Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    శిక్షణ సమకూర్చే బాధ్యత

    తిమోతీలా, మంచి భవిష్యత్తు, ప్రతిభ గల మనుషులు మారుమనసు పొంది క్రైస్తవం స్వీకరించినప్పుడు, వారు దేవుని ద్రాక్ష తోటలో పని చెయ్యటం అవసరమని చూపించటానికి పౌలు బర్నబాలు ప్రయత్నించారు. ఆ అపొస్తలులు మరో స్థలానికి వెళ్లినప్పుడు, ఈ మనుషుల విశ్వాసం తగ్గలేదు పెరిగింది. పౌలు బర్నబాలు ఆ విశ్వాసులుకి దేవుని మార్గాన్ని నమ్మకంగా ఉపదేశించి, తమ తోటి మనుషులికి రక్షణమార్గం చూపించటానికి స్వార్థరహితంగా, చిత్తశుద్ధితో, పట్టుదలతో ఎలా పనిచెయ్యాలో నేర్పించారు. పౌలు బర్నబాలు అన్యుల భూభాగాల్లో సువార్త ప్రకటించినప్పుడు వారికి కలిగిన గొప్ప విజయానికి వారు నూతన విశ్వాసులకి ఇచ్చిన శిక్షణ ముఖ్యకారణమయ్యింది. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పులు. 186, 187. ChSTel 66.1

    సంఘాల్ని స్థాపించేటప్పుడు, ఇతరులికి సత్యాన్ని అందించి, కొత్త సంఘాలు స్థాపించటానికి తమలో నుంచి సయితం మనుషులు వెళ్లాలన్న ధ్యేయాన్ని వాటి ముందుంచాలి. కాబట్టి వారందరూ కలిసి పనిచేస్తూ, దేవుడు తమకిచ్చిన తలాంతుల్ని సాధ్యమైనంత మేరకు వృద్ధిపర్చుకుని, ప్రభువు సేవకు తమ మనసుల్ని తర్బీతు చేసుకుంటూ ఉండాలి. టెస్టిమొనీస్, సం. 3, పు. 205.ChSTel 66.2

    మిషనెరీ వ్యవహారాల నిర్వాహకులు సరియైన మానసిక తరగతికి చెందిన పనివారు లేక అనగా మన విశ్వాసాన్ని నిర్దుష్టంగా సూచించే ఆత్మసమర్పణ, భక్తిగల పనివారు లేక నిత్యం ఇబ్బంది పడుతున్నారు. మిషనెరీలు కావలసిన వారు గాని వారితో కలిసి సంఘంలో ఉన్నవారుగాని లేదా మన కళాశాలల్లో ఉన్నవారుగాని తమ శక్తులన్నిటిపై దేవుని హక్కును వారికి విశదం చెయ్యటానికి, వారితో కలిసి వారికొరకు ప్రార్ధన చెయ్యటానికి హృదయభారం కనపర్చనందువల్ల, సేవారంగంలో ప్రవేశించనివారు చాలామంది ఉన్నారు. కాన్సేల్స్ టు టీచర్స్, పేరెన్ట్స్ అండ్ స్టూడెంట్స్, పులు. 500, 501.ChSTel 66.3

    సంఘంపై ఆధ్యాత్మిక అజమాయిషీ బాధ్యతలు గలవారు ప్రతీ సంఘసభ్యుడు దేవుని సేవలో ఏదోపాత్ర నిర్వహించటానికి అవకాశం కల్పించటానికి మార్గాలు సదుపాయాలు ఏర్పాటు చెయ్యాలి. ఇది గతంలో ఎక్కువ జరగలేదు. అందరి ప్రతిభాపాటవాల్ని దేవుని సేవలో ఉపయోగించటానికి ప్రణాళికలు తయారు చేసుకోటం వాటిని అమలుపర్చటం జరగలేదు. ఈ కారణంగా ఎంత నష్టం సంభవించిందో గుర్తించేవారు బహుకొద్దిమంది మాత్రమే. టెస్టిమొనీస్, సం. 9, పు. 116.ChSTel 67.1

    ప్రతీ సంఘంలోను సభ్యులు క్రీస్తుకి ఆత్మల్ని సంపాదించటంలో తమ సమయం వినియోగించేలా వారికి శిక్షణనివ్వాలి. సంఘ సభ్యులు వాస్తవంలో వెలుగు అందించకపోతే “మీరు లోకమునకు వెలుగైయున్నారు” అని సంఘం గురించి ఎలా చెప్పటం సాధ్యపడుతుంది? క్రీస్తు మందకు నాయకులైనవారు మేల్కొని తమ విధిని చేపట్టి అనేకమందిని దేవుని పనిలో వినియోగింతురుగాక. టెస్టిమొనీస్, సం. 6, పు. 136.ChSTel 67.2