Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    1—పాపం ఎందుకు అనుమతించబడింది ?

    “దేవుడు ప్రేమా స్వరూపియేయున్నాడు” 1 యోహాను 4: 16. ఆయన స్వభావం, ఆయన ధర్మశాస్త్రం ప్రేమ ఆధారితమై ఉన్నాయి. ఇది ఎల్లప్పుడూ ఉన్న పరిస్థితి, నిత్యమూ ఉండనున్న పరిస్థితి. “పూర్వకాలము మొదలుకొని.... ఈలాగు జరిగించు” ఆయన “మహాఘనుడును మహోన్నతుడును నిత్యవాసియునైనవాడు” ఆయన మార్పులేనివాడు ఆయనలో “ఏ చంచలత్వమైనను గమనాగమనమువలన గలుగు ఏ ఛాయయైనను లేదు” యెషయా 57:15, హబక్కూకు 3:6, యాకోబు 1:17.PPTel 17.1

    సృజన శక్తి తాలూకు ప్రతీ ప్రత్యక్షత అనంత ప్రేమను వ్యక్తం చేస్తున్నది. సర్వాధికారి అయిన దేవుని సార్వభౌమత్వంలో సకల జీవుల సంపూర్ణ శ్రేయస్సు దీవెనలు ఇమిడి ఉన్నాయి. కీర్తన రచయిత ఇలా అంటున్నాడు, పరాక్రమముగల బాహువు కలదు. నీ హస్తము బలమైనది. నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు.యెహోవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొను చున్నారు. వారి బలమునకు అతిశయాస్పదము నీవే. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చంపబడుచున్నది. మా కేడెము యెహోవా వశము. మా రాజు ఇశ్రాయేలు పరిశు ద్దదేవుని వాడు” కీర్తనలు 89:13-18.PPTel 17.2

    మంచి చెడుల మధ్య సాగుతున్న మహా సంఘర్షణ చరిత్ర అనగా అది పరలోకంలో ప్రారంభమయ్యింది మొదలు తిరుగుబాటు చివరగా అంతమై పాపం నిర్మూలమయ్యేంతవరకు జరిగే చరిత్ర మార్పులేని దేవుని ప్రేమా ప్రత్యక్షతే.PPTel 17.3

    విశ్వపరిపాలకుడైన దేవుడు తన కృపా కార్యాచరణలో ఒంటరివాడుకాడు. తాను సృష్టించిన మానవులకు సంతోషానందాలివ్వటంలోని ఉద్దేశాన్ని అభినందించి ఆయన సంతోషంలో పాలు పంచుకొనే స్నేహితుడు సహపనివాడు ఆయనకు ఒకడున్నాడు. “ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను” అనగా ( యెహో 1:1,2).వాక్యం,తండ్రికి అద్వితీయ కుమారుడుఅయిన క్రీస్తు తండ్రితో ఒకడై ఉన్నాడు. స్వభావంలోను, గుణశీలంలోను, ఉద్దేశంలోను ఆయన తండ్రి ఒక్కటే. దేవుని ఆలోచనల్లోను, ఉద్దేశాల్లోను పాలు పంచుకోగల వ్యక్తి ఆయన ఒక్కడే. “ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును” యెషయ 9:6. “పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను” మీకా 5:2. దైవ కుమారుడు తన్నుగూర్చి తానిలా అన్నాడు. “తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రథమమైనదానిగా యెహోవా నన్ను కలుగుజేసెను. భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని” సామెతలు 8:22-30.PPTel 17.4

    పరలోకవాసులు సృష్టిని తండ్రి కుమారుని ద్వారా చేశాడు. “అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృష్టింపడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను” కొలస్స 1:16. దూతలు దేవుని పరిచారకులు. ఆయన సముఖం నుంచి నిత్యము ప్రవహించే వెలుగుతో ప్రకాశిస్తూ ఆయన ఆజ్ఞను శిరసావహించటానికి వడివడిగా ఎగురుతూ ఉంటారు. అయితే దేవుని వలన అభిషిక్తుడైన కుమారుడు “దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునైయుండి, తన మహత్తుగల మాటల చేత సమస్తమును నిర్వహించుచు” అందరిమీద సర్వాధికారం కలిగి ఉంటాడు. హెబ్రీ 1:3. “ఉన్నత స్థలమునందుండు మహిమగల సింహాసనము మొదటినుండి” ఆయన గుడార స్థలం (యిర్మీయా 17:12), ఆయన రాజదండము “న్యాయార్థమైనది” హెబ్రీ 1:8 “ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి”. కీర్తనలు 96:6. కృపా సత్యాలు ఆయన ముందు నడుస్తాయి కీర్తనలు 89:14.PPTel 18.1

    దేవుని ప్రభుత్వానికి పునాది ప్రేమ నిబంధన గనుక విజ్ఞతగల ప్రజల సుఖసంతోషాలు ఆ ప్రభుత్వ నీతి సూత్రాలకు అనుగుణంగా జీవించటం పై ఆధారపడి ఉంటాయి. తన ప్రజలందరి నుంచి ప్రేమపూర్వక సేవను - ఆయన శీలాన్ని అభినందించటం ద్వారా పుట్టే సేవను - దేవుడు కోరుతున్నాడు. బలవంతపు విధేయత ఆయనకు అంగీకారం కాదు. తనకు స్వచ్ఛందంగా సేవ చేసేంచేందుకు ఆయన అందరికీ స్వేచ్ఛ ఇస్తాడు.PPTel 18.2

    అందరు ప్రేమసూత్రం పాటించినంతకాలం దేవుడు సృజించిన విశ్వమంతటా సంపూర్ణ సామరస్యం చోటు చేసుకొన్నది. సృష్టికర్త ఉద్దేశాన్ని నెరవేర్చటంలో పరలోక నివాసులు ఎంతో ఆనందించేవారు. ఆయన మహిమను ప్రతిబింబించటానికి ఆయనకు స్తుతి చెల్లించటానికి సంతోషించేవారు. దేవునిపట్ల తమ ప్రేమ అమితంగా ఉండగా ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమ గాఢమైంది, స్వార్థరహితమయ్యింది, దైవ సంబంధమైన ఆ సామరస్యాన్ని పాడుచేసే అపశ్రుతి ఏదీ లేదు. అయితే ఆనందమయ వాతావరణంలో మార్పు వచ్చింది. దేవుడు తన ప్రజలకనుగ్రహించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయటానికి ఒకడు పూనుకొన్నాడు. క్రీస్తు తర్వాత దేవుడు ఎక్కువ గౌరవించిన వ్యక్తి, పరలోక వాసులందరిలో అత్యున్నత స్థానం అధికారం మహిమ ఉన్న వ్యక్తితో పాపం ప్రారంభమయ్యింది. “తేజో నక్షత్రము, వేకువ చుక్క” అయిన లూసిఫర్ ఆశ్రయంగా ఉన్న కెరూబుల్లో ప్రథముడు. అతడు పరిశుద్ధుడు, మచ్చలేనివాడు. అతడు దేవుని సముఖంలో నిలబడి ఉండేవాడు. నిత్యుడైన దేవుని ఆవరిస్తూ నిరంతరం ప్రసరించే మహిమ కిరణాలు అతణ్ని కప్పేవి “ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా - పూర్ణజ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి... అమూల్య రత్నములతోను, బంగారముతోను, నీవు అలంకరింపబడియున్నావు.... అభిషేకము పొందిన కెరూబువై యొక ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్టించబడిన పర్వతముమీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడువరకు ప్రవర్తన విషయములో నీవు యధార్థవంతుడవుగా ఉంటివి” యె హెజ్కేలు 28:12-15.PPTel 18.3

    ఆత్మ ఔన్నత్య ఆకాంక్ష అతనిలో క్రమక్రమంగా పెరిగింది. లేఖనం ఇలా చెబుతున్నది, “నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించినవాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి” యె హెజ్కేలు 28:17. “దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును... మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనకొంటివిగదాను” యెషయా 14:13, 14. తనకున్న మహిమ ప్రభావాలు దేవుని వద్దనుంచి వస్తున్నవే అయినా ఈ మహాదూత అవి తనవిగా భావించాడు. పరలోకంలో అందరికన్నా తనది ఉన్నత స్థానం అయినా దాంతో తృప్తి చెందక సృష్టికర్తకు మాత్రమే చెందే మహిమ ప్రశంసలను ఆశించాడు. సృష్టిపొందిన వారందరి ప్రేమానురాగాలు భక్తి గౌరవాలు విషయంలో దేవుణ్ణి సర్వోన్నతుడిగా పరిగణించేబదులు వాటిని తానే పొందటానికి ప్రయత్నించాడు. కుమారునికి నిత్యుడైన తండ్రిచ్చిన మహిమ పై దురాశ పడూ క్రీస్తుకు మాత్రమే ప్రత్యేక హక్కుగా ఉన్న అధికారాన్ని ఆకాంక్షించాడు.PPTel 19.1

    దీంతో పరలోకంలో రాజ్యమేలే సామరస్యం విచ్చిన్నమయ్యింది. సృష్టికర్తకు సేవ చేసే బదులు సేవలు తనకే జరగాలని కోరుతున్న లూసిఫర్ మనస్తత్వం దేవునికే అత్యున్నత మహిమ చెందాలని కోరేవారి మనసుల్లో భయాందోళనలు పుట్టించింది. పరలోక సభలో దూతలు లూసిఫర్ ని బతిమాలారు. సృష్టికర్త మహత్మ్యా న్ని, కృపను, న్యాయాన్ని, పరిశుద్ధమైన, మార్పులేని ఆయన ధర్మశాస్త్ర స్వభావాన్ని లూసిఫర్ కి దైవకుమారుడు వివరించాడు. పరలోక క్రమాన్ని స్థాపించింది దేవుడే. దాన్ని తోసిపుచ్చటం ద్వారా లూసిఫర్ సృష్టికర్తనే అవమానపర్చి తన్ను తానే నాశనం చేసుకొంటున్నాడు. ప్రేమ కనికరాలతో చేసిన హెచ్చరిక ప్రతిఘటన స్వభావాన్ని పుట్టించింది. క్రీస్తు పై అసూయను బట్టి లూసిఫర్ మరింత రెచ్చిపోయాడు.PPTel 20.1

    దైవకుమారుని సర్వాధికారాన్ని ప్రశ్నించి తద్వారా దేవుని విజ్ఞతను ఆయన ప్రేమను అభిశంసించటమే లూసిఫర్ ధ్యేయం. క్రీస్తు తర్వాత స్వర్గనివాసులందరిలోను మిక్కిలి ప్రతిభాసంపత్తిగల ఈ దూత తన యీ గురిని సాధించటానికి తన శక్తి సామర్థ్యాల్ని ఉపయోగించటానికి పూనుకొన్నాడు. ప్రజలు తమకై తాము స్వేచ్చగా ఎంపిక చేసుకోవాలన్న తత్వంగల దేవుడు తిరుగుబాటును సమర్థించే వాదనల విషయమై అందరికీ ముందస్తు హెచ్చరికచేశాడు. ఎవరి వివేకం, ఎవరి కృప తమ ఆనందానికి మూలమో ఆ దేవుని చిత్తమేమిటో అన్నదాన్ని గూర్చి ఈ మహా సంఘర్షణ ప్రారంభానికి ముందు అందరూ స్పష్టమైన వివరణ పొందాల్సి ఉన్నారు.PPTel 20.2

    అందరి సమక్షంలోను తన కుమారుని గూర్చిన వాస్తవ పరిస్థితి వివరించి సృష్టించబడ్డవారందరి విషయంలో కుమారునికి ఎలాంటి సంబంధం ఉన్నదో సుస్పష్టంచేయటానికి విశ్వపాలకుడైన దేవుడు పరలోక వాసుల సబను ఏర్పాటు చేశాడు. దైవ కుమారుడు తండ్రి సింహాసనాన్ని పంచుకొంటూ ఆయనతో ఆసీనుడుకాగా తండ్రి మహిమ ఇరువుర్నీ ఆవరించింది. సింహాసనం చుట్టూ లెక్కకు మించిన సంఖ్యలో పరిశుద్ధదూతలు సమావేశమయ్యారు - “వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను” (ప్రకటన 5:11). అత్యున్నత స్థాయి దూతగణాలు వారికి సపర్యలందిస్తూ దైవం సముఖంనుంచి తమ పై పడుతున్న మహిమలో ఎంతో ఆనందిస్తూ ఉన్నారు. తన అద్వితీయ కుమారుడు క్రీస్తుకి తప్ప ఇంకెవ్వరికీ తన ఉద్దేశాల్లోకి అంతరంగిక విషయాల్లోకి ప్రవేశం లేదని తన దివ్యచిత్తాన్ననుసరించి తాను వెలువరించే ఆలోచనలను అమలు పర్చే బాధ్యత కుమారుడిదని సమావేశమైన పరలోక నివాసులకు పరలోక రాజు ప్రకటించాడు. కుమారుడు తండ్రి చిత్తం ప్రకారం పరలోక నివాసులందరినీ సృజించాడు. వారి స్తుతి మహిమలు భక్తి విశ్వాసాలు తండ్రి కుమారులకే చెందుతాయి. లోకం, లోకవాసుల సృష్టిలో క్రీస్తు తన శక్తినుపయోగించి ఆ కార్యాన్ని ఇంకా సాధించాల్సి ఉన్నాడు. అయితే, దేవుని చిత్తం ప్రకారం ఈ కార్యనిర్వహణలో క్రీస్తు తన్నుతాను ఘనపర్చుకోటంకాక తండ్రిని ఘనపర్చి మహిమపర్చి ఆయన సంకల్పాన్ని ప్రేమించి నెరవేర్చాల్సి ఉన్నాడు.PPTel 20.3

    క్రీస్తు సర్వాధికారాన్ని దూతలు ఆనందంగా అంగీకరించి తమ ప్రేమను కనపర్చుతూ ఆయన ముందు సాగిలపడి నమస్కరించారు. వారితోపాటు లూసిఫర్ కూడా వంగాడు కానీ అతని మనసులో తీవ్ర సంఘర్షణ ఉత్పన్నమైంది. ఈర్ష్య ద్వేషాలతో సత్యం, న్యాయం, ప్రభుభక్తి సంఘర్షణ పడ్తున్నాయి. పరిశుద్ధ దూతల ప్రభావం కొంతకాలం అతణ్ని తమతో ఉంచింది. వేలాదిమంది గళాలు కలిపి మధురంగా పాడుతున్న స్తుతిగానాలు శ్రావ్యంగా పైకి లేస్తుండగా తన దుర్బుద్ది అణగారిపోయినట్లు, కనిపించింది. వర్ణించలేని ప్రేమతో అతని శరీరం పులకరించింది. అతని ఆత్మ పాపరహితులైన ఆ ఆరాధకులతో కలిసిపోయింది. తండ్రి కుమారుల పట్ల ప్రేమ వెలువెత్తింది. కానీ మళ్లీ అహంభావంతో, స్వీటోన్నత్యంతో అతడి హృదయం నిండింది. సర్వాధికార కాంక్ష తిరిగి వచ్చింది. క్రీస్తు పట్ల ఈర్ష్య మళ్లీ పుట్టింది. తనకున్న గౌరవం, ప్రతిష్టాత్మక హోదాలు దేవుడిచ్చినవేనని గుర్తించి అతను అభినందించటం లేదు. అందుచేత తాను సృష్టికర్తకు కృతజ్ఞుణ్ని కానక్కర్లేదని భావించాడు. తన ప్రతిభాపాటవాలు చూసుకొని గర్వించాడు. దేవునితో సమానుణ్ని కావాలని ఆకాంక్షిం చాడు. అతడు పరలోక వాసుల ఆదరాభిమానాల్ని సంపాదించాడు. దూతలు అతడి ఆదేశాల్ని సంతోషంగా శిరసావహించారు. అందరికన్నా అతడికి ఎక్కువ వివేకం, కీర్తి ఉన్నాయి. అయినా దైవకుమారుడు శక్తి విషయంలోను అధికారం విషయంలోను తండ్రితో సరిసాటి అయి తనకన్నా ఉన్నత స్థాయిలో ఉన్నాడు. క్రీస్తు తండ్రి ఆలోచనల్లోను సంప్రదింపుల్లోను భాగస్వామి కాగా వాటిలో లూసిఫర్ కి ఏ మాత్రం పాలులేదు. “క్రీస్తుకు సర్వాధికారం దేనికి? లూసిఫర్‌కు మించిన గౌరవ ప్రతిష్టలు క్రీస్తుకు ఎందుకు?” ప్రశ్నించాడు లూసిఫర్.PPTel 21.1

    దేవుని సమక్షంలోంచి వెళ్లిపోయి దూతల్లో అసంతృప్తి మంటలు రగిలించటానికి ప్రయత్నం మొదలు పెట్టాడు. ఆ పని అతి రహస్యంగా మొదలు పెట్టాడు. దేవుని పట్ల భక్తి గౌరవాలన్న ముసుగు కింద తన నిజమైన ఉద్దేశాల్ని కొంతకాలం మరుగుపర్చగలిగాడు. పరలోక వాసులకు సంబంధించిన నిబంధల్ని గురించి సందేహాలు వ్యక్తం చేయటం మొదలు పెట్టాడు. దూతలు దేవునికి అపకీర్తి తెచ్చే జీవులుకారు. వారి తలంపులు పరిశుద్ధ తలంపులు. దేవుడు పొరపాటు చేయటం సాధ్యంకానట్లే దూతలు తప్పుచేయటం సాధ్యం కాదు. దైవకుమారుని తండ్రితో సమానుడిగా హెచ్చించటాన్ని తనకు జరిగిన అన్యాయంగా లూసిఫర్ సూచిస్తున్నాడు. తానుకూడా గౌరవానికి ఔన్నత్యానికి యోగ్యుణ్ణని అతడి వాదన. తాను తన న్యాయమైన ఆ ఉన్నతస్థానం పొందగలిగినట్లయితే పరలోక నివాసులందరికీ గొప్ప ఉపకారం ఒనగూడుందని, వారందరికీ స్వేచ్చను ఇవ్వటమే తన పరమ లక్ష్యమని లూసిఫర్ సూచించాడు. అయితే ఇప్పుడు తమకు అప్పటి నిరంకుశ పాలకుణ్ణి దేవుడు నియమించాడని ఆయన అధికారానికి అందరూ నివాళులర్పించాల్సి ఉంటుందని నిందాపూర్వకంగా పలికాడు. లూసీఫర్ కపట వర్తన ద్వారా ఇలాంటి సున్నితమైన మోసాలు పరలోకంలో ప్రచారమయ్యాయి.PPTel 21.2

    క్రీస్తు స్థానంలోగానీ అధికారంలోగానీ మార్పేమీ రాలేదు. లూసీఫర్ అసూయ, అతడి దుష్ప్రచారం, అతడు కోరుతున్న క్రీస్తుతో సమానత్వం వీటివల్ల క్రీస్తు స్థానాన్ని గురించి స్పష్టమైన ప్రకటన చేయడం అవసరమయ్యింది. ఆది నుంచి ఇది ఒకే విధంగా ఉన్నది. అయితే, దూతల్లో అనేకమందిని లూసీఫర్ తన మోసాలతో ఆకట్టుగోగలిగాడు.PPTel 22.1

    తన నాయకత్వం కింద ఉన్న పరిశుద్ధ దూతలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని తన అసంతృప్తిని, అపనమ్మకాన్ని తన పాత్ర కనిపించకుండా నేర్పుగా వారిలో వెదజల్లగలిగాడు. లూసిఫర్ దేవుని ఉద్దేశాల్ని వక్రీకరించి వాటి విషయం తప్పుడు ప్రచారం చేశాడు. అసమ్మతిని, అసంతృప్తిని రగిలించటానికి వాటికి అపార్థాలు వికృత భావాలు కూర్చాడు. శ్రోతలకి తమ మనోభావాలు వ్యక్తం చేయమంటూ విజ్ఞప్తి చేసి అనంతరం వాటిని ఉటంకించి వాస్తవానికి దూతలు దైవ ప్రభుత్వంతో పూర్తిగా ఎన్నడూ ఏకీభవించలేదని దుష్ప్రచారం చేశాడు. తాను మాత్రం దేవునికి నమ్మకంగా ఉన్నానంటూ చెప్పుకొని దైవ ప్రభుత్వ సుస్థిరతకు పరలోకక్రమంలోను, నియమ నిబంధనల్లోను కొన్ని మార్పులు అవసరమని ప్రతిపాదించాడు. రహస్యంగా అసంతృప్తిని తిరుగుబాటును ప్రోత్సహిస్తూ తన పరమోద్దేశం ప్రభుభక్తికి మద్దతు పలికి శాంతి సామరస్యాల్ని ప్రోత్సహించటమేనన్న అభిప్రాయం పుట్టించడానికి యుక్తిగా ప్రయత్నించాడు.PPTel 22.2

    ఇలా రగుల్కొన్న అసంతృప్తి దాని విధ్వంసకరమైన పనిని అందచేస్తూ ఉన్నది. బహిరంగ తిరుగుబాటు లేకపోయినప్పటికీ దేవదూతల్లో అంతర్గతంగా చీలిక సంభవిస్తున్నది. దేవుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా లూసిఫర్ చేసిన ఆరోపణల్ని నమ్మి వాటికి సుముఖంగా ఉన్నదూతలు కొందరున్నారు. దేవుడు స్థాపించిన క్రమాన్ననుసరించి అంతవరకు సామరస్యంగా నివశిస్తున్నప్పటికీ ఇప్పుడు వారి అసంతృప్తికీ అసంతోషానికి కారణం ఆయన ఆలోచనల్లో వారికి పాలులేకపోవటం. క్రీస్తును ఘనపర్చటంలో ఆయన ఉద్దేశాన్ని వారు తప్పుపట్టారు. క్రీస్తుతో సమాన ప్రతిపత్తిని కోరుతున్న లూసీఫర్ ని వారు సమర్థించటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నమ్మకంగాను యదార్థంగాను ఉన్నదూతలు దేవుని చట్టానికి విధేయులై ఉంటూ అసంతృప్తితో ఉన్న లూసిఫర్ ని దేవునితో సమాధాన పర్చటానికి ప్రయత్నించారు. క్రీస్తు దేవుని కుమారుడు. దూతలు ఉనికిలోకి రాకముందునుంచే ఆయన తండ్రితో ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ తండ్రి కుడి పక్కనిలిచి ఉన్నాడు. అందరికీ దీవెనకరంగా ఉన్న ఆయన అధికారాన్ని అప్పటివరకూ ఎవరూ ప్రశ్నించలేదు. పరలోక సామ రస్యంలో అపశ్రుతి చోటుచేసుకోలేదు. అసమ్మతి ఇప్పుడు ఎందుకు తలెత్తాలి? ఈ అసమ్మతి భయంకర పరిణామాలకు దారితీస్తుందని నమ్మకంగా ఉన్న దూతలు ఆందోళన చెంది తమ దురుద్దేశాలు విరమించుకొనిదేవుని ప్రభుత్వానికి మద్దతుచేయ డంద్వారా ఆయనకు నమ్మకంగా ఉండమంటూ అసమ్మతి దూతలకు హితవు పలికారు.PPTel 22.3

    సహన శీలుడైన దేవుడు లూసిఫర్ పట్ల కరుణ కలిగి అతన్ని ఎంతోకాలం సహించాడు. అసంతృప్తి అసమ్మతి అన్నవి పరలోకంలో ముందెన్నడూ లేవు. అదొక విచిత్రమైన, మర్మపూరితమైన పరిణామం. తన ఉద్దేశాల తీరుతెన్నులు ఏమిటో మొదట లూసిఫర్ కే తెలియలేదు. తన మనోభావాల్ని ఆలోచనల్ని వ్యక్తం చేయటానికి భయపడ్డాడు. అయినా వాటిని విరమించుకోలేదు. తాను ఏ దిశకు కొట్టుకుపోతున్నాడో కానరాలేదు. కానీ తాను అనుసరిస్తున్నది తప్పుడు మార్గమని అతడికి బోధపర్చటానికి హద్దులేని ప్రేమ వివేకాలుగల దేవుడు చేయగల ప్రయత్నాలన్నీ జరిగాయి. అతని అసమ్మతి కారణ రహితమని రుజువయ్యింది. తిరుగుబాటు కొనసాగింపు ఫలితమేంటో అతనికి స్పష్టంగా చెప్పడం జరిగింది. తాను పొరపాటులో ఉన్నట్లు లూసిఫర్ గుర్తించాడు. ” యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు” అని అతడెరుగును (కీర్తనలు 145:17) ఆయన ధర్మశాసనాలు న్యాయమైనవని వాటిని అలాగని తాను దేవునిముందు అంగీకరించటం తన విధి అని అతడెరుగును. ఇది చేసి ఉంటే అతను అతని దూతలు పతనమయ్యేవారు కాదు. ఆ సమయంలో లూసిఫర్ దేవునిపట్ల తన ప్రభు భక్తిని పూర్తిగా వదులుకోలేదు. ఆశ్రయంగా ఉన్న కెరూబు పదవిని కోల్పోయినా తిరిగి దేవుని వద్దకు రావటానికి అతను సిద్ధంగా ఉండి దేవుడు విజ్ఞతగలవాడని గుర్తించి తన ప్రణాళిక ననుసరించి ఆయన తనకు నియమించే ఏ స్థానాన్నయినా అంగీకరించి దానితో తృప్తి చెందుతానని చెప్పినట్లయితే దేవుడు అతని పదవిని తిరిగి అతనికి ఇచ్చేవాడే. చివరి తీర్మానానికి సమయం వచ్చింది. అతను పూర్తిగా దేవుని సర్వాధికారానికైనా లొంగాలి. లేదా బహిరంగంగా తిరుగుబాటయినా చేయాలి. దేవుని వద్దకు తిరిగి రావటానికి దాదాపు నిర్ణయించుకొన్నాడు కానీ గర్వం అడ్డు తగిలింది. అంత ఉన్నత గౌరవాన్నందుకొన్న తాను తప్పుచేశానని తన ఆలోచనలన్నీ తప్పుడు ఆలోచనలని ఒప్పుకోటం,తప్పుడు అధికారమని నిరూపించటానికి తాను కృషి చేస్తూ వచ్చిన అధికారానికి దాసోహం అనటం గొప్ప త్యాగమే.PPTel 23.1

    కరుణా కటాక్షాలుగల సృష్టికర్త లూసిఫర్, అతని అనుచరుల పట్ల దయకలిగి తాము పొందనున్న నాశనం నుంచి వారిని కాపాడటానికి ప్రయత్నించాడు. కానీ ఆయన కృపను వారు అపార్థం చేసుకొన్నారు. దేవుని దీర్ఘశాంతమే ఆయన ఔన్నత్యానికి నిదర్శనమని, తన షరతులకు విశ్వపరిపాలకుడు అంగీకరిస్తాడనటానికి అది సూచనని లూసిఫర్ తన అనుచరులకు చెప్పాడు. తాము తనతో స్థిరంగా నిలబడి ఉంటే తాము కోరిందంతా సంపాదించవచ్చని దూతలతో చెప్పాడు. తాననుసరిస్తున్న విధానాన్ని సమర్ధిస్తూ అతను దేవునికి వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించటానికి నిబద్దుడై ఉ న్నాడు. “వెలుగును అందిస్తూ” దేవుని మహిమలో పాలుపొందుతూ, దైవ సింహాసనం వద్ద సేవ చేసే లూసిఫర్ ఇలా అతిక్రమంవల్ల దేవునికి పరిశుద్ధ దూతలకు “విరోధి”, కాపుదలకూ, నడుపుదలకూ దేవుడు తనకు అప్పగించిన దూతల విషయంలో వినాశకుడూ అయిన సాతాను అయ్యాడు.PPTel 24.1

    దేవునికి నమ్మకంగా నిలిచిన దూతల వాదనల్నీ విజ్ఞాపనల్నీ తోసిపుచ్చుతూ వారిని మోసపోయిన సేవకులంటూ విమర్శించాడు. క్రీస్తును ఎంపిక చేసుకోటంలో తనకూ మొత్తం పరలోక నివాసులకూ అన్యాయం జరిగిందనీ తన హక్కుల పైన తక్కినవారి హక్కుల పైన జరిగిన దాడిని సహించి తానిక లొంగి ఉండనని లూసిఫర్ ప్రకటించాడు. క్రీస్తు సర్వాధికారాన్ని తానిక ఎన్నడూ అంగీకరించనని తెగేసి చెప్పాడు. తనకు రావలిసన గౌరవాన్ని చేతుల్లోకి తీసుకొని తనను అనుసరించదలచిన వారందరికీ నాయకత్వం వహించటానికి తీర్మానించుకొన్నాడు. తనతో చేతులు కలిపే వారికి మెరుగైన కొత్త ప్రభుత్వాన్ని వాగ్దానం చేశాడు. తన ప్రభుత్వంలో అందరికీ స్వేచ్చ ఉంటుందన్నాడు. అతణ్ణి తమ నేతగా అంగీకరిస్తామని పెద్ద సంఖ్యలో దూతలు తమ సమ్మతిని తెలిపారు. తన ప్రతిపాదనలకు లభించిన స్పందనతో ఉబ్బితబ్బిబ్బై దూతలందరినీ తన పక్కకు ఆకర్షించవచ్చునని ఆశించాడు. తాను దేవునితో సమానుణ్ణి కావచ్చునని పరలోక నివాసులందరు తన అదుపాజ్ఞల కిందకు రావటం ఖాయమని కలలుకన్నాడు.PPTel 24.2

    దేవునికి విధేయులు కావలసిందిగా లూసిఫర్ కి అతని సానుభూతిపరులకి నమ్మకంగా ఉన్నదూతలు విజ్ఞప్తి చేశారు. తమ అవిధేయత మానుకోకపోతే పర్యవసానాలు తప్పవని హెచ్చరించారు. తమను సృష్టించిన ఆ ప్రభువు తమను ఓడించి తమను శిక్షించటం తథ్యమని వారిని హెచ్చరించారు. దేవునికి మల్లే పరిశు ద్దమైన ఆయన ధర్మశాస్త్రాన్ని దేవదూతలు జయప్రదంగా ప్రతిఘటించలేరని చెప్పారు. లూసిఫర్ మోసకరమైన తర్కానికి చెవులు మూసుకుని తక్షణమే దేవుని సన్నిధిలోకి వెళ్లి ఆయన వివేకాన్ని, అధికారాన్ని ప్రశ్నించినందుకు క్షమాపణ వేడుకోవలసిందిగా అందరినీ వారు హెచ్చరించారు.PPTel 25.1

    ఆ హెచ్చరికను పాటించి, తమ అసమ్మతి నిమిత్తం పశ్చాత్తాపపడి తండ్రి కుమారుల అనుగ్రహాన్ని పొందాలని అనేకమంది దూతలు ఆలోచిస్తూ ఉన్నారు. అంతలో లూసిఫర ఇంకో మోసాన్ని సిద్ధం చేశాడు. తనతో చేతులు కలిపిన దూతలు తిరుగుబాటులో తిరిగిపోలేనంత దూరం వెళ్లిపోయారని దైవ ధర్మశాస్త్రం తనకు తెలుసునని, దేవుడు తనను క్షమించడని తనకు తెలుసునని లూసిఫర్ ఇప్పుడు ప్రకటించాడు. దేవుని అధికారానికి లొంగుతున్న దూతలందరూ తమ గౌరవాన్ని కోల్పోతారని హోదా తగ్గింపుకు గురి అవుతారని భయ పెట్టాడు. తన విషయంలో మాత్రం క్రీస్తు సర్వాధికారాన్ని తాను ఇక ఎన్నడూ గుర్తించబోనని లూసిఫర్ ఉద్ఘాటించాడు. తనకూ తన అనుచరులకు మిగిలిందల్లా తమకు న్యాయంగా చేకూరని తమ స్వేచ్చను బలప్రయోగం ద్వారానే సాధించటం జరగాలని అతను చెప్పాడు.PPTel 25.2

    సాతానుకి సంబంధించినంతవరకు తాను తిరిగి రాలేనంత దూరం వెళ్లిన మాట ముమ్మాటికి నిజం. కాని అతడి మోసాలవల్ల, గుడ్డివారైన వారి విషయంలో ఇది నిజంకాదు. నమ్మకమైన దూతల హితవు, విజ్ఞప్తులు వారికి నిరీక్షణ ద్వారాన్ని తెరిచాయి. ఆ విజ్ఞప్తులకు వారు స్పందించి ఉంటే సాతాను ఉచ్చులోంచి బైటపడేవారే. అయితే గర్వం, తమ నాయకుడి పట్ల వారి ప్రేమ, హద్దులు లేని స్వేచ్ఛకోసం వారి వాంఛ బలీయమవటం వల్ల దైవకృపచేసిన విజ్ఞప్తుల్ని తోసిపుచ్చారు.PPTel 25.3

    అసమ్మతి స్వభావం పక్వమై చురుకైన తిరుగుబాటుగా మారేవరకూ సాతాను తన పనిని కొనసాగించటానికి దేవుడు అనుమతించాడు. అతని ప్రణాళికల నిజస్వభావ స్వరూపాల్ని అందరూ చూసేందుకుగాను అవి పూర్తిగా అమలుకావటం అవసరం. అభిషేకం పొందిన కెరూబుగా లూసిఫర్ ఉన్నత స్థానాన్ని ఆక్రమించాడు. పరలోక వాసులు అతన్ని అమితంగా ప్రేమించారు. వారి పై అతని ప్రభావం బలీయంగా ఉంది. దేవుని ప్రభుత్వం కింద పరలోక నివాసులే కాక దేవుడు సృజించిన లోకాల్లోని నివాసులందరూ ఉన్నారు. తన తిరుగుబాటుకు పరలోక దూతల మద్దతును సంపాదించగలిగితే అన్ని లోకా లమద్దతును సునాయాసంగా సంపాదించగలనన్నది లూసీఫర్ ధీమా. తన కార్యసాదనకోసం తన పక్షం నుంచి తర్కానికి మోసాన్ని రంగరించి సమస్యను అతి నిపుణంగా వారి ముందు పెట్టాడు. అతను గొప్ప మోసగాడు. అబద్దాల దుస్తులు ధరించి లబ్ది పొందాడు. అతని చర్యలన్నీ మర్మంతో కప్పబడి ఉండటం చేత తన పని స్వభావ స్వరూపాల్ని అతను దేవదూతలకు వివరించలేకపోయాడు. పూర్తిగా బయట పడేవరకు అది దుష్కార్యంగా కనిపించలేదు. అతని అసమ్మతి తిరుగుబాటుగా కనిపించలేదు. నమ్మకంగా నిలిచిన దూతలు సైతం లూసిఫర్ ప్రవర్తనను పూర్తిగా గ్రహించలేకపోయారు. అతను చేస్తున్న పని పర్యవసానాన్ని వారు గ్రహించలేకపోయారు.PPTel 25.4

    మొదట్లో లూసిఫర్ తన సంబంధం కనిపించకుండా తన శోధనల్ని ఏర్పాటు చేశాడు. తాను పూర్తిగా తన పక్కకు తిప్పుకోలేకపోయిన దూతలకు పరలోక వాసుల శ్రేయస్సుపట్ల, ఎలాంటి ఆసక్తి లేదని నిందమోపాడు. తాను జరిగిస్తున్న దుష్ట కార్యాల్ని నమ్మకంగా ఉన్న దూతలు చేస్తున్నట్లు ఆరోపించాడు. దేవుని ఉద్దేశాల గురించి కుటిల వాదనలతో గలిబిలిపర్చటమే అతడి విధానం. ప్రతీ సామాన్య విషయాన్నీ మర్మంతో కప్పి స్పష్టమైన దైవవాక్కుల్ని వక్రీకరించి సందేహాలు శంకలు సృష్టించాడు. దైవ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న అతడి హెూదా తాను చెప్పే మాటలకు బలం చేకూర్చింది.PPTel 26.1

    సత్యాన్ని నీతిని బలపర్చే సాధనాల్ని మాత్రమే దేవుడు ఉపయోగిస్తాడు. పొగడ్తను మోసాన్ని ఆయన ఉపయోగించడు. వీటిని సాతాను నిక్షేపంగా ఉపయోగిస్తాడు. దూతలపై నియమ నిబంధనల్ని అన్యాయంగా విధించాడని దేవుని నిందిస్తూ దైవ వాక్యానికి తప్పుడు అర్థాలు చెప్పి ఆయన ప్రభుత్వాన్ని గూర్చి అబద్ద ప్రచారం చేయటానికి పూనుకొన్నాడు. ప్రజల నుంచి విధేయత కోరటంలో తన్నుతాను హెచ్చించుకోటానికే ఆయన తాపత్రయపడున్నాడని దేవున్ని నిందించాడు. అందుచేత దేవుని ప్రభుత్వం న్యాయవంతమైనదని ఆయన ధర్మశాస్త్రం సంపూర్ణమైనదనీ పరలోక నివాసులకూ ఇతర లోకాల్లోని ప్రజలకు చూపించటం అగత్యమయ్యింది. విశ్వం విశాల హితాన్ని ప్రోది చేస్తున్నది తానేనని చూపించుకోటానికి సాతాను ప్రయత్నించాడు. అందుచేత ఆక్రమణదారుడు మోసగాడు అయిన అతడి వాస్తవ ప్రవర్తన అతడి దురుద్దేశం అందరికీ తెలియటం అవసరం. తన దుష్కార్యాలవల్ల తన్నుతాను బయట పెట్టుకోటానికి అతనికి సమయం కావాలి.PPTel 26.2

    తన కార్యకలాపాలవల్ల, పరలోకంలో ఏర్పడ్డ అనైక్యతకు సాతాను దేవుని ప్రభుత్వాన్ని నిందించాడు. చెడుగంతా దైవ ప్రభుత్వ ఫలితంగా చోటుచేసుకొంటుదన్నదని డప్పు కొట్టి చాటాడు. తన ముఖ్యోద్దేశం యెహోవా ప్రతిపత్తిని మెరుగుపర్చటమేనని చెప్పాడు. కాబట్టి అతని కోరికలేమిటో వ్యక్తం చేయటానికి, దైవ ధర్మశాస్త్రంలో తాను ప్రతిపాదిస్తున్న మార్పులు ఎలా పనిచేస్తాయో చూపించటానికి దేవుడు అనుమతి నిచ్చాడు. కనుక ముసుగు తొలగి మోసగాణ్ణి విశ్వమంతా కళ్లారా చూడాలి.PPTel 27.1

    సాతాను పరలోకం నుంచి బహిష్కృతుడైనప్పుడు సైతం అనంత జ్ఞానియైన దేవుడు అతణ్ణి నాశనం చేయలేదు. ప్రేమ ఆధారిత పరిచర్యమాత్రమే దేవునికి అంగీకృతం కనుక ప్రజల విశ్వసనీయత, ఆయన న్యాయశీలతను గూర్చి ఆయన ఉదారతనుగూర్చి వారి నమ్మకం మీద ఆధారపడి ఉండాలి. పరలోక నివాసులూ, ఇతర లోకాల ప్రజలూ పాపరహితులు కాబట్టి పాపం గురించి పాపపర్యవసానాలగురించి గ్రహింపులేనివారు గనుక దేవుడు సాతానుని నాశనం చేసి ఉంటే దేవుని న్యాయశీలతను అవగాహన చేసుకొని ఉండేవారుకాదు. దేవుడు అతణ్ణి తక్షణమే నాశనం చేసి ఉంటే కొందరు ప్రేమవల్ల కాక భయంవల్ల ఆయన్ని సేవించి ఉందురు. సాతాను ప్రభావం పూర్తిగా నశించి ఉండేది కాదు. తిరుగుబాటుతత్వం కూడా నశించి ఉండేది కాదు. అనంతయుగాలుగా సర్వవిశ్వం శ్రేయస్సు దృష్ట్యా, సృష్టించబడ్డ వారందరూ దైవ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాతాను ఆరోపణల్ని చూసి వాటి నిజానిజాలు గ్రహించేందుకూ, దేవుని కృప న్యాయాల విషయంలోను, ఎన్నడూ మార్పులేని ఆయన ధర్మశాస్త్రం విషయంలోనూ ఎప్పుడూ ఎలాంటి ప్రశ్నలూ లేకుండా ఉండేందుకూ సాతాను తన నియమాన్ని సంపూర్తిగా రూపొందించుకోవాలి.PPTel 27.2

    రానున్న యుగాలన్నిటిలోను సాతాను తిరుగుబాటు విశ్వానికి గుణపాఠం కావాల్సి ఉన్నది. పాపం స్వభావ స్వరూపాల గురించీ, దాని భయంకర పర్యవసానాల గురించి అది నిత్యసాక్షిగా నిలవాల్సి ఉన్నది. సాతాను నియమాలు, మానవుల పైన దూతల పైన దాని ఫలితాలు దైవాధికారాన్ని తోసిపుచ్చటంవల్ల లభించే ఫలమేంటో ఇవి బయలుపర్చుతాయి. దైవ ప్రభుత్వంతోనే సర్వసృష్టిలోని ప్రజల క్షేమాభివృద్ధి ముడిపడి ఉన్నదని అది చాటి చెబుతుంది. ఈ రీతిగా, భయంకరమైన ఈ తిరుగుబాటు ప్రయోగం చరిత్ర పరిశుద్ధ ప్రజలందరికీ కాపుదలగా ఉండి, పాపం స్వభావం విషయంలో మోసపోకుండా వారిని కాపాడేందుకు, పాపం చేయకుండా దాని శిక్షకు గురికాకుండా వారిని కాపాడేందుకు తోడ్పడాల్సి ఉన్నది.PPTel 27.3

    పరలోకంలో ఉండి విశ్వపాలన చేసే ఆ ప్రభువు ఆదినుంచి కలుగబోవు వాటిని తెలియజేసేవాడు. గతంలోని మర్మాలు భవిష్యత్తులోని మర్మాలు ఆయన ముందు బహిర్గతమై ఉంటాయి. పాపం కలిగించే దు:ఖాన్ని, అంధకారాన్ని, నాశనాన్ని అధిగమించి తన ప్రేమ లక్ష్యసాధనల్ని దీవెనల్ని ఆయన చూస్తాడు. “మేఘాంధకారాలు ఆయన చుట్టూ” ఉన్నా “నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి పునాది” కీర్తనలు 9:2, ఆర్.వి. విశ్వజనులు, నమ్మకంగా ఉన్నవారూ, నమ్మకంగా లేనివారూ, ఒకనాడు దీన్ని అవగాహన చేసుకొంటారు. “ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యయలన్నియు న్యాయములు. ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు” ద్వితి. 32:4.PPTel 28.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents