Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    పరలోక రిజిష్టరు

    లోకానికి మిషనెరీలు, అంకిత భావంగల స్వదేశ మిషనెరీలు అవసరం. మిషనెరీ స్వభావం లేనివారెవ్వరూ పరలోక గ్రంథాల్లో క్రైస్తవుడిగా నమోదు కారు. రివ్యూ అండ్ హెరాల్డ్, ఆగ, 23, 1892.ChSTel 98.2

    సంఘసభ్యులు ఈ సేవను వ్యక్తిగతంగా చేపట్టకపోతే, తమకు దేవునితో సజీవ సంబంధం లేదని చూపిస్తారు. వారి పేర్లు సోమరి సేవకులుగా నమోదవుతాయి. టెస్టిమొనీస్, సం. 5 పులు. 462, 463. ChSTel 98.3

    ప్రతీ మత ఉద్యమంలో-అది దేవుని కార్యం కాదనలేకపోయినప్పటికిదానికి దూరంగా ఉంటూ ఎలాంటి సహాయం చెయ్యటానికి నిరాకరించేవారు కొందరుంటారు. పరలోకంలో రికార్డు ఉన్నది, అందులో లోపాలుగాని పొరపాట్లుగాని ఉండవని, అందులోని దాఖలాల ఆధారంగానే తీర్పు జరుగుతుందని అలాంటివారు గుర్తుంచుకోటం మంచిది. దేవునికి సేవ చెయ్యటానికి జారవిడిచిన ప్రతీ అవకాశం దాఖలవుతుంది. అక్కడే ప్రతీ విశ్వాస క్రియ, ప్రేమాకార్యం దాఖలై నిత్యం జ్ఞాపకముందచు కునేందుకు నిలిచి ఉంటుంది. ప్రోఫెట్స్ అండ్ కింగ్స్, పు. 639.ChSTel 98.4

    1879 అక్టోబరు 23 ఉదయం సుమారు రెండు గంటలకి ప్రభువు ఆత్మ నా మీదికి రాగా రానున్న తీర్పు దృశ్యాల్ని చూశాను... పెద్ద సింహాసనం ముందు వేవేల ప్రజలు సమావేశమయ్యారు. ఆ సింహాసనంపై ఠీవిగల ఓ వ్యక్తి కూర్చున్నాడు. ఆయన ముందు చాలా గ్రంథాలున్నాయి. వాటిలోని ప్రతీ గ్రంథం అట్టమీద మండుతున్న అగ్నివంటి సువర్ణాక్షరాల్లో “పరలోక లెడ్జర్” అని రాయబడి ఉంది. ఈ గ్రంథాల్లో ఒకదానిలో సత్యాన్ని నమ్ముతున్నట్లు చెప్పేవారి వేర్లున్నాయి. అది అప్పుడు తెరవబడింది. వెంటనే సింహాసనం చుట్టూ ఉన్న లక్షలాది ప్రజల పై నుంచి నాదృష్టి మళ్లింది. వెలుగు, సత్యం గల దైవ ప్రజలుగా చెప్పుకుంటున్నవారే నా దృష్టిని ఆకర్షించారు.ChSTel 98.5

    ఇంకో గ్రంథం తెరవబడింది. సత్యాన్ని నమ్ముతున్నట్లు చెప్పుకునే వారి పాపాలు అందులో దాఖలై ఉన్నాయి. స్వార్థప్రితియత్వం అన్న సాధారణ అంశం కింద ప్రతీ ఇతర పాపం ఉంది... ఓ తరగతి ప్రజలు భూమికి భారంగా నమోదయ్యారు. న్యాయాధిపతి తీక్షణ దృష్టి వీరిమీద నిలవగా వారు నిర్లక్ష్యం చేసిన పాపాలు స్పష్టంగా వెల్లడయ్యాయి. వారు తమ కప్పగించబడ్డ పరిశుద్ద విషయాల సందర్భంగా ద్రోహం చేశామని పాలిపోయిన, వణుకుతున్న పెదాలతో ఒప్పుకున్నారు. వారికి హెచ్చరికలు వచ్చాయి, ఆధిక్యతలున్నాయి. కాని వారు వాటిని లెక్క చెయ్యలేదు. సద్వినియోగపర్చుకోలేదు. తాము దేవుని కృపను గురించి తప్పుడు అభిప్రాయాలతో ఉన్నామని ఇప్పుడు గ్రహించారు. నిజమే, దుష్టులు, నికృష్టపాపులు చేయాల్సిన ఒప్పుకోళ్లు వారు చెయ్యాల్సిలేరు. కాని, అంజూరపు చెట్టులా ఫలాలు ఫలించనందుకు, తమకు ఇచ్చిన తలాంతల్ని వినియోగించనందుకు వారు శపించబడ్డారు. ఈ తరగతి ప్రజలకి స్వార్థం ప్రధానం. వారు స్వార్ధ ప్రయోజనం కోసమే పని చేశారు. వారు పరలోకంలో ధనం కూర్చుకోలేదు. దేవుని హక్కుల విషయంలో స్పందించలేదు. క్రీస్తు సేవకులమని చెప్పుకున్నా వారు ఆయనకు ఆత్మల్ని సంపాదించలేదు. దేవుని సేవ వారి పని మీదే ఆధారపడి ఉంటే అది క్షీణించేది. ఎందుకంటే దేవుడు తమకిచ్చిన ధనాన్ని అట్టి పెట్టుకోటమే కాదు వారు తమని తాము అట్టి పెట్టుకున్నారుకూడా... ప్రభువు ద్రాక్షతోటలో పని చెయ్యటానికి, పంట బాధ్యతలు నిర్వహించటానికి వారు ఇతరులికి అనుమతి ఇచ్చి తాము మాత్రం తమ ఐహికాసక్తుల్లో తలమునకలయ్యారు.ChSTel 99.1

    న్యాయాధిపతి ఇలా అన్నాడు “అందరూ తమ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడతారు. తమ క్రియల్ని బట్టి తీర్పు పొందుతారు.” అలాగైనప్పుడు వారి నిర్లక్ష్యం ఎంత స్పష్టంగా కనిపించింది? దేవుని సేవను వృద్ధిపర్చి, తన తోటి మనుషుల్ని రక్షించటానికి ప్రతీ వ్యక్తికీ తాను చెయ్యాల్సిన ఓ పనిని ఇవ్వటంలో దేవుడు చేసిన ఏర్పాటు ఎంత వివేకవంతమైంది? బీదలపట్ల దయ చూపించటం, కష్టాలనుభవిసుతన్న వారి పట్ల సానుభూతి చూపించటం, మిషనెరీ సేవ చెయ్యటం, దేవుని సేవకు ద్రవ్యమివ్వటం ద్వారా ప్రతి వ్యక్తి తన కుటుంబం పై, తన పరిసరాల్లోని ప్రజలపై సజీవ విశ్వాసాన్ని ప్రదర్శించాలి. దేవునికి ఏమి చెయ్యనందుకు దేవుని శాపం మేరోజు మీద నిలిచినట్లు, దేవుని సేవ ఏమి చెయ్యనందుకు వారిమీద దేవుని శాపం నిలిచింది. ఈ జీవితంలో తమకు గొప్ప లాభం చేకూర్చే పనినే వారు ప్రేమించారు. సర్రియలు దాఖలైన గ్రంథంలో వారి పేర్లకు ఎదురుగా ఖాళీ మాత్రమే ఉంది. అది ఎంత విచారకరం!. టెస్టిమొనీస్, సం.4, పులు. 384-386.ChSTel 99.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents