Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఉన్నత ప్రమాణాల కొనసాగింపు

    ఉన్నత సేవ నిర్వహించగల సమర్థత అర్హత గల అనేకులు కొంచెమే సాధించటానికి కారణం వారు కొంచెమే ప్రయత్నించటం. జీవితంలో సాధించాల్సిన గురి, చేరాల్సిన ఉన్నత ప్రమాణం లేనట్లు వేల ప్రజలు జీవితాల్ని వెళ్లదీస్తుంటారు. దీనికి ఓ కారణం తమను గూర్చి తాము తక్కువ అంచనా వేసుకోటం. క్రీస్తు మనకోసం అపార మూల్యం చెల్లించాడు. తాను చెల్లించిన మూల్యం ప్రకారం మనం మన విలువను గుర్తించాలని ఆయన అభిలషిస్తున్నాడు. గాస్ పుల్ వర్కర్స్, పు. 291. ChSTel 279.3

    యేసు ఈ లోకంలో తన జీవితమంతా శద్ధాసక్తులతో నిత్యం పని చేశాడు. ఎక్కువ ఆశించాడు గనుక ఎక్కువ కృషి చేశాడు. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 72.ChSTel 279.4

    సంపాదించాలని అనేకులు ఇంకా యోచించని అనుభవం కన్నా ఉన్నతమైన, లోతైన, విశాలమైన అనుభవం ప్రభువు సేవలో పనిచేస్తున్న వారికి అవసరం. ఇప్పటికే దేవుని కుటుంబంలో సభ్యులైన వారిలో అనేకమందికి ఆయన మహిమను వీక్షించటమంటే ఏంటో, మహిమ నుంచి అధిక మహిమకు మార్చబడటమంటే ఏంటో తెలియదు. అనేకులకి క్రీస్తు ఔనత్యాన్ని గూర్చి సంధ్య వెలుగు అవగాహన మాత్రమే ఉంది. అయినా వారి హృదయాలు అమితానందంతో నిండి ఉన్నాయి. రక్షకుని ప్రేమను గూర్చి మరెక్కువ సంపూర్ణమైన, మరెక్కువ లోతైన జ్ఞానం కోసం వారు ఆశిస్తున్నారు. దేవుని గూర్చి ఆత్మకున్న ప్రతీ కోరిక వారికి ఉంది. గాస్ఫుల్ వర్కర్స్, పు. 274ChSTel 279.5

    మన వాక్యపరిచారకులు వైద్యులు ఉపాధ్యాయులు ఇంకా ఇతర శాఖల్లో ప్రభువు సేవ చేస్తున్న వారికి నేను అందించాల్సిన వర్తమానం ఉంది. ఉన్నత ప్రమాణాన్ని చేరటానికి మీరింకా పైకి రావాలని ప్రభువు కోర్తున్నాడు. మీరింకా లోతైన అనుభవం పొందాలి. ఇప్పటికే దేవుని కుటుంబంలో సభ్యులైనవారిలో అనేకమందికి ఆయన మహిమను వీక్షించటమంటే ఏంటో, మహిమనుంచి అధిక మహిమ కు మార్చబడటమంటే ఏంటో తెలియదు. మీలో అనేకులకి క్రీస్తు ఔన్నత్యాన్ని గూర్చి సంధ్య వెలుగు అవగాహన మాత్రమే ఉంది. అయినా మీ హృదయాలు అమితానందంతో నిండి ఉన్నాయి. రక్షకుని ప్రేమను గూర్చి మరెక్కువ సంపూర్ణమైన, మరెక్కువ లోతైన, జ్ఞానం కోసం మీరు ఆశిస్తున్నారు. మీకు తృప్తి లేదు. కాని నిస్పృహ చెందకండి. క్రీస్తుకి మా ఉత్తమ, అతి పవిత్ర ప్రేమను అర్పించండి. ప్రతీ వెలుగు కిరణాన్ని దాచుకోండి. ఆత్మకు దేవుని పట్ల గల ప్రతీ కోరికను మనసులో దాచుకోండి. ఆధ్యాత్మిక ఆలోచనల సంస్కృతిని పరిశుద్ద సమావేశాల మేలును పొందండి. ఆయన మహిమ ఉదయ కాంతి కిరాణాల్ని మీరు చూశారు. ప్రభువుని తెలసుకోటానికి మీరు ఆయన్ని వెంబడిస్తుంటే, ఉదయం తప్పక వచ్చేరీతిగా ఆయన ఉదయిస్తాడని తెలుసుకుంటారు. “నీతిమంతుడి మార్గం ఉదయ కాంతిలా ఉండి, పూర్ణ దినం వరకు ఇంతలంతలుగా ప్రకాశిస్తుంది.” మనం మన పాపాల నిమిత్తం పశ్చాత్తాపపడి, వాటిని ఒప్పుకుని క్షమాపణ పొందిన తర్వాత, పరిపూర్ణ సువార్త విశ్వాసంతో పూర్ణ దినానికి వచ్చే వరకు క్రీస్తుని గూర్చి నేర్చుకోటం కొనసాగించాలి. టెస్టిమొనీస్, సం. 8, పులు. 317, 318.ChSTel 280.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents