Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అపొస్తలుల కార్యాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    48—నీరో ముందు పౌలు

    విచారణకు పౌలు నీరో చక్రవర్తి ముందుకి రావలసిందిగా ఆదేశం వచ్చినప్పుడు అది అతని శీఘ్రమరణానికి సంకేతమన్నది స్పష్టమయ్యింది. అతనిపై మోపిన నేరం, క్రైస్తవులపట్ల పెచ్చు పెరుగుతున్న పగ, ద్వేషాన్నిబట్టి ఆ ఆరోపణ విషయంలో సానుకూల తీర్పువస్తాదని ఆశించటానికి ఆస్కారమే లేదు.AATel 352.1

    ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి న్యాయస్థానాల ముందు వాదించటానికి న్యాయవాదిని పెట్టుకోటానికి అనుమతించటం గ్రీకులు రోమియులు అనవాయితీగా అనుసరించిన విధానం. వాదన బలంవల్ల, వాగ్దాటివల్ల లేదా విజ్ఞాపనలు, ప్రార్థనలు కన్నీళ్లవల్ల అలాంటి న్యాయవాది తరచుగా ఖైదీకి అనుకూలమైన తీర్పు పొందేవాడు. ఒక వేళ ఇది అలా జరగకపోతే నేరస్తుడి శిక్ష తీవ్రతయినా తగ్గేది. అయితే పౌలు నీరోముందు నిలవాల్సిందిగా ఆదేశం పొందినప్పుడు, అతనికి న్యాయవాదిగా వ్యవహరించటానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. తన మీద మోపిన నేరాల లేదా తన పక్షంగా సమర్పించే వాదనల దాఖలాలుంచటానికి ఏమిత్రుడు దగ్గర్లో లేడు. ఆ క్లిష్టసమయంలో పౌలు పక్కన నిలబడటానికి రోములోని క్రైస్తవుల్లో ఒక్కడు కూడా ముందుకు రాలేదు.AATel 352.2

    ఈ సందర్భాన్ని గూర్చిన ఒకే ఒక విశ్వసనీయ దాఖలాను తాను తిమోతికి రాసిన రెండో ఉత్తరంలో పాలు ఇస్తున్నాడు. ‘నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలువలేదు; అందరు నన్ను విడిచిపోయిరి; ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తము అన్య జనులందరును దాని విను నిమిత్తమును, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోటనుండి తప్పింపబడితిని” 2 తిమోతి 4:16,17.AATel 352.3

    పౌలు నీరో ముందు నిలబడటం! ఇద్దరి మధ్యా ఎంత వ్యత్యాసముంది! ఎవరి ముందు దైవభక్తుడు తన విశ్వాసం నిమిత్తం జవాబు చెప్పుకునేందుకు నిలబడి వున్నాడో, గర్వాంధుడైన ఆ చక్రవర్తి లోకాధికారం, ఆధిపత్యం, భాగ్యం విషయంలో అత్యున్నత స్థితిలో ఉన్నాడు. నేరం దుర్మార్గత విషయంలో అధ:పాతాళానికి దిగజారిపోయాడు. అధి కారం ఔన్నత్యం వరంగా అతడికి పోటీగా నిలిచేవారెవరూలేరు. అతడి అధికారాన్ని ప్రశ్నించే వారు లేరు, ప్రతిఘటించే వారు లేరు. రాజులు తమ కిరీటాల్ని అతడి పాదాలవద్ద పెట్టారు. అతడి ఆజ్ఞమేరకు శక్తిమంతమైన సేనలు బయల్దేరాయి. అతడి యుద్ధ నావలు విజయ పతాకాలు ఎగరవేశాయి. న్యాయస్థానాల్లో అతడి విగ్రహం నిలిచింది. శాసనసభ సభ్యుల తీర్మానాలు న్యాయాధిపతుల తీర్పులు అతడి చిత్తాన్నే ప్రతిధ్వనించాయి. అతడి ఆజ్ఞను లక్షలమంది శిరసావహించారు. నీరో పేరు చెప్పితే ప్రపంచం వణికింది. అతడి ఆదరాన్ని కోల్పోయినవారు ఆస్తి, స్వేచ్ఛప్రాణాలు పోగొట్టుకునేవారు. అతడి ఆగ్రహం భయంకర జాడ్యం కన్నా బీభత్సమయ్యేది.AATel 352.4

    డబ్బులేకుండా, మిత్రులు లేకుండా, న్యాయవాది లేకుండా ఈ వృద్ధ ఖైదీ నీరో ముందు నిలబడ్డాడు. చక్రవర్తి ముఖం అతడిలో చెలరేగుతున్న రాగ ద్వేషాల్ని ప్రతిబింబిస్తుంది. నిందితుడు పౌలు ముఖం దేవునితో తనకున్న సమాధానానికి అద్దం పడుతున్నది. పౌలు పేదరికాన్ననుభవించాడు. ఆత్మ నిరసన పాటించాడు. బాధలనుభవించాడు. తనను భయ పెట్టటానికి శత్రువులు నిత్యం అబద్ద ప్రచారం, నిందారోపణలు, దుర్భాషలు కొనసాగించినా అతను సిలువ పతాకాన్ని నిర్భయంగా ఎగరవేశాడు. తన ప్రభువులాగే అతను కూడా నివాసమంటూలేని సంచారి. ఆయనకుమల్లే అతను కూడా ఇతరులకు మేలు చేస్తూ నివసించాడు. చపలచిత్తుడు, ఉద్రేకపరడు, స్త్రీలోలుడు నిరంకుశ పరిపాలకుడు అయిన నీరో ఈ దేవుని కుమారుడి ప్రవర్తనను ఉద్దేశాలను ఎలా అవగతం చేసుకోగలుగుతాడు? ఎలా అభినందించగలుతాడు?AATel 353.1

    అక్కడ జరుగుతున్నదంతా చూడాలని వినాలని ఆతురతగా గెంటుకొంటూ తోసుకొంటూవున్న జనసమూహంతో ఆ విశాలమైన హాలు కిటకిటలాడున్నది. హాలులోని ప్రజలు ఒకర్నొకరు నెట్టుకొంటూ ముందుకు వస్తున్నారు. గొప్ప వారు కొద్దివారు, ధనికులు దరిద్రులు, చదువున్నవారు చదువులేనివారు, గర్వాంధులు సామాన్యులు ఆ హాల్లో ఉన్నారు. అందరూ జీవమార్గాన్ని గురించి రక్షణ గురించి ఏమి తెలియనివారే.AATel 353.2

    యూదులు పౌలు మీద మోపిన నేరాలు రాజద్రోహం (కథోలికి) సంఘ సిద్ధాంత (కథోలికి) వ్యతిరేకత అన్న పాత నేరాలే. అంతేకాదు, యూదులు రోమీయులు పౌలు మీద రోము నగరాన్ని కాల్చివేయటానికి ప్రజల్ని ప్రోత్సహించాడన్న ఆరోపణను చేశారు. ఈ నేరాల్ని వారు పౌలు మిద మోపగా పౌలు ముఖంపై ప్రశాంతత వెల్లివిరిసింది. ప్రజలు న్యాయాధిపతులు అతని వంక ఆశ్చర్యంగా చూశారు. కాని తమముందు నిలిచివున్న నిందితునిలో ప్రదర్శితమౌతున్న పరిశుద్ధత ప్రశాంతత వారు ముందెన్నడూ చూడలేదు. ఖైదీల ముఖాల్ని చూసి విషయం గ్రహించగల నిశిత దృష్టిగల న్యాయాధిపతుల కళ్ళు ఏదో నేరం కనుక్కోటానికి వ్యర్ధంగా పౌలు ముఖంలోకి చూశాయి. తన పక్షంగా మాట్లాడటానికి అనుమతి లభించి పౌలు మాట్లాడుతున్నప్పుడు అందరూ ఆసక్తిగా విన్నారు.AATel 353.3

    ఆశ్చర్యంతో నిండిన జన సమూహం ముందు సిలువ ధ్వజాన్ని ఎగరవెయ్య టానికి పౌలుకి మరొక అవకాశం లభించింది. యూదులు, గ్రీకులు, రోమియులు ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన పరదేశులతో కూడిన జనసమూహాల్సి వీక్షించినప్పుడు వారి రక్షణ నిమిత్తం అతనిలో బలీయమైన ఆకాంక్ష చెలరేగింది. అతడు అక్కడున్న సందర్పాన్ని మర్చిపోయాడు. తనను చుట్టు ముట్టివున్న ప్రమాదాల్ని మర్చిపోయాడు. కొద్ది సమయంలోనే తనను కబళించనున్న దురదృష్టాన్ని మర్చిపోయాడు. అతడు యేసును మాత్రమే చూస్తున్నాడు. పాపుల పక్షంగా దేవుని ముందు విజ్ఞాపన చేస్తున్న యేసును మాత్రమే చూస్తున్నాడు. మానవాతీతమైన వాగ్దాటితో శక్తితో పౌలు సువార్త సత్యాల్ని బోధించాడు. నశించిన మానవజాతి పక్షంగా యేసు చేసిన త్యాగానికి తన శ్రోతల దృష్టిని ఆకర్షించాడు. మానవుడి విమోచన నిమిత్తం గొప్ప మూల్యం ఆయన చెల్లించాడని వివరించాడు. దేవుని సింహాసనాన్ని మానవుడు అధిష్టించటానికి ఏర్పాటయ్యింది. దూతల ద్వారా లోకానికి పరలోకానికి మధ్య సంబంధం ఏర్పడింది. మనుషులు జరిగించే పనులు అవి మంచివే గాని చెడ్డవేగాని నిత్య న్యాయాధిపతి కంటికి స్పష్టంగా కనిపిస్తాయి.AATel 354.1

    సత్యప్రవక్త ఈ విధంగా విజ్ఞాపన చేశాడు. విశ్వాసం లేనివారి మధ్య విశ్వాస పూర్ణుడుగా, అపనమ్మకస్తుల మధ్య నమ్మకస్తుడుగా, అతడు దేవుని ప్రతినిధి అయి నిలిచాడు. అతని స్వరం పరలోకం నుంచి వచ్చిన స్వరం. అతనిలో భయం, వ్యాకులత, మాటలోగాని చూపులోని నిరుత్సాహం ఏకోశానా లేదు. తాను నిరపరాధిని అన్న స్పృహకలిగి, సత్యం అనే సర్వాంగ కవచం ధరించి తాను దేవుని కుమారుడైనందుకు అతడు ఆనందించాడు. అతని మాటలు యుద్ధం రొదలోనుంచి వినిపించే విజయోత్సాహ ధ్వనిలా వినిపించాయి. తన జీవితం ఏ సేవకు అంకితమయ్యిందో ఆ సువార్త సేవను వివరించాడు. ఆ దైవకార్యం ఎన్నటికీ విఫలం కానిదని ప్రకటించాడు. తాను నశించినా సువార్త నశించదని ఉదాటించాడు. దేవుడు సజీవుడని ఆయన సత్యం జయిస్తుందని చెప్పాడు.AATel 354.2

    ఆ రోజు అతణ్ని చూసిన అనేకులకు, “అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖమువలె... కనబడెను.” అ.కా. 6:15.AATel 354.3

    అక్కడ సమావేశమైన ప్రజలు అలాంటి మాటల్ని ముందెన్నడూ వినలేదు. అవి హృదయాన్ని కదిలించిన మాటలు. కఠిన హృదయాల్ని సయితం ఉత్తేజపర్చిన మాటలు. అది స్పష్టమైన విశ్వసనీయమైన సత్యం. ఆ సత్యం అసత్యాన్ని కూలదోసింది. అనేకుల హృదయాల్లో వెలుగు ప్రకాశించింది. అనంతరం వారు ఆ సత్యాన్ని అంగీకరించారు. ఆ రోజున ఆ అపొస్తలుడు వచించిన సువార్త సత్యాలు రాజ్యాల్ని కదిలించాల్సివున్నాయి. అవి భవిష్యత్ కొలమంతా కొనసాగుతూ ఉండాల్సిన సత్యాలు. వాటిని ప్రకటించిన పెదవులు హతసాక్షి సమాధిలో మూగబోయి ఉన్నప్పుడు ఆ సత్యాలు మనుషుల మనసుల్ని ప్రభావితం చేయాల్సివున్నాయి.AATel 354.4

    ఈ సమయంలో విన్నట్లుగా సత్యాన్ని నీరో ముందెప్పుడూ వినవేదు. తన జీవితంలో పోగుపడ్డ అపరాధం గురించి ఇప్పుడు బహిర్గతమైనంత స్పష్టంగా క్రితంలో ఎన్నడూ బహిర్గతం కాలేదు. అతడి ఆత్మను ఆవరించిన పాపపు చీకటిని పరలోకం నుంచి వచ్చిన వెలుగు పారదోలింది. ఒక న్యాయస్థానం ఉందని, లోక పరిపాలకుడైన తాను ఆ న్యాయస్థానం తీర్పుకోసం నిలబడాల్సి ఉంటుందని, తన పాప క్రియలకు ప్రతిఫలం ఉంటుందని విన్నప్పుడు రాజు భయంతో వణికాడు. అపొస్తలుడి దేవుడంటే భయం కలిగింది. ఏ నేరమూ లేని అపొస్తలుడి పై తీర్పు వెలిబుచ్చడానికి భయపడ్డాడు. రక్తదాహం గల అతడి స్వభావాన్ని భయం కొంతకాలం నియంత్రించింది.AATel 355.1

    అపరాధం కాఠిన్యం పేరుకుపోయిన నీరోకు పరలోకం ఒక్కక్షణం తెరుచు కుంది. దాని శాంతి, పవిత్రత కోరదగినవిగా తోచాయి. ఆ క్షణంలో అతడికి సైతం కృపాహ్వానం అందుబాటులో ఉంది. ఒక్కక్షణ కాలం మాత్రమే క్రమాభిక్షను గూర్చిన తలంపుకు చోటుంది. అంతట పౌలును మళ్ళీ తన చీకటి కొట్టులోనికి తీసుకు పోవాల్సిందిగా ఆజ్ఞ జారీ అయ్యింది. దైవ సేవకుడికి తలుపు మూతపడుతుండగా రోమా చక్రవర్తికి పశ్చాత్తాపద్వారం మూత పడింది. అతణ్ని అలముకున్న అంధకారంలోకి చొచ్చుకుపోయే కాంతికిరణం మరెన్నడూ పరలోకం నుంచి ప్రకాశించలేదు. త్వరలోనే అతడు దేవుని తీర్చుకు శిక్షకు గురికావల్సివున్నాడు.AATel 355.2

    ఇది జరిగిన కొద్ది కాలానికే నీరో గ్రీసుపై తన అప్రదిష్టకర దండయాత్రను చేశాడు. అక్కడ తన చౌకబారు, హేయ వర్తనవల్ల ఛీకొట్టించుకున్నాడు. గొప్ప ఆర్బాటం ఆడంబరాలతో, చుట్టూ ఆ స్థానికులతో రోముకు తిరిగివచ్చి తినటంలోను తాగటంలోను కామకేళిలోను మునిగితేలాడు. ఈ వినోదాల్లో తలమునకలైవున్న తరుణంలో వీధుల్లో గందరగోళం జరుగుతున్న శబ్దం వినిపించింది. అదేంటో తెలుసుకోటానికి నియుక్తుడైన సేవకుడు తిరిగివచ్చి గల్చా తన సైన్యంతో రోము పైకి దండెత్తి వేగంగా వస్తున్నాడని, నగరంలో యుద్ధం అప్పుడే మొదలయ్యిందని, వీధులు ఆగ్రహావేశాలతో రెచ్చిపోతున్న ప్రజలతో కిటకిటలాడున్నాయని, ఆ మూకలు చక్రవర్తిని అతని మద్దతుదారుల్ని చంపుతామంటూ వడివడిగా రాజభవనం దిశగా వస్తున్నాయని నివేదించాడు.AATel 355.3

    ఈ అపాయకర సమయంలో భక్తుడైన పౌలుకుమల్లే ఆదారపడటానికి నీరోకి శక్తిమంతుడు దయామయుడు అయిన దేవుడు లేడు. మూకగా వస్తున్న ప్రజల చేతుల్లో బాధ హింస సంభవించవచ్చునన్న భయంతో ఆ నికృష్ట నియంత ఆత్మహత్య చేసుకోవాలని మొదట భావించాడు. కాని ఆ పని చేయటానికి ధైర్యం చాలలేదు. ఎవరూ తోడు లేకుండా ఒంటరిగా నగరంనుంచి పారిపోయి నగరానికి కొన్ని మైళ్ళ దూరంలోవున్న గ్రామీణ ప్రాంతంలో ఆశ్రయం కోరాడుగాని ఫలందక్కలేదు. అతడు దాక్కొన్న స్థలాన్ని ప్రజలు కనుగొని తరుంకొంటూ వస్తున్న అశ్వదళాలు నీరోను సమీపిస్తుండగా ఒక బానిసను పిలిచి అతడి సాయంతో తన్నుతాను పొడుచుకుని మరణించాడు. క్రూరపాలకుడైన నీరో ముప్పయి రెండేళ్ళ తరుణప్రాయంలో నశించిపోయాడు.AATel 355.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents