Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    సంస్కృతి గల భాష

    భాషను సరిగా వృద్ధిపర్చుకుని చక్కగా మాట్లాడే శక్తి క్రైస్తవ సేవా శాఖలన్నిటిలోను అవసరమౌతుంది. ఇం పైన స్వరంతో మాట్లాడటం, స్వచ్చమైన, తప్పులు లేని భాష ఉపయోగించటం, దయ, మర్యాద గల మాటలు వాడటం మనం అలవర్చుకోవాలి. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు, 336.ChSTel 261.4

    తాను నిత్యమైన ఆసక్తులకి సంబంధించిన వర్తమానాన్ని ప్రజలకు అందిస్తున్నానని ప్రతీ వాక్యపరిచారకుడు, ప్రతీ ఉపాధ్యాయుడు మనసులో ఉంచుకోవాలి. ఉచ్చరించిన సత్యం ఆ చివరి మహా తీర్పునాడు వారికి తీర్పు తీర్చుతుంది. కొందరి విషయంలో వర్తమానం అందించే వ్యక్తి మాటల తీరును బట్టి వర్తమాన్ని అంగీకరించటం లేక విసర్జించటం జరుగుతుంది. కాబట్టి అవగాహన కలిగించి, హృదయాన్ని ప్రభావితం చేసే విధంగా మాట్లాడదాం. మాటల్ని సాఫీగా, స్పష్టంగా, గంభీరంగా, వాటి ప్రాముఖ్యత డిమాండుచేసే గంభీరత, నిజాయితీలతో ఉచ్చరించాలి. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్,ChSTel 262.1

    మీరు ఇతరుల్ని క్రీస్తు ప్రేమ పరిధిలోకి ఆకర్షించేటప్పుడు మా ప్రేమ శుద్ధంగాను, మీ సేవ నిస్వార్థంగాను, మా లైఖరి ఉత్సాహంగాను ఉండి ఆయన కృపనుగురించి సాక్ష్యం ఇవ్వాలి. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 156.ChSTel 262.2

    ప్రతీ క్రైస్తవుడు శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యాన్ని ఇతరులికి చాటించటానికి పిలుపుపొందుతున్నాడు. కనుక ప్రతి క్రైస్తవుడు తన మాటను పరిపూర్ణం చేసుకోటానికి కృషి చెయ్యాలి. ఇతరులికి సిఫారసు చేసేవిధంగా అతడు దైవ వాక్యాన్ని సమర్పించాలి. తన మానవ ప్రతినిధులు మోటుగా ఉండాలని దేవుడు సంకల్పించటంలేదు. మానవుడు తన ద్వారా లోకానికి ప్రవహించే పరలోక విద్యుత్తును కించపర్చటంగాని భ్రష్టపర్చటం గాని వెయ్యకూడదు. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పులు. 336.ChSTel 262.3

    ఓర్పులోను, దయలోను, స్నేహమర్యాదల్లోను, సహాయమందించటంలోను వారు శిక్షణ పొందుతారు. తమ మిత్రుడు క్రీస్తు కఠినమైన నిర్దయగల మాటలు లేక మనోభావాల్ని సమ్మతించడని గుర్తుంచుకుని వారు యధార్థ క్రైస్తవ మర్యాదను పాటిస్తారు, వారి మాటలు పవిత్రంగా ఉంటాయి. ఓ ఉన్నత, పరిశుద్ద సేవ చెయ్యటానికి తమకు వాక్శక్తి ప్రశస్త వరంగా అరువుగా ఇవ్వబడిందని భావిస్తారు. గాసిపుల్ వర్కర్స్, పు. 97.ChSTel 262.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents