Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    చెల్లింపు పొందిన సేవ

    ప్రభువు వచ్చినప్పుడు ప్రతీ తలాంతును పరీక్షిస్తాడు. ఆయన అప్పగించిన మూలధనం పై వడ్డీ డిమాండు చేస్తాడు. తాను పొందిన పరాభవం హృదయవేదన, తన శ్రమ జీవితం సిగ్గుకరమైన మరణం ద్వారా క్రీస్తు తన నామం ధరించి తన సేవకులమని చెప్పేవారి సేవకు జీతం చెల్లిస్తున్నాడు. టెస్టిమొనీస్, సం.9, పు. 104.ChSTel 125.1

    ఆయనకు ఆత్మల్ని సంపాదించే సేవలో ప్రతీ సమర్థతను అభివృద్ధి పర్చుకోవలసిన గంభీర బాధ్యత అందరి మీద ఉంది. “మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టి కొనబడినవారు.” కనుక పాపం నుంచి నీతికి పురుషుల్ని స్త్రీలని నడిపించే సేవా జీవితం ద్వారా దేవున్ని మహిమ పర్చండి అంటున్నాడాయన. క్రీస్తు తన ప్రాణాన్ని మూల్యంగా చెల్లించి మనల్ని కొన్నాడు. దేవునికి చెందినదాన్ని నమ్మకమైన సేవ ద్వారా ఆయనకు మనం తిరిగి ఇచ్చేందుకు క్రీస్తు మనల్ని కొన్నాడు. టెస్టిమొనీస్, సం.9, పు. 104ChSTel 125.2

    తన ప్రజలకు అందించటానికి దేవుడు నాకోవర్తమానం ఇచ్చాడు. వారు మేల్కొని, డేరాలు వేసుకుని, తమ సరిహద్దుల్ని విశాలం చేసుకోవాలి. నా సోదర సోదరీలారా, మీరు విలువ పెట్టి కొనబడ్డవారు. మాతో సహా మీకున్న సమస్తం దేవుని మహిమార్ధం మీ తోటి మనుషుల మేలుకోసం మీరు ఉపయోగించాలి. లోకం పాపంలో మరణించకుండా ఉండేందుకు క్రీస్తు సిలువపై మరణించాడు. ఈ సేవలో మీ సహకారాన్ని ఆయన కోరుతున్నాడు. ఆయనకి మీరు చెయ్యూత అందించాలి. నశించిపోతున్న వారిని రక్షించటానికి అలసిపోకుండా మీరు చిత్తశుద్ధితో కృషి చెయ్యాలి. మా పాపాలవల్ల క్రీస్తు సిలువ మరణం పొందటం అవసరమయ్యిందని గుర్తుంచుకోండి. టెస్టిమొనీస్, సం.7, పు.9. ChSTel 125.3

    క్రీస్తు అనుచరులు సేవ నిమిత్తం రక్షణ పొందుతున్నారు. జీవిత పరమావధి పరిచర్య అని మన ప్రభువు బోధిస్తున్నాడు. స్వయాన క్రీస్తే పనిచేశాడు. తన శిష్యులందరికీ సేవా చట్టాన్నిచ్చాడు - దేవునికి సాటి మనుషులకు సేవ... ఈ సేవా చట్టం మనల్ని దేవుని తోను సాటి మనుషులతోను బంధించే సంబంధమౌతుంది. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 326.ChSTel 126.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents