Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    60—సౌలు దురభిమానం

    గిల్గాలు సమావేశం అనంతరం సౌలు తాను ఆమ్మోనీయుల్ని నాశనం చేసేందుకు సమకూర్చిన సైన్యాన్ని ఇంటికి పంపివేసి మిక్మషులో తన వద్ద రెండు వేలు మంది సైనికుల్ని గిబియాలో యోనాతానుతో ఉన్న వెయ్యిమంది సైనికుల్ని మాత్రమే ఉంచాడు. ఇది పెద్ద పొరపాటు. లోగడ తమకు కలిగిన విజయంతో సైనికుల్లో ఉత్సాహం ఉద్రేకం ఉరకలు వేసాయి. సౌలు వెంటనే ఇతర శత్రువుల మీద దాడి చేసి ఉంటే ఇశ్రాయేలీయుల స్వాతంత్ర్యానికి ధోకా ఉండేది కాదు.PPTel 622.1

    అంతలో వారి పక్కనే ఉన్న ఫిలీప్తీయులు అప్రమత్తులయ్యారు. ఎబినెజరు వద్ద తమ ఓటమి అనంతరము వారికి ఇశ్రాయేలీయుల దేశంలో కొండల్లో కొన్ని దుర్గాలు మాత్రమే మిగిలిపోయాయి. సదుపాయాలు, ఆయుధాలు పరికరాల పరంగా ఇశ్రాయేలీయులకన్నా ఫిలప్రియులే మిన్న .తమ దీదీ నిరంకుశ పరిపాలన కాలంలో ఇశ్రాయేలీయులు యుద్ధాయుధాలు తయారు చేసుకుంటారేమో మోనన్నభయంతో వారు కమ్మరంతో ఆయుధాలు చేయటాన్ని నిషేధించి తమ పట్టును పటిష్టపర్చుకోవ టానికి ఫిలప్రియులు ప్రయత్నించారు. సంధి జరిగి శాంతి నెలకొన్న తరువాత కూడా తమకు అవసరమైన పనులు చేయించుకోవటానికి హెబ్రీయులు ఫిలీప్తీయుల సైనిక కర్మాగారాలకు వెళ్ళే వారు. ఉన్నత జీవనానికి అలవాటుపడి, దీర్ఘకాలి హింసకు గురి అవటం వల్ల లొంగుబాటుతత్వాన్ని అలవర్చుకొని ఇశ్రాయేలీయులు యుద్దా యుధాల తయారీని నిర్లక్ష్యం చేసారు. విల్లు వడిసెల యుద్ధాయుదాలు ఇశ్రాయేలీయులికి ఇవే లభించేవి. కాగా సౌలుకు అతడి కుమారుడు యోనాతానుకు తప్ప ఇశ్రాయేలీయుల్లో మరెవ్వరికి ఈటెగాని ఖడ్గం గాని లేదు.PPTel 622.2

    సౌలు పరిపాలన రెండోపడిలో పడేంతవరకు ఫిలీప్తీయుల్ని జయించటానికి ప్రయత్నం జరగలేదు. రాజు కొడుకు యోనాతాను వారి మొదటి వేటు వేసాడు. గెబలో ఉన్న ఫిలిప్తీయ సేనపై యోనాతాను ఆడిచేసి దాన్ని జయించాడు. ఈ ఓటమితో కోపాద్రిక్తులైన ఫిలిప్తీయులు ఇశ్రాయేలీయులపై మెరుపుదాడికి సిద్ధపడ్డారు. యోర్దాను అవతల పక్క ఉన్న గోత్రాల్లోని వారితో సహా ఇశ్రాయేలు దేశమంతటా ఉన్న సైనికులకి బూరద్వారా యుద్ధ ప్రకటన చేసి గిల్లాలులో సమావేశం కావలసిందిగా వారికి సౌలు పిలుపునిచ్చాడు. ఆ ఆదేశాన్ని అందరూ శిరసా వహించారు.PPTel 622.3

    ఫిలిప్తీయులు విస్తారమైన సైన్యంతో మిక్మషులో సమావేశమయ్యారు. “ముప్పది వేల రథములను ఆరువేల గుఱ్ఱపు రౌతులను సముద్రపు దరి నుండు ఇసుక రేణువలంతు విస్తారమైన సమూహమును సమకూర్చుకొని వచ్చిరి”. గిల్గాలులో వున్న సౌలుకు అతడి సైనికులకు ఈ వార్త వినబడగానే యుద్ధంలో తాము ఎదుర్కొనున్న ఆ సైన్యం గురించి భయకంపితులయ్యారు. శత్రువుని ఎదుర్కొటానికి వారు సిద్ధంగా లేరు. అనేకులు భయపడి బైటికి రాలేదు. కొందరు యోర్దాను దాటి పారిపోగా ఇతరులు బండల సందుల్లోను కొండగుహల్లోను దాక్కున్నారు. యుద్ధానికి సమయం అసమన్నమయినప్పుడే పారిపోయేవారి సంఖ్య అధికమయ్యింది. మిగిలి ఉన్నవారు భయంతో వణుకుతున్నారు.PPTel 623.1

    సౌలు ఇశ్రాయేలీయుల రాజుగా అభి షేకం పొందిన తరుణంలో ఈ సమయంలో ఏమి చెయ్యాలి అన్న విషయమై సమూయేలు స్పష్టమైన ఉపదేశం సౌలుకిచ్చాడు. “నాకంటే ముందు నీవు గిలునుకు వెళ్ళగా దహనబలులును బలులను సమాధాన బలులును అర్పించుటకై నేను నీ యొద్దకు దిగివత్తును; నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయు వరకు ఏడు దినములపాటు నీవు అచ్చట నిలువవలెను” అన్నాడు ప్రవక్త 1 సమూయేలు 10:8PPTel 623.2

    రోజుకు రోజు సౌలు కనిపెడున్నాడే గాని ప్రజల్ని ఉత్సాహపర్చటం గాని దేవుని పై వారి విశ్వాసాన్ని పటిష్టపర్చటం గాని చేయలేదు. జరుగుతున్న జాప్యం గురించి ప్రవక్త నిర్దేశించిన కాలవ్యవధి పూర్తిగా ముగియకముందే సహనం కోల్పోయి చుట్టూ చోటు చేసుకొంటున్న పరిస్థితుల వల్ల నిరాశ చెందాడు. ఏ పరిశుద్ద కార్యనిర్వహణ నిమిత్తం సమూయేలు వస్తున్నాడో దానికి ప్రజల్ని సంసిద్ధం చేసే బదులు సౌలు అవిశ్వాసానికి భయాలకు లోనై నిష్క్రియపరుడయ్యాడు. బలి అపర్పణల ద్వారా దేవుని అన్వేషించటం అతి గంభీరమైన, ప్రాముఖ్యమైన కార్యం. దాన్ని ప్రభువంగీకరించే రీతిలో అర్పించేందుకు శత్రువుల్ని జయించటానికి తాము చేసే ప్రయాత్నాలపై దేవుని దీవెనలుండేందుకు ప్రజలు తమ హృదయాల్ని పరిశోధించుకొని తమ పాపాల నిమిత్తం పశ్చాత్తాపం పొందాలని దేవుడు కోరుతున్నాడు. అయతే సౌలు హృదయం ఆందోళనతో నిండి ఉంది. సహాయం కోసం ప్రజలు దేవుని మీద ఆధారపడే బదులు తాము ఎంపిక చేసుకున్న రాజు మీద ఆధారపడ్డారు. అయినా ప్రభువు వారిని కాపాడూనే ఉన్నాడు. మానవ సహాయం మీదే అనుకొని ఉంటే వారికి సంభవించే విపత్తులకు బలి కావటానికి వారిని విడిచి పెట్టలేదు. మానవుణ్ణి నమ్ముకోవటం బుద్దిహీనమని గుర్తించి తమకు ఆసరా ఆయనే అని తెలుసుకొని ఆయన తట్టు తిరిగేందుకు ప్రభువు వారిని క్లిష్ట పరిస్తితుల్లోకి నడిపించాడు. సౌలుకు పరీక్షా సమయం వచ్చింది దేవుని పై ఆధారపడి ఆయన అదేశానుసారం ఓర్పుతో వేచి ఉండటం ద్వారా తన ప్రజల పరిపాలకుడుగా క్లిష్ట పరిస్తితుల్లో దేవుడు నమ్మదిగిన వ్యక్తిగా నిరూపించుకొంటాడో లేదా ఊగిసలాడూ నిలిచిపోవంటం ద్వారా తన పై ఉన్న పవిత్ర బాధ్యతకు ఆయోగ్యుడని నిరూపించుకొంటాడో ఇప్పుడతడు తేల్చాల్సి ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఎన్నుకున్న రాజు రారాజు మాట వినటానికి నిశ్చయించుకొంటాడా? ఎవరికి ఆనంత శక్తి ఉ న్నదో ఎవరు విమోచించగలరో ఆ ప్రభువుకి నమ్మకంగా నిలిచిన తన సైనికుల గమనాన్ని ఇప్పుతాడా?PPTel 623.3

