Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    సత్యం తాలూకు విజయం

    దైవ ధర్మశాస్త్ర విధుల్ని నాస్తికత్వం ఎగతాళి చేసి ఉపేక్షించవచ్చు. ఐహిక స్వభావం అనేకమందిని మలినపర్చి కొద్ది మందిని నియంత్రించవచ్చు. గొప్ప శ్రమవల్ల నిత్యత్యాగం వల్ల మాత్రమే దేవుని సేవ దాని స్థానాన్ని నిలుపుకోవచ్చు. తుదకు సత్యం మహిమాన్వితంగా విజయం సాధిస్తుంది. ప్రోఫెట్స్ అండ్ కింగ్స్, పు. 186.ChSTel 192.3

    లోకంలో దేవుని సేవ అంతిమ దశలో ఆయన ధర్మశాస్త్ర ప్రమాణం మళ్లీ ఘనపర్చబడుతుంది. తప్పుడు మతం ప్రబలవచ్చు. దుర్నీతి పెచ్చరిల్లవచ్చు. అనే కుల ప్రేమ చల్లారవచ్చు. కల్వరి సిలువ కనుమరుగవ్వవచ్చు. చీకటి మరణ పరదాలా లోకాన్ని కప్పవచ్చు. ప్రజా ప్రవాహ శక్తి అంతా సత్యానికి ఎదురు తిరగవచ్చు. దైవ ప్రజల్ని కూలదోయ్యటానికి కుట్రమిద కుట్ర జరగవచ్చు. కాని గొప్ప ప్రమాదం ఏర్పడ్డ సమయంలో ఏలీయా దేవుడు వర్తమానాన్ని ప్రకటించటానికి మానవ ప్రతినిధుల్ని లేపుతాడు. ఆ వర్తమాన్ని ఎవరూ ఆపలేరు. దేశంలో ఎక్కడ మనుషులు సర్వోన్నతునికి వ్యతిరేకంగా మాట్లాడటంలో మితిమిర్తారో జన సంఖ్య ఎక్కువగా ఉన్న ఆ పెద్ద పెద్ద నగరాల్లో తీవ్ర మందలింపు స్వరం వినిపిస్తుంది. దేవుడు నియమించిన మనుషులు సంఘం లోకంతో సంయుక్తమవ్వటాన్ని ధైర్యంగా ఖండిస్తారు. మానవ కల్పిత వ్యవస్థ అయిన ఆదివారాచరణ నుంచి యధార్థ సబ్బాతును ఆచరించాల్సిందిగా పురుషులకు స్త్రీలకు వారు చిత్తశుద్ధితో పిలుపు నిస్తారు. ప్రొఫెట్స్ అండ్ కింగ్స్, పు. 186, 187.ChSTel 192.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents