Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఏ నిమిషంలోనైనా సిద్ధంగా ఉండే మనుషులు

    చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాల్ని ప్రచురణ చేసే నిమిత్తం నమ్మకమైన మనుషులుగా ఏ నిమిషంలోనైనా సిద్ధంగా ఉండండి. రివ్యూ అండ్ హెరాల్డ్, జన. 24, 1893.ChSTel 286.2

    దైవ సేవకులు దేవుడు ఎంత వేగంగా మార్గం తెలిస్తే అంత వేగంగా కదలటానికి ఏ నిమిషంలోనైనా సిద్ధంగా ఉండాలి. వారు ఎలాంటి జాప్యం చేసినా తమను జయించటానికి అది సాతానుకి అవకాశం ఇస్తుంది. పేట్రియార్క్స్ అండ్ ప్రోఫెట్స్, పు. 423. ChSTel 286.3

    ఆజ్ఞలు ఆచరించే ప్రజలు సేవ చెయ్యటానికి నిత్యం సిద్ధంగా ఉండాలి. టెస్టిమొనీస్, సం. 8, పు. 247.ChSTel 286.4

    క్రీస్తు యధార్థ ప్రతినిధులు ఇతరుల మేలు కోసం పని చేస్తారు. స్వదేశంలోను విదేశాల్లోను దేవుని సేవాభివృద్ధికి పని చెయ్యటంలో ఆనందిస్తారు. ప్రార్ధన సమావేశానికి వెళ్లి వాటిలో పాల్గొంటారు. వాటిలో వారి ప్రభావం ప్రబలంగా ఉంటుంది. వారు తమను తాము ఘనపర్చుకోటానికి, లేక తాము గొప్పపని చేస్తున్నట్లు గుర్తింపు పొందటానికి ప్రయత్నించరు. కాని క్రీస్తు తమకు ఎంతో మేలు చేస్తున్నాడు గనుక చిన్న చిన్న పనులుగాని అవసరమైతే పెద్ద పనులుగాని చెయ్యటంలో వారు వినయ హృదయులు సాత్వికులు అయి నమ్మకంగా పని చేస్తారు. రివ్యూ అండ్ హెరాల్డ్, సెప్టె. 6, 1881.ChSTel 286.5