Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    బైబిలు అధ్యయనానికి మి గృహానికి ఆహ్వానించండి

    మీ ఇరుగు పొరుగువారిని మా గృహానికి ఆహ్వానించి బైబిలుని, సత్యాన్ని విశదం చేసే పుస్తకాల్ని వారితో కలిసి చదవండి. మీతో కలిసి పాటలు పాడటానికి ప్రార్ధన చెయ్యటానికి వారిని ఆహ్వానించండి. ఆయన వాగ్దానం మేరకు, ఈ చిన్న సమావేశాల్లో క్రీస్తు ఉంటాడు. ఆయన కృప హృదయాల్ని స్పృశిస్తుంది. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పులు 152, 153. ChSTel 140.4

    అపొల్లో ఎఫెసులో ఉన్నప్పుడు “సమాజ మందిరములో ధైర్యముగా మాటలాడనారంభించెను.” ఆ సమావేశంలో ఉండి వింటున్న వారిలో ప్రిస్కిల్ల అకులలు ఉన్నారు. అతడు సువార్త వెలుగును పూర్తిగా పొందలేదని గ్రహించి, “అతని చేర్చుకొని దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి వివరించిరి.” వారి ఉపదేశం వల్ల అపొల్లో లేఖనాల్ని స్పష్టంగా అవగాహన చేసుకుని క్రైస్తవ విశ్వాసాన్ని అతి సమర్ధంగా ప్రబోధించినవారిలో ఒకడయ్యా డు. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 270.ChSTel 141.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents