Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అపొస్తలుల కార్యాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    52—అంతం వరకు దృఢంగా

    తాను రాసిన రెండో ఉత్తరంలో క్రైస్తవ ప్రవర్తనాభివృద్ధికి దేవుని ప్రణాళికను గురించి తనవలె “అమూల్యమైన విశ్వాసము” పొందినవారికి పేతురు రాస్తున్నాడు. అతడు ఇలా రాస్తున్నాడు :AATel 380.1

    “తన మహిమనుబట్టియు, గుణాతిశయమును బట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నటిని మనకు దయజేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయవ మనకు ఆమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు. దురాశను అనుసరించుటవలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను.AATel 380.2

    ” ఆ హేతువుచేతనే మిమట్టుకు వారు పూర్ణ జాగ్రత్తగలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుమునందు జ్ఞానమును, జానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదరప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించినయెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము విషయములో మిమ్మును సోమరులైనను, నిష్ఫలువైనను కాకుండచేయును.”AATel 380.3

    ఇవి ఉపదేశంతోనిండిన మాటలు. విజయానికి సోపానాలు. ప్రగతికి నిచ్చెనను అపొస్తలుడు విశ్వాసుల ముందు పెడుతున్నాడు. ఈ నిచ్చెన తాలూకు ప్రతీమెట్టు దేవుని గూర్చిన జ్ఞానంలో ముందడుగును సూచిస్తుంది. దీన్ని ఎక్కేటప్పుడు ఎక్కడా నిలిచిఉండటానికి లేదు. విశ్వాసం, సద్గుణం, జ్ఞానం, ఆశా నిగ్రహం, సహనం, భక్తి, భ్రాతృత్వం, ప్రేమ ఈ నిచ్చెనకు మెట్లు. ఈ నిచ్చెన పై మెట్టుతర్వాత మెట్టు ఎక్కుతూ క్రీస్తు ఆదర్శశిఖరం చేరటంద్వారా మనం రక్షణ పొందుతాం. ఈ రీతిగా ఆయన మనకు వివేకం, నీతి, పరిశుద్ధత విమోచన అవుతాడు.AATel 380.4

    దేవుడు తన ప్రజల్ని మహిమకోసం, మంచితనం కోసం పిలుస్తాడు. ఆయనతో వాస్తవంగా అనుసంధానమై ఉన్నవారిలో ఇవి ప్రదర్శితమౌతాయి. పరలోక వరంలో పాలుపంచుకున్న వారు ” విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత” నివసిస్తూ సంపూర్ణత్వాన్ని సాధించాలి. (1 పేతు 1:5). తన బిడ్డలకు మంచితనాన్నివ్వటం దేవుని మహిమను బట్టే జరుగుతుంది. స్త్రీలు పురుషులు అత్యున్నత ప్రమాణాల్ని చేరాలని దేవుని కోరిక. వారు విశ్వాసం ద్వారా క్రీస్తు శక్తిని పొందినప్పుడు, ఆయన వాగ్దానాల ఆధారంగా, ఎడ తెగకుండా ప్రార్ధించి, పరిశుద్ధాత్మ శక్తిని అన్వేషించినప్పుడు వారు ఆయన యందు సంపూరులవుతారు.AATel 381.1

    సువార్త విశ్వాసాన్ని స్వీకరించిన విశ్వాసి తన ప్రవర్తనకు మంచితనాన్ని చేర్చుకోవావి. ఈ విధంగా అతడు తన హృదయాన్ని ప్రక్షాళనచేసుకుని దేవుని జ్ఞానాన్ని పొందటానికి మనసును ఆయత్తం చేసుకుంటాడు. ఈ జ్ఞానమే వాస్తవ విద్యకు వాస్తవ సేవకు పునాది. శోధన నుంచి కాపాడేది ఇది మాత్రమే. ప్రవర్తన విషయంలో వ్యక్తిని దేవునికిమలే చేసేది ఇది మాత్రమే. దేవునిగూర్చి ఆయన కుమారుడు యేసుక్రీస్తునిగూర్చిన జ్ఞానం ద్వారా ” జీవమునకును భక్తికిని కావలసిన” సమస్తం విశ్వాసికి లభిస్తాయి. దేవుని నీతిని పొందాలని వాస్తవంగా ఆశించేవానికి ఇవ్వకుండా దేవుడు ఏ మేలును అట్టిపెట్టుకోడు.AATel 381.2

    “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము” అన్నాడు క్రీస్తు (యాహోను 17:3). ప్రవక్త యిర్మీయా ఇలా అన్నాడు; “యేహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు- జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమునుబట్టియు అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేనానందించువాడను.” యిర్మీయా 9:23, 24. ఈ జ్ఞానాన్ని సంపాదించే వ్యక్తి సాధించే ఆధ్యాత్మిక కార్యాల వెడల్పు, లోతు, ఎత్తు మానవ అవగాహనకు మించి ఉంటాయి.AATel 381.3

    తన పరిధిలో క్రైస్తవ ప్రవర్తన సంపూర్ణత సాధనలో ఎవరూ విఫలం కానవసరంలేదు. క్రీస్తు చేసిన త్యాగంవల్ల విశ్వాసి జీవితానికి భక్తికి సంబంధించిన విషయాల్ని విశ్వాసి పొందటానికి ఏర్పాటు జరిగింది. పరిపూర్ణత ప్రమాణాన్ని సాధించాల్సిందిగా దేవుడు మనల్ని కోరుతూ ఆదర్శంగా క్రీస్తు ప్రవర్తనను మన ముందుంచుతున్నాడు. ఎల్లప్పుడూ దుష్టిని ప్రతిఘటిస్తూ జీవించి సంపూర్ణ ప్రవర్తనను సాధించగలమని తన ప్రవర్తన ద్వారా రక్షకుడు చూపించాడు. మనం కూడా సంపూర్ణ విజయం సాధించగలమని దేవుడు భరోసా ఇస్తున్నాడు.AATel 381.4

    ధర్మశాస్త్ర సూత్రాలన్నిటికి విధేయుడై జీవించిన క్రీస్తును పోలి జీవించే అద్బుతావకాశం విశ్వాసి ముందు ఉంచుతున్నాడు. దేవుడు. అయితే మానవుడు తనంతటతానే ఈ స్థితికి చేరుకోలేడు. రక్షణ పొందకముందు మానవుడు సాధించాలని వాక్వం చెబుతున్న పరిశుద్ధత దైవకృప పనిద్వారా కలిగే ఫలం. సత్యస్వరూపి అయిన ఆత్మక్రమ శిక్షణకు, అదుపుచేసే ఆయన ప్రభావానికి అతడు తన్నుతాను సమర్పించుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. క్రీస్తుతి అనే ధూపం మాత్రమే మానవుడి విధేయతను పరిపూర్ణం చేస్తుంది. విధేయమైన ప్రతీ క్రియను దివ్య పరిమళంతోనింపేది క్రీస్తు నీతే. ప్రతీ అపరాధాన్ని జయించటానికి ఓర్పుతో కృషిచేయటమే క్రైస్తవుడు నిర్వహించాల్సిన పాత్ర. ఆత్మకు పాషం కలిగించే ఆరోగ్యసమస్యల్ని సరిచెయ్యాల్సిందని అతడు నిత్యం ప్రార్ధించాలి. జయించటానికి అతడికి వివేకంగాని శక్తిగాని లేదు. ఇది ప్రభువు సొత్తు. ఎవరు దీన మనసుతో విరిగి నలిగిన ఆత్మతో ఆయన సహాయం అర్థిస్తారో వారికి వాటిని ఆయన అనుగ్రహిస్తాడు.AATel 382.1

    పాప స్థితినుంచి పరిశుద్ధ సిద్ధికి మార్పుచేసేపని ఎడతెరపి లేకుండా సాగే ప్రక్రియ. మానవుణ్ని పరిశుద్ధీకరించే పనిలో దేవుడు అనుదినం నిమగ్నుడై ఉన్నాడు. మానవుడు మంచి అలవాట్లు వృద్ధిచేసుకోవటంలో ఓర్పుతో కృషి చేయటం ద్వారా దేవునితో సహకరించాలి. ఒక మంచిగుణానికి ఇంకో మంచిగుణం కలుపుకోవాలి. ఇలా కలుపుకొనే ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నప్పుడు హెచ్చవేత ప్రణాళిక ప్రకారం దేవుడు పనిచేస్తూ వృద్ధిపర్చుతాడు. పశ్చాతప్త హృదయం చేసే ప్రార్థనను వినటానికి మన రక్షకుడు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. ఆయనపట్ల నమ్మకంగా ఉన్నవారికి కృపాశాంతులు విరివిగా లభిస్తాయి. దుష్టత్వంతో పోరాటంలో తమకు అవసరమైన దీవెనల్ని ప్రభువు వారికి ఆనందంగా అనుగ్రహిస్తాడు.AATel 382.2

    క్రైస్తవ ప్రగతి అనే నిచ్చెనను ఎక్కటానికి ప్రయత్నించేవారు కొందరున్నారు. అయితే ముందుకు సాగే కొద్దీ వారు మానవశక్తిని నమ్ముకుంటారు. విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే వాడైన యేసును వారు కొద్ది కాలంలోనే మర్చిపోతారు. దాని పర్యవసానం పరాజయం. సాధించిందంతా పోగొట్టుకోవటం. జీవిత పయనంలో అలసిపోయి, జీవితకాలమంతా తమలో వృద్ధిపొందుతూవచ్చిన క్రైస్తవ సుగుణాల్ని హరించటానికి అపవాదికి అవకాశం ఇచ్చేవారి పరిస్థితి విచారకరం. “ఇవి ఎవనికి లేకపోవునోవాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి, గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడునగును” అంటున్నాడు అపొస్తలుడు.AATel 382.3

    అపొస్తలుడు పేతురుకు దైవ విషయాల్లో దీర్ఘానుభవం ఉంది. రక్షించేందుకు దేవుని శక్తి పై అతడి విశ్వాసం సంవత్సరాలు గతించేకొద్ది బలో పేతమయ్యింది. విశ్వాసమూలంగా కొనసాగుతూ, మెట్టు వెంబడిమెట్టు ఎక్కుతూ, పైకి ఇంకా పైకి వెళ్తూ, పరలోకం గుమ్మాల్ని అంటుతూవున్న నిచ్చెన చివరి మెట్టు వరకూ ఎక్కేవ్యక్తి ముందు వైఫల్యమంటూ ఉండదని పేతురు సందేహానికి అతీతంగా నిరూపించాడు.AATel 383.1

    విశ్వాసులు కృపలోను సత్యవాక్య జ్ఞానంలోను పెరగాల్సిన అవసరాన్ని గూర్చి పేతురు అనేక సంవత్సరాలుగా విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇప్పుడు త్వరలోనే తన విశ్వాసం నిమిత్తం హతసాక్షి కానున్నట్లు గ్రహించి, ప్రతీ విశ్వాసికి అందుబాటులో ఉన్న అమూల్య ఆధిక్యతల్ని గురించి అతడు మరోసారి ప్రస్తావించాడు. క్రైస్తవ జీవనంలో నమ్మకంగా నిశ్చలంగా సాగాల్సిందిగా ఈ వృద్ధ శిష్యుడు తన సహోదరులకు పూర్ణవిశ్వాసంతో విజ్ఞప్తి చేశాడు. వారితో ఇలా అన్నాడు, ” మీ పిలుపును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి. హెరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్రిల్లరు. ఆలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును.” ప్రశస్త్ర వాగ్దానం! విశ్వాసం ద్వారా విశ్వాసి క్రైస్తవ సంపూర్ణత శిఖరానికి సాగుతుండగా అతడి ముందు మహిమానిత్వమైన నిరీక్షణ ఉంది!AATel 383.2

    అపొస్తవుడు ఇంకా ఇలా అన్నాడు, ” మీరు ఈ సంగతులను తెలిసికొని మిరంగీకరించిన సత్యమందు స్థిరపడియున్నను, వీటినిగూర్చి ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసు క్రీస్తు నాకు సూచించిన ప్రకారము నాగుడారమును త్వరగా విడిచి పెట్టవలసివచ్చునని యెరిగి, నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకముచేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను.”AATel 383.3

    మానవ జాతి విషయంలో దేవుని సంకల్పాల్ని గూర్చి మాట్లాడటానికి అపోస్తులుడికి మంచి అర్హత ఉంది. ఎందుచేతనంటే, క్రీస్తు ఇహలోక సేవాకాలంలో దేవుని రాజ్యంగురించి ఎంతో చూశాడు, ఎంతో విన్నాడు. విశ్వాసులికి అపొస్తలుడు ఈ విషయాలు గుర్తుచేశాడు ” చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదుగాని ఆయన మహాత్మ్యమును మేము కన్నులార చూచినవారమై తెలిపితిమి. ఈయన నాప్రియ కుమారుడు ఈయనయందు నేను ఆనందించు చున్నాను అని శబ్దము మహాదివ్యమహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రియైన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయనపొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడ ఉండినవారమై ఆ శబ్దము ఆకాశమునుండి రాగా వింటిమి.”AATel 383.4

    విశ్వాసుల నిరీక్షణ నిశ్చితమైనదనటానికి గల నిదర్శనం విశ్వసింపదగినదైనా మరెక్కువ విశ్వసనీయతగల ప్రవచన సాక్ష్యం ఉంది. దీని ద్వారా అందరి విశ్వాసం ధ్రువపడి సుస్థిరం కావచ్చు. ” ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క నా హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. ఒకడు తన ఊహనుబట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగా పలికిరి” అన్నాడు పేతురు.AATel 384.1

    ” స్థిరమైన ప్రవచన వాక్యము” ను అపాయకరమైన కాలాల్లో సురక్షితమైన మార్గదర్శిగా ఘనపర్చుతూ, అసత్యప్రవచన దీపంగురించి అపొస్తలుడు సంఘాన్ని హెచ్చరించాడు. ఈ అసత్యప్రవచనాన్ని ” అబద్ధ బోధకులు” ఘనపర్చుతారు. వీరు ” ప్రభువును కూడ విసర్జించుచు” “నాశనకరమగు భిన్నాభిప్రాయములను” రహస్యంగా బోధిస్తారు. సంఘంలోనుంచే బయలుదేరి, విశ్వాసులైన సహోదరులచే యధార్ధభక్తులన్న పత్తాసు పుచ్చుకునే ఈ అబద్ధ బోధకుల్ని “నీళ్లులేని బావులును. పెనుగాలికి కొట్టుకొనిపోవు మేఘములు.” అంటున్నాడు అపోస్తలుడు. అతడింకా ఇలా అంటున్నాడు, “వారు ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానముచేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటిచేత జయింపబడిన యెడల వారి కడవరి స్థితి మొదటి స్థితికంటె మరి చెడ్డదగును. వారి నీతిమార్గమును అనుభవ పూర్వకముగా తెలిసికొని, తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుటకంటె ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక యుండుటయే వారికి మేలు”.AATel 384.2

    లోకాంతం వరకూ సాగే యుగాల్లోకి చూస్తున్నప్పుడు, క్రీస్తు రెండో రాకకు ముందు లోకంలో ఉండే పరిస్థితుల్ని సూచించటానికి పేతురు పరిశుద్ధాత్మ ప్రేరితుడయ్యాడు. అతడు ఇలా రాశాడు, ” అంత్యదినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమందున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురు.” కాని ” లోకులు - నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా.... ఆకస్మికముగా నాశనము తటస్థించును.” 1 థెస్స 5:3. సాతాను కుతంత్రాలకు అందరూ పడిపోరు. లోకాంతం సమిపిస్తూండగా కాల సూచనల్ని గ్రహించే సామర్థ్యగల నమ్మకమైన దైవజనులు ఉంటారు. విశ్వాసులమని చెప్పుకొనేవారిలో అధిక సంఖ్యాకులు తమ క్రియలద్వారా తమ విశ్వాసాన్ని నిరాకరించగా శేషించినవారు కొందరుంటారు. వారు చివరివరకూ నమ్మకంగా ఉంటారు.AATel 384.3

    క్రీస్తు తిరిగి వస్తాడన్న నిరీక్షణ పేతురు మనసంతా నింపింది. రక్షకుని ఈ వాగ్దానం తప్పక నెరవేరుతుందని సంఘానికి భరోసా ఇచ్చాడు,” నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో వారును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొనిపోవుదును” యోహాను 14:3 నమ్మకంగా నిలిచిన విశ్వాసులకు ఆయన రాక చాలా ఆలస్యమైనట్లు కనిపించవచ్చు. వారికి అపొస్తలుడు ఈ భరోసా ఇచ్చాడు. ” కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడను నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, నా యెడల దీర్ఘశాంతము గలవాడైయున్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతోలయమైపోవును, భూమియు దానిమీద నున్న కృత్యములును కాలిపోవును.AATel 385.1

    “ఇవన్నియు ఇట్లు లయమైపోవునని గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారైయుండవలెను. అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.AATel 385.2

    “ప్రియులారా వీటికొరకు మీరు కని పెట్టువారు గనుక శాంతము గలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్తపడుడి. మరియు మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి. ఆలాగు మన ప్రియసహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసియున్నాడు...... ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొని యున్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధన వలన తొలగింపబడి, నాకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచుకొని యుండుడి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమునందును అభివృద్ధి పొందుడి.”AATel 385.3

    దేవుని సంకల్పం చొప్పున పేతురు తన సువార్త సేవను రోము నగరంలో ముగించాల్సి ఉన్నాడు. ఆ నగరంలోనే పేతుర్ని అరెస్టు చెయ్యటానికి నీరో ఆదేశాలు జారీచేశాడు. ఆ సమయంలోనే పౌలు చివరి అరెస్టు కూడా జరిగింది. అనేక సంవత్సరాలుగా ఎవరికి వారుగా పనిచేస్తూ వచ్చిన, అనుభవజ్ఞులైన ఈ ఇద్దరు అపొస్తలులు ఈ ప్రపంచ మహానగరంలో క్రీస్తును గూర్చిన తమ చివరి సాక్ష్యం ఇలా ఇవ్వాల్సివున్నారు. భక్తులు, హతసాక్షుల పంటకోసం వారు ఈ నగరం నేలపై తమ రక్తాన్ని విత్తనాలుగా వెదజల్లాల్సి ఉన్నారు.AATel 385.4

    క్రీస్తును ఎరగనని బొంకిన అనంతరం జరిగిన తన పునరుద్ధరణ సమయం నుంచి అపాయాన్ని ధైర్యంగా ఎదుర్కోటానికి పేతురు వెనకాడలేదు. సిలువను పొంది తిరిగి లేచి పరలోకానికి వెళ్లిన రక్షకుణ్ని గూర్చి బోధించటంలో అసాధారణ సాహసాన్ని ప్రదర్శించాడు. తనతో క్రీస్తు అన్న ఈ మాటలు ఖైదులో బాధలను భవిస్తున్న సమయంలో గుర్తు చేసుకున్నాడు: ” నీవు యౌవనుడవైయుండినప్పుడు నీ అంతట నీవే నడుముకట్టుకొని నీ కిష్టమైన చోటికి వెళ్లుచుంటివి, నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుముకటి నీ కిష్టము కాని చోటికి నిన్ను మోసుకొనిపోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” యోహాను 21:18. యేసు తాను మరణించే తీరునుగూర్చి ఇలా తన శిష్యుడు పేతురుతో చెప్పాడు. సిలువమిద తన చేతులు చాచటం గురించి సయితం చెప్పాడు.AATel 386.1

    యూదుడు, విదేశీయుడు అయిన పేతురుని కొరడాల్తో కొట్టి సిలువవేయాలన్న తీర్పునిచ్చారు. ఈ భయంకర మరణం దృష్ట్యా పేతురు యేసుకు తీర్పు జరుగు తున్న ఘడియలో ఆయనను ఎరగనని బొంకటం గుర్తుచేసుకున్నాడు. ఒకప్పుడు సిలువను అంగీకరించటానికి సిద్ధంగాలేని అతడు ఇప్పుడు సువార్త కోసం ప్రాణాన్ని త్యాగం చెయ్యటం మహదానందంగా భావించాడు. అది తనకు గొప్ప గౌరవమని పరిగణించాడు. ఆ పాపం గురించి పేతురు చిత్తశుద్ధితో పశ్చాత్తాప పడ్డాడు. గొర్రెల్ని గొర్రెపిల్లల్ని మేపుటమన్న ఉన్నత బాధ్యతను అప్పగించటం ద్వారా సూచించినట్లు క్రీస్తు పేతుర్ని క్షమించాడు. భయంకరమైన తన బాధాకరమైన చివరి శ్రమలను గూర్చిన ఆలోచన ‘సైతం తనలో పెల్లుబుకుతున్న దు:ఖాన్ని పశ్చాత్తాపాన్ని ఆపలేకపోయింది. తన చివరి కోరికగా, తనను తలకిందకు పెట్టి సిలువ వేయవలసిందిగా సిలువ వేసేవారిని కోరాడు. వారు అందుకు అంగీకరించటంతో అపొస్తలుడైన పేతురు ఈ రకంగా సిలువ మరణం పొందాడు.AATel 386.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents