Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అధ్యాయం-5
    సంఘం శిక్షణ కేంద్రం

    ప్రస్తుత అవసరం

    ఇప్పుడు మన సంఘాల్ని అభివృద్ధి పర్చటానికి జరగాల్సింది సంఘంలోని ప్రతిభను, ప్రభువుసేవలో ఉపయోగించగల ప్రతిభను గుర్తించి వృద్దిపర్చటానికి కృషి చేసేందుకు వివేకంగల పనివారి సేవ. మన సంఘాల్లోకి వెళ్లి - అవి పెద్దవేగాని చిన్నవేగాని - సంఘాల్ని వృద్ధిపర్చటం, అవిశ్వాలకోసం పని చెయ్యటం పై సంమసభ్యులికి ఉపదేశించటానికి పని వారి నియామకానికి గట్టి ప్రణాళికను రూపొందించటం జరగాలి. కావలసింది శిక్షణ, విద్య, సంఘాల్నిసందర్శించే బాధ్యతలు గలవారు సహోదరులకు సహోదరీలకు మిషనెరీ సేవ చెయ్యటానికి ఆచరణాత్మక పద్ధతుల పై ఉపదేవం ఇవ్వాలి. టెస్టిమొనీస్, సం.9, పు. 117.ChSTel 63.1

    తనను గూర్చిన జ్ఞానాన్ని తన సంవసభ్యులు లోకానికి అందించటానికి సంఘం క్రమ శిక్షణ నిచ్చి వారిని సమర్థుల్ని చెయ్యాలని దేవుడు కోరుతున్నాడు. విలువైన తలాంతుల్ని వినిమయదారులికి అందించే విద్యను వందలాది ప్రజలకు అందించాలి. ఈ తలాంతుల వినియోగం ద్వారా వ్యక్తులు బాధ్యత, పలుకుబడిగల స్థానాల్ని ఆక్రమించటానికి, పవిత్రమైన, పరిశుద్దమైన నియమాల్ని అనుసరించటానికి సిద్దం చెయ్యబడతారు. ఇలా ప్రభువు సేవకు గొప్ప సహాయం చెయ్యటానికి వీలవుతుంది. టెస్టిమొనీస్, సం.6, పు. 431, 432.ChSTel 63.2

    ప్రతీ పనివాడు అవగాహన, నిపుణత కలిగి పనిచెయ్యాలి. అప్పుడు ఉన్నత, విశాల దృక్పధంతో ఈ దినాలకు దేవుడు ఏర్పాటు చేసిన సత్యాన్ని క్రీస్తులో ఉన్న రీతిగా అతడు ప్రకటించగలగుతాడు. టెస్టిమొనీస్, సం.7, పు. 70.ChSTel 63.3

    సంఘసభ్యుల్ని తర్బీతు చెయ్యటానికి గట్టి ఏర్పాట్లు చెయ్యటంలో జాప్యం జరగకూడదు. టెస్టిమొనీస్, సం.9, పు. 119. ChSTel 63.4

    దేవుని సేవ చెయ్యటం, వాక్యపరిచారకుల మీద కాక దేవుని మీద ఆధారపడటం మన ప్రజలకు నేర్పించటం మనం చెయ్యగల అతిగొప్ప సహాయం . టెస్టిమొనీస్, సం.7, పు. 19.ChSTel 64.1

    బోధకులు ప్రసంగించిన ప్రసంగాలన్నీ తమను తాము ఉపేక్షించుకునే పెద్ద సేవకవర్గాన్ని తయారు చెయ్యలేకపోయాయన్నది స్పష్టం. ఇది తీవ్ర ఫలితాలకి దారితీసే అంశం. నిత్యజీవానికి సంబంధించిన మన భవిష్యత్తును తేల్చే అంశం. తమ తలాంతుల్ని వెలుగును వెదజల్లటానికి ఉపయోగించటంలో విఫలమైనందువల్ల సంఘాలు క్షీణిస్తున్నాయి. అందరూ తమ వెలుగును ఆచరణాత్మకంగా ఉపయోగించేందుకు జాగ్రత్తగా ఉపదేశించటం జరగాలి. అది రక్షకుడిచ్చిన ఉపదేశంలా ఉంటుంది. టెస్టిమొనీస్, సం.6, పు. 431.ChSTel 64.2

    ప్రజలు చాలా నీతిబోధ విన్నారు. అయితే క్రీస్తు ఏ ఆత్మల నిమిత్తం మరణించాడో వారికోసం ఎలా పనిచెయ్యాలో వారికి నేర్పటం జరుగుతున్నదా? ఓ సేవా పద్దతిని రూపొందించి, ప్రతీవారు దానిలో పాలుపంచుకునే అవసరాన్ని గుర్తించేటట్టుగా వారి ముందు దాన్నుంచటం జరుగుతున్నదా? టెస్టిమొనీస్, సం.6, పు. 131.ChSTel 64.3

    సంభవించగల అత్యవసర పరిస్థితిని ఎదుర్కోటానికి వ్యక్తులు శిక్షణ ఆచరణ ద్వారా అర్హత సంపాదించాలి. బాధ్యతను వహించటానికి తనను యోగ్యుణ్ని చేసే అనుభవాన్ని ప్రతీవ్యక్తి సంపాదించేందుకు ప్రతి వ్యక్తిని తన ఉచిత స్థానంలో ఉంచాలి. టెస్టిమొనీస్, సం.9, పు. 221,222.ChSTel 64.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents