Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    22—మోషే

    ఆ కరవు కాలంలో తినటానికి తిండి లేక ఐగుప్తు ప్రజలు తమ పశువుల్ని భూముల్ని రాజుకి అమ్ముకొన్నారు. చివరికి ప్రజలు తమ్మును తాము జీవితకాలం బానిసలుగా అమ్ముకొన్నారు. కాగా యోసేపు జ్ఞానయుక్తంగా వారి విముక్తికి ఏర్పాట్లు చేశాడు. ప్రజలు కౌలుదారులుగా ఉండి రాజువద్ద భూములు తీసుకొని ఆ భూముల మీద ఆదాయంలో సాలీనా అయిదోవంతు రాజుకు చెల్లించేందుకు వెసులుబాటు కల్పించాడు.PPTel 232.1

    అయితే ఈ షరతులు యాకోబు పిల్లలకు వర్తించలేదు. ఐగుప్తు ప్రజలకు యోసేపు సేనల దృష్ట్యా రాజు ఆ దేశంలో కొంత భూమిని గృహ వసతికి ఇవ్వటమే గాక పన్నుల మినహాయింపు, కరవు కాలమంతా ఉదారంగా ఆహార సరఫరా వగైరా రాయితీలిచ్చాడు. తక్కిన దేశాలు కరవు కోరల్లో విలవిల్లాడుండగా, యోసేపు దేవుడైనPPTel 232.2

    యెహోవా జోక్యంవల్ల ఆయన కరుణాకటాక్షాలవల్ల ఐగుప్తు ఆహార సమృద్ధి కలిగి ఉన్నదని రాజు బహిరంగంగా ఒప్పుకొన్నాడు. యోసేపు యాజమాన్యంవల్ల దేశం భాగ్యవంతమయ్యిందని రాజు గ్రహించాడు. కృతజ్ఞతతో నిండి యాకోబు కుటుంబానికి ఎన్నో ఉపకారాలు చేశాడు.PPTel 232.3

    అయితే కాలం దొర్లిపోయింది. ఐగుప్తుకి ఎంతో మేలు చేసిన ఆ మహనీయుడు అతని కృషివల్ల గొప్ప లబ్ధి పొందిన తరం ప్రజలు గతించిపోయారు. “అప్పుడు యోసేపుని ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను”. యోసేపు చేసిన సేవల గురించి అతడికి తెలియక కాదు. అతడు వాటిని గుర్తించకపోవటం, సాధ్యమై నంత మట్టుకు వాటిని విస్మరించటం. “అతడు తన జనులతో ఇట్లనెను - ఇదిగో ఇశ్రాయేలు సంతతియైన యీ జనము మనకంటె విస్తారముగాను బలిష్ఠముగాను ఉన్నది. వారు విస్తరించకుండునట్లు మనము వారియెడల యుక్తిగా జరిగించుదము రండి. లేనియెడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములోనుండి వెళ్లిపోదురేమో అనెను”.PPTel 232.4

    అప్పటికే ఇశ్రాయేలు ప్రజలు అసంఖ్యాకంగా పెరిగారు. వారు “బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండియుండెను”. యోసేపు శ్రద్ధాసక్తులవల్ల, అప్పుడు దేశాన్ని పాలించిన రాజు సానుకూల వైఖరివల్ల ఇశ్రాయేలు ప్రజలు త్వరితంగా దేశమంతా విస్తరించారు. కాని ఆచారాల్లోనేగాని మత విషయంలోనేగాని ఐగుప్తీయులతో పొత్తులేకుండా వారు తమ జాతి ప్రత్యేకతను కాపాడుకొన్నారు. పెరగుతున్న వారి సంఖ్య ఇప్పుడు రాజులోను, ప్రజల్లోను భయాందోళనలు రేపింది. యుద్ధం వస్తే ఇశ్రాయేలీయులు శత్రువులతో చెయ్యి కలుపుతారేమోనని భయపడ్డారు. అయినా వారిని దేశం నుంచి బహిష్కరించటం విజ్ఞత కాదు. వారిలో చాలామంది సమర్ధులైన పనివారు, దేశ సంపద పెరగుదలకు ఎంతో తోడ్పడ్డారు. భవనాలు, దేవాలయాల నిర్మాణానికి అలాంటి పనివారు రాజుకి అవసరం. అందుచేత తమ ఆస్తులతో పాటు తమ్మును తాము రాజుకు అమ్ముకొన్న ఐగుప్తీయులతో వారిని సమానులుగా రాజు పరిగణించాడు. రాజు వారి మీద వెట్టి పనులు చేయించే అధికారుల్ని నియమించటంతో వారు పూర్తిగా బానిసలయ్యారు.“ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినంగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనిలోను పొలములో చేయు ప్రతిపనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. అయితే ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టుకొలది వారు విస్తరించి ప్రబలిరి”.PPTel 232.5

    ఇశ్రాయేలీయుల్ని కఠిన శ్రమతో లొంగదీయాలని రాజు అతడి సలహాదారులు పెట్టుకొన్నారు. వారి సంఖ్యను ఆరీతిగా అదుపుచేసి వారి స్వతంత్రా భావాన్ని చితక తొక్కాలని భావించారు. ఆ లక్ష్యం సాధించలేకపోటంతో ఇంకా కఠిన చర్యలకు పూనుకొన్నారు. తమ అదుపాజ్ఞలకు లోబడి పనిచేసే ఆ హెబ్రీ మహిళల్ని హెబ్రీయుల మగ పిల్లల్ని పుట్టిన వెంటనే చంపెయ్యాల్సిందిగా ఆదేశం ఇచ్చారు. ఈ పథకం రూపకర్త సాతానే. ఇశ్రాయేలీయుల్లోనుంచి ఒక విమోచకుడు బయల్దేర్రాడని అతడికి తెలుసు. వారి పిల్లల్ని చంపటానికి రాజును నడిపించటం ద్వారా దేవుని ఉద్దేశాన్ని నిరర్థకం చెయ్యాలన్నది అతడి ఎత్తుగడ. కాగా ఆ మహిళలు దేవునికి భయపడ్డారు. క్రూరమైన ఆ ఆదేశాన్ని అమలు పర్చటానికి భయపడ్డారు. వారి చర్యను దేవుడు ఆమోదించి వారిని వర్థిల్లచేశాడు. తన పథకం జయప్రదం కానందుకు రాజు ఆగ్రహం చెంది తన ఆజ్ఞను ఇంకా విశాలపర్చి వేగవంతం చేశాడు. దేశమంతా మగ పిల్లల్ని వేటాడి చంపాల్సిందిగా రాజు పిలుపు నిచ్చాడు. “అయితే ఫరో - హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతుకనియ్యుడి అని తన జనులందరికి ఆజ్ఞాపించెను”. .PPTel 233.1

    ఆజ్ఞ పకడ్బందీగా అమలవుతుండగా అమ్రాము యెకొబెదు దంపతులకు ఒక కొడుకు పుట్టాడు. ఈ దంపతులు లేవి గోత్రానికి చెందిన ఇశ్రాయేలీయులు. దైవ భక్తిపరులు. అ పసివాడు “సుందరుడు”. ఇశ్రాయేలీయుల విడుదలకు సమయం ఆసన్నమయ్యిందని, తన ప్రజల్ని నడిపించటానికి దేవుడు ఒక విమోచకుణ్ని లేపుతాడని విశ్వసించి తమ కుమారుణ్ని చంపివేయకూడదని ఆ దంపతులు నిశ్చయించుకొన్నారు. దేవుని పై తమకున్న విశ్వాసం వారికి బలం చేకూర్చింది. వారు “రాజాజ్ఞకు భయపడ”లేదు. హెబ్రీ 11 : 23.PPTel 233.2

    శిశువును తల్లి మూడు మాసాలపాటు దాచి ఉంచగలిగింది. ఇక అతణ్ని క్షేమంగా ఉంచటం సాధ్యం కాదని గ్రహించినప్పుడు జమ్ముతో చిన్న పెట్టె చేసి దానికి జిగట మన్ను కీలు పూసి, పిల్లవాణ్ని అందులో పెట్టి నది ఒడ్డున జమ్ములో ఆ పెట్టను ఉంచింది.ఆ పెట్టెను కాపాట్టానికి అక్కడ ఉండటానికి సాహసించలేదు.అది శిశువు ప్రాణానికి తన ప్రాణానికి ముప్పు. కాని ఆ శిశువు అక్క మిర్యాము దగ్గరలో మసులుతున్నది. ఏమీ సంబంధం లేనట్లు ముసులుతున్నా తమ్ముడికి ఏం జరుగుతుందో ఒక కంట కనిపెట్టటానికే అక్కడుంది. శిశువుని కని పెట్టే వారు ఇంకా ఉన్నారు. ఆ పసివాణ్ని ప్రార్ధనపూర్వకంగా దేవుని కాపుదలకు తల్లి విడిచి పెట్టింది. కంటికి కనిపించని దేవదూతలు ఆ చిన్నారి బాలుడు విశ్రమిస్తున్న పెట్టెకు పైగా ఉండి కాపాడున్నారు. ఫరో కుమార్తెను దేవదూతలు అక్కడకు నడిపించాయి. జమ్ములో ఉన్న ఆ చిన్న పెట్టె ఆమెను ఆకర్షించింది. అందులో ఉన్న చక్కని బిడ్డను చూసినప్పుడు కథను అర్థం చేసుకొంది. శిశువు ఏడ్పు ఆమెకు కనికరం పుట్టించింది. ఆ పసికందు ప్రాణం రక్షించేందుకు ఈ పనిచేసిన ఆ అజ్ఞాత మాతృమూర్తిపట్ల ఆమెకు సానుభూతి పుట్టింది. పసివాణ్ని కాపాడాలని తీర్మానించుకొంది. అతణ్ని తన కుమారుడుగా దత్తం తీసుకోటానికి నిశ్చయించుకొంది.PPTel 234.1

    యువరాణి ప్రతీ కదలికను మిర్యాము గమనిస్తూనే వుంది. ఆ పసివాడిపట్ల ఆమె సున్నితంగా వ్యవహరించటం చూసి ఆమె దగ్గరకు వెళ్లి “నీ కొరకు ఈ పిల్ల వాని పెంచుటకు నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వత్తునా?” అంది. అందుకు అనుమతి లభించింది.PPTel 234.2

    అక్క ఆ సంతోషకరమైన వార్తతో తల్లి దగ్గరకు వెళ్లింది. క్షణంలోనే ఆమెను తీసుకొని ఫరో కుమార్తె వద్దకు వచ్చింది. “ఈ బిడ్డను తీసుకొనిపోయిన నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చెదను” అంది యువరాణి.PPTel 234.3

    తల్లి చేసిన ప్రార్థనల్ని దేవుడు విన్నాడు. ఆమె విశ్వాసానికి ప్రతిఫలం లభించింది. తనకు ఇప్పుడు లభించిన క్షేమకరమూ, ఆనందదాయకము అయిన పనిని ఆమె కృతజ్ఞతతో అంగీకరించి ప్రారంభించింది. తనకు కలిగిన అవకాశాన్ని ఆ తల్లి సద్వినియోగపర్చుకొని తన కుమారుణ్ని దేవుని సేవకోసం తర్ఫీదు చేసింది. అతణ్ని ఒక గొప్ప కార్యసాధన నిమిత్తం దేవుడు కాపాడాడని ఆమె నమ్మింది. త్వరలోనే అతణ్ని తన రాజమాత పెంపకానికి ఇచ్చెయ్యాలని కూడా ఆ తల్లికి తెలుసు. అక్కడ అతణ్ని ఆవరించి ఉండే ప్రభావాలు ఆ బాలుణ్ని దేవునివద్ద నుంచి దూరంగా నడిపించేవని ఆమెకు తెలుసు. ఇదంతా మనసులో ఉంచుకొని తక్కిన బిడ్డల విషయంలో కన్నా ఈ చిన్నారి ఉపదేశం సందర్భంగా మరింత పట్టుదలగా, జాగ్రత్తగా వ్యవహరించింది. అతడి మనసులో దైవ భక్తిని, సత్యంపట్ల. నాయ్యపట్ల ప్రేమను పెంచటానికి కృషిచేసింది. చెడుగును ప్రోత్ససించే ప్రతీ దుష్ప్రభావం నుంచి అతణ్ని కాపాడమని దేవునికి చిత్తశుద్ధితో ప్రార్థించింది. విగ్రహారాధన పాపమని అతడికి నేర్పించింది. ప్రతీ అత్యవసర పరిస్థితిలోనూ తన మొరవిని సహాయం అందించగల సజీవ దేవునికి వంగి ప్రార్థించాలని చిన్నతనం లోనే అతడికి నేర్పించింది.PPTel 234.4

    బాలుణ్ని తనవద్ద ఉంచగలిగినంతకాలం తల్లి ఉంచింది. కాని అతడికి పన్నెండు సంవత్సరాలు వచ్చినప్పుడు అతణ్ని రాజ భవనానికి పంపాల్సి వచ్చింది. సామాన్యుడి గృహంనుంచి అతణ్ని రాజ భవనానికి ఫరో కుమార్తె వద్దకు తీసుకువెళ్లగా “అతడు ఆమెకు కుమారుడాయెను”. తాను చిన్నతనంలో నేర్చుకున్న విషయాలు రాజభవనంలోకుడా అతడు మార్చిపోలేదు. తల్లి వడిలో నేర్చుకొన్న పాఠాల్ని అతడు ఎన్నడూ మార్చిపోలేదు. రాజాస్థానపు వాతావరణంలో వర్థిల్లే గర్వం, నమ్మకద్రోహం, దుష్టత్వం నుంచి ఆ పాఠాలు అతడికి కాపుదల ఇవ్వనున్నాయి.PPTel 235.1

    ఒక్క హెబ్రీ మహిళ, బానిస అయిన ఒక పరదేశ మహిళ, ప్రభావం ఎంత శక్తివంతమయ్యింది! పెద్దవాడైన తర్వాత మోషే జీవించిన జీవితం. ఇశ్రాయేలీయుల నాయకుడుగా అతడు సాధించిన లక్ష్యం క్రైస్తవ తల్లి సేవ ప్రాముఖ్యానికి ప్రబల సాక్ష్యం. గృహంలో తల్లి పనికి సరిపాటి అయ్యింది. ఇంకొకటి లేదు. చాలామట్టుకు బిడ్డల భవిష్యత్తు తల్లి చేతుల్లోనే ఉంటుంది. పెరుగుతున్న మనసులతోను ప్రవర్తనల తోను ఆమె పని చేస్తుంది. ప్రస్తుత కాలాన్ని మాత్రమేకాక నిత్య జీవిత కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తల్లి పనిచేస్తుంది. ఆమె విత్తనాలు విత్తుతుంది. అవి మొలిచి పంట పండుతాయి. ఆ పంట మంచిదైనా కావచ్చు, చెడ్డదైనా కావచ్చు. గుడ్డమీద అందమైన రూపాన్ని ఆమె చిత్రించనక్కర్లేదు లేక రాతితో విగ్రహం మలచనక్కరలేదు. మానవ అత్మపై దైవ స్వరూపాన్ని అద్దితే సరిపోతుంది. ముఖ్యంగా తన బిడ్డలు బాల్యదశలో ఉనప్పుడు వారి ప్రవర్తనల్ని తీర్చిదిద్దే బాధ్యత తల్లి మీద ఉన్నది. వృద్ధిచెందుతున్న వారి మనసుల్లోకి ప్రవేశించే అభిప్రాయాలు జీవిత కాలమంతా వారిని ప్రభావితం చేస్తాయి. తమ బిడ్డలు క్రైస్తవులవ్వాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు తమ బిడ్డలు చిన్నవయసులో ఉన్నప్పుడే వారి విద్యను శిక్షణను నిర్దేశించాలి. ఈ లోక రాజ్య సింహాసనానికి వారసులుగాక దేవుని రాజ్యంలో రాజులుగా నిత్యకాలంలో యుగయుగాలుగా పరిపాలన చేయటానికిగాను తర్పీదు చేసేందుకు దేవుడు వారిని మనకు అప్పగించాడు.PPTel 235.2

    తన సమయం ఎంతో విలువైనదని ప్రతీ తల్లీ గుర్తించాలి. లెక్క అప్పగించల్సిన ఆ మహ దినాన ఆమె చేసిన పని పరిగణకు వస్తుంది. అనేకమంది స్త్రీ పురుషుల వైఫల్యాలు, నేరాలు తాము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వారి చిన్నారి పాదాల్ని సరైన మార్గంలో నడిపించటానికి బాధ్యులైన వారి అజ్ఞానం, అశ్రద్ధల ఫలితమేనని ఆ దినాన తేల్తుంది. తమ ప్రతిభతో, సత్య వర్తనతో, నీతి నిజాయితీలతో లోకాన్ని మెరుగుపర్చిన అనేకులు తమ ప్రభావానికి విజయానికి మూలమైన సూత్రాలు ప్రార్థించే తమ క్రైస్తవ తల్లులు నేర్చినవేనని అప్పుడు తేలుతుంది.PPTel 236.1

    ఫరో ఆస్థానంలో మోషే ఉన్నతమైన పౌర శిక్షణను సైనికి శిక్షణను పొందాడు. దత్తత తీసుకున్న తన మనవణ్ని తన తర్వాత రాజుని చెయ్యాలని రాజు ఆశించాడు. ఆ యువకుడికి ఆ దిశలో విద్య నేర్పించాడు. “మో షే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలయందును, కార్యములయందును ప్రవీణుడై యుండెను” అ.కా.7:22. సైనిక నాయకుడిగా తన సామర్థ్యంవల్ల ఐగుప్తు సేనలకు మో షే ప్రీతిపాత్రుడయ్యాడు. సామాన్యంగా ప్రజలు అతణ్ని విశిష్ట వ్యక్తిగా పరిగణించారు. మోషే విషయంలో సాతాను పరాజయం పొందాడు. హెబ్రీ పిల్లల్ని మట్టు పెట్టడానికి ఏ ఆజ్ఞ జారీ అయ్యిందో అదే ఆజ్ఞను దైవ ప్రజల భావి నాయకుడి శిక్షణ నిమిత్తం విద్య నిమిత్తం దేవుడు ఉపయోగించాడు.PPTel 236.2

    ఇశ్రాయేలు ప్రజల విమోచనకు సమయం దగ్గరకొచ్చిందని ఈ కార్యసిద్ధికి దేవుడు మోషేను ఉపయోగిస్తాడని ఇశ్రాయేలు పెద్దలకు దేవదూతలు ఉపదేశించారు. తన ప్రజలను ఐగుప్తు దాస్యం నుంచి విడిపించటానికి దేవుడు తనను ఎంపిక చేసుకొన్నాడని దేవదూతలు మో షేకి కూడా ఉపదేశించారు. ఇశ్రాయేలు ప్రజలు సాయుధ బల ప్రయోగం ద్వారా తమ స్వేచ్చను సాధించాల్సి ఉంటుందని భావించి, హెబ్రీ ప్రజల్ని ఐగుప్తు సేనలకు వ్యతిరేకంగా నడిపించటానికి మోషే ఎదురుచూశాడు. ఇది దృష్టిలో ఉంచుకొని తన దత్తత తల్లిపట్ల లేదా ఫరోపట్ల తన మమతానుబంధాలు దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా తనకు అడ్డు తగలకుండా ఉండేందుకు జాగ్రత్తగా వ్యవహరించాడు.PPTel 236.3

    ఐగుప్తు చట్టాల ప్రకారం ఫరోల సింహాసనాన్ని అధిష్టించే వారందరూ యాజక కులంలో సభ్యులవ్వాలి. యువరాజుగా మోషే జాతీయ మతంలోని లోతుపాతుల్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ బాధ్యత యాజకులకు అప్పగించటం జరిగింది. మోషే శ్రద్ధగల విద్యార్లే అయినా దేవుళ్ల పూజకు సుముఖంగా లేడు. అలాగైతే తనకు రాజకిరీటం దొరకదని భయ పెట్టారు. హెబ్రీ విశ్వాసాన్ని విడిచి పెట్టకపోతే తన్ను రాకుమార్తె తన కుమారుడిగా తిరస్కరిస్తుందని భయ పెట్టారు. అయినా భూమ్యాకాశాల సృష్టికర్తను తప్ప ఇంకెవ్వరిని పూజించనన్న తన తీర్మానానికి మోషే కట్టుబడి ఉన్నాడు. అర్థం పర్థంలేని వస్తువులపట్ల భక్తి ప్రదర్శనల వంటి మూఢ నమ్మకాల్ని ఖండిస్తూ మోషే యాజకులతో వాదించాడు. అతడితో వాదించగలిగినవారు గాని అతని ఉద్దేశాన్ని మార్చగలిగినవారుగాని లేరు. అయినా తన ఉన్నత హోదా దృష్ట్యా, రాజు దృష్టిలోను, ప్రజల దృష్టిలోను అతడికున్న అభిమానం దృష్ట్యా అతడి వైఖరిని సహించడం జరిగింది.PPTel 237.1

    “మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటే దేవుని ప్రజలతో శ్రమ ననుభవించుట మేలని యెంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు; ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టియుంచెను”. హెబ్రీ 11:24-26. లోకంలోని గొప్ప వ్యక్తుల మధ్య ప్రధాన స్థానం ఆక్రమించటానికి, ప్రఖ్యాతి చెందిన రాజ్యం ఆస్థానంలో ప్రకాశించటానికి, ఆ రాజ్య దండం వహించి పరిపాలన నిర్వహించటానికి మోషే సమర్థుడుగా రూపొందాడు. తన మానసిక విశిష్టత అన్ని యుగాల్లోని గొప్ప వ్యక్తుల కన్నా అతడ్ని ఉన్నత స్థానంలో ఉంచుతుంది. చరిత్రకారుడిగా, కవిగా, వేదాంతిగా, సైనిక నేతగా, శాసన రూపకర్తగా అతడు తనకు తానే సాటి అయినా ప్రపంచమంతా తనముందున్నా, భాగ్యాన్ని, గొప్పతనాన్ని, ప్రతిష్ఠను తోసిపుచ్చటానికి నైతిక శక్తిని ప్రదర్శించి “అల్పకాలము పాపభోగము అనుభవించుటకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని” ఎంచాడు.PPTel 237.2

    దేవునికి వినయంగా విధేయంగా నివసించే వారికి చివరగా కలిగే ప్రతిఫలం గురించి మోషే ఉపదేశం పొందాడు. దానితో పోల్చినప్పుడు లోకభాగ్యం లోక ప్రతిష్ఠ అసలు అతడి పరిగణనలోకే రాలేదు. ఫరో తన వైభవోపేతమైన రాజభవనం, సింహాసనం మో షేముందు ప్రేరణగా ఉంచాడు. అయితే దేవుని మర్చిపోయేటట్లు చేసే పాప సుఖ భోగాలు రాజస్థానాల్లో రాజ్యమేల్తాయని మో షేకి తెలుసు. సుందర రాజభవనంకన్నా, రాజు సింహాసనం కన్నా పైనుండి, పాప మాలిన్యం అంటని రాజ్యంలో సర్వశక్తని భక్తులకు లభించనున్న గొప్ప పురస్కారం కోసం అతడు ఆశతో ఎదరు చూసాడు. జయించేవారి శిరంమీద పరలోక రాజు నిత్యజీవ కిరీటం పెట్టటం అతడు విశ్వాసం ద్వారా చూశాడు. పాపానికి దాసులుకావటం కన్నా లోకంలోని ప్రముఖులు గొప్పవారి మధ్య నుంచి తొలగిపోయి దేవునికి విధేయులుగా నివసించటానికి ఎంపిక చేసుకొన్న సామాన్యులు, పేదలు, తృణీకరించబడ్డవారు అయిన తన జాతి ప్రజలతో ఉండటానికి ఈ విశ్వాసం అతణ్ని నడిపించింది.PPTel 237.3

    తనకు నలభై సంవత్సరాల వయసు వచ్చేవరకు మోషే రాజు ఆస్థానంలో ఉన్నాడు. తన ప్రజల దుర్భర పరిస్థితిని గురించి తరచుగా ఆలోచించేవాడు. వెట్టి చాకిరీ చేస్తున్న తన సహోదరుల్ని సందర్శించి దేవుడు తమ విడుదలను తప్పక ఏర్పాటు చేస్తాడని వారికి ధైర్యం చెప్పేవాడు. వారికి జరుగుతున్న అన్యాయం, హింస కళ్లారా చూసి తీవ్ర అసహనంతో ఊగిపోయి ప్రతీకారం తీర్చుకోటానికి తరచు సిద్ధపడేవాడు. ఒకరోజు అలా బయటికి వచ్చినప్పుడు ఐగుప్తీయుడు ఒకడు ఇశ్రాయేలీయుణ్ని కొట్టడం చూసి ముందుకి దూకి ఆ ఐగుప్తీయుణ్ని చంపాడు. ఆ ఇశ్రాయేలీయుడు మినహా ఆ ఘటనను చూసినవారు ఇంకెవరూ లేరు. మోషే అతడి శవాన్ని ఇసుకలో పూడ్చి పెట్టాడు. మోషే ఇప్పుడు తన ప్రజల ఉద్యమాన్ని చేపట్టటానికి సిద్ధంగా ఉన్నాడు. స్వేచ్ఛను సంపాదించుకోటానికి తన ప్రజలు విజృంభిస్తారని ఎదురుచూశాడు. “తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెనుగాని వారు గ్రహింపరైరి”. అకా. 7:25. స్వతంత్రతకు వారింకా సిద్ధంగా లేరు. మర్నాడు ఇద్దరు హెబ్రీయులు పోట్లాడుకోటం మోషే చూశాడు. వారిద్దరిలో ఒకడి పొరపాటు బాహాటంగా కనిపిస్తుంది. తప్పులో ఉన్నవాణ్ని మోషే మందలించగా అతడు తిరగబడి జోక్యం చేసుకోటానికి తనకు ఏమి హక్కుందని ప్రశ్నిస్తూ తాను ఘోర నేరస్తుడంటూ మోషేని నిందిస్తూ ఇలా అన్నాడు, “మా మీద నిన్ను అధికారినిగాను, తీర్పరినిగాను నియమించినవాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా?’PPTel 238.1

    ఆ సంగతంతా ఐగుప్తీయులకి తెలిసిపోయింది. త్వరలో అది ఫరోకి కూడా తెలిసింది. ఆ క్రియకు చాలా అర్థమున్నదని, తన ప్రభుత్వాన్ని పడగొట్టి సింహాసనాన్ని చేజిక్కించుకోటానికిగాను మోషే తన ప్రజల్ని ఐగుప్తీయుల మీదికి దండెత్తటానికి ఉద్దేశించిన పని అని, అతడు బతికి ఉంటే దేశానికి భద్రత ఉండదని కొందరు రాజుకి సూచించారు. వెంటనే రాజు మోషేకి మరణ శిక్ష ప్రకటించాడు. అయితే అలా జరుగుతుందని ఎరిగి మోషే తప్పించుకొని అరేబియా దిశగా పారిపోయాడు.PPTel 238.2

    ప్రభువు అతడికి మార్గ నిర్దేశం చేశాడు. మోషే యిత్రో గృహంలో ఆశ్రయం పొందాడు. యితో మిద్యాను రాజు యాజకుడు. అతడు కూడా దేవుని భక్తుడే. కొంత కాలానికి మోషే యిత్రో కుమార్తెల్లో ఒక యువతిని పెండ్లి చేసుకొన్నాడు. ఇక్కడ మామగారి మందల కాపరిగా సేవచేస్తూ మోషే నలబయి సంవత్సరాలు గడిపాడు.PPTel 239.1

    ఐగుప్తీయుణ్ని చంపటంలో తన పితరులు తరచుగా చేసిన పొరపాట్లలోనే అనగా దేవుడు తానే చేస్తానని వాగ్దానం చేసిన పనిని తమ చేతుల్లోకి తీసుకొంటమన్న పొరపాటులోనే మోషే పడ్డాడు. మోషే భావించినట్లు యుద్ధం ద్వారా తన ప్రజల్ని ఐగుప్తునుంచి విడిపించటమన్నది దేవుని ఉద్దేశం కాదు. తనకు మాత్రమే మహిమ కలిగేటట్లు తన అపార శక్తిమూలంగా వారి విడుదల జరగాలన్నది దేవుని సంకల్ప. అయినా తన ఉద్దేశాల నెరవేర్పుకు ఈ దుందుడుకు కార్యాన్ని కూడా దేవుడు విస్మరించాడు. తాను నిర్వర్తించాల్సిన మహా కార్యానికి మోషే సిద్ధంగా లేడు. అబ్రాహాము. యాకోబులు నేర్చుకొన్న పాఠాన్నే అనగా తన వాగ్దానాల నెరవేర్పుకు మానవ జ్ఞానాన్ని గాని, శక్తినిగాని, నమ్ముకోక దేవుని శక్తినే నమ్ముకోవలన్న పాఠన్ని మోషే కూడా నేర్చుకోవాల్సి ఉన్నాడు. పర్వతాల నడుమ ఒంటరిగా ఉంటూ అతడు నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. ఆత్మ నిరసన, కష్టాల పాఠశాలలో సహనం, ఉద్రే కాలు, ఉద్రిక్తల నియంత్రణ మోషే నేర్చుకోవలసి ఉన్నాడు. జ్ఞానయుక్తంగా పరిపాలించటానికి ముందు లోబడటం నేర్చుకోవాల్సి ఉన్నాడు. ఇశ్రాయేలీయులకి దేవుని చిత్తానికి గూర్చిన జ్ఞానాన్ని బోధించటానికి ముందు తన సొంత హృదయం దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలి. తన సహాయం అవసరమైన వారి విషయంలో తండ్రిని పోలిన శ్రద్ధాసక్తులు చూపటానికి అతడు అనుభవ పూర్వకంగా సిద్ధపడాలి.PPTel 239.2

    సమయం వృధా అవుతుందని భావించి ఈ దీర్ఘకాల శ్రమను, అజ్ఞాత వాసాన్ని మానవుడు రద్దుచేసి ఉండేవాడు. కాని తన ప్రజలకు నాయకుడు కావలసి ఉన్న వ్యక్తి గొర్రెల కాపరిగా నలభై సంవత్సరాలు గడపాలని అనంత జ్ఞాని అయిన దేవుడు సంకల్పించాడు. మందల్ని జాగ్రత్తగా కాసి వాటి ఆలన పాలన చూడటం, ఆ పనిలో తన్నుతాను మార్చిపోవటం, మంద బాగోగుల గురించి ఆలోచించటం వంటి అలవాట్లు ఇశ్రాయేలీయులపరంగా అతణ్ని దయగల, దీర్ఘశాంతంగల కాపరిగా తీర్చిదిద్దుతాయి. మానవ శిక్షణ, సంస్కృతి ఒనగూర్చే ఏ నైపుణ్యంగాని, సామర్థ్యంగాని ఈ అనుభవానికి ప్రత్యామ్నాయం కాజాలదు.PPTel 239.3

    మోషే తాను నేర్చుకొన్నది చాలా మట్టుకు విసర్జించటం నేర్చుకొంటున్నాడు. ఐగుప్తులో తన చుట్టూ ఉన్న ప్రభావాలూ దత్తత తల్లి ప్రేమ, రాజు మనవడుగా తన ఉన్నత స్థానం, దుర్వ్యయం, సంస్కారం, కుటిలత్వం, తప్పుడు మత వేదాంతం, విగ్రహారాధన ప్రభావం, శిల్ప, వాస్తు కళల వైభవం, వృద్ధి చెందుతున్న అతడి మనసును ఆకర్షించి అతడి అలవాట్లను ప్రవర్తనను కొంతమేరకు ప్రభావితం చేశాయి. కాలం, పరిసరాల మార్పు, దేవునితో ఆత్మీయత ఈ ప్రభావాల్ని తుడచివేయవచ్చు. తప్పును విసర్జించి సత్యాన్ని అంగీకరించటానికి ప్రాణం కోసమా అన్నట్లు మోషే స్వయంగా పోరాటం సల్పాలి. ఆ పోరాటానికి మానవశక్తి చాలనప్పుడు దేవుడు అతడికి సహాయం చేస్తాడు.PPTel 240.1

    దేవుని కార్య నిర్వహణకు ఎంపికైన వారందరిలోను, మానవ ప్రవృత్తి కనిపిస్తుంది. అయినా వారందరూ ఒకేలాంటి అలవాట్లు, ఒకేలాంటి ప్రవర్తన కలిగి అలాగే మిగిలి పోవటంతో తృప్తి చెందలేదు. దేవుని వద్దనుంచి జ్ఞానం పొంది ఆయన సేవ చేసే పద్దతుల్ని నేర్చుకోవాలని ఆకాక్షించారు. అపోస్తలుడిలా అంటున్నాడు. “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను. అప్పుడు అతనికి అనుగ్రహించబడును”. యాకోబు 1:5. అయితే చీకటిలో ఉండటంతో తృప్తి పడేవారికి దేవుడు తన వెలుగు ఇవ్వడు. దేవుని సహయం పొందటానికి మానవుడు తన బలహీనతను, తన కొదవను గుర్తించాలి. తనలో చోటుచేసుకోవలసిన మార్పును గురించి మానవుడు దీర్ఘంగా ఆలోచించాలి. అతడు మేల్కొని ఎడతెగకుండ విసుగ కుండా ప్రార్థించి,కృషి చెయ్యాలి. తప్పుడు అభ్యాసాలు అలవాట్లు విడిచి పెట్టాలి. ఈ తప్పుల్ని కృత నిశ్చయంతో సవరించి నీతి సూత్రాలను అవలంబించటం ద్వారా మాత్రమే విజయం సాధించగలుగుతాం. తమంతట తామే జయించటానికి దేవుడు శక్తిని ఇవ్వగా అనేకులు దాన్ని ఉపయోగించకుండా దేవుని సహాయం కోసం ఎదురు చూస్తూ ఉండిపోవటంవల్ల తాము ఆక్రమించాల్సిన స్థానాలకు చేరలేకపోతున్నారు. ప్రయోజనకరమైన సేవకు యోగ్యులైన వారందరు కఠినమైన మానసిక, నైతిక క్రమశిక్షణ ద్వారా శిక్షణ పొందాలి, మానవ ప్రయత్నానికి తన శక్తిని జోడించి దేవుడు వారికి చేయూత నిస్తాడు.PPTel 240.2

    పెట్టనికోటగా ఉన్న పర్వతాల మధ్య మోషే ఒంటరిగా దేవునితో ఉన్నాడు. ఐగుప్తు దేవాలయాలు వాటికి సంబంధించిన మూఢ నమ్మకాలు అతని మనసును ఇక ఆకట్టుకోలేదు. ప్రకృతి సొగసులతో నిండిన ఆ కొండల నడుమ దేవుని మహోన్నత్యాన్ని వీక్షించి ఐగుప్తు దేవుళ్లు ఆయన ముందు ఎంత శక్తి శూన్యులో గ్రహించాడు. ఎక్కడ చూసినా అతడికి సృష్టికర్త పేరే కనిపించింది. ఇక్కడ అతడి అతిశయం ఆత్మ సమృద్ధి మాయమయ్యాయి. నిరాడంబరమైన అరణ్య జీవితంలో ఐగుప్తులోని విలాస జీవిత సుఖాలు మచ్చుకు కూడా లేవు. మోషేలో ఓర్పు, నమ్రత చోటుచేసుకొన్నాయి. అతడు “భూమిమీదనున్న వారిందరిలో మిక్కిలి సాత్వికుడు” (సంఖ్యాకాండము 12:3). మోషేకి యాకోబు దేవుని బలం పై ధృడమైన విశ్వాసం ఏర్పడింది.PPTel 240.3

    సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. మందలతో ఒంటరి ప్రదేశాల్లో సంచరించేటప్పుడు తన ప్రజలు దుర్భర పరిస్థితిని గురించి ఆలోచిస్తూ తన పితరులతో దేవుడు వ్యవహరించిన రీతిని ఎంపిక అయిన ప్రజలకు స్వాస్థ్యమైన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొన్నాడు. ఇశ్రాయేలీయుల నిమిత్తం తన ప్రార్థనలు రాత్రిం బగళ్లు దేవుని సింహాసనం చేరుకొన్నాయి. పరలోక దూతలు తమకాంతిని అతడి చుట్టూ విరజిమ్మారు. పరిశుద్దాత్మ ఆవేశంవల్ల మోషే ఇక్కడ ఆదికాండాన్ని రచించాడు. అరణ్యం ఏకాంతంలో మోషే గడిపిన దీర్ఘ సంవత్సరాలు దీవెనకరమైన సంవత్సరాలు, మోషే విషయంలోనేగాక అన్నితరాల్లో లోకంలో నివసించిన ప్రజల విషయంలో కూడా.PPTel 241.1

    “అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర పెట్టుకొనుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము, ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను”. ఇశ్రాయేలు విముక్తికి సమయమయ్యింది. అయితే దేవుని కార్యం మానవుడి గర్వాన్ని అణగదొక్కే రీతిలో సిద్ధి పొందాల్సి ఉన్నది. విమోచకుడు చేతిలో కర్రతో సామన్య కాపరిలా వెళ్లాలి. దేవుడు ఆ కర్రను తన శక్తికి సంకేతం చేయనున్నాడు. ఒక రోజు మోషే తన మందను “దేవుని పర్వతము” అయిన హోరేబు దగ్గర మేపుతుండగా ఒక పొద మండటం చూశాడు. దాని కొమ్మలు, ఆకులు, మొదలు మండుతున్నాయి. మంటలు వస్తున్నాయే గాని అది కాలిపోవటం లేదు. ఆ వింత దృశ్యాన్ని చూడటానికి పొద దగ్గరకు వెళ్లాడు. మండుతున్న పొదలోంచి తనను పేరు పెట్టి ఒక స్వరం పిలవటం వినిపించింది. వణుకుతున్న పెదవుల్తో “చిత్తము ప్రభువా” అన్నాడు. దగ్గరకు రావద్దని హెచ్చరిస్తూ “నీ పాదములనుండి నీ చెప్పులు విడువుము. నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము... నేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను” అని ఆ స్వరం అన్నది. గతించిన యూగాల్లో పితరులకు నిబంధన దూతగా తన్నుతాను కనపర్చుకొన్న వ్యక్తి ఆయనే. “మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను”.PPTel 241.2

    దేవుని సన్నిధిలోకి అందరూ వినయ మనసుతో పూజ్య భావంలో రావాలి. ఆయన ముందుకు యేసు నామంలో మనం ధైర్యంగా రావచ్చు. కాని ఆయన మనతో సమానుడైనట్లు దురుసుగా గర్వంగా ఆయనను సమీపించకూడదు. సమీపించటానికి అలవిగాని ప్రకాశతగల వెలుగులో నివసించే సర్వశక్తిగల ఆ పరిశుద్ధ మహోన్నత దేవున్ని తమతో సమానుడిలా లేదా తమకన్నా ఎక్కువవాడిలా సంబోధించేవారున్నారు. ఈ లోకంలో ఒక రాజు దర్శనం లభించే గదిలో మెలగటానికి భయపడే తీరులో కొందరు దేవుని మందిరంలో మసుల్తారు. ఎవరి ముందు కెరూబులు వంగి సమస్కరిస్తారో ఎవరి ముందు దేవుదూతలు తమ ముఖాలు కప్పుకొంటారో ఆ దేవుని ముందున్నామని వీరు జ్ఞాపకముంచుకోవాలి. దేవునిపట్ల పూజ్యభావం ప్రదర్శించాలి. ఆయన సముఖాన్ని గుర్తించే వారందరూ ఆయన ముందు వినయంగా వంగి యాకోబు రితిగా దేవుని దర్శనం చూసి. “ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమేగాని వేరొకటి కాదు; పరలోకపు గవిని ఇదే” అని గుర్తిస్తారు. PPTel 242.1

    దేవుని ముందు మోషే భయంతోను భక్తితోను వేచి ఉండగా ఆయన ఇలా కొనసాగించాడు: “నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్ట పెట్టువారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వాని ద: ఖములు నాకు తెలిసే యున్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని విడిపించుటకును, ఆ దేశములోనుండి విశాలమైన మంచి దేశమునకు .... పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి యున్నాను...... రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తీసుకొని పోవలెను.”PPTel 242.2

    ఆ ఆదేశం వినప్పుడు విస్మయంచెంది భయంతోనిండి కాస్త వెనక్కు జరిగి ఇలా అన్నాడు, “నేను ఫరోయొద్దకు వెళ్లుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటివాడను?” “నిశ్చయముగా నీవు నీకు తోడై యుందును. నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులోనుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరు” అని దేవుడు బదులు పలికాడు.PPTel 242.3

    తాను ఎదుర్కోనవలసిన కష్టాలు గురించి, దేవుని గూర్చిన జ్ఞానం బొత్తిగా లేని అధిక సంఖ్యాకులైన ప్రజల గుడ్డితనం, అజ్ఞానం, అవిశ్వాసం గురించి మోషే ఆలోచించాడు. “చిత్తగించుము; నేను ఇశ్రాయేలీయులయొద్దకు వెళ్లి వారిని చూచి - మీ పితురుల దేవుడు మీయొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు - ఆయన పేరేమి అని అడిగిన యెడల వారితో నేనేమని చెప్పవలెనని అడిగెను”.PPTel 242.4

    “నేను ఉన్నవాడను అనువాడను” “ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పం పెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెనను”.PPTel 243.1

    తమ దాస్యంగురించి దీర్ఘకాలంగా మనస్తాపం చెందుతున్న సౌమ్యులు, నీతిమంతులు అయిన పెద్దల్ని సమావేశపర్చి విడుదల కలిగిస్తానన్న దైవ వాగ్దానాన్ని వారికి అందిస్తూ మోషే మొదటగా వారికి దేవుని వర్తమానాన్ని తెలియపర్చాల్సి ఉన్నాడు. ఆ తర్వాత పెద్దలతో రాజు ముందుకు వెళ్లి ఇలా చెప్పాల్సి ఉన్నాడు -PPTel 243.2

    “హెబ్రీయుల దేవుడైన యెహోనా మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు మూడు దినముల ప్రయాణమంత దూరముపోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుము సెలవిమ్ము.” PPTel 243.3

    ఇశ్రాయేలీయుల్ని వెళ్లనిమ్మన్న మనవిని ఫరో ప్రతిఘటిస్తాడని దేవుడ మోషేను హెచ్చరించాడు. అయినా తాను అధైర్యం చెందకూడదని చెప్పాడు. ఎందుకంటే ఐగుప్తీయులముందు తన ప్రజలముందు దాన్ని అసరా చేసుకొని తన శక్తిని ప్రదర్శించాలన్నది దేవుని సంకల్పం. “నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలచియున్న నా అద్భుత కార్యములన్నిటిని చూసి దాని పాడుచేసెదను. అటు తరువాత అతడు మిమ్మును పంపివేయును.”PPTel 243.4

    ప్రయాణానికి వారు చేసుకోవాల్సిన ఏర్పాట్ల విషయంలో కూడా సూచనలు చేశాడు. ప్రభువిలా అన్నాడు, “మీరు వెళ్ళునప్పుడు వట్టి చేతులతో వెళ్లరు. ప్రతి స్త్రీయు తన పొరుగుదానిని తన యింటనుండు దానిని వెండి, నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి” తీసుకొండి ఇశ్రాయేలీయులనుంచి అన్యాయంగా పొందిన శ్రమదానంవల్ల ఐగుప్తీయయులు ధనవంతులయ్యారు. ఇప్పుడు వారు తమ గృహానికి వెళ్లిపోతున్న తరుణంలో వారు అనేక సంవత్సరాలు చేసిన శ్రమ ఫలితాన్ని వారు ఎరువు తీసుకోవల్సి ఉన్నారు. దేవుడు ఐగుప్తీయుల్ని అందుకు సుముఖంగా ఉండేటట్లు చేశాడు. వారి విడుదల నిమిత్తం దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఐగుప్తీయులికి భయం పుట్టించి పీడిత ప్రజల్ని విడిచి పెట్టేటట్లు చేయటానికి ఉద్దేశించబడ్డాయి.PPTel 243.5

    తనముందు అధిగమించలేని కష్టాలున్నట్లు మోషే చూశాడు. తనను దేవుడే పంపాడనటానికి రుజువేంటి? “చిత్తగించుము; వారు నన్ను నమ్మరు. నా మాట వినరు. యోహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు” అన్నాడు మోషే ప్రభువుతో. మోషేకే బాగా నచ్చిన నిదర్శనం దేవుడు ఇప్పుడిచ్చాడు. తన కర్రను నేలమీద పడెయ్యమన్నాడు. మోషే అలా చేయగా “అది పామాయెను”. దాన్ని పట్టుకోమని చెప్పాడు. అతడి చేతిలో అది కర్ర అయ్యింది. తన చేతిని చాతిమీద పెట్టుకోమని చెప్పినప్పుడు మోషే అలా చేశాడు. “దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా ఆయెను”. దాన్ని మళ్లీ చాతిమీద పెట్టుకోమని కోరగా పెట్టుకొని తీసివేసినప్పుడు అది తక్కిన చెయ్యి మాదిరిగా అయ్యింది. ఈ గుర్తుల ద్వారా తమ ముందు ప్రదర్శితమవుతున్నవాడు ఐగుప్తు రాజుకన్నా శక్తిమంతుడని తన ప్రజలు ఫరోసహా తనను నమ్ముతారని దేవుడు మోషేతో చెప్పాడు.PPTel 244.1

    తన ముందున్న ఆ బృహత్ కార్యం దైవ సేవకుణ్నింకా గజిబిజి పరుస్తూనే ఉంది. ఆ అయోమయ స్థితిలో మోషే తాను సరిగా మాట్లాడలేనన్న సాకు చెప్పి తప్పించుకో జూశాడు. “ప్రభువా, ఇంతకు మును పైనను, నీవు నీ xసునితో మాట్లాడినప్పటినుండి యైనను, నేను మాట నేర్పరినికాను, నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడను” అన్నాడు. ఐగుప్తీయుల్నుంచి ఎంతోకాలం దూరంగా ఉండటం మూలాన క్రితం వారితో ఉన్నప్పుడు మాట్లాడినంత సరళంగా వారి భాష ఇప్పుడు మోషే మాట్లాడలేకపోయాడు.PPTel 244.2

    “మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగవానినేగాని, చెవిటివానినేగాని, దృష్టిగలవానినేగాని, గ్రుడ్డివానినేగాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనేగదా?” సహాయం చేస్తానంటూ మరొక వాగ్దానం దీనికి కలిపాడు. “కాబట్టి వెళ్లుము, నీ నోటికి తోడైయుండి నీవు ఏమి పలుక వలసినది నీకు బోధపరచెదను”. తనకన్న మెరుగైన వేరొకర్ని ఎంపిక చేసుకోమని మోషే ప్రభువును బతిమాలాడు. మొదట ఈ సాకులు వినయ మనస్సు నుంచి ఆత్మ విశ్వాసం లోపించటంవల్ల వచ్చాయి. కాని తనకున్న సమస్యల్ని తొలగించి తనకు జయం చేకూర్చుతానన్న వాగ్దానం దేవుడిచ్చినప్పుడు ఇంకా సందేహించటం, తాను సమర్ధుణ్ని కాదనటం దేవున్ని విశ్వసించకపోవటమే అవుతుంది. ఏ పని నిమిత్తం దేవుడు తనను ఎంపిక చేశాడో దానికి ఆయన తనను యోగ్యుణ్ని చేయలేకపోయాడనో లేదా దేవుడు తనను ఎంపిక చెయ్యడంలో పొరపాటు చేశాడనో అది సూచిస్తుంది.PPTel 244.3

    మోషేని దేవుడు ఇప్పుడు తన అన్న అహరోను వద్దకు నడిపించాడు. అహరోను ఐగుప్తీయుల భాషను అనునిత్యం మాట్లాడటంవల్ల ఆ భాషను చక్కగా మాట్లాడగలడు. అహరోను తనను కలవటానికి వస్తున్నాడని ఆయన మోషేతో చెప్పాడు. తర్వాత ప్రభువు పలికిన మాటలు ఒక ఖచ్చితమైన ఆజ్ఞ.PPTel 245.1

    “నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడైయుండి మీరు చేయవలసిన దానినిన మీకు బోధించెదను. అతడే నీకు బదులు జనులతో మాటలాడును. అతడే నీకు నోరుగా నుండును. నీవు అతనికి దేవుడవుగా ఉందువు. నీవు ఈ కర్ర చేతపట్టుకొని దానితో ఈ సూచకక్రియలు చేయవలెనె”. మోషే ఇక సాకులు చెప్పటానికి ఆస్కారం లేకపోయింది.PPTel 245.2

    తనకు దేవుని ఆనతి వచ్చినప్పుడు మోషేలో ఆత్మ విశ్వాసం లేదు. అతడు సరళంగా మాట్లాడలేనివాడు. పిరికివాడు. దేవుని స్థానే ఇశ్రాయేలీయులకి వక్తగా వ్వవహరించ టానికి తాను అసమర్థుణ్నన్న స్పృహ అతడిలో ప్రబలంగా ఉంది. కాగా బాధ్యతను అంగీకరించాడు గనుక దేవుని పై పూర్తి విశ్వాసముంచి కార్యా చరణ చేపట్టాడు. తాను చేపట్టిన కార్యం గొప్పది. ఆ కార్యాచరణకు తన ఉన్నత మానసిక శక్తుల్ని ఉపయో గించటం అవసరం. వెంటనే లోబడినందుకు దేవుడతణ్ని దీవించాడు. అతడు చక్కగా మాట్లాడగలిగాడు. అతడు నిరీక్షణతో ఆత్మ విశ్వాసంతో నిండి దేవుడు తనకిచ్చిన ఆ మాహాకార్యాన్ని నిర్వహించటానికి సమర్ధుడయ్యాడు. తనను సంపూర్తిగా విశ్వసించి తన ఆజ్జల్ని మినహాయింపులు లేకుండా అమలు పర్చటానికి తమ్మును తాము సమర్పించుకోనేవారి ప్రవర్తల్ని దేవుడు ఎలా పటిష్ఠం చేస్తాడో అన్నదానికి ఇది ఒక ఉదాహరణ.PPTel 245.3

    ఒక వ్యక్తి దేవుడు తనకిచ్చే బాధ్యతల్ని అంగీకరించి వాటిని సవ్యంగా నిర్వహించటానికి తన్నుతాను అర్హుణ్ని చేసుకొన్నప్పుడు అతడు శక్తిని నిపుణతను పొందుతాడు. అతడి హోదా ఎంత చిన్నదైనా అతడి సామర్థ్యం ఎంత పరిమితమైందైనా దేవుని శక్తి మీద ఆధారపడి తన పనిని నమ్మకంగా చేస్తే అతడు నిజమైన గొప్పతనాన్ని సాధిస్తాడు. తన సొంత బలంమీద తన సొంత జ్ఞానం మీద ఆధారపడి ఆ బాధ్యతను మోషే అతృతగా అంగీకరించి ఉంటే అలాంటి కార్యనిర్వహణకు తాను అనర్హుణ్నని కనపర్చుకొనేవాడు. ఒక వ్యక్తి తాను బలహీనుణ్నని అసమర్ధుణ్నని భావించటమన్న విషయం అతడు తనకు నియమితమైన కార్య విస్తారతను గుర్తించి దేవునిని తన ఆలోచనకర్తగాను బలంగాను చేసుకొంటాడని భావించటానికి కొంత నిదర్శనం.PPTel 245.4

    మోషే తన మామవద్దకు వెళ్లి ఐగుపుతలోవున్న తన ఆప్తుల్ని సందర్శించటానికి వెళ్తానని చెప్పాడు. యిత్రో “క్షేమముగా వెళ్లుము” అని దీవించి పంపాడు మోషే తన భార్యా పిల్లలతో ప్రయాణమాయ్యడు. తాను ఎందుకు వెళ్తున్నదీ చెప్పితే భార్యను పిలల్ని తనతో వెళ్లనివ్వరేమోనని ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. ఐగుప్తు చేరకముందు తన క్షేమం దృష్టిలో ఉంచుకొని భార్యను పిల్లల్ని మిద్యాను గృహానికి తిరిగి పంపివేయాలని మోషేనే భావించాడు.PPTel 246.1

    ఫరో గురించి, నలభై సంవత్సరాల క్రితం తనపై ఆగ్రహించిన ఐగుప్తు ప్రజల గురించి మోషేకి లోలోన భయం ఉంది. అందుకు ఐగుప్తుకి వెళ్లటం తనకు ఇష్టం లేదు. అయితే తన శత్రువులు మరణించారాని మోషేకి దేవుడు బయలుపర్చాడు. మోషే దేవుని ఆజ్ఞ శిరసావహించటం ప్రారంభించాడు.PPTel 246.2

    మిద్యాను నుంచి వెళ్లున్నప్పుడు మార్గంలో తన తీవ్ర అసమ్మతి వ్యక్తం చేస్తూ దేవుడు మోషేని హెచ్చరించాడు. భయంకర భంగిమలో తనను వెంటనే నాశనం చేస్తాడా అన్నట్లు ఒక దూత మో షేకి కనిపించాడు. వివరణ ఏమీ ఇవ్వలేదు. దేవుని విధుల్లో ఒక దాన్ని తాను అశ్రద్ధ చేసినట్లు మోషేకి జ్ఞాపకం వచ్చింది. భార్య మాట విని తమ చిన్న కుమారుడికి సున్నతి చేయటం మోషే అశ్రద్ధ చేశాడు. ఇశ్రాయేలుతో దేవుడు చేసిన నిబంధన దీవెనలు తన కుమారుడు పొందటానికిగాను తాను నెరవేర్చాల్సిన షరతులను మోషే అశ్రద్ధ చేశాడు. ఎంపికయిన నాయకుడు అట్టి అశ్రద్ధకు పాల్పడడం ప్రజలపై దేవుని నీతి విధుల ప్రభావాన్ని బలహీనపర్చడం ఖాయం, భర్త మరణిస్తాడేమోనన్న భయంతో సిప్పోరా కుమారుడికి తానే సున్నతి చేయగా దూత వెళ్లిపోయాడు. మోషే ప్రయాణం కొన సాగించాడు ఫరోతో తన రాయబారం సందర్భంగా మోషే అపాయకరమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది పరిశుద్ధ దూతల సంరక్షణ వల్లనే అతడికి భద్రత కలుగుతుంది. అయితే తనకు తెలిపిన ఒక ధర్మవిధిని అలక్ష్యం చేస్తే అతడికి భద్రత ఉండదు. దేవుని దూతలు అతణ్ని కాపడలేదు. క్రీస్తు రాకకు ముందు సంభవించనున్న శ్రమకాలంలో నీతిమంతులకు పరిశుద్ధ దూతల పరిచర్య ద్వారా భద్రత కలుగుతుంది. దైవ ధర్మ శాస్త్రాన్ని అశ్రద్ధచేసేవారికి భద్రత ఉండదు. దేవుని అజ్ఞల్లో ఒక దాన్ని బేఖాతరు చేసేవారిని దూతలు పరిరక్షించలేరు.PPTel 246.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents