Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    భావి ప్రతిఫలం

    నిత్యజీవం : సహాయం ఎక్కడ అవసరమో అక్కడ సహాయం చెయ్యటానికి చిత్తశుద్ధితో, ఆలోచన పూర్వకంగా కృషి చెయ్యటం ద్వారా యధార్థ క్రైస్తవుడు దేవునిపట్ల సాటి మనుషులపట్ల తన ప్రేమను కనపర్చుతాడు. సేవలో అతడు తన ప్రాణాన్ని పోగొట్టుకోవచ్చు. అయితే క్రీస్తు తన స్వకీయ స్వాస్థ్యాన్ని పోగుచేసుకోటానికి వచ్చినప్పుడు అతడు దాన్ని మళ్లీ పొందుతాడు. టెస్టిమొనీస్, సం. 9, పు. 56.ChSTel 319.1

    గృహానికి అనురాగ పూర్వక స్వాగతం: ఆయన నిమిత్తం బాధలు అనుభవించటం ఓ ఆధిక్యత అని గౌరవం అని భావిస్తూ, ఈ జీవితంలో క్రీస్తుతో సహకరించిన వారు గృహానికి అనురాగపూర్వక స్వాగతం పొందటం నిత్యత్వ ద్వారంలో నిలబడి వినండి... విమోచన పొందినవారు రక్షకుని వద్దకు తమని నడిపించిన వారిని అక్కడ కలుస్తారు. మానవులు దేవునిలా పరిశుద్ధంగా నివసించేందుకు మరణించిన ప్రభువుని స్తుతించటంలో వారు ఏకమౌతారు. సంఘర్షణ అంతమౌతుంది. శ్రమలు, కలహాలు సమాప్తమౌతాయి. విమోచన పొందినవారు దేవుని సింహానం చుట్టూ నిలబడగా విజయ గీతాలతో పరలోకం మారుమోగుతుంది. మమ్మల్ని విమోచించిన వధించబడ్డ గొర్రెపిల్ల అరుడు, అరుడు, అన్న ఉత్సాహ గానంతలో అందరూ గళం కలుపుతారు. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పులు. 506, 507.ChSTel 319.2

    వారి జీవితం ఇలాంటిదని, వారి ప్రవర్తనలు కనికరం, ఆత్మోపేక్ష, ఔదార్యంతో నిండి ఉన్నాయని పరలోక రికార్డు చూపిస్తే వారు “భళా మంచి దాసుడా” అన్న క్రీస్తు మెచ్చుకోలుని, దీవెనని పొందుతారు. “నా తండ్రిచేత ఆశీర్వదించబడినవారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొర కు సిద్దపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి” అని యేసు స్వాగతం పలుకుతాడు. టెస్టిమొనీస్, సం. 3, పు. 525.ChSTel 319.3

    పరలోక పర్యావరణం: సంఘానిది ఇప్పుడు సమరశీలం. చీకటిలో ఉన్న, దాదాపు పూర్తిగా విగ్రహారాధనలో మునిగిన లోకం మన ముందున్నది. కాని ఓ దినం వస్తున్నది. అప్పుడు యుద్ధం చెయ్యటం విజయం సాధించటం జరుగుతుంది. దేవుని చిత్తం పరలోకంలో నెరవేరుతున్నట్లు భూమి మీదనూ నెరవేరాల్సి ఉంది. రక్షణ పొందిన జాతులు పరలోక ధర్మ శాస్త్రం తప్ప మరే ఇతర చట్టాన్ని ఎరుగరు. అందరూ సంతోషంగా సంఘటిత కుటుంబంగా నివసిస్తారు. క్రీస్తు నీతివస్త్రమైన స్తుతివందన వస్త్రాలు ధరిస్తారు. ప్రకృతి దాని రమ్యత అంతటితో స్తుత్యారాధనలు అర్పిస్తుంది. పరలోక కాంతితో లోకం నిండుతుంది. చంద్రకాంతి సూర్యకాంతిలా ఉంటుంది. సూర్యకాంతి ఇప్పటి కన్నా ఏడురెట్లు ప్రచండా ఉంటుంది. సంవత్సరాలు ఆనందంగా గడిచిపోతాయి. ఆ దృశ్యంలో ఉదయ నక్షత్రాలు ఏకంగా పాడాయి. దేవదూతలందరూ ఆనంద ధ్వనులు చేస్తారు. దేవుడు, క్రీస్తు కలిసి “ఇక పాపం ఉండదు. మరణం ఇక ఎన్నటికీ ఉండదు” అని ప్రకటిస్తారు. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 504.ChSTel 320.1

    ఆనందం : క్రీస్తు సేవ చేసేవారికి ఆయన ఆనందంలో పాలు పొందటమన్నది ప్రతిఫలం. గొప్ప ఆశతో క్రీస్తు తానే ఎదురు చూస్తున్న ఆనందం తండ్రికి ఆయన చేసిన ఈమనవిలో వ్యక్తం చేశాడు. “నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడ ఉండవలెనని... కోరుచున్నాను.” టెస్టిమొనీస్, సం. 6, పు. 309.ChSTel 320.2

    ప్రాపంచికమైనది, పాపం వలన పరిమితమైనది అయినా, ఇక్కడ మన జీవితంలో అత్యున్నతానందం, అతున్నత విద్య వినియోగంలో ఉన్నాయి. భవిష్యత్తులో పాప మానవుల పరిమితులు నియంత్రణ లేని నిత్య జీవన స్థితిలో మన అత్యున్నతానందం, అత్యున్నత విద్య, సేవలోనే లభిస్తాయి - సాక్ష్యమివ్వటం, సాక్ష్యమిస్తూ ఆయన “మహిమైశ్వర్యము గూర్చి, అనగా “మియందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై యున్నాడని” నూతనంగా నేర్చుకోటం జరుగుతుంది. ఎడ్జుకేషన్, పు. 309.ChSTel 320.3

    వారు క్రీస్తు శ్రమల్లో పాలు పంచుకుంటారు. వెల్లడి కానున్న మహిమలోనూ వారు పాలు పంచుకుంటారు. ఆయన సేవలో ఆయనతో ఏకమై ఆయనతో కలిసి దు:ఖ పాత్రలోనిది తాగే వారు ఆయన ఆనందంలో పాలు పొందుతారు. తాట్స్ ఫ్రమ్ ది మౌంట్ ఆఫ్ బ్లెసింగ్, పు. 12.ChSTel 321.1

    విత్తటం తాలూకు ఫలసిద్ధి - మంచి చెయ్యటానికి, దేవుని వద్దకు రావటానికి మనుషులుకి పరిశుద్దాత్మ నుంచి వచ్చే ప్రతీ ప్రేరణ పరలోక గ్రంథాల్లో దాఖలవుతుంది, తనను తాను సమర్పించుకునే ప్రతీ వ్యక్తి పరిశుద్దాత్మ సాధనంగా తన జీవితం సాధించిన మంచిని వీక్షించటానికి దేవుడు తన మహాదినాన అనుమతిస్తాడు. టెస్టిమొనీస్, సం. 6, పు. 310.ChSTel 321.2

    రక్షణ పొందినవారు దేవుని ముందు నిలబడినప్పుడు ఎవరు తమ నిమిత్తం నమ్మకంగా ఓర్పుతో కృషి చేసినందువల్ల తాము అక్కడున్నారో, ఆశ్రయదుర్గానికి పారిపోవలసిందిగా ఎవరు చిత్తశుద్ధితో తమను ఒప్పించారో వారి పేర్లకు ప్రశస్త ఆత్మలు స్పందిస్తాయి. ఈ విధంగా ఈ లోకంలో దేవుని జతపనివారుగా సేవ చేసేవారు తమ ప్రతిఫలాన్ని పొందుతారు. టెస్టిమొనీస్, సం. 8, పులు. 196, 197.ChSTel 321.3

    విమోచన పొందినవారు తమ రక్షణ నిమిత్తం హృదయభారం కలిగి కృషి చేసిన వారిని కలిసి పలకరించుకున్నప్పుడు ఎంత గొప్ప ఆనందం ఉంటుంది! తమకోసం తామే నివసించకుండా, అభాగ్యులికి, లేమిలో ఉన్న వారికి దీవెనగా ఉండటానికి నివసించిన వారి హృదయాలు ఎంత ఆనందంతో ఎంత తృప్తితో నిండుతాయి! “నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమియు లేదు గనుక నీవు ధన్యుడవు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువు.” గాస్పుల్ వర్కర్స్, పు. 519.ChSTel 321.4

    మన గృహాలకి ఆహ్వానించి, శోధనలో వడకుండా నడిపించి మనం సహాయం చేసిన యువతని పరలోకంలో చూస్తాం. వారి ముఖాలు దేవుని మహిమను ప్రతిబింబించటం చూస్తాం. టెస్టిమొనీస్, సం. 6, పు. 348.ChSTel 321.5

    రక్షణ ప్రణాళికలో క్రీస్తుకి దూతలకి తోటి పనివారు కావటం! దీనితో పోల్పతగింది ఏముంది? రక్షణ పొందిన ప్రతీ వ్యక్తి నుంచి దేవునికి మహిమాదాయం వస్తుంది. అది రక్షణ పొందిన వ్యక్తి మీద అతడి రక్షణలో సాధనమైన వ్యక్తిమీద ప్రతిబింబించాల్సి ఉంది. టెస్టిమొనీస్, సం. 2, పు. 232.ChSTel 322.1

    విమోచన పొందినవారు తాము ఎవరి దృష్టికి రక్షకుణ్ని తీసుకువచ్చారో వారిని గుర్తుపడతారు. వీరికి వారికి మధ్య జరిగే సంభాషణ ఎంత ధన్యమైంది! “నేను దేవుడు లేకుండా, నిరీక్షణ లేకుండా పాపినై లోకంలో ఉండగా నీవు నా వద్దకు వచ్చి రక్షకుణ్ని నా ఒకే ఒక నిరీక్షణగా నా దృష్టికి తెచ్చావు. నేను ఆయాన్ని విశ్వసించాను. నా పాపాల నిమిత్తం పశ్చాత్తాపపడ్డాను. ఇప్పుడు నేను క్రీస్తు యేసు నామంలో ఆయన భక్తులతో కలిసి కూర్చున్నాను.” అని అంటాడు. ఇతరులంటారు, “నేను అన్యదేశాల్లో నివసించిన అన్యుణ్ని. నీవు నీ మిత్రుల్ని విడిచి పెట్టి, హాయిగా ఉన్న నీ గృహాన్ని విడిచి పెట్టి, యేసుని ఎలా చేరాలో బోధించటానికి, ఒకే ఒక దేవుడైన ఆయన్ని ఎలా విశ్వసించాలో నేర్పించటానికి వచ్చావు. నేను నా విగ్రహాల్ని విరగొట్టేశాను. దేవున్ని ఆరాధించటం ప్రారంభించాను. ఇప్పుడు ఆయన్ని ముఖాముఖి చూస్తున్నాను. నేను రక్షించబడ్డాను. నేను ప్రేమించే ప్రభువుని వీక్షించటానికి నిత్యం జీవించటానికి రక్షించబడ్డాను. అప్పుడు ఆయన్ని విశ్వాస నేత్రంతోనే చూశాను. కాని ఇప్పుడు ఆయన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాను. నన్ను ప్రేమించి నా పాపాన్ని తన రక్తంతో కడిగి వేసిన ప్రభువుకి తన రక్షణ కృపావరం నిమిత్తం ఇప్పుడు నా కృతజ్ఞతల్ని తెలుపుగోగలను.” గాసిపుల్ వర్కర్స్, పు. 518.ChSTel 322.2

    ఇతరులు ఆకలిగా ఉన్న వారికి భోజనం పెట్టిన వారికి, వస్త్రహీనుతికి వస్త్రాలిచ్చిన వారికి కృతజ్ఞతలు తెలపుతారు. వారిలా అంటారు, “నేను నిస్పృహ చెంది అపనమ్మకానికి బందీనైనప్పుడు ప్రభువు నిన్ను నా దగ్గరకు నిరీక్షణ ఆదరణ కలిగించే మాటలు చెప్పటానికి పంపాడు. నా శరీరానికి అగత్యమైన ఆహారాన్ని నీవు నాకు తెచ్చావు. దైవ వాక్యాన్ని నాకు తెరిచి, నా ఆధ్యాత్మిక అవసరాలికి నన్ను మేల్కొలిపావు. నీవు నన్ను ఓ సోదరుడిగా చూశావు. నా దుఃఖాల్లో నాకు సానుభూతి చూపించావు. నన్ను రక్షించటానికి క్రీస్తు నాకు చాపిన హస్తాన్ని పట్టుకునేందుకు గాయపడ్డ నా ఆత్మను నీవు పునరుద్దరించావు. నా అజ్ఞానంలో, నాకో పరలోక తండ్రి ఉన్నాడని, ఆయన నన్ను సంరక్షిస్తాడని నీవు నాకు ఓర్పుతో బోధించావు. దైవ వాక్యంలోని వాగ్దానాన్ని నీవు నాకు చదివి వినిపంచావు. ఆయన నన్ను రక్షిస్తాడన్న విశ్వాసం నాలో పుట్టించావు. క్రీస్తు నా నిమిత్తం చేసిన త్యాగాన్ని ధ్యానించగా నా హృదయ కాఠిన్యంపోయి, విరిగి నలిగి ఆయన వశమయ్యింది. జీవాహారానికి నాలో ఆకలి పుట్టింది. సత్యం నా ఆత్మకు ఎంతో ప్రశస్తమయ్యింది. నేను రక్షణ పొంది ఇదిగో ఇక్కడున్నాను. నిత్యం రక్షించబడ్డాను. ఆయన సముఖంలో నిరంతరం ఉండటానికి తన ప్రాణాన్ని నాకోసం అర్పించిన ఆయన్ని నిత్యం స్తోత్రించటానికి రక్షించబడాను.” గాస్ఫుల్ వర్కర్స్, పులు. 518, 519.ChSTel 322.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents