Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఆటంకాల్ని ఎదుర్కోటం

    సైనిక రక్షక బృందంతో ఏదో ముఖ్యమైన పనిమీద వచ్చినట్లు సూచిస్తూ అతడు యెరూషలేము చేరటం ఇశ్రాయేలు శత్రువుల్లో అసూయ ద్వేషం పుట్టించింది. యెరూషలేము సమీపంలో స్థిరపడ్డ అన్యజాతులు యూదుల పట్ల శత్రుత్వం పూని వారికి తాము చేయగల హానిని అవమానాన్ని చేస్తూ వచ్చారు. ఈ దుష్కృతాలు జరిగించటంలో ప్రధానులు హోరోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీయుడైన టోబియా, అరబీయుడైన గేషెము. ఈ సమయం నుంచి ఈ నాయకులు నెహెమ్యా కదలికల్ని డేగ కలళ్లతో కని పెడూ అతడి ప్రణాళికల్ని నిరర్ధకం చెయ్యటానికి అతడి కార్యాన్ని అడ్డుకోటానికి తమ శక్తి కొద్దీ ప్రయత్నించారు. సదర్న్ వాచ్ మేన్, మార్చి 22, 1904.ChSTel 202.1

    తమ జయం గురించి సందేహాలు అపనమ్మకం పుట్టించటం ద్వారా పనివారిలో భేదాలు పుట్టించటానికి ప్రయత్నించారు. కట్టటం పని చేసేవారి పనిని ఎగతాళిచేసి, అది సాధ్యం కాని పని అని, అది విఫలమై తమను అభాసుపాలు చేస్తుందని ప్రవచనం చెప్పారు. గోడ మీద పనిచేస్తున్న వారు మరింత తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కున్నారు. నిద్రలేకుండా పని చేస్తున్న తమ శత్రువుల కుట్రల నుంచి తమను తాము కాపాడుకోటానికి పనివారు నిత్యం అప్రమత్తంగా ఉండాల్సి వచ్చింది. శత్రువు ప్రతినిధులు అబద్ద సమాచారం ప్రసారం చేయటం ద్వారా వారి ధైర్యాన్ని దెబ్బతియ్యటానికి ప్రయత్నించారు. నెహెమ్యాని తమ ఉచ్చులోకి లాగటానికి ఆయా సాకులతో రకరకాల కుట్రలు పన్నారు. ఆ విశ్వాసఘాతుక చర్యకు మద్దతు పలకటానికి మోసకారులైన యూదులు కొందరున్నారు... శత్రువు ప్రతినిధులు స్నేహం నటిస్తూ కట్టడం పనివారిలో కలిసిపోయి, పని వారి దృష్టిని మళ్లించటానికి, గందరగోళం ఆందోళన సృష్టించి, అవిశ్వాసాన్ని, అనుమానాన్ని పుట్టించటానికి ప్రణాళికలో మార్పులు ప్రతిపాదించారు. సదర్న్ వాచ్ మేన్, ఏప్రి.12, 1904.ChSTel 202.2