Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అపొస్తలుల కార్యాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    7—కపట వర్తనను గూర్చి హెచ్చరిక

    శిష్యులు సువార్త సత్యాల్సి యెరూషలేములో ప్రకటించినప్పుడు దేవుడు వారి మాటలకు శక్తినిచ్చాడు. వేలాది ప్రజలు విశ్వసించారు. యూదుమత దురభిమానులు అనేకమందిని తమ కుటుంబాలు స్నేహితులనుంచి వెంటనే వెలివేసివేరు చేశారు. వారికి భోజనం గృహవసతులు ఏర్పాటుచేయాల్సి వచ్చింది.AATel 51.1

    “వారిలో ఎవనికి కొదువలేకపోయెను” అని రికార్డు చెబుతున్నది. అవసరాన్ని ఎలా తీర్చారో కూడా రికార్డు తెలుపుతున్నది. అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కోడానికి డబ్బు ఆస్తి ఉన్న విశ్వాసులు వాటిని త్యాగం చేశారు. తమ ఇళ్లు లేదా పొలాలు అమ్మి ఆ డబ్బు తెచ్చి అపొస్తలుల పాదాలవద్ద పెడితే వారు “ప్రతివానికి వాని వాని అక్కరకొలది ఉదారత పంచి పెట్టిరి.AATel 51.2

    విశ్వాసులు ప్రదర్శించిన ఉదారత ఆత్మ కుమ్మరింపు ఫలితమే. సువార్తను విశ్వసించిన వారందరు ” ఏక హృదయమును ఏకాత్మయు గలవారైయుండిరి.” వారి ఉమ్మడి ఆసక్తి ఒకటే - తమకు అప్పగించబడ్డ కార్యం విజయవంతం కావడం. వారి జీవితాల్లో దురాశకు తావులేదు. తమ సహోదరులపట్ల, తాము పాటుపడున్న కార్యంపట్ల వారి ప్రేమ, డబ్బుమీద ఆస్తిమీద వారి ఆశ కన్నా అధికం. వారికి లోక భాగ్యంకన్నా మానవాత్మలు ఎక్కువ విలువైనవని వారి కార్యాలు చాటి చెబుతున్నాయి.AATel 51.3

    దేవుని ఆత్మ జీవితాన్ని అదుపు చేసినప్పుడు జీవితం సర్వదా ఇలాగే ఉంటుంది. క్రీస్తుపట్ల ప్రేమతో తమ హృదయాలు నింపుకొన్నవారు తన పేదరికం ద్వారా మనల్ని భాగ్యవంతులు చేయడానకి మన నిమిత్తం పేదవాడైన ప్రభువు ఆదర్శాన్ని అనుసరిస్తారు. డబ్బు, సమయం, ప్రభావం - దేవుని వద్ద నుంచి వచ్చే వరాలన్నిటినీ సువార్త సేవాభివృద్ధికి సాధనాలుగా మాత్రమే వారు పరిగణిస్తారు. తొలినాళ్ళ సంఘంలో ఇలాగే జరిగింది. ఈనాడు సంఘంలోవున్న సభ్యులు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తమ ఆశల్ని ఆసక్తుల్ని లోక విషయాల పై నుంచి తీసివేసుకొన్నట్లు, తమ తోటి మనుషులకు సువార్త అందేందుకు త్యాగాలకు సంసిద్ధంగా ఉన్నట్లు కనిపించినప్పుడు సంఘం ప్రకటించే సత్యాలు ప్రజలు మనసుల పై గొప్ప ప్రభావం ప్రసరిస్తాయి. ధారాళతలో విశ్వాసులు చూపించిన ఆదర్శానికి అననీయ సప్పీరాల ప్రవర్తన భిన్నంగా వున్నట్లు బయలుపడింది. ప్రవక్త వర్ణన ప్రకారం వారి అనుభవం తొలినాళ్ళ సంఘ చరిత్రలో మాయని మచ్చగా నిలిచింది. ఇతరులతోపాటు శిష్యులనిపించుకొంటున్న వీరుకూడా అపొస్తలులు ప్రకటించిన సువార్తను విన్నారు. అపొస్తలులు ప్రార్థించిన తర్వాత “వారు కూడియున్న చోటు కంపించెను. అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండి “నప్పుడు తక్కిన విశ్వాసులతో వారు కూడా ఉన్నారు. అ.కా. 4:31. అక్కడ ఉన్న వారందరికి దృఢమైన నమ్మకం ఏర్పడింది. తమ ఆస్తిని అమ్మి ఆడబ్బు ప్రభువుకి ఇస్తామని దేవుని ఆత్మ ప్రత్యక్ష ప్రభావం కింద అవనీయ సప్పీరాలు వాగ్దానం చేశారు.AATel 51.4

    దరిమిల, దురాశకు లొంగి అననీయ సప్పరాలు పరిశుద్దాత్మను దుఃఖ పెట్టారు. తమ తీర్మానం గురించి బాధపడడం మొదలు పెట్టారు. క్రీస్తు సేవాభివృద్ధికి గొప్ప కార్యాలు చేయాలన్న కోరికను పుట్టించిన శుభప్రదమైన ప్రభావం త్వరలో మాయమయ్యింది. తాము తొందరపడి వాగ్దానం నెరవేర్చకూడదని తీర్మనించు కొన్నారు. బీదలైన తమ సహోదరుల అవసరాలు తీర్చడానికి తమ ఆస్తుల్ని త్యాగం చేసినవారు గౌరవాభిమానాలు పొందడం వారు చూశారు. స్వార్థపరులైన తాము దేవునికి వాగ్దానం చేసింది. ఇవ్వడానికి బాధపడున్నట్లు సహవిశ్వాసులు తెలుసుకో కూడదని వారు తమ ఆస్తిని బహిరంగంగా అమ్మి ఆ డబ్బు సంఘ నిధికి ఇస్తున్నట్లు నటించి వాస్తవానికి అందులో ఎక్కువ మొత్తం అట్టి పెట్టుకోవాలని నిశ్చయించు కొన్నారు. ఇలా అందరితో కలిసి భోజన వసతి పొందవచ్చు సహవిశ్వాసుల ఆదరాభిమానాల్నీ పొందవచ్చు అని వారు ఊహించుకొన్నారు.AATel 52.1

    కపట వర్తన అబద్ద జీవితం అంటే దేవునికి హేయం. అననీయ సప్పీరాలు దేవునితో మోసపూరితంగా వ్యవహరించారు. పరిశుద్దాత్మకు అబద్ధం చెప్పారు. వారి పాపం తక్షణ భయంకర తీర్పుపొందింది. అననీయ తాను వాగ్దానం చేసిన ద్రవ్యంతో వచ్చినప్పుడు పేతురు ఇలా అన్నాడు “అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్దాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నపుడు నీదే గదా? అమ్మిన పిమ్మట అది నీ వశమైయుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్దమాడితివి.”AATel 52.2

    “అననీయ యీమాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినినవారికంద రికిని మిగుల భయము కలిగెను.AATel 52.3

    “అది నీ యొద్దనున్నప్పుడు నీదేగదా?” అన్నాడు పేతురు. ప్రజల ఉమ్మడి ప్రయోజనార్థం అననీయ తన ఆస్తిని అమ్మాలని ఎవరూ ఒత్తిడి చేయలేదు. అది అతని సొంత తీర్మానం. అయితే శిష్యుల్ని మోసగించడానికి ప్రయత్నించడంలో అతను దేవునితోనే అబద్ధమాడాడు.AATel 52.4

    “ఇంచుమించు మూడు గంటల సేపటికి వాని భార్య జరిగినది యెరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు - మీరు ఆ భూమిని యింతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె అవును ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు - ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనేయున్నవి; వారు నిన్నును మోసుకొనిపోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్దపడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమెను మోసికొనిపోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టిరి. సంఘమంతటికిని ఈ సంగతులు వినిన వారికందరికిని మిగుల భయము కలిగెను.”AATel 53.1

    ప్రారంభదశలో ఉన్న సంఘాన్ని నిరుత్సాహపడకుండా కాపాడేందుకు తన ఉగ్రతను ఈ విధంగా ప్రదర్శించడం అవసరమని సర్వజ్ఞాని అయిన దేవుడు ఉద్దేశించాడు. విశ్వాసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. విశ్వాసుల సంఖ్య వేగంగా పెరిగే కొద్దీ దేవునికి సేవ చేస్తున్నామని చెప్పుకొంటూ సిరిని కొలిచేవారు సంఘంలోకి చేరివుంటే సంఘం ఎంతో పెద్దదయ్యేదే. మనుషులు దేవుని కన్నుకప్పలేరని, హృదయంలో దాగి ఉన్న పాపాన్ని ఆయన కనుగొంటాడని ఆయనను ఎవరూ వెక్కిరించలేరని ఈ తీర్పు చాటి చెబుతున్నది. నటన, కపటవర్తన దేవున్ని దోచుకోడం వీటికి దూరంగా ఉండేందుకు సంఘానికి ఇది హెచ్చరికగా ఏర్పాటయ్యింది.AATel 53.2

    దురాశ, మోసం, కపటవర్తన పట్ల దేవుని ద్వేషానికి సాదృశ్యం అయిన ఈ ఉదంతం తొలినాళ్ళ సంఘానికే కాదు భవిష్యత్తులోని అన్ని తరాల ప్రజలకు ప్రమాద సూచికగా వస్తున్నది. అననీయ సప్పీరాలు పేరాశను మొదట ప్రేమించారు. దేవునికి వాగ్దానం చేసిన దానిలో కొంత తమకోసం అట్టిపెట్టుకోవాలన్న కోరిక వారిని మోసానికి కపట వర్తనకు నడిపించింది.AATel 53.3

    తన ప్రజల సేవతో దాతృత్వంతో సువార్త ప్రకటన కొనసాగాలన్నది దేవుని సంకల్పం. తన సేవకు స్వేచ్ఛార్పణలు దశమభాగాలు ప్రభువు ఏర్పాటు చేసి నిధులు. మానవుడికి తానిచ్చిన ఆదాయంలో దేవుడు ఒక భాగాన్ని కోరుతున్నాడు. అది పదవభాగం. ఇంతకన్నా ఎక్కువివ్వడమా లేదా అన్నది అందరూ స్వేచ్ఛగా ఆలోచించుకోవాల్సిన విషయం. అయితే పరిశుద్ధాత్మ ప్రేరణవల్ల హృదయంలో ఇవ్వాలన్న కోరిక పుట్టి కొంత మొత్తం ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు వాగ్దానం చేసిన వ్యక్తికి ఆ పరిశుద్ధ భాగంపై ఎలాంటి హక్కూలేదు. మానవుల మధ్య ఇలాంటి వాగ్దానాలు జరిగినప్పుడు వాటిని తప్పనిసరిగా గౌరవించాల్సివుంటుంది. దేవునితో చేసిన వాగ్దానాలు మరెక్కువ ఆచరణీయాలు కావా? మనస్సాక్షి న్యాయస్థానంలో విచారించే వాగ్దానాలు మనుషుల మధ్య రాతలో వున్న ఒప్పందాలకన్నా తీసిపోయాయా? అందుకు అవి తక్కువ ఆచరణీయాలా?AATel 53.4

    దేవుని వెలుగు అసాధారణ స్పష్టత తోను శక్తి తోను హృదయంలో ప్రకాశిస్తున్నప్పుడు స్వార్థం పట్టుసడలుతుంది. దేవుని సేవకు ఇవ్వాలన్న చిత్తవృత్తి ఏర్పడుంది. అప్పుడు తాము చేసిన వాగ్దానాల్ని సాతాను వ్యతిరేకించకుండా నెరవేర్చడం సాధ్యమవుతుందని ఎవరూ భావించనవసరం లేదు. భూమి పై రక్షకుని రాజ్యం స్థాపితం కావడం అతనికి సుతరామూ ఇష్టం లేదు. తాము వాగ్దానం చేసిన మొత్తం చాలా ఎక్కువని ఆస్తి సంపాదించుకోడానికి తాము చేస్తున్న ప్రయత్నాలకు ఇది గొడ్డలి పెట్టని లేదా తమ కుటుంబాల ఆశలు నెరవేర్చుకోడానికి ఇది ప్రతి బంధకమని సాతాను వారి చెవిలో ఊదుతాడు.AATel 54.1

    తన సేవ పురోగమించేందుకు తాము ఇచ్చే నిమిత్తం దేవుడు మనుషులకు ఆస్తినిస్తాడు. సూర్యరశ్మి వర్షం దేవుని ఈవులే. మొక్కలు ఏపుగా పెరిగేటట్లు చేసేవాడు ఆయనే. ఆరోగ్యాన్ని, ఆస్తి సంపాదనకు శక్తిని ఇచ్చేది ఆయనే. ధారాళంగా ఇచ్చే ఆయన చేతుల మీదుగానే మన దీవెనలన్నీ వస్తున్నాయి. తిరిగి కొద్ది భాగం దశమభాగాలు స్వేచ్చారణలు కృతజ్ఞతార్పణలు అపరాధార్పణల రూపంలో మనుషులు తనకు చెల్లించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు నిర్ణయించిన ఈ ప్రణాళిక ప్రకారం ఖజానాలోకి నిధులు వస్తే - ఆదాయమంతటిలో పదవభాగం, ధారాళ విరాళాలు - ప్రభువు సేవాభివృద్ధి కోసం నిధులు సమృద్ధిగా ఉంటాయి.AATel 54.2

    కాగా స్వార్థం వల్ల మానవుల హృదయాలు కఠినమవుతాయి. వారు అననీయ సప్పీరాలకు మల్లే అమ్మిన దానిలో కొంత భాగం ఉంచుకొని దేవుని విధుల్ని నెరవేర్చుతున్నట్లు నటిస్తారు. అనేకులు శరీరాశలు తీర్చుకోడానికి ద్రవ్యాన్ని దుబారాచేస్తారు. దేవుని సేవకు అంతంత మాత్రం కానుకలే ఇస్తారు. అది కూడా అయిష్టంగా. దేవుడు తమకు ఇచ్చిన ఆస్తిని వారు ఎలా ఉపయోగించారో ఒకనాడు ఖచ్చితమైన లెక్క అడుగుతాడని, అననీయ సప్పీరాలిచ్చిన డబ్బును అంగీకరించని రీతిగానే వారిచ్చే అరకొర కానుకల్ని దేవుడు అంగీకరించడని వారు మర్చిపోతారు.AATel 54.3

    కపటవర్తన మోసం అంటే దేవుడు ఎంతగా ద్వేషిస్తాడో అన్నది ఆ అబద్ధసాక్షులకు ఆయన ఇచ్చిన కఠిన శిక్షనుబట్టి గ్రహించవచ్చు. సొమ్మంతా ఇచ్చినట్లు నటించడం ద్వారా అననీయ సప్పీరాలు పరిశుద్ధాత్మతో అబద్ధమాడారు. పర్యవసానంగా వారు ఈ జీవితాన్ని రానున్న జీవితాన్ని పోగొట్టుకొన్నారు. వీరిని శిక్షించిన దేవుడే నేడు అన్ని రకాల అసత్యాన్ని ఖండిస్తున్నాడు. అబద్ధమాడే పెదవులు ఆయనకు హేయాలు. పరిశుద్ధ పట్టణంలో “నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైన దానిని అబద్దమైన దానిని జరిగించువాడైనను..... ప్రవేశింపడు” అని ఆయన ప్రకటిస్తున్నాడు. ప్రకటన 21:27. సత్యాన్ని పలకడం గట్టిగా చేపట్టండి. సత్యవచనం జీవితంలో అంతర్భాగం కానీయండి. సత్యంతో దోబూచులాడడం, ఒకడు తన స్వార్థానికి అనుకూలంగా సత్యాన్ని మలుచుకోడం అంటే విశ్వాసాన్ని విచ్ఛిన్నం చేసుకోడమే. “నా నడుమునకు సత్యమను దట్టికట్టుకొని.... నిలువబడుడి.” ఎఫెసీ 6:14. అబద్దాలాడేవాడు తన ఆత్మను చౌకబజారులో అమ్మేవాడు. అతడి అబద్దాలు అత్యవసర పరిస్థితిలో చెలామణి కావచ్చు. సత్యవర్తన ద్వారా సంపాదించలేనిది అసత్య వ్యాపారం ద్వారా అతను సంపాదించవచ్చు. చివరికి ఎవరినీ నమ్మలేని పరిస్థితికి అతను చేరుకుంటాడు. అబద్ధికుడైన తాను ఇతరుల మాటలు నమ్మలేకుండా ఉంటాడు.AATel 54.4

    అననీయ సప్పీరాల విషయంలో దేవునికి వ్యతిరేకంగా చేసిన మోసానికి వెంటనే శిక్షపడింది. అదే పాపం తర్వాతి సంఘచరిత్రలో పదే పదే జరిగింది. మన దినాల్లో కూడా అనేకులు ఈ పాపానికి పాల్పడుతున్నారు. దాని విషయంలో దేవుని ద్వేషం మనకు కనిపించే విధంగా ప్రదర్శితం కాకపోయినస్పటికీ ఆయన దృష్టిలో అది అపొస్తలుల కాలంలో ఎంత హేయమో నేడూ అంతే హేయం. హెచ్చరిక చేయడం జరిగింది. ఈ పాపం పట్ల దేవుడు తన ద్వేషాన్ని ప్రదర్శించాడు. కపటవర్తనకు దురాశకు దాసులైన వారందరూ తమ ఆత్మలను. నాశనం చేసుకొంటున్నారన్నిది వాస్తవం.AATel 55.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents