Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అపొస్తలుల కార్యాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    50—మరణ శిక్ష

    నిరోముందు జరిగిన పౌలు అంతిమ విచారణలో అపొస్తలుడి మాటలు చక్రవర్తిని బహూగా ప్రభావితం చేసినందువల్ల ఆ వ్యాజ్యాన్ని అటో ఇటో తేల్చకుండా వాయిదా వేశాడు. కాని పౌలు మీద అతడికున్న విద్వేషం కొద్దికాలంలోనే తిరిగి వచ్చింది. దేశంలో ఆ మాటకొస్తే రాజభవనంలోనూ క్రైస్తవ మతానికి అడ్డుకట్ట వెయ్యటంలో విఫలుడై ఆగ్రహంతోవున్న అతడు ఒకమంచి సాకు దొరికిన వెంటనే అపొస్తలునికి మరణదండన విధించాలని తీర్మానించుకున్నాడు. అనంతరం కొద్ది కాలానికి పౌలు హతసాక్షిగా మరణించాలని ప్రకటించాడు. రోమా పౌరులెవరూ హింసకు గురికావటం చట్టవిరుద్ధం కనుక పౌలు శిరచ్ఛేదనం వల్ల మరణించాలని తీర్మానించాడు.AATel 365.1

    వధ్యా స్థలానికి పౌలును ఒంటరిగా తీసుకువెళ్లారు. ప్రేక్షకులెవ్వర్ని రానివ్వలేదు. హింసకులు పౌలు విస్తారమైన ప్రభావానికి భయపడ్డారు. పౌలు మరణ దృశ్యాల్ని చూసి అనేకులు క్రైస్తవులవుతారని భయపడ్డారు. కాగా పౌలు వెంటవున్న కఠిన హృదయులైన సైనికులు అతని మాటలు విన్నారు. మరణించబోతున్న ఘడియల్లో కూడా అతడు ఉత్సాహంగా ఉండటం ఆనందించటం చూసి ఆశ్చర్యపోయారు. పౌలు హతసాక్షిగా మరణించటం చూసిన కొందరికి తన హంతకుల విషయంలో అతడు ప్రదర్శించిన క్షమాస్ఫూర్తి, చివరి శ్వాస వరకు క్రీస్తుపై అతడికున్న అచంచల విశ్వాసం జీవార్డమైన జీవపువాసనగా పరిణమించింది. పౌలు ప్రచురపర్చిన రక్షకుణ్ని అంగీకరించిన వారు కొందరున్నారు. వారు కూడా కొద్దికాలంలోనే తమ రక్తంతో తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారు.AATel 365.2

    జీవితంలో తన చివరి ఘడియవరకూ కొరింథీయులికి రాసిన ఈ మాటల్లోని సత్యానికి పౌలు జీవితం నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది: “అంధకారములోనుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. గనుక మేము మిమ్మును గూర్చి ప్రకటించుకొనుటలేదుగాని, క్రీస్తుయేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మునుగూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ఆయన బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై యుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములోనున్నను కేవలము ఉపాయము లేనివారముకాము; తరుమబడుచున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము. యేసు యొక్క జీవము మా శరీర మందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించుకొని పోవుచున్నాము.” 2 కొరింథీ 4:6-10. అతడి సమృద్ధి అతడిలోనిది కాదు. తన ఆత్మను నింపి తన ప్రతీ ఆలోచనను క్రీస్తు చిత్తానికి లోబరచిన దైవాత్మ సన్నిధిలోను ప్రాతినిధ్యంలోను ఉంది. ప్రవక్త ఇలా అంటున్నాడు, ” ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ల శాంతి గలవానిగా కాపాడుదువు.” యెషయా 26:3. పౌలు ముఖంలో వ్యక్తమైన పరలోక శాంతి సువార్తను అంగీకరించటానికి అనేకమందిని నడిపించింది.AATel 365.3

    పౌలు తనతో పరలోక వాతావరణాన్ని తీసుకువెళ్ళేవాడు. తనతో సహవసించిన వారందరు క్రీస్తుతో అతని ఏకీభావ ప్రభావాన్ని గుర్తించారు. తాను ప్రకటించిన సత్యానికి తన సొంత జీవితమే ఉదాహరణ కావటం అతడి బోధకు విశ్వసనీయతను శక్తిని చేకూర్చింది. ఒక పరిశుద్ధుని జీవితం అనాలోచితంగా ప్రసరించే అతని ప్రభావం క్రైస్తవ మతానికి అనుకూలంగా చేసిన శక్తిమంతమైన ప్రసంగం. వాదన - అది తిరుగులేని వాదనైనా - వ్యతిరేకతను రెచ్చగొడుంది. కాగా భక్తి జీవితంలోవున్న శక్తిని పూర్తిగా ప్రతిఘటించటం అసాధ్యం .AATel 366.1

    వ్యతిరేక అభిప్రాయాలకు, ద్వేషానికి హింసకు తాను విడిచి పెట్టి వెళ్ళనున్న వారి విషయం ఆందోళనతో నిండిన అపొస్తలుడు, తాను అనుభవించనున్న ఇక్కట్లు శ్రమల్ని గూర్చి మర్చిపోయాడు. వద్యా స్థలానికి తన వెంట వెళ్ళిన కొద్దిమంది క్రైస్తవుల్ని నీతి నిమిత్తం హింస పొందేవారికి దేవుడిచ్చిన వాగ్దానాలతో ఉద్రేకపర్చాడు. తనకు నమ్మకంగా నిలిచే బిడ్డల విషయంలో ప్రభువు చేసిన ఏ వాగ్దానం నిరర్థకం కాదని వారికి భరోసా ఇచ్చాడు. అనేక శోధనలవల్ల కొద్దికాలం తమకు హృదయవేదన కలగవచ్చునని; లోకంలో సుఖసంతోషాలు కరవు అవ్వవచ్చునని; అయితే దేవుడు తమపట్ల నమ్మకంగా ఉంటాడన్న ఈ నిశ్చయతతో తాము ఉద్రేకం పొందవచ్చునని వారికి ధైర్యం చెప్పాడు, “నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను.” 2 తిమోతి 1:12. కష్టాలు శ్రమల కాళరాత్రి త్వరలో అంతంకానుంది. ఆ తర్వాత శాంతి సమాధానాలతో నిండిన పరిపూర్ణ ఆనందోదయం రానుంది.AATel 366.2

    అపోస్తలుడు మరణానికి ఆ పక్కవున్న అనంతకాలం వంక చూస్తున్నాడు. అనిశ్చితితో గాని భయంతోగాని కాదు. కాని ఉల్లాసంతో నిండిన నిరీక్షణతో, ఆశతో నిండిన ఉత్కంఠతో. హతసాక్షికాబోతున్న స్థలంలో నిలబడి ఉన్నప్పుడు అపొస్తలుడు చూసింది సంహారకుడి ఖడ్గంకాదు లేదా త్వరలో తన రక్తాన్ని అందిపుచ్చుకోనున్న నేలను కాదు. ఆ వేసవి ఉదయం స్వచ్ఛంగా కనిపిస్తున్న నీలి ఆకాశంలోనుంచి ఆ ప్రభువు నిత్య సింహాసనాన్ని వీక్షిస్తున్నాడు.AATel 366.3

    పరలోకాన్ని భూలోకానికి దేవునికి అనుసంధానం చేస్తున్న క్రీస్తును సూచిస్తూ తన దర్శనంలో యాకోబు చూసిన నిచ్చెనను ఈ విశ్వాస వీరుడు తనకు ఎవరు బలం చేకూర్చుతూ ఆదరణనిస్తున్నారో, ఎవరికోసం తాను తన ప్రాణాన్ని ఇస్తున్నాడో ఆ ప్రభువు మీదనే పితరులు ప్రవక్తలు ఆధారపడి జీవించారని గుర్తు తెచ్చుకున్నప్పుడు అతని విశ్వాసం మరింత పటిష్టమయ్యింది. యుగాల పొడవున తమ విశ్వాసాన్ని నిర్భయంగా ప్రకటించిన ఈ పరిశుద్ధుల నుంచి దేవుడు యధార్థవంతుడు అన్న హామీని వింటున్నాడు. క్రీస్తు సువార్తను ప్రచురించటానికి వెళ్ళిన సాటి అపొస్తలులు మత మౌఢ్యాన్ని అన్యమత మూఢనమ్మకాల్ని హింసను, ద్వేషాన్ని ఎదుర్కోటానికి వెళ్ళారు. అవిశ్వాస చీకటితో నిండిన గజిబిజి దారుల్లో సిలువ వెలుగును ఎత్తిపట్టుకునే నిమిత్తం తమ ప్రాణాల్ని లెక్కచేయని వారు వీరు. యేసు దేవుని కుమారుడని లోక రక్షకుడని వీరు సాక్ష్యం ఇవ్వటం ఈ అపొస్తలుడు వింటున్నాడు. హింసా యంత్రం నుంచి, దహన స్తంభం నుంచి, చీకటి కొట్లనుంచి, గుహలు సొరంగాలనుంచి హతసాక్షుల విజయ ధ్వనులు వినిపిస్తున్నాయి. అనాధలు, బాధితులు, హింసకు గురైయినవారు “నేను నమ్మినవాని ఎరుగును” అంటూ తమ విశ్వాసాన్ని నిర్భయంగా ప్రకటించారు. విశ్వాసం నిమిత్తం తమ ప్రాణాల్ని త్యాగం చేస్తున్న వీరు తాము ఎవరిని విశ్వసిస్తున్నారో ఆ ప్రభువు తమను సంపూర్ణంగా రక్షించటానికి సమర్థుడని ప్రపంచానికి చాటి చెప్పుతారు.AATel 367.1

    క్రీస్తు త్యాగం వలన విమోచన పొంది, ఆయన రక్తంలో పాపశుద్ధి పొంది, ఆయన నీతి వస్త్రాన్ని ధరించిన పౌలులోనే తన రక్షకుని దృష్టిలో తన ఆత్మ ప్రశస్త మైనదన్న దానికి సాక్ష్యంవుంది. అతని జీవం క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడి వుంది. కనుక మరణాన్ని జయించిన ప్రభువు తనకు అప్పగించిన దాన్ని భద్రంగా కాపాడటానికి సమర్థుడని అతని దృఢ నమ్మకం. “అంత్య దినమున నేను వానిని లేపుదును” (యోహాను 6:40) అన్న రక్షకుని వాగ్దానాన్ని అతని మనసు గ్రహించింది. అతని ఆలోచనలు నిరీక్షణ ప్రభువు రెండో రాకడ మిద కేంద్రీకృతమయ్యా యి. సంహారకుడి ఖడ్గం మెడ పై పడుతుండగా మరణఛాయలు హతసాక్షి చుట్టూ మూగటానికి సిద్ధమౌతున్నప్పుడు అతడి చివరి ఆలోచన - పునరుత్థాన దినాన తన మొదటి ఆలోచనలా - రక్షణ పొందిన వారిని స్వాగతించనున్న ప్రాణదాత అయిన యేసును కలుసుకోటం.AATel 367.2

    దైవ వాక్యం నిమిత్తం, యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తం వృద్దుడైన పౌలు తన రక్తాన్ని ధారపోసినప్పటినుంచి ఇరవై శతాబ్దాలు గతించాయి. భావి తరాలకోసం ఈ పరిశుద్ధుడి జీవితంలోని చివరి సన్నివేశాల్ని ఎవరూ నమ్మకంగా దాఖలు చెయ్యలేదుగాని అతని మరణ సాక్ష్యాన్ని మనకోసం పరిశుద్ధ లేఖనం దాఖలు చేసింది. అనాటి నుంచి యుగాలన్నిటిలోనూ బాకా నాదంలా అతని స్వరం వినిపిస్తూనే వుంది. క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చే వేలాది మందికి అది స్ఫూర్తినిస్తున్నది. దుఃఖిస్తున్న వేలాదిమంది ప్రజల్లో అతని ఈ విజయోత్సాహం ప్రతిధ్వనిస్తుంది:” నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమిపమైయున్నది. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని. విశ్వాసము కాపాడుకొంటిని. ఇకమీదట నా కొరకు నీతి కిరీటముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించువారికందరికిని అనుగ్రహించును.” 2 తిమోతి 4:6-8.AATel 368.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents