Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    జయానికి అత్యవసరాలు

    నేటి కాలానికి ఉద్దేశించిన సత్యాన్ని గూర్చిన జ్ఞానాన్ని, పురోగమిస్తున్న దైవ సేవలో ఆయన ఆశ్చర్యకరమైన కృపల్ని గూర్చిన జ్ఞానాన్ని ఇతరులకు అందించటానికి ఏర్పాటైన ఏ ప్రణాళికనైనా అనుసరించటంలో మనం ఎవరి నామాన్ని ఘనపర్చాలని ఆశిస్తున్నామో ఆ ప్రభువుకి ముందుగా మనల్ని మనం ప్రతిష్టించు కుందాం. మనం ఎవరిని సందర్శించగోరుతున్నామో వారిని దేవుని సన్నిధిలోకి తెచ్చి వారిలో ప్రతీ ఒక్కరి గురించి సజీవ విశ్వాసంతో ప్రార్ధన చేద్దాం. మానవుడి తలంపులు ఉద్దేశాలు దేవునికి తెలుసు. ఆయన మన మనసుల్ని ఎంత సులభంగా కరిగించగలడు! ఆయన ఆత్మ, అగ్నిలా, హృదయాన్ని ఎలా వశపర్చుకోగలుగుతుంది! ఆత్మను ప్రేమతో కరుణతో ఆయన ఎలా నింపుతాడు! తన పరిశుద్దాత్మ కృపలను మనకిచ్చి, ఆత్మలకోసం పనిచెయ్యటంలో లోపలికి వెళ్లటానికి బయటికి రావటానికి మనల్ని ఎలా సమర్ధుల్ని చేస్తాడు! ఎమ్ఎస్, “కాన్సిక్రేటెడ్ ఎఫర్ట్స్ టు రీచ్ అన్ బిలీవర్స్,” జూన్ 5, 1914.ChSTel 197.2

    మనుషులతో తెలివిగా మెలగుతూ మనం మన సేవను గురించి వారికి వివరించి, దాని పురోగతికి తోడ్పడటం తమ ఆధిక్యతని వారిని ప్రోత్సహిస్తే, దేవుని సేవకు ఇప్పటికన్నా ఎక్కువ ఆదరణ ప్రోత్సాహం లభించేవి. దేవుని సేవ కులుగా మనం వివేకవంతమైన మార్గాన్ని అనుసరించినట్లయితే, మన కృషిలో ఆయన బాహువు మనకు వృద్దిననుగ్రహిస్తుంది. సదర్న్ వాచ్ మేన్, మార్చి 15, 1904.ChSTel 198.1

    ప్రభువు సేవలో ఉన్నవారందరు తమ విశ్వసనీయత మీద, జ్ఞానవివేకాల మిద ఎంత ఆధారపడి ఉంటుందో గుర్తిస్తే, వారి కృషి ఫలితంగా మరింత వృద్ధి సాధ్యపడుతుంది. సంశయం, వెనకబాటుతనం వల్ల మనం ప్రభుత్వాల నుంచి మన హక్కుగా పొందగలదాన్ని తరచు పొందలేకపోతున్నాం. మన వంతుగా మనం చెయ్యగలిగింది చెయ్యాల్సింది మనం చేసినప్పుడు దేవుడు మన పక్షంగా పనిచేస్తాడు. సదర్న్ వాచ్ మేన్, మార్చి 15, 1904.ChSTel 198.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents