Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First

  అధ్యాయం 26
  విజయానికి హామి

  దేవుని హామి

  మనం పనిముట్లు సమకూర్చితే దేవుడు పనిని చేస్తాడు. టెస్టిమొనీస్, సం. 9, పు. 107.ChSTel 302.1

  పూర్ణ హృదయంతో చేసే సేవను దేవుడు అంగీకరించి, లోటుల్ని తానే పూరిస్తాడు. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 150.ChSTel 302.2

  తాను చేసిన కార్యం గుర్తించ తగింది కాదని కార్యకర్త భావించినప్పటికీ, ప్రతీ నీతి కార్యం చిరస్మరణీయమౌతుంది. టెస్టిమొనీస్, సం. 2, పు. 683.ChSTel 302.3

  మీరు నిజంగా దేవునికి సమర్పించుకున్న వారైతే, చీకటిలో కొట్టుమిట్టాడుతున్న వారికి వెలుగు చేరవెయ్యటానికి తన సాధనాలుగా ఉపయోగించగల వారిని ఆయన మిద్వారా సత్యంలోకి తెస్తాడు. టెస్టిమొనీస్, సం. 7, పు. 63. ChSTel 302.4

  త్వరలో సత్యం విజయం సాధిస్తుంది. ఇప్పుడు దేవుని జతపనివారుగా సేవ చేస్తున్న వారందరూ దానితో విజేతలవుతారు. టెస్టిమొనీస్, సం. 9, పు. 135.ChSTel 302.5

  ఏమి మినహాయించుకోకుండా దేవుని సేవకు తన్నుతాను సమర్పించుకునే ప్రతీ వ్యక్తికి అపరిమితమైన ఫలితాలు సాధించే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. టెస్టిమొనీస్, సం. 7, పు. 30.ChSTel 302.6

  సాటి మనుషుల రక్షణ కోసం మనం హృదయశుద్ధితో పని చేసినప్పుడు మన కృషిని దేవుడు ఫలింపజేస్తాడు. టెస్టిమొనీస్, సం. 9. పు. 86.ChSTel 302.7

  తన ప్రణాళికలో ప్రతీ వ్యక్తికీ దేవుడు ఓ స్థానాన్ని ఏర్పాటు చేశాడు. అవసరం లేని వరాల్ని దేవుడు ఇవ్వడు. ఓ వరం చిన్న వరమనుకుందాం. దాని కోసం దేవునికో స్థలం ఉంటుంది. ఆ ఒక్క వరాన్ని సరిగా వినియోగిస్తే అది ఏ పని చెయ్యాలని దేవుడు ఉద్దేశిస్తాడో ఆ పనిని అది చేస్తుంది. టెస్టిమొనీస్, సం. 9, పు. 37.ChSTel 303.1

  క్రీస్తుతో సహకరించి పని చేసే సామాన్య పనివారు హృదయ వీణి తీగలు మాటవచ్చు. వాటి ధ్వని భూదిగంతాల వరకూ వినిపిస్తూ నిత్యజీవ యుగాల పొడుగునా మధుర గానమౌతుంది. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 159.ChSTel 303.2

  ఏ రకమైన పనిలోనైనా వాస్తవిక విజయం దానంతట అదే సంభవించేదిగాని యాదృచ్ఛికంగా కలిగేదిగాని విధి విలాసం వల్ల చోటు చేసుకునేది గాని కాదు. అది క్రియాత్మకమైన దేవుని కృపా సంకల్పం. అది విశ్వాసం, వివేకం, సచ్చీలం, నిరంతర శ్రమ ప్రతిఫలం. సున్నితమైన మానసిక గుణలక్షణాలు, సమున్నతమైన నైతిక ప్రవృత్తి ప్రమాదవశాత్తు లభించవు. దేవుడు అవకాశాలిస్తాడు. జయం వాటిని ఉపయోగించుకోటంపై ఆధారపడి ఉంటుంది. ప్రోఫెట్స్ అండ్ కింగ్స్, పు. 486.ChSTel 303.3

  స్వదేశంలోగాని ఇతర దేశాల్లోగాని సేవలో ప్రవేశించాలని మనసు కలిగిన వారు ప్రభువు నామంలో ముందుకి సాగాలి. కృపకోసం, శక్తికోసం వారు దేవుని పై ఆధాపడితే విజయం సాధిస్తారు. ఆరంభంలో వారి పని చిన్నది కావచ్చు. అయినా వారు ప్రభువు ప్రణాళికల్ని అనుసరిస్తే, అది విస్తరిస్తుంది. దేవుడు సజీవుడు. అతడు ఎవరైనా, ఎక్కడున్నా స్వార్ధరహిత, ఆత్మ త్యాగ స్పూర్తిగల సేవకుడి పక్షంగా ఆయన పనిచేస్తాడు. సదర్న్ వాచ్ మెన్, ఏప్రి. 9, 1903.ChSTel 303.4