Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అపొస్తలుల కార్యాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    17—సువార్త ప్రబోధకులు

    అంతియొకయ వంఘంలోని సహోదరుల వలవ అభిషేకం పొందిన ఆవంతరం పౌలు బర్నబాలు పరిశుద్దాత్మచేత పంపబడిన వారై పెలూరయకు వచ్చి అక్కడనుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి”. ఈ విధంగా ఈ ఆపొస్తలులు తమ మొదటి మిషనరీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు.AATel 118.1

    ప్తిపను మరణం తర్వాత కలిగిన హింపకారణంగా యెరూషలేము మంచి పారిపోయిన విశ్వామలు తలదాచుకొన్న స్థలాల్లో కువ్ర ఒకటి. “ప్రభువైన యేసుక్రీస్తుమ గూర్చిన సువార్త” ప్రకటిస్తూ ఆంతియొకయుకు వెళ్ళిన మనుషులు కుప్రవారే. (అ.కా. 11:20). బర్నబా “కుప్రలో పుట్టినవాడు (ఆకా, 436). ఇప్పుడు తాను పౌలు తన బంధువైన మార్కు అను మారు పేరుగల యోహామ ఈ దీవిని సందర్శించారు.AATel 118.2

    మార్కు తల్లి క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. యెరూషలేములోని ఈమె గృహం శిష్యులకు ఆశ్రయమయ్యింది. శిష్యులకు ఆ గృహంలో ఎల్లప్పుడు ఆతిథ్యం విశ్రాంతి లభించేవి. అపొస్తలులు తన తల్లి గృహంలో ఆతిథ్యం పొందుతున్న ఒక సందర్భంలో తాను కూడా తమతో మిషనెరీ ప్రయాణానికి వస్తానని మార్కు పౌలు, బర్నబాలతో అనడం జరిగింది. అతని మనసులో దేవుని పట్ల భక్తి కలిగింది. పువార్త ప్రచార పరిచర్యకు తన యావజ్జీవితాన్ని అంకితం చేయాలని నిశ్చయించుకొన్నాడు.AATel 118.3

    ఈ అపోస్తులులు సలమీ చేరి “యూదుల సమాజమందిరములలో దేవుని వాక్యము ప్రకటించుచుండిరి.... వారు ఆ ద్వీపమంతట సంచరించి పాపు అమ ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ద ప్రవక్తయునైన బయిసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడై సెర్గిపౌలు అను అధిపతి యొద్దనుండెను. అతడు బర్నబాను పౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరమ. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసమునుండి తొలగింపవలెనని యత్నము చేసి వారిని ఎదిరించెను (ఎలుమ అను పేరునకు గారడీవాడని అర్థము)”.AATel 118.4

    సాతానుతో పోరాటం లేకుండా లోకంలో దేవుని రాజ్య నిర్మాణకృషి సాగదు. సువార్త వ్యాప్తికి ఏర్పాటైన సాధనాలతో దుష్ట శక్తులు అవిశ్రాంతంగా సంఘర్షణ పడుతూ ఉంటాయి. ముఖ్యంగా పేరు ప్రతిష్ఠలు విశ్వసనీయతగలవారికి సువార్త పత్యం ప్రకటించడం జరిగేటప్పుడు ఈ అంధకార శక్తులు మరింత క్రియాశీల మౌతాయి. కుప్ర ఆధిపతి సెర్గిపౌలు సువార్త వింటున్నప్పుడు ఇదే జరిగింది. తాము ప్రకటించడానికి వచ్చిన వర్తమానం వినగోరి ఆ అధిపతి అపొస్తలుల్ని రమ్మని కబురు పంపాడు. అయితే ఎలుమ అనే గారడీ వాడి ద్వారా ప్రమాద భరితమైన తమ సలహాలతో అతణ్ణి విశ్వాసంనుంచి పక్కకు మళ్ళించి తద్వారా దేవుని కార్యానికి గండి కొట్టడానికి దుష్ట శక్తులు ప్రయత్నించాయి.AATel 118.5

    మారు మనసు పొందితే దేవునికి గణనీయంగా సేవచేయగల, పలుకుబడిగల వ్యక్తుల్ని తన వశంలో ఉంచుకోడానికి సాతాను ఈ రకంగా కృషి చేస్తాడు. కాగా నమ్మకమైన సువార్త కృషీవలుడు సాతాను చేతిలో ఓడిపోతానని దిగులు చెందాల్సిన పనిలేదు. సాతాను ప్రభావాన్ని ప్రతిఘటించడానికి శక్తిని పొందే ఆధిక్యత అతనికున్నది.AATel 119.1

    సాతాను నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ సాతాను తన పనికి ఎవర్ని ఉపయోగించుకొంటున్నాడో ఆ గారడీవాణ్ని పౌలు ధైర్యంగా మందలించాడు. అపొస్తలుడు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరిచూచి - సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్తనీతికి విరోధీ. నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభువు తన చెయ్యి నీమీద ఎత్తియున్నాడు. నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైన చెయ్యిపట్టుకొని నడిపింతురా అని వెదకు చుండెను. అంతట ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను”.AATel 119.2

    ఆ గారడీవాడు సువార్త సత్య నిదర్శనాలకు కళ్ళుమూసుకొన్నాడు. ప్రభువు పరిశుద్ధాగ్రహంతో సూర్యకాంతి కనిపించకుండా అతడిభౌతిక నేత్రాల్ని మూసివేశాడు. అయితే ఈ అంధత్వం తాత్కాలిక మైంది మాత్రమే. తాను బహుగా నొప్పించిన ప్రభువును పశ్చాత్తాపంద్వారా క్షమాభిక్ష వేడుకొనేందుకోసం హెచ్చరికగా అది కొద్దికాలం మాత్రమే ఉండనుంది. అతణ్ణి ఆవరించిన గందరగోళ పరిస్థితి క్రీస్తు సిద్ధాంతాన్ని వ్యతిరేకించే అతడి గారడీ విద్యను నిరర్థకం చేసింది. అపాస్తలులు చేసిన సూచక క్రియల్ని హస్తలాఘవంవల్ల జరిగిన మోసంగా ఎలుమ కొట్టిపారేయగా ఇప్పుడతను కళ్ళు కనిపించక తడుములాడడం అపొస్తలులు చేసిన అద్భుతాలు దేవుని శక్తివల్ల జరిగాయని అక్కడున్నవారందరికీ రూఢిపర్చింది. అపోస్తులులు బోధించిన బోధ సత్యమని విశ్వసించి ఆ ఆధిపతి సువార్తను స్వీకరించాడు.AATel 119.3

    ఎలుమ విద్యలేనివాడు. అయినా పాతాను పనికి ఆతమ అన్ని విధాల సరిపోయాడు. దేవుని సత్యాన్ని ప్రకటించేవారికి అపవాది అనేక రూపాల్లో ప్రత్యక్షమవుతాడు. కొన్నిసార్లు, విద్యావంతుల, రూపంలోను కాని, ఆత్మల్ని మోసగించడానికి విజయవంతమైన సాధనాలుగా పనిచేసేందుకు తరచుగా అజ్ఞానుల రూపంలోను, కనిపించేటట్లు మనుషుల్ని ఆతను తర్ఫీదు చేస్తాడు. దైవసేవకుడు భయభక్తులతోను దేవుని బలంతోను తన స్థానంలో నిలిచి ఉండాలి. ఈ రీతిగా అతను సాతాను బలగాన్ని గందరగోళపర్చి ప్రభువు పేరిట విజయం సాధించ గలుగుతాడు.AATel 120.1

    పౌలు అతని సహచర్లు, తమ ప్రయాణం కొనసాగించి పంపూలియాలో ఉన్న పెర్డేకి వెళ్ళారు. వారి ప్రయాణం శ్రమతో నిండింది. మార్గంలో ఎన్నో శ్రమలు, లేములు అనుభవించారు. వారు తమ ప్రయాణంలో దాటిన పట్టణాలు నగరాల్లోను, జనసంచారం లేని రహదారుల్లోను ఎన్నో అపాయాల్ని. ఎదుర్కొన్నారు. వాటన్నిటినుంచి తమను రక్షించగల దేవుని శక్తిమీద పౌలు బర్నబాలు గట్టి నమ్మకం ప్రదర్శించారు. నశించిపోతున్న ఆత్మల పట్ల వారికున్న ప్రేమ అమితం. తప్పిపోయిన గొర్రెల్ని వెదకే కాపర్లవలే వారు తమ సొంత సుఖాన్ని గురించిగాని సదుపాయాన్ని గురించిగాని ఆలోచించలేదు. స్వార్ధాలోచనల్ని పూర్తిగా విస్మరించిన వారు అలిసిపోయినప్పుడు, ఆకలిగొన్నప్పుడు, చలితో బాధపడినప్పుడు తప్పటడుగు వేయలేదు. మందలోనుంచి దూరంగా చెదిరిపోయిన ఆత్మల రక్షణే వారి ముందున్న గురి. AATel 120.2

    ఇక్కడే మార్కు అధైర్యం చెంది భయపడి తన్నుతాను దైవ సేవకు పూర్తిగా అంకితం చేసుకొనే విషయంలో వెనకాడాడు. శ్రమలకు అలవాటుపడ్డవాడు కాడు గనుక మార్గాంలో ఎదురైన అపాయాలు శ్రమలనుబట్టి అధైర్యపడిపోయాడు. అనుకూలపరిస్థితుల్లో విజయవంతంగా పనిచేశాడు. అయితే ఇప్పుడు ప్రారంభ సేవకులకు తరచుగా ఎదురయ్యే వ్యతిరేకత ప్రమాదకర పరిస్థితులు తల ఎత్తినప్పుడు శ్రమల్ని భరించలేకపోయాడు. నమ్మకమైన సిలువ యోధుడుగా నిలబడలేకపోయాడు. అపాయాన్ని, హింసను, శ్రమను ధైర్యంగా ఎదుర్కోడం ఇంకా నేర్చుకోవాల్సి ఉన్నాడు. అపొస్తలులు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుండగా ఇంకా కఠినమైన శ్రమలు ఎదురుకావడంతో మార్కు మరింత భయపడిపోయి ధైర్యం కోల్పోయి అక్కడనుంచి తిరిగి యెరూషలేముకి వెళ్ళిపోయాడు.AATel 120.3

    మార్కు ఇలా వెళ్ళిపోయినందుకు పౌలు అతనితో నిర్ణయగా, కొంతకాలం కఠినంగా వ్యవహరించాడు. కాని బర్నబా అనుభవంలేక అతను అలా చేశాడన్న అభిప్రాయంతో మార్కు పట్ల క్షమావైఖరి వహించాడు. మార్కు సువార్త పరిచర్యను వదిలి పెట్టకూడదని బర్నబా అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే క్రీస్తు సేవకు అతనిలో మంచి అర్హతలున్నట్లు, బర్నబా గుర్తించాడు. మార్కు విషయంలో బర్నబాకున్న సదభిప్రాయం తర్వాత సంవత్సరాల్లో నిజమయ్యింది. సువార్త సేవకు మార్కుతన్ను తాను పూర్తిగా అంకితం చేసుకొని కష్టతరమైన ప్రాంతాల్లో గొప్ప సేవచేశాడు. దేవుని నడుపుదల దీవెనలతో బర్నబా జ్ఞానయుక్తంగా ఇచ్చిన శిక్షణతో మార్కు విలువైన సువార్త సేవకుడుగా పరివర్తన చెందాడు.AATel 120.4

    తర్వాత పౌలు మార్కుతో రాజీపడి అతన్ని తన సహ సేవకుడిగా అంగీకరించాడు. “దేవుని రాజ్యము నిమిత్తము” తన జతపనివాడిగాను తనకు “ఆదరణ” గాను మార్కును కొలొస్సయులకు పౌలు సిఫార్సు చేశాడు. కొలొస్స 4:11 మళ్ళీ తన మరణానికి కొంచెం ముందు “పరిచారము నిమిత్తము” తనకు “ప్రయోజనకరమైన” వాడిగా పౌలు మార్కు గురించి మాట్లాడాడు. 2 తిమోతి 4:11.AATel 121.1

    మార్కు వెళ్ళిపోయిన తర్వాత పౌలు బర్నబాలు పిసిదియలోని అంతియొకయకు వెళ్ళి సబ్బాతు దినాన సమాజ మందిరంలోకి వెళ్ళి కూర్చున్నారు. “ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివినతరువాత సమాజ మందిరపు అధికారులు - సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైన బోధ వాక్యము చెప్పవలెననియున్నయెడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి” ఆ ఆహ్వానాన్ని పురస్కరించుకొని “పౌలు నిలువబడి చేసైగ చేసి ఇట్లనెను - ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారలారా, వినుడి” ఆ తర్వాత చక్కని ప్రసంగం చేశాడు. ఐగుప్తు దాస్యవిముక్తి సమయం నుంచి ప్రభువు యూదులతో ఎలా వ్యవహరించాడో, దావీదు వంశంనుంచి వాగ్రత్త రక్షకుడు ఎలా రావాల్సి ఉన్నాడో వివరించి, “అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా - నేనెవడనని మీరు తలంచుచున్నారు. నేను ఆయనను కాను, ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ళ చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కాను అని చెప్పెను” అంటూ చరిత్ర వివరించాడు. యేసు మానవ రక్షకుడని ప్రవచనం ప్రకటిస్తున్న మెస్సీయా అని ఈ విధంగా గొప్ప శక్తితో ప్రబోధించాడు.AATel 121.2

    ఇలా ప్రసంగించిన తర్వాత పౌలు ఇలా అన్నాడు, “సహోదరులారా, అబ్రహాము వంశస్తులారా, దేవునికి భయపడువారలారా, యీ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడియున్నది. యెరూషలేములో కాపురముండు వారును, వారి అధికారులును, ఆయన నైనను ప్రతి విశ్రాంతి దినమున చదువుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక, ఆయనకు శిక్ష విధించుటచేత ఆ వచనములను నెరవేర్చిరి”.AATel 121.3

    యూదు నేతలు రక్షకుని విసర్జించడాన్ని గూర్చిన సత్యాన్ని పౌలు కుండ బద్దలు కొట్టినట్లు పలికాడు. అపొస్తలుడు ఇలా పలికాడు, “ఆయనయందు మరణమునకు తగిన హేతువేదియు కనబడక పోయినను ఆయనను చంపించ వలెనని వారు పిలాతును వేడుకొనిరి. వారు ఆయనను గూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేర్చిన తరువాత ఆయనను ప్రేమ మీదమండి ఆయనను లేపెను. ఆయన గలిలయనుండి యెరూషలేమునకు తవలోకూడ వచ్చిన వారికి అనేక దివములు కనబడెను. వారిప్పుడు ప్రజల యెదుట ఆయనకు సాక్షులైయున్నారు”.AATel 121.4

    అపొస్తలుడింకా ఇలా అన్నాడు, “దేవుడు యేసుమ లేపి, పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు వెరవేర్చియున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే • వీపు వా కుమారుడపు నేడు నేను విన్ను కంటిని అవి రెండవ కీర్తనయందు వ్రాయబడియున్నది. మరియు యిక కుళ్ళు పట్టకుండ ఆయవమ మృతులలోనుండి లేపుటమ బట్టి దావీదువకు అనుగ్రహించిన పవిత్రమైన వరములన మీకనుగ్రహింతుమ, అవి వమ్మకములైనవని చెప్పెను. కాబట్టి వేరొక కీర్తవయందు - నీ పరిశుద్దుని కుళ్ళుపట్టవియ్యనని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవచేసి విద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెముగాని దేవుడు లేపినవాడు కుళ్ళుపట్టలేదు”AATel 122.1

    మెస్పీయామ గూర్చిన సుపరిచిత ప్రవచనాల్ని గురించి స్పష్టంగా మాట్లాడిన మీదట. మారుమనసు గురించి రక్షకుడైన క్రీస్తు వీటిద్వారా పాపక్షమాపణ ప్రచురణమగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రమువలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్పబడలేక పోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడువనియు మీకు తెలియునుగాక” అన్నాడు.AATel 122.2

    మాట్లాడిన మాటలకు దేవుని ఆత్మతోడ్పడంతో హృదయాల్లో సానుకూల స్పందన చోటుచేసుకొంది. అపొస్తలుడు పాతనిబంధన ప్రవచనాల్ని ప్రస్తావించడం, ఇవి నజరేయుడైన యేసు పరిచర్య ద్వారా నెరవేరాయని అతను ఉద్ఘాటించడం వాగ్రత్త మెస్సీయా రాకకోసం ఆశతో ఎదురుచూస్తున్న అనేకమంది విశ్వసించడానికి తోడ్పడింది. రక్షణ యూదులకే కాక అన్యులకూ ఉన్నదంటూ అపొస్తలుడందించిన “ఉత్సాహవార్త” శారీరకంగా అబ్రహాము సంతతివారు కాని ప్రజలకు నిరీక్షణను ఆనందాన్ని చేకూర్చింది.AATel 122.3

    “వారు సమాజ మందిరములోనుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలెనని జనులువేడుకొనిరి” సభముగిసి ప్రజలు వెళ్ళిపోయిన తర్వాత, ఆ రోజు ప్రకటితమైన సువార్తను అంగీకరించిన “అనేకులు యూదులను, భక్తిపరులైన యూదుమత ప్రవిష్ణులును పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు, దేవుని కృపయందు నిలకడగా నుండవలెనని వారిని హెచ్చరించిరి”.AATel 122.4

    పిసిదియలోని అంతియొకయలో పౌలు బోధ రేకెత్తించిన ఆసక్తివల్ల ఆ మరుసటి పబ్బాతునాడు ” దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు, పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి”. AATel 123.1

    “అప్పుడు పౌలుమ బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి - దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము ఆవ్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఏలయనగా - వీపు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండువట్లు నిమ్న అన్యజమలకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించెను”.AATel 123.2

    “అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి. మరియు విత్యజీవమువకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి”. క్రీస్తు తమను దేవుని బిడ్డలుగా గుర్తించినందుకు వారు అమితంగా పంతోషించి వాక్యబోధను విన్నారు. విశ్వసించినవారు ఉత్సాహపూరితంగా సువార్తమ ఇతరులకు అందించారు. ఈ విధంగా ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను”. అవ్యజనులకు రక్షణ ఏర్పాటు గురించి లేఖవ వాక్యం శతాబ్దాల క్రితమే ప్రస్తావించింది. అయితే ఆ ప్రవచన వాక్కులు అంతంతమాత్రంగానే అవగతమయ్యాయి. హోషేయ ఇలా అన్నాడు “ఇశ్రాయేలీయుల జన సంఖ్య అమితమై లెక్క లేని సముద్రపు ఇసుకంత విస్తారమగుమ. ఏ స్థలమందు - మీరు నా జమలు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే • మీరు జీవముగల దేవుని కుమారులై యున్నారని వారితో చెప్పుదురు”. మళ్ళీ ఇలాగన్నాడు. “నేమ దానిని భూమియందు నా కొరకై విలుదుము. దాలినొందని దానియందునేమ జాలిచేసికొందును. నా జనము కానివారిలో • మీరే నాజవమని నేను చెప్పగా వారు • వీవే మా దేవుడవు అని యందురు” హోషేయ 1:10; 2:23.AATel 123.3

    అమ్యల మధ్య సువార్త పరిచర్య ప్రబలమవుతుందని తన భూలోక పేవాకాలంలో రక్షకుడే ముందుగా చెప్పాడు. ద్రాతోట ఉపమానంలో పశ్చాత్తాపంలేని యూదులలో ఆయన ఇలా అన్నాడు. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దనుండి లొలగింపబడి. దాని ఫలమిచ్చు జమలకియ్యబడును.” మత్తయి 21:43. తన పునరుత్థానం అనంతరం ” మీరు వెళ్ళి” “సమస్తజమల” కు “బోధించుడి” అని తన శిష్యులను ఆయన ఆదేశించాడు. వారు ఎవరినీ విడిచిపెట్టక “సర్వసృష్టికి సువార్తను ప్రకటించాల్సి ఉన్నారు. మత్తయి 28:19. మార్కు 16:15.AATel 123.4

    పిపిదియలో ఉన్న ఆంతియొకయలోని అమ్యలపై దృష్టి ఉంచినా యూదుల విమిత్తం పనిచేయడానికి ఎక్కడ అవకాశం ఉన్నదో అక్కడ కృషి చేయడం పౌలు బర్నబాలు మానలేదు. అనంతరం పౌలు అతని అనుచరులు థెస్సలొనీక, కొరింథు, ఎఫెసీలలో యూదులకూ అన్యులకూ సువార్త ప్రకటించారు. అయితే వారి లక్ష్యం మాత్రం దేవునిని ఆయన కుమారుడు క్రీస్తును గూర్చి ఏమీ తెలియవి అన్యుల ప్రాంతాల్లో దేవుని రాజ్యం గురించి ప్రచురించడం.AATel 123.5

    “ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలులేని పరజనులును, నిరీక్షణ లేనివారును, లోకమునందు దేవుడు లేనివారునైయుండి క్రీస్తుకు దూరస్థులైయున్న” వారికి పౌలు అతని అనుచర సేవకుల హృదయాలు ఆకర్షితమయ్యాయి. ‘పరదేశులును... పరజనులును” “మునుపు దూరస్థులును” అయిన అన్యజనులు “క్రీస్తు రక్తమువలన సమీపస్థులై” ప్రాయశ్చితార్థమైన ఆయన మరణం ద్వారా “పరిశుద్దులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారని” తెలుసుకొనేందుకు వారికోసం అపొస్తలులు అవిశ్రాంతంగా కృషిచేశారు. ఎఫెసీ 2:12, 13, 19.AATel 124.1

    విశ్వసించే వారందరికీ క్రీస్తు స్థిరమైన పునాది. సజీవమైన ఈ బండ పై యూదులు అన్యజనులు తమ విశ్వాస కట్టడాన్ని కట్టుకోవచ్చు. ఆ బండ అందరికీ సరిపోయేంత విశాలమైంది. లోకం యావత్తు బరువుని భారాన్ని మోయగలిగినంత శక్తిగలది. ఈ వాస్తవాన్ని పౌలు గుర్తించాడు. సువార్త సత్యాన్ని అమితంగా ప్రేమిస్తూ స్థిరంగా నిలిచిన అన్యవిశ్వాసుల సమూహాన్ని ఉద్దేశించి తన సువార్త సేవ చరమ దశలో పౌలు ఇలా రాశాడు, “క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా ఆపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాది మీద మీరు కట్టబడియున్నారు” ఎఫెసీ 2:20. పిసిదియలో సువార్త సేవ విస్తరిల్లడంతో అంతియొకయలో ఉన్న విశ్వాసులైన యూదులు గుడి దురభిప్రాయాలతో నిండి, “భక్తి మర్యాదలుగల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలువకును బర్నబాకును హింస కలుగజేసి, వారిని తమ ప్రాంతమునుండి వెళ్ళగొట్టిరి”. AATel 124.2

    ఈ శ్రమల్ని బట్టి అపొస్తలులు అధైర్యం చెందలేదు. రక్షకుడు చెప్పిన మాటల్ని వారు గుర్తుచేసుకున్నారు. “నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్దముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధమ్యలు. సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము ఆధికమగును. ఈ లాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి” మత్తయి 5:11, 12.AATel 124.3

    సువార్త వర్తమావం పురోగమిస్తున్నది. స్వాభావికంగా అపొస్తలులు ఉత్సాహభరితు లయ్యారు. అంతియొకయలో ఉన్న పిసిదీయుల మధ్య వారి కృషి ఫలించింది. అక్కడ సువార్త పరిచర్యను కొనసాగించేందుకు అపొస్తలులు ఏర్పాటు చేసిన విశ్వాసులు “ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండినవారైరి”.AATel 124.4