Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    మసకబారిన ఆధ్యాత్మిక వివేకం

    సంఘం క్రీస్తు నియమాలననుసరించి పని చెయ్యటం అలక్ష్యం చేస్తున్నందువల్ల కలిగే ఫలితం మనకు లోకంలో మాత్రమే కనిపించటం లేదు. ఈ అలక్ష్యం వల్ల సంఘంలో ఏర్పడున్న పరిస్థితులు దేవుని సేవ తాలూకు ఉన్నతమైన పరిశుద్ధమైన ఆసక్తుల్ని మరుగుపర్చుతున్నాయి. తప్పుపట్టే స్వభావం ద్వేషించే మనస్తత్వం సంఘంలోకి ప్రవేశిస్తున్నాయి. అనేకుల్లో ఆధ్యాత్మిక వివేకం మసకబారుతున్నది. పర్యవసానంగా క్రీస్తు సేవకు గొప్ప నష్టం కలుగుతున్నది. టెస్టిమొనీస్, సం.6, పు. 297.ChSTel 38.3

    ఓ జనాంగంగా మన పరిస్థితిని గురించి తలంచినప్పుడు నాకు విచారం కలుగుతుంది. ప్రభువు మనకు పరలోకాన్ని మూసివెయ్యడు. కాని మన ఎడతెగని విశ్వాసఘాతుకత మనల్ని దేవునినుంచి వేరుచేస్తున్నది. గర్వం, దురాశ, లోకాశ, బహిష్కరణ లేదా శిక్షా భయం లేకుండా మన హృదయాల్లో కొనసాగుతున్నాయి. మనలో ఘోరపాపాలు, దురభిమాన పాపాలు కొనసాగుతున్నాయి. అయినా సంఘం వర్థిల్లుతున్నదని, సమాధానం ఆధ్యాత్మికత పెంపారుతున్నాయన్న సామాన్యాభిప్రాయం ఉన్నది. సంఘం తన నాయకుడైన క్రీస్తును వెంబడించటం మాని క్రమక్రమంగా వెనుదిరిగి ఐగుపు దిశగా నడుస్తున్నది. అయినా తమలోని ఆధ్యాత్మిక శక్తి లోపానికి ఆందోళన చెందేవారుగాని ఆశ్చర్యపడేవారుగాని ఎవరూలేరు. దైవాత్మ సాక్ష్యాల్ని సందేహించటం, నమ్మకపోటం అన్న పులిసిన పిండి అన్నిచోట్ల మన సంఘాల్ని భ్రష్టం చేస్తున్నది. ఇదే సాతానుకి కావలసింది. టెస్టిమొనీస్, సం.5, పు. 217.ChSTel 39.1