Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    మనోహరమైన కల

    సెప్టెంబరు 29, 1886లో నాకు వచ్చిన కలలో బెర్రీ పండ్ల కోసం వెళ్లే ఓ పెద్ద జనుల గుంపుతో నేను నడుస్తున్నాను. ఆ గుంపులో చాలా మంది యువకులు యువతులు ఉన్నారు. వారు పండ్లు పోగుచెయ్యటంలో సహాయం చెయ్యాల్సి ఉంది. మేము ఓ పెద్ద నగరంలో ఉన్నట్లు కనిపించింది. ఎందుకంటే అక్కడ ఖాళీ స్థలం ఎక్కువ లేదు. కాని నగరం చుట్టూ పొలాలు, అందమైన వనాలు, కూరగాయల తోటలు ఉన్నాయి. మా గుంపుకి ఆహారపదార్థాలతో నిండిన ఓ పెద్ద వ్యాగన్ మా ముందు వెళ్తున్నది.ChSTel 47.3

    కొద్దిసేపైన తర్వాత వ్యాగన్ ఆగింది. పండ్లు వెతకటానికి గుంపు చెల్లా చెదురయ్యింది. వ్యాగన్ చుట్టూ అందమైన పెద్ద పెద్ద బెర్రీ పండ్లతో పొడుగాటివి పొట్టివి అయిన బెర్రీ పళ్ల మొక్కలున్నాయి. కాని ఆ గుంపు వీటిని చూడకుండా పండ్లకోసం దూరంగా చూస్తుంది. నేను దగ్గరగా ఉన్న పండ్లను పొగుచేసుకోవటం మొదలు పెట్టాను. ఒకే గుత్తిలో పచ్చికాయలు పండ్లు కలిసి ఉన్నందువల్ల పచ్చికాయల్ని కోస్తానేమో అన్న భయంతో నేను జాగ్రత్తగా పండ్లు ఏరి కోస్తున్నాను.ChSTel 48.1

    పెద్ద పెద్ద బెర్రీ పండ్లు కొన్ని నేల మీద పడగా సగం పురుగులు కీటకాలు తినేశాయి. “అయ్యో! ఈ తోటలోకి ఇంతకన్నా ముందు ప్రవేశించి ఉంటే ఈ పండ్లన్నింటినీ కాపాడగలిగే దాన్ని, కాని ఇప్పుడు చాలా ఆలస్యమయ్యింది. అయినా, వీటిని ఏరి వీటిలో ఏమైన మంచి ఉన్నదేమో చూస్తాను. ఒక వేళ బెర్రీ అంతాచెడిపోయినా, ఆలస్యం చెయ్యకుండా ఉండి ఉంటే తాము ఏమి కనుక్కొని ఉండే వారో సహోదరునికి కనీసం చూపించగలగుతాను” అనుకున్నాను. .ChSTel 48.2

    సరిగా అప్పుడే గుంపులోని ఇద్దరు లేక ముగ్గురు నేనున్న చోటుకి వచ్చారు. వారు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఇంకెవరినీ పట్టించుకోటం లేదు. నన్ను చూసి, “అన్ని చోట్లా వెదికాంగాని మాకు పండ్లు కనిపించలేదు” అన్నారు. నేను కోసిన పండ్లు చూసి వారు విస్మయం చెందారు. “కోసుకోటానికి ఈ పళ్లమొక్కల పై చాలా పండ్లున్నాయి” అన్నాను. వారు కొయ్యటం మొదలు పెట్టారు, కాని “ఇక్కడ మేము కోసుకోటం సరికాదు; ఈ స్థలం నీవు కనుక్కున్నావు కనుక ఈ పండ్లు నీవి” అంటూ కాసేపటిలోనే కొయ్యటం మానేశారు. “పరవాలేదు. పండ్లు ఎక్కడున్నా కోసుకోండి. ఇది దేవుని తోట. ఇవి ఆయన బెర్రీపండ్లు వీటిని కోసుకోటం మీ ఆధిక్యత” అన్నాను.ChSTel 48.3

    నేను మళ్లీ ఒంటరిగా ఉన్నట్లు కనిపించింది. వ్యాగన్ వద్ద పదేపదే మాట్లాడుకోటం నవ్వుకోటం వినిపించింది. “ఏం చేస్తున్నారు?” అని అక్కడున్న వారిని ప్రశ్నించాను. “మాకు పండ్లు ఏమి దొరకలేదు. మేము అలసిపోయాం, ఆకలిగా ఉన్నాం. భోజనం తీసుకుందామని వ్యాగన్ వద్దకు వచ్చాం. కాసేపు విశ్రమించాక మళ్లీ పండ్లకోసం వెళ్తాం” అని వారు బదులు పలికారు.ChSTel 48.4

    అందుకు నేనిలా అన్నాను, “ఇప్పటిదాకా మీరేమి తీసుకురాలేదు. ఏమి ఇవ్వకుండా మీరు మన భత్యాలన్నీ తినేస్తున్నారు. కోయాల్సిన పండ్లు చాలా ఉన్నాయి. మీకు పండ్లు ఎందుకు కనిపించలేదంటే మీరు జాగ్రత్తగా వెదక లేదు. నిజమే, మీరు చేతులనిండా అందుకుని కొయ్యలేరు. పచ్చికాయలతో కలిసి ఉన్న పండ్లను జాగ్రత్తగా ఏరి కొయ్యాలి. మీకు నచ్చిన పండ్లు దొరుకుతాయి.”ChSTel 49.1

    నా చిన్న బుట్ట పండ్లతో నిండింది. దాన్ని వ్యాగన్ వద్దకు తీసుకువెళ్లి ఇలా అన్నాను, “నేను కోసిన ఈ పండ్లు చాలా చక్కనివి. మీరు దూరంగా వెళ్లి వ్యర్థంగా పండ్ల కోసం వెతుకుతుండగా నేను వీటిని ఈ పరిసరంలోనే కోశాను.”ChSTel 49.2

    అప్పుడు నా పండ్లు చూట్టానికి అందరూ వచ్చారు. “ఇవి పెద్ద మొక్కల్ని పండిన బెర్రీ పండ్లు. బలమైనవి మంచివి. పెద్ద కొమ్మల పై పండ్లు దొరుకుతాయని మేము అనుకోలేదు. అందుకు తక్కువ ఎత్తులో ఉన్న కొమ్మల పండ్లకోసం వెతికాం. ఇలాంటివి మాకు బహు తక్కువగా దొరికాయి.” అన్నారు.ChSTel 49.3

    అప్పుడు నేనన్నాను, “ఈ పండ్లను జాగ్రత్త పెట్టి, పై కొమ్మల్ని ఎక్కువ పండ్లు వెతకటానికి నాతో వస్తారా?” అయితే పండ్లను జాగ్రత్త పెట్టటానికి వారు ఏర్పాట్లేమి చెయ్యలేదు. పాత్రలు సంచులు సమృద్ధిగా ఉన్నాయి. వాటిని భోజనం ఉంచటానికి వినియోగించుకున్నారు. నేను వేచి వేచి అలసిపోయి చివరికి ఇలా ప్రశ్నించాను, “మీరు పండ్లు కొయ్యటానికి రాలేదు? వస్తే వాటిని భద్రపర్చటానికి ఎందుకు సిద్దంగాలేరు?”ChSTel 49.4

    ఒకరు ఇచ్చిన సమాధానం ఇది, “సహోదరి వైట్, అనేకమైన గృహాలున్నచోట, ఎన్నో కార్యకలాపాలు సాగుతున్న చోట పండ్లుంటాయని మేము అనుకోలేదు. కానీ నీవు పండ్లు పోగుచెయ్యటానికి ఆతురతగా ఉన్నావు గనుక నీతో రావటానికి మేము నిశ్చయించుకున్నాం. తినటానికి సరిపోయినంత ఆహారం తెచ్చుకుని వినోదాల్లో సమయం గడుపుతూ పండ్లు దొరకకపోయినా ఆనందించాలని భావించాం.”ChSTel 49.5

    నేనిలా సమాధానమిచ్చాను, “ఇలాంటి పని నాకు సపిపడదు. మళ్లీ ఆ పండ్ల మొక్కల వద్దకు ఇప్పుడే వెళ్తాను. దినమంతా దాదాపు గడిచిపోయింది. కొద్దిక్షణాల్లో చీకటి పడుతుంది. అప్పుడు మనం పండ్లు పోగుచెయ్యలేం.” కొందరు నాతో వచ్చారు. ఇతరులు తినటానికి వ్యాగన్ పక్కనే ఉండిపోయారు. ChSTel 50.1

    ఒక చోట ఓ చిన్న గుంపుకూడి తమ కెంతో ఆసక్తికరమైన ఓ విషయాన్ని గూర్చి మాట్లాడుకుంటున్నారు. నేను వారి దగ్గరకు వెళ్లగా ఓ స్త్రీ చేతుల్లో ఉన్న ఓ చిన్నబిడ్డ వారిని ఆకట్టుకున్నట్లు గమనించాను. “మాకు అతి కొంచెం సమయం మాత్రమే ఉంది గనుక మీరు చెయ్యగలిగిన పని చెయ్యటం మంచిది” అని వారితో అన్నాను.ChSTel 50.2

    వ్యాగన్ వద్దకు పరుగు పందెంలో ఉన్న ఓయువకుడు ఓ యువతి అనేకుల గమనాన్ని ఆకర్షించారు. దీన్ని చేరిన తర్వాత వారు బాగా అలసిపోయినందువల్ల కూర్చుని విశ్రమించాల్సివచ్చింది. ఇతరులు కూడ గడ్డి పై పడి విశ్రాంతి తీసుకున్నారు.ChSTel 50.3

    ఈ రకంగా దినం గడిచింది. జరిగిన పనిమాత్రం ఏమంతలేదు. చివరికి నేనిలా అన్నాను, “సోదరులారా, దీన్ని మీరు నిష్పల దండయాత్ర అంటారు. మీరు పనిచేసే తీరు ఇదే అయితే, మీ వైఫల్యానికి నేను ఆశ్చర్యపడను. మీ జయాపజయాలు మీరు పనిని చేపట్టే తీరుమీద ఆధారపడి ఉంటాయి. ఇక్కడ బెర్రీపండ్లున్నాయి. ఎందుకంటే నేను వాటిని కోశాను. మిలో కొందరు వాటికోసం కింద కొమ్మల పై వ్యర్థంగా వెదకుతున్నారు. ఇతరులికి కొన్ని పండ్లు దొరికాయి. కాని పై కొమ్మల్ని ఎవరూ వెదకకుండా విడిచి పెట్టారు. కారణం ఏంటంటే వాటి పై పండ్లుంటాయని మీరు తలంచలేదు. నేను కోసిన పండ్లు మీరు చూస్తున్నట్లు పెద్దవి, పండినవి. కొద్దికాలంలో ఇతర బెర్రీలు పండుతాయి. అప్పుడు మళ్లీ ఆ మొక్కల నుంచి పండ్లు కొయ్యవచ్చు. ఇలాగే పండ్లు పోగుచెయ్యటం నేను నేర్చుకున్నాను. మీరు వ్యాగన్ కి సమీపంలో వెదకి ఉంటే మీరూ నాకులాగే పండ్లు కనుక్కునేవారు.ChSTel 50.4

    “ఈ పని ఎలా చెయ్యాలో నేర్చుకుంటున్నవారు ఈ రోజు మీరిచ్చిన పాఠాన్ని అనుకరిస్తారు. ప్రభువు ఈ పండ్ల మొక్కల్ని భారీ జన సంఖ్యగల ఈ స్థలాల నడుమ పెట్టాడు. ఆ పండ్లను మీరు కనుక్కోవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. కాని మీరు తినటంలోను వినోదాల్లో ఆనందించటంలోను తలమునకలై ఉన్నారు. పండ్లు కనుక్కోవాలన్న దృఢ సంకల్పంతో మీరు పొలంలోకి రాలేదు.ChSTel 51.1

    “మీరు ఇకనుంచి మరింత ఉత్సాహంతోను మరింత చిత్తశుద్ధితోను, పూర్తిగా భిన్నమైన ధ్యేయంతోను పనిచెయ్యాలి. లేకపోతే మీ కృషి ఎన్నడూ ఫలించదు. సరియైన మార్గంలో పని చెయ్యటంలో, తినటం వినోదాల్లో ఆనందించటంలో ఎక్కువ ప్రాముఖ్యంలేని విషయాలని మీరు యువతరం పనివారికి నేర్పుతారు. ఆహార సరఫరాల వ్యాగన్ ఇక్కడికి తీసుకురావటానికి ఎంతో కష్టపడాలి కాని మీరు భోజన పదార్థాల గురించి ఎక్కువ ఆలోచించారు. మీ కృషికి ఫలితంగా ఇంటికి తీసుకు వెళ్లాల్సిన పండ్లను గురించి మీరు ఏమంత ఆలోచించలేదు. ముందు మీ సమీపంలో ఉన్న బెర్రీ పండ్లను కోసి ఆ మిదట దూరంలో ఉన్న పండ్లను వెదకాలి. ఆ తర్వాత తిరిగివచ్చి మళ్లీ సమీపంలో పనిచెయ్యాలి. మీరు ఇలా విజయవంతంగా పనిచెయ్యవచ్చు”. గాస్ పుల్ వర్కర్స్, పులు. 136-139.ChSTel 51.2