Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    మిషనెరీలుగా స్త్రీలు

    స్త్రీలు పురుషులు అది ఎక్కడ పనిచెయ్యగలుగుతుందో ఆ స్థలాల్లో సత్యాన్ని దాచి ప్రకటించే సేవలో నిమగ్నులవ్వవచ్చు. వారు ఈ క్లిష్ట సమయంలో తమ పాత్ర పోషించవచ్చు. వారి ద్వారా ప్రభువు పనిచేస్తాడు. వారు తమ బాధ్యతను గుర్తించి దైవాత్మ ప్రభావం కింద పనిచేస్తే ఈ సమయానికి అవసరమైన సంయమనం వారికి ఉంటుంది. ఆత్మత్యాగ స్పూర్తిగల ఈ స్త్రీల పై ఆయన తన ముఖ ప్రకాశాన్ని ప్రతిబింబిస్తాడు. అది వారికి పురుషుల శక్తిని మించిన శక్తినిస్తుంది. కుటుంబాల్లో పురుషులు చెయ్యలేని పనిని చెయ్యగలుగుతారు. అది ఆంతరంగిక జీవితాన్ని చేరేసేవ. పురుషులు చేరలేని హృదయానికి వారు దగ్గరగా రావచ్చు. వారి సేవ అవసరం. వివేకం అణకువ గల స్త్రీలు ప్రజలకు తమ గృహాల్లో సత్యాన్ని వివరించటంలో గణనీయమైన సేవ చెయ్యవచ్చు. ఈ రీతిగా విశదీకరించబడ్డ దైవవాక్యం పులిసిన పిండిలా దాని పని అది చేస్తుంది. ఫలితంగా కుటుంబాలకు కుటుంబాలు క్రీస్తును విశ్వసిస్తాయి. టెస్టిమొనీస్, సం. 9, పులు. 128,129.ChSTel 25.1

    దైవ సేవ చేసే వారందరు మార్త మరియల లక్షణాల కలయికను కలిగి ఉండాలి. అంటే పరిచర్యకు సంసిద్ధత, సత్యంపట్ల యధార్థ ప్రేమ ఉండాలి. స్వార్థాన్ని స్వార్ధపరత్వాన్ని విడిచి పెట్టాలి. నమ్మకమైన మహిళా పనివారికి, ప్రజ్ఞ, సానుభూతి, దయ కలిగి నియమానికి నిలబడే మహిళా పనివారికి దేవుడు పిలుపునిస్తున్నాడు. పట్టుదలతో పనిచేసే స్త్రీలను, స్వార్ధ చింతలేని, స్వీయ సుఖంకోరని, స్త్రీలను, తమ మనసుల్ని క్రీస్తు పై కేంద్రీకరించి, సత్యాన్ని బోధిస్తూ, తమకు ఎవరితో మాట్లాడటానికి తరుణం కలుగుతుందో వారి కోసం ప్రార్ధిస్తూ, ఆత్మల మారుమనసుకోసం శ్రమపడే స్త్రీలను దేవుడు పిలుస్తున్నాడు. టెస్టిమొనీస్, సం.6, పు. 118.ChSTel 25.2

    సహోదరీలు మన పత్రికలకు చందాలు సేకించటంలో సమర్థంగా పనిచెయ్యవచ్చు. ఈ విధంగా వారు అనేకుల ముందుకి వెలుగును తేవచ్చును. రివ్యూ అండ్ హెరాల్డ్, జూన్ 10, 1880.ChSTel 25.3

    నిదర్శనాన్ని జాగ్రత్తగా పరిగణించిన మిదట నైతిక ధైర్యంతో సత్యాన్ని అంగీకరించటానికి తీర్మానించుకునే గుణవతులైన స్త్రీలున్నారు. వారు తమ మనస్సాక్షికి లోబడి సత్యాన్ని అంగీకరిస్తారు. వారు నేర్పు, అవగాహన, మంచి సామర్థ్యం గలవారు, వారు తమ ప్రభువుకి విజయవంతమైన సేవకురాండ్రవుతారు. క్రైస్తవ స్త్రీలను దేవుడు పిలుస్తున్నాడు. రివ్యూ అండ్ హెరాల్డ్, డిసె. 19, 1878.ChSTel 25.4

    మన పత్రికలు కరపత్రాలు చదివే మిత్రుల యదార్ధ మనోభావాల్ని రాయటంలోను గీయటంలోను మంచి పనివారుగా మన సహోదరీలు సేవచేయ్యవచ్చు.... పటిష్ఠ నియమం నిశ్చిత ప్రవర్తనగల స్త్రీలు, మనం చివరి దినాల్లో నివసిస్తున్నామని, లోకానికి అందించాల్సిన అంతిమ గంభీర హెచ్చరికా వర్తమానం మనకున్నదని విశ్వసించే స్త్రీలు అవసరం... కరపత్రాల సేవలను మిషనెరీ సేవలోను దేవుడు వినియోగించగల స్త్రీలు వీరే... అనేక విధాలుగా వీరు కరపత్రాలు సైన్స్ ఆఫ్ ది టైమ్స్ జ్ఞానయుక్తంగా పంచటంలో విలువైన సేవ చెయ్యవచ్చు. రివ్యూ అండ్ హెరాల్డ్, డిసె. 19,1887. ChSTel 26.1

    స్త్రీలు ఓటర్లు కావాలనిగాని పదవులు నిర్వహించాలనిగాని నేను సిఫారసు చెయ్యను. కాని ఉత్తరాల ద్వారా, కరపత్రాలు పంచటం ద్వారా ఈ కాలానికి ఉద్దేశించిన సత్యంగల పత్రికలకు చందాలు సమీకరించటం ద్వారా సత్యాన్ని బోధించే మిషనెరీలుగా వారు గొప్ప సేవ చెయ్యవచ్చు. రివ్యూ అండ్ హెరాల్డ్, డిసె. 19, 1878.ChSTel 26.2

    ఈ పరిశుద్ధ కర్తవ్యాన్ని తమ జీవితంలో ప్రియమైన సేవగా చేపట్టే స్త్రీలు ఇప్పుడు ఒక స్త్రీ స్థానంలో ఇరవైమంది ఉంటే, సత్యాన్ని స్వీకరించే స్త్రీలు ఇంకా ఎక్కువ మంది ఉండేవారు. రివ్యూ అండ్ హెరాల్డ్, జన. 2, 1879.ChSTel 26.3

    పని చెయ్యగలిగిన స్త్రీలు, తాము ఇతరులకన్నా ప్రాముఖ్యమని భావించకుండా సాత్వికం, దీనమనసు కలిగి, ఆత్మల రక్షణ విషయంలో తాము చేయగలిగిన పనిని చెయ్యటానికి సంసిద్ధంగా ఉండే స్త్రీలు ఇప్పుడు అవసరం. రివ్యూ అండ్ హెరాల్డ్, జన. 2, 1879.ChSTel 26.4

    తాము కోరుకుంటే వందల సహోదరీలు నేడు పనిలో ఉండవచ్చు. అలంకరణలు లేకుండా, శుభ్రమైన, మన్నికైన బట్టలు, సామాన్యమైన రీతిలో తాము ధరించి, తమ బిడ్డలకి ధరింపజెయ్యాలి. అనవసర ఆడంబరానికి వ్యయం చేసే సమయాన్ని వారు మిషనెరీ సేవకు వినియోగించాలి. దూరంలో ఉన్న స్నేహితులికి ఉత్తరాలు రాయవచ్చు. ఉత్తమ కార్యాచరణ రీతుల పై సంప్రదింపులు సలహాలకై మన సహోదరీలు సమావేశాలు జరుపుకోవచ్చు. తమ మిత్రులికి పంపటానికి పత్రికలు కరపత్రాల్లో పెట్టుబడి కోసం డబ్బు ఆదాచేసి దేవునికి కానుకగా సమర్పించవచ్చు. ఇప్పుడు ఏమి చెయ్యకుండా కూర్చున్న వారు మొదలు పెట్టి పని చెయ్యాలి. దేవుని బిడ్డనని చెప్పుకునే ప్రతీ సోదరి తన అందుబాటులో ఉన్న వారందరికీ చెయ్యూత నివ్వటం తన బాధ్యతని భావించాలి. రివ్యూ అండ్ హెరాల్డ్, డిసె. 12, 1878. ChSTel 26.5

    ఆలోచన, మానసిక శక్తుల వినియోగం అవసరమయ్యే బాధ్యతల్ని తప్పించుకోటానికి మన సహోదరీలు సిద్దంగా ఉంటారు. అయినా క్రైస్తవానుభవ పరిపూర్ణతకు వారికి అగత్యమయ్యింది. ఈ క్రమశిక్షణే. మన విశ్వాసాన్ని నిర్దుష్టంగా సూచించే పత్రికల్ని కరపత్రాల్ని ప్రజలకి పంచటంలో వ్యక్తిగత ఆసక్తి కనపర్చుతూ మిషనెరీ సేవారంగంలో వారు పనివారు కావచ్చు. రివ్యూ అండ్ హెరాల్డ్, డిసె. 12, 1878. ChSTel 27.1

    సహోదరీల్లారా, అప్రమత్తులై మిషనెరీ సేవ చెయ్యటంలో అలసిపోకండి. మీరు దేవునితో సంబంధం కలిగి ఉంటే, ఈ సేవను మీరందరూ జయప్రదం చేయవచ్చు. నిజమైన ద్రాక్షావల్లికి జయప్రదంగా అంటుకట్టటానికి, అవి దేవుని మహిమకు ఫలాలు ఫలించటానికి మీరు కొన్ని అడవి కొమ్మల్ని పోగు చేసేందుకు ఉత్తరాలు రాయకముందు మీ హృదయాల్ని ఎల్లప్పుడు ప్రార్థనలో పెకెత్తండి. వినయ హృదయాలతో ఈ సేవలో పాల్గొనే వారందరూ ప్రభువు ద్రాక్షాతోటలో పనివారుగా నిత్యం శిక్షణ పొందుతారు. రివ్యూ అండ్ హెరాల్డ్, జూన్ 10, 1880. ChSTel 27.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents