదే. ఆయన మీ డబ్బును కోరుతున్నాడు. ఇవ్వండి, అది ఆయనదే. “మీరు మీసొత్తు కారు. విలువ పెట్టి కొనబడినవారు.” 1 కొరింథీ 6:19,20. పరిశుద్ధత పొందిన ఆత్మ సమర్పించే శ్రద్ధాంజలి దేవుడు కోరుతున్నాడు. అది ఆయనను సేవించటానికి ప్రేమ మూలంగా పనిచేసే విశ్వాసాచరణ ద్వారా తన్నుతాను సమాయత్తం చేసుకున్న ఆత్మ. మన ముందు అత్యున్నత ఆదరాన్ని ఆయన ఉంచుతున్నాడు. అది పరిపూర్ణత. తాను దేవుని ముందు పూర్తిగా మనకోసం ఎలాగున్నాడో మనం ఈలోకంలో సంపూర్తిగా తనకోసం ఉండాలని ఆయన కోరుతున్నాడు.AATel 406.3

    “మీరు పరిశుద్ధులగుటయే” ఈ విషయంలో “దేవుని చిత్తము.” 1 థెస్స 4:3. అది మీ చిత్తం కూడానా? మీ పాపాలు మీ ముందు పర్వతాల్లా కనిపించవచ్చు. కాగా మిమ్మల్ని మీరు తగ్గించుకుని, సిలువ మరణం పొంది తిరిగి లేచిన రక్షకుని నీతిని నమ్ముకుని నా పాపాల్ని ఒప్పుకున్నట్లుయితే ఆయన మిమ్మల్ని క్షమించి సమస్త అనీతినుంచి శుద్ధి చేశాడు. తన ధర్మశాస్త్రానుసారంగా జీవించాలని దేవుడు మిమ్మన్ని ఆదేశిస్తున్నాడు. పరిశుద్ధంగా, ఇంకా పరిశుద్ధంగా అంటూ మీతో అంటున్న దేవుని స్వరం ప్రతిధ్యనే ఈ ధర్మశాస్త్రం. క్రీస్తు కృప సంపూర్ణత్వాన్ని అభిలషించండి. ఆయన నీతికోసం తీవ్ర తృష్ణతో నా హృదయాన్ని నింపుకోండి. దైవవాక్యం ఆ కార్యాన్ని సమాధాన మంటుంది. దాని ఫలితం నిత్య ప్రశాంతత, నిత్య నిశ్చయత.AATel 407.1

    నా ఆత్మ దేవుని కోసం పరితపించేటప్పుడు, మీరు శోధింపశక్యంకాని ఆయన కృప అనే ఐశ్వర్యాన్ని అధికంగా, అత్యధికంగా కనుగొంటారు. ఈ ఐశ్వరాన్ని గురించి ఆలోచించే కొద్దీ, అది మీసొంతమై, రక్షకుని త్యాగం ప్రభావాన్ని ఆయన నీతి సంరక్షణను, తండ్రిముందు మిమ్మల్ని “నిష్కళంకులుగాను నిందారహితులుగాను” సమర్పించటానికి ఆయనకున్న శక్తిని వెల్లడిచేస్తుంది. 2 పేతురు 3:14.AATel 407.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents