Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    65—దావీదు ఔదార్యం

    సౌలు ప్రభువు యాజకుల్ని చిత్రవధ చేసిన తర్వాత ‘అహీటూబు కుమారుడైన అహీమెలకు కుమారులలో అబ్యాతారు అనునొకడు తప్పించుకొని పారిపోయి దావీదు నొద్దకు వచ్చి సౌలు యోహోవా యాజకులను చంపిన సంగతి దావీదుకు తెలియజేయగా దావీదు- ఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడున్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేననుకొంటిని. నీ తండ్రి యింటివారందరికి మరణము రప్పించుటకు నేను కారకుడనైతినిగదా. నీవు భయపడకు నా యొద్దనుండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉందువు. నా ప్రాణము తీయచూచు వాడును నీ ప్రాణము తీయచూచు వాడును ఒకడే అని అబ్యాతారుతో చెప్పెను’.PPTel 668.1

    రాజు ఇంకా తరుముతూనే ఉన్న దావీదుకి విశ్రాంతిగాని భద్రతగాని లేవు. దావీదు సాహస అనుచర ధళం ఫిలిప్తీయుల ముట్టడినుంచి కెయిలా పట్టణాన్ని కాపాడింది. కాగా తాము కాపాడిన ప్రజల మధ్య కూడా వారికి భద్రత లేదు. కెయిలానుంచి వారు జీవు అరణ్యానికి వెళ్ళారు. PPTel 668.2

    తన మార్గంలో ఉత్సాహం ఉద్రేకం కూర్చే తరుణాలు ఎక్కువలేని సమయంలో తాను ఆశ్రయం పొందుతున్న స్థలం తెలుసుకొని తనను సందర్శించ టానికి యోనాతాను రావటం దావీదుకి అమితానందాన్ని కలిగించింది. ఈ మిత్రులిద్దరూ పరస్పర సహవాసంలో గడిపిన ఘడియలు ఎంతో ప్రశస్తమైనవి. తమకు కలిగిన ఆయా అనుభవాల్ని వారు ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు. యోనాతాను ఈ మాటలతో దావీదుని ఉద్రే కపర్చాడు.“నా తండ్రి యైన సౌలు నిన్ను పట్టుకొనజాలడు నీవు భయపడవద్దు. నీవు ఇశ్రాయేలీయులకు రాజవగుదువు. నేన నీకు సహకారినౌదును ఇది నా తండ్రియైన సౌలునకు తెలిసియున్నది”. దేవుడు దావీదుతో వ్యవహరించిన ఆశ్చర్యకరమైన రీతిని గురించి వారు ప్రస్తావించుకొన్నప్పుడు వేట జంతువులా పలాయితుడవుతున్న దావీదు ఎంతో ఉత్సాహభరితుడయ్యాడు. “వీరిద్దరు యోహోవా సన్నిధిని నిబంధన చేసుకొనిన తరువాత దావీదు వనములో నిలిచెను. యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళెను”.PPTel 668.3

    యోనాతాను సందర్శనాంతరం సితార వాయించుకొంటూ స్తుతిగానం చేస్తూ దావీదు ఉద్రేకం ఉత్సాహం నింపుకొన్నాడు.PPTel 669.1

    ” యోహోవా శరణుజొచ్చియున్నాను
    పక్షివలె నీ కొండకు పారిపొమ్ము
    అని మీరు నాతో చెప్పుట యేల?
    దుష్టులు విల్లెక్కు పెట్టియున్నారు
    చీకటిలో యధార్ధ హృదయుల మీద వేయుటకై
    తమ బాణములు నారియందు సంధించియున్నారు
    పునాదులు పాడైపోగా
    నీతిమంతులేమి చేయగలరు?
    యోహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు
    యోహోవా సింహాసనము ఆకాశమందున్నది
    ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు
    యోహోవా నీతిమంతులను పరిశీలించును
    దుష్టులను బలాత్కారాసక్తులును ఆయనకు
    PPTel 669.2

    అసహ్యులు” కీర్తనలు 11:1-5

    కెయిలానుంచి వెళ్ళి దావీదు ఏ ప్రజల అరణ్య ప్రాంతములో ప్రవేశించాడో ఆ జీబీయులు దావీదు దాగి ఉన్న తావు తమకు తెలుసనీ తాము అతడి విడిది స్థలానికి తనను నడిపిస్తామని గిబియాలో ఉన్న సౌలుకు కబురు పంపారు. అయితే వారి దురద్దేశం గురించి హెచ్చరిక పొందిన దావీదు తన ఆశ్రయ స్థలాన్ని మార్చి అరణ్యానికి మృత సముద్రానికి మధ్య వున్న పర్వతాల్లో ఆశ్రయం పొందాడు.PPTel 669.3

    మళ్ళీ సౌలుకి ఈ వర్తమానం వచ్చింది. “దావీదు ఏనెదీ అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి మూడు వేలమందిని ఏర్పర్చుకొని వచ్చి, కొండమేకలకు వాసములగు శిలా పర్వతముల మీద దావీదును అతని జనులను వెదకుటకై బయలుదేరెను”. దావీదు దళంలో అరువందల మంది మాత్రమే ఉండగా వారి పైకి సౌలు మూడువేల మంది సైనికులతో దండెత్తి వస్తున్నాడు. దేవుని నడుపుదల కోసం నిరీక్షిస్తూ దావీదు అతడి అనుచరణగణం ఒక ఏకాంత గుహలో ఉన్నారు. సౌలు పర్వతాల మీదుగా సాగుతున్న తరుణంలో పక్కకు మరలి దావీదు అతడి దళం ఏ గుహలో దాగి ఉన్నారో ఆ గుహలోనే సౌలు ఒంటరిగా ప్రవేశించాడు. ఇది చూసిన దావీదు మనుషులు సౌలును చంపవలసినదిగా దావీదును బతిమాలాడారు. రాజు తమ వశంలోకి రావటం శత్రువుని దేవుడే తమ చేతులకు అప్పగించటమని కనుక తాము అతణ్ణి చంపవచ్చని వారు వ్యాఖ్యానించారు. దాన్ని అమలు పర్చాలన్న శోధన దావీదుకి కలిగింది. కాని అతడి అంతరాత్మ ఇలా ప్రబోధించింది. “అభిషేకించిన వారిని ముట్టవలదు”.PPTel 669.4

    దావీదు అనుచరలు సౌలును వదిలివేయటానికి ఇష్టం లేక తమ నేతకు ఈ వాక్యో పదేశం గుర్తు చేసారు. “ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా దావీదు లేచివచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను”. ఆ తరువాత రాజు వస్త్రాన్ని పాడు చేసినందుకు దావీదుని తన మనస్సాక్షి గద్దించింది.PPTel 670.1

    సౌలు లేచి తన అన్వేషణను కొనసాగించటానికి గుహలో నుంచి బయటకి వెళ్ళాడు. అప్పుడు “నా యేలినవాడా రాజా” అని పిలుస్తున్న గొంతు విని రాజు తుళ్ళిపడ్డాడు. తనను పిలుస్తున్నదెవరా అని వెనక్కు తిరిగి చూసాడు. ఇంకెవరు? అది తాను పట్టుకొని చంపాలని ఎంతో కాలంగా తపనపడుతున్న యెషయి కుమారుడైన దావీదే. దావీదు వంగి నమస్కరించి సౌలుని తన నాయకుడిగా గుర్తించాడు. అప్పుడు సౌలుతో ఈ మాటలన్నాడు. “దావీదు నీకు కీడు చేయనుద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఈ దినమున యోహోవా నిన్ను ఏలాగు గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీయందు కనికరించి ఇతడు యోహోవా చేత అభిషేకము పొందినవాడు గనుక నా యేలిన వాని చంపమని చెంగు మాత్రమే కోసితిని గనుక నా వలన నీకు కీడు ఎంతమాత్రము రాదనియు నాలో తప్పిదము ఎంతమాత్రమును లేదనియు నీవు తెలిసికొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనైయుండగా నీవు నా ప్రాణము తీయవలెనని నన్ను తరుముచున్నావు”.PPTel 670.2

    దావీదు పలికిన మాటలు విన్న సౌలు సిగ్గుపడి అవి వాస్తవమే అని ఒప్పుకొన్నాడు. తాను ఎవరి ప్రాణం తియ్యటానికి ప్రయత్నించాడో ఆ దావీదు ఆధీనంలో తాను పూర్తిగా ఉన్నానన్న గుర్తింపు సౌలు హృదయాన్ని చలింపజేసింది. తన ముందు దావీదు నిరపరాధిగా నిలిచి ఉన్నాడు. సున్నిత స్వరంతో ఇలా అన్నాడు. “దావీదా నాయనా! ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చాడు. ఆ మీదట దావీదుతో ఇలా అన్నాడు “యోహోవా నన్ను నీ చేతికప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా యెడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి జేసితివి గనుక నీవు నా కంటె నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన యెడల మేలు చేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యోహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక, నిశ్చయముగా నీవు రాజవగుదువనియు ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియను”. ఇది జరిగినప్పుడు తన వంశీయుల్ని ఉదారతతో పరిగణిస్తానని పేరున తుడిచివేయునని సౌలుతో దావీదు నిబంధన చేసుకున్నాడు.PPTel 671.1

    గతంలో సౌలు వ్యవహరించన తీరు ఎరిగిన దావీదు రాజు ఇచ్చే హామీల్ని నమ్మలేకపోయాడు. అతడి పశ్చాత్తాపం ఎక్కువకాలం ఉంటుందని నమ్మలేదు. కనుక సౌలు తన ఇంటికి వెళ్లిపోయినప్పుడు దావీదు ఆ పర్వత ఆశ్రయాల్లోనే ఉండిపోయాడు.PPTel 671.2

    సాతానుకి లొంగి వ్యవహరించివారు దైవ సేవకుల పట్ల ప్రదర్శించే వైరం కొన్నిసార్లు మారి సయోధ్యకు సద్భావనకు అవకాశమున్నట్లు కనిపించవచ్చు. కాని ఆ మార్పు ఎక్కువ కాలం కొనసాగేదికాదు. దుర్బుద్ధి కలిగినవారు దైవ సేవకులకు కీడు చేసి వారిని నిందించి దుర్భాషలాడిన తరువాత తాము చేసింది తప్పు అన్న గుర్తింపు కొన్నిసార్లు వారి మనసుల్లో చోటు చేసుకోవచ్చును. వారిలో ప్రభువు ఆత్మ పనిచేయటం వల్ల వారు దేవుని ముందు తాము ఎవరినైతే నాశనం చేయటానికి అపసోపాలు పడ్డారో వారి ముందు వినయమను గలిగి వారి పట్ల తమ వైఖరిని మార్చుకోవచ్చు. అయితే వారు మళ్ళీ సాతాను దురాలోచనలు ద్వారం తెవరటం చేస్తే పాత అపోహలు పునర్జీవం పొందుతాయి. పాతవైరం మేల్కొంటుంది. వారు ఏ పనుల విషయం పశ్చాత్తాపం పొంది వాటిని కొంతకాలం విడిచి పెట్టారో వాటిని చేయటంలో మళ్ళీ తలమునకలవుతారు. ఎవరితో తమ అపరాధాలు ఒప్పుకున్నారో వారిని నిందిస్తూ తీవ్రంగా ఖండిస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తారు. మనుషులు అలాంటి దుష్కార్యాలు చేసిన తర్వాతే సాతాను వారిని ఎక్కువ శక్తిమంతంగా ఉపయోగించాడు, చేయకముందు కాదు, ఎందుకంటే ఎక్కువ వెలుగున్నప్పుడే వారు పాపం చేసారు.PPTel 671.3

    “సమూయేలు మృతి చెందగా ఇశ్రాయేలీయులందరు కూడుకొని అతడు చనిపోయెనని ప్రేలాపించుచు, రామాలోనున్న అతని ఇంటి నివాశములో అతిని సమాధి’ ‘ చేసారు. సమూయేలు మరణాన్ని దేశానికి గొప్ప నష్టంగా ప్రజలు పరిగణించారు. గొప్ప వ్యక్తి మంచి ప్రవక్త న్యాయాధిపతి మరణించాడు. ప్రజలు బహుగా దు:ఖించారు. సమూయేలు తన చిన్ననాటి నుంచి ఇశ్రాయేలీయుల మధ్య సత్యవర్తనుడై నివసించాడు. సౌలు రాజైనప్పటికి సమూయేలు అధికారాన్ని ప్రాబల్యాన్ని ప్రజలు ఎక్కువగా గౌరవించారు. సమూయేలు విశ్వసనీయత, విధేయత దైవభక్తే అందుకు కారణం. తన జీవిత కాలమంతా ఇశ్రాయేలీయులికి న్యాయాధి పతిగా సేవ చేసాడని అతన్ని గూర్చి చదువుతున్నాం.PPTel 672.1

    సమూయేలు జీవితానికి సౌలు జీవితానికి మధ్య గల వ్యత్యాసాన్ని చూసినప్పుడు ఇతర ప్రజలవలె ఉండాలన్న తపనతో తమకు రాజు కావాలని కోరటంలో తాము ఎంత ఘోర తప్పిదం చేశారో ప్రజలు గ్రహించారు. సమాజ పరిస్థితిని చూసి అనేకమంది ఆందోళన చెందారు. సమాజం మతాసక్తిని మంచితనాన్ని కోల్పోయి పులు పెక్కిన పిండిలా తయారయ్యింది. తమ రాజు అదర్శం గొప్ప దుష్ప్రభావాన్ని ప్రదర్శిస్తూ ఉంది. దైవ సేవకుడైన సమూయేలు ప్రవక్త మరణానికి ఇశ్రాయేలు ప్రజలు దు:ఖించటం బాగానే ఉంది.PPTel 672.2

    పరిశుద్ధ పాఠశాలల స్థాపకుడు అధ్యక్షుడు అయిన సమూయేలుని దేశం పొగొట్టుకున్నది. అంతేకాదు. ప్రజలు ఎవరి వద్దకు తమ కష్టాల్ని బాధల్ని చెప్పుకోవటానికి వెళ్ళేవారో ఎవరు ఎల్లప్పుడు ప్రజా శ్రేయాన్ని కోరి ఎల్లప్పుడూ తమ పక్షంగా దేవునితో విజ్ఞాపన సల్పేవారో ఆ ప్రవక్తను వారు పోగొట్టుకొన్నారు. సమూయలు చేసిన విజ్ఞాపనలు వారిలో భద్రతా భావాన్ని పుట్టించేవి. ఎందుకంటే “నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును” యాకాబు 5:16 ఇప్పుడు దేవుడు తమను విడిచి పెట్టేస్తున్నాడని ప్రజలు భావించారు. రాజు దాదాపు పిచ్చివాడైనట్లు కనిపించాడు. న్యాయం వక్రించింది. క్రమం పోయి ఆయోమయ పరిస్థితి నెలకొన్నది.PPTel 672.3

    దేశం అంత:కలహాలతో అతలాకుతలమౌతున్న తరుణంలో, సమూయేలిచ్చే దైవభక్తి పూరిత హితవు అత్యవసరమైన సమయంలో దేవుడు తన వృద్ధ సేవకుడికి విశ్రాంతినిచ్చాడు. అతడి విశ్రాంతి స్థలాన్ని వీక్షిస్తూ తాము అతణ్ణి తమ పరిపాలకుడిగా అంగీకరించికపోవటం గురించి ఆలోచించినప్పుడు వారిలో దు:ఖం వెల్లువెత్తింది. ఎందుకంటే దవునితో అతడికున్న ఆత్మీయత ఇశ్రాయేలు ప్రజల్ని దేవునితో అనుసంధానపర్చినట్లు కనిపించేది. దేవుని ప్రేమించి ఆయనకు విధేయులై జీవించటం వారికి నేర్పింది సమూయేలు. అయితే సమూయేలు మరణించటంతో తాము సాతానుతో జతకట్టి తమను దేవునికి దూరం చేసే రాజు దుర్నీతికి బలికానున్నామని ప్రజలు ఆందోళన చెందుతున్నారు,.PPTel 672.4

    దావీదు సమూయేలు సమాధికి హజరు కాలేకపోయాడు. కాని కుమారుడు తండ్రి నిమిత్తం విలపించేటట్లు దావీదు సమూయేలు కోసం విలపించాడు. సమూయేలు మరణించటంతో సౌలు దురంతాల్ని నిలువరించే మార్గం మూతపడిందని, అతడున్నప్పుడు తనకున్న భద్రత ఇక ఉండదని దావీదు గ్రహించాడు. కనుక దావీదు పారాను ఆరణ్యానికి పారిపోయాడు. నూట ఇరవై ఒకటో కీర్తన దావీదు ఇక్కడే రాశాడు. ప్రవక్త మరణించాడని రాజు తన శత్రువు అని గుర్తిస్తూ ఆ నిర్జన అరణ్యంలో ఇలా గానం చేసాడు.PPTel 673.1

    “యోహోవా వలననే నాకు సహాయము కలుగును
    ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు
    ఆయన నీ పాదము తొట్రిల్ల నియ్యుడు
    నిన్ను కాపాడు వాడు కునుకడు
    ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు
    నిద్రపోడు యోహోవా యే నిన్ను కాపాడువాడు
    నీకుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా నుండును
    పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు
    ఏ అపాయమును రాకుండ యోహోవా నిన్న కాపాడును
    ఆయన నీ ప్రాణమును కాపాడును
    ఇది మొదలుకొని నిరంతరము
    నీ రాకపోకల యందు యోహోవా నిన్ను కాపాడును”
    PPTel 673.2

    కీర్తనలు 121:2-8

    దావీదు అతడి మనుషులు సారాను అరణ్య ప్రాంతములో ఉన్న సమయంలో నాబాలు అనే భాగ్యవంతుడి మందల్ని బందిపోట్ల బారి నుండి కాపాడారు. నా బాలుకి ఆ ప్రాంతంలో విస్తారమైన ఆస్తి ఉంది. నాబాలు కాలేబు వంశస్తుడు. కాని అతడు మొరటు మనిషి పరమ పిసినారి.PPTel 674.1

    అది గొర్రెలకు బొచ్చు కత్తిరించే కాలం. అతిథ్యం చేసే సమయం. దావీదుకి అతడి మనుషులికి ఆహారం కొదవగా ఉంది. నాటి ఆచారన్ననుసరించి దావీదు పదిమిందిని పిలిచి వారిని నాబాలు వద్దకు పంపాడు. తన పేరిట నాబాలుని కుశల ప్రశ్నలడిగి “ఆ బాగ్యవంతునితో - నీకును నీ ఇంటివారికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమగును గాక అని పలికి ఈ వర్తమానము తెలియజేయవలెను. నీ యొద్ద గొట్టె బొచ్చు కత్తిరించు వారున్నారను సంగతి నాకు వినబడెను. నీ గొట్టెల కాపరులు మా దగ్గరనుండగా మేము వారికి ఏ కీడును చేసియుండలేదు. వారు కర్మలులో నున్నంతకాలము నీదేదియు పొగొట్టుకొనలేదు. నీ పని వారిని నీవు వారిని అడిగిన యెడల వారాలాగు చెప్పుదురు. కాబట్టి నా పని వారికి దయచూపుము. శుభ దినమున మేము వచ్చితిమిగదా, నీకిష్టము వచ్చినట్లు నీ దాసులకును నీకుమారుడైన దావీదునకును ఇమ్ము”.PPTel 674.2

    దావీదు అతడి మనుషులు నాబాలు గొర్రెల కాపర్లకు మందలకు రక్షణ దుర్గంలా ఉన్నారు. తనకు విలువైన సేవలందించిన తమకు తమ సమృద్ధిలో నుంచి కొంత సహాయం చేయాల్సిందిగా నా బాలుకి దావీదు అనుచరలువినతి చేసారు. దావీదు అతడి మనుషులు నాబాలు మందలోనుంచి గొర్రెల్ని తీసుకోగలిగేవారు.కాని వారు ఆ పని చేయలేదు. వారు ఎంతో నిజాయితీగా వ్యవహరించారు. కాగా వారు చూపించిన దయను నాబాలు గుర్తించలేదు. అతడు దావీదుకు పంపిన జవాబును బట్టి అతడు ఎలాంటి ప్రవర్తనగలవాడో బోధపడింది. ” దావీదు ఎవడు ? యెషయి కుమారెడవడు? తమ యాజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొల్టెబొచ్చు కత్తిరించువారి కొరకు నేను వధించిన పశు మాసంమును తీసి, నేను బొత్తిగా ఎరుగని వారికిత్తునా?”PPTel 674.3

    ఆ యువకులు వట్టి చేతులతో తిరిగి వచ్చి విషయాన్ని దావీదుకి తెలియపర్చగా అతడు ఉగ్రుడయ్యాడు. యుద్ధానికి సిద్ధము కండని తన మనుషుల్ని ఆదేశించాడు దావీదు. తనకు న్యాయంగా ఇవ్వవలసిన దాన్ని నిరాకరించి ఆ పైన తనను అవమానపర్చిన నా బాలుని శిక్షించాలని దావీదు కృతనిశ్చయుడయ్యాడు. ఇలాంటి దుందుడుకు చర్య సౌలు ప్రవర్తనకు సరిపోయేదిగాని దావీదు ప్రవర్తనకు కాదు. కాకపోతే యెషయి కుమారుడు శ్రమల బడిలో ఓర్పు పాఠాలు ఇంకా నేర్చుకోవాల్సి ఉంది.PPTel 674.4

    నాబాలు దావీదు మనుషుల్ని అవమానించి పంపేసిన అనంతరము అతడి సేవకుల్లో ఒకడు అతడి భార్య అబీగయాలు దగ్గరకు పరుగెత్తుకు వెళ్ళి జరిగినదంత ఆమెకు వివరించాడు. “అమ్మా దావీదు అరణ్యములో నుండి మన యాజమానుని కుశల ప్రశ్నలడుగుకై దూతలను పంపగా అతడు వారితో కఠినముగా మాటలాడెను. అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపకారము చేసియున్నారు. మేము వారి మధ్యను సంచరించుచున్నంత సేపు ఆపాయముగాని నష్టముగాని మాకు సంభవింపలేదు. మేము గొట్టెలను కాయుచున్నంత సేపు వారు రాత్రిం బగళ్ళు మా చుట్టు ప్రాకరముగా ఉండిరి. అయితే మా యాజామానునికిని అతని ఇంటివారికందరికిని వారు కీడు చేయనిశ్చయించియున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసినదానిని బహుజాగ్రత్తగా ఆలోచించుము. మన యాజమానుడు బహుపనికిమాలినవాడు ఎవనిని తనతో మాట లాడనీయడు” అన్నాడు.PPTel 675.1

    భర్తను సంప్రదించకుండా లేదా అతడికి చెప్పకుండా అబీగయీలు సమృద్ధిగా ఆహారపదార్ధాలు సిద్ధం చేసుకొని గాడిదల మీద కట్టి సేవకులతో వాటిని ముందుగా పంపించి దావీదును అతడి మనుషుల్ని కలవటానికి వెనుక బయలుదేరి వెళ్ళింది,. కొండలోయలో వారినికలుసుకొంది. “అబీగయీలు దావీదును కనుగొని, గార్దభము మీద నుండ త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదముల పట్టుకొని ఇల్లైనెను- నా యేలినవాడా, యీ దోషము నాదని యెంచుము, నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను అలకించుము” పట్టాభిషిక్తుడైన రాజుతో మాట్లాడేంత గౌరవంతో అబీగయీలూ దావీదుదో మాట్లాడింది.నాబాలు ” దావీదు ఎవడు” అని హేళన చేయగా అబీగయీలు దావీదును” నా యేలినవాడా” అని సంబోధించింది. గాయపడ్డ అతడి మనోభవాల్ని సాంత్వన పర్చటానికి భర్త పక్షంగా ఆమె విజ్ఞాపన చేసింది. ఆడంబరంగాని ఆహంభావంగాని ప్రదర్శించుకోకుండా విజ్ఞతతో దేవునిపై ప్రేమతో తన కుటుంబం పట్ల తన విశ్వసనీయత బలిమిని అబీగయీలు బయలుపర్చింది. తన భర్త వలన జరిగిన అమర్యాద పథకం ప్రకారం వ్యక్తిగతంగా తనను కించపర్చటానికి చేసిన పనికాదని అది స్వార్ధ బుద్ది నుండి పుట్ట విడుదలైన అసంతోషమేనని ఆమె స్పష్టం చేసింది.PPTel 675.2

    “నాయేలినవాడా, యోహోవా జీవముతోడు నీ జీవము తోడు ప్రాణహాని చేయకుండ యోహోవా నిన్న ఆపియున్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించెనన్నమాట నిజమని యోహోవా జీవము తోడు నీ జీవము తోడు అని ప్రమాణము చేయు చున్నాననేను. నీ శత్రువులును నాయేలినవాడనైన నీకు కీడు చేయనుద్దేశించి వారును నాబాలు వలె ఉందురుగాక”. తన తొందరపాటు చర్యనుంచి దావీదును తప్పించి కీర్తిని సొంతం చేసుకోక అందు నిమిత్తం ఘనతను స్తుతిని అబీగయీలు దేవునికి చెల్లించింది. తదనంతరము తాను తెచ్చిన ఆహార పదార్థాల్ని సమాధాన అర్పణగా దావీదుకు సమర్పిస్తూ అతడి క్రోధానికి కారణం తానేనన్నట్లు ఆమె ఇంకా విజ్ఞాపన చేసింది.PPTel 676.1

    అమె ఈ మాటలన్నది. “నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. నా యేలినవాడవగు నీవు యోహోవా యుద్ధములను చేయుచున్నావు. గనుక నా యేలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలుగకుండును”. దావీదు అనుసరించాల్సిన విధానాన్ని అభీగయీలు సూచాయగా చెప్పింది. అతడు యోహోవా యుద్దాల్ని చేయాల్సి ఉన్నాడు. దేశద్రోహివలె హింసకు గురి అయినప్పటికి వ్యక్తిగతమైన పొరపాట్లకు ప్రతీకారం తీర్చుకోవటానికి చూడకూడదు. ఆమె ఇంకా ఇలా అన్నది. “నిన్ను హింసించుటకైనను నీప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మాటలో కట్టబడును. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసరివేయును. యోహోవా నా యేలని వాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నిర్ణయించిన తరువాత నా యేలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించనందుకే గాని నా యేలిన వాడవగు నీవు పగతీర్చుకొనినందుకేగాని, మనోవిచారమైనను దు: ఖమైనను నా యేలినవాడవగు నీకు ఎంతమాత్రమును కలుగకపోవును గాక, యెహోవా నా యేలినవాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలవగు నన్ను జ్ఞాపకము చేసికొనుము” 1 సమూయేలు 25:29-31.PPTel 676.2

    దైవ జ్ఞానం పొందిన వ్యక్తినోటి నుంచి మాత్రమే ఈ మాటలు రాగలవు. అబీగయాలు దైవభక్తి పువ్వుసువాసనలా తనకు తెలియకుండానే తన ముఖం నుంచి మాట నుంచి క్రియ నుంచి బయలుపడింది. దైవ కుమారుడి ఆత్మ ఆమె హృదయంలో నివాసముంటున్నది. కృపతో సమ్మిళితమైన దయతో సమాధానంతో నిండిన ఆమె పలుకు ఆధ్యాత్మిక ప్రభావాన్ని ప్రసరించింది. దావీదు మనసులో మెరుగైన భావోద్రేకాలు పుట్టాయి. తాను తల పెట్టిన దుందుడుకు చర్య పర్యవసానాలు ఎంత ఘోరంగా ఉండేవో అని లోచించినప్పుడు అతనికి కంపం పుట్టింది. “సమాధాన పరుచువారు ధన్యులు. వారు దేవుని కుమారులనబడుదురు” మత్తయి 5:9. కోపోద్రేకాల్ని చల్లార్చి దుందుడుకు యోచనలకు అడ్డు కట్ట వేసి వివేకంతో నిండిన మాటలతో గొప్ప విపత్తును తొలగించిన ఈ మగువ వంటి మహిళలు ఎక్కువ మంది ఉంటే బాగుండేది.PPTel 676.3

    అంకిత భావం గల క్రైస్తవ జీవితం సర్వదా శాంతిని ఓదార్పును సమాధానాన్ని వెదజల్లుతుంటుంది. అది పవిత్రత, విజ్ఞత నిరడంబరత ప్రయోజకత్వాలతో అలరారుతుంటుంది. పలుకుబడిని పరిశుపర్చే స్వార్ధరహిత ప్రేమ దాన్ని నియంత్రిస్తుంది. అది క్రీస్తుతో నిండి ఉండి అది కలిగిన వ్యక్తి నడిచిన మార్గాన్ని వెలుగుబాటుగా మిగుల్చుతుంది. అబీగయీలు జ్ఞానయుక్తమైన మందలింపు హితవును అందించిన వ్యక్తి. ఆమె ప్రభావం వలన హేతువాదం వలన దావీదు కక్ష కార్పణ్యాలు సర్దుమణిగాయి. తాను అవివేకంగా వ్యవహరించానని ఆత్మ నిగ్రహాన్ని కోల్పోయానని అతడు గుర్తించాడు.PPTel 677.1

    తానే రచించిన ఈ మాటలకు అనుగుణంగా వినియ మనసుతో అతడు ఆ గద్దింపును అంగీకరించాడు. “నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము” కీర్తనలు 14:15 ఆమె తన సలహాను నీతితో అందించింది. గనుక వందనాలు చెప్పి ఆమెను దీవించాడు. గద్దింపు పొందే పలువురు గద్దింపును విసుగు చెందకుండా స్వీకరించటం అభినందనీయమని భావిస్తారు. కాని గద్దింపును కృతజ్ఞతతో స్వీకరించేవారు, చెడు మార్గం నుంచి తమను కాపాడటానికి ప్రయత్నించేవారిని అభినందించే వారు బహు కొద్దిమంది మాత్రమే.PPTel 677.2

    అబీగయీలు ఇంటికి తిరిగి వచ్చేసరికి నాబాలు అతడి అతిథులు విందు భోజనంలోను తాగుడు విందులోను నిమగ్నులై ఉన్నారు. దావీదుతో తన సమావేశంలో ఏం జరిగిందో మరుసటి ఉదయం వరకు భర్తకు నివేదించలేక పోయింది. నాబాలు వట్టి పరికివాడు. తన బుద్దిహీనత తనను హఠాన్మరణం అంచుకి తీసుకువెళ్ళిన ఉదంతం విని పక్షపాతం బారిన పడినట్లు కనిపించింది. దావీదు తనపై ఇంకా ప్రతీకారం తీర్చుకొంటాడేమోనన్న అనుమానంతో బెంబేలెత్తిపోయి స్పృహ తప్పి నిస్సహాయ స్థితికి చేరుకున్నాడు. పది రోజుల తరువాత మరణించాడు. అతడికి దేవుడిచ్చిన ప్రాణం లోకానికి శాపంగా పరిణమిచింది. ఉపమానంలో ధనవంతుడితో దేవుడున్నట్లు నాబాలు తిని తాగి తుళ్ళిపడుతున్నప్పుడు అతడితో దేవుడు ‘వెర్రివాడా, ఈరాత్రి నీ ప్రాణము నడుగుచున్నాను. అన్నాడు”. లూకా 12:20PPTel 677.3

    తర్వాత దావీదు అబీగయీలూని వివాహం చేసుకున్నాడు. అప్పటికే అతడికి ఒక భార్య ఉన్నది. అయితే ఆ కాలంలో జాతులు అనుసరిస్తున్న ఆచారం అతడి బుద్దిని వక్రీకరించి అతడి క్రియల్ని ప్రభావితం చేసింది. అనేకమంది గొప్పవారుమంచివారు లోకాచారాలన్ని అనుసరించటంలో తప్పటడుగు వేశారు. పెక్కుమంది భార్యల్ని పెండ్లి చేసుకోవటం వల్ల కలిగిన దుష్పరిణామాల్ని దావీదు తన జీవితమంతా అనుభవించాడు.PPTel 678.1

    సమూయేలు మరణానంతరము దావీదు కొన్నిమాసాలు ప్రశాంతముగా ఉన్నాడు. మళ్ళీ జీపు ప్రాంతానికి వెళ్ళి ఏకాంతంగా నివసిస్తున్నాడు. శత్రుత్వం గల ఈ ప్రజలు రాజు ప్రాపకం సంపాదించేందుకు దావీదు తల దాచుకొంటున్న స్థలాన్ని రాజుకి తెలియజేసారు. ఈ రహస్య సమాచారం సౌలులో నిద్రిస్తున్న క్రోథం అనే రక్కసిని నిద్రలేపింది. మరోసారి తన సైనికుల్ని సమావేశపర్చి దావీదును పటు కోవటానికి బయలుదేరాడు. సౌలు తనను మళ్ళీ పట్టుకొనే ప్రయత్నంలో ఉన్నా డని స్నేహితులైన వేగులు దావీదుకి వార్త అందించాడు. తన దళంలోని కొంతమందిని తీసుకొని శత్రువు ఉన్న స్థలాన్ని పసికట్టటానికి దావీదు బయలు దేరాడు. అది రాత్రి సమయం అచి తూచి అడుగులు వేసుకుంటూ వెళ్తున్న తరుణంలో శత్రువుల విడిది స్థలానికి వచ్చారు. అక్కడ రాజు గూడారాన్ని అతడి సహాయకుల గుడారాల్ని చూసారు. శత్రువులు వీరిని చూడలేదు శిబిరమంతా గాఢ నిద్రలో మునిగి ఉంది. శత్రు శిబిరం మధ్యకు వెళ్తామని దావీదు తన మిత్రులికి ప్రతిపాదించాడు. “పాళెములోనికి సౌలు దగ్గరకు నాతో కూడ ఎవరు వత్తురు”? అన్న దావీదు ప్రశ్నకు “నీతో కూడ నేను వత్తునని అభిప్లై” వెంటనే స్పందించాడు.PPTel 678.2

    ఆ కొండల నీడ ముసుగులో దావీదు అతడి సహాయకుడు శత్రువు శిబిరంలో ప్రవేశించారు. శత్రువుల సంఖ్య నిర్దిష్టంగా తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు నిద్రలో మునిగి ఉన్న సౌలును చూసారు. సౌలు ఈటె నేలను నాటి ఉంది. తల వద్ద నీళ్ల బుడ్డి ఉంది. అతడి పక్క తన సేనాపతి అబ్నేరు పడుకొని ఉన్నాడు. వారి చుట్టు సైనికులు పడుకొని నిద్రపోతున్నారు. అబీ షై తన ఈటెను ఎత్తి దావీదుతో ఇలా అన్నాడు. “దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకప్పగించెను. కాబట్టి నీ చిత్తమైతే ఆ యీటెతో ఒక్కపోటు పొడిచి నేనతిని భూమికి నాటివేయుదును. ఒక దెబ్బతోనే పరిష్కారము చేతును”.దావీదు అనుమతి కోసం వేచి ఉన్నాడు. దావీదు గుసగుసగా అన్న ఈ మాటలు అతడి చెవిని పడ్డాయి. “నీవతనిని చంపకూడదు. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషియగుట యెవనికి సాధ్యము? యెహోవా జీవము తోడు యెహోవాయే అతనిని మెత్తును, అతడు అపాయము వలన చచ్చును. లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకమునొందిన వానిని నేను చంపను. అలాగు నేను చేయకుండ యెహోవా నన్ను అపును గాక. అయితే అతని తలగడ దగ్గరనున్న యీటెను నీళ్ళ బుడ్డిని తీసుకొని మనము వెళ్ళిపోదము రమ్మని... చెప్పి పౌలు తలగడ దగ్గర నున్న యీటెను నీళ్ళ బుడ్డిని తీసుకొని వారిద్దరు వెళ్ళిపోయిరి.... యెహోవా వలన వారికందరికి గాఢ నిద్ర కలుగగా వారిలో ఎవరును నిద్ర మేల్కొనలేదు. ఎవడును వచ్చినవారిని చూడలేదు. జరిగిన దానిని గుర్తుపటిన వాడొకడును లేడు. బలవంతుణ్ణి దుర్బలుణ్ణి చేయటం జ్ఞాని జ్ఞానాన్ని తీసివేయటం మిక్కిలి జాగ్రత్తగా కావాలి కాస్తున్న వాడి నిపుణుల్ని గలిబిలి చేయటం ప్రభువుకి ఎంత సులభం !PPTel 678.3

    శిబిరానికి కొంత దూరం వెళ్ళి ఓ కొండ శిఖరం పై నుండి ప్రజల్నీ అబ్నేరును ఉద్దేశించి దావీదు పెద్ద స్వరంతో ఇలా అన్నాడు. “నీవు మగవాడవు కావా? ఇశ్రాయేలీయులలో నీ వంటివాడెవడు? నీకు యాజమానుడగు రాజునకు నీ వెందుకు కాపుకాయకపోతివి? నీకు యాజమానడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువరకు వచ్చెనే. నీ ప్రవర్తన అనుకూలము కాదు. నీవు శిక్షకు పాత్రుడవే. యెహోవా చేత అభిషేకము నొందని నీ యేలిన వానికి నీవు రక్షణముగా నుండలేదు. యెహోవా నా జీవము తోడు నీవు మరణ శిక్షకు పాత్రుడవే. రాజు యొక్క యీటె యెక్కడున్నదో చూడుము. సౌలు దావీదు స్వరము ఎరిగిదావీదా నాయనా, ఇది నీ స్వరమే గదా అని అనగా దావీదు ఇచొనెను.. నా యేలినవాడా నా రాజా నా స్వరమే. నా యేలినవాడు తన దాసుని ఈలాగు ఎందుకు తరుము చున్నాడు? నేనేమి చేసితిని ? నా వలన ఏ కీడు నీకు సంభవించును? రాజా నా యేలినవాడా, నీ దాసుని మాటలు వినము” రాజు నోటి నుండి మళ్ళీ ఈ ఒప్పుకోలు వచ్చింది. “నేను పాపము చేసితిని, ఈ దినమున నాప్రాణము నీ దృష్టిని ప్రియముగా నుండిన దాని బట్టి నేను నీకిక కీడు చేయను. దావీదు రాజా, యిదిగో నీ యీటె నా యొద్దనున్నది, పనివారిలో నొకడు వచ్చి దాని తీసుకొనవచ్చును. “నేను నీకిక కీడు చేయును” అని సౌలు వాగ్దానం చేసినప్పటికి దావీదు రాజు వద్దకు వెళ్ళలేదు.PPTel 679.1

    రాజు ప్రాణం పట్ల దావీదు రెండోసారి గౌరవం కనపర్చటం రాజు మనసును ఆకట్టుకొని తన తప్పులను అంగీకరించటంత దీన మనసు కలిగించింది. దావీదు అలాంటి దయ కనపర్చటం రాజును నివ్వెరపర్చి అతణ్ణి లొంగదీసుకుంది. దావీదును విడిచి పెట్టి వెళ్తున్న్పడు రాజు ఇలా అన్నాడు. “దావీదా నాయనా, నీవు ఆశీర్వాదము పొందుదువు గాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక”. కాని రాజు అదే మనస్తత్వంలో ఎక్కువకాలం కొనసాగుతాడన్న నమ్మకం దావీదుకి లేదు. PPTel 680.1

    సౌలుతో సయోధ్య విషయంలో దావీదు నిస్పృహ చెందాడు. చివరికి రాజు దుర్బుద్ధికి బలికావటం అనివార్యంగా దావీదుకు కనిపించింది. కాబట్టి ఫిలీప్తీయుల దేశంలో ఆశ్రయం కోరటానికి నిశ్చయించుకొన్నాడు. తనతో ఉన్న ఆరువదందల మందిని తీసుకొని గాతు రాజు ఆకీషు వద్దకు వెళ్ళాడు.PPTel 680.2

    సౌలు తనను చంపటానికి వేసుకున్న పథకాన్ని నెరవేర్చి తీరతాడన్న దావీదు యోచన దేవునితో సంప్రదించకుండా ఊహించుకొన్నది. దావీదును హతమర్చటానికి సౌలు కుట్రలు పన్నుతున్న తరుణంలోనే దావీదుకి ఇశ్రాయేలీయుల రాజ్యం స్థిరపర్చాలని ప్రభువు ఏర్పాట్లు చేస్తున్నాడు. మానవ దృష్టికి మరుగై ఉన్నప్పటికి దేవుడు తన ప్రణాళికల్ని అమలుజరుపుతాడు. దేవుని మార్గాల్ని మానవులు గ్రహించలేరు. దేవుడు అనుమతించే కష్టాలు, శ్రమలు, పరీక్షలు తమకు వ్యతిరేక విషయాలని తమ నాశన కారకాలని పైకి కనిపించేవాటిని బట్టి వారు వ్యాఖ్యానం చెబుతారు. దావీదు ఇలాగే పైకి కనిపించే వాటిని చూశాడే తప్ప దేవుని వాగ్దానాల్ని పరిగణించలేదు. ఎప్పటికైనా రాజునవుతానా అన్న సందేహం అతణ్ని తొలచివేసింది. దీర్ఘశ్రమలు అతడి విశ్వాసాన్ని దెబ్బతీశాయి. అతడి ఓర్పును హరించివేసాయి, PPTel 680.3

    ఇశ్రాయేలీయలికి బద్ద శత్రువులైన ఫిలీప్రియుల్నీ కాపాడనికి ప్రభువు దావీదును పంపలేదు.ఈ ప్రజలే దావీదు చివరి దినాల్లో అతడికి మిక్కిలి హానికరమైన శత్రువులు కానున్నారు. అయినా అవసరంలో వారి వద్దకే సహయం కోసం దావీదు వెళ్ళాడు. సౌలు మీద అతడి అనుచరలు మీద నమ్మకం పూర్తిగా కోల్పోయిన దావీదు తన ప్రజల శత్రువుల దయా వీక్షణాల్ని ఆశ్రయించాడు. దావీదు సాహసంగల సేనానాయకుడు. ప్రతిభ పాటవాల్ని నిరూపించుకొన్న యోధుడు. అయితే ఫిలీప్తీయుల ఆశ్రయం కోరి వెళ్ళటం ద్వారా తన సొంత ప్రయోజనాలకే హాని చేసుకొంటున్నాడు. తన ద్వజాన్ని యూదాలో ఎత్తటానికి దేవుడు దావీదుని నియమించాడు. దేవుని ఆదేశం లేకుండా దాన్ని విడిచి పెట్టటానికి కారణం అతడికి విశ్వాసం కొరవడటమే.PPTel 680.4

    తన అవిశ్వాసాన్ని బట్టి దావీదు దేవుని అగౌవరపర్చాడు. ఫిలీప్తీయులు సౌలుకు అతడి సేవకూ భయపడటం కన్నా దావీదుకి ఎక్కువ భయపడ్డారు. ఫిలీప్తీయుల పరీరక్షణ కోరటం ద్వారా దావీదు తన సొంత ప్రజల బలహీనతల్ని బయట పెట్టినట్లయ్యింది. ఈ రకంగా ఈ శత్రుతులు ఇశ్రాయేలీయుల్ని హింసంచటానికి ప్రోత్సాహమిచ్చాడు. దైవ ప్రజలకు కాపుదలగా ఉండటానికి దావీదు అభిషేకం పొందాడు. తన ప్రజల బలహీనతల్ని బహిర్గతం చేయటం ద్వారా లేదా వారి క్షేమాభివృద్ధి విషయంలో నిర్లిప్త వైఖరి అవలంభించటం ద్వారా తన సేవకులు దుర్మార్గులకు చేయూత నివ్వటానికి దేవుడు విముఖుడు. అంతేకాదు, దావీదు అన్య దేవతల్ని సేవించటానికి అన్యులవద్దకు వెళ్ళిపోయాడన్న అభిప్రాయం ప్రజల్లో బలపడింది. ఈ కార్యం అనేకులు అతని ఉద్దేశాల్ని ఆపార్ధం చేసుకొని అతడిపట్ల దురభిప్రాయాలు కలిగి ఉండటానికి దారి తీసింది. దావీదు దేవుని ఆరాధించటం మానుకోలేదు. ఆయన సేవ విషయంలో శ్రద్ధాసక్తులు కనపర్చటం మానలేదు. కాని తన వ్యక్తిగత క్షేమం విషయంలో దేవునిపై నమ్మకం ఉంచలేదు. తన సేవకులు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్న నీతిమంతమూ విశ్వసనీయమూ అయిన ప్రవర్తను దావీదు ఈ విధంగా కలుషితం చేసాడు.PPTel 681.1

    ఫిలీప్తీయుల రాజు దావీదును హార్థికంగా ఆహ్వానించాడు. ఆ రాజుకి వ్యక్తిగతంగా దావీదు పట్ల విశేషాదరం ఉండటం ఒక హెబ్రీయుడు తనను ఆశ్రయించటం వల్ల తనకు కలిగే ప్రతిష్ట ఈ అభిమానపూర్వక స్వాగానికి కొంత మేరకు హేతువు కావచ్చు. ఆకీషు రాజ్యంలో తన అప్పగింత భయం ఉండదని దావీదు ధీమగా ఉన్నాడు. తన కుటంబాన్ని ఇంటివారిని తన సంపాదనని, తన అనుచరణాల్ని దావీదు తీసుకువెళ్ళాడు. దానంతటిని బట్టి ఫిలీప్తీయాలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవటానికి వెళ్ళినట్లు కనిపించింది. ఇదంత ఆకీషుకి ఆనందంగా ఉన్నది. పలాయితులై వచ్చిన ఇశ్రాయేలీయుల్ని కాపాడ్డానని ఆకీషు వాగ్దానం చేశాడు.PPTel 681.2

    నివాసం నిమిత్తం తన విజ్ఞప్తి మేరకు రాజు నగరికి దూరంగా ఉన్న సిక్లగును రాజు దావీదుకి స్వాస్థ్యంగా మంజూరు చేశాడు. విగ్రహారధకుల ప్రభావం క్రింద తాను తన అనుచరగణం నివసించటం ప్రమాదకరమని దావీదు గుర్తించాడు. తమ కోసమే ప్రత్యేకంగా నిర్దేశితమైన పట్టణంలో వారు మరింత స్వేచ్చగా దేవుని సేవించవచ్చు. కాగా గాతులోనే ఉండిపోతే గొప్ప చెడుగుకి హైరానాకి మూలమైన అన్యాఆచరాలకు వారు ఆకర్షితులయ్యేవారు.PPTel 681.3

    ఈ విడిది పట్టణంలో నివసించిన కాలంలో దావీదు గెషూరీయులతోను, గెజెరీయులతోను, అమాలేకీయులతోను యుద్ధం చేసి గాతుకి వార్తతేవటానికి ఒక్కడు కూడా మిగలకుండా అందరిని సంహరించాడు. యుద్ధం నుంచి తిరిగి వచ్చినప్పుడు తన యూదా ప్రజలతోనే యుద్ధం చేసానని ఆకీషుకి చెప్పాడు. ఈ నటన ద్వారా ఫిలీప్తీయుల్ని బలపర్చటానికి సాధనమయ్యాడు. ఎందుకంటే రాజిలా అన్నాడు. “దావీదు తన జనులైన ఇశ్రాయేలీయులు తన యందు బొత్తిగా అసహ్యపడునట్లు చేసెను గనుక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండును”. ఆ అన్యజాతుల ప్రజల నాశనం కావటం దేవుని చిత్తమని ఆ కార్యసిద్ధికి దేవుడు తనను నియమిం చాడని దావీదుకు బాగా తెలుసు. అయితే “అతడు మోసానికి దిగినప్పుడు దేవుని చిత్తాన్ననుసరించి నడుచుకోలేదు.PPTel 682.1

    “ఆ దినములలో ఫిలీప్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయవలెనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా, ఆకీషు దావీదును పిలిచి నేను దండెత్తగా నీవును నీ జనులును నాతో కూడా యద్దుమునకు బయలుదేరి రావలెనని పరిష్కారముగా తెలిసికొనుము”. తన ప్రజలకు వ్యతిరేకంగా చెయ్యి ఎత్తటం దావీదుకి సుతరాము ఇష్టం లేదు. పరిస్థితులు తన బాధ్యత ఎంటో నిర్దేశించేవారకు ఏ చర్య తీసుకోవాలి అన్న విషయాన్ని దావీదుతేల్చి చెప్పలేక పోయాడు. రాజుకి తన సమాధానాన్ని దాటవేస్తూ ఇలా అన్నాడు. “నీ దాసుడైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలిసికొందువు”. ఈ మాటల్ని జరుగనున్న యుద్ధంలో సహాయం చేస్తున్న వాగ్దానంగా ఆకీషు అవగాహన చేసుకొని దావీదుకి గొప్ప సన్మానం చేసి తనకు ఫిలీప్తీయుల ఆస్థానంలో ఉన్నతమైన హోదా ఇస్తానని వాగ్దానం చేసాడు.PPTel 682.2

    దేవుని వాగ్దానాల్ని విశ్వసించటంలో దావీదు కొంతమేరకు వెనకాడినప్పటికి సమూయేలు తనను ఇశ్రాయేలీయుల రాజుగా అభిషేకించటం దావీదుకి ఇంకా జ్ఞాపకముంది. గతంలో తన శత్రువుల పై దేవుడు విజయాల్ని ఇవ్వటం గుర్తు చేసుకున్నాడు. తనను సౌలు చేతినుంచి కాపాడటంలో దేవుడు చూపిన కృపను గుర్తు చేసుకొని దేవుడు తనకప్పగించిన పరిశుద్ధ కార్యనిర్వహణలో నమ్మకద్రోహం చేయనని నిర్ధారించుకొన్నాడు. ఇశ్రాయేలీయులరాజు తన ప్రాణం తీయటానికి ప్రయత్నిస్తున్నప్పటికి తాను మాత్రం ప్రజల శత్రువులతో చేతులు కలపమని నిశ్చయించుకొన్నాడు.PPTel 682.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents