Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అపొస్తలుల కార్యాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    22—థెస్సలొనీక

    ఫిలిప్పీ విడిచి పెట్టిన తర్వాత పౌలు సీలలు థెస్సలొనీకకు ప్రయాణమయ్యారు. ఇక్కడ యూదుల సమాజ మందిరంలో పెద్ద సమావేశంలో ప్రసంగించటానికి వారికి అవకాశం లభించింది. లోగడ తాము పొందిన శ్రమల నిదర్శనాలు తమ ఒంటిమీద కొట్టొచ్చినట్లు కనిపించటంతో ఏం జరిగిందో సమావేశానికి విశదం చేయాల్సిన అవసరం వారికి ఏర్పడింది. తమ్మును తాము హెచ్చించుకోకుండా, తమ్మును అద్భుత రీతిగా విడిపించిన ప్రభువును ఘనపర్చుతూ వారు దీన్ని చేశారు.AATel 156.1

    థెస్సలొనీకయులకు సువార్త బోధించటంలో మెస్సీయాను గూర్చిన పాతనిబంధన ప్రవచనాల్ని పౌలు ఉపయోగించాడు. తన పరిచర్యలో క్రీస్తు ఈ ప్రవచనాలికి తన శిష్యుల మనసుల్ని తిప్పాడు, “మో షేయు సమస్త ప్రవక్తలును మొదలుకొని లేఖనములన్నిటిలో తన్నుగూర్చిన వచనముల భావము వారికి తెలిపెను” లూకా 24:27. క్రీస్తును గురించి బోధించినప్పుడు పేతురు పాత నిబంధనలోనుంచి తన నిదర్శనాన్ని చూపించాడు. సైఫనూ అదే మార్గాన్ని అవలంబించాడు. పౌలుకూడా తన సువార్త పరిచర్యలో క్రీస్తు జననం, శ్రమలు, మరణం, పునరుత్థానం, ఆరోహణం తాలూకు ప్రవచనాన్ని గూర్చిన లేఖనాల్ని ఉపయోగించాడు. దైవావేశపూరితమైన మోషే సాక్ష్యాన్ని ప్రవక్తల సాక్ష్యాన్ని ఆధారం చేసుకొని నజరేయుడైన యేసే మెస్సీయా అని నిరూపిస్తూ ఆదాము నాటినుంచి పితరులు ప్రవక్తల ద్వారా మాట్లాడూ వచ్చింది క్రీస్తు స్వరమేనని వివరించాడు.AATel 156.2

    వాగ్రత్త మెస్సీయా రాకను గురించి స్పష్టమైన నిర్దిష్టమైన ప్రవచనాల్ని దేవుడిచ్చాడు. విమోచకుడు వస్తాడని ఆదాముకి వాగ్దానం చేశాడు. సాతానుకి ఈ తీర్పునిచ్చాడు, “నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదువు” (ఆది కాండము 3:15).. ఇది మన మొదటి తల్లిదండ్రులకు క్రీస్తు ద్వారా కలిగే విమోచన వాగ్దానం.AATel 156.3

    లోక రక్షకుడు తన వంశంలోనుంచి వస్తాడని అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. “భూలోకములోని జనములన్నియు నీ సంతానము వలన ఆశీర్వదించ బడును.” “ఆయన అనేకులను గూర్చి అన్నట్లు - సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే - నీ సంతానమునకు అనెను; అ సంతానము క్రీస్తు.” ఆదికాండము 22:18; గలతీ 3:16.AATel 156.4

    ఇశ్రాయేలీయుల నాయకుడుగాను బోధకుడుగాను తన సేవ చివరికాలంలో మోషే మెస్సీయా ఆగమనాన్ని గురించి విస్పష్టంగా ప్రవచించాడు. సమావేశమైన ఇశ్రాయేలు ప్రజలతో అతడిలా అన్నాడు, “నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయవ మాట నీవు వినవలెను.” “వారి సహోదరులలో నుండి నీవంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను; అతని నోట నా మాటలుంచుదును; నేను అతని కాజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును” అని దేవుడు తనకు హోరేబు కొండమీద బయలు పర్చాడని మోషే ఇశ్రాయేలు ప్రజలకు భరోసాయిచ్చాడు. ద్వితి. 18:16,18.AATel 157.1

    మెస్సీయా రాజవంశం నుంచి రానున్నాడు. ఎందుకంటే యాకోబు పలికిన ప్రవచనంలో ప్రభువిలా అన్నాడు, “షిలోహు వచ్చువరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులైయుందురు. ఆది 49:10.AATel 157.2

    యెషయా ఇలా ప్రవచించాడు: “యెషయి యొద్దనుండి చిగురు పుట్టును. వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును.” “చెవి యొగ్గి నాయొద్దకు రండి. మీరు వినిన యెడల మీరు బ్రదుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసెదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించితిని. జనములకు రాజుగాను అధిపతిగాను ఆతని నియమించితిని. నీ వెరుగని జనులను నీవు పిలిచెదవు. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యోహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరుగెత్తి వచ్చెదరు.” యెషయా 11:1; 55:3-5.AATel 157.3

    రానున్న విమోచకుణ్ణి దావీదు వంశపు రాజుగా చెబుతూ యిర్మీయా కూడా ఆయన్ని గూర్చి సాక్ష్యమిచ్చాడు: “యెహోవా ఈలాగు ఆజ్ఞయిచ్చుచున్నాడు - రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమిమీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదారక్షణ నొందును ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతియని అతనికి పేరు పెట్టుదురు.” ఇంకా, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - ఇశ్రాయేలు వారి సింహాసనము మీద కూర్చుండు వాడొకడు దావీదునకుండక మానడు. ఎడతెగక దహన బలులను అర్పించుటకును నైవేద్యముల నర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీయులలో ఒకడుండక మానడు.” యిర్మీయా 23:5,6 : 33: 17,18. AATel 157.4

    మెస్సీయా జన్మస్థలాన్ని సయితం ముందే పేర్కోటం జరిగింది: “బేల్లెహేము ఎప్రోతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతనకాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ” మీకా 5:2.AATel 158.1

    లోకంలో రక్షకుడు చేయనున్న సేవను గురించి కూడా వివరించటం జరిగింది: “యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచుము.” “దీనులకు సువర్తమానము ప్రకటించుటకును... నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్నవారికి విడుదలను, బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమున ప్రకటించుటకును, దుఃఖాకాంత్రులందరిని ఓదార్చుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును” ఆయన అభిషిక్తుడయ్యాడు. “యెహోవా తన్ను మహిమ పరచుకొనునట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును.” యెషయా 11:2,3 ;61:1-3.AATel 158.2

    “ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. నేను ఏర్పరచుకొనిన వాడు నా ప్రాణమునకు ప్రియుడు. అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయడు అరువడు. తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు. నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యము ననుసరించి న్యాయము కనుపరచును. భూలోకమున న్యాయము స్థాపించువరకు అతడు మందగిలడు నలుగుడుపడడు.’ యెషయా 42:1-4. -AATel 158.3

    “క్రీస్తు శ్రమపడి మృతులలోనుండి లేచుట అవశ్యకమని” పాత నిబంధన లేఖనాలనుంచి గొప్ప శక్తితో పౌలు తర్కించాడు. “వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కట్టితో చెంపమీద” కొడ్తారని మీకా ప్రవచించలేదా? మీకా 5:1. ప్రభువే తన్నుగూర్చి యెషయా నోట ఇలా ప్రవచించలేదా? “కొట్టువారికి నా వీపును అప్పగించితిని. వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్పగించితిని. ఉమ్మివేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము దాచుకొనలేదు.” యెషయా 50:6. తన పట్ల మనుషులు వ్యవహరించే తీరును గురించి కీర్తన కారుడు దావీదు ద్వారా క్రీస్తు ఇలా ప్రవచించాడు: ‘నేను... నిందింపబడినవాడను, ప్రజలచేత తృణీకరింపబడినవాడను. నన్ను చూచువారందరు పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడుగదా ఆయన వానిని తప్పించునేమో.” “నా యెముకలన్నియు. నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా ఆంగీ కొరకు చీట్లు వేయుచున్నారు.” నా సహోదరులకు నేను అన్యుడనైతిని. నా తల్లి కుమారులకు పరుడనైతిని. నీ యింటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది. నిన్ను నిందించువారి నిందలు నామీద పడియున్నవి.” “విందకు నా హృదయము బద్దలాయెను. నేను బహుగా కృషించి యున్నామ. కరుణించువారి కొరకు కనిషెట్టు కొంటిని గాని యెవరును లేక పోయిరి. ఓదార్పు వారికొరకు కనిపెట్టుకొనియుంటినిగాని యెవరును కొనరైరి.” కీర్తనలు 22:6-8, 17, 18, 69:8:9,20.AATel 158.4

    క్రీస్తు శ్రమలు మరణం గురించి యెషయా ప్రవచనం ఎంత స్పష్టంగా ఉంది! “మేము తెలియజేసిన సమాచారము ఎవడు వమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలు పరచబడెను? లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన యెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైననులేదు. మనమతని చూచి, ఆ పేక్షించునట్లుగా అతనియందు సురూపములేదు. అతడు తృణీకరింపబడినవాడును ఆయెను. మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడుగాను మనుష్యులు చూడవాల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనినిని ఎన్నిక చేయకపోతిమి.AATel 159.1

    “నిశ్చయముగా ఆతడు మన రోగములను భరించెను. మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడినవానిగాను దేవుని వలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి. మన యతి క్రమ క్రియలను బట్టి అతడు గాయపర్చబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను. అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది.AATel 159.2

    “మన మందరము గొఱ్ఱలవలే త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తన కిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన యందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యమునొందెను. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొట్టె పిల్లయు బొచ్చు కత్తిరించువాని యెదుట గొట్టేయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు?” యెషయా 53:1-8.AATel 159.3

    ఆయన మరణించే తీరుకూడా ముందే ప్రవచితమయ్యింది. అరణ్యంలో ఇత్తడి సర్పం పెకెత్తబడ్డ మాదిరిగా రానున్న విమోచకుడు తనపై “విశ్వాస ముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు” (యోహాను 3:16) సిలువ మీద వేళాడవలసివున్నాడు.AATel 160.1

    “నీ చేతులకు గాయములేమని వారడుగగా వాడు - ఇది నన్ను ప్రేమించినవారి యింట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును.” జెకర్యా 13:6.AATel 160.2

    “అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు. అతని నోట ఏకపటమును లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను.” యెషయా 53:9,10.AATel 160.3

    కాగా దుర్మార్గుల చేతిలో మరణించాల్సివున్న ఆయన పాపాన్ని సమాధిని జయించి విజేతగా లేవాల్సివున్నాడు. దైవావేశంతో నిండిన ఇశ్రాయేలు మధురగాయకుడు పునరుత్థానం నాటి ఉదయం మహిమల్ని ఇలా వివరిస్తున్నాడు, “నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకవగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచి పెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు.” కీర్తనలు 16:9-10.AATel 160.4

    “వధకు తేబడు గొఱ్ఱపిల్ల” కావలసివున్న ఆయనను గూర్చిన ప్రవచనాలతో బలి అర్పణల సేవను దేవుడు ఎంత సన్నిహితంగా అనుసంధానపర్చాడో పౌలు విశదీకరించాడు. మెస్సీయా తన ప్రాణాన్ని “అపరాధ పరిహారార్లబలి”గా అర్చించాల్సి వున్నాడు. శతాబ్దాల దిగువకు దృష్టిసారించి రక్షకుని ప్రాయశ్చిత్తార్పణ సన్నివేశాల్ని పరిశీలించిన యెషయా ప్రవక్త దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు మరణము పొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడినవాడాయెను. అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను” (యెషయా 53:7,10,12) అని సాక్ష్యమిచ్చాడు.AATel 160.5

    ప్రవచిత రక్షకుడు రావలసివున్నాడు. అయితే అది యూదు ప్రజల్ని తమను హింసిస్తున్న పాలకుల నుంచి కాపాడేందుకు భూలోక రాజుగా కాదు. మనుషుల మధ్య మనిషిగా సామాన్యుడిగా పేదవాడిగా నివసించేందుకు చివరికి తృణీకారం తిరస్కారాలకు గురి అయి మరణించేందుకు ఆయన రావలసివున్నాడు. పాతనిబంధన లేఖనాల్లో ముందే పేర్కొబడ్డ రక్షకుడు పతనమైన మానవజాతి పక్షంగా తన్నుతాను బలిగా అర్పించుకోవలసి వున్నాడు. ఉల్లంఘనకు గురి అయిన ధర్మశాస్త్రాన్ని ఆయన ఇలా నెరవేర్చాల్సివున్నాడు. బలి అర్పణలు క్రీస్తుకు ఛాయారూపాలు. వాటి నిజస్వరూపమైన క్రీస్తులో అవి నెరవేరనున్నాయి. సిలువపై క్రీస్తు మరణం యూదు పరిపాలన వ్యవస్థకు ప్రాధాన్యాన్ని సమకూర్చాల్సి ఉంది.AATel 160.6

    గతంలో ఆచార ధర్మశాస్త్రంపట్ల తనకు గొప్ప శ్రాద్ధాసక్తులుండటాన్ని గురించి దమస్కు, గుమ్మం వద్ద తనకు కలిగిన అద్భుతమైన అనుభవాన్ని గురించి పౌలు థెస్సలొవీయ యూదులికి చెప్పాడు. తన మత మార్పిడికి ముందు పారంపర్య భక్తిమీద పౌలు నమ్మకం పెట్టుకొన్నాడు. అది తప్పుడు నిరీక్షణ. అతని విశ్వాసం క్రీస్తుమీద బలంగా నిర్మితమైంది కాదు. అతను ఆచారాలు సంప్రదాయాల్ని ఎక్కువ నమ్మాడు. ధర్మశాస్త్రం విషయంలో తన ఆసక్తికి ఉద్రేకానికి ఆధారం క్రీస్తుపై తనకున్న విశ్వాసం కాదు. అది నిరర్థకం ధర్మశాస్త్ర క్రియల నిర్వహణలో తాను నిందారహితుడనని అతిశయిస్తూనే ఆ ధర్మశాస్త్రానికే విలువను చేకూర్చిన ప్రభువుని అతను నిరాకరించాడు.AATel 161.1

    ఇలా గుండగా, తన పరివర్తన వేళ అంతా మారిపోయింది. తన భక్తుల రూపంలో నజరేయుడైన యేసును హింసిస్తున్న యేసు వాగ్దత్త మెస్సీయగా పౌలు ముందు నిలబడ్డాడు. ప్రవచనాల నెరవేర్పు మేరకు భువికి వచ్చిన వాడిగా, పరిశుద్ధ లేఖనాలు నిర్దేశించిన ప్రతీ వివరాన్ని ధృవపర్చుతున్నవాడిగా దైవ కుమారుణ్ని ఆ హింసకుడు చూశాడు.AATel 161.2

    థెస్సలోనిక లోని సమాజ మందిరంలో పౌలు సువార్త బోధిస్తున్నప్పుడు గుడార సేవలకు సంబంధించిన ఆచారాలు సంస్కారాల నిజమైన అర్థం పై విస్తారమైన వెలుగు ప్రసరించింది. ఇహలోక సేవ దరిమిలా పరలోక గుడారంలో క్రీస్తు చేస్తున్న సేవమీద, అక్కడ తన మధ్యవర్తిత్వ సేవ ముగిసిన తర్వాత ఈ భూమిపై తన రాజ్యస్థాపనకు తన శక్తితోను మహిమతోను క్రీస్తు మళ్ళీ వచ్చే సమయం మీద శ్రోతల మనసుల్ని పౌలు నిలిపాడు. క్రీస్తు రెండోసారి వస్తాడన్న విశ్వాసం పౌలుకున్నది. ఈ ఘటన గురించి అతను బోధించిన సత్యాలు ఎంత స్పష్టంగాను నిస్సందేహం గాను ఉన్నాయంటే వినేవారి మనసుల పై అవి చెరగని ముద్ర వేసుకొన్నాయి.AATel 161.3

    వరుసగా మూడు సబ్బాతులు పౌలు కొరింథీయులికి బోధించాడు. “జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న దేవుని గొట్టె పిల్ల” ప్రకటన 13:8) అయిన క్రీస్తు జీవితం, మరణం, పునరుత్థానం, గుడార సేవ, భవిష్యత్ మహిమను గూర్చి వారితో చర్చించాడు. పౌలు క్రీస్తుని ఘనపర్చాడు. ఆయన సేవను గూర్చి సరియైన అవగాహనే పాత నిబంధన లేఖనాల్ని తెరిచే తాళపు చెవి. అదే వారికి వాక్య సిరులనందించే సాధనం.AATel 161.4

    గొప్ప శక్తితో థెస్సలోనీకలో ప్రకటితమవుతున్న సువార్త సత్యాలు పెద్ద ప్రజా సమూహాల్ని ఆకట్టుకొంటున్నాయి. “వారిలో కొందరును, భక్తిపరులగు గ్రీసు దేశస్థులలో చాలామందియు, ఘనత గల స్త్రీలలో అనేకులును ఒప్పుకొని పౌలుతోను సీలతోను కలిసికొనిరి”.AATel 161.5

    క్రితం ప్రవేశించిన స్థలాల్లోలాగానే ఇక్కడా ఈ అపొస్తలులికి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యింది. అయితే విశ్వసించని కొంతమంది” యూదులు “మత్సరపడి” వ్యవహరించారు. ఈ యూదులు అప్పట్లో రోమా అధికారం పట్ల విరోధభావజాలం కలిగి ఉన్నారు. ఎందుకంటే దానికి కొద్ది కాలం క్రితం రోములో వారు తిరుగుబాటు లేవదీశారు. అందుకే వారిని అనుమానంగా చూసేవారు. వారి స్వేచ్ఛను కొంతమేరకు నియంత్రించారు. అధికారుల ప్రాపకం సంపాదించి వారి సహృదయతను తిరిగి పొందటానికి అదే సమయంలో ఆ అపొస్తలుల మీద క్రైస్తవాన్నంగీకరించిన విశ్వాసులమీద నింద మోపటానికి ఇప్పుడు వారికి మంచి అవకాశం లభించింది.AATel 162.1

    ఇది చెయ్యటానికి వారు ‘పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టుల”తో ఏకమై “పట్టణమెల్ల అల్లరి” చేశారు. అపొస్తలుంటారన్న ఉద్దేశంతో వారు “యాసోనును ఇంటిమీద” దాడి చేశారు. కాని పౌలుగాని సీలగాని వారికి దొరకలేదు. “వారు కనబడనందున” తీవ్ర నిరాశకు గురి అయిన ఆ మూక “యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొనిపోయి - భూలోకమును తల్లక్రిందుచేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చియున్నారు. యాసోను వీరిని చేర్చుకొని యున్నాడు. వీరందరు యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొనువారు అని కేకలు వేసిరి.”AATel 162.2

    పౌలు సీలలు కనిపించలేదు గనుక న్యాయాధికారులు శాంతి భద్రతలు కాపాడటానికి నిందితులైన ఆ విశ్వాసుల్ని చెరలో ఉంచారు. దౌర్జన్యం పెచ్చు పెరుగుతుందన్న భయంతో “సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి”.AATel 162.3

    పౌలు, తన అనుచర సువార్తికులు ఏ ప్రజల మధ్య పరిచర్య చేశారో వారినుంచి పొందిన అవాంఛనీయ ప్రతిస్పందనకు భిన్నంకాని ప్రతిస్పందన క్రైస్తవులమని చెప్పుకొనే వారినుంచి సైతం నేడు ఆదరణలేని సత్యాలు బోధించే వారికి ఎదురైతే వారు నిరుత్సాహపడాల్సిన పనిలేదు. సిలువ దూతలు మెలకువ కలిగి ప్రార్థించటమన్న ఆయుధం ధరించి “శ్వాసంతో దీక్షతో అన్ని వేళల యేసు పేరట పని చేస్తూ ముందుకు సాగాలి. ఎవరు పాత నిబంధన కాలపు బలి అర్పణలన్నిటికి కేంద్రబిందువో, ఎవరి ప్రాయశ్చితార్థ బలిదానం దైవధర్మ శాస్త్రాన్ని ఉల్లంఘించిన పాపులకు సమాధానం, క్షమాపణ చేస్తున్నదో ఆ క్రీస్తును పరలోక గుడారంలో సేవచేస్తున్న మధ్యవర్థిగా వారు ఘనపర్చాలి.AATel 162.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents