Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అపొస్తలుల కార్యాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    13—సిద్దబాటు దినాలు

    తన బాప్తిస్మం అనంతరం పౌలు “దమస్కులోనున్న శిష్యులతో కూడ కొన్ని దినములుండెను. వెంటనే సమాజమందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను.” “మన పాపముల నిమిత్తము మృతి నొందెను, సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను” అని నజరేయుడైన యేసే ప్రజలు ఎదురుచూసిన మెస్సీయా అని పౌలు నిర్భయంగా బోధించాడు. ఆ తర్వాత పన్నెండు మంది శిష్యులకు ఇంకా ఇతరులకు యేసు కనిపించాడన్నాడు. తాను చెప్పినదానికి అదనంగా పౌలు ఈ మాటలన్నాడు, “అందరికి కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను” 1 కొరింథి 15:3,4,8 ప్రవచనం ఆధారంగా అతను చేసినవాదనలు కాదనలేవిగా ఉండడంవల్ల, అతని కృషి దేవుని శక్తితో నిండినందువల్ల యూదులు గలిబిలిచెంది అతనికి సమాధానం చెప్పలేకపోయారు.AATel 88.1

    పౌలు మారుమనసు పొందాడన్న వార్త యూదులకు ఆశ్చర్యం కలిగించింది. “ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది” విశ్వాసుల్ని బంధించి హించించడానికి దమస్కుకు వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు సిలువను పొంది తిరిగి లేచిన రక్షకుణ్ణి ప్రకటిస్తున్నాడు. విశ్వాసులైన వారిని బలపర్చుతున్నాడు. ఒకప్పుడు తాను తీవ్రంగా వ్యతిరేకించిన విశ్వాసంలోకి కొత్త విశ్వాసుల్ని తెస్తూ సర్వదా కృషిచేస్తున్నాడు.AATel 88.2

    క్రితం పౌలు యూదుమతవాదిగాను యేసు అనుచరులను హింసించడంలో నిర్విరామంగా కృషిచేసిన వ్యక్తిగాను ఖ్యాతి పొందాడు. భయం ఎరుగనివాడు, స్వతంత్రుడు, సహనశీలి అయిన పౌలుకున్న వరాలు, శిక్షణ అతణ్ణి ఏ హోదాకైనా సమర్ధుణ్ణి చేయగలిగేవి. అతని హేతువాదంలో అసాధారణమైన స్పష్టత ఉండేది. అతని వ్యంగ్యం ఏ ప్రత్యర్తినైనా నవ్వులపాలు చేసేది. గొప్ప ప్రతిభా పాటవాలున్న ఈ యువకుడు ఒకప్పుడు తాను ఎవరిని హింసించాడో ఆ విశ్వాసులతో చేయి కలిపి ఇప్పుడు యేసునామంలో జంకు కొంకు లేకుండా బోధించడం యూదులు చూశారు.AATel 88.3

    యుద్ధంలో హతుడైన సేనాపతి తన సైన్యానికి గొప్ప నష్టమే. కాని అతడి మరణం తన శత్రువుకు అదనపు బలం చేకూర్చదు. అయితే ప్రతిభావంతుడైన ఒకవ్యక్తి శత్రుసేనలో చేరితే అతడి సేవల విషయంలో నష్టం కలగడమేగాక అతను ఏ పక్కచేరాడో ఆ పక్క గొప్ప లాభం పొందుతుంది. తార్సువాడైన పౌలు దమస్కుకు వెళ్తుండగా ప్రభువు అతణ్ణి మార్గంలోనే మొత్తి చంపగలిగేవాడే. అలా చేసి ఉంటే హింసాకాండ సాగిస్తున్నవారి గాలి తీసివేసిట్లు అయ్యేది. అయితే కృపగల దేవుడు పౌలు ప్రాణాన్ని కాపాడడమేకాక అతణ్ని’ మార్చి ఒక వీరుణ్ణి శత్రుపక్షం నుంచి క్రీస్తు పక్షానికి బదిలీ చేశాడు. చక్కని వాగ్దాటి, మంచి విమర్శనాత్మక దృష్టిగల పౌలు కార్యదీక్ష, ధైర్యసాహసాలు దండిగా వున్న వ్యక్తి . తొలి సంఘంలో అవసరమైన యోగ్యతలు ఇవే.AATel 89.1

    దమస్కులో పౌలు క్రీస్తును ప్రకటిస్తున్నప్పుడు విన్నవారందరూ విస్మయం చెందుతూ, “యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసినవాడితడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చియున్నాడని చెప్పుకొనిరి.” తన విశ్వాసమార్పిడి ఉద్వేగ ఫలితంగాగాని మత మౌఢ్యం ఫలితంగాగాని సంభవించింది కాదని, అది తిరుగులేని నిదర్శనం ఫలితమని పౌలు వ్యక్తం చేశాడు. తన సువార్త ప్రబోధంలో క్రీస్తు మొదటి రాకకు సంబంధించిన ప్రవచనాల్ని విశదం చేయడానికి అతను ప్రయత్నించాడు. ఈ ప్రవచనాలన్నీ నజరేయుడైన యేసులో అక్షరాలా నెరవేరాయని అతను విస్పష్టంగా వివరించాడు. స్థిరమైన ప్రవచన వాక్యమే అతని విశ్వాసానికి పునాది. “మారుమనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారుమనస్సునకు తగిన క్రియలు చేయవలె” (అ.కా. 26:20) నంటూ పౌలు తన శ్రోతలకు విజ్ఞప్తిచేస్తూ “మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని ఋజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను.” కాగా చాలామంది తమ హృదయాల్సి కఠినపర్చుకొని అతని వర్తమానాన్ని తిరస్కరించారు. పౌలు పరివర్తన విషయంలో వారి విస్మయం త్వరలో ద్వేషంగా మారింది. అది యేసుపట్ల వారు ప్రదర్శించిన ద్వేషంలాంటిది.AATel 89.2

    వ్యతిరేకత తీవ్రమైనందువల్ల దమస్కులో పౌలు తన సేవను కొనసాగించలేక పోయాడు. కొంతకాలం అక్కడ నుంచి వెళ్లిపోవలసిందిగా పరలోక దూత ఆ దేశం మేరకు “అరేబియా దేశములోనికి” (గలతీ 1:17) వెళ్లాడు. అక్కడ అతనికి సురక్షితమైన ఆశ్రయం లభించింది.AATel 89.3

    ఇక్కడ ఏకాంతమైన అరణ్యప్రాంతంలో వాక్యపఠనానికి ధ్యానానికి పౌలుకి చాలినంత సమయం దొరికింది. తన గతానుభవాన్ని నెమరువేసుకొని పశ్చాత్తా పడడ్డాడు. పూర్ణహృదయంతో దేవుని వెదికాడు. తన పశ్చాత్తాపాన్ని అంగీకరించి దేవుడు తనను క్షమించాడన్న నిశ్చయత కలిగేవరకూ విశ్రమించలేదు. భవిష్యత్తులో తన సేవలో యేసు తనతో ఉంటాడన్న నిశ్చయత కోసం ఆశించాడు. క్రితంలో తన జీవితాన్ని రూపుదిద్దిన పూర్వానుభవాల్ని సంప్రదాయాల్ని తీసివేసుకొని క్రీస్తు ఉపదేశంతోను, సత్యంతోను అతను తన హృదయాన్ని నింపుకొన్నాడు. యేసు అతనితో మాట్లాడి విశ్వాసంలో అతన్ని బలపర్చి అతనికి జ్ఞానాన్ని కృపను అనుగ్రహించాడు.AATel 89.4

    మానవుడి మనసు దేవుని మనసుతో సంయుక్తమైనప్పుడు, పరిమితుడు అపరిమితునితో ఒకటైనప్పుడు, శరీరం మనసు ఆత్మపై దాని ప్రభావం అంచనాకుమించి ఉంటుంది. అలాంటి కలయికలో ఉన్నత విద్యవున్నది. అభివృద్ధి సాధనకు ఇది దేవుడిచ్చిన పద్ధతి. ” ఆయనతో సహవాసము” చేయండి అన్నదే మానవులకు ప్రభువు సందేశం (యోబు 22:21).AATel 90.1

    అననీయతో తాను సమావేశమైన తరుణంలో తనకు వచ్చిన బాధ్యతల సవాలు పౌలు మనసులో బలంగా నిలిచిపోయింది. “పౌలా సహోదరా దృష్టిపొందుము” అన్నమాటలకు స్పందిస్తూ పౌలు మొదటసారిగా ఈ భక్తుడి ముఖం చూసినప్పుడు, పరిశుద్ధాత్మ ఆవేశం పొందిన అననీయ అతనితో ఇలా అన్నాడు: “మన పితరుల దేవుడు తన చిత్తమును తెలిసికొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటిమాట ద్వారా నిన్ను నియమించి యున్నాడు. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుష్యుల యెదుట ఆయనకు సాక్షినైయుందువు.” అ.కా. 22;13-16.AATel 90.2

    దమస్కు కు వెళ్తున్న పౌలును బంధించి అతనితో యేసు పలికిన మాటలవంటివే ఈ మటాలూను: ” నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంకగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను, సాక్షిగాను నియమించుటకై కనబడియున్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము: నేను ఈ ప్రజల వలనను అన్యజనులవలనను హాని కలుగకుండ నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికిని సాతాను అధికారనము నుండి దేవుని వైపు కును తిరిగి, నాయందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను.” అ.కా. 26:16-18.AATel 90.3

    ఈ విషయాల్ని గురించి ఆలోచించినప్పుడు, “దేవుని చిత్తమువలన యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడుగ నుండుటకు” పిలుపు పొందడమంటే ఏమిటో పౌలు స్పష్టంగా గ్రహించాడు. 1 కొరింథీ 1:1. “మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలననైననుకాక యేసుక్రీస్తు వలనను..... దేవునివలనను” అతనికి పిలుపు వచ్చింది. గలతీ 1:1 “సిలువ వ్యర్థము కాకుండునట్లు వాక్చాతుర్యము లేకుండ సువార్త ప్రకటించుటకే” ” నేను మాటలాడినను సువార్త ప్రకటించినను... పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కవపరచు దృష్టాంతములవే” వినియోగించడానికి పౌలును తన ముందున్న మహాకార్యం పరిశుద్ధ లేఖనాల అధ్యయనానికి నడిపించింది. 1 కొరింథీ 1:17, 2:4,5.AATel 90.4

    యుగాల పొడుగువా “జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదుగాని ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు జానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెట్టివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. ఎన్నికైనవారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింపబడిన వారిని ఎన్నికలేనివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు” అని లేఖనాల్ని పరిశోధించి పౌలు తెలుసుకొన్నాడు. 1 కొరింథీ 1:26-29. కనుక లోకజ్ఞానాన్ని సిలువ వెలుగులో పరిశీలించి, “యేసుక్రీస్తును అనగా, సిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని సమధ్య నెరుగకుందును” అని పౌలు నిర్ధారించుకొన్నాడు. 1 కొరింథీ 2:2.AATel 91.1

    అనంతర కాలంలోని తన పరిచర్య అంతటిలోను తన జ్ఞానానికి బలానికి మూలాన్ని పౌలు ఎన్నడూ మర్చిపోలేదు. సంవత్సరాలు గతించిన అనంతరం పౌలు ఇంకా ఏమంటున్నాడో వినండి, “నామట్టుకైతే బ్రతుకుట క్రీస్తే.” ఫిలిప్సీ 1:21. ఇంకా అతను ఇలా అంటున్నాడు: “నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొను చున్నాను. క్రీస్తును సంపాదించి ధర్మశాస్త్రమూలమైన నా నీతిగాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమునుబట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తము” సమస్తం నష్టంగా భావించాడు. ఫిలిప్సీ 3:8-10.AATel 91.2

    అరేబియా నుంచి పౌలు మళ్లీ ” దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి” (గలతీ 1:17) “యేసు నామమునుబట్టి ధైర్యముగా బోధించెను.” వివేకంతో నిండిన అతని వాదనలను ఎదుర్కొనలేక “యూదులు అతనిని చంపనాలోచించిరి.” అతను తప్పించుకొని పారిపోకుండా పట్టణం గుమ్మాలు మూసివేశారు. ఈ విపత్తు శిష్యుల్ని ప్రార్థనలోకి నడిపించింది. “గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసికొనిపోయి గంపలో ఉంచి గోడగుండా అతనిని క్రిందికి దింపిరి.” అ.కా. 9:25.AATel 91.3

    దమస్కునుంచి తప్పించుకొన్న తర్వాత పౌలు యెరుషలేముకు వెళ్ళాడు. అది అతడు మారిన తర్వాత మూడేళ్ళు గడిచాక. తానే తర్వాత చెప్పిన విధంగా పౌలు యెరుషలేము వెళ్ళడంలోని ముఖ్యోద్దేశం “కేఫాను పరిచయము చేసికొనవలెనని.” గలతీ 1:18. తాను “హింసకుడు పౌలుగా” పేరు పొందిన పట్టణంలో ప్రవేశించిన వెంటనే “శిష్యులతో కలిసికొనుటకు యత్నము చేసెనుగాని, అతడు శిష్యుడని నమ్మక అందరును అతనికి భయపడిరి.” కరడుగట్టిన పరిసయ్యుడు సంఘానికి ఎనలేనిహాని చేసిన వ్యక్తి అయిన పౌలు యేసుకు నిజమైన అనుచరుడయ్యాడంటే నమ్మడం కష్టమే. “అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసికొని అపొస్తలుల యొద్దకు తోడుకొనివచ్చి - అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభువు అతనితో మాటలాడెననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించెననియు వారికి వివరముగా తెలియపరచెను.”AATel 91.4

    ఇది విన్న తర్వాత శిష్యులు అతని తమలో ఒకడిగా అంగీకరించారు. అతని క్రైస్తవానుభవాన్ని గురించి త్వరలోనే వారికి బోలెడు నిదర్శనం కనిపించింది. భవిష్యత్తులో అన్యులకు అపొస్తలుడు కానున్న వ్యక్తి ఇప్పుడు యెరుషలేములో ఉన్నాడు. ఆ నగరంలోనే అతని పూరు స్నేహితులు అనేకులున్నారు. ఈ యూదుమత నాయకులకు మెస్సీయాను గూర్చిన ప్రవచనాల్ని విశదంచేసి రక్షకుని రాకతో అవి నెరవేడాన్ని వారికి వివరిద్దామని అతను ఆశించాడు. ఇశ్రాయేలులోని మత గురువులతో పౌలుకి ఒకప్పుడు మంచి పరిచయం ఉండేది. వీరు తనకు మల్లే యధార్థవంతులని, నిజాయితీపరులని పౌలు అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో పౌలు తప్పటడుగు వేశాడు. తన యూదు సోదరుల స్వభావాన్ని అపార్థం చేసుకొన్నాడు. వారిని సులభంగా మార్చవచ్చునన్న భావన విషయంలో ఆశాభంగం ఎదురయ్యింది. “ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు, గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాటలాడుచు తర్కించుచు” ఉన్నా యూదు సంఘనేతలు అతని బోధను నమ్మలేదు. “అతనిని చంపప్రయత్నము చేసిరి.” అతని హృదయం దు:ఖంతో నిండింది. తన ప్రాణత్యాగం ద్వారా కొందరినైనా సత్యంలోకి తేగలననుకొని ఉంటే దానికైనా పౌలు సిద్ధపడ్డాడు. స్తెఫను మరణంలో తాను వహించిన కీలకపాత్రను గుర్తుచేసుకొని సిగ్గుపడ్డాడు. అపనిందకు గురిఅయిన ఆ నిరపరాధి మీది మచ్చను తుడిచివేయాలన్న ఆశతో సైఫను ఏ సత్యం నిమిత్తం తన ప్రాణం త్యాగం చేశాడో ఆ సత్యం నిజమని నిరూపించడానికి పౌలు నడుం బిగించాడు.AATel 92.1

    అనంతరం తానే వివరించిన విధంగా, సత్యాన్ని తిరస్కరించిన వారి నిమిత్తం హృదయభారంతో దేవాలయంలో ప్రార్థిస్తుండగా పౌలుకు దర్శనం వచ్చింది. ఒక పరలోక దూత తనముందు ప్రత్యక్షమై ఇలా అన్నాడు: ” నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్లుము నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారంగీకరింపరు.” అ.కా.22:18.AATel 92.2

    యెరుషలేములోనే ఉండి వ్యతిరేకతను ఎదుర్కోవాలన్నదే పౌలు ఆలోచన. పారిపోవడం పరికితనంగా భావించాడు. అక్కడే ఉండడం వల్ల కరడుగట్టిన కొంతమంది యూదుల్ని సువార్తను విశ్వసింపజేయగలిగితే దాని వల్ల తన ప్రాణాలు పోయినా పర్వాలేదని భావించాడు. అందుచేత ఇలా సమాధానం ఇచ్చాడు: “ప్రభువా, ప్రతి సమాజమందిరములోను నీయందు విశ్వాసముంచువారిని నేను చెరసాలలో వేయుచు కొట్టుచునుంటినని వారికి బాగుగా తెలియును. మరియు నీ సాక్షియైన సైఫను రక్తము చిందించినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపినవారి వస్త్రములకు కావలియుంటిని.” అయితే తన సేవకుడు తన ప్రాణాన్ని అనవసరంగా అపాయానికి గురిచేసుకోడం దేవుని సంకల్పం కాదు. పరలోక దూత సమాధానం ఇది. “వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదును.” అ.కా. 22:19-21. AATel 92.3

    ఈ దర్శనం గురించి విన్న తర్వాత యెరూషలేము నుంచి పౌలును రహస్యంగా పంపివేయడానికి సహోదరులు ఏర్పాటుచేశారు. పౌలు హత్యకు గురికావచ్చునని భయపడ్డారు. “అతనిని ‘కైసరయకు తోడుకొని వచ్చి తార్పునకు పంపిరి.” పౌలు వెళ్ళిపోవడంతో యూదుల వ్యతిరేకత కొంతకాలంపాటు ఆగిపోయింది. సంఘం కొంతకాలం ప్రశాంతంగా ఉంది. అనేకులు విశ్వసించి సంఘంలో చేరారు.AATel 93.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents