Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    69—సింహాసనానికి పిలుపు పొందిన దావీదు

    దావీదు బహిష్కుతికి దారితీసిన విపత్తులు సౌలు మరణంతో తొలగిపోయాయి. అతడు తన దేశానికి తిరిగి రావాటానికి మార్గం సుగమమయ్యింది. సౌలు యోనాతానుల మరణాలకి సంతాప దినాలు ముగిశాక, “యూదా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా వద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా - హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను”.PPTel 707.1

    హెబ్రోను బెయేర్షాబాకు ఉత్తరాన ఇరవై మైళ్ళ దూరంలో ఉండి ఆ పట్టణానికి భవిష్యత్తులో నిర్మితం కానున్న యెమాషలేము పట్టణ స్థలానికి దాదాపు మధ్యలో ఉన్నది. అదిలో దానికి కిర్యతర్బా అని పేరు. అర్బా పట్టణం అనాకీయుల తండ్రి పట్టణం. అనంతరము దానికి మమే అన్న పేరు కలిగింది. పితరుల శ్మశాన వాటిక అయిన “మక్సేలా గుహ” ఇక్కడే ఉంది. హెబ్రోను కాలేబు స్వాస్థ్యం. దాని చుట్టు సారవంతమైన పర్వత ప్రదేశం పంట పొలాలు ఉన్నాయి. పాలస్తీనా దేశంలోని మిక్కిలి సుందరమైన ద్రాక్ష తోటలు, ఓలీవా తోటలు వివిధ ఫల వృక్షాలు ఆ పట్టణ సరిహద్దుల్లో ఉన్నాయి.PPTel 707.2

    దావీదు అతడి సహచరులు దేవుడిచ్చిన ఉపదేశాన్ని ఆచరించటానికి వెంటనే సన్నద్దులయ్యారు. సాయుధులైన అరువందల మంది పురుషులు,భార్యలు, పిల్లలు, మేకలు, గొర్రెలు పశువులతో వెంటనే హెబ్రోనకు ప్రయాణమయ్యారు. వారు పట్టణంలో ప్రవేశించినపుడు భవిష్యత్ ఇశ్రాయేలీయుల రాజు దావీదుకు స్వాగతం పలకటానికి యూదా ప్రజలు వేచియున్నారు. దావీదు పట్టాభిషేకానికి వెంటనే ఏర్పాట్లు జరిగాయి. “అక్కడికి వచ్చి యూదావారిమీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి”. తక్కిన గోత్రాలపై అతడి అధికారాన్ని విధించటానికి ఎలాంటి ప్రయత్నమూ జరగలేదు.PPTel 707.3

    కొత్తగా రాజకిరీటం ధరించిన దావీదు చేసిన కార్యాల్లో మొట్టమొదటి కార్యం సౌలు యోనాతానుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రేమతో కూడిన నివాళులర్పించటం. యాబేషిలాడు మనుషులు యుద్ధరంగంలో నేలకూలిన నాయకుల మృతదేహాల్ని కాపాడి వారికి గౌరవ ప్రధమైన భూస్థాపన జరిగిన విషయం తెలుసుకొని ఈ వర్తమానంతో యాబేషుకి దావీదు దూతల్ని పంపించాడు. “మీరు ఉపకారము చూపి మీ యేలినవాడైన సౌలును పాతి పెట్టితిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వాదము నొందుదురు గాక. యెహోవా మీకు కృపను సత్యస్వభావమును ఆగపరచును. నేనును మీరు చేసిన యీ క్రియను బట్టి ప్రత్యుపకారము చేసెదెను”. యూదా రాజ్యానికి తాను రాజు కావటాన్ని ప్రకటించి యదార్ధ హృదయలందరూ తనకు నమ్మకంగా నిలవాల్సిందిగా ఆహ్వానించాడు.PPTel 707.4

    యూదా ప్రజలు దావీదును రాజుగా ఎంపికి చేసుకోవటాన్ని ఫిలిప్తీయులు వ్యతిరేకించలేదు,. దావీదు ప్రవాసమున్న కాలంలో వారు అతడితో స్నేహం నెరపారు. అది సౌలును భాధించటానికి చేసినపని. తాము క్రితంలో దావీదుకి కనపర్చిన దయనుబట్టి ఇప్పుడు అతడి రాజ్యవ్యాప్తి తమకు లబ్ధి చేకూర్చుతుందన్నది వారి ఆశాభావం. అయితే దావీదు రాజ్యపాలనతో తమకు సమస్యలుండవనుకోవటం పొరపాటే. తన పట్టాభిషేకం జరిగి జరగటంతోనే కుట్రలు తిరుగుబాట్లు పర్వం ప్రారంభ మయ్యింది. దావీదు అధిష్టించింది. దేశద్రోహి సింహాసనం కాదు ఇశ్రాయేలీయులు రాజుగా దేవుడే అతణ్ణి ఎంపిక చేసాడు. అందుచేత అవివ్వాసానికి వ్యతిరేకతకు గాని అస్కారం లేదు. అయినా, యూదా ప్రజలు దావీదు అధికారాన్ని గుర్తించారో లేదో అప్పుడే అబ్నేరు పలుకుబడి ద్వారా సౌలు కుమారడైన ఇష్బో షెతుని రాజుగా ప్రకటించి ఇశ్రాయేలు పై అతణ్ణి పోటీ రాజును చేయటం జరిగింది.PPTel 708.1

    సౌలు గృహంలో ఇష్పో షెతు బలహీనుడూ,. అసమర్దుడు కాగా దావీదు రాజ్యపాలనా బాధ్యతల్ని వహించటానికి మిక్కిలి సమర్దుడు యోగ్యుడును. ఇష్బో షెతును రాజ్యా ధికారానికి పోటీ పెడుతున్న ప్రధాన సూత్రధారి అబ్నేరు సౌలు సైన్యానాకి అధిపతి. ఇశ్రాయేలు దేశమంత టిలోను ఘనత వహించిన వ్యక్తి. దావీదుని ఇశ్రాయేలీయులు రాజుగా దేవుడు ఎంపిక చేసిన సంగతి అబ్నేరుకి తెలసిందే. కాగా అప్పటి వరకు దావీదుని వేటాడటంలో ప్రధాన పాత్ర పోషించిన అతడికి ఇప్పుడు దావీదు రాజై సౌలు పాలించిన రాజ్యాన్ని పరిపాలించటం మింగుడు పడటంలేదు.PPTel 708.2

    అబ్నేరు ఏ పరస్థితుల కింద ఉండి పనిచేశాడో అవి అతడి నడవడిని తీర్చిదిద్దాయి, అతడు అత్యాశాపరుడని నియమాలు లేని వ్యక్తి అవి సూచించాయి. అబ్నేరు సౌలుకి అత్యంత సన్నిహితుడు ఇశ్రాయేలీయుల రాజుగా దేవుడు ఎంచుకున్న వ్యక్తి పట్ల రాజుకున్న విద్వేషం అతణ్ణి కూడా ప్రభావితం చేసింది.PPTel 708.3

    సౌలు శిబిరంలో నిద్రించి ఉన్నప్పుడు అతడి నీళ్ళ బుడ్డని ఈటెను తీసుకువెళ్ళిన సందర్భములో దావీదు చేసిన కటువైన మందలింపు అతడి క్రోధాన్ని ఇంతలంతలు చేసింది. రాజా ఇశ్రాయేలు ప్రజలూ వింటుండగా దావీదు ఈ విధముగా అనటం అతడు జ్ఞాపకం చేసుకున్నాడు. “నీవు మగవాడవుకావా? ఇశ్రాయేలీయులలో నీవంటి వాడెవడు? నీకు యాజమానుడగు రాజునకు నీవెందుకు కాపుకాయకపోతివి?.... నీ ప్రవర్తన అనుకూలము కాదు. నీవు శిక్షకు పాత్రుడవే. యెహోవా చేత అభిషేకము నొందిన నీ యేలినవానికి నీవు రక్షకముగా నుండలేదు” ఈ మందలింపు అతడి మనసులో గూడుకట్టుకొని ఉంది. ఇశ్రాయేలు రాజ్యాన్ని విభజించి తద్వారా తన ఉన్నతని చాటుకోవటానికిగాను తన ప్రతీకార క్రియను జరిగించాలని నిశ్చయించుకొన్నాడు. స్వప్రయోజనాలతో కూడిన తన ఉద్దేశాల్ని నెరవేర్చుకవోటానికి మరణించిన రాజవంశ ప్రతినిధి ఒకణ్ణి ఉపయోగించుకున్నాడు. ప్రజలు యోనాతామని అభిమానించిన సంగతి అతడికి తెలిసందే. యోనాతాను జ్ఞాపకాలు ప్రజల మనసుల్లో నిలిచిపోయాయి. సౌలు వలన తొలి దినాల్లో జరిగిన విజయవంతమైన దండయాత్రల్ని సైనికులు మర్చిపోలేదు. ఒక మంచి కార్యాన్ని సాధించటానికి ఉపకరించే దీక్షతోను పట్టుదలోను ఈ తిరుగుబాటు నేత తన ప్రణాళికల అమలుకు పూనిక వహించాడు.PPTel 709.1

    యోర్దాను అవలి పక్క ఉన్న మహానయీము దావీదు వలన లేదా ఫిలిప్తీయుల వలన సంభవించగల దాడుల నుంచి ఎక్కువ భద్రత కూర్చుతుంది. గనుక దాన్ని రాజ నివాసానికి ఎంపిక చేసారు. ఇక్కడ ఇష్బా షెతు పట్టాభిషేకం జరిగింది. యోర్ధానకు తూర్పున ఉన్న గోత్రాలు మొదట అతడి పరిపాలనను అంగీకరించాయి. తుదకు యూదా తప్ప ఇశ్రాయేలు దేశమంతా అంగీకరించింది. సౌలుకుమారుడు మారుమూల ఉన్న తన రాజ నగరిలో తన గౌరవాదరాల్ని అనుభవించాడు. అయితే తన అధికారాన్ని ఇశ్రాయేలు దేశమంతటికి విస్తరింపజెయ్యాలని అత్రుతపడుతున్న అబ్నేరు తీవ్ర పోరాటాలకు సమాయత్తమవుతున్నాడు. ‘సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులకును బహు కాలము యద్దుము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను; సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను”.PPTel 709.2

    పగ దురాశవల్ల స్థాపితమైన పాలనను చివరికి నమ్మక ద్రోహం కూలదోసింది. బలహీనుడు అసమర్దుడు అయిన ఇష్బోషెతు పాలనతో విసిగిన అబ్నేరు దావీదు పక్షానికి ఫిరాయించి ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిని తన వద్దకు తీసుకు వస్తానని దావీదుకి వాగ్దానం చేసాదు. అతడి ప్రతిపాదనల్ని రాజు అంగీకరించాడు. ఆ కార్యసాధనకు రాజు అతణ్ణి గౌరవంగా నియోగించాడు. అయితే గొప్ప సాహసం ప్రతిభ గల ఆ యోధుడికి లభించిన ఆదరాభిమానాలు దావీదు సేనాపతి అయిన యోవాబుకి ఈర్ష్య కలిగించాయి. అబ్నేరు యోవాబుల మధ్య తీవ్ర కుటుంబ శత్రుత్వం ఉంది. ఇశ్రాయేలుకి యూదాకి మధ్య జరిగిన యుద్ధంలో అబ్నేరు యోవాబు సోదరుడు ఆశా హేలుని చంపాడు. సోదరుడి చావుకి ప్రతీకారం తీర్చుకోవటానికి కాగల ప్రత్యర్ధిని తొలగించుకోవాలన్న ఉద్దేశంతోను యోవాబు దారికాచి అబ్నేరుని హత్య చేసాడుPPTel 709.3

    ఈ విశ్వాస ఘాతుక చర్య గురించి విన్న దావీదు ఇలా స్పందించాడు. “నేనును నా రాజ్యమును నేరు కుమారుడగు అబ్నేరు ప్రాణము తీయుట విషయములో యెహోవా సన్నిధిని ఎప్పటికిని నిరపరాధులమే. ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరని మీదను మోపబడునుగాక” రాజ్యం ఇంకా సుస్థిరం కాకపోవటాన్ని హంతకుల అధికారాన్ని హోదాని - యోవాబు సోదరుడు అబీ షై అతడితో ఏకమ్వటాన్ని మనసులో ఉంచుకొని నేరానికి తగిన శిక్షను దావీదు విధించలేకపోయాని ఆ నేరాన్ని తీవ్రంగా ఖండించాడు. ఆ విషయమై తన ద్వేషాన్ని బహిరంగంగా ప్రదర్శించాడు. అబ్నేరు సమాధి గౌరవ మర్యాదలతో జరిగింది,. సైన్యం యోవాబు నేతృత్వంలో సంతాప కార్యక్రమంలో పాలు పొందింది. బట్టలు చింపుకొని గోనెబట్టులు ధరించి సైన్యం సంతాపం వ్యక్తం చేసింది. సమాధి జరిగిన రోజు ఉపవాసం ఉండటం ద్వారా రాజు తన సంతాపాన్ని వ్యక్తం చేసాడు. ప్రధాన సంతాపకుడిగా శవపేటిక వెంబడి వెళ్ళాడు. సమాధి వద్ద సంతాప గీతం వల్లించాడు. ఆ గీతం హంతకులికి తీవ్రమైన మందలింపు. రాజు అబ్నేరుని గురించి సంతోషపడుతూ ఇలా అన్నాడు : PPTel 710.1

    “అబ్నేరూ
    నీచుడొకడకు చచ్చునట్లుగా నీవు చావ తగునా?
    నీ చేతులకు కట్టు లేకుండగను
    నీ కాళ్ళకు సంకెళ్ళు లేకుండగను
    దోషకారి యెదుట ఒకడు పడునట్లు నీవు పడితివే”
    PPTel 710.2

    తనకు బద్ద శత్రవుగా ఉన్న ఒక వ్యక్తి పట్ల దావీదు ఔదార్యం గుర్తింపు ఇశ్రాయేలు ప్రజల విశ్వాసాన్ని మెచ్చుకోళ్ళను పొందాయి. “జనులందరు ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిరి. రాజు చేయునదంతయు జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమాయెను. నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరణ వలననైనది కాదని ఆ దినమున జనులందరికిని తెలియబడెనె”. తనకు విశ్వాసపాత్రులైన సలహాదారులు సహచరులతో రాజు ఆ నేరాన్ని గురించి వ్యక్తిగతంగా చర్చించాడు. తాననుకొన్న రీతిగా హంతుకుల్ని శిక్షించటానికి ఆశక్తతను వివరిస్తూ దేవుడే వరికి తీర్పు తీర్చుతాడని విడిచి పెట్టాడు. “నేటి దినమున పడిపోయినవాడు ఇశ్రాయేలువారిలో ప్రధానుడనియు పెద్దలలో ఒకడనయు మీకు తెలిసేయున్నది. పట్టాభిషేకము నొందినవాడనైనను నేడు నేను బలహీనుడనైదిని. సెరూయా కుమారులైన యీ మనుష్యులు నాకంటే బలము గలవారు. అతడు జరిగించిన దుష్క్రియనుబట్టి యెహోవా కీడు చేసినవానికి ప్రతికీడు చేయునుగాక”.PPTel 710.3

    అబ్నేరు దావీదుకు చేసిన సూచనల విషయంలో నిజాయితీగా వ్యవహరించాడు. అయినాఅతడి ఉద్దేశాలు చెడ్డవి. అవి స్వార్ధంతో నిండి ఉన్నాయి. స్వీయ ప్రతిష్ఠకోసం అతడు దేవుడు నియమించిన రాజుని అవిశ్రాంతంగా వ్యతిరేకిస్తూ వచ్చాడు : తాను దీర్ఘకాలంగా ఏ కార్యసాధనకు కృషి చేశాడో దాన్ని ద్వేషం, దెబ్బతిన్న ఆత్మాభిమానం, ఉద్రేకం వల్ల విడిచి పెట్టేశాడు. దావీదు పక్షానికి ఫిరాయించటం వల్ల ఉన్నత, హోదా, గౌరవ స్థానం సంపాదించాలని ఆశించాడు. ఇందులో అతడు సఫలుడైతే అతడి సామర్థ్యం, అతడి పలుకుబడి, భక్తి రాహిత్యం వల్ల దావీదు సింహాసనానికి దేశ శాంతి భద్రతలకు, ప్రగతికి గొప్ప ముప్పు వాటిల్లేది.PPTel 711.1

    “హెబ్రోనులో అబ్నేరు చనిపోయెనును సంగతి సౌలు కుమారుడు విని అధైర్య పడెను. ఇశ్రాయేలు వారి కందరికి ఏమియు తోచక యుండెను”. ఆ రాజ్యం ఎక్కువ కాలం కొనసాగటం కష్టమని బోధపడింది. క్షీణిస్తున్న అధికారం పతనాన్ని ఇంకొక విద్రోహచర్య పూర్తి చేసింది. ఇష్బో షేతు సైన్యాధికారులిద్దరు ఇష్బో షెతను యూదా రాజు ప్రాపకం అన్యాయంగా సంపాదించటానికి అతడి తలతో రాజు వద్దకు వెళ్ళారు.PPTel 711.2

    కారుతున్న రక్తమే తమ నేరానికి సాక్ష్యంగా వారు దావీదు ముందు నిలచి ఇలా అన్నారు. “చిత్తగించుము, నీ ప్రాణము తీయు చూచిన సౌలుకుమారుడైన ఇష్బో షెతు తలను మేము తెచ్చియున్నాము. ఈ దినమున యెహోవా మా యేలినవాడవును రాజవునగు నీ పక్షమున సౌలుకును అతని సంతతికి ప్రతీకారము చేసియున్నాడు” ఎవరి సింహాసనాన్ని సాక్షాత్తు దేవుడే స్థాపించాడో ఎవరిని తన శత్రువు చేతి నుంచి దేవుడే విడిపించాడో ఆ దావీదు తన అధికారాన్ని స్థిపర్చుకోవటానికి నమ్మకద్రోహ చర్యల సహాయాన్ని అర్థించలేదు. సౌలుని చంపానని హెచ్చులు చెప్పుకొన్నవాడికి వచ్చిన మరణదండనను గురించి దావీదు ఈ హంతకులకు చెప్పాడు. “దుర్మార్గులైన మీరు ఇష్బో షెతు ఇంటిలో చొరబడి, అతని మంచముమీదనే నిర్దోషియగు వానిని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణదోషము విచారించకపోవుదునా? లోకములో నుండకుండ నేను మిమ్మును తీసివేయక మానుదునా.... అని చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుష్యులను చంపి... ఇష్బో షెతు తలను తీసుకొనిపోయి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతి పెట్టిరి”.PPTel 711.3

    ఇష్బో షేతు మరణం అనంతరం ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటికి దావీదు రాజు కావాలని ప్రధాన వ్యక్తుల సమాజం అభీష్టాన్ని వ్యక్తం చేసారు. “ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదునొద్దకు వచ్చి చిత్తగింపుము మేమునీ ఎముకనంటివారము. రక్త సంబంధులము.. నీవు ఇశ్రాయేలులను నడిపించువాడై యుంటిని. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలీయులను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతియై యుందువని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చియున్నాడని చెప్పిరి. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరు హెబ్రోనులో రాజునొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను”. ఈ విధంగా దేవుని చిత్తాన్ననుసరించి అతడు రాజుగా సింహాసనాన్ని అధీష్టించటానికి మార్గం సుగమమయ్యింది. అతడికి వ్యక్తిగతమైన ఆశలేవి లేవు. తనకు కలిగిన గౌరవ మర్యాదల కోసం దావీదు కృషి చేయలేదు.PPTel 712.1

    అహరోను వంశీయులికి లేవీయులకి చెందిన ఎనిమిది వేల మందికి మించి దావీదు సేవల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రజల అభిప్రాయాల్లో నిర్ణయాత్మకమైన మార్పు చోటు చేసుకొంది. అది గుట్టుచప్పుడు కాకుండా గౌరవ ప్రదంగా వారు చేస్తున్న మహత్తర సేవకు అనుగుణంగా సంభవించిన విప్లవం. క్రితంలో సౌలు ప్రజలైన అయిదు లక్షల మంది హెబ్రోనులోను పరిసర ప్రాంతాల్లోను సమావేశమయ్యారు. కొండలు లోయలు ప్రజాసమూహాల్తో కిటకిటలాడాయి. పట్టాభిషేకానికి సమయం నిర్దేశితమయ్యింది. సౌలు ఆస్థానంలోంచి బహిష్కృతుడైన వ్యక్తి. తన ప్రాణాలు దక్కించుకొనే ప్రయత్నంలో పర్వతాలు, కొండలు, గుహల్లో దాక్కొన్న వ్యక్తి తోటి మానవుడు ఇవ్వగల అత్యున్నత ప్రతిష్టను అందుకోవాటానికి సిద్ధంగా ఉన్నాడు., మతపరమైన దుస్తులు ధరించిన యాజకులు పెద్దలు, తళతళ మెరిసే ఈటెలు శిరస్త్రాణాలు ధరించిన సైనికులు అధికారులు, సూదూర ప్రాంతాల నుంచి వచ్చిన పరదేశులు, ఎంపికయిన రాజు పట్టాభిషేక మహోత్సావాన్ని తిలకించటానికి నిలబడి ఉన్నారు. దావీదు రాజవస్త్రాలు ధరించాడు. ప్రధాన యాజకుడు అతడి తలమీద పరిశుద్ధ తైలాన్ని పూశాడు. నాడు సమూయేలు నిర్వహిచంని అభిషేకం అతడు రాజైనప్పుడు ఏమి సంభవించనున్నదో దాన్ని సూచించింది. సమయం అయ్యింది పవిత్రాచారం మేరకు అతణ్ణి దేవుని ప్రతినిధిగా తన హోదాకు ప్రతిష్టించటం జరిగింది. అతడి చేతికి రాజ దండం ఇచ్చారు. అతడి నీతి సార్వభౌమత్వ నిబంధన విరచితమయ్యింది. ప్రజలు తమ ప్రభు భక్తిని ప్రమాణం చేసారు. అతడి శిరం మీద రాజకిరీటం పెట్టారు. అంతటితో పట్టాభిషేకోత్సవం ముగిసింది. దైవ నియామకం చొప్పున ఇశ్రాయేలుకి రాజు లభించాడు. దైవ నియామకం కోసం ఓర్పుతో కనిపెట్టిన దావీదు దైవ వాగ్దాన నెరేవర్పును చూశాడు. ” దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను”. 2 సమూయేలు 5:10PPTel 712.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents