Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    యుగాల సంక్షోభం

    మనం యుగాల సంక్షోభం ద్వారంలో నిలబడి ఉన్నాం. దేవుని తీర్పులు - అగ్ని ప్రమాదాలు, వరదలు, భూకంపాలు, యుద్దాలు, రక్తపాతం ఒకదాని వెనక ఒకటి వస్తాయి. ఈ సమయంలో గొప్ప, నిర్ణయాత్మక ఘటనలు మనల్ని ఆశ్చర్యపర్చకూడదు. ఎందుకంటే పాపపశ్చాత్తాపం లేనివారిని కాపాడటానికి కృపాదూత ఎక్కువ సేపు ఆగలేడు. ప్రోఫెట్స్ అండ్ కింగ్స్, పు. 278. ChSTel 54.1

    ఈ క్లిష్ట పరిస్థితి క్రమక్రమంగా వచ్చి మన మీద పడుతుంది. సూర్యుడు యధావిధిగా ప్రకాశిస్తాడు. ఆకాశాలు ఆయన మహిమను ఇంకా వివరిస్తూనే ఉన్నాయి. మనుషులు ఇంకా తింటూ, తాగుతూ, మొక్కలు నాటుకుంటూ, ఇళ్లు కట్టుకుంటూ, పెళ్లి చేసుకుంటూ, పెళ్లికిచ్చుకుంటూ ఉన్నారు. వర్తకులు ఇంకా కొంటున్నారు, అమ్ముతున్నారు. ఉన్నత స్థానంకోసం పోటీపడుతూ మననుషులు ఒకరి మీద ఒకరు పడుతూ పరుగులు తీస్తున్నారు. వినోద ప్రేమికులు ఇంకా సినిమా హాళ్లకి, గుర్రం పందాలకి, జూదపు నరకానికి పెద్ద సంఖ్యలో వెళ్తూనే ఉన్నారు. ఉద్రేకం ఉత్సాహం పరాకాష్ఠకు చేరుతున్నాయి. అయితే కృపకాలం త్వరత్వరగా ముగింపుకి వస్తున్నది. ప్రతీ కేసు నిత్యకాలికమైన తీర్పుకి సిద్దంగా ఉన్నది. సాతాను తన సమయం ఎక్కువలేదని గ్రహిస్తాడు. కృపకాలం అంతమై కృపా ద్వారం నిరంతరంగా మూతపడే వరకు మునుషుల్ని మోసగించి, వారి మనసుల్ని ఆకట్టుకుని వారిని ఆశ్చర్యంలో ముంచేందుకు తన ప్రతినిధుల్ని వినియోగిస్తాడు. సదర్న్ వాచ్ మేన్, అక్టో. 3, 1905. ChSTel 54.2

    ఉల్లంఘన దాదాపు దాని హద్దును చేరుకుంటుంది. లోకం గందరగోళంతో నిండింది. త్వరలో గొప్ప భయం మానవుల పై విరుచుకుపడనుంది. అంతం అతిసమీపంలో ఉంది. సత్యం తెలిసిన మనం త్వరలో లోకం మీదికి మిక్కిలి ఆశ్చర్యంగా రానున్న ఘటనకు సిద్ధపడుతూ ఉండాలి. టెస్టిమొనీస్, సం.8, పు. 28.ChSTel 55.1

    పాపం అధర్మం విస్తరిస్తున్న ఈ సమయంలో మనం ఆ చివరి అపూర్వ సంక్షోభం అతి సమీపంలో ఉన్నదని గ్రహించవచ్చు. దైవ ధర్మశాస్త్ర ధిక్కరణ దాదాపు లోకవ్యాప్తమైనప్పుడు, దైవ ప్రజలు తోటి మానవుల వలన శ్రమలు హింసకు గురి అయినప్పుడు ప్రభువు కలుగజేసుకుంటాడు. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 178.ChSTel 55.2

    గంభీర సంఘటనల ద్వారంలో మనం నిలిచి ఉన్నాం. ప్రవచనాలు నెరవేరుతున్నాయి. పరలోక గ్రంథాల్లో విచిత్రమైన, చరిత్రాత్మకమైన విషయాలు దాఖలవుతున్నాయి. మన లోకంలోని సమస్తం ఆందోళనకరంగా ఉంది. యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్దాలు గురించి పుకార్లు వినబడుతున్నాయి. జాతులు ఆగ్రహంతో నిండి ఉన్నాయి. మృతులు తీర్పు పొందాల్సిన సమయం వచ్చింది. రావటానికి తొందరపడుతున్న ప్రభువు దినం సంభవించటానికి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్క క్షణం మాత్రమే ఉన్నట్లు కనిపిస్తున్నది. అయితే ఇప్పటికే దేశం మీదికి దేశం, రాజ్యం మీదికి రాజ్యం లేస్తూ ఉండగా ఇప్పుడే సామాన్య యుద్ధం జరగటం లేదు. దైవ సేవకులు తమ నొసళ్లపై ముద్ర పొందేవరకు నాలుగు గాలులూ ఆపుచెయ్యబడ్తున్నాయి. అప్పుడు లోక రాజ్యాలు చివరి మహాసంగ్రామానికి తమ బలగాల్ని మోహరిస్తాయి. టెసిమొనీస్, సం.6, పు. 14.ChSTel 55.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents