Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అపొస్తలుల కార్యాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    51—నమ్మకమైన సహాయక కాపరి

    అపొస్తలుడు పేతురు తదుపరి సేవను గురించి అపొస్తలుల కార్యాల పుస్తకంలో ప్రస్తావన దాదాపు శూన్యం. పెంతెకొస్తు దినాన ఆత్మకుమ్మరింపు అనంతరం ముమ్మరంగా సువార్త సేవ జరిగిన సంవత్సరాల్లో, సాంవత్సరిక పండుగల సమయంలో దేవున్ని ఆరాధించటానికి యెరూషలేముకి వచ్చే యూదుల్ని విశ్వాసుల్ని చేయటానికి కృషి చేసినవారిలో పేతురు ఒక్కడు.AATel 369.1

    యెరూషలేములోను సిలువ బోధకులు సందర్శించిన ఇతరస్థలాల్లోను విశ్వాసుల సంఖ్య పెరిగే కొద్దీ పేతురుకున్న వరాలు తొలినాళ్ల క్రైస్తవ సంఘానికి ఎంతో విలువ గలవయ్యాయి. నజరేయుడైన యేసును గూర్చి అతని సాక్ష్యం ప్రభావం అనేక ప్రాంతాలకు విస్తరించింది. అతని పై రెట్టింపు బాధ్యత పడింది. మెస్సీయాను గురించి అవిశ్వాసుల ముందు ఖండితమైన సాక్ష్యం ఇస్తూ వారిని విశ్వాసులు చెయ్యటానికి పాటుపడ్డాడు. అదే సమయంలో విశ్వాసుల పరంగా ప్రత్యేక సేవచేసి క్రీస్తును గూర్చిన విశ్వాసంలో వారిని బలోపేతం చేశాడు.AATel 369.2

    పేతురు స్వార్థాన్ని త్వజించి దేవుని శక్తి మీద పూర్తిగా ఆధారపడిన తర్వాతే సహాయక కాపరిగా సేవచేయటానికి పిలుపు పొందాడు. పేతురు క్రీస్తును ఎరగనని బొంకకముందు అతడితో క్రీస్తిలా అన్నాడు, “నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుము” లూకా 22:32. భవిష్యత్తులో క్రీస్తును విశ్వసించేవారి నిమిత్తం అపొస్తలుడు చేయాల్సిఉన్న విస్తృత ఫలభరిత సేవ సందర్భంగా ఈ మాటలు ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. పాపంతో, శ్రమలు బాధలతో, పశ్చాత్తాపంతో తనకు కలిగిన అనుభవం పేతురుని ఈ ప్రత్యేక సేవకు సిద్ధం చేసింది. విశ్వాసికి తన బలహీనత ఏంటో తెలిసివచ్చేవరకు క్రీస్తు పై ఆధారపడాల్సిన అవసరాన్ని అతడు గ్రహించలేదు మానవుడు తన్నుతాను నమ్ముకోకుండా రక్షకునిపై ఆధారపడినప్పుడే అతడు సురక్షితంగా నడవగలడని పేతురు శోధన, గాలితుఫాను మధ్య గ్రహించాడు.AATel 369.3

    సముద్రం పక్క శిష్యులతో క్రీస్తు చివరి సమావేశంలో “నన్ను ప్రేమించు చున్నావా?” (యోహాము 21:15-17) అని పేతుర్ని ముమ్మారు ప్రశ్నించి పరీక్షించి ఆమీదట శిష్యుల్లో అతణ్ని తన స్థానానికి పునరుద్ధరించాడు ప్రభువు. అతడి కర్తవ్యం నిర్దేశించాడు. అతడు ప్రభువు గొర్రెలమందను మేపాల్సి ఉన్నాడు. ఇప్పుడు మార్పుచెంది ప్రభువు అంగీకారం పొందిన అతడు దొడ్డి వెలపల ఉన్నవారిని రక్షించుటమేకాదు గొర్రెలకు కాపరిగా కూడ పనిచేయాల్సి ఉన్నాడు.AATel 369.4

    సేవచేయటానికి పేతురుకి క్రీస్తు విధించిన షరతు “నన్ను ప్రేమించు చున్నావా?” అన్నది. ఇదే అవసరమైన అర్హత. ఇతర అర్హతలు పేతురుకి ఎన్ని ఉన్నా క్రీస్తుపట్ల ప్రేమ లేకుండా ఆయన గొర్రెల్ని అతడు నమ్మకంగా కాయలేడు. జ్ఞానం, ఔదార్యం , వాగ్దాటి, ఉద్రేకం -ఇవన్నీ మంచి సేవకు అవసరమే. అయితే హృదయంలో క్రీస్తుపట్ల ప్రేమ లేకపోతే క్రైస్తవ బోధకుడి సేవ నిరర్థకమౌతుంది.AATel 370.1

    క్రీస్తుపట్ల ప్రేమ అప్పుడప్పుడు కలిగే మనోభావనకాదు. అది హృదయంలో ఉండి ప్రదర్శితం కావలసిన సజీవశక్తి. కాపరి ప్రబోధించే సత్యం అతడి ప్రవర్తనకు నడవడికి ప్రతిరూపమైతే ఆపనిపై ప్రభువు తన ఆమోద ముద్రవేస్తాడు. కాపరి మంద ఒకటవుతారు. క్రీస్తు పై నిరీక్షణలో వారు ఏకమౌతారు.AATel 370.2

    పేతురుతో ప్రభువు వ్యవహరించిన తీరులో అతనికి అతని సహోదరులకు ఒక గుణపాఠం ఉంది. పేతురు తన ప్రభువునెరుగనని బొంకినప్పటికీ అతనిపట్ల క్రీస్తుకున్న ప్రేమ ఎన్నడూ మారలేదు. అపొస్తలుడు ఇతరులకు సువార్త పరిచర్య చేయాల్సి ఉండగా అపరాధిని అతడు ఓర్పుతో, సానుభూతితో, క్షమించే బుద్ధితో, ప్రేమతో కలుసుకోవాలి. తన దౌర్బల్యాన్ని, వైఫల్యాన్ని గుర్తుంచుకుని తనకు అప్పగించబడ్డ గొర్రెల్ని క్రీస్తు మాదిరిగా దయగా చూసుకోవాలి.AATel 370.3

    చెడుగు చేయటం సహజమైన మానవులు తప్పిదస్తులతో కఠినంగా వ్యవహరిస్తుంటారు. వారు హృదయాన్ని గ్రహించలేరు. దాని సంఘర్షణలు, బాధ వారెరుగరు. ప్రేమతో నిండిన మందలింపును, మాన్పటానికి గాయపర్చే దెబ్బను, నిరీక్షణను ప్రస్తావించే హెచ్చరికను వారు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.AATel 370.4

    తన సేవాకాలమంతా పేతురు తనకు దేవుడిచ్చిన మందను నమ్మకంగా కాసి రక్షకుడు తనకిచ్చిన బాధ్యతకు యోగ్యుడుగా నిరూపించుకున్నాడు. నజరేయుడైన యేసును ఇశ్రాయేలు నిరీక్షణగాను మానవాళి రక్షకుడుగా నిత్వము ఘనపర్చాడు. ప్రభువు విధించిన క్రమ శిక్షణ కనుగుణంగా తన జీవనసరళిని తీర్చిదిద్దుకున్నాడు. విశ్వాసుల్ని చైతన్యపర్చి వారిని క్రియాశీలుల్ని చేయటాన్కి తన శక్తిమేరకు కృషి చేశాడు. అతడి భక్తి జీవితాదర్శం , అతడి నిర్విరామ సేవ అనేకమంది యువకులు తమ్మును తాము సువార్త పరిచర్యకు పూర్తిగా అంకితం చేసుకోటానికి స్ఫూర్తినిచ్చాయి. కాలం గతించే కొద్దీ ఉపదేశకుడుగా అపొస్తలుడి ప్రభావం పెరిగింది. తాను ముఖ్యంగా యూగుల రక్షణ కోసం పనిచేయాల్సి ఉన్న బాధ్యతను ఎన్నడూ విస్మరించకపోయినా అనేక ప్రాంతాల్లో క్రీస్తును గూర్చిన సాక్ష్యం ఇస్తూ సువార్త విషయంలో వేలాది ప్రజల విశ్వాసాన్ని పటిష్ఠపర్చాడు.AATel 370.5

    తన సేవ చివరి సంవత్సరాల్లో “పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆస్థియ, బితునియ అను దేశములయందు చెదరిన” విశ్వాసులకు ఉత్తరాలు రాయటానికి పేతురు ఆత్మావేశం పొందాడు. కష్టాలు శ్రమలు అనుభవిస్తున్నవారిని ఉత్తేజపర్చి వారి విశ్వాసాన్ని బలోపేతం చేయటానికి, అనేక శోధనలవల్ల తమ విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదంలో ఉన్న వారిని ప్రోత్సహించి వారు తమ సత్కియల్ని కొవసాగించేటట్లు చెయ్యటానికి పేతురు ఉత్తరాలు సాధనమయ్యాయి. క్రీస్తు శ్రమలు, ఆయన లచరణ, ఓదార్పు ఎవరు బహుగా పొందారో ఆ భక్తుడైన పేతురి ముద్ర ఈ ఉత్తరాల పై ఉంది. అతడు కృపవల్ల పూర్తిగా పరివర్తన చెందిన వ్యక్తి. అతడి విత్యజీవ నిరీక్షణ నిశ్చితమైంది, దృఢమైంది.AATel 371.1

    తన మొదటి ఉత్తరం ఆరంభంలోనే ఈ వృద్ధ దైవ సేవకుడు ప్రభువుకు స్తోత్రం చెల్లించి కృతజ్ఞతలు తెలిపాడు. “మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్వము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసేను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మికొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది” అన్నాడు.AATel 371.2

    తీవ్ర శ్రమలు హింస సంభవిస్తున్న కాలంలో సైతం తొలి దినాల క్రైస్తవులు నూతన భూమిలో తమకు నిశ్చయంగా ఉన్న స్వాస్థ్యం గురించి నిరీక్షిస్తూ ఉత్సాహించి ఆనందించారు. పేతురు ఇలా రాశాడు, “మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుచున్నదిగదా? దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత, నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు . . . . ఈ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణ పొందుచు, చెప్పశక్యముగాని మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు.”AATel 371.3

    అపొస్తలుడి మాటలు ప్రతీయుగంలోని విశ్వాసులకు రాసిన మాటలు. అవి “అన్నిటి అంతము సమిపమైయున్న” సమయంలో నివసిస్తున్న ప్రజలకు ప్రత్యేక ప్రాధాన్యం గల మాటలు. అతని హితవాక్యాలు, హెచ్చరికలు విశ్వాసాన్ని ధైర్యాన్ని కూర్చేమాటలు, తమ విశ్వాసాన్ని “అంతము మట్టుకు గట్టిగా చేప చెట్టాలనుకునే వారికి అవి ఎంతో అవసరం. హెబ్రీ 3:14.AATel 371.4

    మనసును నిషిద్ధ అంశాల పై నిలుపకుండా ఉంచుకోటం లేదా మానసిక శక్తుల్ని ప్రాధాన్యం లేని విషయాల పై వ్యర్థం చేయకుండా చూసుకోటం ప్రాముఖ్యమని విశ్వాసులకు బోధించటానికి పేతురు ప్రయత్నించాడు. సాతాను ఉచ్చుల్లో చిక్కుకోకూడదని కోరుకునేవారు తమ ఆత్మలోకి ప్రవేశమార్గాల్ని పకడ్బందీగా కాపాడుకోవాలి. చెడు ఆలోచనలు పుట్టింటి విషయాల్ని చదవటం, చూడటం లేదా వినటం వారు మానుకోవాలి. సాతాను ప్రతిపాదించే ప్రతీ అంశం పైన ఆలోచించటానికి మనసును విడిచి పెట్ట కూడదు. హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకపోతే వెలపలి కీడులు లోపలి కీడులను మేల్కొలుపుతాయి. దానితో ఆత్మ చీకటిలో సంచరిస్తుంది. పేతురు ఇలా రాస్తున్నాడు, “నా మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమైన సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి. . . . మీ పూర్వపు అజ్ఞాన దశలో మాకుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్దుడై యున్న ప్రకారము నారును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై యుండుడి.”AATel 372.1

    “మీరు పరదేశులైయున్నంత కాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మివ్యర్థ ప్రవర్తనను విడిచి పెట్టునట్లుగా వెండిబంగారముల వంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రకముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొట్టె పిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని యెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా ఈ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉండియున్నవి.”AATel 372.2

    మానవ రక్షణను కొనటానికి వెండి బంగారాలు సరిపోతే “వెండి నాది, బంగారు నాది” (హగ్గయి 2:8) అంటున్న ప్రభువు ఈ కార్యాన్ని ఎంత సునాయాసంగా సాధించేవాడు! దైవకుమారుని ప్రశస్త రక్తం వలన మాత్రమే పాపి రక్షణ పొందగలడు. రక్షణ ప్రణాళికకు మూలం త్యాగమే. అపొస్తలుడు పౌలిలా రాశాడు, “మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు గదా? ఆయన ధనవంతుడైయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని, ఈ నిమిత్తం దరిద్రుడాయెను.” 2 కొరిథీ 8:9. మనల్ని సమస్త పాపంనుంచి విమోచించాలని ఎంచి క్రీస్తు మనకోసం బలిఅయ్యాడు. ఇక రక్షణ ప్రసాదించే అత్యుత్తమ దీవెన “దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవము.” రోమా 6:23.AATel 372.3

    పేతురింకా ఇలా అన్నాడు, “నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు, మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి.” దేవుడు తన ఆత్మను శక్తిని వాక్యం ద్వారా ప్రదర్శిస్తాడు. వాక్యానికి లోబడి జీవించటం నిర్దిష్ట నాణ్యత గల ఫలాన్నిస్తుంది; “అదే నిష్కపటమైన సహోదర ప్రేమ”. ఇది దేవుని వలన కలిగే ప్రేమ. ఇది ఉన్నతాశయాలకు స్వారరహిత క్రియలకు దారితీస్తుంది. AATel 373.1

    సత్యం జీవితంలో నిత్యసూత్రంగా రూపొందినప్పుడు ఆత్మ “క్షయ బీజమునుండి కాక శాశ్వతమగు జీవముగల దేవుని వాక్వమూలముగా అక్షయ బీజమునుండి” పుడుతుంది. పరిశుద్దాత్మ మూలంగా సత్యం హృదయంలో ముద్రితమైనప్పుడు నూతన అభిప్రాయాలు మేల్కొంటాయి. నిద్రావస్థలో ఉన్న శక్తి సామర్థ్యాలు మేల్కొని దేవునితో సహకరిస్తాయి.AATel 373.2

    పేతురు అతని తోటి శిష్యుల విషయంలో ఇదే జరిగింది. లోకానికి క్రీస్తే సత్యప్రకాశకుడు. ఆయనే అక్షయ బీజమైన దైవవాక్యాన్ని మనుషుల హృదయాల్లో నాటాడు. తన అమూల్య పాఠాల్లో చాలా వాటిని అప్పుడు అవగాహన చేసుకోలేకపోయిన మనుషులికి ఆ మహోపాధ్యాయుడు బోధించాడు. ఆయన ఆరోహణమైన తర్వాత, పరిశుద్ధాత్మ ఆ పాఠాల్ని శిష్యుల స్ఫురణకు తెచ్చినప్పుడు నిద్రావస్థలో ఉన్నవారి మనసులు మేల్కొన్నాయి. ఆ సత్యాల భావం నూతన ఆవిష్కరణలా వారి మనసుల్లో తళుక్కుమన్నది. అప్పుడు పవిత్రమైన నిష్కపటమైన సత్యం చోటు చేసుకొంది. అంతట అద్భుతమైన ప్రభువు జీవితానుభవం వారి అనుభవమయ్యింది. దైవ వాక్యం వారి ద్వారా సాక్ష్యం ఇచ్చింది. వారు శక్తిమంతమైన సత్యాన్ని ప్రకటించారు. “ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను.” “ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొంచితిమి.” యోహాను 1:14,16.AATel 373.3

    లేఖనాలు పఠించమని వాటిని సరిగా అవగాహన చేసుకోటం ద్వారా వారు దేవుని నిత్యరాజ్యం కోసం పాటుపడగలరని అపొస్తలుడు విశ్వాసులికి హితవు పలికాడు. అంతిమంగా విజయవంతులు కానున్న ప్రతీ ఆత్మ అనుభవంలో ఆందోళన, శ్రమలు ఉంటాయని పేతురు గుర్తించాడు. కాని శోదనకు గురి అయిన వ్యక్తి మనసుకు లేఖన అవగాహాన ఓదార్పునిచ్చి శక్తిగల దేవుని పై అతడి విశ్వాసాన్ని బలపర్చే వాగ్దానాల్ని స్ఫురణకు తెస్తుందని కూడ అతనికి తెలుసు.AATel 373.4

    “సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది; గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును, మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే. ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్నయెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి” అన్నాడు పేతురు.AATel 374.1

    పేతురు ఎవరికి ఉత్తరాలు రాశాడో వారిలో ఎక్కువమంది అన్యజనుల మధ్య నివసిస్తున్నవారు. వారికి వచ్చిన పిలుపుకు వారు నమ్మకంగా ఉండటం పై ఎంతో ఆధారపడి ఉంది. యేసుక్రీస్తు అనుచరులుగా వారి ఆధిక్యతల్ని గూర్చి అపొస్తలుడు ప్రస్తావించాడు. “మిరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పర్చబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు. ఒకప్పుడు ప్రజలుగా ఉండక యిప్పుడు దేవుని ప్రజలైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.AATel 374.2

    “ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికలునై యున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆవిషయములో వారు మా సత్క్రియలను చూచి, వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమ పరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.”AATel 374.3

    పౌరసంబంధమైన అధికారుల విషయంలో విశ్వాసులు అవలంబించాల్సిన వైఖరిని పేతురు స్పష్టం చేశాడు: “మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమితమై లోబడియుండుడి. రాజు అందరికిని అధిపతియనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుట కును సన్మారుల కు మెప్పుకలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడియుండుడి. ఏలయనగా మెరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానులు మాటలాడు మూర్తుల నోరు మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులైయుండియు దుష్టత్వమును కప్పి పెట్టుటకు మా స్వాతంత్ర్యమును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడియుండుడి. అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడి, రాజును సన్మానించుడి.”AATel 374.4

    “మంచి వారును సాత్వికులునైనవారికి మాత్రమేకాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణభయముతో లోబడియుండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి, దుఃఖము సహించిన యెడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడుచున్నప్పుడు నాకు సహించిన యెడల అది దేవునికి హితమగును; ఇందుకు వారు పిలువబడితిరి. క్రీస్తు కూడ మికొరకు బాధపడి, మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను. ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏకపటమును కమబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమ పెట్ట బడియు బెదిరింపక న్యాయముగా తీర్పుతీర్చు దేవునికి తన్నుతాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి, నీతి విషయమై జీవించునటు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానువాద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి. వారు గొబైలవలె దారి తప్పిపోతిరిగాని యిప్పుడు నా ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్లియున్నారు” అంటూ సేవకులైనవారు తమ యజమానులికి లోబడి ఉండాలని అపొస్తలుడు స్పష్టంగా చెప్పాడు.AATel 374.5

    విశ్వాసాన్నంగీకరించిన స్త్రీలు పవిత్ర ప్రవర్త కలిగి ఉండాలని వస్త్రాలు ధరించే విషయంలోను ఇతరులతో మెలగే విషయంలోను వారు మర్యాదగా ఉండాలని అపొస్తలుడు ఉపదేశించాడు. అతడు ఇలా సూచించాడు, “జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు, మృదునైనట్టియునైన గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.”AATel 375.1

    ఈ పాఠం ప్రతీయుగంలోని విశ్వాసులకూ వర్తిస్తుంది. “మీరు వారి ఫలముల వలన వారిని తెలిసికొందురు.” మత్తయి 7:20. సాత్వికం, మృదుస్వభావం అనే ఆంతరంగిక అలంకారం అమూల్యమైనది. యధార్థ క్రైస్తవుడి జీవితంలో వెలపటి అలంకారం అంతరంగంలోని శాంతికి పరిశుద్ధతకు అనుగుణంగా ఉంటుంది. “ఎవడైనను నన్ను వెంబడింపగోరిని యెడల, తను తాను ఉపేక్షించుకొని, తన సిలువ నెత్తికొని నన్ను వెంబడింపవలెను” అని క్రీస్తు అన్నాడు. మత్తయి 16:24. ఆత్మోపేక్ష, త్యాగం క్రైస్తవ జీవితంలో అంతర్భాగాలు. రక్షణ పొందేవారికి నిర్దేశితమైన మార్గంలో నడిచేవారి హృదయాల్లో చోటుచేసుకున్న మార్పుకి వారు ధరించే దుస్తుల్లో వారి అభిరుచిలో నిదర్శనం కనిపిస్తుంది.AATel 375.2

    అందాన్ని ప్రేమించటం అందాన్ని ఆకాంక్షించటం మంచిదే. అయితే మనం ఎన్నడూ నశించని అత్యున్నత సౌందర్యాన్ని ముందుగా ప్రేమించి అన్వేషించాలని దేవుడు కోరుతున్నాడు. “సాధువైనట్టియు, మృదువైనట్టియు” గణంతోను, లోకంలోని పరిశుద్ధులందరూ ధరించబోతున్న. “శుభ్రమైన తెల్లని నారబట్టల” సౌందర్యంతో ఏ బాహ్య సౌందర్యమూ సాటికాదు (ప్రక 19:14) ఈ దుస్తులు వారికి గొప్ప సౌందర్యాన్ని కూర్చి వారిని ఇక్కడ అందరికీ అభిమానపాత్రుల్ని చేస్తాయి. ఇకనుంచి అవి పరలోక రాజు గుర్తింపును ఆయన కోటలోకి ప్రవేశాన్ని ఇచ్చే చిహ్నంగాను ఉంటాయి. ఆయన వాగ్దానం ఇది, “వారు అరులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడ సంచరించెదరు.” ప్రకటన 3:4.AATel 375.3

    భవిష్యత్తులో క్రీస్తు సంఘం ఎదుర్కోనున్న అపాయకర కాలాన్ని ప్రావచనిక దృష్టితో చూస్తూ, శ్రమలు బాధలు సంభవించినా, విశ్వాసంలో నమ్మకంగా కొనసాగాల్సిందిగా విశ్వాసుల్ని అపొస్తలుడు ప్రోత్సాహించాడు. “ప్రియులారా, మిమ్మును శోధించుటకు నాకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి” అని రాశాడు పేతురు.AATel 376.1

    దైవ ప్రజల్లోని లౌకికత అనే వ్యర్ధాన్ని దహించివేసి వారిని శుద్ధం చెయ్యటానికి క్రీస్తు పాఠశాలలో నేర్పించే విద్యలో శ్రమలు భాగం. దేవుడు తన ప్రజల్ని నడిపిస్తున్నాడు. కనుకనే వారికి శ్రమలతో నిండిన అనుభవాలు కలుగుతాయి. శ్రమలు, అడ్డంకులు ఆయన ఎంపిక చేసుకున్న క్రమశిక్షణ పద్దతులు. విజయసాధనకు అవి ఆయన నియమించిన షరతులు. మనుషుల హృదయ రహస్యాలెరిగిన ఆ ప్రభువు వారికన్న మెరుగుగా వారి దౌర్బల్యాల్ని ఎరిగినవాడు. కొందరు తమకున్న అర్హతల్ని సక్రమంగా వినియోగిస్తే అవి తన సేవ పురోభివృద్ధికి ఉపయుక్తమౌతాయని ఆయన గ్రహిస్తాడు. వీరు తమకు తెలియకుండా దాగి ఉన్న తమ లోపాల్ని కనుగొనేందుకుగాను ప్రభువు వారిని వివిధ హోదాల్లోకి వివిధ పరిస్థితుల్లోకి తీసుకువస్తాడు. ఈ బలహీనతల్ని అధిగమించటానికి వారికి అవకాశమిచ్చి ఆయన సేవకు తమ్మును తాము యోగ్యుల్ని చేసుకోటానికి తరుణ మిస్తాడు. వారు పరిశుద్ధులయ్యేందుకుగాను శ్రమల కొలిమిలో కాలటానికి తరచు అనుమతిస్తాడు.AATel 376.2

    తన వారసుల నిమిత్తం దేవుని శ్రద్ధ అనంతమైనది. తన బిడ్డల ప్రస్తుత శ్రయానికి వారి నిత్య జీవన శ్రేయానికి దోహదపడని ఏ శ్రమ ఏ కష్టం ప్రభువు వారికి రానివ్వడు. తన ఇహలోక సేవాకాలంలో క్రీస్తు దేవాలయాన్ని శుద్ధి చేసినట్లు ఆయన తన సంఘాన్ని శుద్ధి చేస్తాడు. తన ప్రజలు భక్తిగా జీవించేందుకు, సిలువ విజయాల్ని ఇతోధిక శక్తితో ప్రకటించేందుకు దోహద పడటమే తన ప్రజలకు కలిగే శ్రమలు బాధల పరమోద్దేశం.AATel 376.3

    క్రీస్తు సేవలో సిలువను చూడటానికి పేతురు ససేమిరా ఇష్టపడని సమయం అతని అనుభవంలో ఒకటి ఉంది. తనకోసం పొంచి ఉన్న శ్రమలు, మరణాన్ని గూర్చి రక్షకుడు తన శిష్యులతో చెప్పినప్పుడు, “అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడును కలుగదు” (మత్తయి 16:22) అని పేతురన్నాడు. శ్రమల్లో ఉన్న క్రీస్తుతో సహవాసానికి ఆత్మసానుభూతి దూరంగా ఉంది. ఆ ఆత్మసానుభూతి ఇప్పుడు పేతురు వ్యతిరేకతను ప్రతిపాదించింది. పేతురుకి అది చేదు పాఠం. లోకంలో క్రీస్తు మార్గం వేదన అవమానంతో నిండిన మార్గమని అతడు నెమ్మదిగా గ్రహించాడు. కాగా కాలుతున్న కొలిమి వేడిలో అతడు దాని గుణపాఠాన్ని నేర్చుకోవాల్సి ఉన్నాడు. ఒకప్పుడు చురుకుగా పనిచేసిన అతడు, పైబడ్డ సంవత్సరాల భారం ఆపై సేవాభారంతో ఇప్పుడు వంగిపోయిన అతడు ఇలా రాయగలిగాడు, “ప్రియులారా మిమ్మును శోధించుటకు నాకు కలుగుచున్న అగ్నివంటి శ్రమను గూర్చి మీకేదో యొక వింత సంభవించినట్లు ఆశ్యర్యవడ కుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై యున్నంతగా సంతోషించుడి.”AATel 376.4

    సంఘ పెద్దలకు సహాయకాపర్లుగా తమ బాధ్యతల్ని గురించి రాస్తూ అపొస్తలుడిలా అన్నాడు: “బలిమిచేత కాక దేవుని చిత్త ప్రకారముగాను, దుర్గాభాపేక్షతో కాక సిద్దమనస్సుతోను, ఈ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాపాడి నాకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైయుండక మందకు మాదిరిగా ఉండుడి, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడతారని మహిమ కిరీటము పొందుదురు.”AATel 377.1

    సహాయకాపరులుగా ఉన్నవారు ప్రభువు మందను జాగ్రత్తగా కాయాలి. ఇది నిరంకుశంగా పరిపాలించటం కాదు. వారి పాలన ఉద్రేకపర్చేదిగా, బలోపేతం చేసేదిగా, వృద్ధిపర్చేదిగా ఉండాలి. సువార్త పరిచర్య అంటే నీతి బోధ చెయ్యటమేకాదు. చిత్తశుద్ధిగల వ్యక్తిగత పరిచర్య అని దాని అర్థం. లోకంలోని సంఘం తప్పులు చేసే పురుషులు స్త్రీలతో కూడినది. వారు ఈ జీవితంలో ఆ నిత్య మహిమా రాజ్యం కోసం పనిచెయ్యటానికి శిక్షణ క్రమశిక్షణ పొందటానికి సహనంతో కూడిన కృషి అవసరం. దైవ ప్రజల్ని పొగడ్తలతో ఉబ్బించకుండ లేదా వారితో కఠినంగా వ్యవహరించకుండ ఉండి వారికి జీవాహారం అందించే నమ్మకమైన కాపరులు, మార్పు కలిగించే పరిశుద్ధాత్మ శక్తిని అనుదినం పొందే మనుషులు, తాము ఎవరికోసం సువార్త పరిచర్య చేస్తున్నారో వారి పట్ల స్వార్ధరహిత ప్రేమగల మనుషులు నమ్మకమైన కాపరులుగా పనిచేసేందుకు అవసరం.AATel 377.2

    సహాయకాపరి సంఘంలో వేర్పాటు, ద్వేషం, ఈర్ష, అసూయ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక అతడు నేర్పుతో పనిచేయాల్సి ఉంది. పరిస్థితుల్ని చక్కబర్చేందుకు అతడు క్రీస్తు స్ఫూర్తితో పనిచేయాల్సి ఉంటుంది. నమ్మకంగా హెచ్చరించాలి. పాపాల్ని ఖండించాలి. తప్పుల్ని సరిదిద్దాలి. ఈ కార్యాల్ని ప్రసంగ వేదికపై నుంచే కాక వ్యక్తిగత సేవ ద్వారా సాధించాలి. అవిధేయ హృదయులు వర్తమానాన్ని వ్యతిరేకించవచ్చు. దైవసేవకుణ్ని విమర్శించి తప్పుపట్టవచ్చు. అప్పుడు అతడు ఈ మాటలు గుర్తుంచుకోవాలి, “పై నుండి వచ్చు జానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యు న్నది” యాకోబు 3:17,18.AATel 377.3

    సువార్త పరిచారకుడి కర్తవ్యం “సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన యేర్పాటు ఎట్టిదో అందరికిని తెలియ” పర్చటమే. ఎఫెస్సీ 3:11. ఈ సేవను నిర్వహించే బోధకుడు ఆత్మత్యాగం ఏమంత అగత్యం లేని భాగాన్ని ఎంపికచేసుకుని, ప్రసంగించటంతోనే తృప్తిపడి, వ్యక్తి గత సేవను ఇతరులకు విడిచి పెడే అతడి సేవను దేవుడు అంగీకరించడు. సువార్త సేవను చేపట్టి సంఘసభ్యుల్ని బలోపేతం చెయ్యటానికి అగత్యమైన వ్యక్తి గత పరిచర్య చెయ్యటానికి ఇష్టపడని బోధకుడు తన పిలుపును అపార్థం చేసుకున్నాడనాలి.AATel 378.1

    నిజాయితీ పరుడైన కాపరికి తన్నుతాను మర్చిపోయే తత్వం ఉంటుంది. దైవకార్యాల్ని నిర్వహించటంలో తనకు తనను గూర్చిన ఆలోచన ఉండదు. వాక్యం బోధించటం ద్వారాను, గృహాల్లో వాక్యపరిచర్య ద్వారాను వారి అవసరాల్ని, వారి దుఃఖాల్ని, వారి కష్టబాధల్ని తెలుసుకుంటాడు. సమస్త భారాన్ని భరించే ప్రభువు సహాకారంతో వారి కష్టాల్లో పాలుపంచుకుని, వారి దుఃఖాల్ని ఓదార్చి ఆకలిగా ఉన్నవారి ఆత్మలను తృప్తిపర్చి వారిని దేవుని వద్దకు నడిపిస్తాడు. ఈ సేవలో సువార్త సేవకుడికి పరలోక దూతలు సహకరిస్తారు. ఈ ప్రక్రియ బోధకుడికి సత్యం విషయంలో ఉపదేశం ఉత్తేజం కలిగించి రక్షణ దిశగా అతణ్ని వివేకవంతుణ్ని చేస్తుంది.AATel 378.2

    సంఘంలో బాధ్యతలు గలవారికి ఉపదేశం ఇచ్చే సందర్భంగా సంఘ సహవాసంతో సంబంధమున్న వారందరూ అవలంబించాల్సిన కొన్ని సూత్రాల్ని అపొస్తలుడు సూచించాడు. సంఘంలోని యువసభ్యులు తమ పెద్దల ఆదర్శాన్న నుసరించి క్రీస్తును పోలిన నమ్రతను ఆచరించాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. “చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి; మీరందరు ఎదుటి వాని యెడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతి క్రింద దీనమనస్కులై యుండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావతు ఆయన మీద వేయుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు . . . . విశ్వాసమునందు స్థిరులై వానిని ఎదిరించుడి.”AATel 378.3

    సంఘం ఒక విలక్షణమైన శ్రమ కాలాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో పేతురు విశ్వాసులికి ఉత్తరం రాశాడు. అప్పటికే అనేకులు క్రీస్తు శ్రమల్లో పాలివారయ్యారు. కొద్ది కాలంలోనే సంఘం భయంకర హింసను ఎదుర్కోబోతున్నది. సంఘంలో బోధకులుగాను నాయకులుగాను నిలిచిన అనేకమంది కొన్ని సంవత్సరాల్లోనే సువార్త నిమిత్తం తను ప్రాణాల్ని కోల్పోవాల్సి ఉన్నారు. అతి త్వరలో మంద పై జాలిలేని క్రూరమైన తోడేళ్లు మందలో ప్రవేశించనున్నాయి. అయితే క్రీస్తు పై తమ నిరీక్షణను కేంద్రీకరించిన వారిని ఇవేవీ నిరాశపర్చలేవు. ప్రస్తుత శ్రమల నుంచి భవిష్యత్తు కష్టాల దృశ్యాలనుంచి ఉద్రేకం ఉత్సాహం అందించే మాటలతో విశ్వాసుల మనసుల్ని “అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్థ్యము” పైకి తిప్పాడు. “తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, కొంచెము కాలము వారు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. యుగయుగములకు ప్రభావమాయనకు కలుగునుగాక. ఆమెన్” అంటూ చిత్తశుద్ధితో ప్రార్థన చేశాడు.AATel 379.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents