Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    58—ప్రవక్తల పాఠశాలలు

    ఇశ్రాయేలీయుల విద్యాభ్యాసానికి దిశానిర్దేశం దేవుడే చేసాడు. ఆయన శ్రద్ధా సక్తులు వారి మతపరమైన విషయాలికి మాత్రమే పరిమితం కాలేదు. వారి మానసిక లేదా శారీరక క్షేమాభివృద్ధికి సంబంధించినదంతా ఆయన ఆలోచనలకి దైవ నిబంధన పరిధిలోకి వచ్చింది.PPTel 598.1

    హెబ్రీయులు తమ బిడ్డలకు దైవ నిబంధనలు నేర్పించి ఆయన తమ పితరులతో వ్యవహరించిన తీరు తెన్నుల్ని వారికి తెలియజేయవలసిందిగా దేవుడు ఆదేశించాడు. ప్రతీ తల్లికి ప్రతీ తండ్రికి ఇది దేవుడిచ్చిన ప్రత్యేక బాధ్యత. ఇది వారు మరొకరికి అప్పగించరాని బాధ్యత. తమ బిడ్డలు వారెవరుగని పరాయి వారి నోట ఉపదేశం పొందేకన్నా తల్లితండ్రులే వారికి ఉపదేశమివ్వాలన్నది దేవుని సంకల్పం. దినవారీ జీవనానికి సంబంధించిన ఘటనలతో దేవుని గూర్చిన భావజాలాన్ని అనుబంధ పర్చాల్సి ఉన్నారు. తన ప్రజల విమోచనలో దేవుని అద్భుత కార్యాల్ని రానున్న రక్షకుని గూర్చిన వాగ్దానాన్ని ఇశ్రాయేలీయులు తమ గృహాల్లో తరచు ప్రస్తావించు కోవాల్సి ఉన్నారు. చాయారూపకాలు, సంకేతాలతో ఈ పాఠాల్ని మనసుల్లో ధృడంగా పాదుకోల్పొల్సి ఉన్నారు. తల్లితండ్రులు దైవ కృపలను గూర్చిన సత్యాలు, నిత్యజీవాన్ని గూర్చిన సత్యాలు పిల్లల మనసులో పాదుకొల్పారు. ప్రకృతి లోని దృశ్యాల్ని దైవ వాక్యంలోని మాటల్ని ఒకటిగా పరిగణిచేటట్లు చిన్నారుల మనుసల్ని తర్పీదు చేసారు. ఆకాశంలోని నక్షత్రాలు, పొలాల్లోని చెట్లు, పువ్వులు ఎత్తయిన పర్వతాలు, ప్రవహించే సెలయేళ్ళు - ఇవన్నీ సృష్టికర్త ఉనికిని చాటుతున్నాయి. గుడారంలోని బలులు, దైవారాదన, ప్రవక్తల మాటలు ఇవన్నీ దేవుని ప్రత్యక్షతలే.PPTel 598.2

    తాను పెరిగిన సామాన్య గోషేను గృహంలో మోషే పొందిన విద్య ఇలాంటిదే. హన్నా సమూయేలుకి నేర్పిన విద్య ఇదే. తన తల్లితండ్రులు గృహం నుంచి బబులోను చెర దానియేలుని విడదీయకముందు అతడు పొందిన విద్య ఇదే. నజరేతులో తన బాల్యంలో క్రీస్తూ ఇలాంటి విద్యనే నేర్చుకున్నాడు. బాలుడైన తిమోతి ఆమ్మమ్మ లోయ వద్ద తల్లి యునికే వద్ద నేర్చుకొన్న విద్య (2 తిమోతి 1:5, 3:15) పరిశుద్ద వాక్యంలోని సత్యాలే! |PPTel 598.3

    ప్రవక్తల పాఠశాలల స్థాపన ద్వారా బాలల విద్యకు అదనపు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక యువకుడు ఇశ్రాయేలు దేశంలో ఉపాధ్యాయుడు కావాలన్న కోరికతో దైవ వాక్యంలోని సత్యాల్ని లోతుగా పరిశీలించి పై నుంచి జ్ఞానం పొందగోరినట్లయితే అతడు ఈ పాఠశాలల్లో చేరవచ్చు. విస్తరించి ఉన్న దుర్నీతికి అడ్డుకట్టవేయటానిక యువజనుల మానసిక ఆధ్యాత్మిక శ్రేయాన్ని ప్రోది చేయటానికి నాయకులుగాను, హితవరులుగాను దేవుని భయంతో వ్యవహరించటానికి యోగ్యులైన వ్యక్తుల్ని అందించటం ద్వారా భవిష్యత్తులో దేశ ప్రగతిని ప్రోత్సహించటానికి సమూయేలు ప్రవక్తల పాఠశాలల్ని స్థాపించాడు. ఈ లక్ష్యసాధనలోసమూయేలు భక్తి, తెలివితేటలు, కష్టపడి చదివే తత్వం గల విద్యార్థుల్ని పోగు చేసాడు. వీరిని ప్రవక్తల శిష్యులని పిలిచారు! వారు దేవునితో మాట్లాడి ఆయన వాక్యాల్ని కార్యాల్ని అద్యయనం చేసేవారు గనుక వారి స్వాభావిక సమర్థతలకు తోడుగా దేవుడు వారికి వివేకాన్నిచ్చాడు. ఆ పాఠశాలల్లోని ఉపదేశకులు దైవవాక్యంలో ప్రతిభ గలవారు మాత్రమే గాక దేవునితో సాంగత్యం కలిగి ఆయన ప్రత్యేక ఆత్మ వరాన్ని పొందిన వ్యక్తులు. జ్ఞానం విషయంలోను దైవభక్తి విషయంలోను వారు ప్రజల గౌరవాన్ని అదరణను పొందినవారు.PPTel 599.1

    ఈ పాఠశాలల్లో ప్రధాన పాఠ్యాంశాలు, దేవుడు మో షేకిచ్చిన ఉపదేశాలతో పాటు దైవ ధర్మశాస్త్రం, పరిశుద్ధ చరిత్ర, పరిశుద్ధ సంగీతం, పద్య సాహిత్యం వారు అనుసరించిన బోధనా పద్ధతి నేటి వేదాంత పాఠశాలల్లోని బోధనా విధానానికి భిన్నమైంది. నేటి పాఠశాలల్లో నుంచి ఉత్తీర్ణులవుతున్న విద్యార్థులు తాము వచ్చినప్పటికన్నా వెళ్ళిపోయేటప్పుడు దేవుని గురించి మత సంబంధిత సత్యం గురించి తక్కువ జ్ఞానంతో వెళ్తున్నారు. పూర్వకాలంలోని ఆ పాఠశలల్లో దేవుని చిత్తాన్ని గూర్చి దేవుని పట్ల మానవుడి విధిని గూర్చి అధ్యయనం చేయటమే విద్య తాలూకు ప్రధాన లక్ష్యం. పరిశుద్ద చరిత్ర దాఖలాల్లో యెహోవా అడుగుజాడలు ద్యోతకమాయ్యయి. చాయారూపక దృశ్యాల్లో గొప్ప సత్యాలు వ్యక్తమయ్యాయి. ఛాయా రూపక వ్యవస్థ అంతటికి కేంద్రబిందువును అనగా లోకపాపాల్ని తీసివేసే దేవుని గొర్రెపిల్లను విశ్వాసం అవగాహన చేసుకొంది.PPTel 599.2

    భక్తిభావం పెల్లుబికింది, ప్రార్ధనా విధిని మాత్రమే గాక ఎలా ప్రార్ధించటం , తమ సృష్టికర్తను ఎలా సమీపించటం, ఆయన పై విశ్వాసం నిలపం, పరిశుద్దాత్మ ప్రభోదాల్ని అవగాహన చేసుకొని అచరించం విద్యార్థులకు నేర్పటం జరిగేది. పరిశు ద్దలైన మేధావులు దేవుని ధనాగారమైన ప్రవచనం ద్వారాను పరిశుద్ధ సంగీతం ద్వారాను దేవుని ఆత్మ ప్రదిర్శతమయ్యేది.PPTel 599.3

    పరిశుద్ధమైన ఉదాత్తమైన సమున్నత స్థాయికి తలంపుల్ని ఎత్తటం, ఆత్మలో దేవుని పట్ల భక్తి కృతజ్ఞతల్ని పెంపొందించటం అన్న పవిత్ర లక్ష్యసాధనకు సంగీతం ఉపయుక్తమయ్యేది. పూర్వాచారానికి నేడు సంగీతాన్ని ఉపయోగిస్తున్న తీరుకు మధ్య ఎంత వ్యత్యాసముంది! దేవున్ని మహిమ పర్చటానికి ఉపయోగించే బదులు ఆత్మ ఉన్నతిని పెంచుకోవటానికి ఎంతమంది ఈ వరాన్ని ఉపయోగించుకొంటున్నారు! సంగీతం పట్ల తమకున్న అమరశక్తిన బట్టి అనేకమంది అమాయకంగా లోకాశలు అభిరుచులు గల వారితో కలసి దేవుడు తన బిడ్డలకు నిషేధించిన చోట్లకు వినోదాల్లో తేలి అడటానికి వెళ్లారు. ఏది సవ్యమైన రీతిలో ఉపయోగించినప్పుడు గొప్ప ఆశీర్వాదంగా పరిణమిస్తుందో అది ఇలా సాతాను విజయవంతంగా ఉపయోగించే సాధనాల్లో ఒకటవుతుంది. విద్యుక్తధర్మం నుంచి తప్పించి నిత్యజీవానికి సంబంధిం చిన సంగతులకు అది ఇలా మనసును విముఖం చేస్తుంది.PPTel 600.1

    పరలోకంలో దేవుని ఆరాధనలో సంగీతం ఒక భాగం. అందుచేత మన స్తుతి గానాలు సాధ్యమైనంత మేరకు పరలోక బృందం గానానికి అనుగుణంగా ఉండాలి. స్వరాన్ని సక్రమ రీతిలో తర్పీదు చేయటం విద్యలో ఎలా ముఖ్యమైన భాగమో మతారాధన లోని గానం కూడా అలాగే ముఖ్యమైన భాగం పాట స్పూర్తితో హృదయం నిండాలి. అప్పుడే దాని భావ ప్రకటన సరి అయిన రీతిలో జరుగుతుంది.PPTel 600.2

    దేవుని ప్రవక్తలు భోధించిన పాఠశాలకు మన నవీన విద్యా సంస్థలకు మధ్య ఎంత గొప్ప తేడా ఉంది! లౌకిక సూత్రాలు ఆచారాలు ఆచరించకుండా నడిచే పాఠశాలలు సంఖ్య ఎంత తక్కువ! పాఠశాలల్లో ఆదుపాజ్ఞలు, క్రమశిక్షణ వైఫల్యం అతి దారుణం. క్రైస్తవులమని చెప్పుకుని ప్రజల్లో దైవ వాక్యాన్ని గూర్చిన అజ్ఞానం అందోళనకరం.నైతిక విలువలు, మతం విషయాల్లో వట్టిమాటలు ఉద్వేగ భరిత భావాలు ఉపదశంగా చలామణి అవుతున్నాయి. దేవుని న్యాయం, కృప, పరిశుద్ధత తాలూకు సౌందర్యం, నీతి క్రియలకు ప్రతిఫలం, పాపం హేయ స్వభావం దాని అనివార్యభయంకర పర్యవసానం వీటిని గూర్చి యువతకు స్పష్టమైన అవగాహన ఉండదు. శీలహీన నేస్తాలనుంచి యువజనులు నేరం, దుర్వ్యయం, వ్యభిచారం నేర్చుకుంటారు,. పూర్వపు హెబ్రీయుల పాఠశాలల నుంచి ఈనాటి విద్యావేత్తలు నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్నిలేవా! మానవుణ్ణి సృష్టించిన దేవుడు అతడి శారీరక, మానసిక ఆత్మీయ క్షేమాభివృద్ధికి వనరులు ఏర్పాటు చేశాడు. కనుక, సృష్టికర్త అనుగ్రహించిన ప్రణాళికను నమ్మకంగా అనుసరించటం మీదనే విద్య విషయంలో వాస్తవమైన విజయం లభ్యమౌతుంది.PPTel 600.3

    దేవుని స్వరూపాన్ని ఆత్మలో పునరుద్దరించటమే విద్య సాధించాల్సిన వాస్తవిక లక్ష్యం. అదిలో మానవుణ్ణి దేవుడు తన స్వరూపంలో సృష్టించాడు. అతడికి సమున్నత గుణలక్షణాలిచ్చాడు. అతడికి సంతుల మనసునిచ్చాడు. అతడి శక్తి సామ్యా లన్నీ సామరస్యంతో పనిచేశాయి. అయితే పాపం. దాని పర్యవసానాల వల్ల వీటిలో వక్రత చోటు చేసుకుంది. మానవుడిలో దైవ స్వరూపాన్ని పాపం వికృత పర్చి దాన్ని దాదాపు తుడిచివేసంది. దీన్ని పునరుద్ధరించేందుకు రక్షణ ప్రాణాళిక రచన జరిగింది. మానవ మనుగడకు కృపకాలం ఏర్పాటయ్యింది. మానవుడు అదిలో ఏ సంపూర్ణతతో సృష్టి పొందాడో ఆ సంపూర్ణ స్తితికి అతణ్ణి పునరుద్ధరించటమే జీవిత మహోన్నత లక్ష్యం తక్కినఅ అంశాలన్నిటిలో ఇదే ప్రధానంశం. పిల్లల విద్య విషయంలో దేవునితో సహకరించటమే తల్లితండ్రులు అధ్యాపకులు చేయాల్సిన పని. ఆవిధంగా వారు “దేవుని జతపనివారై” ఉన్నారు 1 కొరింథీ 3:9PPTel 601.1

    మానవులకన్న మానసిక, ఆత్మీయ శారారీక సామార్యాలన్ని దేవుడిచ్చినవే. వాటిని తమ శక్తి మేరకు వృద్ధిపర్చటానికే దేవుడిచ్చాడు. అలాగని వాటిని కేవలం స్వార్ద ప్రయోజనాలకే ఉద్దేశించి వృద్ధి పర్చకూడదు. ఎందుకంటే దేవుని ప్రవర్తన ఔదార్యంతో, ప్రేమతో కూడినది ఆ పోలికను మనం పెంపొందించుకోవాలసి ఉన్నాం. సృష్టికర్త మనకనుగ్రహించిన ప్రతీ సామార్థ్యాన్ని ప్రతీ గుణలక్షణాల్ని ఆయనన మహిమపర్చేందుకూ మన సాటి మానవుల్ని ఉద్దరించేందుకూ మనం వినయోగించాలి. ఇలా వినియుక్తమైనప్పుడే అవి సార్ధకమవుతాయి. అవి నిష్కళంకమైన ఉదాత్తమైన ఆనందాన్ని ఇస్తాయి.PPTel 601.2

    ప్రాముఖ్యమైన ఈ సూత్రం కోరే గమనాన్ని దీనికిచ్చినట్లయితే ప్రస్తుతం ఆచరణలో ఉన్న కొన్ని బోధన పద్దుతుల్లో బ్రాహ్మండమైన మార్పు వస్తుంది. అనుకరణను ప్రోత్సహించే అహంకారాన్ని స్వార్ధాన్ని రగుల్కొలిపే బదులు ఉపాధ్యాయులు మంచి తనం, యధార్ధత, సౌందార్యం పట్ల మక్కువనే మేల్కొలుపుతారు. తనలో దైవవరాల్ని వృద్ధిపర్చుకోవటానికి విద్యార్ది పాటుపడ్డాడు. అది చేయటం ఇతరులపై అధిక్యం సంపాదించటానికి కాదు. సృష్టికర్త వద్దకు వెళ్లటానికి, ఆయనను గూర్చి తెలుసుకోవటానికి, ఆయనను పోలి ఉండటానికి మనసు ప్రోత్సాహం పొందుతుంది.PPTel 601.3

    “యెహోవాయందు భయభక్తులు గలిగియుండుటయే జ్ఞానమునకు మూలము” సామెతలు 9:10 జీవితంలో చేయాల్సిన గొప్ప పని ప్రవర్తన నిర్మాణం, దేవుని గూర్చిన జ్ఞానమే యధార్థ విద్యకు పునాది. ఈ జ్ఞానాన్ని అందించటం దానికనుగుణంగా ప్రవర్తనను తీర్చిదిద్దటంమన్నదే ఆధ్యాపకుడి లక్ష్యం కావాలి. దేవుని ధర్మశాస్త్రం అయన ప్రవర్తన ప్రతిబంబమే. అందుకే కీర్తన రచయిత ఇలా అంటున్నాడు. నీ ఆజ్ఞలన్నియు న్యాయములు” నీ ఉపదేశముల వలన నాకు కలిగెను.” కీర్తనలు 119:172, 104 తన వాక్యంలోను దైవావేశం వల్ల కలిగిన ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారాను, ఆయన ప్రకృతి గ్రంధం ద్వారా నుండి ఆయనను గూర్చిన జ్ఞానాన్ని ఆర్జించాల్సి ఉన్నాం,PPTel 602.1

    మనసు ఏ అంశాల పై ధ్యానించటటానికి శిక్షణ పొందుతుందో క్రమక్రమంగా వాటికి అనుగుణంగా మారుతుందన్నది మనోశాస్త్ర నిబంధన. సామాన్య అంశాలతోనే దాన్ని నింపితే అది ఎదుగుబొదుగు లేకుండా ఉంటే కొంతకాలానికి అది దాని పెరుగుదల శక్తిని దాదాపుకోల్పోవుతుంది. భోధనా శక్తి బైబిలు దానికదే సాటి. ఆలోచనలో మనసు ఆగాధాల్లోకి వెళ్ళటానికి ఉన్నతంగా పైకి లేవటానికి దైవవాక్యంలో అంశాలున్నాయి. బైబిలు గొప్ప పరిజ్ఞానాన్నిచ్చే చరిత్ర గ్రంథం. అది నిత్య సత్యనిధి నుంచి తాజగా వెలువడిన గ్రంథం. దైవ హస్తమే అన్ని యుగాల్లోను దాని స్వచ్చతను పరిరక్షించింది. మానవ పరిశోధనకు అలవికాని సుదీర్ఘ గతాన్ని అది వెలుగుతో నింపుతుంది. భూమికి పునాదులు వేసి ఆకాశ విశాలాన్న పరిచిన శక్తిని దైవ వాక్యంలో మనం చూస్తున్నాం. మానవ దురాభిమానాలకి, దురహంకారినికి తావులేని చరిత్ర ఇక్కడ మాత్రమే లభ్యమవుతుంది. లోకంలో అత్యుత్తమ వ్యక్తుల శ్రమలు, లోటుపాట్లు, విజయాల దాఖలాలు ఈ గ్రంధంలో కనుగొంటాం. మానవుడి విధి అతడి భవిష్యత్తును గూర్చిన సమస్యలు ఇందులో విశదం చేయటం జరిగింది. కనిపించని ప్రపంచం నుంచి కనిపించే నీతి సత్యాల అంతిమ విజయం వరక మంచికి, చెడుకు మధ్యసాగే సంఘర్షణన మనం వీక్షిస్తాం. ఇదంతాదేవుని ప్రవర్తన అవిష్కరణ తప్ప మరేమి కాదు. దైవ వాక్యంలోని సత్యాల్ని భక్తి పూర్వకంగా పరిశీలించటంలో విద్యార్ధి మనసుకు అనంత జ్ఞాని అయిన దేవుని మనసుతో సంబంధం ఏర్పడుతుంది. అట్టి అధ్యయనం ప్రవర్తనను శుద్ధిపర్చి సమున్నత మోనరించటమే గాక మానసిక శక్తిని విస్తృత పరచి బలోపేతం చేస్తుంది.PPTel 602.2

    జీవన సంబంధాలన్నిటిలోను మానవుడి ప్రగతిలో బైబిలు బోధన ప్రధాన పాత్ర పోషిస్తుంది. జాతి అభివృద్ధికి మౌలిక సూత్రాల్ని సూచిస్తుంది. అవి సమాజ సంక్షేమానికి కుటుంబ సంక్షేమానికి అత్యవసరమైన సూత్రాలు ఈ సూత్రాలు లేకుండా ఏమనిషీ జీవితంలో ప్రయోజకత్వాన్ని సంతోషాన్ని గౌరవాన్ని సాధించటం దుర్లభం,భవిష్యత్తులో నిత్య జీవాన్ని పొందటానికి నిరీక్షించటం అసంభవం. జీవితంలో ఏ హోదాకైన ఆ ఏ అనుభవానికైనా అవసరమైన సిద్దబాటును శిక్షణను బైబిలు బోధన సమకూర్చలేకపోవటమంటూ లేదు. మనుషులు దైవ వాక్యాన్ని అధ్యయనం చేసి దాని ఉపదేశానికి విధేయులై నివసించినట్లయితే అది తర్బీతు చేసే వ్యక్తులు మానవ వేదాంతం అంశాలు రూపొందించే వ్యక్తుల కన్నా మానసికంగా ఎంతో చురుకుగా ఎంతో దృడంగా ఉంటారు. బైబిలు ధృడమైన ప్రవర్తన, జ్ఞానయుక్తమైన అవగాహన విచక్షణ గల మనుషుల్ని లోకానికి ఇస్తుంది. వారు దేవుని ప్రేమించి ఏ మనుషులుగా లోక శ్రేయాన్ని ప్రోది చేసే మనుషులుగా ఉంటారు.PPTel 603.1

    విజ్ఞాన శాస్త్ర అధ్యయనం ద్వారా కూడా సృష్టికర్తనుగూర్చిన జ్ఞానాన్ని మనం పొందాల్సి ఉన్నాం. భౌతిక ప్రపంంచ మీద దేవుని చేతిరాతకు వివరణ ఇచ్చేది. యధార్థమైన విజ్ఞాన శాస్త్రం. విజ్ఞాన శాస్త్రం తన పరిశోధనల ద్వారా దేవుని శక్తికి వివేకానికి తాజా నిదర్శనాల్ని సమర్పించాల్సి ఉంది. సరి అయిన రీతిలో అవగాహన చేసుకుంటే ప్రకృతి గ్రంథం బైబిలు గ్రంథం రెండు ఏ నియామల ప్రకారం దేవుడు పనిచేస్తాడో వాటిని మనకు వివరించటం ద్వారా మనకు ఆయనతో పరిచయం ఏర్పర్చుతాయి.PPTel 603.2

    సృష్టి కార్యాలన్నిటిలోను ఉపాధ్యాయుడు విద్యార్ధికి దేవున్ని చూపించాలి. ఉపాధ్యాయులు పరమ ఉపాధ్యాయుడైన యేసు ఆదర్శాన్ని అనుకరించాలి. సుపరిచతమైన ప్రకృతి దృశ్యాల నుంచి ఉదాహరణలు తీసుకొని శ్రోతలకు సులభంగా విస్పష్టంగా గ్రాహ్యమయ్యేరీతిగా ఈ పరమ భోధకుడు బోధించాడు. చెట్ల ఆకుల చాటు నుంచి పాటలు పాడే పిట్టలు లోయలో విరబూచే పుష్పాలు, ఆకాశన్నంటే వృక్షాలు పంట పొలాలు విచ్చుకొంటున్న వెన్నులు, ఎడారి భములు, ఆస్తమిస్తున్న సూర్యుడు ఆకాశంలో మెరిస్తూ బంగారు కిరణాలు అన్నిటిని ఆయన తన ఉపదేశ సాధనాలుగా మల్చుకున్నాడు. తాను పలికిన జీవ వాక్కులతో కనిపించే సృష్టి కార్యాల్ని జతపర్చి అవి శ్రోతల దృష్టికి వచ్చినప్పుడల్లా తాను వాటితో జతపర్చిన సత్యాల పైకి వారి ఆలోచనల్ని తిప్పేవాడు.PPTel 603.3

    ఆత్మావేశంతో నిండిన బైబిలు పుటల్లో కనిపిస్తున్న దేవుని ముద్రే పర్వతాలు, లోయలు, సముద్రాల పైనా కనిపిస్తుంది. ప్రకృతిలోని కార్యాలు మానవుడికి తన సృష్టికర్త ప్రేమను వెల్లడిచేస్తున్నాయి. భూమ్యాకాశాల్లు అనేక గుర్తుల ద్వారా ఆయన మనల్ని తనతో అనుసంధాన పర్చుకొంటున్నాడు. ఈలోకం అంతా దు:ఖం విచారం మాత్రమే కాదు విచ్చుకొంటున్న ప్రతీ మొగ్గ మీద , ప్రతీ పూరేకు మీద, ప్రతీ గడ్డిపోచ మీద, “దేవుడు ప్రేమా స్వరూపి” అని ముద్రిత పై ఉంది. పాపం కారణంగా భూమి పై ముళ్ళూ, గుచ్చుపాదలు ఉన్నప్పటికి గచ్చ పొదల పై చక్కని పువ్వులున్నాయి. ముళ్ళను కప్పివేస్తే గులాబీలున్నాయి. ప్రకృతితోని కార్యాలన్ని దేవుడు మనపట్ల చూసే శ్రద్ధాసక్తుల్ని పితృవాత్సల్యానికి తన బిడ్డల్ని సంతోషంగా ఉంచాలన్న ఆయన కోరికకూ సాక్ష్యాలు. ఆయన నిషేదాలు ఉపదేశాలు తన అధికారాన్ని చూపించుకోవటానికి ఉద్దేశించినవి కావు. తాను చేసే సమస్తంలోను తన బిడ్డల సంక్షేమమే అయిన లక్ష్యం. తమకు మేలుచేసే దేనిని వారు త్యాగం చేయాలని ఆయన కోరడు.PPTel 604.1

    ఈ జీవితంలో మతం ఆరోగ్యానికి లేదా ఆనందానికి దోహదకారి కాదన్న అభిప్రాయం సమాజంలోని అన్ని తరగుతుల ప్రజల్లోను ఉన్నది. ఇది పెద్ద పొరపాటు. వాక్యం ఇలా చెబుతున్ననది “యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట జీవ సాధనము. అది కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండ బ్రదుకును” సామెతలు 19:23 “బ్రదుక గోరువాడెవడైన నున్నాడా? మేలునొందుచు అనేక దినములు బ్రదకగోరువాడెవడైన నున్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుక ను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుచు. కీడు చేయుటమాని మేలు చేయుము. సమాధానము వెదకి దాని వెంటాడుము” కీర్తనలు 34:12-14 “వివేకంగల మాటలు దొరకినవారికి అవి జీవమును, ఆరోగ్యమును ఇచ్చును. సామతెలు 4:22PPTel 604.2

    వాస్తవికమైనమతం శారీరక మానసిక నైతికపరమైన దైవ నిబంధనకు అనుగుణంగా నడుచుకొనేటట్లు మనుషుణ్ణి నడిపిస్తుంది. ఆత్మ నిగ్రహం, ప్రశాంతత అశా నిగ్రహం నేర్పిస్తుంది. మతం మనసును ఉన్నత పర్చుతుంది. అభిరుచుల్ని శుద్దీకరిస్తుంది. అభిప్రాయాల్ని పరిశద్దుపరుస్తుంది ఆత్మకు పరలోక పవిత్రతలో పాలుపంపులు కలిగిస్తుంది. దేవుని ప్రేమ పై ఆయన దిశా నిర్దేశం పై విశ్వాసం కలిగిస్తుంది. ఆందోళనను చింతనను తొలగిస్తుంది. అది కలిమిలోను, లేమిలోను హృదయాన్ని ఆనందంతోను తృప్తితోను నింపుతుంది. మతం ప్రత్యక్షంగా ఆరోగ్యాన్ని పెంపుచేస్తుంది. జీవితాన్ని తేలికపర్చుతుంది. జీవితం ప్రసాదించే ఆశీర్వాదాల్ని ఆనందించటానికి తోడ్పడుతుంది. ఎన్నడూ ఎండిపోని ఆనందపు ఊటను ఆత్మలో ప్రవహింపజేస్తుంది. తాము అన్వేషిస్తున్న దానికన్నా ఎంతో శ్రేష్టమైన ఈవిని ఇవ్వటానికి క్రీస్తు సిద్ధంగా ఉన్నాడన్న సంగతి ఆయనను ఎంపిక చేసుకోని వారందరూ గుర్తుంచుదురు గాక దేవుని చిత్తానికి విరుద్ధంగా తలంచటం నడుచుకోవటం చేసే మనిషి స్వయాన తనకే తీవ్రహాని తీరని అన్యాయం చేసుకొంటున్న వాడవుతాడు. ఏది ఉత్తమమో ఎరిగినవాడు, తన ప్రజలకు ఏది మంచిదో అది ఏర్పాటు చేసేవాడు అయిన ప్రభువు కాదన్నదేదైనా వాస్తవికానందాన్ని ఇచ్చేది కాదు. అవిధేయ మార్గం దు:ఖానికి నాశనానికి నడిపిస్తుంది. కాని జ్ఞాన “మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలన్నియు క్షేమకరములు”. సామెతలు 3:17PPTel 604.3

    హెబ్రీయుల పాఠశాలల్లో లభ్యమైన శరీర సంబంధమైన మత సంబంధమైన శిక్షణను అధ్యయం చేయటం ప్రయోజకరం. అలాంటి శిక్షణకు అభినందన కరవయ్యింది. మనసుకి శరీరానికి మధ్య చాలా దగ్గర సంబంధము ఉన్నది. నైతికంగాను మానసికంగాను ఉన్నత ప్రమాణాలుసాధించటానికి మన భౌతిక శరీరాన్ని నియంత్రించే నిబంధనల్ని పాటించటం అవసరం. బలమైన, సమతౌల్యమైన ప్రవర్తన నిర్మాణానికి మానసిక శక్తులు శారీరక శక్తులు రెండింటిని వృద్ధిపర్చటం అవసరం. మనకు దేవుడిచ్చిన ఆశ్చర్యకరమైన శారీరక వ్యవస్థ. దాన్ని ఆరోగ్యంగా ఉంచే నిబంధనల అధ్యయనం కన్నా ప్రాముఖ్యమైన అధ్యయనం ఇంకేమి ఉంటుంది, ?PPTel 605.1

    ఇశ్రాయేలీయుల దినాల్లోలాగే ఇప్పడు కూడా ప్రతీ యువకుడు ప్రతీ యువతి సామన్య జీవిత విధుల నిర్వహణలో శిక్షణ పొందటం ప్రాముఖ్యం. ఒళ్ళు వంచి చేసే ఏదో పనిలో అనగా అవసరమైనప్పుడు ఉపాధి నివ్వగల ఏదో పనిలో ప్రతీ ఒక్కరూ అనుభవ జ్ఞానం సంపాదించాలి. అనుకోని విధముగా జీవితంలో సంభవించే మార్పుల దృక్కోణంలోనే గాక శారీరక, మానసిక నైతిక వృద్ధి పై పడే ప్రభావం దృష్ట్యా కూడా ఇది ఎంతో అవసరం. బతుకుదెరువుకోసం ఒక వ్యక్తి కాయకష్టం చేయాల్సిన అవసరం ఏర్పడకపోయినా అతనికి తప్పనిసరిగా పని నేర్పాలి. దేహానికి వ్యాయామం లేకుండా దేహ దారుడ్యం, మంచి ఆరోగ్యం దుర్లభం, చురుకైన మనసుకు ఉన్నతమైన ప్రవర్తనకు కూడా క్రమబద్దమైన శారీరక శ్రమ అవసరం.PPTel 605.2

    ప్రతీ విద్యార్ధి పనినిమిత్తం దినంలో కొంత భాగాన్ని కేటాయించాలి. కష్టపడి పనిచేసే అలవాటు ఇలా అబ్బుతుంది. స్వయం సహాయక స్వభావం బలపడుతుంది. అదే సమయంలో సోమరితనం తెచ్చి పెట్టే దురభ్యాసాలు దుష్ప్రభావాలకు వారు దూరంగా ఉంటారు. ఇదంతా విద్య ప్రధాన లక్ష్యం నెరవేర్పులో భాగం. ఎందుచేతనంటే పని సంస్కృతిని కార్యదీక్షను పవిత్రతను ప్రోత్సహించటంలో మనం సృష్టికర్తతో సామరస్యాన్ని సాధిస్తున్నాం.PPTel 606.1

    దేవుని ఘనపర్చటానికి తోటి మనునషుల హితానికి పాటుపడటానికి తమను దేవుడు సృజించాడని యువతకు అవగాహన కలిగించాలి. పరలోకమందున్న తండ్రి తమ పట్ల అమిత ప్రేమవాత్సల్యాలు కలిగి ఉన్నాడని తమకు ఉత్కృష్టమైన భవిష్యత్ జీవితం ఉన్నదని దానికి జీవితంలోని క్రమశిక్షణ తమను సిద్ధం చేస్తుందని దేవుని కుమారులు కుమార్తెలు అన్న గౌరవానికి తాము పిలుపు పొందుతున్నారని ఎందరో తాము మునుపు ప్రేమించిన సుఖ భోగాల్ని ద్వేషించి వాటి నుండి వైదొలుగుతారని గ్రహించటానికి యువతను నడిపించాలి. అప్పుడు వారు పాపాన్ని ద్వేషించి విడిచి పెట్టటానికి తీర్మానించుకొంటారు. ప్రతిఫలం పొందటానికో లేక శిక్ష పడుతున్న భయంవల్లో కాక పాపం తాలూకు నైచ్యం వల్ల అది దేవుడు తమకిచ్చిన శక్తుల్ని కించపర్చుతుందున్నందువల్ల దైవపోలికలోని తమ వ్యక్తిత్తానికి అది మచ్చగా ఉన్నందు వల్ల వారు ఆ తీర్మానాన్ని తీసుకుంటారు.PPTel 606.2

    యువతకు కోరికలు ఉండకూడదని దేవుడు కోరటంలేదు. వ్యక్తిని విజయవంతుణ్ణి చేసి మానవ సమాజంలో పేరు ప్రతిష్ఠలు సంపాదించే గుణలక్షణాల్ని - మంచిన సాధించటానికి ఎనలేని ఆశక్తి ధృడచిత్తం. అలుపెరగని ప్రయత్నం, హద్దులేని సహనం. అణిచివేయకూడదు. వారి లక్ష్యాలు స్వార్ధాసక్తులు లౌకిక ప్రయోజనాలకన్నా ఉన్నతంగా పెట్టుకోవటానికి దైవ కృప ద్వారా వారిని నడిపించాలి. ఈ జీవితంలో ప్రారంభించిన విద్య రానున్న నిత్య జీవితంలో కొనసాగుతుంది. దేవుడు చేసిన అద్భుత కార్యాలు విశ్వాన్ని సృజించి దాన్ని పోషించటంలో ఆయన వివేకానికి శక్తికి నిదర్శనాలు. రక్షణ ప్రణాళికలోని ప్రేమ వివేకాల మర్మం మనసుకు కొత్త కొత్త సొగసుల్ని అవిష్కరిస్తాయి. “దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనపడలేదు. చెవికి వినపడలేదు. మనుష్య హృదయము నకు గోచరము కాలేదు.“1 కొరింథీ 2:9 ఈ జీవితంలోనూ ఆయన దర్శనం పొంది ఆయనతో సహాసానందాన్ని పొందగలుగుతాం.దైవ స్వరూపానికి పునరుద్దరణ పొందిన మానవుడు అందుకొనే మహిమపూరితస్థితి ఎలాంటిదోదివ్య భవిష్యత్తే ఆవిష్కరిస్తుంది.PPTel 606.3