    కట్టలు తెంచుకొంటున్న అసహనంతో సౌలు సమూయేలు రాకకై ఎదురు చూస్తున్నాడు. తన సైన్యంలో చోటు చేసుకొన్న గందరగోళానికి నిరుత్సాహానికి, సైనికులు పారిపోవటానికి కారణం సమూయేలు చేస్తున్న జాప్యమేనని విమర్శిం చాడు. నిర్దిష్ట సమయం వచ్చింది కాని ప్రవక్త సమూయేలు వెంటనే ప్రత్యక్షమవ్వలేదు. ప్రవక్త రాకలో జాప్యం దైవ సంకల్పితమే. ఉద్రేకం ఉద్వేగం కలబోసుకొన్న సౌలు మనసు ఇక ఆగటం లేదు. ప్రజల భయాన్ని సద్దమణచటానికి వెంటనే ఏదో చెయ్యాలని భావించి దైవారాధనకు ప్రజల్ని సమావేశపర్చి బలి అర్పించటం ద్వారా దేవుని సహయం అర్ధించాలని నిశ్చయించుకొన్నాడు. పరిశుద్ద సేవకు ప్రతిష్టితమైన వారే తన ముందు బలులు అర్పించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. కాగా “దహన బలులును... తీసుకొని రమ్ము” అని యద్దకవచం యుద్దాయుదాలు ధరించిన సౌలు బలిపీఠం వద్దకు వెళ్లి దేవుని ముందు బలి అర్పించాడు.PPTel 624.1

    “అతడు దహనబలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలిసికొని అతనికి వందనము చేయుటకై” వెళ్ళాడు. తనకిచ్చిన ఆదేశాల్ని సౌలు అతిక్రమించాడని సమూయేలు వెంటనే గ్రహించాడు. యద్దాన్ని ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట సమయంలో తాము ఏమి చెయ్యాలో ఈ సమయంలో తెలుపుతానని ప్రవక్త ద్వారా ప్రభువు ఇశ్రాయేలీయులతో చెప్పాడు. తన సహాయాన్ని ఏ షరుతల పై దేవుడు వాగ్దానం చేసాడో వాటిని సౌలు నెరవేర్చి ఉంటే రాజుకి నమ్మకంగా నిలిచిన కొద్దిమంది సైనికులతోనే ప్రభువు ఇశ్రాయేలీయులికి ఆశ్చర్యకరంగా విడుదల కలిగించేవాడు. తాను చేసిన కార్యంతో సౌలు తృప్తి చెందిన ఆ మంచి పనికి తాను అభినందనీయుణ్ణి అభివందనీయుణ్ణి అనుకొంటూ ప్రవక్తను కలవటానికి ఎదురెళ్ళాడు.PPTel 624.2

    సమూయేలు ముఖం ఆందోళన ఆవేదనల్ని ప్రతిబింబిస్తున్నది. “నీవు చేసిన పని ఏమి”? అన్న అతడి ప్రశ్నకు జవాబు సౌలు తన దురభిమాన చర్యకు సాకులు చెప్పాడు. అతడిలా అన్నాడు “జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు, నిర్ణయకాలముకు నీవు రాకపోవుటయు, ఫిలిపీయులు మిక్మషులో కూడి యుండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచకమును పే ఫిలిపీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహిసించి దహనబలి అర్పించితిని.PPTel 625.1

    “అందుకు సమూయేలు ఇట్టనెను - నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదా కాలము స్థిరపడుటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొని యున్నాడు... యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీనీయుల గిబియాకు వచ్చెను”.PPTel 625.2

    ఇశ్రాయేలీయులు దైవ ప్రజలుగా గుర్తింపునైనా వదులుకోవాలి లేదా ఏ నియమం ప్రకారం రాచరికం ఏర్పాటయ్యిందో దాన్ననుసరించి దైవాధికారం కింద దేశ పరిపాలనైనా సాగాలి. ఇశ్రాయేలీయులు సంపూర్ణతగా మారిన దైవ ప్రజలై ఉంటే లోక సంబంధమైన మానవ చిత్తం దైవ చిత్రానికి లొంగి వ్యవహరించి ఉంటే ప్రభువే ఇశ్రాయేలీయుల పరిపాలకుడుగా కొనసాగేవాడు. రాజూ ప్రజలు దేవునికి విధేయులై ఎంతకాలము నడుచుకొంటారో అంతకాలం ఆయన వారిని సంరక్షిస్తాడు. కాగా ఇశ్రాయేలు దేశంలోని ఏ రాచరికం అన్ని విషయాల్లోను దేవుని సర్వాధికారాన్ని గుర్తించి వ్యవహరించలేదో అది వర్ధిల్లలేకపోయింది.PPTel 625.3

    ఈ పరీక్షా కాలంలో సౌలు దేవుని ధర్మ విధుల పట్ల గౌరవం ప్రదర్శించి ఉంటే దేవుడు తన చిత్రాన్ని అతడి ద్వారా నెరవేర్చేవాడు. దైవ ప్రజల మధ్య తాను దైవ ప్రతినిధిగా ఉండలేడన్న విషయం అతడి వైఫల్యం రుజువు చేసింది. ఇశ్రాయేలీయుల్ని తప్పుదారి పట్టిస్తాడని తేలింది. అతణ్ణి అదుపు చేసేది తన సొంత చిత్తమే గాని దేవుని చిత్తం కాదు. సౌలు దేవునికి నమ్మకంగా నిలిచి ఉంటే ఆ రాజ్యం తనకే స్థిరమై ఉండేది. అతడు విఫలుడయ్యాడు. గనుక ఆ దైవ కార్యాన్ని మరో వ్యక్తి నిర్వహించాల్సి ఉంది. దేవుని చిత్తాన్ననురించి ప్రజల్ని పరిపాలించే వ్యక్తికే ఇశ్రాయేలు ప్రభుత్వ బాధ్యతను అప్పగించాల్సి ఉంది.PPTel 625.4

    ఏ గొప్ప ఆసకులికి విఘాతం కలుగకుండా చూడటానికి పరిశోధన జరుగుతుందో మనకు తెలియదు. దేవుని వాక్యాన్ని విశ్వసించి ఆచరించటంలోనే క్షేమముంది. విశ్వసించి ఆచరించమన్న షరతు మీదనే దేవుడు తన వాగ్దానాలు చేస్తాడు. ఆయన ఆజ్ఞ పాలనలో వైఫల్యం వల్లనే లేఖనాల నెరవేర్పును మనం పొందలేకపోతున్నాం. మనం భావోద్వేగాన్ని అనుసరించకూడదు. ఇతరుల వివేకాన్ని నమ్ముకూడదు. దేవుని ప్రకటిత చిత్తమేంటో తెలుసుకొని చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాంటివైనప్పటికి ఆయన నిర్దిష్ట ఆజ్ఞల ప్రకారం నడవాలి. ఫలితాల విషయం దేవుడే చూసుకొంటాడు. దేవుని వాక్యాన్ననుసరించి నివసించటం ద్వారా మనుషుల మందు పరిశుద్ధ దూతల మందు కఠినమైన స్థలాల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చేందుకు ఆయన నామాన్ని ఘనపర్చేందుకు ఆయన ప్రజలకు మేలు చేసేందుకు ఆయన మనల్ని విశ్వసించగలడని నిరూపించుకొంటాం.PPTel 626.1

    సౌలు దేవుని అగ్రహానికి గురి అయ్యాడు. అయినా వినయ మనసుతో పశ్చాత్పా పడటానికి సముఖంగాలేడు. తనలో కొరవడ్డ భక్తిని మతాచారాల పట్ల ఉద్రేకం కనపర్చటం ద్వారా కప్పి పుచ్చుకోవాలని చూశాడు. హోస్నీ ఫీనెహాసులు మందసాన్ని ఇశ్రాయేలీయుల శిబిరంలోకి తెచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల ఓటమి సంగతి సౌలుకు తెలియంది కాదు. ఇదంతా తెలిసి కూడా పరిశుద్ద మందసాన్ని దానితో ఉండే యాజకుణ్ణి రప్పించాలని తీర్మానించుకొన్నాడు. ఈ కార్యం ద్వారా ప్రజల్లో నమ్మకం పుట్టించి చెదిరిపోయిన సైనికుల్ని మళ్ళీ సమకూర్చి ఫిలిప్తీయులతో యుద్ధం చెయ్యాలనుకొన్నాడు. ఇప్పుడు సమూయేలు సన్నిధి గాని మద్దుతుగాని అతడికి అవసరం లేదు. అప్పుడు ప్రవక్త విమర్శలు మందలింపులు ఉండవు.PPTel 626.2

    సౌలు అవగాహనను ఉత్తేజపర్చి అతడి హృదయాన్ని సానుకూలంగా మలుచుకోవటానికి అతడికి పరిశుద్దాత్మ నిచ్చాడు దేవుడు. దేవుని ప్రవక్త అతడికి ఉపేదశాన్ని మందలింపును అందించాడు. అయినా అతడి భ్రష్టత ఎంతో ఘోరంగా ఉంది! చిన్నతనంలో ఏర్పడ్డ చెడ్డ అలవాట్లు ఎలా విపరణమిస్తాయో ఇశ్రాయేలీయుల మొట్టమొదటి రాజు చరిత్ర చెబుతుంది. తన చిన్నతనంలో సౌలు దేవుడంటే భయభక్తులు లేకుండా పెరిగాడు. లేత వయసులోనే అదుపు చేయని అతని దుందుడుకు స్వభావం దైవాధికారం పై తిరుగుబాటుకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉండేది. ఎవరు తన బాల్యంలో దేవుని చిత్తాన్ని భక్తిపూర్వకంగా గౌరవించి తమ విధుల్ని నమ్మకంగా నిర్వహిస్తారో వారిని దేవుడు పరలోకంలో ఉన్నత సేవలకు సిద్ధం చేస్తాడు. అయితే దేవుడిచ్చిన శక్తుల్ని దగ్ధకాలం దుర్వినియోగం చేసి ఆ తరువాత మరాలనుకొన్నప్పుడు అవే శక్తుల్ని పూర్తిగా విభిన్నమైన పనికి ఉపయో గించటం మనుషులికి సాధ్యం కాదు.PPTel 626.3

    ప్రజల్ని చైతన్యపర్చేందుకు సౌలు చేసిన ప్రయాత్నాలు వ్యర్థ మయ్యాయి. తన సైనికుల సంఖ్య అరువందల మందికి పడిపోవటంతో గిల్గాలు విడిచి పెట్టి తాను కొద్దికాలం కిందటే ఫిలిప్తీయుల చేతుల్లో నుంచి స్వాధీనం చేసుకొన్న గెబ కోటకు వెళ్ళాడు. ఈ కోట లోతైన రాళ్ళమయమైన లోయకు దక్షిణ పక్క ఉంది. ఇది యెరూషలేముకు ఉత్తరాన కొన్ని మైళ్ళ దూరంలో ఉంది. అదే లోయకు ఉత్త రాన మిక్మషులో ఫిలిప్తీయుల సైన్యం శిబిరం వేసి ఉంది. ఇక్కడ నుండి సైనిక బృందాలు దేశం వివిధ ప్రాంతాలకు వెళ్ళి విధ్వంసం సృష్టించాయి,PPTel 627.1

    సౌలు అనుసరిస్తున్న తప్పుడు మార్గాన్ని సరిచేయటానికి తన ప్రజలకు అణకువ విశ్వాసం నేర్పించటానికి పరిస్థితులు అలా క్లిష్టమవ్వటానికి దేవుడే అనుమతించాడు. సౌలు దురాభిమానంతో బలి అర్పించి పాపం చేసినందు వల్ల ఫిలిప్తీయుల్ని జయించటమన్న గౌరవాన్ని ప్రభువు అతడకివ్వదలంచలేదు. కాగా రాకుమారుడు యోనాతాను దైవ భక్తుడు. ఇశ్రాయేలీయుల్ని రక్షించటానికి అతడు ఎంపికయ్యాడు. శత్రు శిబిరం పై రహస్యంగా దాడి చేయాలని ఆత్మ ప్రేరణవల్ల యోనాతను తన ఆయుధాలు మోసేవాడితో ” యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా”? అని ఉద్రేకపర్చాడు. PPTel 627.2

    ఆయుధవాహకుడు కూడా దైవభక్తి గలవాడు., ప్రార్ధన పై నమ్మకం ఉన్నవాడు అతడు యోనాతాన్ని ఉద్రేకవపర్చాడు. తమ ఉద్దేశాన్ని ఎవరూ వ్యతిరేకించ కుండేందుకు వారిద్దరు శిబిరంలో నుంచి సంచప్పుడు లేకుండా బైటికి వెళ్ళారు. తమ పితురుల్ని నడిపించిన దేవునికి చిత్తశుద్ధితో ప్రార్ధించి తాము ఎలా ముందుకు వెళ్ళాలన్న విషయమై ఒక గుర్తుపై ఇద్దరూ అంగీకరానికి వచ్చారు. రెండు సైన్యాలకీ మధ్య ఉన్న ఇరుకు మార్గంలోకి జారుకొంటూ దిగి వారు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ కొండనీడలో లోయలోని గుట్టలు మెట్టల మాటున నడిచి వెళ్ళారు. వారు ఫిలిప్తీయుల దుర్గాన్ని సమీపిస్తుండగా శత్రువుల కంటపడ్డారు. ఎగతాళి చేస్తూ ఫిలిప్తీయులిలా అన్నారు. “చూడుడి, తాము దాగియుండిన గుహలలోనుండి హెబ్రీయులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు” మేము మీకు ఒకటి చూపింతము రండి” అంటూ సవాలు చేసారు. వారి ఉద్దేశం ఏంటంటే సాహసం ప్రదర్శిస్తున్న ఆ ఇద్దరు హెబ్రీయులకి తగని శాస్తి చేస్తామని తాము చేపట్టిన కార్యంలో ప్రభువు తమను విజేతలు చేస్తాడనటానికి వారిరువురు ఎంచుకొన్న సంకేతం అదే. ఒక ఫిలిప్తీయుల దృష్టినుంచి తప్పుకొని ఒక రహస్యమైన కష్టభరితమైన మార్గాన్ని ఎంపిక చేసుకొని భద్రతా ఏర్పాట్లు సరిగాలేని ఒక శిఖరానికి ఆ శూరులిద్దరూ ఎగబాకారు. వారిరివురు శత్రు శిబిరంలో ప్రవేశించి కావలివాండ్రను సంహరించారు. ఆశ్చర్యంతోను భయంతోను నిండిన వారినుంచి ఎలాంటి ప్రతిఘటనా రాలేదు.PPTel 627.3

    యోనాతాన్ని అతడి ఆయుధ వాహకుణ్ణి పరలోక దూతలు కాపాడారు. దేవదూతలు వారి పక్కనిల్చి పోరాడారు. వారి ముందు ఫిలిప్తీయులు నిలువలేక నేలకూలారు. ఆశ్వధలాలు రధాలతో గొప్ప సైన్యం వస్తున్నట్లు భూమి దద్దరిల్లింది. దేవుడు అందించిన సహాయ చిహ్నాల్ని యోనాతాను గుర్తించాడు. ఇశ్రాయేలీయుల విమోచనకు దేవుడు కృషి చేస్తున్నాడని ఫిలిప్తీయులు సయితం గుర్తించారు. యుద్ధ స్థలంలోను స్కంధావారంలోను భయాందోళనలు వెల్లువెత్తాయి. ఆ గందర గోళంలో తమ సైనికుల్ని శత్రు సైనికులుగా భావించి ఫిలిప్తీయులు ఒకర్నొకరు చంపుకున్నారు.PPTel 628.1

    ఇశ్రాయేలీయుల స్కంధావరంలో యుద్ధ ఘోష వినిపించింది. ఫిలిప్తీయుల నడుమ ఆస్తవ్యస్త పరిస్థితులు చోటు చేసుకొన్నాయని వారి సంఖ్య తగ్గిపోతుందని కావలి వాళ్ళు రాజుకు తెలిపారు. దర్యాప్తు ప్రకారం యోనాతను అతడి ఆయుధ వాహకుడు తప్ప తక్కిన వారంతా శిబిరంలోనే ఉన్నట్లు తేలింది. కాగా ఫిలిప్తీయుల నుంచి ప్రతిఘటన ఎదురవ్వటం చూసి సౌలు తన సైన్యంతో వారి మీదికి వెళ్ళాడు. శత్రు సైన్యంలోకి వెళ్ళిన హెబ్రీ ఫిరాయింపుదారులు ఫిలిప్తీయులకి ఎదురు తిరిగారు. దాగొన్నవారిలో అధిక సంఖ్యాకులు బయటకి వచ్చారు ఓడిపోయి పారిపోతున్న ఫిలిస్తీయుల్ని సౌలు సైనికులు తరిమి చంపారు.PPTel 628.2

    వచ్చిన ఆ అవకాశాన్ని సొమ్ము చేసుకోవటానికి ఆ దినమంతా సైనికులెవ్వరూ ఆహారం తీసుకోకూడదని రాజు నిషేధించాడు. ఈ గంభీర ప్రకటనతో తన ఆజ్ఞను అమలుపర్చాడు. “నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనకమునుపు, సాయంత్రం కాకమునుపు భోజనము చేయువాడు శపింపబడును”. సౌలుకు తెలియకుండా లేదా అతడి సహకారం లేకుండా విజయం వచ్చింది. ఓడిపోయిన సేనను పూర్తిగా నాశనం చేయటం ద్వారా గుర్తింపు పొందాలని ఆకాంక్షించాడు. భోజనం చేయటాన్ని నిషేధిస్తూ జారీ అయిన ఆజ్ఞ స్వార్ధాశల నెరవేర్పుకోసం ఏర్పాటయ్యింది. తన గొప్పతనానికి అడ్డు వచ్చినప్పుడు రాజు ప్రజల అవసరాల్ని లెక్కచేయడని ఇది వెల్లడించింది. తన నిషేధాన్ని గంభీర ప్రమాణంతో ధ్రువీకరించటం సౌలు దురుసుతనాన్ని భ్రష్టత్వాన్ని సూచిస్తుంది. సౌలు ఉద్రేకం తనకోసమే గాని దేవుని గౌరవం కోసం కాదనటానికి ఆ శాపంలోని మాటలే నిదర్శనం. అతడి ప్రకటిత ఉద్దేశం “యెహోవా తన శత్రువుల మీద పగ తీర్చుకోవటం” కాదు “నేను నా శత్రువుల మీద పగతీర్చు”కోటం. ఆ నిషేధం ప్రజలు దేవుని ఆజ్ఞను మీరటానికి దారి తీసింది. ప్రజలు ఆ దినమంతా యుద్ధం చేస్తూ ఉన్నారు. అన్నం లేక సోలిపోతున్నారు. నిషేధ కాలవ్యవధి గతించిన వెంటనే కొల్లగొన్న జంతువులపై పడి రక్తంతోనే మాంసాన్ని భక్షించారు. ఈ విధంగా ప్రజలు రక్తంతో తినకూడదన్న నిబంధనను అతిక్రమించారు.PPTel 628.3

    రాజు ఆజ్ఞను గురించి వినిన యోనాతను ఆనాటి యుద్ధంలో ఒక అడవిలో నుంచి వెళ్తున్న తరుణంలో కొంచెం తేనె తినటం ద్వారా తెలియకుండా రాజ అజ్ఞను మీరాడు. దాన్ని గురించి సౌలుకి ఆ సాయంత్రం తెలిసింది. శాసన ఉల్లంఘనకు మరణం తప్పదని రాజు ప్రకటించాడు. యోనాతను నేరం తెలిసి చేసింది. కాకపోయినా దేవుడు అతడి ప్రాణాన్ని ఆశ్చర్యకరంగా కాపాడి అతడి ద్వారా ఇశ్రాయేలీయులకి విమోచనను సాధించినా తన తీర్పు అమలు కావలసిందేనని రాజు పట్టుపట్టాడు. తన కుమారుడి ప్రాణాన్ని కాపాడటం తొందరపాటు ప్రమాణం చేయటం ద్వారా పాపం చేశానని సౌలు గుర్తించటం అవుతుంది,. ఇది అతడి ఆత్మ గౌరవనాకి దెబ్బ. “యోనాతానా, నీవు ఆవశ్యకముగా మరణమవుదువు. నేను ఒప్పుకొనని యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక” అన్నదే అతడి భయంకరమైన తీర్పు.PPTel 629.1

    సౌలు ఆ విజయ గౌరవాన్ని పొందలేకపోయినా తన ప్రమాణ పవిత్రతను కాపాడుకొన్న గౌరవాన్ని పొందాలని ఆశపడ్డాడు. తన కుమారుడి ప్రాణం త్యాగం చేసైనా సరే రాజు అధికారం తిరుగులేనిదని ప్రజలకు చూపించటమే అతడి లక్ష్యం. దీనికి కాస్త ముందే గిలులో దౌవాజ్ఞకు విరుద్ధంగా పౌలు దురభిమానంతో యాజకుడుగా వ్యవహరించాడు. అందుకు సమూయేలు మందలించినప్పుడు సౌలు తన్ను తాను మొండిగా సమర్ధించుకున్నాడు. ఇప్పుడు తన సొంత అజ్ఞాతిక్రమం జరిగినప్పుడు - అది సబబు కాని ఆజ్ఞ అయినప్పటికి, తెలియక చేసిన అతిక్రమం అయినప్పటికి - రాజా, తండ్రి కూడా అయిన వ్యక్తి కుమారుడికి మరణ శిక్ష వేశాడు.PPTel 629.2

    ఆ ఆజ్ఞ అమలును ప్రజలు తిరస్కరించారు. రాజు అగ్రహానికి భయపడ కుండా ప్రజలిలా అన్నారు. “ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికి కూడదు. దేవుని సహాయము చేత ఈ దినమున యోనాతాను మనలను జయము నొందించెను. యెహోవా జీవము తోడు అతని తల వెంట్రుకలలో ఒకటియు నేలరాలదు”. గర్వాంధుడైన రాజు ఈ ప్రజాతీర్పును తోసి పుచ్చలేకపోయాడు. యోనాతానుకి మరణం తప్పింది, ప్రజలు దేవుడు యోనాతానునే ఆదరిస్తున్నారని సౌలు గుర్తించాడు. యోనాతను విడుదల సౌలు దుందుడుకు చర్య పై గట్టి మందలింపు. తన శాపాలు తన మీదకే తిరిగి వస్తాయన్న మనోభావం సౌలుకు కలిగిస్తుంది. ఫిలిప్తీయులతో యుద్ధం ఎక్కువకాలం కొనసాగించలేదు. ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. అతడిలో అస్థిర అసంతృప్తి చోటు చేసుకున్నాయి.PPTel 629.3

    ఎవరైతే తమ పాపాన్ని సమర్ధించుకుంటారో వారు ఇతరుల్ని ఖండించి వారి పై తీర్పు వెలిబుచ్చటంలో కఠినాతి కఠినంగా వ్యవహరిస్తారు. కొందరు సౌలుకు మల్లే దైవాగ్రహాన్ని కొని తెచ్చుకొంటారు. అయితే వారు సలహాల్ని తోసి పుచ్చుతారు. మందలింపుల్ని తృణీకరిస్తారు. ప్రభువు తమతో లేడని నమ్మినా మెరుగుగా ఉన్న వారిని తమ కష్టాలకు కారకులని విమర్శిస్తూ లేదా కఠినగంగా మందలిస్తూ వారు గర్వంగా వ్యవహరిస్తారు. తమంతటతామే న్యాయాధిపతులై ఇతరుల్ని విమర్శించేవారు. క్రీస్తు చెప్పిన ఈ మాటల గురించి ఆలోచిచంటం మంచిది “మీరు తీర్చు తీర్పు చొప్పుననే మీకును కొలువబడును”. మత్తయి 7:2PPTel 630.1

    తమ్మును తాము హెచ్చించుకోజూ చేవారు తరుచు తమ ప్రవర్తనను బయలుపర్చే హోదాల్లో నియమితులవుతుంటారు. సౌలు ఇలా నియమితుడైనవాడే. న్యాయం, దయ లేదా ఔదార్యం కన్నా రాచ గౌరవం అధికారి అతడికి ఎంతో ప్రియమని అతడి క్రియలే ప్రజలకు చాటి చెప్పాయి. దేవుని పరిపాలనను నిరాకరించటంలో తాము చేసిన పొరపాటును ప్రజలు ఇలా గుర్తించారు. తన ప్రార్ధన ద్వారా దీవెనలు తెచ్చిన దైవ భక్తుడైన ప్రవక్తకు బదులుగా తన గుడ్డి ఉద్రేకంలో తమ పై శాపం కోసం ప్రార్ధన చేసిన రాజును ప్రజలు కోరుకొన్నారు.PPTel 630.2

    యెనాతను ప్రాణాన్ని రక్షింటానికి ఇశ్రాయేలు ప్రజలు కలుగజేసుకొని ఉండకపోతే తమ విమోచకుడు రాజు ఆజ్ఞ మేరకు మరణించి ఉండేవాడు. ఆ తరువాత ఆ ప్రజలు సౌలు మార్గదర్శకత్వాన్ని ఎన్ని అనుమానాలతో అంగీకరించి ఉంటారు! తమ చర్యవల్లనే అతడు సింహాసనం పై ఉన్నాడన్నది ఎంత బాధాకరమైన సంగతి! దుష్టులైన మానవుల్ని దేవుడు దీర్ఘకాలం సహిస్తాడు. తమ పాపాల్ని గుర్తించి విడిచి పెట్టటానికి ఆయన అందరికి అవకాశం ఇస్తాడు. అయితే తన చిత్రాన్ని లెక్క చెయ్యనివారిని తన హెచ్చరికల్ని తృణీకరించేవారిని దీవించి వృద్ధి పర్చుతున్నట్లు కనిపించినా ఆయన తాను ఎంచుకొన్న సమయంలో వారి దుర్బుద్ధిని తప్పక బహిర్గతం చేస్తాడుPPTel 630.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents