Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అసంబద్ధమైన సాకులు

    యేసు వెళ్లిపోయేటప్పుడు, ప్రతీ మనిషికి తన పనినిచ్చాడు. “చెయ్యటానికి ఏమిలేదు” అన్నది అసంబద్దమైన నెపం. “చెయ్యటానికి ఏమిలేదు” అన్నది సహోదరులు శ్రమలకు గురి అవ్వటానికి కారణమవుతున్నది. ఎందువలనంటే, సోమరి మనసుల్ని సాతాను ప్రణాళికలతో నింపి వాటికి పని పురమాయిస్తాడు... “చెయ్యటానికి ఏమిలేదు” అన్నది సహోదరులకు వ్యతిరేకంగా అబద్ధ సాక్షాన్ని తెస్తుంది. క్రీస్తు సంఘంలోకి భేదాభిప్రాయాలు తగవులు తెస్తుంది. యేసంటున్నాడు, “నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు.” రివ్యూ అండ్ హెరాల్డ్, మార్చి 13, 1888. ChSTel 123.5

    సోదరసోదరీలారా, ఇతరులకోసం పని చెయ్యటానికి శక్తిలేదంటూ సాకు చెప్పి మాలో చాలా మంది పని తప్పించుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని అంత శక్తి హీనులుగా సృజించాడా? ఈ శక్తి హీనత మా సోమరితనం వల్ల పుట్టి మీ ఉద్దేశపూర్వక ఎంపిక ద్వారా కొనసాగటంలేదా? మా సొంత సుఖానికి, సంతుష్టికి కాక, ఆయన కోసం వృద్ధి పర్చటానికి దేవుడు మీకు కనీసం ఒక్క తలాంతునైనా ఇవ్వలేదా? తన సేవకుడుగా ఆయన మాకు అప్పగించిన మూలధనాన్ని తెలివిగా, నైపుణ్యంతో ఉపయోగించటం ద్వారా ఆదాయం తేవాల్సిన విధిని గుర్తిస్తున్నారా? ఈ కోణంలో చూస్తూ మీరు మీ శక్తుల్ని వృద్ధి పర్చుకోటానికి ఉన్న అవకాశాల్ని నిర్లక్ష్యం చెయ్యటం లేదా? దేవుని పట్ల తమ బాధ్యత విషయంలో ఏ కొంచెమైనా స్పహ ఉన్నవారు దాదాపు లేరనటం నిజం. టెస్టిమొనీస్, సం.5, పు. 157. ChSTel 124.1

    తమది నిత్యం పనిచేసే వ్యాపారజీవితమైతే ఆత్మల రక్షణ విషయంలోను తమ రక్షకుని సేవ విషయంలోను తాము ఏమి చెయ్యలేమన్న అభిప్రాయం చాలామందిలో ఉన్నది. సగం పనులు తాము చెయ్యలేమని అందుకే తమ విధులకు, తమ కార్యకలాపాలకు దూరంగా ఉండి లోక విషయాల్లో మునిగిపోతున్నామని వారంటారు. తమ వ్యాపారానికే ప్రాధాన్యమిచ్చి దేవున్ని మర్చిపోతారు. వారి విషయంలో ఆయనకు దుఃఖం కలుగుతుంది. భక్తి జీవితంలో పురోగమిస్తూ, దైవభీతితో సంపూర్ణ పరిశుద్దత సాధనకు అంతరాయం కలిగే విధంగా ఎవరైనా వ్యాపారంలో తల మునకలై ఉంటే, వారు ప్రతీ గడియ క్రీస్తు తమతో ఉండే వ్యాపారాన్ని చేపట్టాలి. టెస్టిమొనీస్, సం. 2, పులు. 233, 234.ChSTel 124.2