Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    సంయుక్త క్రైస్తవ శక్తులు

    విశ్వాసపరమైన సహోదరులు, సహోదరీల్లారా, “నా తమ్మునికి నేను కావలివాడనా?” అన్న ప్రశ్న మీ హృదయాల్లో లేస్తున్నదా? మేము దేవుని బిడ్డలమని మీరు చెప్పుకుంటుంటే మీరు మీ తమ్ముడికి కావాలివారే. ఎవరి ఆత్మల రక్షణకు సంఘం సాధనం కాగలిగి ఉండేదో వారికి సంఘాన్ని దేవుడు జవాబుదారి చేస్తాడు. హిస్టారికల్ స్కెచ్చేస్, పు. 291.ChSTel 9.1

    బాధపడుతున్నవారికి, దుఃఖిస్తున్నవారికి, శోధించబడుతున్నవారికి పరిచర్య చెయ్యటానికి సమర్థమైన సంఘాన్ని నెలకొల్పేందుకు రక్షకుడు తన అమూల్య రక్తాన్ని చిందించాడు. ఓ సంఘ విశ్వాసులు పేదవారు, విద్యలేని వారు, అనామకులు కావచ్చు. అయినా గృహంలోను, సమాజంలోను, “సుదూర ప్రాంతాల్లో సయితం వారు క్రీస్తులో చెయ్యగలిగే పని నిత్యకాలం పొడుగున కనిపించే ఫలితాలు కలదై ఉండవచ్చు. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 106.ChSTel 9.2

    సంఘం బలహీనతలు లోపాలతో నిండిఉన్నట్లు కనిపించవచ్చుగాక. ఆ సంఘంపట్లే దేవుడు ప్రత్యేక శ్రద్ద గౌరవం కనపర్చుతాడు. అది ఆయన కృపకు ప్రదర్శనశాల. అందులో హృదయాల్ని మార్చే తన శక్తిని ప్రత్యక్షపర్చటానికి ఆయన సంతోషిస్తాడు. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 12.ChSTel 9.3

    క్రీస్తు ఆదేశాన్ని నెరవేర్చటానికి ఎవరో ఒకరుండాలి. భూమి పై ఆయన మొదలు పెట్టిన పనిని ఎవరో ఒకరు కొనసాగించాలి. ఈ అధిక్యతను దేవుడు సంఘానికిచ్చాడు. ఈ ఉద్దేశం నెరవేర్పుకే సంఘం వ్యవస్థీకృతం అయ్యింది. అలాగైతే సంఘ సభ్యులు ఆ బాధ్యతను ఎందుకు నిర్వర్తించటం లేదు? టెస్టిమొనీస్, సం.6, పు. 295.ChSTel 9.4

    నూతన స్థలాల్లోకి పురోగమించటానికి శిక్షితులు అవనుభవజ్ఞులు అయిన పనివారిని విడిచి పెట్టి, తమ సొంత భూభాగంలో వాస్తవిక సంస్కరణ పతాకాన్ని ఎగురవేస్తూ, తమకు నియమితమైన విధిని చేపట్టాల్సిందిగా సంఘానికి దేవుడు పిలుపునిస్తున్నాడు. టెస్టిమొనీస్, సం. 6, పు. 292.ChSTel 9.5

    థెస్సలొనీక విశ్వాసులు అసలు సిసలు మిషనెరీలు... అనేకుల హృదయాలు సత్యానికి ఆకర్షితమయ్యాయి. అనేక ఆత్మలు విశ్వసించి సంఘంలో చేరారు. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 256. ChSTel 10.1

    క్రీస్తు ఆరోహణానంతరం భూమి పై ఆయన సేవలను కొసాగించటానికి సంఘ వ్యవస్థీకరణ దిశలో మొట్టమొదటి చర్య పన్నెండు మంది అభి షేకంతో జరిగింది. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 18.ChSTel 10.2

    దైవ సంఘం వివిధ వరాలు, పరిశుద్ధాత్మ వరం కలిగిన పరిశుద్ధ జీవిత ప్రాంగణం. ఆ సభ్యులు తాము ఎవరికి సహాయం చేస్తూ ఉంటారో వారి సంతోషమే తమ సంతోషంగా పరిగణిస్తారు. తన నామ మహిమార్ధం తన సంఘం ద్వారా సాధించటానికి ప్రభువు సంకల్పించిన సేవ అద్భుతమైనది. ది. ఏక్ట్స్ ఆప్ ది అపాజల్స్, పులు. 12, 13. ChSTel 10.3

    దైవవాక్యంలో మన సేవ స్పష్టంగా నిర్దేశించబడింది. క్రైస్తవుడు క్రైస్తవుడితో, సంఘం సంఘంతో, ఒకటై, మానవ సాధనం దైవ సాధనంతో సహకరిస్తూ, లోకానికి దేవుని కృపా సువార్తను అందించటంలో అందరు కలిసి పని చెయ్యాలి. జెనరల్ కాన్షరెన్స్ బులిటన్, ఫిబ్ర. 28,1893, పు. 421.ChSTel 10.4

    భవిష్యత్తులో విస్తారమైన పంట కోయగలమన్న ఆశాభావంతో మన సంఘాలు ఆధ్యాత్మికపరమైన దున్నటం పనిలో సహకరించాలి... నేల గట్టిది. అయినా సేద్యంలేని ఆ బీడు భూమిని బద్దలు చేసి నీతి విత్తనాల్ని నాటాల్సి ఉంది. దేవుని ప్రియమైన బోధకులారా, శ్రమ చెయ్యాలా వద్దా అని సందేహిస్తూ ఆగకండి. మీ పనిని బట్టి పైరు పెరుగుదల ఉంటుంది. టెస్టిమొనీస్, సం.6, పు. 420.ChSTel 10.5

    సంఘం మానవ రక్షణార్థం దేవుడు నియమించిన ప్రతినిధి. అది సేవ నిమిత్తం వ్యవస్థీకరించబడింది. దాని కర్తవ్యం సువార్తను లోకానికి అందించటం. తన సంపూర్ణత సమృద్దత తన సంఘం ద్వారా లోకానికి ప్రతిబింబింపజెయ్యాలన్నది ఆదినుంచీ దేవుని సంకల్పం. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలువబడ్డ సంఘసభ్యులు ఆయన మహిమను ప్రకటించాల్సి ఉంది. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 9.ChSTel 10.6

    ఈ కాలానికి ఏర్పాటైన గొప్ప సేవలో తాము ప్రభావవంతమైన పాత్ర నిర్వహించలేనంత చిన్న సంఘమని ఏ సంఘమూ భావించకూడదు. ChSTel 11.1

    సోదరులారా లేచి పనిచెయ్యండి. బృహత్తర శిబిర సమావేశాలు, సదస్సులు, సభలు మాత్రమే దేవుని ప్రసన్నతను పొందవు. స్వార్థరహిత ప్రేమతో చేసే సామాన్య కృషిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దానికి గొప్ప ప్రతిఫలం కలుగుతుంది. మీ శక్తిమేరకు పని చెయ్యండి. అప్పుడు దేవుడు మీ సామర్థ్యాన్ని వృద్ధి చేస్తాడు. రివ్యూ అండ్ హెరాల్డ్, మార్చి 13, 1888.ChSTel 11.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents