Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ద్రవ్యం విషయంలో గృహనిర్వాహకత్వం

    డబ్బు ఖర్చు పెట్టే సందర్భాలన్నింటిలో క్రైస్తవ సేవ అంతటికి ఆల్పా ఒమేగా అయిన ప్రభువు ఉద్దేశాన్ని నెరవేర్చటానికి మనం కృషి చెయ్యాలి. టెస్టిమొనీస్, సం.9, పు.49.ChSTel 257.2

    ద్రవ్యానికి గొప్ప విలువ ఉంది. ఎందుకంటే అది గొప్ప మేలు చెయ్యగలుగుతుంది. దేవుని బిడ్డల చేతుల్లో అది ఆకలిగా ఉన్న వారికి ఆహారం, దాహంగా ఉన్న వారికి నీళ్లు, బట్టలు లేనివారికి బట్టలు. అది బాధితులకు రక్షణ, రోగపీడితులకు సహాయ సాధనం. జీవితావసరాలు తీర్చటానికి, ఇతరులికి సహాయం చెయ్యటానికి, క్రీస్తు సేవను కొనసాగించటానికి ఉపయుక్తమైనప్పుడే దానికి విలువ ఉంటుంది. లేకపోతే దానికి గుప్పెడు ఇసుక కన్నా ఎక్కువ విలువ ఉండదు. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 351. ChSTel 257.3

    దేవుడు తానే తన సేవాభివృద్ధికి ప్రణాళికలు రచించాడు. సహాయం కోసం పిలుపునిచ్చినప్పుడు తన ప్రజలు, “ప్రభువా, నీ రూపాయితో ఇంకా కొన్ని రూపాయిలు సంపాదించాం” అని ప్రతిస్పందించేందుకు ఆయన తన ప్రజలకి అదనపు ద్రవ్యం ఇస్తాడు. టెస్టిమొనీస్, సం.9, పు.58. ChSTel 257.4

    తర్వాత జీవితంలోకి ద్రవ్యం తీసుకువెళ్లలేం. అక్కడ దాని ఉపయోగముండదు. అయితే క్రీస్తుకి ఆత్మల్ని సంపాదించటంలో చేసే మంచి పనుల్ని పరలోకంలోకి తీసుకువెళ్తాం. కాగా ప్రభువు ఇచ్చిన వరాల్ని వనరుల్ని తమకోసమే ఉపయోగించుకుంటూ లేమిలో ఉన్న తమ సహోదరులికి సహాయం చెయ్యనివారు, లోకంలో దేవుని సేవాభివృద్ధికి ఏమి చెయ్యనివారు తమ సృష్టికర్తను అగౌరవపర్చుతున్నారు. పరలోక గ్రంథాల్లో వారి పేర్లకు ఎదురుగా దేవుణ్ని దోచుకున్నవారు అని రాయబడుతుంది. క్రైస్ట్స్ అబ్జెక్ట్ లెసన్స్, పు. 266. ఆత్మల విలువతో పోల్చితే డబ్బు విలువ ఏపాటిది? మన ఆదాయంలోని ప్రతి రూపాయి మనదిగా కాక ప్రభువుదిగా, మనకు ప్రభువు అప్పగించిన ప్రశస్త ట్రస్టుగా, అర్ధరహిత వ్యసనాలికి వ్యర్థం చెయ్యటానికి కాక దేవుని సేవకు మనుషుల ఆత్మల్ని నాశనం నుంచి రక్షించటంలో వినియోగించవలసిన దానిగా పరిగణించాలి. లైఫ్ స్కెచ్చేస్ ఆఫ్ ఎలెన్ జి. వైట్, పు.214.ChSTel 257.5

    మన లోకంలో జరగాల్సి ఉన్న మిషనెరీ సేవ మన ప్రభావం మన మద్దతు పొందాల్సినంత ప్రధాన్యం గలది కాదా? సత్యాన్ని ఇతర దేశాలకి అందించేందుకు, స్వదేశ మిషనెరీ సేవ కొనసాగేందుకు మనం మన ప్రతీరకమైన దుబారాను మాని మన కానుకలు అర్పణల్ని దేవుని ధనాగారంలో సమర్పించ నవసరంలేదా? ఈ సేవ దేవునికి సమ్మతం కాదా? ఈ చివరి దినాల్లో జరగాల్సిన సేవ వంశపారంపర్య ఆస్తి మద్దత్తువల్ల సాగటంలేదు లేక లోక సంబంధమైన పలుకుబడి వల్ల పురోగమించటం లేదు. అది ఆత్మోపేక్ష, త్యాగ స్పూర్తి ఫలితంగా వచ్చే కానుకల ద్వారా సాగుతున్నది. ఇక్కడ క్రీస్తు శ్రమల్లో ఆయనతో పాలివారమయ్యే ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. వారసత్వానికి హక్కుదారులమయ్యే ఏర్పాటు ఆయన మనకు నూతన భూమిలో చేశాడు. రివ్యూ అండ్ హెరాల్డ్, డిసెం. 2, 1890.ChSTel 258.1

    దేవునికి ప్రతిష్ఠించి ఆయన ధనాగారంలోకి సమర్పించే ప్రతీ కానుకను అలా సమర్పించే ద్రవ్యం అంతిమ ఫలాన్ని దాఖలు చేసే దూత నమ్మకంగా దాఖలు చేస్తాడని నాకు దర్శనంలో చూపించటం జరిగింది. తన సేవ నిమిత్తం సమర్పితమైన ప్రతీ పైసాని, ఇచ్చేవాడి ఇష్టాన్ని అయిష్టాన్ని దేవుని నేత్రం గుర్తిస్తుంది. ఇవ్వటం వెనక ఉద్దేశం కూడా దాఖలవుతుంది. ఆయన కోరుతున్నట్లు ప్రభువుకి చెందేది ఆయనకు సమర్పించే ఆత్మత్యాస్పూర్తి అంకితభావం గల వారు తమ క్రియల చొప్పున ప్రతిఫలం పొందుతారు. ఇలా ప్రతిష్ఠితమైన ద్రవ్యం దేవునికి మహిమ ఆత్మల రక్షణ అన్న దాత ధ్యేయాన్ని సాధించకుండా దుర్వినియోగమైనప్పటికీ, దేవుని మహిమ దృక్పథంతో చిత్తశుద్ధితో త్యాగం చేసేవారు తమ ప్రతిఫలాన్ని కోల్పోరు. టెస్టిమొనీస్, సం.2, పు.519.ChSTel 258.2

    అవసరంలో ఉన్న ఓ సహోదరుడికి సహాయం చెయ్యటానికి, లేక సత్య విస్తరణలో దేవుని సేవకు సహాయం చేసేందుకు, కలిగే ప్రతీ అవకాశం భద్రంగా ఉంచటానికి మీరు ముందుగా డిపాజిట్టుగా పరలోక బ్యాంకుకి పంపే ఓ ముత్యం. దేవుడు మా నిజాయితీని పరీక్షిస్తున్నాడు. ఆయన తన ఆశీర్వాదాల్ని మికు సమృద్ధిగా ఇస్తూ వచ్చాడు. వాటిని మీరు ఎలా ఉపయోగిస్తున్నారో, సహాయం అవసరమైన వారికి సహాయం చేస్తున్నారో లేదో, ఆత్మల విలువను గుర్తించి, మాకు అప్పగించబడ్డ ద్రవ్యంతో మీరు ఏమి చెయ్యగలరో చూడటానికి ఇప్పుడు ఆయన కని పెడుతున్నాడు. సద్వినియోగపర్చుకున్న అలాంటి ప్రతీ తరుణం మీ పరలోక ధనాన్ని వృద్ధిపర్చుతుంది. టెస్టిమొనీస్, సం.3, పులు.249, 250.ChSTel 259.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents