Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    వాక్యపరిచారకుడి విధి

    మన వాక్యపరిచారకులు మన సంఘ సభ్యులకు చేయగల ఉత్తమ సహాయం నీతిబోధకాదుగాని వారికి కార్యాచరణ ప్రణాళిక తయారు చెయ్యటం. ఇతరులకి చెయ్యటానికి ప్రతి వారికీ ఏదోకొంత ఇవ్వటం. క్రీస్తు కృపను పొందేవారుగా, తాము ఆయనకు సేవచెయ్య బద్దులై ఉన్నారని అందరూ గ్రహించేటట్లు సహాయం చెయ్యటం. ఎలా పని చెయ్యాలో అందిరకీ నేర్పించటం. ముఖ్యంగా నూతనంగా విశ్వాసులైన వారిని దేవుని జత పనివారు కావటానికి తర్బీతు నివ్వటం. టెస్టిమొనీస్, సం.9, పు. 82.ChSTel 78.1

    వాక్యపరిచారకులారా, క్రీస్తు వెలపల ఉన్నవారికోసం ప్రత్యేక సేవకు దారితీసే సత్యాల్ని బోధించండి. సాధ్యమైన ప్రతీమార్గం వినియోగించి వ్యక్తిగత కృషిని ప్రోత్సహించండి. టెస్టిమొనీస్, సం.9, పు.124.ChSTel 78.2

    ఆధ్యాత్మికంగా పెరగటానికి ప్రభువు తమ పై మోపిన భారాన్ని అనగా ఆత్మల్ని సత్యంలోకి నడిపించాలన్న హృదయ భారాన్ని తాము మొయ్యాలని వాక్యపరిచారకులు సంఘసభ్యులకి బోధించాలి. తమ బాధ్యతల్ని నెరవేర్చకుండా ఉంటున్న వారిని సందర్శించి, వారితో కలిపి ప్రార్థించి, వారిని బలోపేతం చెయ్యటం జరగాలి. వాక్యపరిచారకులుగా మా మీద ఆధారపడటానికి ప్రజల్ని నడిపించకండి. దానికన్నా వారు తమ చుట్టూ ఉన్న వారికి సత్యాన్ని అందించటంలో తమ వరాల్ని ఉపయోగించాలి. ఇలా పనిచెయ్యటంలో వారికి పరలోక దూతల సహకారం ఉంటుంది. తమ విశ్వాసాన్ని వృద్ధిపరచి దేవుని పై తమ పట్టును దృఢతరంచేసే అనుభవం వారికి కలుగుతుంది. గాస్ పుల్ వర్కర్స్, పు. 200.ChSTel 78.3

    అప్పటికే కొందరు విశ్వాసులున్న స్థలంలో పని చెయ్యటంలో వాక్యపరిచారకుడు అవిశ్వాసుల్ని క్రైస్తవానికి మార్చటానికి ప్రయత్నించటం కన్నా సంఘం సహకారమివ్వటానికి సభ్యులికి శిక్షణ నివ్వటం ముఖ్యం. వాక్యపరిచారకుడు వారితో వ్యక్తిగతంగా పనిచేస్తూ, తమకు మరింత లోతైన అనుభవం అవసరమన్న గుర్తింపు, ఇతరుల రక్షణ కోసం పాటుపడాలన్న ఆకాంక్ష వారికి కలిగించటానికి కృషిచెయ్యాలి. వారు వాక్యపరిచారకుణ్ణి తమ ప్రార్థనలద్వారా, తమ సేవ ద్వారా ఆదుకోటానికి సిద్ధంగా ఉన్నప్పుడు అతడి కృషి మరింత విజయవంతమౌతుంది. గాస్పుల్ వర్కర్స్, పు.196.ChSTel 78.4

    కొన్ని సందర్భాల్లో పాదిరి స్థానం పనివారి ముఠానాయకుడు లేదా ఓ ఓడ సిబ్బంది కెప్టెన్ స్థానం లాంటిది. ఈ మనుషులు తాము ఎవరిపై నియమితులయ్యారో ఆ మనుషులు తమకు నియమించబడ్డ పనిని ఖచ్చితంగాను సకాలంలోను చేసేటట్లు చూడాలి. అత్యవసర పరిస్థితిలో మాత్రమే వారు చిన్నచిన్న వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఓ పెద్ద మిల్లు యజమాని ఒకసారి తన మిల్లు పర్యవేక్షకుణ్ని ఓ చక్రం గుంటలో చిన్న మరమ్మత్తులు చేయటం, అందులో పనిచేసే ఆరుగురు కార్మికులు నిలబడి చూడటం చూశాడు. విషయాలన్నీ తెలుసుకున్న మిదట ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండేందుకు ఆ యజమాని ఆ పర్యవేక్షకుణ్ని పిలిచి, పూర్తి జీతం చేతిలో పెట్టి, పనినుంచి తొలగించాడు. దిగ్ర్భాంతి చెందిన పర్యవేక్షకుడు తన చర్యకు కారణమేంటని యజమానిని అడిగాడు. “నిన్ను ఆరుగురు కార్మికుల్ని పనిలో ఉంచటానికి నియమించాను. ఆరుగురు పనిలేకుండా ఉంటుండగా నీవు ఒక్కడి పని చేస్తున్నావు. నీవు చేసిన పని ఆ ఆరుగురిలో ఏ ఒక్కడైనా నీకులా చెయ్యగలిగేవాడు. ఆరుగురికి సోమరితనం నేర్పటానికి నీకు ఏడుగురి జీతం ఇవ్వలేను” అన్నాడు.ChSTel 79.1

    ఈ ఘటన కొన్ని సందర్భాల్లో వర్తించవచ్చు, మరికొన్నింటిలో వర్తించకపోవచ్చు. కాని అనేకమంది పాదుర్లు సంఘ సేవలోని వివిధ శాఖల్లో పనిచెయ్యటానికి సభ్యులందరిని ఎలా రాబట్టాలో తెలియనందువల్ల లేక రాబట్టటానికి ప్రయత్నించనందువల్ల విఫలులవుతున్నారు. తమ సభ్యుల్ని సంఘ సేవకు రప్పించి ఉపయోగించటంపై పాదుర్లు మరింత దృష్టి పెడితే, వారు ఎక్కువ మేలు చయ్యగులుగుతారు. అధ్యయనానికి మతపరమైన సందర్శనలకు ఎక్కువ సమయముంటుంది. పొరపొచ్చాలకు కారణాలు కూడా తగ్గుతాయి. సపుల్ వర్కర్స్, పులు. 197,198.ChSTel 79.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents