Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    72—అబ్బాలోము తిరుగుబాటు

    ప్రవక్త నాతోను చెప్పిన ఉపమానం విన్నవెంటనే “ఆ గొట్టె పిల్లకు ప్రతిగా నాలుగు గొఱ్ఱపిల్లనియ్యవలెను” అంటూ తెలియకుండా దావీదిచ్చిన తీర్పు తన విషయంలోనే దావీదు వెలువరించుకొన్నాడు. తానిచ్చిన తీర్పును బట్టే దావీదు తీర్పు పొందాల్సి ఉన్నాడు. అతడి నలుగురు కుమారులు వేటుకి గురి కావలసిందే. వారిలో ప్రతి ఒక్కరి మరణం తండ్రి పాపపర్యవసానంగా చోటుచేసుకోనుంది.PPTel 742.1

    తనే జ్యేష్ట కుమారుడైన అమ్నోను నేరాన్ని దావీదు శిక్షించకుండా కనీసం మందలించకుండా విడిచి పెట్టేశాడు. వ్యభిచారికి మరనణమే శిక్ష అని ధర్మశాస్త్రం ఘోషిస్తుంది. అమ్నోనుది అస్వాభావిక పాపం కావటంతో అతడి నేరం రెండంతలు. కాగా సొంత నేరమే తనను ఖండిస్తుండంతో దావీదు నేరస్తుణ్ణి శిక్షించటంలో విఫలుడయ్యాడు. అబాలోము తన సూదరికి స్వాభావిక పరిరక్షకుడు. సహోదరి విషయంలో అతడికి తీరని అన్యాయం జరిగింది. అబాలోము తన ప్రతీకారేచ్చను రెండేళ్ళ పైకి కనపడనియ్యలేదు కాని చివరికి తీవ్రంగా విజృంభించనున్నాడు. రాజు కుమారులు ఏర్పాటు చేసిన ఒక విందులో తాగుబోతు, వరసవావి, ఎరగని వ్యభిచారి అయిన ఆమ్మోను తమ్ముడి ఆదేశం మేరకు హతడయ్యాడు.PPTel 742.2

    దావీదుకి రెట్టింపు శిక్ష పడింది. “రాజకుమారులను అందరిని అబ్బాలోము హతము చేసెనని దావీదుకు వార్త రాగా అతడు లేచి వస్త్రములు చింపుకొని నేలపడి యుండెను. మరియు అతని సేవకులందరు వస్త్రములు చింపుకొని దగ్గర నిలువబడి యుండిరి”.భయభ్రాంతులైన యెరూషలేముకి తిరిగి వచ్చి రాకుమారులు అమ్మోను మాత్రమే హతుడయ్యాడన్న వాస్తవాన్ని తండ్రికి తెలియజేసారు. వారు “బిగ్గరగా ఏడ్వసాగిరి.రాజును అతని సేవకులును దీనిని చూచి బహుగా ఏడ్చిరి”.ఇలా ఉండగా అబాలోము గైషూరు రాజైన తల్మయి వద్దకు పారిపోయాడు. తల్మయి అబాలోము తల్లికి తండ్రి.PPTel 742.3

    తక్కిన కుమారుల్లాగే అమ్మోనుని స్వార్ధ కార్యకలపాల్లో విశృంఖలంగా వ్యవహరించటానికి తండ్రి వదిలేశాడు. దైవ ధర్మ శాస్త్ర నిధులతో నిమిత్తం లేకుండా ఆమ్మోను తన హృదయ వాంఛలిన్నటిని తీర్చుకోవటానికి ప్రయత్నించాడు. అతడు ఘోరపాపానికి ఓడికట్టుకొన్నప్పటికి అతడి పట్ల దేవుడు ఎంతో సహనం కనపర్చాడు. అతడు పశ్చాత్తాపపడటానికి దేవుడు రెండేళ్ళ తరుణం ఇచ్చాడు. అయినా అతడు పాపం చెయ్యటం మానలేదు. దోషిగా కొనసాగుతున్న అతణ్ణి మరణం మొత్తింది అతడు ఆ తీర్పు దినంకోసం సమాధిలోనే వేచి ఉండాలి.PPTel 742.4

    నేరం చేసిన ఆమ్మోనుని శిక్షించటం దావీదునిర్లక్ష్యం చేసాడు. రాజా, తండ్రీ అయిన దావీదు అపనమ్మకంవల్ల కుమారుడిలో పశ్చాత్తాపం లేనందు వల్ల పరిస్థితులు స్వాభావికంగా పరిణమించటానికి దేవుడు అనుమతించి అబ్లాలోమను నిరోధించలేదు. తల్లితండ్రులు లేదా పరిపాలకులు దుర్మార్గతను శిక్షించాల్సిన తమ బాధ్యతను నిర్లక్ష్యం చేసినప్పుడు ఆ బాధ్యతను దేవుడే చేపడ్డాడు. దుష్టశక్తుల పై ఆయన అదుపు కొంత మేరకు ఉపసంహరించుకోగా పాపాన్ని పాపంతోనే శిక్షించేందుకు గాను కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి.PPTel 743.1

    ఆమ్మోను పట్ల దావీదు ప్రదర్శించిన ఆహేతుక ప్రేమ దుష్ఫలితాలు అంతం కాలేదు. ఎందుకుంటే తండ్రికి అబ్బాలోముకి మధ్య ఆగాధం ఏర్పడటానికి ఇదే కారణం. ఆబాలోము గెషూరికి పారిపోయిన తరువత దావీదు తనకుమారుడి నేరానికి ఏదో శిక్ష అవసరమని భావించి అతడు తిరిగి రావటానికి అనుమతి నిరాకరించాడు. దావీదు పీక వరకూ కూరుకుపోయి ఉన్న దుస్తితని మెరుగుపర్చేకన్నా ఇది అతణ్ణి మరింత దిగజార్లే ప్రమాదం ఏర్పడింది. చురుకైన వాడు, అత్యాశగలవాడు, నియమ నిబంధనలు లెక్కచేయని వాడు, తన ప్రవాసం వల్ల రాజ్య వ్యవహారాల్లో పాత్ర లేనివాడుఅయిన అభాలోము కుట్రలు పన్నటంలో తలమునకలయ్యాడు.PPTel 743.2

    రెండేళ్ళ అనంతరమ తండ్రి కుమారుల మధ్య రాజీ కుదర్చఆనిక యోవాబు పూనిక వహించాడు. ఈ ఉద్దేశంతో యోవాబు తేకోవకు చెందిన ఒక స్త్రీ సహాయన్ని తీసుకున్నాడు. ఆమె యుక్తికి వివేకానికి పేరు మోసిన స్త్రీ. యోవాబు ఉపదేశించిన విధంగా ఆ స్త్రీ దావీదు వద్దకు వెళ్ళి తాను విధవరాలిననితనకు ఇద్దరు కుమారులున్నారని ఒక కలహంలో వీరిలో ఒకడు రెండో వాణ్ని చంపాడని, ఇప్పుడు తన బంధువులంతా బతికి ఉన్న తన కుమారుణ్ణి ప్రతిహత్య చేసేవాడికి అప్పగించిమని డిమాండు చేస్తున్నారని “ఈలాగున వారు నా పెనిమిటికి భూమి మీద పేరైనను శేషమైనను లేకుండ మిగిలిన నిప్పురవ్వను అర్పివేయబోవుచున్నారు” అని అన్నది. ఆమె కథనం విని రాజు చలించాడు. ఆమె కుమారుణ్ణి రక్షిస్తానని భరోసా ఇచ్చాడు.PPTel 743.3

    ఆ యువకుడి క్షేమం విషయమై రాజు పదే పదే వాగ్దానం చేసిన మీదట తనను క్షమించమని రాజు వేడుకుంటూ ప్రవాసం వెళ్లిన తనకుమారుణ్ణి ఇంటికి తీసుకురానందుకు తాను పొరపాటులో ఉన్నట్లు రాజుకు గుర్తు చేసింది. ‘మనమందరము చనిపోదుము గదా, నేలను ఒలికిన మీదట మరల ఎత్తులేని నీటివలె ఉన్నాము; దేవుడు ప్రాణము తీయక తోలివేయబడినవాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు”. అన్నది పాపిపట్ల దేవుని ప్రేమనుగూర్చిన ఈ సున్నితమైన వర్ణన రక్షణ సంబంధిత మహత్తర సత్యాలు ఇశ్రాయేలీయులు ఎరిగినవే అనటానికి ప్రబల నిదర్శనం. PPTel 743.4

    దేవుని కృపాకటాక్షాలు తనకెంతో అవసరమని గుర్తించిన రాజు ఈ స్త్రీ విజ్ఞప్తిని తోసిపుచ్చలేదు. “యౌవనుడగు అబాలోమును రప్పింపుము” అని రాజు యెవాబును ఆదేశించాడు.PPTel 744.1

    ఆబాలోము యెరూషలేము రావటానికి దావీదు అనుమతించాడు. ఆస్థానానికి హజరవ్వటానికి గాని తనతో సమావేశమవ్వటానికి గాని అనుమతించలేదు. పిల్లల్ని అమితంగా ప్రేమించి విచ్చలవిడిగా విడిచి పెట్టటం వల్ల చోటు చేసుకొనే దుష్పలితాల్ని దావీదు గ్రహించటం మొదలు పెట్టాడు. సుందరమైన ఎన్నో సమర్ధతలు గల ఈ కుమారుణ్ణి ఎంతో ప్రేమించినప్పటికి అబ్బాలోముకీ ప్రజలకూ పాఠం నేర్పేందుకు గాను కుమారుడు చేసిన పాపం పట్ల ఏహ్యత ప్రదర్శించటం అవసరమని దావీదు భావించాడు. తన సొంత గృహంలో అబాలోము రెండేళ్ళు నివసించాడు. కాని ఆస్థానానికి హాజరు కాలేదు. తన చెల్లెలు అతడితో నివసించింది. ఆమె ఉనికి ఆమెకు జరిగిన అన్యాయానికి మరపు రాకుండా చేసింది. ప్రజల దృష్టిలో అబాలోము నేరస్తుడు కాదు వీరుడిగా నిలిచాడు. ఈ పరిస్థితిని అనుకూలంగా మల్చుకొని ప్రజాదరణను పొందటానికి ప్రయత్నించాడు. ప్రజలు అతడి వ్యక్తిగత సుందర రూపాన్ని చూసి అతడికి ఆకర్షితులయ్యారు. “ఇశ్రాయేలీయులందరిలో అబ్బాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు. అరికాలు మొదలుకొని తలవరకు ఏ లోపమునకు అతనియందు లేకపోయెను. “అబ్బాలోము ప్రవర్తనవంటి ప్రవర్తన గలవాణ్ణి అత్యాశ, దుందుడుకుతనం, ఉద్రేకం గలవాణ్ణి ఊహాజనిత అన్యాయాల గురించి ఆలోచించటానికి రెండేళ్ళుగా రాజు ఖాళీగా వదిలి పెట్టటం విజ్ఞత కాదు. దావీదు అతణ్ణి యోరూషలేముకి రానిచ్చి తన సముఖంలోకి రావటానికి అనుమతించకపోవటం అతడు ప్రజల సానుభూతి పొందటానికి దోహదపడింది.PPTel 744.2

    తాను దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించానన్న జ్ఞాపకం నిత్యం తన ముందుండటంతో దావీదు నైతికంగా ఎటూ కదల్లేని స్థితికి చేరాడు. బలహీనుడయ్యాడు. తీర్మానం చేసుకోలేకపోయాడు. పాపం చేయకముందు అతడు ధైర్యంగా నిశ్చయాత్మకంగా వ్యవహరించేవాడు. ప్రజల్లో తన పలుకుబడి బలహీనమయ్యింది. ఇదంతా తన కుమారుడి దురాలోచనలకు అనుకూలంగా పరిణమించింది.PPTel 744.3

    దావీదు నిరాసక్తత, క్రియా శూన్యతల ప్రభావం తన కింద అధికారులపై కూడా పడింది. న్యాయపాలిక నిర్లక్ష్యం తాత్సరంతో అఘోరించింది. అసంతృప్తి కలిగించే ప్రతీ అంశాన్ని అబ్బాలోము తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. ప్రజలు తమ బాధల్ని నివేధించుకొని వాటి నివారణ కోసం పెద్ద సంఖ్యలో కూడుకొనే ఆ పట్టణ సమావేశద్వారాల వద్ద ఈ సుందర వదనుడు ప్రతీరోజు దర్శనమిచ్చేవాడు. వారితో కలసి పోయి వారు చెప్పుకొన్న ఇక్కట్లు బాదలు విని తన ప్రగాఢ సానుభూతి వెలిబుచ్చి ప్రభుత్వ అసమర్థతకు సంతాపం ప్రకటించేవాడు. ఇశ్రాయేలు దేశంలో ఓ బాధితుడి కథనం విన్న తరువాత యువరాజు ఇలా సమాధానం ఇచ్చేవాడు. “నీవాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నదిగాని దానిని విచారించుటకై నియమింపబడినవాడు రాజునొద్ద ఒకడును లేడని చెప్పి నేను ఈ దేశమునకు న్యాయాధిపతినైయుండుట యెంత మేలు;అప్పుడు వ్యాజ్యెమాడువారు నా యొద్దకు వత్తురు; నేను వారికి న్యాయము తీర్చుదును. మరియు తనను నమస్కారము చేయుటకై యెవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచు వచ్చెను”.PPTel 745.1

    యువరాజు నేర్పుతో చేసిన వ్యంగ్య సూచనల వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసంతృప్తి వేగంగా విస్తరిస్తున్నది. ప్రజలందరూ అబాలోముని కొనియాడుతున్నారు. అతడే తండ్రి సింహాసానికి వారసుడన్నది ప్రజాభిప్రాయం. ఆ ఉన్నత స్థానానికి తానే యోగ్యుడన్న భావంతో అతణ్ణి గూర్చి ప్రజలు అతిశయపడుతున్నారు. అతడే సింహాసనానికి రావలన్న కోరిక ప్రజల్లో వ్యక్తమయ్యింది. “అబాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలీయులనందరిని తన చుట్టు త్రిప్పుకొనెను.” అయినా కుమారుడి పై ప్రేమమూలంగా గుడ్డివాడైన రాజుకి ఎలాంటి అనుమానమూ కలుగలేదు. అబాలోము ప్రకటించుకున్న యువరాజరికాన్ని ఒక ఆస్థాన గౌరవంగాను తమ మధ్యచోటు చేసుకున్న సయోధ్యకు ప్రతీకగాను దావీదు పరిగణించాడు.PPTel 745.2

    దాని తరువాత జరగనున్న ఘటననకు ప్రజల మనసులు సంసిద్ధంగా ఉండటంతో గోత్రాలన్నిటిని తిరుగబాటుకి సంఘటిత చేయటానికి ఎంపిక చేసుకున్న కొందరు వ్యక్తుల్ని అబ్బాలోము రహస్యంగా పంపించాడు. చాలాకాలం క్రితం తాను ప్రవాసిగా ఉన్నప్పుడు మొక్కుకున్న మొక్కుబడి హెబ్రోనులో చెల్లించాల్సి ఉంది. అబాలోము రాజుతో ఇలా అన్నాడు. “నీ దాసుడనైన నేను సిరియ దేశమునందలి గెషూరు నందుండగా - యెహోవా నన్ను యెరూషలేమునకు తిరిగి రప్పించిన యెడల నేను ఆయనను సేవించెదనని మొక్కుకొంటిని.” కుమారుడిలో కనిపిస్తున్న దైవభక్తి కితన్మయం చెందిన తండ్రి అతణ్ణి దీవించి పంపించాడు. కుట్ర అమలుకు ఇప్పుడు అంతా సిద్ధంగా ఉంది. అబాలోము దొంగ నాటకం తండ్రి కన్ను కప్పటానికే కాదు ప్రజల విశ్వాసాన్ని చూరగొని దేవుడు ఎంపిక చేసిన రాజు పై తిరుగుబాటు చేయటంలో వారిని నడిపించటానికి పనిచేసింది కూడా.PPTel 745.3

    అబ్బాలోము హెబ్రోనుకి బయల్దేరాడు. “రెండువందల మంది యెరూషలేములో నుండ అబాలోముతో కూడా బయలుదేరి యుండిరి. వీరు ఏమియు తెలియక యధార్ధమైన మనస్సుతో వెళ్ళియుండిరి.” కుమారుడి పట్ల తనకున్న ప్రేమాభిమానాలు తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు నడిపిస్తాయని భావించకుండా ఈ రెండు వందల మంది అబాలోముతో బయలుదేరి వెళ్ళారు.PPTel 746.1

    హెబ్రోనుకు వెళ్ళిన వెంటనే అబాలోము అహీతో పెలుని పిలిపించాడు. అహీతో పెలు దావీదు ప్రధాన సలహాదారుల్లో ఒకడు. ప్రతిభాశాలిగా పేరు పొందిన వ్యక్తి. అతడి అభిప్రాయం దైవవాక్కుతో సమానంగా పరిగణించటం జరిగేది. అహీతో పేలు కుట్రదారులతో చెయ్యి కలిపాడు. అతడి మద్దుతు అబాలోము చేపట్టిన కార్యానికి తప్పక విజయం చేకూర్చుతుందన్న నమ్మకం కలిగించింది. దేశం అన్ని ప్రాంతాల నుండి ప్రాబల్యం గల అనేకమందిని తిరుగుబాటు నాయకుడి జెండా కిందికి ఆకర్షించింది. తిరుగుబాటు బాకా ధ్వని వినిపించగానే యువరాజు తాలూకు వేగులు అబాలోము రాజయ్యాడని దేశమంతా ప్రచారం చేసారు. ప్రజల్లో అనేకమంది అబాలోము పక్కన నిల్చారు. ఇంతలో యెరూషలేములో ఉన్న రాజుకు ఈ వార్త అందింది.PPTel 746.2

    దావీదు తన సింహాసం పక్కనే లేస్తున్న తిరుగుబాటును చూడటానికి హఠాత్తుగా మేల్కొన్నాడు. తాను ఎంతగానో ప్రేమించి నమ్మిన తన సొంత కుమారుడు తన సింహాసనాన్ని తీసుకోవటానికి ఆ మాటకొస్తే తన ప్రాణాన్ని తియ్యటానికి కుట్ర పన్నుతున్నాడు. తానున్న ఆ ప్రమాద భరిత పరిస్థితిలో చాలాకాలంగా తనలో చోటు చేసుకున్న ఉదాసీనతను పక్కకు నెట్టి తన పూర్వ సాహన స్పూర్తితో ఈ అత్యవసరం పరిస్థితిని ఎదుర్కొటానికి దావీదు నడుం బిగించాడు. ఇరవై మైళ్ళ దూరంలో వున్న హెబ్రోనులో అబాలోము తన సైన్యాన్ని మెహరిస్తున్నాడు. తిరుగుబాటు దారులు కొద్దికాలంలోనే యెరూషలేమ గుమ్మాల వద్ద ప్రత్యక్షం కాగలరు.PPTel 746.3

    రాజభవనం నుంచి దావీదు తన రాజధాన్ని పారజూశాడు. “రమ్యమైన యెత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా నున్నది. దాని నగరులలో దేవుడు... ప్రత్యక్షమగుచున్నాడు”. కీర్తనలు 48:2 ఆ పట్టణాన్ని రక్తపాతానికి విధ్వంసానికి గురి చెయ్యటమన్న తలంపు దావీదుని కలవర పెట్టింది. తనకు నమ్మకంగా వున్న ప్రజల్ని తనకు తోడుగా రమ్మని పిలిచి వారి సహాయంతో పట్టణాన్ని కాపాడటమా? యెరూషలేము రక్తపు వరదలో మునగటానికి నమ్మతించటమా? అతడు తన తీర్మానాన్ని చేసుకున్నాడు. ఆ పట్టణం పై భీకర యుద్దఛాయలు పడకూడదనుకొన్నాడు. యెరూషలేము నుండి వెళ్ళిపోయి తనకు మద్దతు ఇవ్వటానికి ప్రజలకు అవకాశమివ్వటం ద్వారా వారి నిజాయితీని పరీక్షించాలనుకొన్నాడు. దేవుడు తనకిచ్చిన అధికారాన్ని ఈ క్లిష్ట సమయంలో కొనసాగించటం దేవుని పట్ల తన ప్రజల పట్ల అతడి బాధ్యత. ఇక పోరాటం సంగతి దేవునికప్పగించాడు.PPTel 747.1

    వినయ మనస్కుడై హృదయ వేదనతో దావీదు యెరూషలేము గుమ్మాల్లో నుంచి బయటకి వెళ్ళాడు. తాను అమితంగా ప్రేమించిన కుమారుడి తిరుగుబాటు వల్ల నుంచి బయటికి వెళ్ళాడు. తాను అమితంగా ప్రేమించిన కుమారుడి తిరుగుబాటు వల్ల సింహాసనాన్ని రాజభవంతిని దేవుని మందసాన్ని విడిచి పెట్టి వెళ్ళిపోయాడు సమాధికి వెళ్ళే ఊరేగింపు జనంలా ప్రజలు అతని వెంటవెళ్ళారు. దావీదుకు రక్షక భటులుగా కెరేతీయులు, పెలేతీయులు గాతునుంచి ఇత్తయి నాయకత్వంలో అరువందలమంది గిత్తీయులు రాజు వెంట వెళ్ళారు. అయితే దావీదు తన సహజ స్వార్ధరహిత మనసుతో తన సంరక్షణను ఆశించిన ఆ పరదేశులు తన విపత్తులో ఇరుక్కొటానికి సమ్మతించిన లేదు. తన నిమిత్తం వారు ఈతాగ్యం చేయటానికి సన్నద్ధమవుతున్నందుకు ఆశ్చర్యం వ్యక్తం చేసాడు. అప్పుడు రాజు గిత్తీయుడైన ఇత్తయితో ఇలా అన్నాడు. “నీవు నివాస స్థలము కోరు పరదేశివై యున్నావు.. నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు ? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదుమో తెలియకయున్న మాతో కూడా ఈ తిరుగులాటయెందుకు ? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము. కృపా సత్యములు నీకు తోడుగా ఉండును గాక”!PPTel 747.2

    “నేను చచ్చినను బ్రదికినను, యెహోవా జీవముతోడు నా యేలినవాడవును రాజవునగు నీ జీవముతోడు, ఏ స్థలమునందు నాయేలినవాడవును రాజవునగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేనుందును” అన్నాడు ఇత్తయి. ఈ మనుషులు అన్యమతం నుంచి యెహోవాను సేవించటానికి మత మార్పిడి చేసుకున్నారు. ఇప్పుడు వారు తమ దేవునికి తమ రాజుకి తమ విశ్వసనీయతను నిరూపించుకొన్నారు. కృతజ్ఞతతోనిండిన హృదయంతో వారి దైవ భక్తిని స్వామి భక్తిని దావీదు అంగీకరించాడు. వారందరూ కిడ్రోను వాగు దాటి అరణ్యం దిశగా సాగిపోయారు. PPTel 747.3

    వారి ప్రస్తానం మళ్ళీ అగిపోయింది. పరిశుద్ధ వస్త్రాలు ధరించిన ఒక బృందం వారిని సమీపిస్తున్నది. సాదోకును లేవీయులందరును దేవుని మందసమును మోయుచు అతని యొద్ద ఉండిరి “. దావీదు అనుచరలు దీన్ని సంతోషసూచనగా పరిగణించారు. పరిశుద్ద మందసం తమతో ఉండటాన్ని వారు తమ విడుదలకు అంతిమ విజయానికి సూచనగా భావించారు. వారిని ధైర్యపరచి వారు రాజు పక్క నిలవటానికి ఇది వారికి స్ఫూర్తి నిచ్చింది. అది యెరూషలేములో లేకపోవటం అబాలోము అనుచరులకు కంపరం పుట్టించనుంది.PPTel 748.1

    మందస్నాన్ని చూశాక కొన్ని నిముషాలు దావీదు హృదయం ఆనందోత్సాహాలతో నిండింది. దరిమిలా ఇతర ఆలోచనలు పుట్టుకొచ్చాయి. ఇశ్రాయేలు స్వాస్థ్యానికి నియమితుడైన నాయకుడిగా అతడిపై గురుతర బాధ్యత ఉంది. ఇశ్రాయేలు రాజు మనసులో ప్రధానాంశాలు కావాల్సింది వ్యక్తిపరమైన ఆసక్తులు కాదు గాని దేవుని మహిమ ఆయన ప్రజల హితం. కెరూబుల మధ్య నివసించే ఆ ప్రభువు “ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును” (కీర్తనలు 132:14) అని యెరూషలేము గురించి అంటున్నాడు. దైవ సన్నిధికి ప్రతీక అయిన మందాసాన్ని దేవుని అధికారం లేకుండా యాజకుడికిగాని, రాజుకి గాని ఆ స్థలంలో నుంచి కదిపే హక్కులేదు. తన హృదయం తన జీవితం దైవసూత్రాలకు అనుగుణంగా ఉండాలిని అలాక్కకపోతే మందసం తనకు విజయం కూర్చే బదులు విపత్తులు తెచ్చి పెడుతందని దావీదుకు తెలుసు. తన పాపం నిత్యం తన కళ్ళముందే ఉండేది. ఈ కుట్రలో దేవుని తీర్పును దావీదు గుర్తించాడు. తన కుటుంబ పై నుంచి తొలగిపోకుండా ఉండాల్సి ఉన్న ఖడ్గం దూయబడింది.ఆ సంఘర్షణ పర్యవసానం ఎలా ఉండబోతుందో అతడికి తెలియలేదు. దైవ సార్వభౌముడి చిత్రానికి ప్రతిరూపం. దేశానికి రాజ్యాంగం దేశ సౌభాగ్యానికి పునాది అయిన పరిశుద్ధ ధర్మశాసనాల్ని జాతీయ రాజధాని నుండి కదపటం అతడి పనికాదు.PPTel 748.2

    దావీదు సాదోకును ఇలా ఆదేశించాడు “దేవుని మందసమున పట్టణానికి తిరిగి తీసుకొనిపొమ్ము. యెహోవా ధృష్టికి నేను అనుగ్రహము పొందిన యెడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమును నాకు చూపించును. నీయందు నాకిష్టము లేదని ఆయన సెలవిచ్చిన యెడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నా యెడల జరిగించుమని నేను చెప్పుదును”.PPTel 748.3

    దావీదు ఇంకా ఇలా అన్నాడు.“నీవు దీర్ఘ దర్శివి కావా”? ప్రజలకు ఉపదేశ మిచ్చేందుకు దేవుడు నియమించిన వ్యక్తి. “శుభమొంది నీవును నీ కుమారుడగు అహిమయస్సు అభ్యా తారునకు పుట్టిన యోనాతాను అను మీ ఇద్దరు కుమారులును పట్టణమునకు పోవలెను. అలకించుము; నా యొద్ద నుండి నాకు రూఢియై వర్తమానము వచ్చువరకు నేను అరణ్యమందలి రేవు దగ్గర నిలిచి యుందును”. నగరంలో ఆ యాజాకులు రాజుకి మంచి సేవలందించవచ్చు. తిరుగు బాటుదారుల కదలికల్ని ఉద్దేశాన్ని కని పెట్ట తమ కుమారులు అహిమయస్సు, యోనాతాన్ల ద్వారా ఆ సమాచారాన్ని రహస్యంగా రాజుకి చేరవేయవచ్చు.PPTel 749.1

    యాజకులు వెనక్కి తిరిగి యోరూషలేముకి వెళ్తున్న తరుణంలో ఆ ప్రజల్ని తీవ్రమైన నిరాశ అలుముకున్నది. తను రాజు పలాయితుడు. ఇక తమ మాటకొస్తే వారు తృణీకరించబడ్డవారు. దేవుని మందసం కూడా వారిని విడిచి పెట్టింది. భవిష్యత్తు చీకటితో నిండి భయకంరంగా కనిపిస్తుంది. “అయితే దావీదు ఓలీవ చెట్ల కొండ యెక్కుచు ఏడ్చుచు తన కప్పుకొని పాద రక్షలు లేకుండా కాలి నడకకు వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరును తలలు కప్పుకొని యేడ్చుచు కొండయెక్కిరి.PPTel 749.2

    అంతలో ఒకడు వచ్చి అబ్బాలోమే చేసిన కుట్రలో అహీతో పెలు చేరియున్నాడని” తెలియజేసాడు. దావీదు మళ్ళీ తన కష్టాలు శ్రమల్లో తన పాప పర్యవసాన్ని గుర్తించక తప్పలేదు. అహీతో పెలు సమర్ధుడు. యుక్తి పరుడు అయిన రాజకీయ నాయకుడు. తన మనవరాలు ద్వారా తన కుటుంబానికి కలిగిన అపకీర్తీ గురించిన ప్రతీకారేచ్చ అహీతో పెలు ఫిరాయింపుకి కారణం.PPTel 749.3

    “దావీదు - యెహోవా అహీత పెలు యొక్క అలోచనను చెదరగొట్టుమని ప్రార్ధన చేసెను”. పర్వత శిఖరం చేరిన తర్వాత రాజు తన భారమంతా దేవుని పై వేసి ఆయన కృపకోసం విజ్ఞాపన చేస్తూ ప్రార్ధన చేశాడు. అతడి ప్రార్ధనకు వెంటనే జవాబు లభించినట్లు కనిపించింది. దావీదుకి నమ్మకమైన మిత్రుడు. విజుడు, సమర్ధుడు అయిన సలహాదారు, ఆర్కీయుడైన హూ షై బట్టలు చింపుకొని తల పై ధూళి జల్లుకొని, సింహాసనంపోయి పలాయితుడవుతున్న రాజుతో ఉండటానికి నిర్ణయించుకొని వచ్చాడు. నమ్మకస్తుడు. యధార్థ హృదయుడు అయిన ఈ వ్యక్తి రాజధానిలో రాజు ప్రయోజనాల్ని కాపాడటానికి అవసరమైనవాడని దేవుడు నడుపుదలతో దావీదు గ్రహించాడు. దావీదు విజ్ఞప్తి మేరకు హు హై అహీతో పెలు దస్తంత్రాలకు అడ్డుకట్టవేయటానికి యెరూషలేముకి వెళ్ళాడు.PPTel 749.4

    చీకటిలో ఈ చిరుకాంతితో రాజు అతడి అనుచరగణం ఒలీవ కొండ తూర్పు దిక్కునుంచి దిగి బండలమయమైన అరణ్య భూములు, లోతైన లోయలు, పెద్ద పెద్దరాళ్ళు ఆగాధాలతో నిండిన మార్గాల గుండా యోయోను దిశగా సాగారు. “రాజైన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమీ అనునొకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరును బలాడ్యులందరును దావీదు ఇరు పార్శ్వములనుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచు వచ్చెను. ఈ షీమ - నరహంతకుడా, దుర్మార్గుడా, ఛీపో, చీఫో - నీవెల ఏలవలెను నీవు వెళ్ళగొట్టిన సౌలు యింటివారి హత్యను యెహోవా నీమీదికి రప్పించి, యెహోవా నీకుమారుడైన అబ్లాలోము చేతికి రాజ్యమును అప్పగించియున్నాడు. నీవు నరహంతుకుడువు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి యున్నావని చెప్పి రాజును శపించెను”.PPTel 750.1

    దావీదు వృద్ధిలో ఉన్న కాలములో షిమీ తన మాటల్లోని క్రియల ద్వారా గాని తాను రాజు పాలనకిందలేని వ్యక్తినని కనపర్చలేదు. కాని రాజుకి శ్రమకాలం వచ్చినప్పుడు ఈ బెన్యామీనీయుడు తన నిజ స్వరూపాన్ని ప్రదర్శించాడు. రాజుగా ఉన్నప్పుడు దావీదుకి అడుగులకు మడుగులొత్తి అవమానం కలిగినప్పుడు దావీదుని శపించాడు. అతడు దుర్మార్గుడు, స్వార్ధపరుడు ఇతరులు కూడా తనలాగే దుర్మార్గులని భావించేవాడు. దేవుడుగుద్దించిన నాయకుడి పై సాతాను ప్రోద్బలంతో ద్వేషం ప్రదర్శించాడు. శ్రమలు భాదలు అనుభవిస్తున్న వ్యక్తిని ఓడించటానికి ఎగతాళి చేయటానికి లేక దు:ఖపర్చటానికి ప్రేరేపించి స్వభావం సాతానుస్వభావం.PPTel 750.2

    షీమీ దావీదు పై చేసిన ఆరోపణలు పూర్తి అసత్యాలు. అవి నిరాధారమైన దురుద్దేశ్యపూర్వకమైన నిందలు. దావీదు సౌలుకు గాని కుటుంబానికి గాని ద్రోహం చెయ్యలేదు. సౌలు పూర్తిగా తన వశంలో ఉన్నప్పుడు దావీదు అతణ్ణి మట్టు పెట్టగలిగి ఉండేవాడు. కేవలం అతడి వస్త్రపు చెంగును కోసి అనంతరం దేవునిచే అభిషేకం పొందిన వ్యక్తి పట్ల జరిగిన ఈ అమార్యది నిమిత్తం కూడా తన్నుతాను నిందించుకొన్నాడు.PPTel 750.3

    ఇకపోతే, మానవ ప్రాణం పట్ల దావీదుకున్న పరిశుద్ద గౌరవం గురించి చెప్పుకోవాల్సి వస్తే తనను జంతువల్లే వేటాడుతున్న తరుణంలో సయితం అందుకు ప్రయత్నింంచిన బలమైన నిరద్శనం కనిపిస్తున్నది. దావీదు అదుల్లా గుహలో తల దాచుకున్న దినాల్లో ఒకనాడి అతడు ఆలోచనలు తన చిన్ననాటి విశృంఖల జీవితం పై విలువగా ఈ విధంగా తలంచాడు. “బెల్లె హేము గవిని దగ్గరనున్న బావినీళు , ఎవడైనను తెచ్చి యిచ్చిన యెడల ఎంతో సంతోషించెదను!” 2 సమూయేలు 23:13-17 ఆ సమయంలో బెల్లే హేము ఫిలప్రియుల చేతుల్లో ఉంది. అయితే దావీదు అనుచరుల్లో ముగ్గురు యోధులు ఫిలిప్తీయుల చేతుల్లో ఉంది. అయితే దావీదు అనుచరుల్లో ముగ్గురు యోధులు ఫిలీప్తీయుల భటుల్ని ఓడించి తమ యాజమానికి బేళ్లే హేము నీళ్ళను తెచ్చారు. ఆ నీళ్ళు దావీదు తాగలేదు. “నేను ఇది త్రాగను. ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారి చేతీనీళ్ళు త్రాగుదునా?” అన్నాడు. ఆ నీళ్ళను దేవునికి అర్పణగా గౌరవంగా పారబోశాడు. దావీదు యుద్ధాలు చేసిన శూరుడు. అతడి జీవితంలో ఎక్కువ భాగం దౌర్జన్య దృశ్యాల నడుమ సాగింది. అయినప్పటికి అలాంటి అనుభవాల వల్ల కఠినహృదయులు , నీతిబాహ్యులు కాని ఏ కొద్దిమందిలోనో దావీదు మొదటివాడని చెప్పాలి.PPTel 751.1

    దావీదు మేనళ్ళుడు అతని ప్రధానుల్లో మిక్కిలి సాహసవంతుడు అయిన అబీ షై షిమీ పలుకుతున్న నిందావాక్కుల్ని వినలేకపోయాడు. రాజుతో ఇలా అన్నాడు. ” ఈ చచ్చిన కుక్క నా యేలినవాడవు రాజవునగు నిన్ను శపింపనేల? నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చెదను”. అయితే అతనితో రాజు ఇలా అన్నాడు. “నా కడుపున పుట్టిన నాకుమారుడే నా ప్రాణము తీయుచు చున్నాడనగా ఈ బెన్యామినీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? వాని జోలి మానుడి. యెహోవా వానికి సెలవిచ్చియున్నాడు గనుక వానిని శపింపనియ్యుడి.. యెహెూవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలిఇకన శాపమునకు బదులుగా యెహెూవా నాకు మేలు చేయునేమో”.PPTel 751.2

    దావీదుకి తన మనస్సాక్షి కొన్ని చేదుసత్యాల్ని తనను కించపర్చే సత్యాల్ని వెల్లడిస్తుంది. తనపై విశ్వాసముంచిన తన ప్రజలు అతని గతి హఠాత్తుగా మారటానికి విస్మయం చెందుతుండగా రాజుకు మాత్రం అది ఎందుకు జరిగిందన్నది తెలియని ఇది కాదు. ఇలాంటి ఘడియ వస్తుందని తరుచు భయ పెడుతుండేవాడు. తన పాపాల విషయంలో దేవుడు చాలాకాలం సహనం పాటించి తనకు న్యాయంగా కలగవలసిన శిక్ష విధించటంలో జాప్యం చేసాడని అతడు గుర్తించాడు. ఇప్పుడు రాజు దుస్తులకు బదులు గోనెబట్టలు ధరించిన పాదరక్షలు లేని కాళ్ళతో దు:ఖిస్తూ పారిపోతున్న సమయంలో తన అనుచరుల విలాసాలు కొండల్లో ప్రతిధ్వనిస్తున్న తరుణంలో అతడు తన రాజధాని గురించి తలంచాడు. తన పాపం చోటు చేసుకున్న స్థలం గురించి తలంచాడు. దేవుని దయాళుత్వాన్ని, దీర్ఘశాంతాన్ని గురించి తలంచినప్పుడు దయతో వ్యవహరిస్తాడని నమ్మాడు.PPTel 751.3

    తప్పు చేస్తున్న చాలామంది వేలెత్తి దావీదు వంక చూపిస్తూ తమ పాపాన్ని సమర్ధించుకోవటానికి ప్రయత్నిస్తారు. కాని దావీదు కనపర్చి పశ్చాత్తాపం వినయ మనసు ఎంతమంది ప్రదిర్శిస్తారు. మందలింపును శిక్షను అతడు భరించినంత ఓర్పుతో స్థిరచిత్తంతో ఎందరు భరిస్తారు? అతడు తన పాపాన్ని ఒప్పుకొన్నాడు. దేవుని సేకువడిగా తన బాధ్యతను నమ్మకంగా నిర్వరిస్తూ అనేక సంవత్సరాలు కృషి చేసాడు. తన రాజ్య పటిష్టత కోసం పాడుపడ్డాడు. తన పరిపాలన కింద దేశం ముందెన్నడు లేనిరీతిలో బలపడి ప్రగతి సాధించింది. దేవుని మందిరాన్ని నిర్మించటానికి అత్యుత్తమ నిర్మాణ సామాగ్రి వస్తువులు సమకూర్చాడు. అయితే ఇప్పుడు తన జీవితకాలమంతా చేసిన శ్రమ నిరర్థకం కావలసిందేనా? సంవత్సరాలుగా సాగిన నమ్మకమైన కృషి ఫలం, భక్తి, రాజనీతిజ్ఞత దేవుని గౌరవం గాని ఇశ్రాయేలు ప్రజల ప్రగతినిగాని, ఏమి పట్టని దేశద్రోహి అయిన తనకుమారుడి చేతుల్లోకి వెళ్ళాల్సిందేనా? తానున్ను క్లిష్ట పరిస్థితుల్లో దావీదు దేవుని పై సణగటం ఎంత స్వాభావికంగా ఉండేది!PPTel 752.1

    కాగా తన పాపమే తన కష్టాలకు హేతువని దావీదు గుర్తించాడు. మీకా ప్రవక్త పలికిన మాటల స్ఫూర్తి దావీదు హృదయాన్ని ప్రభావితం చేసింది. “నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని గనుక ఆయన నాపక్షమున వ్యాజ్యెమాడి, నా పక్షమున న్యాయము తీర్చువరకునేను ఆయన కోపాగ్నిని సహింతును “. మీకా 7:8,9. ప్రభువు దావీదును విడనాడలేదు. దావీదు గొప్ప అన్యాయానికి అవమనానికి గురి అయిన తన అనుబవంలోని ఈ అధ్యాయనంలో సాత్వికుడుగా, స్వార్థరహితుడుగా, ఔదార్యం గలవాడుగా, వినయ మనస్కుడుగా తన్ను ఆను కనపర్చకున్నాడు. అతని అనుభవమంతటిలోను ఇది మిక్కిలి ఉదాత్తమైన ఘట్టం. తనకు జరిగిన తీవ్ర బహిరంగ అవమానాన్ని భరించిన దావీదు దేవుని దృష్టిలో ఎదిగినంత ఉన్నతంగా మరే ఇశ్రాయేలు రాజు ఎదగలేదు.PPTel 752.2

    దేవుడు దావీదుని మందలించకుండా పాపంలో కొనసాగినిస్తూ శాంతి సౌభాగ్యాలతో తుదూగనిస్తూ రాజ్యపాలన చేయనిస్తూ ఉంటే దావీదు చరిత్రను అవిశ్వాసులు నాస్తికులు బైబిలు మతానికి నింద ఆపాదించే రీతిగా ప్రస్తావించటానికి సాకు దొరికి ఉండేది. కాని దావీదుకి ఆయన ఇచ్చిన అనుభవం ద్వారా తనకు పాపమంటే కిట్టదని పాపాన్ని చూసి చూడనట్లు పోనివ్వమని ప్రభువు వ్యక్తం చేస్తున్నాడు. పాపం విషయంలో దేవుడు వ్యవహరించిన తీరులో ఆయనకున్న గొప్ప లక్ష్యాన్ని చూడటానికి దావీదు చరిత్ర మనకు తోడ్పడుతుంది. భయంకరమైన తీర్పుల్లో సయితం కృపకనికరాల్తో కూడిన ఆయన ఉద్దేశాల కార్యాచరణను గుర్తించటానికి అది మనకు తోడ్పడుతుంది. దావీదుని దండనకు గురి చేసాడే గాని నాశనం చెయ్యలేదు. కొలిమి ఉన్నది శుద్ధిపర్చటానికేగాని నాశనం చెయ్యటానికి కాదు. ప్రభువిలా సెలవిస్తున్నాడు. “వారు నా కట్టడలను అపవిత్ర పరిచే నా ఆజ్ఞలను గైకొనని యెడల నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమునకు దెబ్బలతోను వారిని శిక్షించెదను. కాని నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను. అబద్ధికుడైన నా విశ్వాస్యతను విడవును”). కీర్తనలు 89:31-33PPTel 753.1

    దావీదు యెరూషలేమును వదలి పెట్టి వెళ్ళిన వెంటనే అబ్బాలోము, అతడి సైన్యం యెరూషలేములో ప్రవేశించి ప్రతిఘటన లేకుండా ఇశ్రాయేలు కోటను స్వాధీనపర్చుకున్నారు. కొత్త రాజును అభినందించిన వారిలో హుషై మొదటివాడు. తన తండ్రి పాత స్నేహితుడు సలహాదారు అయిన హూ షైని కలుసుకోవటం ఆశ్చర్యం వేసినా అతణ్ణి తన పక్క చేర్చుకోవటానికి సంతోషించాడు. రాజు విషయం తనదేనని అబాలోము విశ్వసించాడు. ఇంతవరకు అతడి పాచికలు పారాయి, సింహాసనాన్ని పదలిపర్చుకొని ప్రజల అభిమనాన్ని చూరగొనాలన్న ఆకాంక్షతో అబాలోము హుషైని తన అస్థానానికి స్వాగతించాడు.PPTel 753.2

    ఇప్పుడు అబాలోము చుట్టూ పెద్ద జన సమూహం ఉంది. కాని వారంతా యుద్దానికి శిక్షణ పొందని ప్రజలు, వారు ఇంకా యుద్ధాన్ని ఎదుర్కొన్నవారు కాదు. దావీదు పరిస్థితి ఏమంత నిరాశజనకం కాదని అహీతో పెలుకి తెలుసు. దేశంలో ఎక్కువ మంది దావీదుకి నమ్మకంగా నిలిచి ఉన్నారు. అతని చుట్టు ఉన్నవారు రాటు దేలిన యుద్ధవీరులు. వారు రాజుకి నమ్మకంగా ఉన్న వ్యక్తులు. అతని సేనాపతులుఅనుభవం సామర్థ్యం గల నాయకులు. కొత్త రాజుకి అనుకూలంగా పెల్లుబికిన ఉత్సాహం చప్పబడ్డ తర్వాత ప్రతికూలత తలెత్తుతుందని అహీతో పెలుకి తెలుసు. తిరుగుబాటు విఫలమైతే అబాలోము తండ్రితో రాజీపడవచ్చు అప్పుడు అబాలోము ప్రధాన సైనికాధికారిగా ఆహీతో పెలుని ఆ తిరుగు బాటుకి బాధ్యుడుగా పరిగణించం జరుగుతుంది. అతడిపై కఠినమైన శిక్ష పడుతుంది. తిరుగుబాటు విషయంలో అబాలోముని వెనుకంజ వేయకుండా ఉంచేందుకు అహీతో పెలు అతణ్ణి ఒక నీచ కార్యాన్ని ప్రోత్సాహించాడు. జాతి దృష్టలో అది రాజీకి అవకాశం లేకుండా చేసే క్రియ. నీతి నియమాలు లేని ఈ రాజనీతిజ్ఞుడు అబ్లాలోముని తన తిరుగుబాటు నేరంతో పాటు వ్యభిచార నేరం మూటకట్టుకోవటానికి ప్రేరేపించాడు. ఇశ్రాయేలీయులందరి సమక్షంలోను అతడు తన తండ్రి ఉపపత్నుల్ని తీసుకోవాలన్నది అహీతో పెలు సలహా. అది తూర్పుదేశాల అచారమని తండ్రి సింహాసనానికి తాను రావటాన్ని అది సూచిస్తుందని అబాలోముకి చెప్పాడు. నీచమన ఆ సలహాను ఆబాలోము పాటించాడు. “నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును; నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలీయులందరు చూచుచుండగా పగటియందే నేను చెప్పిన దానిని చేయుంతును” (2 సమూయేలు 12:11, 12) అని తన ప్రవక్త నోట దేవుడు దావీదుకు చెప్పిన మాట ఇలా నెరవేరింది. ఈ నికృష్ట కార్యాల్ని దేవుడు ప్రోత్సహించలేదు. కాని దావీదు చేసిన పాపం కారణంగా ఈ అకార్యాలు జరగకుండా అడ్డుకోవటానికి దేవుడు తన శక్తిని ఉపయోగించలేదు.PPTel 753.3

    తన జ్ఞాన వివేకాల విషయంలో ప్రజలు అహీతో పెలుని ఎంతో గౌరవించారు. కాని అతడికి దేవుని గూర్చిన జ్ఞానం లేదు. ” యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము”. (సామెతలు 9:10) ఈ జ్ఞానం అహీతో పెలులో కొరవడింది. అందుకే అతడు తన రాజద్రోహ చర్య విజయానికి వ్యభిచారం మీద ఆధారపడ్డాడు. తమ దురాగతాల్ని రద్దుపర్చే దైవశక్తి లేదన్నట్లు దుష్టులు తమ దుర్మార్గతను సాగించటానికి వ్యూహ రచన చేసుకుంటారు. అయితే “ఆకాశమందు ఆసీనడుగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అసహ్యించు చున్నాడు” కీర్తనలు 2:4 ప్రభువిలా అంటున్నాడు : “నా ఆలోచన విననొల్లక పోయిరి. నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభవించెదరు. తమకు వెక్కసమగువరకు తమ ఆలోచనలను అనుసరించెదురు. జ్ఞాపకము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు”. సామెతలు 1:30-32 PPTel 754.1

    తన సొంతక్షేమం నిమిత్తం చేసిన కుట్ర విషయంలో విజయ సాధించక దావీదు పై వెంటనే దాడి చేయాల్సిందిగా అబ్బాలోముని అహీతో పెలు ప్రోత్సహించాడు. “దావీదు అలసటనొంది బలహీనముగానున్నాడు. గనుక - నేను అతని మీద పడి అతని బెదిరించిన యెడల అతని యొద్దనున్న జనులందరు పారిపోదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరిని నీ తట్టు త్రిప్పెదును. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరు వచ్చి నీతో సమాధానపడుదురు గనుక నీ చిత్తమైతే నేను పండ్రెండు వేలమందిని ఏర్పరచుకొని పోయి ఈరాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతో పెలు అబ్బాలోముతో చెప్పాడు. ఈ ప్రణాళికను రాజు సలహాదార్లు ఆమోదించారు. దీన్ని ఆచరణలో పెట్టి ఉంటే దేవుడు ప్రత్యక్షముగా కలుగజేసుకొని దావీదుని రక్షించి ఉంటే తప్ప దావీదు హత్యకు గురి అయి ఉండేవాడు. కాగా ఆహీతో పెలు కన్నా వివేకమంతుడు సంఘటనల్ని నియంత్రిస్తూ ఉన్నాడు. ” యెహోవా అబ్బాలో ముమీదికి ఉరపద్రవము రప్పింగలందులకై అహీతో పెలు చెప్పిన యుక్తి గల ఆలోచనను వ్యర్థముచేయు నిశ్చయించియుండెను హూ పైని ఆ సమావేశానికి పిలువలేదు. PPTel 754.2

    హూ పై కూడా అక్కడికి వెళ్ళలేదు. అలా వెళ్తే అతణ్ని గూఢాచారిగా భావించవచ్చుననుకొన్నాడు. కాని ఆ సమావేశం ముగిసిన తరువాత తన తండ్రి సలహాదారుడైన హు పై పై గౌరవమున్న అబాలోము అతనికి అహీతో పెలు ప్రతిపాదించిన ప్రణాళికను వివరించాడు. అహీతో పెలు ప్రతిపాదించిన ప్రణాళిక అమలైతే దావీదు మరణించటం ఖాయమని హూ పై గ్రహించాడు. అతడు ఇలా అన్నాడు. “అహీతో పెలు చెప్పిన ఆలోచన మంచిదికాదు. నీ తండ్రియు అతని పక్షముననున్నవారందరు మహా బలాఢ్యులనియు, అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన యెలుగుబంట్ల వంటివారై రేగిన మనస్సుతో ఉన్నారనియు నీకు తెలియును. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు. అతడు జనులతో కూడా బస చేయడు. అతడేదోయెక గుహయందో మరి ఏ స్థలమందో దాగియుండును”. అబ్బాలోము సేనలు దావీదుని తరిమినా వారు రాజును పట్టుకోవటం ఆసాధ్యమని వాదించాను. వారు గనుక ఓడిపోవటం జరిగితే అది వారిని నిరుత్సాహ పర్చి తనకు గొప్ప నష్టం కలిగిస్తుందని, “నీ తండ్రి మహా బలాఢ్యునియు, అతని పక్షపువారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలీయులందరును ఎరుగుదురు” అని అబాలోముతో అన్నాడు. డంబం, స్వార్ధ్యం అధికార దర్పం గల స్వభావానికి నచ్చే ఒక ప్రణాళిక హూ షై అబాలోముకి ప్రతిపాదించాడు. “కాబట్టి నా ఆలోచనయేమనగా, దాననుండి బెయేరైబా వరకు లెక్కకు సముద్రపు ఇసు రేణువులంత విస్తారముగా ఇశ్రాయేలీయులందరి నలుదిశల నుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలెను. అప్పుడు మనము అతడు కనబడిన స్థలములోల ఏదో యొకదాని యందు అతని మీద పడుదుము. నేల మీద మంచురీతిగా మనము అతని మీదికి వచ్చిన యెడల అతని పక్షపువారిలో ఒకడును తప్పించుకొనజాలడు. అతడు ఒక పట్టణములో చొచ్చిన యెడల ఇశ్రాయేలీయులందరును ఆ పట్టణమును త్రాళ్ళు తీసుకొని వచ్చి యొక చిన్నరాయి అచ్చట కనబడకుండదానిని నదిలోనికి లాగుదురు”.PPTel 755.1

    “అబ్బాలోమును ఇశ్రాయేలీయేలందరును ఈ మాటవిని అర్కియుడగు హూ పై చెప్పిన ఆలోచన అహీతో పెలు చెప్పినదానికంటే యుక్తమని యెప్పుకొనిరి”. అయితే మోసపోని వాడొకడున్నాడు. అబాలోము చేస్తున్న ఘోర తప్పిదం పర్యవసానాన్ని స్పష్టంగా చూడగలిగిన వ్యక్తి అతడు.తిరుగుబాటుదారుల ఉద్యమం ఊపిరి పోయిందని అహీతో పెలుకి అర్ధమయ్యింది. యువరాజు మాటెలాగున్నా అతి నీచమైన నేరాల్ని ప్రోత్సహించిన సలహాదారులయిన తనకు మాత్రం భవిష్యత్తు లేదని అహీతో పెలు పసికట్టాడు. అబాలోముని తిరుగుబాటుకి ప్రోత్సహించింది. అహీతో పెలు. తండ్రిని అపకీర్తి పాలుజేసే మిక్కిలి హేయకృత్యాలు చేయటానికి అబాలోమని పురిగొల్పింది అతడే. దావీదుని చంపమని సలహా చెప్పాడు. ఆ హత్యకు అతడే వ్యూహరచన చేసాడు. రాజుతో అబ్బాలోము సయోధ్యకు అవకాశం ఏమి లేకుండా చేశాడు. ఇప్పుడు తనకు గాన వేరొకరికి ఆమోదం లభిస్తున్నది. ఆబాలోము సయితం తననుగాక వేరొకరిని అభిమానిస్తున్నాడు. అతడి హృదయం అసూయ, క్రోధం, తెగింపుతో నిండినది. అహీతో పెలు “తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయెను”. గొప్ప ప్రతిభ పాటవాలు న్నప్పటికినీ దేవుని యందు భయభక్తులు లేని వ్యక్తి వి వేకం ఫలితం అలానే ఉంటుంది. కల్లబొల్లి వాగ్దానాలతో సాతాను మనుషుల్ని ఆకట్టుకొంటాడు. చివరికి ప్రతివారికి “పాపము వలన వచ్చు జీతము మరణము” అని తెలిసొస్తుంది. రోమా 6:23 PPTel 756.1

    తానిచ్చిన సలహాను చపలచిత్తుడైన రాజు పాటిస్తాడో లేదా హూ పైకి నిర్దిష్టంగా తెలియరాలేదు. కనుక జాప్యం చేయకుండా దావీదు యోధానుదాటి తప్పించుకు పోవలసినదిగా హెచ్చరించాడు. తమ కుమారుల ద్వారా ఆ వార్తను దావీదుకి అందించాల్సి ఉన్న యాజకులికి “అబ్బాలో మునకు ఇశ్రాయేలీయుల వారి పెద్దలందరికిని అహీతో పెలు చెప్పిన ఆలోచనలను తాను చెప్పిన ఆలోచను తెలియజెప్పి మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరుదాటు స్థలములలో ఉండవద్ద నియు, రాజును అతని సమక్షమందున్న జనులందరును నశింపకుండునట్లు శీఘ్రముగా వెళ్ళిపోవుడనియు” హుణ్ణి వర్తమానం పంపాడు.PPTel 756.2

    ఆ యువకుల్ని అనుమానించి వెంబడించారు. అబాలోము మనుషులు, అయినా వారు తమ ప్రమాద భరిత కర్తవ్యాన్ని నెరవేర్చారు. మొదటి రోజు ప్రయనం అనంతరము దావీదు శ్రమకు, దు:ఖానికి గురి అయ్యాడు. అప్పుడు తనకుమారుడు తనను చంపజూస్తున్నాడని కనుక రాత్రికి రాత్రే తాను యోర్దాను దాటి వెళ్ళిపోవాలని దావీదుకి వర్తమానం వచ్చింది.PPTel 757.1

    తీరని అన్యాయానికి గురి అయి ప్రమాదకర పరిస్థితిలో ఉన్న తండ్రి,, రాజు మనోభావాలు ఎలాగున్నాయి? “మహాబలాఢ్యుడు” యుద్ధములో ప్రవీణుడు, తన మాటే చట్టంగా చెలామణి అయిన రాజు, తాను అమితంగా ప్రేమించి ఎంతగానో నమ్మిన కొడుకు చేతిలో వంచితుడై, తన పాలిత ప్రజలచే విసర్జితుడై ఉన్న దావీదు తన హృదయంలోని ఆవేదనను ఏ మాటల్లో వ్యక్తం చేశాడు? తనకు కలిగిన భీకర శ్రమల్లో దావీదు హృదయం దేవుని పై అచంచలంగా నిలిచి ఉంది. అతడు ఇలాగానం చేశాడు :PPTel 757.2

    “యోహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి
    యున్నారు.
    నా మీదికి లేచువారు అనేకులు
    దేవుని వలన అతనికి రక్షణ యేమియు దొరకదని
    నన్ను గూర్చి చెప్పువారు అనేకులు
    యెహోవా, నీవే నాకు కేడెము గాను
    నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తు
    వాడవుగాను ఉన్నావు.
    ఎలుగెత్తి నేను యెహోవాకు నాకు మొఱ్ఱ పెట్టినప్పుడు
    ఆయన తన పరిశుద్ధ పర్వతముల నుండి నాకుత్తరమిచ్చును
    యెహోవా నాకు ఆధారము
    కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మెహ
    రించినను
    నేను భయపడును
    యెహోవా, లెమ్ము నాదేవా నన్ను రక్షింపుము
    నా శత్రవులందరిని దవడ యెముకమీద కొట్టు
    వాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవు
    నీవే
    రక్షణ యెహోవాది
    నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక ”

    కీర్తన 3:1-8

    దావీదు అతనితో ఉన్న జనులందరు - యుద్ధ శూరులు, రాజనీతిజ్ఞులు, వృద్ధులు యువత, మహిళలు, చిన్నారులు - రాత్రి చీకటి మాటున వడిగా ప్రవహించే ఆ నదిని దాటారు. “తెల్లవారునప్పటికి నది దాటకయుండినవాడు ఒకడును లేకపోయెను”.PPTel 758.1

    దావీదు అతని సేనలు ఇష్బో షెతు ఆస్థానమైన మహానయీముకు వచ్చారు. ఇది చాలా బలమైన పట్టం. ఇది కొండ ప్రదేశపు జిల్లా నడుమ బలమైన పట్టణం. యుద్ధ సమయాల్లో ఈ పట్టణం చక్కని మదుగుగా ఉపయోగపడేది. ఈ ప్రదేశంలో ఆహారానికి కొరతలేదు. అక్కడి ప్రజలు దావీదు పట్ల సుముఖంగా ఉన్నారు. చాలామంది దావీదుకి మద్దుతు పలికి అతని పక్కనిలిచారు. ధనికులైన కొండజాతి ప్రజలు దావీదుకి అతని అనుచరులకు అవసరమైన ఆహార పదార్ధాలు సరఫరా చేశారు. PPTel 758.2

    హూ షై సలహా దాని ఉద్దేశాన్ని సాధించింది. దావీదు తప్పించు కోవటానికి అది దోహదపడింది. కాగా దుడుకుతనం కాస్త ఎక్కువగా ఉన్న యువరాజుని ఎక్కువ కాలం అదుపు చేయటం కష్టమయ్యింది. కొద్దికాలంలోనే తండ్రిని పట్టుకోవటానికి బయలుదేరాడు. “అబాలోమును ఇశ్రాయేలీయులందరును యోర్దాను నది దాటి వచ్చిరి”. అబాలోము దావీదు సహోదరి అబీగయీలు కుమారుడు ఆమాశాను తన సేనలకు సేనాధిపతిగా నియమించాడు. అబాలోము సైన్యం పెద్దది కాని అది క్రమశిక్షణ లేని సైన్యం. కాకలు తీరిన తన తండ్రి సైనికులకు వారు సాటికానే కారు.PPTel 758.3

    దావీదు తన సైన్యాన్ని మూడు దండులుగా విభజించి యోవాబు, అబీ షై గిత్తీయుడైన ఇత్తయిలను వాటికి అధిపతులుగా నియమించాడు. యుద్ధరంగంలో తానే తన సైన్యానికి నాయకత్వం వహించాలని దవీదు సంకల్పించగా దానికి సైనాధికారులు, తన సలహాదారులు ప్రజలు తీవ్ర అభ్యంతరము తెలిపారు. “నీవు రాకూడదు. మేము పారిపోయినను జనులు దానిని లక్ష్య పెట్టరు. మా వంటి పదివేలమందితో నీవు సాటి. కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయము చేయవలెను” అన్నారు. 2 సమూ 18:3,4PPTel 759.1

    పట్టణం గోడల మీద నుంచి చూస్తుంటే తిరుగుబాటు సైన్యం బారులు తీరి నిలబడి ఉండటం కనిపిస్తుంది. అపహర్త చుట్టు ప్రజలు పెద్ద సంఖ్యలో ఉండగా దావీదు చుట్టు ఉన్నవారు బహుకొద్దిమంది మాత్రమే. తనకు వ్యతిరేకంగా నిలిచిన బలగాల్ని రాజు చూసినప్పుడు అతని ఆలోచన తన కిరిటీన్ని గురించి రాజ్యాన్ని గురించి కాదు. తన ప్రాణం గురించి కూడా కాదు. ఆ తండ్రి హృదయం తిరుగుబాటు చేస్తున్న తన కుమారుడిపై ప్రేమతోను కనికరంతోను నిండింది. శూన్యం ఆ పట్టణ ద్వారాల్లో నుంచి బయటికి వెళ్తుండగా తన సైనికుల్ని దేవుని పై నమ్మకముంచి ముందుకు వెళ్ళమని ఇశ్రాయేలు దేవుడు తమకు విజయం చేకూర్చుతాడని దావీదు ఉత్సాహపర్చాడు. ఇక్కడ కూడా కుమారుడు అబ్లాలోముపట్ల తనకున్న ప్రేమను అణచుకోలేకపోయాడు. మొదటి దండును ఆజ్ఞాపిస్తూ ముందు యోవాబు రాజున్న స్థలానికి వచ్చినప్పుడు వంద యుద్దాలు గెల్చిన ఆ సేనాని రాజు చివరి వర్తమానం వినటానికి వంగి చెవి ఒగ్గగా వణుకుతున్న స్వరంతో రాజిలా అన్నాడు. “నానిమిత్తమై యౌవనుడైన అబ్లాలోమునకు దయచూపుడి” అబీ షైకి, ఇత్తయికి కూడా “నా నిమిత్తమై యౌవనుడైన అబ్బాలోమునకు దయచూపుడి” అన్న విజ్ఞప్తి చేసేవాడురాజు తన రాజ్యం కన్నా తనకు తన కుమారుడే ప్రధానమన్న అభిప్రాయాన్ని వ్యక్తపర్చే ఆ అందోళన అస్వాభావికమైన ఆకుమారుడి పట్ల సైనికులకు అగ్రహం పుట్టించింది.PPTel 759.2

    యుద్ధరంగం యోర్దాను సమీపంలో ఉన్న ఒక అడవి.అధిక సంఖ్యలో ఉన్న అబ్బాలోము బలగాలకు ఆ స్థలం ఏమంత అనుకూలంగా లేదు. క్రమశిక్షణ లేని అతడి సేనలు అడవిలోని పొదలు బండ స్థలాల్లో పడి తబ్బిబ్బయి అదుపు తప్పాయి.PPTel 759.3

    “ఇశ్రాయేలు వారు దావీదు సేనల యెదుట విలువ లేక ఓడిపోయిరి. ఆ దినమున ఇరువది వేల మంది అక్కడ హతులైరి. అది తనకు కలసి రాని దినమని గ్రహించిన అబ్బాలోము తప్పించుకు పారిపోవటానికి ప్రయత్నిస్తుండగా బాగా విస్తరించిన కొమ్మలు గల ఒక చెట్టు కొమ్మల్లో అతడి తల చిక్కుకుంది. అతడెక్కిన గాడిద నిలవకుండా వెళ్లిపోగా అబ్లాలోము నిస్సందేహంగా ఆ కొమ్మల్లో నుంచి వేలాడుతున్న శత్రువుల వేటుకు అనువుగా ఉన్నాడు. ఈ స్థితిలో ఉన్న అతణ్ణి ఒక సైనికుడు చూసి దావీదు ఆగ్రహానికి భయపడి ఏమి చెయ్యకుండా ఆ విషయాన్ని యోవాబుకి నివేదించాడు. యోవాబుకి ఎలాంటి నియమాలు అడ్డురాలేదు. యోవాబు ఎంతో శ్రమపడి అబ్బాలోము దావీదుల మధ్య రెండుసార్లు సయోధ్య కుదిర్చాడు. రెండుసార్లు దాన్ని భగ్నం చేసింది. అబ్బాలోమే, యోవాబు చేసిన విజ్ఞాపన మూలంగా తాను పొందిన ఉపకారాల్ని బట్టే ఆబాలోము ఘోరకలికి కారణమైన ఈ తిరుగుబాటుకి పూనుకున్నాడు. అది లేకపోతే ఈ ఘోరం జరిగేది కాదు. ఇప్పుడు ఈ దుర్మార్గం అంతటికి కారకుడైన అబ్బాలోమును ఒక వేటుతో నాశనం చేసే శక్తి యోవాబు చేతిలో ఉంది. అతడు “మూడు బాణములు చేత పట్టుకొనిపోయి.... అబాలోము యొక్క గుండెకు గురి పెట్టి... అబ్బాలోమును కొట్టి చం పెను... జనులు అబాలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గొతిలో పడవేసి పెద్ద రాళ్ళకుప్ప” దాని మీద పేర్చారు. PPTel 759.4

    ఇశ్రాయేలు దేశంలో తిరుగుబాటుకు కారకులైన కుట్రదారులు ఈరకంగా నిర్మూలమయ్యారు. అహీతో పెలు తన ప్రాణాలు తానే తీసుకున్నాడు. సౌందర్యములో ఇశ్రాయేలుకి గర్వకారణమైన యువరాజు అబాలోము తన యౌవన బలంతో ఉన్నప్పుడే హతమయ్యాడు. అతడి కళేబరాన్ని ఒక గోతిలో పడేసి దాని మీద పెద్ద రాళ్ళ కుప్ప పేర్చారు. అది అతడి నిత్య అవమనానికి చిహ్నంగా నిలిచింది. తాను బతికి ఉన్నంతకాలములో రాజుగా గొప్ప కీర్తీ గడించాలని అబాలోము అశించాడు. కాని తన జ్ఞాపకార్ధంగా తన సమాధి పై నిలిచిన స్మృతి చిహ్నం అరణ్యంలో ఒక రాళ్ళకుప్ప మాత్రమే.PPTel 760.1

    తిరుగుబాటు నాయకుడు మరణించడంతో పారిపోతున్న జనాల్ని తరుముతున్న తన సేనను బూర ద్వనితో ఆపు చేసి కుమారుడి మరణవార్తను రాజుకి అందించే ఏర్పాట్లు చేసాడు యోవాబు.PPTel 760.2

    పట్టణ ప్రాకరం మీద నిలిచి పహారా కాస్తున్న కావలివాడు రణరంగం వైపు పారజూస్తూ ఒక వ్యక్తి ఒంటరిగా పరుగెత్తికుంటూ రావటం చూసాడు. కొద్ది సేపటిలో రెండో వ్యక్తిని కూడా చూశాడు. మొదటివాడు దగ్గరకు వచ్చినప్పుడు గుమ్మంపక్క వేచి ఉన్న రాజుతో ఆ కావలివాడు ఇలా అన్నాడు. “వాడు సాదోకు కుమారుడైన అహిమయస్సు అని నాకు తోచుచున్నది అనినప్పుడు రాజు - వాడు మంచివాడు శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పెను. అహిమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారము చేసి - నా యేలినవాడవును రాజునగునిన్ను చంపచూచినవారిని అప్పగించమని నీ దేవుడైన యెహెూవాకు స్తోత్రము అని చెప్పెను.” “బాలుడగు అబాలోము క్షేమముగా ఉన్నాడా”? అన్న రాజు ప్రశ్నకు అహిమయస్సు సమాధానం దాటవేశారు.PPTel 760.3

    రెండో వార్తాహరుడు ఇలా కేకలు వేస్తూ వచ్చాడు. “నా యేలినవాడా రాజా, నేను నీకు శుభ సమాచారము తెచ్చితిని; యీ దినమున యెహోవా నీ మీదికి వచ్చిన వారందరిని ఓడించి నీకు న్యాయము తీర్చెను. మళ్ళీ ఆ తండ్రి “బాలుడగు అబాలోము క్షేమముగా ఉన్నాడా? అని ప్రశ్నించాడు. ఆ భయంకర వార్తను దాచలేక వార్తాహరుడు ఇలా బదులు పలికాడు. “నా యేలినవాడవును రాజవునగు నీ శత్రువులును నీకు హానీ చేయవలెనని నీ మీదికి వచ్చిన వారందరును ఆ బాలుడున్నట్లుగానే యుందురుగాక”. విషయం అర్థమయ్యింది. దావీదు ఇక ప్రశ్నించలేదు. రాజు తలవంచుకొని “గుమ్మమునకు పైగా నున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు, సంచరించుచు - నాకుమారుడా అబ్బాలోమా, నా కుమారుడా అబ్బాలోనూ, అని కేకలు వేయుచు, ఆయ్యో నాకుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన యెడల ఎంత బాగుండును. నాకుమారుడా అబ్బాలోనూ నాకుమారుడా అని యేడ్చుచు వచ్చెను”.PPTel 761.1

    విజయం సాధించి యుద్ధ భూమి నుండి తిరిగి వస్తున్న సైన్యం నగరాన్ని సమీపించినప్పుడు వారి విజయ ధ్యానాలతో పరిసరాల్లోని కొండలు మారుమోగాయి. కాని వారు నగర ద్వారంలో అడుగు పెట్టినప్పుడు చేతుల్లోని వారిధ్వజాలు కిందికి దిగిపోయాయి. విజయం సాధించిన వారిలా గాక యుద్ధంలో ఓడిపోయిన వారిలా వారు కింది చూపు చూస్తు వెళ్ళారు. వారికి స్వాగతం పలకటానికి నీరిక్షిస్తున్న రాజు లేడు. గుమ్మం పై ఉన్న గదిలో నుంచి “నాకుమారుడా అబాలోమా! నాకమారుడా, అబ్బాలోమా అని కేకలు వేయుచు, అయ్యో నాకుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన యెడల ఎంత బాగుండును నాకుమారుడా అబ్బాలోమా! నా కుమారుడా! అని రాజు ఎడ్వటం వినిపించింది.PPTel 761.2

    “రాజు కుమారుని గూర్చి దు:ఖించుచు ఏడ్చుచున్నాడనను సంగతి ఆ దినమున జనులందరును విని యుద్దమందు సిగ్గుతో పారిపోయిన జనులవలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణములో ప్రవేశించిరి”.PPTel 761.3

    యోవాబుకి పట్టజాలనంత కోపం వచ్చింది. తమ విజయానికి ఆనందోత్సాహానికి దేవుడు వారికి హేతువు నిచ్చాడు. ఇశ్రాయేలు చరిత్రలో అతి పెద్ద తిరుగుబాటును అణిచివేయటం జరిగింది. అయినా ఆనాటి విజయం ఎవరి నేరం వేలాది శూరుల్ని బలిగొన్నదే ఆ అబాలోము కోసం సంతాప సమయంగా మారింది. కటువుగా, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే సైన్యాధిపతి యోవాబు ధైర్యంగా రాజు సముఖంలోకి వెళ్ళి ఇలా అన్నాడు. “నీ ప్రాణమును నీకుమారుల ప్రాణములను నీకుమార్తెల ప్రాణములను ... ఈ దినమున రక్షించిన నీ సేవకులందరిని నేడు సిగ్గుపర్చి నీ స్నేహితుల యెడల ప్రేమ చూపక నీ శత్రువుల యెడల ప్రేమ చూపుచు, ఈ దినమున అధిపతులును సేవకులును నీకు ఇష్టజనము కారని నీవు కనపర్చితివి. మేమందరము చనిపోయి అబాలోము బ్రదికి యుండిన యెడల అది నీకు ఇష్ట మగునన్నమాట యీ దినమున నేను తెలిసికొనుచున్నాను. ఇప్పుడు లేచి బయటికి వచ్చి నీ సేవకులను ధైర్యపర్చుము. నీవు బయటికి రాకయుండిన యెడల ఈ రాత్రి యొకడును నీ యొద్ద నిలువడని యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసిచెప్పుచున్నాను. నీ బాల్యము నుండి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటే అది నీకు కష్టతరముగా ఉండును”.PPTel 762.1

    హృదయ వేదనలో మునిగివున్న రాజుకి ఈ మందలిపు కటువుగా, నిర్దయగా ఉన్నా దావీదు దాన్ని తృణీకరించలేదు. సేనాధిపతి చెప్పింది. వాస్తవమేనని గుర్తించిన రాజు కిందకి దిగి గుమ్మం వద్దకు వెళ్ళి కవాతు చేసుకుంటూ తన ముందు నుంచి వెళ్తున్న సైనికుల్ని ఉద్రేకపర్చి ప్రశంసిసంచాడు.PPTel 762.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents