Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అపొస్తలుల కార్యాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    12—శిష్యుడైన హింసకుడు

    సువార్త ప్రచారం సాధిస్తున్న విజయాలవల్ల తీవ్ర ఉద్రిక్తతకు గురిఅవుతున్న యూదు నేతల్లో ప్రధముడు తార్పువాడైన సౌలు. జన్మత: రోమా పౌరుడైనా సౌలు యూదుడు. యెరూషలేములో ప్రసిద్ధ రబ్బీలవద్ద విద్యనభ్యసించినవాడు. “ఇశ్రాయేలు వంశపువాడు... బెన్యాసను గోత్రములో” పుట్టినవాడు అయిన సౌలు “హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడు... ధర్మశాస్త్రము విషయము పరిసయ్యుడు... ఆసక్తి విషయము సంఘమును హింసించినవాడు... ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనింద్యుడు.” ఫిలిప్పీయులకు 3:5,6. అతన్ని గొప్ప భవిష్యత్తు ఉన్న యువకుడిగా రబ్బీలు పరిగణించారు. సనాతన ధర్మాన్ని సమర్థంగా ఉద్రేకంగా కాపాడగల వ్యక్తిగా అతని మీద ఆశలు పెట్టుకొన్నారు. సన్ హెడ్రిన్ సభలో అతని సభ్యత్వం పౌలికి గొప్ప అధికారాన్నిచ్చింది.AATel 80.1

    సైఫను విచారణలోను శిక్షావిధిలోను సౌలు ప్రముఖపాత్ర వహించాడు. హతసాక్షితో దేవుని సముఖం ఉండడం తాను యేసు అనుచరుల విషయంలో అనుసరిస్తున్న విధానం నీతివంతమైనది కాదన్న సందేహం సౌలుకి కలిగింది. మనసులో ఆందోళన చెందాడు. ఆ సంకట పరిస్థితిలో తనకు నమ్మకమున్న పెద్దల వద్దకు వెళ్లి విజప్తి చేశాడు. యాజకులు అధికారుల వాదనలు, సైఫను దేవదూషకుడని, స్తెఫను బోధించిన క్రీస్తు మోసగాడని పరిశుద్ధ హోదాలోవున్న యాజకులు చేస్తున్న కార్యం మంచిదని సౌలుకు నమ్మకం పుట్టించాయి. AATel 80.2

    హృదయంలో సంఘర్షణ లేకుండా సౌలు ఈ తీర్మానానికి రాలేదు. అయితే చివరికి తన విద్య తన దురభిమానాలు తన గురువుల పట్ల తనకున్న గౌరవాదరాలు తన అహంభావం తనకున్న ప్రజాదరణ సౌలు అంతరాత్మను దైవ కృపను అణచివేశాయి. యాజకులు శాస్త్రులు సరైన మార్గంలో ఉన్నారని నిర్ధారించుకొని సౌలు యేసు శిష్యులు బోధిస్తున్న సిద్ధాంతాల్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. నిరపరాధులైన స్త్రీలను పురుషులను న్యాయస్థానాల ముందుకు ఈడ్చుకు వెళ్ళడం అక్కడ కేవలం క్రీస్తును నమ్మినందుకు వారికి ఖైదు కొందరికి మరణం పడేటట్లు చూడడం వంటి అతని కార్యకలాపాలు కొత్తగా ఏర్పడ్డ సంఘానికి దుఃఖం కలిగించాయి. అనేకులు సురక్షిత స్థలాలకు పారిపోయారు.AATel 80.3

    ఈ హింస కారణంగా యెరూషలేము నుంచి పారిపోయినవారు “సువార్త వాక్యమును ప్రకటించుచు సంచరించిరి.” అ.కా. 8:4. వారు వెళ్లిన పట్టణాల్లో దమస్కు ఒకటి. అక్కడ అనేకమంది నూతన విశ్వాసాన్ని అంగీకరించి అనుచరు లయ్యారు.AATel 81.1

    అప్రమత్తులై కృషిచేయడం వల్ల హింస కొనసాగించడం వల్ల ఈ వ్యతిరేక బోధను అణచివేయవచ్చునని యాజకులు అధికారులు భావించారు. ఈ కొత్త బోధకు వ్యతిరేకంగా యెరూషలేములో తీసుకొన్న చర్యను ఇతర స్థలాల్లో కూడా అమలు పర్చాలని ఆలోచించారు. దమస్కులో చేపట్టాల్సిన ప్రత్యేక కార్యానికి తన సేవలందిస్తానని సౌలు ముందుకు వచ్చాడు. “ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, యీ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన యెడల, వారిని బంధించి యెరూషలేమునకు తీసికొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను.” “ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది” (అ.కా. 26:12) తార్పువాడైన సౌలు యౌవనబలంతోను ఉద్రేకంతోను తొణికిసలాడూ మరవరాని ఆ ప్రయాణం పై బయలుదేరాడు. ఆ ప్రయాణంలో చోటు చేసుకొన్న విచిత్ర ఘటనలు తన జీవితాన్ని గొప్ప మలుపుతిప్పాయి.AATel 81.2

    ప్రయాణంలోని చివరి రోజు “మధ్యాహ్నమందు” అలసిన ప్రయాణికులు దమస్కు పట్టణాన్ని సమీపిస్తుండగా ఆ నగర వీధులు పంట పొలాలు ఉద్యానవనాల చుట్టూ ఉన్న కొండల నుంచి ప్రవహించే సెలయేళ్లు తడిపే పళ్ల తోటలు వారికి కనువిందు గావించాయి. ఎడారి ప్రాంతంలో దీర ప్రయాణం అనంతరం ఆ దృశ్యాలు వారి హృదయాల్ని ఆహ్లాదపర్చాయి. లోతట్టునవున్న పంటపొలాల్ని సుందరమైన దమస్కునగరాన్ని సౌలు అతని సహచరులు వీక్షిస్తుండగా “నా చుట్టును నాతో కూడా వచ్చినవారి చుట్టును ఆకాశము నుండి సూర్యకాంతికంటె మిక్కిలి ప్రకాశమానమైన యొక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని” అని తర్వాత సౌలు చెప్పాడు. అది మానవ నేత్రాలు తాళలేనంత తీక్షణతగల వెలుగు (అ.కా. 26:13) గుడ్డివాడై ఎటూతోచక సౌలు కుప్పకూలిపోయాడు.AATel 81.3

    తమ చుట్టూ ఆ వెలుగు ప్రకాశిస్తూవుండగా “హెబ్రీ భాషలో ఒక స్వరము” (అ.కా. 26:14) తనతో ఇలా మాట్లాడడం సౌలు విన్నాడు. “సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు?” అప్పుడు అతను “నీవు ఎవడవనగా ప్రభువు నేను యేసును” “మునికోలలకు ఎదురుతన్నుట నీకు కష్టమని హెబ్రీభాషలో” పలికాడు.AATel 81.4

    భయంతో నిండి ప్రచండమైన ఆ వెలుగుకు దాదాపు గుడ్డివారైన సౌలు అనుచర్లకు ఒక స్వరమైతే వినిపించిదిగాని మనిషి కనిపించలేదు. ఆ స్వరం మాట్లాడిన మాటల్ని సౌలు అవగాహన చేసుకొన్నాడు. ఎవరు మాట్లాడారో అతనికి స్పష్టంగా బోధపడింది. మాట్లాడింది దైవ తనయుడు క్రీస్తే అని గుర్తించాడు. తనముందు నిలబడివున్న మహిమపూరిత వ్యక్తిని సిలువను పొందిన ప్రభువును చూశాడు. వేటుపడ్డ యూదుడి మనసుపై రక్షకుని రూపం చెరగని ముద్రవేసుకొంది. ఆయన పలికిన మాటలు అతడి హృదయంలోకి చొచ్చుకుపోయాయి. అతని మానసిక చీకటి గదుల్లోకి వెలుగు వరదలా ప్రవహించి అతని గత జీవితంలోని అజ్ఞానాన్ని దోషాన్ని బయలుపర్చి తన ప్రస్తుత జీవితంలో పరిశుద్ధాత్మ అవసరమని తేటతెల్లం చేసింది.AATel 82.1

    యేసు అనుచరుల్ని హింసించడంద్వారా తాను నిజానికి సాతాను పనిని చేస్తున్నానని సౌలు గ్రహించాడు. ధర్మాన్ని గూర్చి తన విధిని గూర్చి తనకన్న నమ్మకాలు అధికారులపై తనకున్న గట్టి నమ్మకం మీద ఆధారితమై ఉన్నవని గ్రహించాడు. పునరుత్థాన కథనం శిష్యులు అల్లిన కట్టుకథ అని యాజలకు అధికారులు చెప్పినప్పుడు అతను నమ్మాడు. ఇప్పుడు యేసే ప్రత్యక్షం కావడంతో శిష్యులు చెబుతున్నది వాస్తవమని సౌలు గట్టిగా నమ్మాడు.AATel 82.2

    పరలోకంనుంచి వెలుగు ప్రకాశించిన ఘడియలో సౌలు మనసు చాలా చురుకుగా పనిచేసింది. పరిశుద్ధ లేఖనాల్లోని ప్రవచనాలు అతని అవగాహన పరిధిలోకి వచ్చాయి. యూదులు యేసును విసర్జించడం, యేసు సిలువ మరణం, పునరుత్థానం, ఆరోహణం - వీటిని గూర్చి ప్రవక్తలు ముందే తెలిపారని యేసే మెస్సీయా అని వీటి నెరవేర్చు ధ్రువపర్చుతుందని సౌలు గ్రహించాడు. హతసాక్షి సైఫను తన మరణ సమయంలో చేసిన ప్రసంగం పౌలుకి జ్ఞాపకం వచ్చింది. “ఆకాశము తెరవబడుటయు చూచుచున్నాను” అని చెప్పినప్పుడు సైఫను నిజంగా “దేవుని మహిమను” చూశాడని సౌలు నమ్మాడు. అ.కా. 7:55,56. ఈ మాటల్ని ప్రధాన యాజకులు దేవదూషణ అన్నారు. కాని సైఫను సత్యం పలికాడని ఇప్పుడు సౌలు గ్రహించాడు.AATel 82.3

    ఆ హింసకుడికి ఇదంతా విజ్ఞానాన్నిచ్చింది. నజరేయుడైన యేసుగా మెస్సీయా ఈ భూమికి వచ్చాడని తాను రక్షించాలని వచ్చిన ప్రజలే ఆయనను నిరాకరించి సిలువవేసి చంపారని ఇప్పుడు సౌలుకు కచ్చితంగా బోధపడింది. రక్షకుడు సమాధినుంచి లేచి పరలోకానికి వెళ్లాడని కూడా గ్రహించాడు. ఈ విషయాల్సి దేవుడు తనకు బయలుపర్చుతున్న స ఎయంలో, సిలువ మరణం పొంది తిరిగి లేచిన రక్షకుని గూర్చి సాక్ష్యమిచ్చిన స్తెఫను తన అనుమతితోనే హత్యకు గురైయ్యాడని, అనంతరం ఉత్తములైన క్రీస్తు విశ్వాసులు అనేకులు తన సహకారంతో క్రూర హింసకు మరణానికి గురయ్యారని జ్ఞాపకంవచ్చి సౌలు భయంకంపితుడయ్యాడు.AATel 82.4

    సైఫను ద్వారా రక్షకుడు సౌలుతో మాట్లాడాడు. సైఫను మాటల్లోని హేతుబద్ధత కాదనిలేనిది. అతని ముఖం క్రీస్తు మహిమను ప్రతిబింబిస్తూ “దేవదూత ముఖమువలె” కనిపించడం విద్వాంసుడైన ఆయూదుడు చూశాడు. అ.కా. 6:15. తన శత్రువులపట్ల స్తెఫను సహనాన్ని క్షమాగుణాన్ని చూశాడు. తాను కలిగించిన హింసను అనుభవించిన వారిలో అనేకులు ప్రదర్శించిన ధైర్యాన్ని సంతోషంగా తమ్మును తాము సమర్పించుకొనే తత్వాన్ని సౌలు చూశాడు. కొందరు తమ విశ్వాసం నిమితం ప్రాణాల్ని వదలడం కూడా అతను చూశాడు.AATel 83.1

    ఇవన్నీ సౌలు మనసును ఆకట్టుకొన్నాయి. కొన్నిసార్లు యేసే వాగ్దత్త మెస్సీయా అన్న దృఢనమ్మకం పుట్టించేవి. అలాంటి సమయాల్లో ఈ నమ్మికతో రాత్రంతా సంఘరణపడి యేసు మెస్సీయా కాడని ఆయన అనుచరులు మోసపోయిన మత దురభిమానులని నిర్ధారించుకోడంతో ఆ సంఘర్షణను ముగించేవాడు. ఇప్పుడు “సౌలా, సౌలా, నీ వేల నన్ను హింసించుచున్నావు.?” అంటూ క్రీస్తే స్వయాన సౌలుతో మాట్లడాడు. “ప్రభువా, నీ వెవడవు?” అన్న అతని ప్రశ్నకు “నేను నీవు హింసించుచున్న యేసును” అని అదే స్వరం సమాధానమిచ్చింది. ఇక్కడ యేసు తన ప్రజలే తానని వ్యక్తం చేస్తున్నాడు. యేసు అనుచరుల్ని హింసించడం ద్వారా సౌలు పరలోక ప్రభువునే వ్యతిరేకించాడు. వారిని నిందించి వారిపై అబద్ధ సాక్ష్యం చెప్పినప్పుడు లోక రక్షకుడినే నిందించి ఆయన పై అబద్ధ సాక్ష్యం చెప్పాడు.AATel 83.2

    తనతో మాట్లాడింది తాము ఎంతోకాలంగా ఎదురు చూసిన మెస్సీయా, ఇశ్రాయేలు ఆదరణ విమోచకుడు అయిన యేసే అన్న విషయమై సౌలు మనసులో ఎలాంటి సందేహం లేదు. “వణుకుతూ విస్మయం చెందుతూ, ప్రభువా నేనేమి చేయవలెనని నీవు కోరుతున్నావు?” అని అడిగాడు. “లేచి పట్టణములోనికి వెళ్లుము అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను.”AATel 83.3

    ఆ మహిమ తొలగిపోయి సౌలు నేలమీద నుంచి లేచినప్పుడు తనకు కనుచూపు పూర్తిగా లేనట్లు తెలుసుకొన్నాడు. ప్రచండమైన క్రీస్తు మహిమను అతని కళ్లు భరించలేకపోయాయి. ఆ మహిమ తొలగిపోయిన తర్వాత రాత్రి చీకటివంటి చీకటి అతని కళ్లను కప్పింది. యేసు శిష్యుల్ని క్రూరంగా హింసించినందుకు శిక్షగా ఈ గుడ్డితనం తనకు వచ్చిందని సౌలు నమ్మాడు. భయంకరమైన ఆ చీకటిలో తడుముకొంటున్నప్పుడు భయాశ్చర్యాలతో నిండిన అనుచరులు అతని ‘చెయ్యిపట్టుకొని దమస్కులోనికి నడిపించిరి.”AATel 83.4

    ఆ చరిత్రాత్మక ఉదయాన తాను ప్రధాన యాజకుడి ఆదరాభిమానాల్ని చూరగొనగలిగినందుకు సంతృప్తి పడుతూ పౌలు దమస్కు పట్టణాన్ని సమీపించాడు. అతని భూజాలమీద గొప్ప బాధ్యతలున్నాయి. సాధ్యమైనంత వరకు దమస్కులో నూతన విశ్వాసం ప్రబలకుండా అడ్డుకోడం ద్వారా యూదు మతాసక్తుల్ని పటిష్ఠపర్చడానికి సౌలు నియమితుడయ్యాడు. తాను చేపట్టిన కార్యం జయప్రదం కావాలని అతను దీక్షపూనాడు. తనముందున్న అద్భుతమైన అనుభవాలకు ఆశగా ఎదురుచూశాడు.AATel 83.5

    అయితే అతని ప్రవేశం తాను ఆశించిన దానికి ఎంత భిన్నంగా వుంది! సౌలు గుడ్డివాడు, నిస్సహాయుడు, పశ్చాత్తాపంతో వేదన చెందుతున్నవాడు. ఈ స్థితిలో అతడు శిష్యుడు యూదా ఇల్లుకోసం వెదకి అక్కడకు వెళ్లాడు. అక్కడ ఏకాంతంగా ఉన్న అతనికి ఆలోచనకు ప్రార్థనకు అవకాశం లభించింది.AATel 84.1

    సౌలు మూడు రోజులు “చూపులేక అన్నపానము లేమియు పుచ్చుకొనక యుండెను.” హృదయ వేదనతో నిండిన ఈ దినాలు అతనికి సంవత్సరాలని పించాయి. హతసాక్షి సైఫను మరణంలో తాను నిర్వహించిన పాత్రను ఆవేదనతో పదే పదే జ్ఞప్తికి తెచ్చుకొన్నాడు. సైఫను ముఖం పరలోకకాంతితో ప్రకాశించినప్పుడు సైతం తాను యాజకులు అధికారుల ద్వేషం పక్షపాతం అదుపుకింద వ్యవహరించిన తన భయంకర నేరం గురించి ఆలోచించాడు. నిదర్శనాలకు కళ్లు చెవులు మూసుకొని యేసు అనుచరుల్ని హింసించడానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశానని దుఃఖంతోను మానసిక భతోను సౌలు ఒప్పుకున్నాడు.AATel 84.2

    ఏకాంతంగా గడిపిన ఈ దినాలు ఆత్మపరీక్షలో ఆత్మనిందలో గడిచాయి. పౌలు దమస్కు పట్టణానికి వస్తున్న పని గురించి తెలుసుకొన్న విశ్వాసులు తమను ఇంకా మోసగించడానికి ఇదొక ఎత్తుగడ అయివుంటుందని భయపడ్డారు. ఎలాంటి సానుభూతి చూపించకుండా అతనికి దూరంగా ఉన్నారు. ఎవరితో కలిసి విశ్వాసుల్ని హింసించడానికి ఏర్పాట్లు చేసుకొన్నాడో ఆ మారుమనసు పొందని యూదుల వద్దకు వెళ్లడానికి సౌలుకి ఇష్టం లేదు. తాను చెప్పేది వారు విననైనా వినరని అతనికి తెలుసు. ఈ రకంగా మానవ సానుభూతిని కోల్పోయినట్లు కనిపించింది. కృపగల దేవుడే తనకున్న సహాయం అని గ్రహించాడు. సంతాపంతో నిండిన హృదయంతో ఆయనకు మొర పెట్టుకొన్నాడు.AATel 84.3

    ఏకాంతంగా దేవునితో గడిపిన సుదీర్ఘ ఘడియల్లో క్రీస్తు మొదటి రాకను గూర్చిన అనేక లేఖన బాగాల్ని గుర్తుచేసుకొన్నాడు. ఇప్పుడు తన మనసులో ఏర్పడ్డ విశ్వాసంతో సౌలు ప్రవచనాల్ని జాగ్రత్తగా పరిశీలించాడు. ఈ ప్రవచనాల భావం గురించి ఆలోచించినప్పుడు వాటిని గ్రహించకుండా తనకు అడొచ్చిన గుడ్డితనాన్ని గూర్చి, సాధారణంగా యూదులు యేసును వాగ్దాత్త మెస్పీయాగా అంగీకరించకుండా వారి మనోనేత్రాల్ని అలుముకొన్న గుడ్డితనాన్ని గూర్చి విస్మయం చెందాడు. వెలుగుతో నిండిన తన దృష్టికి ఇప్పుడు అంతా స్పష్టమయ్యింది. క్రితంలోని తన దురభిమానం అవిశ్వాసం తన ఆధ్యాత్మిక అవగాహనను మసకబార్చి, ప్రవచనం సూచిస్తున్న మెస్సీయా అయిన నజరేయుడైన యేసులో మెస్పీయాను గుర్తించకుండా అడ్డుకొన్నాయని అతడు గుర్తించాడు.AATel 84.4

    విశ్వాసం పుట్టించే పరిశుద్ధాత్మ శక్తికి సౌలు తన్ను తాను అప్పగించుకొన్నప్పుడు తన పొరపాట్లు గుర్తించి దైవ ధర్మశాస్త్ర విధుల్ని అవగాహన చేసుకొన్నాడు. తన సృ్కయలే తనకు రక్షణనిస్తాయన్న నమ్మకంతో సగర్వంగా వివసించిన పరిసయ్యుడైన సౌలు దేవుని ముందు నిలిచి తాను అయోగ్యుణ్ణని ఒప్పుకొంటూ సిలువ మరణం పొంది తిరిగి లేచిన రక్షకుని నీతి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రితోను కుమారునితోను సంపూర్ణ సామరస్యం సహవాసంలోకి రావాలని సౌలు ఆశించాడు. క్షమాపణకోసం అంగీకారం కోసం కృపాసనం ముందు చిత్తశుద్ధితో విజ్ఞాపన చేశాడు.AATel 85.1

    పశ్చాత్తపుడైన ఈ పరిసయ్యుడి ప్రార్థనలు నిరర్థకం కాలేదు. అతని తలంపులు భావోద్రేకాలు దైవ కృపవలన మార్పుపొందాయి. తన ఉదాత్త గుణాల్ని శక్తి సామర్థ్యాల్ని దైవ కార్యాల ఆచరణకు అంకితం చేశాడు. యావత్ప్రపంచంకన్నా సౌలుకి క్రీస్తు ఎక్కువ విలువను సంతరించుకొన్నాడు. ఆయన నీతి గొప్ప విలువ గలది అయ్యింది.AATel 85.2

    మనుషులకు తాము పాపులమన్న గుర్తింపు పరిశుద్ధాత్మ కలిగిస్తాడనడానికి సౌలు పరివర్తన ప్రబల నిదర్శనం. నజరేయుడైన యేసు దైవ ధర్మశాస్త్రాన్ని గౌరవించలేదని, ధర్మశాస్త్రం అర్థరహితమైందని తన శిష్యులకు నేర్పించాడని అతను నిజంగా నమ్మాడు. అయితే సౌలు క్రైస్తవుడిగా మార్పుపొందిన తర్వాత యేసు తన తండ్రి ధర్మ శాస్త్రాన్ని నెరవేర్చే నిర్దిష్ట ఉద్దేశంతో ఈ లోకంలోకి వచ్చాడని నమ్మాడు. యూదుల బలి అర్పణ వ్యవస్థ ప్రారంభకుడు యేసే అని అతడు గట్టిగా నమ్మాడు. ఛాయారూపాన్ని సిలువలో వాస్తవరూపం నెరవేర్చినట్లు, ఇశ్రాయేలు విమోచకుణ్ణి గూర్చిన పాతనిబంధన ప్రవచనాల్ని యేసు నెరవేర్చినట్లు సౌలు గ్రహించాడు.AATel 85.3

    సౌలు మారుమనసు దాఖలాలో మనకు ప్రాముఖ్యమైన సూత్రాలున్నాయి. వాటిని మనం ఎల్లప్పుడు గుర్తుంచుకోవాలి. సౌలు ప్రత్యక్షంగా క్రీస్తు సన్నిదిలోకి తేబడ్డాడు. ఒక ప్రాముఖ్యమైన పని నిమిత్తం క్రీస్తు అతన్ని పిలిచాడు. తాను “ఏర్పరచుకొన్న సాధనము”గా ఆయన సౌలుని పిలిచాడు. అయినా అతనికి తాను నియమించిన పని ఏమిటో సౌలుకు ప్రభువు వెంటనే చెప్పలేదు. అతడు తన కార్యరంగంలో ఉన్నప్పుడు ప్రభువు అతన్ని బంధించి తాను పాపినన్న గుర్తింపును అతనికి కలిగించాడు. ‘నేను ఏమి చేయాలని నీవు కోరుతున్నావు?” అని సౌలు అడిగినప్పుడు అన్వేషణలో వున్న ఆ యూదుడు తనను గూర్చి దేవుని చిత్తమేంటో తెలుసుకొనేందుకుగాను ప్రభువు అతన్ని సంఘంతో అనుసంధానపర్చాడు.AATel 85.4

    సౌలు చీకటిని అద్భుతమైన వెలుగుగా మార్చింది ప్రభువే. కాగా అతని విషయంలో శిష్యులు చేయాల్సిన పని కూడా ఉన్నది. అతన్ని చైతన్యంతోను విశ్వాసంతోను నింపడమన్న కార్యాన్ని క్రీస్తు నిర్వహించాడు. సత్యాన్ని బోధించడానికి దేవుడు అభిషేకించిన వారివద్దనుంచి మారుమనసు పొందిన సౌలు సత్యాన్ని నేర్చుకోడానికి ఇప్పుడు సిద్ధమనసు కలిగివున్నాడు.AATel 86.1

    సౌలు యూదా ఇంటిలో ఏకాంతంగా ప్రార్థిస్తూ ఉండగా “దమస్కులో అననీయ అను ఒక” శిష్యుడికి ప్రభువు దర్శనంలో కనిపించి తార్పువాడైన సౌలు ప్రార్థిస్తున్నాడని అతడికి సహాయం అవసరమని చెప్పాడు. “నీవులేచి తిన్ననిదనబడిన వీధికి వెళ్లి యూదా అనువానియింట తార్చువాడైన పౌలు అను వాని కొరకు విచారించుము; ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అమనొక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టిపొందునట్లు తలమీద చేతులుంచుట చూచియున్నాడని” ఆ పరలోక రాయబారి చెప్పాడు.AATel 86.2

    అననీయ దూత మాటల్ని నమ్మలేకపోయాడు. యెరూషలేములో భక్తుల్ని సౌలు క్రూరంగా హింసిస్తున్నాడన్న వార్త బాగా ప్రచారమయ్యింది. “ప్రభువా యీ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసియున్నాడని అతనిగూర్చి అనే కుల వలన వింటిని. ఇక్కడను నీ నామమునుబట్టి ప్రార్థన చేయువారందరిని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొందియున్నాడు.” అని జవాబిచ్చాడు. కాని ప్రభువు ఆదేశం తిరుగులేనిది: “నీవు వెళ్ళుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నానామము ధరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన నా సాధనమై యున్నాడు.”AATel 86.3

    యేసునామాన్ని విశ్వసించినవారిని ఇటీవలే భయబ్రాంతులో నింపివ సౌలును దూత ఆదేశాన్ని అనుసరించి అననీయ వెదుక్కొంటూ వెళ్లాడు. మార్పు పొంది బాధననుభవిస్తున్న సౌలు తలమీద చేతులుంచి అతను ఇలా అన్నాడు., “సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు, నీవు దృష్టిపొంది, పరిశుద్దాత్మతో నింపబడునుట్లు నన్ను పంపియున్నాడు.”AATel 86.4

    “అప్పుడే అతని కన్నులనుండి పొరలవంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను.”AATel 86.5

    ఇలా తన సంఘాధికారానికి ఆమోదం తెలిపి లోకంలో తన అధికారిక నాయకులతో ప్రభువు సౌలును అనుసంధానపర్చాడు. లోకంలో తన ప్రతినిధిగా క్రీస్తుకు ఇప్పుడొక సంఘముంది. పశ్చాత్తాపం పొందిన పాపిని నిత్యజీవ మార్గంలో నడిపే సేవ సంఘం బాధ్యత.AATel 86.6

    లోకంలో ఆయన గుర్తింపు పొందిన అనుచరులతో ఎలాంటి సంబంధం లేకుండా తమకు వచ్చిన వెలుగునిమిత్తం అనుభవం నిమిత్తం తాము నేరుగా క్రీస్తుకే జవాబుదారులమని అనేకుల అభిప్రాయం. యేసు పాపులకు మిత్రుడు వారికి కలిగే బాధ ఆయనకు బాధాకరం. పరలోకంలోను భూలోకంలోను ఆయన సర్వశక్తి గలవాడు. అయితే మానవరక్షణ నిమిత్తం తాను ఏర్పాటు చేసిన సాధనాల్ని ఆయన గౌరవిస్తాడు. పాపుల్ని ఆయన సంఘం వద్దకు నడిపిస్తాడు. లోకానికి వెలుగును అందించడానికి సంఘాన్ని సాధనంగా ప్రభువు ఎంపికచేసు కొన్నాడు.AATel 86.7

    గుడ్డి దురాభిమానం పొరపాటులో కొట్టుమిట్టాడుతున్న సౌలుకి తాను హింసిస్తున్న క్రీస్తును గూర్చిన ప్రత్యక్షత లభించినప్పుడు లోకానికి వెలుగైన సంఘంతో ప్రత్యక్ష సంబంధం ఏర్పాటయ్యింది. ఈ సందర్భంలో అననీయ క్రీస్తునూ, క్రీస్తు స్థానంలో లోకంలో వ్యవహరించడానికి నియమితులైన క్రీస్తు సువార్త సేవకులను సూచిస్తున్నాడు. సౌలు కళ్ళకు దృష్టి కలిగేందుకు వాటిని క్రీస్తు స్థానంలో అననీయ ముట్టుకొన్నాడు. క్రీస్తు స్థానంలో అననీయ అతని మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు సౌలు పరిశుద్ధాత్మను పొందాడు. సమస్తం క్రీస్తు నామంలోను ఆయన అధికారంతోను జరిగింది. క్రీస్తు జీవపు ఊట. సంఘం దానిని ఇతరులకు అందించే సాధనం .AATel 87.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents