Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అపొస్తలుల కార్యాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    54—నమ్మకమైన సాక్షి

    క్రీస్తు ఆరోహణానంతరం యోహాను తన ప్రభువుకు నమ్మకమైన, చిత్తశుద్ధిగల కార్యకర్తగా నిలిచాడు. పెంతెకొస్తు దినాన తక్కిన శిష్యులతోపాటు యోహాను కూడా పరిశుద్దాత్మ కుమ్మరింపును పొందాడు. నూతనోత్సాహంతోను శక్తితోను జీవ వాక్యాన్ని ప్రజలకు పంచి ప్రజల ఆలోచనల్ని అదృశ్యదేవుని మీదికి తిప్పటానికి కృషిచేశాడు. అతడు శక్తిమంతమైన ప్రబోధకుడు. ఉత్సాహం, ఉద్రేకం దండిగా ఉన్నవాడు. మధురమైన స్వరంతో చక్కని భాషలో క్రీస్తు చెప్పిన మాటల్ని క్రీస్తు చేసిన పనుల్ని ప్రజలకు వివరించాడు. అతని మాటలు వినేవారిలో ఆసక్తి రేకేత్తించాయి. అతని మాటల సరళత, అతడు బోధించే సత్యాల్లోని శక్తి, అతని బోధనలోని ఉద్వేగం అన్ని తరగతుల ప్రజల్ని ఆకట్టుకున్నాయి.AATel 392.1

    అపొస్తలుని జీవితం అతడి బోధనల్ని అనుసరించి ఉన్నది. క్రీస్తుపట్ల తన హృదయంలో ప్రకాశిస్తున్న ప్రేమ తన తోటి మనషుల కోసం ప్రధానంగా క్రైస్తవ సంఘంలోని తన సహోదరుల కోసం పాటుపడటానికి అతణ్ని నడిపించింది.AATel 392.2

    తాను తమను ప్రేమించిన రీతిగానే వారుకూడా ఒకరినొకరు ప్రేమించాలని యేసు ఆదిమ శిష్యున్ని ఆదేశించాడు. క్రీస్తు తమ హృదయాల్లో మహిమానిరీక్షణే ఉన్నాడని వారు ఈ విధంగా లోకానికి చాటిచెప్పాల్సి ఉన్నారు. ఆయన ఇలా అన్నాడు, “మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే నారును ఒకరినొకడు ప్రేమింపవలెను.” యెహాను 13 : 34. ప్రభువు ఈ మాటలన్న సమయంలో శిష్యులు వాటిని గ్రహించలేకపోయారు. కాని వారు క్రీస్తు శ్రమల్ని చూసిన తర్వాత, ఆయన సిలువ మరణం, పునరుత్థానం తర్వాత, పెంతెకొస్తునాడు తమమీదికి పరిశుద్ధాత్మ దిగివచ్చాక, దేవుని ప్రేమను గురించి, తాము ఒకరిపట్ల ఒకరు కలిగి ఉండాల్సిన ప్రేమ స్వభావంగురించి వారికి స్పష్టమైన అభిప్రాయం ఏర్పడింది. అప్పుడు యెహాను తన తోటి శిష్యులికి ఇలా చెప్పగలిగాడు;AATel 392.3

    ” ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనము కూడ సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమైయున్నాము.”AATel 393.1

    పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనంతరం, సజీవుడైన రక్షకుని ప్రకటించేందుకు శిష్యులు బయలుదేరి వెళ్లినప్పుడు ఆత్మల్ని రక్షించటమన్నదే వారి ఒకే ఒక వాంఛ. వారు భక్తులతో సహవాసానందాన్ని అనుభవించారు. వారు దయ కనికరాలు, ఇతరులను గూర్చి పరిగణన, ఆత్మ నిరసన, సత్యం నిమిత్తం త్యాగాలకు సంసిద్ధత ప్రదర్శించారు. తమ అనుదిన జీవితంలో ఒకరితో ఒకరు వ్యవహారించటంలో క్రీస్తు ఆదేశించిన ప్రేమను వారు ప్రదర్శించారు. స్వార్ధరహితమైన మాటలు క్రియలద్వారా ఈ ప్రేమను ఇతరుల హృదయాల్లో రగుల్కొలిపారు.AATel 393.2

    విశ్వాసులు అలాంటి ప్రేమను నిత్యం ప్రదర్శించాల్సి ఉన్నారు. కొత్త అజ్ఞను మనఃపూర్వకంగా ఆచరిస్తూ ముందుకు సాగాల్సి ఉన్నారు. క్రీస్తు'తో సన్నిహితబాంధవ్యం కలిగి ఉండి తద్వారా ఆయన ధర్మవిధుల్ని నెరవేర్చటానికి శక్తి కలిగి ఉండాల్సి ఉన్నారు. తన నీతి మూలంగా వారిని నీతిమంతులుగా తీర్చగల రక్షకుని శక్తిని వారి జీవితాలు ప్రదర్శించాల్సి ఉన్నాయి.AATel 393.3

    క్రమేణా మార్పుచోటు చేసుకుంది. విశ్వాసులు ఇతరుల్లో లోపాలు వెదకటం మొదలు పెట్టారు. తప్పులు వెదకటంలోను, ఇతరుల్ని విమర్శించటంలోను సమయం వ్యర్థపుచ్చుతూ రక్షకుణ్ని గూర్చి, ఆయన ప్రేమనుగూర్చి మర్చిపోయారు. విశ్వాసి బాహ్యాచారాల్ని అనుసరించటంలో నిష్టగా ఉండటం, సిద్ధాంతాల్ని పట్టించుకుని ఆచరణను తుంగలో తొక్కటం ఎక్కువయ్యింది. ఇతరుల్ని విమర్శించటంలో ఉద్రేకం ఎక్కువై వారు తమ సొంత పొరపాట్లు వైఫల్యాల్ని విస్మరించారు. క్రీస్తు ఆజ్ఞాపించిన సహోదర ప్రేమను కోల్పోయారు. మిక్కిలి విచారకరమైన విషయమేంటంటే, వారు ఆప్రేమను కోల్పోయామన్న సంగతిని గ్రహించకపోవటం. తమ జీవితాల్లో ఆనందోత్సాహాలు శూన్యమవుతున్నాయని హృదయాల్లో నుంచి దేవుని ప్రేమను తోలినేసిన తాము త్వరలో చీకటిలో నడవనున్నామని వారు గ్రహించలేదు.AATel 393.4

    సంఘంలో సహోదరప్రేమ కొరవడ్డ సంగతి గుర్తించిన యోహాను ఈ ప్రేమ ఆవశ్యకతను గురించి సంఘానికి పదేపదే విజ్ఞప్తి చేశాడు. సంఘానికి అతని ఉత్తరాలు ఈ ఆలోచనతో నిండి ఉన్నాయి. యోహానిలా రాస్తున్నాడు, “ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి; ప్రేమలేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించునట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు; తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమైయుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింపబద్ధులమై యున్నాము.”AATel 393.5

    విశ్వాసులు ఈ ప్రేమను ప్రత్యేకార్థంతో ప్రదర్శించాల్సి ఉన్నారు. దాన్ని గురించి అపొస్తలుడిలా రాస్తున్నాడు: “క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మాయందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటివరకును చీకటిలోనే యున్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు; అతనియందు అభ్యంతర కారణమేదియు లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. “మన మొకనినొకడు ప్రేమింపలెననునది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే గదా.” “ప్రేమలేనివాడు మరణమందు నిలిచియున్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు: ఏ నరహంతకునియందును నిత్యజీవముండదని మీరెరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనము కూడ సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై యున్నాము.”AATel 394.1

    క్రీస్తు సంఘానికి మిక్కిలి ప్రమాదకరమైంది లోకం వ్యతిరేకతకాదు. అది విశ్వాసుల హృదయాల్లో దోబూచులాడే దుష్టత్వం. అదేవారికి ఘోర ప్రమాదం కలిగిస్తుంది. దేవుని సేవ పురోగమనాన్ని అడ్డుకొంటుంది. ఆధ్యాత్మికంగా నిర్వీర్యపర్చే మార్గం ఈర్ష్యను అనుమానాన్ని తప్పులు వెదకటాన్ని, దురాలోచనలు చేయటాన్ని బలపర్చటంకన్నా శక్తిమంతమైన మార్గం ఇంకొకటి లేదు. మరోపక్క, వేర్వేరు చిత్తవృత్తులు మనస్తత్వాలు గల వ్యక్తుల సమాహారమైన సంఘంలో ఉన్న సామరస్యం దేవుడు తన కుమారుణ్ని లోకంలోకి పంపించాడనటానికి మిక్కిలి శక్తిమంతమైన సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని ఇవ్వటం క్రీస్తు అనుచరుల ఆధిక్యత. ఈ కార్యనిర్వహణకు వారు క్రీస్తు ఆజ్ఞకు విధేయులై ఉండాలి. వారి ప్రవర్తనలు ఆయన ప్రవర్తనకు, వారి చిత్రాలు ఆయన చిత్తానికి అనుగుణంగా ఉండాలి.AATel 394.2

    క్రీస్తు అన్నాడు “మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే నారును ఒకరినొకరు ప్రేమింపవలెను” యోహాను 13:34. ఇది ఎంత చక్కని ప్రకటన! అయ్యో. దీన్ని ఆచరించేవారు ఎంత తక్కువ మంది! ఈనాడు దేవుని సంఘంలో సోదర ప్రేమ లేకపోవటం శోచనీయం. రక్షకుణ్ని ప్రేమిస్తున్నట్లు చెప్పుకునే అనేకమంది ఒకరినొకరు ప్రేమించరు. క్రైస్తవులుగా చెప్పుకునే వారి విశ్వాసం తమ జీవితాలపై పరిశుద్ధ ప్రభావాన్ని ప్రసరిస్తుందో లేదో చూడటానికి అవిశ్వాసులు కళ్లు తెరిచి చూస్తున్నారు. ప్రవర్తన దోషాల్ని కనిపెట్టటానికి క్రియల్లో అవకతవకలు కనుగోటానికి వారు చురుకుగా వ్యవహరిస్తున్నారు. “క్రీస్తు పతాకం కింద నిలబడి ఉన్న ప్రజలు ఒకరినొకరు ఎలా ద్వేషించుకుంటున్నారో చూడండి అని తమ శత్రువు నిందించటానికి క్రైస్తవుడతడికి అవకాశం ఇవ్వకూడదు. క్రైస్తవులంతా ఒకే కుటుంబ సభ్యులు, ఒకే పరమ తండ్రి బిడ్డలు, అమర్యతను గురించి ఒకే శుభప్రద నిరీక్షణ గలవారు. వారి సంబంధం ప్రేమానుబంధమై వారిని ఐక్యంగా ఉంచాలి.AATel 394.3

    తాను ప్రదర్శించిన సున్నితమైన ప్రేమను ప్రదర్శించాల్సిందిగా మనకు పిలుపునిస్తున్నప్పుడు క్రీస్తు దైవప్రేమ మన హృదయాలను కదిలించే విజ్ఞాపన చేస్తున్నది. తన సహోదరుడి పట్ల స్వార్థరహిత ప్రేమ గలవాడే దేవుని పట్ల నిజమైన ప్రేమ గలవాడు. నిజాయితీగల క్రైస్తవుడు అపాయంలో కొట్టుమిట్టాడుతున్న ఆత్మను విడిచి పెట్టటం, హెచ్చరిక చేయాల్సిన అవసరాన్ని గుర్తించకపోవటం ఇష్టపూర్వకంగా చెయ్యడు. తప్పు చేస్తున్నవార్ని తమ తప్పిదంలో కూరుకుపోయి దుఃఖంలో నిరాశలో కునారిల్లటానికి లేదా సాతాను రణరంగంలో కూలిపోటానికి విడిచి పెట్టడు.AATel 395.1

    సున్నితమైన క్రీస్తు ప్రేమను ఎన్నడూ అనుభవించి ఉండనివారు ఇతరుల్ని జీవపు ఊట వద్దకు నడిపించలేరు. హృదయంలో ఉన్న ఆయన ప్రేమకు బలవంతం చేసే శక్తి ఉంది. తమ మాటల్లో, దయ, కనికరంగల స్వభావంలో, తాము ఎవరితో సహవాసం చేస్తారో వారి జీవితాల్ని మెరుగుపర్చటంలో ఆయనను ఆవిష్కరించటానికి ఆ శక్తి మనుషుల్ని నడిపిస్తుంది. తన సేవలో విజయం సాధించాలని అభిలాషించే క్రైస్తవ కార్యకర్తలు క్రీస్తును ఎరగటం అవసరం. ఆయనను ఎరగాలంటే ఆయన ప్రేమను గూర్చి తెలుసుకోవాలి. క్రీస్తు ప్రేమించినట్లు ప్రేమించటానికి, ఆయన పనిచేసినట్లు పనిచెయ్యటానికి వారి శక్తిసామర్థ్యాల్ని బట్టి దైవ సేవకులుగా వారి సమర్థతను కొలవటం జరుగుతుంది పరలోకంలో.AATel 395.2

    అపొస్తలుడిలా రాస్తున్నాడు, “మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము.” పరులకు సహాయం చెయ్యాలని, మేలు చెయ్యాలని ప్రతి నిత్యం ప్రేరణ కలిగినప్పుడు క్రైస్తవ ప్రవర్తన సంపూర్ణతను సాధిస్తుంది. విశ్వాసి ఆత్మను ఆవరించే ఈ ప్రేమ వాతావరణం అతణ్ని జీవాత్తమైన జీవపు వాసనగా తీర్చిదిద్ది, దేవుడు అతడి సేవను దీవెనగా మార్చటానికి దోహదపడుతుంది.AATel 395.3

    దేవునిపట్ల సర్వోన్నత ప్రేమ, ఒకరిపట్ల ఒకరికి నిస్వార్థ ప్రేమ - ఇదే మనపరలోకపు తండ్రి అనుగ్రహించగల ఉత్కృష్ట వరం. ఈ ప్రేమ భావోద్వేగం కాదు. అది దైవ సూత్రం, నిత్యం ఉండే శక్తి. సమర్పితం కాని హృదయం దాన్ని ఉత్పత్తి చెయ్యలేదు. క్రీస్తు పాలించే హృదయంలో మాత్రమే అది కనిపిస్తుంది. “ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.” దైవ కృపవలన పునరుద్ధరణ పొందిన హృదయంలో కార్యాచరణకు ప్రేమ ముఖ్య నిబంధన. అది ప్రవర్తనను మార్చుతుంది. ఉద్వేగాల్ని నియంత్రిస్తుంది. ఉద్రేకాల్ని అదుపుచేస్తుంది. మమతానురాగాల్ని ఉదాత్తం చేస్తుంది. ఆత్మలో వృద్ధిచెందే ఈ ప్రేమ జీవితాన్ని రాగరంజితం చేసి చుట్టూ ఉన్నవారి పై సంస్కరించే ప్రభావాన్ని ప్రసరిస్తుంది.AATel 395.4

    ప్రేమస్ఫూర్తి వినియోగం ద్వారా ఒనగూడే ఉన్నతాధిక్యతల్ని అవగాహన చేసుకోటానికి విశ్వాసుల్ని నడిపించటానికి యోహాను కృషిచేశాడు. హృదయాన్ని నింపే ఈ విమోచన కార్యం వ్యక్తి ఆశయాలన్నిటిని అదుపుచేసి అతణ్ని ప్రపంచంలోని దుష్టభావాలకు అతీతంగా ఉంచుతుంది. ఈ ప్రేమ ప్రధాన పాత్ర పోషించి జీవిత ప్రేరేపక శక్తి అయితే దేవుని పై వారి నమ్మకం, విశ్వాసం, వారి విషయంలో ఆయన వ్యవహరణ పరిపూర్ణమౌతాయి. అప్పుడు వారు తమ ప్రస్తుతకాలానికి భవిష్యత్తుకి అవసరమైందంతా ఆయన అనుగ్రహిస్తాడన్న తెలివిడితో ఆయన వద్దకు పూర్ణవిశ్వాసంతో రావచ్చు. అతడిలా రాశాడు, “తీర్పు దినమందు మనకు ధైర్వము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడియున్నది; ఏలయనగా ఆయన ఎట్టివాడైయున్నాడో మనము కూడ ఈ లోకములో అట్టివారమైయున్నాము.AATel 396.1

    ప్రేమలో భయములేదు; అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును.” “ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే... మనమాయనను వేడుకొనునవి మనకు కలిగినవని యెరుగుదుము.” - “ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపముల కు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమైయున్నాడు.” “మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును.” దేవుని కృపను పొందటానికి గల షరతులు సాధారణమైనవి, సముచితమైనవి. క్షమాపణ పొందేందుకు మనం ఏదో దారుణ కార్యం చేయాలని దేవుడు మనల్ని కోరటంలోదు. మనం దీర్ఘ తీర్థయాత్రలు చెయ్యనవసరం లేదు. మన ఆత్మల్ని దేవునికి అంగీకృతం చేసుకోటానికి లేక మన దోషాలకు ప్రాయశ్చిత్తం చేసుకోటానికి మనం బాధాకరమైన తపస్సులు చెయ్యనక్కర లేదు. తన పాపాల్ని “ఒప్పుకొని విడిచి పెట్టువాడు కనికరము పొందును” సామెతులు 28:13.AATel 396.2

    పరలోకంలో క్రీస్తు తన సంఘం నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరికోసం తన రక్తాన్ని విమోచన మూల్యంగా చెల్లించాడో వారికోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మానవ ప్రాయశ్చితార్థం ఆయన చేసిన త్యాగం ప్రభావాన్ని శతాబ్దాలు యుగాలు తగ్గించలేవు. క్రీస్తు యేసులో ఉన్న దేవుని ప్రేమనుంచి జీవమైనా, మరణమైనా, ఎత్తైనా, లోతైనా మనల్ని వేరు చెయ్యలేదు. మనం ఆయన్ను గట్టిగా పట్టుకున్నందుకు కాదు ఆయన మనల్ని వేరుచెయ్యకపోటం ఆయన మనల్ని గట్టిగా పట్టుకున్నందుకే. మన రక్షణ మన సొంత కృషిమీద ఆధారతమై ఉంటే మనకు రక్షణ ఉండదు. వాగ్దానాలన్నిటి వెనక ఉన్న ప్రభువుమీద మన రక్షణ ఆధారపడి ఉంది. ఆయన పై మన పట్టు బలహీనంగా ఉన్నట్లు కనిపించవచ్చు. అయితే ఆయనAATel 397.1

    ప్రేమ పెద్దన్న ప్రేమ వంటిది. మనం ఆయనతో కలిసి ఉన్నంతకాలం ఆయన చేతిలో నుంచి మనల్ని ఎవ్వరూ లాక్కోలేరు. సంవత్సారాలు గతించే కొద్దీ విశ్వాసుల సంఖ్య పెరగటంతో సహోదరుల పట్ల మరెక్కువ శ్రద్ధాసక్తులతో యోహాను సేవ చేశాడు. అవి సంఘానికి ఎంతో అపాయకరమైన దినాలు. ఎక్కడ చూసినా సాతాను మోసాలే. అపోహలు అబద్దాలు ప్రచారం చేయటం ద్వారా సాతాను పరివారం క్రీస్తు సిద్ధాంతాలకు వ్యతిరేకతను సృష్టించి తద్వారా భేదాభిప్రాయాల్ని తప్పుడు సిద్ధాంతాల్ని ప్రబోధించి సంఘాన్ని నాశనం చెయ్యటానికి పూనుకున్నారు. క్రీస్తు అనుచర్లమని చెప్పుకొంటున్న కొందరు ఆజ్ఞల్ని ఆచరించాల్సిన విధిని క్రీస్తు ప్రేమ రద్దు చేస్తుందిని చెప్పటం మొదలు పెట్టారు. మరోపక్క యూదుల ఆచారాల్ని కర్మకాండను ఆచరించటం అవసరమని; క్రీస్తు రక్తాన్ని విశ్వసించకుండా కేవలం ధర్మశాస్త్రాన్ని ఆచరించటం రక్షణకు సరిపోతుందని బోధించటం మొదలు పెట్టారు. కొందరు క్రీస్తు మంచి వ్యక్తి అని నమ్మారు గాని ఆయన దేవుడు కాదన్నారు. దేవునికి నమ్మకంగా ఉన్నట్లు నటించిన కొందరు మోసగాళ్లు. నిజానికి వారు క్రీస్తును, సువార్తను నమ్మినవారు కారు. అతిక్రమంలో నివసిస్తూ వారు సంఘంలోకి తప్పుడు సిద్ధాంతాలు తెస్తున్నారు. ఇలా అనేకులు నాస్తిక బోధల్ని మోసాల్ని నమ్మనారంభించారు.AATel 397.2

    సంఘంలోకి ప్రవేశిస్తున్న విషపూరిత దోషాల్ని చూసి యోహాను తీవ్ర సంతాపం చెందాడు. సంఘం ముందున్న అపాయాల్ని చూశాడు. ఆ అత్యవసర పరిస్థితిని వెంటనే కృత నిశ్చయంతో ఎదుర్కొన్నాడు. యోహాను ఉత్తరాలు ప్రేమస్ఫూర్తితో నిండిన ఉత్తరాలు. అతడు ప్రేమలో కలంముంచి రాసినట్లు కనిపిస్తుంది. కాగా దైవధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నా పాపరహితంగా నివసిస్తున్నట్లు చెప్పుకునే వారిని కలిసినప్పుడు తమ భయంకర వంచనను గూర్చి వారిని హెచ్చరించటానికి వెనకాడలేదు.AATel 397.3

    సువార్త సేవలో మంచి పేరు పలుకుబడి ఉన్న ఓ సహాయకురాలికి రాస్తూ అతనిలా అన్నాడు: “యేసుక్రీస్తు శరీరధారయై వచ్చెనని యెప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరియున్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై యున్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. క్రీస్తు బోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు; ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీయొద్దకు వచ్చిన యెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును.”AATel 397.4

    దైవ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తూ జీవిస్తూనే తాము క్రీస్తులో ఉన్నామని చెప్పుకునే వారిని ప్రియశిష్యుడు యోహాను పరిగణించినట్లే పరిగణించటానికి మనకు అధికారముంది. తొలినాళ్ల సంఘాభివృద్ధిని కబళించటానికి సిద్ధమైన పరిస్థితుల్లాంటి పరిస్థితులే ఈనాడు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ అంశాలపై అపొస్తలుడు యోహాను బోధనల్ని జాగ్రత్తగా వాటించాలి. “మిలో ప్రేమ ఉండాలి” అన్న నినాదం అన్నిచోట్లా వినిపిస్తుంది. తాము పరిశుద్ధులమని చెప్పుకునేవారి నుంచి ప్రధానంగా ఈ నినాదం వస్తున్నది. అయితే యధార్థమైన ప్రేమ ఒప్పుకోలులోని పాపాన్ని తీసివేయలేనంత పవిత్రమైంది. క్రీస్తు ఏ ఆత్మలకోసం మరణించాడో వాటిని మనం ప్రేమించాల్ని ఉండగా మనం దుష్టత్యంతో రాజీపడకూడదు. తిరుగుబాటుదారులతో ఏకమయ్యి. దాన్ని ప్రేమ అనకూడదు. ఈ యుగంలోని మనం ఆత్మనాశనానికి దారితీసే అవరోధాల్ని వ్యతిరేకించటంలో యోహానుకుమల్లే నీతికి నిర్భయంగా నిలబడాలని దేవుడు కోరుతున్నాడు.AATel 398.1

    మనం క్రైస్తవ మర్యాద ప్రదర్శించాల్సి ఉండగా, పాపం విషయంలోను పాపుల విషయంలోను సూటిగా వ్యవహరించటం అవసరమని ఇది నిజమైన ప్రేమకు విరుద్ధం కాదని అపొస్తలుడు బోధిస్తున్నాడు. యోహానిలా రాస్తున్నాడు, “పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెనని మీకు తెలియును; ఆయన యందు పాపమేమియులేదు. ఆయన యందు నిలిచియుండువాడెవడును పాపము చేయడు. పాపము చేయువాడెవడును ఆయనను చూడనులేదు ఎరుగనులేదు.”AATel 398.2

    క్రీస్తుకు సాక్షిగా యోహాను వివాదానికి దిగలేదు. ఆయాసకరమైన వాదోపవాదాలు చెయ్యలేదు. తనకు ఏమి తెలిసిందో తాను ఏమి చూశాడో ఏమి విన్నాడో వాటినే వెల్లడిచేశాడు. అతడు క్రీస్తుతో సాన్నిహిత్యం కలిగి జీవించాడు. ఆయన బోధనలు విన్నాడు. ఆయన చేసిన అద్భుతాలు చూశాడు. క్రీస్తు ప్రవర్తన సౌందర్యాన్ని యోహాను చూసినంతగా ఎవరూ చూసి ఉండలేదు. అతనికి చీకటి గతించింది. అతనిమీద యధార్థమైన వెలుగు ప్రకాశించింది. రక్షకుని జీవిత మరణాల్ని గూర్చి అతని సాక్ష్యం స్పష్టంగా శక్తిమంతంగా ఉంది. రక్షకుని పట్ల ప్రేమతో నిండిన హృదయంతో అతడు మాట్లాడాడు. అతని మాటల్ని ఏ శక్తీ ఆపలేకపోయింది.AATel 398.3

    అతడు ఇలా ప్రకటించాడు, “జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది యుండేనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది నాకు తెలియచేయు చున్నాము... మాతోకూడ మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడను ఉన్నది.”AATel 399.1

    అలాగే ప్రతీ విశ్వాసి తన సొంత అనుభవం ద్వారా “దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర” వేయాల్సి ఉన్నాడు. యోహాను 3:33. క్రీస్తు శక్తిని గూర్చి తాను చూసిన విన్న అనుభవించిన దాన్ని గురించి సాక్ష్యమివ్వవచ్చు.AATel 399.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents