Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ప్రభావవంతమైన దృశ్యం

    రాత్రి దర్శనాల్లో నా ముందునుంచి ఓ ప్రభావవంతమైన దృశ్యం జరిగిపోయింది. అందమైన కొన్ని భవనాల మధ్య బ్రహ్మాండమైన ఓ అగ్నిగోళం పడటం చూశాను. ఆ భవనాలు వెంటనే దగ్గమై నాశనమయ్యాయి. ఒకరు ఇలా అనటం విన్నాను. “దేవుని తీర్పులు లోకం మీదికి వస్తున్నాయని మాకు తెలుసు, కాని అవి ఇంత త్వరగా వస్తాయని తెలియదు.” ఇతరులు వేదనతో నిండిన స్వరాలతో ఇలా అన్నారు, “మీకు తెలుసుగదా! మరి మాకెందుకు చెప్పలేదు? వీటి గురించి మాకేమి తెలియదే!” ప్రతీచోటా ఇలాంటి నిందా వాక్కులే నాకు వినిపించాయి.ChSTel 128.2

    గొప్ప దుఃఖంలో నేను మేల్కొన్నాను. నేను మళ్లీ నిద్రపోయాను. నేనో బ్రహ్మాండమైన సమావేశంలో ఉన్నట్లు అనిపించింది. ఒకరు ఆ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడ్తున్నాడు. అతడి ముందు ప్రపంచపటం తెరవబడి ఉంది. అది సాగుచెయ్యాల్సి ఉన్న దేవుని ద్రాక్షతోటను సూచిస్తున్నదని అతడన్నాడు. ఒక వ్యక్తికి పరలోకం నుంచి వెలుగు ప్రకాశించే కొద్దీ అతడు ఆ వెలుగును ఇతరులికి ప్రతిబింబించాలి. అనేక చోట్ల దీపాల్ని వెలిగించాల్సి ఉంది. ఈ దీపాల నుంచి ఇంకా ఇతర దీపాల్ని వెలిగించాల్సి ఉంది.ChSTel 128.3

    ప్రభువిలా అన్నాడు, “మీరు లోకమునకు ఉప్పయియున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగైయున్నారు. కొండ మీద నుండు పట్టణము మరుగై యుండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండువారి కందరికి వెలుగు నిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్కియలు చూచి పరలోకమందున్న మా తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మి వెలుగు ప్రకాశింపనియ్యుడి.” మత్తయి 5:13-16. ChSTel 129.1

    భూమి మీద పట్టణాలు, గ్రామాల నుంచి ధనికులున్న స్థలాలనుంచి పేదలున్న స్థలాలనుంచి తేజోవంతమైన వెలుగు ప్రకాశించటం నేను చూశాను. ప్రజలు దైవవాక్యానికి విధేయులయ్యారు. ఫలితంగా ప్రతీ నగరంలోను ప్రతీ గ్రామంలోను ప్రభువుకి మందిరాలు వెలశాయి. ఆయన సత్యం లోకమంతటా ప్రచురితమయ్యింది. టెస్టిమొనీస్, సం.9, పులు. 28, 29. ChSTel 129.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents