Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  ప్రస్తుత ప్రతిఫలం

  ఆనందం : క్రీస్తు చేసిన పరిచర్యకు తమ జీవితాల్ని అంకితం చేసుకునేవారు యధార్ధమైన ఆనందమంటే ఏంటో తెలిసిన వారు. వారి ఆసక్తులు వారి ప్రార్ధనలు సొంత విషయాలకే పరిమితం కాకుండా తమను మించి దూరంగా వెళ్తాయి. ఇతరులుకి సహాయం చేస్తున్నప్పుడు వారు పెరుగుతున్నారు. విస్తృత ప్రణాళికలతో, ఉద్వేగభరితమైన సాహస కార్యాలతో పరిచయం పెరుగుతుంది. దేవుని వెలుగు, దీవెనల మార్గంలో నివసిస్తున్నప్పుడు వారు పెరగకుండా ఎలా ఉంటారు? అలాంటి వారు పరలోకం నుంచి వివేకం పొందుతారు. క్రీస్తు ప్రణాళికలన్నింటిలోను ఆయనతో ఏకమై పని చేస్తారు. ఆధ్యాత్మిక స్తబ్దతకు అవకాశం ఉండదు. టెస్టిమొనీస్, సం. 9, పు. 42. ChSTel 315.4

  ఈ సేవలో విజయవంతంగా నిమగ్నమయ్యే సంవుం ఆనందదాయకమైన సంఘం. తప్పిదాలు చేస్తున్నవారి పట్ల కనికరం, ప్రేమ వల్ల ఆకర్షితుడు ఆకర్షితురాలు అయి వారిని ఆ మహా కాపరి దొడ్డిలో చేర్చే పురుషుడు, స్త్రీ ధన్యమైన సేవలో నిమగ్నులై ఉన్నారు. అలా ఒక్క పాపిని తిరిగి సంపాదించటం జరిగినప్పుడు తొంబయి తొమ్మిది నీతిమంతుల విషయంలో కన్నా పరలోకంలో ఎక్కువ ఆనందం ఉంటుందన్నది ఆత్మను ఎంత ఆనందింపజేసే తలంపు! టెస్టిమొనీస్, సం. 2, పు. 22. ChSTel 316.1

  తనను దేవుని చిత్తానికి సమర్పించుకునే వ్యక్తికి ఏ పనీ ఆయాసకరం నిరాసక్తం కాదు. “దాన్ని ప్రభువుకి చేసినట్లు చెయ్యటం” అన్న భావన తనకు దేవుడు ఏ పని ఇస్తే ఆ పని మీద ఆకర్షణను సృష్టించే భావన. టెస్టిమొనీస్, సం. 9, పు. 150.ChSTel 316.2

  క్రైస్తవ పనివాడు తనకు దేవుడు నియమించిన పనిని చెయ్యటం ఆయాసకరమైన శ్రమగా భావించడు. ఆత్మలు పాప దాస్యం నుంచి విముక్తి పొందటం చూడటంలో అతడు తన ప్రభువు ఆనందంలో పాలు పొందుతాడు. ఈ ఆనందం అతడు చేసిన ప్రతీ ఆత్మత్యాగాన్నీ తిరిగి చెల్లిస్తుంది. సదర్న్ వాచ్ మేన్, ఏప్రి. 2, 1903.ChSTel 316.3

  పనివాడవ్వటం, తన్ను తాను ఉపేక్షించుకుని ఇతరులుకి మేలు చెయ్యటంలో ఓర్పుతో కొనసాగటం మహిమాన్వితమైన సేవ. దాన్ని చూసి దేవుడు మందహాసం చేస్తాడు. టెస్టిమొనీస్, సం. 2, పు. 24.ChSTel 316.4

  సాతాను ఎవరిని నీచపర్చి వారి ద్వారా పని చేస్తాడో, భ్రష్టమైన నిరీక్షణలేని ఆ వ్యక్తుల్ని క్రీస్తు తీసుకుని తన కృపకు పాత్రుల్ని చెయూనికి సంతోషిస్తాడు. ఈ సేవను పూర్తి చెయ్యటానికి తన బిడ్డల్ని తన ప్రతినిధులుగా చేసుకుంటాడు. దాని జయంలో ఈ జీవితంలో సయితం వారికి ప్రశస్త బహుమానం లభిస్తుంది. టెస్టిమొనీస్, సం.6, పులు. 308, 309.ChSTel 316.5

  దీవెన : క్రీస్తు నిమిత్తం మనం చేసే ప్రతి ప్రయత్నం తిరిగి మనకు దీవెనగా పని చేస్తుంది. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 354. ChSTel 317.1

  నెరవేర్చిన ప్రతీ విధి, యేసు నామంలో చేసిన ప్రతీ త్యాగం గొప్ప ప్రతిఫలాన్ని తెస్తుంది. విధి నిర్వహణ చర్యలోనే దేవుడు మాట్లాడి తన దీవెనలిస్తాడు. టెస్టిమొనీస్, సం. 4, పు. 145.ChSTel 317.2

  రక్షకునికి ఆత్మల్ని సంపాదించటానికి మనం లోకంలో నివసించాలి. మనం ఇతరులుకి హాని చేస్తే మనకి కూడా హాని చేసుకుంటాం. మనం ఇతరులకి మేలు చేస్తే మనకి మనం మేలు చేసుకుంటాం. ఎందుకంటే ప్రతీ సత్కార్య ప్రభావం మన సొంత హృదయాల పై ప్రతిబింబిస్తుంది. టెస్టిమొనీస్, సం. 4, పు. 72.ChSTel 317.3

  మనం ఇతరుల పై ప్రకాశింపజేసే ప్రతీ వెలుగు కిరణం మన సొంత హృదయాల పై ప్రతిబింబిస్తుంది. దుఃఖించే వారికి చెప్పే ప్రతీ దయ సానుభూతి గల మాట, బాధితులికి ఉపశమనం కలిగించే ప్రతీ చర్య, తోటి మానవుల అవసరాల్ని తీర్చటానికి ఇచ్చే ప్రతీ వరం, దేవుని మహిమను దృష్టిలో ఉంచుకుని చేసినప్పుడు, ఇచ్చే వారికి దీవెనగా పరిణమిస్తుంది. ఈ విధంగా పనిచేసేవారు దేవుని ధర్మ శాస్త్రానికి విధేయులవుతున్నారు. వారు దేవుని ఆమోదం పొందుతారు. టెస్టిమొనీస్, సం.4, పు. 56.ChSTel 317.4

  చివరి ప్రతిఫలం క్రీస్తు రాక సమయంలో అనుగ్రహించబడాల్సి ఉండగా, యధార్థ హృదయంతో చేసే దైవ సేవకు ఈ జీవితంలో సహితం ప్రతిఫలం కలుగుతుంది. దైవ సేవకుడికి ఆటంకాలు, వ్యతిరేకరత, హృదయాన్ని చీల్చే తీవ్ర ఆశాభంగాలు ఎదురవుతాయి. అతడు తన శ్రమ ఫలితాన్ని చూడకపోవచ్చు. అయినప్పటికీ అతడి సేవలో ఓ శుభప్రదమైన ప్రతిఫలం ఉంటుంది. మానవాళికి స్వార్థ రహిత సేవ చెయ్యటానికి తమ జీవితాల్ని దేవునికి సమర్పించుకునే వారందరు మహిమ ప్రభువుతో సహకరిస్తున్నారు. ఈ భావన శ్రమ అంతటినీ మధురం చేస్తుంది, చిత్తాన్ని బలపర్చుతుంది. ఏమి సంభవించినా దానికి ఆత్మను పటిష్ఠపర్చుతుంది. టెస్టిమొనీస్, సం.6, పులు. 305, 306.ChSTel 317.5

  ఆరోగ్యం : మేలు చెయ్యటం వ్యాధికి భేషైన ఔషధం. ఈ సేవ చేస్తున్న వారు దేవునికి ప్రార్ధించాల్సిందిగా ఆహ్వానించబడుతున్నారు. వారి మనవులు ఆలకిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. క్షామ కాలంలో వారి ఆత్మకు తృప్తి లభిస్తుంది. వారు ఎన్నడు ఎండిపోని నీటి సరఫరా ఉన్న ఉద్యాన వనంలా వర్ధిల్లుతారు. టెస్టిమొనీస్, సం.2, పు. 29. ChSTel 318.1

  దేవునితోను, క్రీస్తుతోను, పరిశుద్ధ దూతలతోను సహవాసం చేస్తూ వారు పరలోక వాతావరణంలో, అనగా శరీరానికి ఆరోగ్యాన్ని, మనసుకు బలాన్ని, ఆత్మకు ఆనందాన్ని సమకూర్చే వాతావరణంలో నివసిస్తారు. టెస్టిమొనీస్, సం.6, పు. 306.ChSTel 318.2

  ఇతరులకి మేలు చెయ్యటంలో ఉన్న ఆనందం మనోభావాలకి తేజస్సునిస్తుంది. అది నరాలగుండా ప్రవహించే ఉద్వేగాలకు ప్రకాశాన్నిచ్చి రక్త ప్రసారానికి చురుకుతనం పుట్టించి, మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. టెస్టిమొనీస్, సం.4, పు. 56.ChSTel 318.3

  శక్తి: ఓ బలమైన మనిషిని పని చెయ్యకుండా ఉంచండి. అతడు బలహీనుడవుతాడు. ఇతరుల భారాల్ని భరించడకుండా దూరంగా ఉండే సంఘం లేక వ్యక్తులు తమ లోకంలో తామే ఉండే వ్యక్తులు త్వరలో ఆధ్యాత్మిక దుర్బలతకు గురిఅవుతారు. బలవంతుణ్ని బలంగా ఉంచేది శారీరక శ్రమ. పని చెయ్యటం, కష్టాలు భరించటం వంటి ఆధ్యాత్మిక శ్రమదానం క్రీస్తు సంఘానికి శక్తి నిస్తుంది. టెస్టిమొనీస్, సం. 2, పు. 22.ChSTel 318.4

  సమాధానం: ఇతరులకి సహాయం చెయ్యటంలో ఓ మధురమైన తృప్తి, అంతర్గత సమాధానం లభిస్తాయి. అవే ఓ మంచి బహుమానం. ఇతరులకు మేలు చెయ్యటానికి ఉన్నతమైన ఆకాంక్షతో క్రియాచరణకి పూనిక వహించే వారు జీవితంలోని వివిధ విధుల్ని నమ్మకంగా నిర్వర్తించటంలో నిజమైన ఆనందాన్ని కనుగొంటారు. ఇది లౌకిక బహుమానం కన్నా గొప్ప బహుమానాన్ని తెస్తుంది. ఎందుకంటే ప్రతీ విధిని నమ్మకంగా నిస్వార్థంగా నిర్వహించినప్పుడు దాన్ని దూతలు గుర్తించటం జరుగుతుంది. అది జీవిత రికార్డులో కాశిస్తూ ఉంటుంది. టెస్టిమొనీస్, సం. 2, పు. 132.ChSTel 318.5

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents