Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    44—యోర్లను నదిని దాటటం

    మరణించిన తమ నాయకుడి నిమిత్తం ఇశ్రాయేలీయులు తీవ్ర సంతాపం చెందారు. అతడి గౌరవార్థం ముప్పయి దినాలు ప్రత్యేక సభలు నిర్వహించారు. అతడి సలహాలు, పితృవాత్సల్యం, ఆచంచల విశ్వాసం విలువను తమ మధ్య ఇక అతడు లేకుండా పోయే వరకూ వారు పూర్తిగా గుర్తించలేదు. జీవించి ఉన్నప్పుడు అతడు నేర్పిన మంచి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఎంతో అభినందించారు.PPTel 478.1

    మోషే మరణించాడు కాని అతడి ప్రాబల్యం అతడితోనే సమసిపోలేదు. ప్రజల హృదయాల్లో ఉత్పత్తి చెందుతూ అది నివసించాల్సి ఉంది. పరిశుద్ధమైన స్వార్థరహితమైన ఆ జీవితాన్ని గూర్చిన జ్ఞాపకం చాలా కాలం నిలిచిపోతుంది. జీవితాన్ని తీర్చిదిద్దే శక్తిగల అతడి మాటల్ని తృణీకరించిన వారు సయితం అతణ్ని మర్చి పోరు. సూర్యుడు కొండల వెనుక ఆస్తమించిన చాలా సేపటి వరకూ పర్వతశిఖరాలు వెలుగుతో నిండేటట్లు పరిశుద్దుల మంచి పనులు వారు గతించిన ఎంతోకాలం వరకు వాటి వెలుగును ప్రపంచం మీద ప్రసరింపజేస్తాయి. వారి పనులు, వారి మాటలు, వారి ఆదర్శం నిత్యం బతికి ఉంటాయి. “నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు”. కీర్తను 112:6.PPTel 478.2

    తాము పోగొట్టుకొన్న ప్రియతమ నాయకుణ్ని గురించి ప్రజలు దు:ఖంతో నిండి ఉన్నప్పటికీ వారు దిక్కులేని ప్రజలు కారు. తన ఆజ్ఞల్ని అనుసరించి నడచుకొంటే రాత్రిపూట అగ్నిస్తంభం, పగటిపూట మేఘస్తంభం గుడారం పై నిలవటం దేవుడు తమను ఇంకా నడిపిస్తున్నాడని ఇశ్రాయేలు ప్రజలకు హామీ ఇవ్వటాన్ని సూచిస్తున్నది. ఇప్పుడు ఇశ్రాయేలీయుల నాయకుడు యెహోషువ. అతడు యుద్దశూరుడుగా పేరుపొందాడు. ఇశ్రాయేలీయుల చరిత్రలోని ఈ సమయంలో అతడి ప్రతిభ పాటవాలు గుణ లక్షణాలు ఎంతో అవసరం. ధైర్యం, పట్టుదల, సహనం, రక్షణ చర్య, నీతి నిజాయితీలు, తాను బాధ్యులైన వారి ఆలనపాలన విషయంలో స్వార్థ రహిత ఆసక్తి, అన్నిటిని మించి దేవుని పై ప్రగాఢ విశ్వాసం... ఇది వాగ్దత్త దేశంలోకి ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపించటానికి దేవుడు ఎంపిక చేసిన వ్యక్తి ప్రవర్తన. అరణ్య సంచార కాలంలో అతడు మోషేకి ప్రధాన మంత్రిగా సేవ చేశాడు. నిష్కపటమైన తన విశ్వసనీయతవల్ల, ఇతరులు ఊగిసలాడినప్పుడు తాను ధృఢంగా నిలబడటం వల్ల, అపాయకర పరిస్థితుల మధ్య సత్యానికి నిలబడటం వల్ల, దేవుడు పేరు పెట్టి పిలవక ముందే తాను మోషేకి సరైన వారసుణ్నని యెహోషువ నిరూపించుకొన్నాడు.PPTel 478.3

    తన ముందున్న కార్యాన్ని చేపట్టటం విషయంలో యెహోషువ గొప్ప ఆందోళనకు తన సొంత సామర్థ్యం పై సందేహానికి గురి అయ్యాడు. కాని దేవుని ఈ వాగ్దానంతో అతడి భయాలు తొలగిపోయాయి, “నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడైయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము గలిగి ధైర్యముగా నుండము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన యీ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు”. “నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను”. దూరాన ఉన్న ఎత్తయిన లెబానోను వరకూ, మహాసముద్ర తీరం వరకూ, తూర్పున ఉన్న యూఫ్రటీసు నదివరకూ ఉన్న భూభాగమంతా వారికి సొంతం కానున్నది. ఈ వాగ్దానానికి దేవుడు ఈ ఆదేశాన్ని జతపర్చాడు, “అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహు ధైర్యముగా నుండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర మంతటి చొప్పున చేయవలెను”. ప్రభువిచ్చిన ఆదేశం ఇది, “ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు... దివారాత్రము దాని ధ్యానిం”ప వలెను. “నీవు దాని నుండి కుడికి గాని, యెడమకు గాని తొలగకూడదు”. “దాని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్థిల్ల జేసికొని చక్కగా ప్రవర్తించెదవు”. PPTel 479.1

    ఇశ్రాయేలీయులు ఇంకా యోధానుకి తూర్పు పక్క శిబిరం వేసుకొని ఉన్నారు. కనాను స్వాధీనానికి ఇది మొట్టమొదటి ప్రతిబంధకంగా నిలిచింది. “నీవు లేచి నీవును ఈ జనులందరును ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న దేశమునకు వెళ్లుడి”. అన్నది మొట్టమొదటగా దేవుడు యెహోషువకిచ్చిన వర్తమానం. వారు ఎలా వెళ్లాలి అన్నదాన్ని గూర్చి ఎలాంటి ఉపదేశం లేదు. దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని ఆయన ప్రజల ఆచరించటానికి మార్గాన్ని తెరుస్తాడని యెహోషువకు తెలుసు. ఈ నమ్మకంతోనే వెంటనే ముందుకు సాగటానికి ఆ మహానాయకుడు తన ఏర్పాట్లు మొదలు పెట్టాడు. PPTel 479.2

    ఇశ్రాయేలీయుల శిబిరం వేసిన స్థలానికి ఎదురుగా ఉన్న యోర్దాను అద్దరికి కొన్నిమైళ్లు ఎగువలో బలమైన ప్రాకారాలు గల యెరికో పట్టణముంది. ఆ దేశంలో ఇదెంతో ముఖ్యమైన పట్టణం. ఇశ్రాయేలీయుల విజయానికి అది తీవ్ర ప్రతిబంధకం కానుంది. ఈ పట్టణంలో ప్రవేశించి దాని జనసంఖ్య గురించి, వనరుల గురిం, దాని ప్రాకారాల పటిష్ఠత గురించి తెలుసుకోటానికి యెహోషువ ఇద్దరు గూఢచారుల్ని పంపాడు. ఆ పట్టణ వాసులు భయాందోళనలు, అనుమానాలతో నిండి నిత్యం అప్రమత్తులై ఉండటంతో గూఢచారులు ప్రమాద పరిస్థితికి గురి అయ్యారు. ఎరికోలోవున్న రాహాబు అనే స్త్రీ తన ప్రాణాన్ని పణంగా పెట్టి వారిని కాపాడింది. ఆమె చూపించిన దయకు ప్రతిఫలంగా తాము ఆ పట్టణాన్ని స్వాధీన పర్చుకొన్నప్పుడు తన ప్రాణాలు కాపాడ్తామని వారు ఆమెతో ప్రయాణం చేశారు.PPTel 479.3

    గూఢచారులు క్షేమంగా తిరిగివచ్చి ఈ వార్త అందించారు, “ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశ నివాసులందరికి ధైర్యము చెడియున్నది” ఎరికో ప్రజలు ఇలా అనుకొంటున్నట్లు గూఢచారులికి రాహాబు చెప్పింది, “మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడుPPTel 480.1

    మీ యెదుట యెహోవా ఎఱ్ఱ సముద్రపు నీరును ఏలాగు ఆరిపోజేసెనో, యోర్దాను తీరముననున్న అమోరీయుల యిద్దరు రాజులైన సీహోనుకును, ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును, క్రింద భూమియందును దేవుడే”.PPTel 480.2

    పురోగమనానికి ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజలు మూడు రోజులకు సరిపడే ఆహారాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉన్నారు. సైన్యం యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉండా ల్సిందిగా ఆదేశం. నాయకుడి ప్రణాళికకు అందరూ ఆమోదం తెలిపారు. అతడిపై విశ్వాసాన్ని ప్రకటించారు. అతడికి మద్దతు పలికారు, “నీవు మాకాజ్ఞాపించిన దంతయు మేము చేసెదము, నీవు మమ్ము నెక్కడికి పంపుదువో అక్కడికి పోదుము: మోషే చెప్పిన ప్రతి మాట మేము విన్నట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మో షేకు తోడై యుండినట్లు నీకును తోడై యుండును గాక”. తాము శిబిరం వేసిన షిత్తీము తుమ్మలవనం విడిచి పెట్టి ఇశ్రాయేలీయులు యోర్దాను తీరానికి వచ్చారు. దేవుని సహాయంతో తప్ప తాము ఆ నదిని దాటి వెళ్లలేమని అందరూ గుర్తించారు. అది ఎండాకాలం. ఆ సమయంలో మంచు కరగటం వల్ల యోర్దానునది పొంగి పారుతుంది. అందుచేత రేవుల్లో నుంచి నదిని దాటడం అసాధ్యం. ఇశ్రాయేలీయులు యోర్డానును దాటటం ఒక అద్భుత కార్యం కావాలని దేవుడు సంకల్పించాడు. దేవుని ఆదేశం మేరకు ప్రజలు తమ్మును తాము పరిశుద్ధ పర్చుకోవాలసిందిగా యెహోషువ ఆజ్ఞాపించాడు. వారు తమ పాపాల్ని విడిచి పెట్టి బాహ్యమైన సమస్త అవిత్రత నుంచి విముక్తి పొందాల్సి ఉన్నారు “రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును” అన్నాడు యెహోషువ.“నిబంధన మందసము” వారిని నడిపించాల్సి ఉన్నది. దైవ సముఖానికి సంకేతమైన మందసాన్ని శిబిరం మధ్య నుంచి యాజకులు మోసుకు వెళ్లటం చూసినప్పుడు ప్రజలు తామున్న చోట నుంచి బయలుదేరి “దాని వెనుక వెళ్లాల్సి ఉన్నారు”. అలా దాటటానికి సంబంధించిన పరిస్థితుల వివరాలు ముందే ప్రవచితమయ్యా యి. యెహోషువ ఇలా అన్నాడు. “సర్వలోక నాధుని నిబందన మందసము మీకు ముందుగా యోర్దాను దాటబోవుచున్నది. గనుక జీవము గల దేవుడు మీ మధ్య నున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ యెదట నుండి కనానీయులను... వెళ్లగొట్టుననియు దీని వలన మీరు తెలిసికొందురు”.PPTel 480.3

    నిర్దిష్ట సమయానికి మందసాన్ని భుజాలపై మోస్తూ యాజకులు ముందు నడుస్తుండగా వారి వెనుక ఇశ్రాయేలీయుల ప్రస్థానం ప్రారంభమయ్యింది. మందసానికీ తమకూ మధ్య అరమైలు ఎడముంచి నడవలసిందిగా ప్రజలకు ఆదేశం జారీ అయ్యింది. యాజకులు యోర్దాను నది గట్టుపై నుంచి కిందకు దిగుతుండగా అదే అందరూ ఆసక్తితో చూస్తున్నారు. ఉరవళ్లు, పరవళ్లు తొక్కుతూ వడిగా ప్రవహిస్తున్న యోధాను కేసి పరిశుద్ధ మందసంతో వారు నెమ్మదిగా కదలటం వారి పాదాలు నీటిలో మునగటం చూశారు. అంతట పై నుంచి వస్తున్న వరద హఠాత్తుగా నిల్చిపోయింది. కిందవున్న ప్రవాహం కొనసాగింది. నది గర్భం స్పష్టంగా కనిపించింది.PPTel 481.1

    దేవుని ఆజ్ఞ ప్రకారం యాజకులు ప్రవాహం మధ్యకు వెళ్లి నిలబడ్డారు. ఇశ్రాయేలీయులందరూ గట్టు దిగివచ్చి నది అవతల పక్కకు దాటి వెళ్లిపోయారు. నలభై సంవత్సరాల క్రితం తమ పితరులకు ఎర్ర సముద్రం గుండా మార్గం తెరచిన ఆ మహాశక్తే ఇప్పుడు యోర్దాను నదీ ప్రవాహన్ని ఆపి తమకు మార్గం తెరిచిందని ఇశ్రాయేలీయులకి స్పష్టమయ్యింది. ప్రజలందరూ నదిని దాటిన తర్వాత యాజకులు మందసాన్ని పశ్చిమ తీరానికి మోసుకు వెళ్లారు. మందసం సురక్షిత స్థానం చేరిన వెంటనే “ఆ యాజకుల అరికాళ్లు పొడినేలను నిలువగా” నిలిచి పోయిన నీరు విడుదల అయ్యింది. నదీ ప్రవాహం మళ్లీ పరవళ్లు తొక్కుకుంటూ సాగింది.PPTel 481.2

    ఈ అద్భుత కార్యాన్ని గూర్చి భావి తరాల వారికి నిదర్శనం లేకుండా పోకూడదు. మందసాన్ని మోస్తున్న యాజకులు ఇంకా యోర్దాను నది మధ్యలో నిలిచి ఉంటుండగా ఒకొక్క గోత్రం నుంచి ఒకరు చొప్పున ఎంపికైన పన్నెండు మంది మనుషులు, యాజకులు నదిలో నిలిచి ఉన్న స్థలం నుంచి తలోరాయి తీసి వాటిని పడమటి పక్కకు మోసుకువెళ్లారు. నది అవతల వారు వేసే మొదటి శిబిరం వద్దల ఒక స్మారక చిహ్న నిర్మాణానికి ఈ రాళ్లు ఉపయుక్తం కానన్నవి. యెహోషువ చెప్పినట్లు “యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరు తెలిసికొనుటకును, మీరు ఎల్లప్పుడును మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును” దేవుడు తమకు కలిగించిన విడుదల ఉదంతాన్ని ఇశ్రాయేలీయుల తమ పిల్లకు, పిల్లల పిల్లలకు పదేపదే చెప్పాల్సిందిగా ఆదేశం పొందారు. ఇశ్రాయేలీ యుల మీద వారి శుత్రుల మీద ఈ అధ్భుత కార్య ప్రభావం చాలా ప్రాముఖ్యమైనది. తమతో సర్వదా ఉంటానని తమను కాపాడ్డానని ఇశ్రాయేలీ యులకి దేవుడిచ్చిన హామీ ఇది. మోషేద్వారా పనిచేసిన రీతిగా యెహోషువ ద్వారా పనిచేస్తాననటానికి నిదర్శనం. ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోటంలో నిమగ్నులైన సమయంలో నలభై ఏళ్ల క్రితం తమ తండ్రుల విశ్వాసాన్ని కదిలించి ఆ బృహత్కార్య సాధనలో వారి హృదయాల్ని పటిష్ఠ పరచటానికి అలాంటి హామీ అవసరమయ్యింది. నదిని దాటక ముందు ప్రభువు యెహోషువతో ఇలా అన్నాడు, “నేను మోషేకు తోడై యుండినట్లు నీకు తోడై యుందునని ఇశ్రాయేలీయులందరు ఎరుగునట్లు నేడు వారి కన్నుల యెదుట నిన్ను గొప్ప చేయుమొదలు పెట్టెదను”.ఈ వాగ్దానం నెరవేరింది. ‘ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి యెదుట యెహోషువను గొప్ప చేసేను గనుక వారు మోషేను గౌరవించినట్లు అతను బ్రదుకు దినములన్నిట అతని గౌరవించిరి”.PPTel 481.3

    చుట్టుపట్ల ఉన్న జాతులకు ఇశ్రాయేలీయుల పట్ల గల భయాన్ని అధికం చేసి తద్వారా వారి విజయానికి మార్గం సుగమం చేయటానికి వారి పక్షంగా ఈ దైవ శక్తి ప్రదర్శన జరిగింది. ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం దేవుడు యోధాను నదీ ప్రవాహాన్ని నిలిపివేశాడన్న వార్త విన్న అమోనీయులు, కనానీయులు రాజులు భయ కంపితులయ్యారు హెబ్రీయులు మిద్యాను అయిదుగురు రాజుల్నీ, అమోరీయుల రాజైన సీహోనును, బాషాను రాజైన ఓగును అప్పటికే హతమార్చారు. ఇప్పుడు వారు ఉరవళ్లు తొక్కుతూ, పొంగుతూ ప్రవహించే యోర్దాను దాటటం చుట్టుపట్ల వున్న జాతుల ప్రజల్ని భయాందోళనలకు లోను చేసింది. భూమ్యాకాశాలకు రాజైన జీవంగల దేవుడు తన ప్రజల మధ్య ఉన్నాడని ఆయన వారిని విడవటం గాని ఆశాభంగ పర్చటం గాని చేయడని కనానీయులకి, ఇశ్రాయేలీయులికి యెహోషువకి కాదనలేని నిదర్శన ఇచ్చాడు.PPTel 482.1

    యోర్దానుకు కొంచెం దూరంలో ఇశ్రాయేలీయులు కనానులో తమ మొట్టమొదటి శిబిరాన్ని వేశారు. ఇక్కడ యెహోషువ “ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించెను”. ఇశ్రాయేలీయులు గిల్లాలులో దిగి... పస్కా పండుగ ఆచరించిరి”. కాదేషులో జరిగిన తిరుగుబాటు నాటి నుంచి సున్నతి సంస్కారం అమలు కాకుండా నిలిచిపోయింది. దాని నిలిపివేత దేనికి చిహ్నంగా ఉన్నదో ఇశ్రాయేలుతో దేవుడు చేసి ఆ నిబంధనను తాము అతిక్రమించామన్నదానికి సాక్ష్యంగా మిగిలింది. ఐగుప్తు దాస్యం నుంచి తమ విముక్తికి చిహ్నమైన పస్కా ఆచరణ నిలిపివేత తాము బానిసలుగా ఉన్న ఐగుప్తుకి తిరిగి వెళ్లిపోవాలన్న వారి కోరికపట్ల దేవుని ఆగ్రహానికి నిదర్శనం. దేవుడు వారిని నిరాకరించిన ఆ సంవత్సరాలు ఇప్పుడు అంతమ య్యాయి. ఇశ్రాయేలీయుల్ని తన ప్రజలుగా దేవుడు మళ్లీ గుర్తించాడు. నిబంధన గుర్తు మళ్లీ గుర్తింపు పొందింది. అరణ్యంలో జన్మించిన వారందరికి సున్నతి సంస్కారం జరిగింది. ప్రభువు యెహోషువతో ఇలా అన్నాడు. “నేడు నేను ఐగుప్తు అవమానము మీమీద నుండకుండ దొరలించి వేసియున్నాను”. వారు శిబిరం వేసిన చోటికి గిల్గాలు అన్న పేరు కలిగింది. “దొరలినది”. అని దీని అర్థం.PPTel 483.1

    ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి పెట్టిన స్వల్పకాలంలోనే కనానును స్వతంత్రించుకోలేనందుకు అందరి మాదిరిగానే జనులు దేవుణ్ని, దేవుని ప్రజలను నిందించారు. ఇశ్రాయేలీయులు చాలాకాలం అరణ్యంలో సంచరించటం వారి శత్రువులకు విజయం. హెబ్రీయుల దేవుడు వారిని వాగ్దత్త దేశంలోకి తేవటంలో విఫలుడయ్యాడంటూ వారు ఎగతాళి చేశారు. ఇప్పుడు ఆయన తన ప్రజలకు యోర్దాను గుండా మార్గం తెరచి వారి పక్షంగా తన శక్తిని ప్రదర్శించాడు. ఇక వారి శత్రువులు ఎవరిని నిందించలేరు.PPTel 483.2

    “ఆ నెల పదునాలుగవ తేదీని సాయంకాలమున” ఎరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించారు. “పస్కాపోయిన మరునాడు వారు ఈ దేశము పంటను తినాలి. ఆ దినమందే వారు పొంగకయు, వేచబడియున్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను, అటు తరువాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి”. వారి దీర్ఘ అరణ్య సంచారానికి తెర దిగింది. చివరికి ఇశ్రాయేలీయులు వాగ్దత్త దేశంలో ఆనందంగా నివసించటం మొదలు పెట్టారు .PPTel 483.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents