Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    48—కనాను విభజన

    బేత్ హోనోను విజయం అనంతరం దక్షిణ కనాన్ను జయించటం జరిగింది. “అప్పుడు యెహోషువ మన ప్రదేశమును దక్షిణ ప్రదేశమును షఫేలా ప్రదేశమును చరియల ప్రదేశమును..జయించెను..ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులందరిని వారి దేశములను యెహోషువ ఒక దెబ్బతో పట్టుకొనెను. తరువాత యెహోషువయు అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును గిలులోని పాళెమునకు తిరిగి వచ్చిరి”.PPTel 505.1

    ఇశ్రాయేలీయులు సాధిస్తున్న విజయాల గురించి తీవ్ర భయాందోళనలకు గురి అయిన ఉత్తర పాలస్తీనాలోని జాతుల వారు వారికి వ్యతిరేకంగా ఒక కూటమిగా జట్టుకట్టారు. ఈ కూటమికి హాసోరు రాజైన యాబీను నాయకుడు. అతని రాజ్యం మేరోము నీళ్లకు పశ్చిమాన ఉన్నది. “వారు... తమ నాయకులందరిని సమకూర్చుకొని విస్తారమైన గుఱ్ఱములతోను, రథములతోను... ఆ రాజులందరును కూడుకొని... బయలుదేరిరి. “కనానులో ఇశ్రాయేలీయులు తలపడ్డ సైన్యమలన్నిటిలో ఈ సైన్యం ఎంతో పెద్దది - “సముద్రతీరమందలి యిసుకరేణువులంత విస్తారముగానున్న తమ సైనికులందరిని సమకూర్చుకొని విస్తారమైన గుఱ్ఱములతోను.. ఆ రాజులందరు కూడుకొని ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మేరోము నీళ్ల యొద్దకు వచ్చి” దిగారు. యెహోషువకి మళ్లీ ఈ ఉత్సాహపూరిత వర్తమానం దేవుని వద్ద నుంచి వచ్చింది. “వారికి భయపడకుము. రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరించబడిన వారినిగా నేను వారినందరిని అప్పగించెదను”.PPTel 505.2

    వారు మేరోము నీళ్లవద్ద వున్న శత్రువుపై పడి వారి సేనల్ని సర్వనాశనం చేశారు. “యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించెను. వీరు వారిని హతము చేసి... వారిని తరమి నిశ్శేషముగా చంపిరి.” కనానీయులకు గర్వకారణమైన రథాలు, గుర్రాల్ని తీసుకోరాదన్నది దేవుని ఆదేశం. దేవుని ఆదేశం చొప్పున రథాల్ని దహనం చేశారు. గుర్రాల కాలినరాలు నరికి వాటిని యుద్దానికి పనికిరాకుండా చేశారు. రథాల మీద గుర్రాల మీద కాక ఇశ్రాయేలీయులు “తమ దేవుని మీద” నమ్మకం పెట్టుకోవాల్సి ఉన్నారు.PPTel 505.3

    వారి పట్టనాలన్నిటిని ఇశ్రాయేలీయులు స్వాధీనపర్చుకొన్నారు. కూటమికి ఆశ్రయదుర్గమైన హాసోరును కాల్చివేశారు. యుద్ధం కొన్ని సంవత్సరాలు కొనసాగింది. యుద్ధం ముగిసినప్పుడు కనానంతా యెహోషువ వశమయ్యింది.. “అప్పుడు యుద్ధము లేకుండ దేశము సుభిక్షముగా నుండెను”. PPTel 506.1

    కనానీయుల శక్తి పతనమైనప్పటికీ వారు పూర్తిగా నిర్మూలం కాలేదు. పశ్చిమదిక్కున సముద్రం పొడవునా ఉన్న సారవంతమైన మైదానం ఫిలీప్తీయుల ఆధీనంలో ఉంది. వారికి ఉత్తరాన సిదోనీయుల దేశం ఉంది. లెబానోను కూడా వారి స్వాధీనంలోనే ఉంది. దక్షిణాన ఐగుప్తు దిశగా ఉన్న భూభాగం ఇంకా ఇశ్రాయేలీయుల శత్రువుల వశంలోనే ఉంది.PPTel 506.2

    కాగా యోహోషువ ఇక యుద్ధం కొనసాగించటానికి లేదు. ఇశ్రాయేలీయుల నాయకుడుగా బాధ్యతలు విరమించకముందు యెహోషువ చేయాల్సిన పని ఇంకొకటుంది. దేశమంతటిలో స్వాధీనం చేసుకొన్న భూభాగాన్నీ, ఇంకా స్వాధీనం చేసుకోవాల్సి భూభాగాన్ని ఇశ్రాయేలీయుల గోత్రాలకు విభజించాల్సి ఉంది. ప్రతీ గోత్రం తన తన స్వాస్థ్యాన్ని పూర్తిగా స్వాధీన పర్చుకోటం దాని బాధ్యత. వారు దేవునికి నమ్మకస్తులై ఉంటే శత్రువుల్ని తమ మధ్య నుంచి ఆయనే తరిమి వేస్తాడు. వారు ఆయన నిబంధనకు విధేయులై ఉంటే మరింత సంపదనిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. PPTel 506.3

    భూమి పంపిణీ బాధ్యతను దేవుడు యాజకుడైన ఎలియాజరుకు, గోత్రాల అధిపతులకు యెహోషువకు అప్పగించాడు. ప్రతీ గోత్రానికి స్థల నిర్దేశం చీట్ల ద్వారా జరగాల్సి ఉంది. ఇశ్రాయేలీయులు కనానుని స్వాధీనం చేసుకొన్నప్పుడు గోత్రాలకు భూ విభజన నిమిత్తం దేశ సరిహద్దుల్ని మోషేని నియమించాడు. విభజన కార్యాన్ని నిర్వహించటానికి ప్రతీ గోత్రం నుంచి ఒక ప్రధానిని నియమించాడు. గుడార సేవలకు అంకితమైన లేవీ గోత్రాన్ని ఇందులో లెక్కించలేదు. కాని దేశములో ఆయా ప్రాంతాల్లో నలభై ఎనిమిది పట్టణాల్ని లేవీయులకి తమ స్వాస్థ్యంగా ఇచ్చారు.PPTel 506.4

    భూమి పంపిణి ప్రారంభానికి ముందు కాలేబు తన గోత్రం నాయకులతో కలిసి వచ్చి తన ప్రత్యేక హక్కును గూర్చి యెహోషువతో ప్రస్తావించాడు. యెహోషువను మినహాయిస్తే కాలేబు ఇశ్రాయేలీయులందరిలో అతి వృద్ధుడు. వాగ్రత్త భూమిని గురించి మంచి వార్త తెచ్చి ప్రభువు నామంలో ముందుకు అడుగువేసి ఆ దేశాన్ని స్వాధీన పర్చుకోవాల్సిందిగా ప్రోత్సహించిన ఇద్దరు వేగులవారు కాలేదు, యెహోషువలే. తన విశ్వసనీయతకు ప్రతిఫలంగా అప్పుడు దేవుడు చేసిన వాగ్దానాన్ని కాలేబు ఇప్పుడు యెహోషువకు గుర్తు చేస్తున్నాడు, “నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని గనుక నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకును, నీ సంతానమునకును ఎల్లప్పుడును స్వాస్థ్యముగా నుండును”. కనుక తనకు హెబ్రోనును స్వాస్థ్యంగా ఇవ్వాల్సిందిగా కాలేబు మనవి చేశాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు అనేక సంవత్సరాలు నివసించే ఇక్కడే మక్పేలా గుహాలో సమాధి అయ్యారు. ఎవరి ఆకారం చూసి వేగులవారు బెంబేలెత్తారో, ఎవరి మూలంగా ఇశ్రాయేలీయుల ధైర్యం నాశనమయ్యిందో భయంకరులైన ఆ అనాకీయులకి హెబ్రోను కేంద్రం. దేవుని బలాన్ని నమ్ముకొని కాలేబు తన స్వాస్థ్యంగా ఎంపిక చేసుకొన్న స్థలం అందరి స్థలాలకన్నా ఉన్నత స్థాయిలో ఉంది.PPTel 506.5

    “యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి... ఈ నలువది ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడియున్నాడు. ఇదిగో నేనిప్పుడు ఎనుబదియయి దేండ్ల వాడను. మోషే నన్ను పంపినాడు. నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకుగాని, వచ్చుచు పోవుచునుండుటకు గాని నాకెన్నటియట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన గల గొప్ప పట్టణములును అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడైయుండిన యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీన పరచు కొందురు.” కాలేబు చేసిన ఈ మనవికి యూదా ప్రధానులు మద్దతు పలికారు. భూమి విభజన నిమిత్తం ఈ గోత్రం నుంచి కాలేబు ఎన్నిక కావటంతో తన విన్నపాన్ని యెహోషువకు సమర్పించటంలో ఈ మనుషుల్ని కలుపుకొన్నాడు. స్వీయ ప్రయోజనం కోసం తన అధికారాన్ని ఉపయోగించుకొన్నాడన్న అపవా రాకుండా కాలేబు వారి మద్దతు తీసుకొన్నాడు.PPTel 507.1

    అతడు కోరింది తక్షణమే మంజూరయ్యింది. బలీయైన ఈ దుర్గాన్ని స్వాధీనం చేసుకొనే కార్యం ఇంకెవరికీ అప్పగించటం క్షేమం కాదు. “యెపున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను”. వేగులవారు సమర్పించిన చెడ్డ నివేదికను ఖండిచినప్పుడు కాలేబు ఎలాంటి విశ్వాసంతో ఉన్నాడో ఇప్పుడు కూడా అదే విశ్వాసంతో ఉన్నాడు. తన ప్రజలకు కనాను నిస్తానన్న దైవ వాగ్దానాన్ని చిత్తశుద్ధితో నమ్మి ఆయనను సంపూర్తిగా అనుసరించాడు. తన ప్రజలతో కలిసి అపరాధుల ఆశాభంగాల్ని, హృదయ భారాల్ని పంచుకొంటూ సుదీర్ఘ అరణ్య సంచారం చేశాడు. అయినా సణుగుకోలేదు. ఫిర్యాదులు చేయలేదు. అరణ్యంలో తన సహోదరులు రాలిపోగా తనను కాపాడిన కృపామయుడైన దేవుణ్ని సన్నుతించాడు. అరణ్య సంచార సుదర్షికాలంలో ఎదురైన ఈతిబాధలు, ప్రమాదాలు, తెగుళ్ల నడుమ కనాను ప్రవేశం నాటి నుంచి తాను పొందిన సుఖ దు:ఖాల్లో ప్రభువు తనను కాపాడాడు. ఇప్పుడు ఎనభై ఏళ్ల పైచిలుకు వయసులో తన బలం ఏమాత్రం తగ్గ లేదు. అప్పటికే తమ స్వాధీనంలో వున్న స్థలం ఇవ్వమని కాలేబు కోరలేదు. స్వాధీన పర్చుకోటానికి అసాధ్యమైందని వేగులవారు నిర్ధారించిన స్తలాన్ని కోరాడు. ఏ భీకర శరీరులు ఇశ్రాయేలీయుల విశ్వాసాల్ని కుదిపివేశారో వారి కోటను వారి వద్ద నుంచి దేవుని సహాయంతో స్వాధీన పర్చుకొంటానన్నాడు. అది ప్రతిష్ఠకోసం, అందలంకోసం మనవి కాదు. దేవుని గౌరవించటంలో ప్రజలముందు ఒక ఆదర్శాన్ని నిలపి తమ తండ్రులు అసాధ్యమని భావించిన భూభాగాన్ని పూర్తిగా స్వాధీనపర్చుకోటానికి గోత్రాలకు స్ఫూర్తి నివ్వాలన్నది ఈ వృద్ధ సాహస వీరుడి ఉద్దేశం.PPTel 507.2

    నలభై యేళ్లుగా తాను ఆశించిన స్వాస్థ్యం కాలేబు పొందాడు. దేవుని పై విశ్వాసముంచి, “అనాకు యొక్క ముగ్గురు కుమారులను... వెళ్లగొట్టి దేశమును స్వాధీనపరచుకొనెను”. తనకు తన వంశీయులకు స్వాస్థ్యం సంపాదించిన అనంతరం అతడి ఉత్సాహం అంతం కాలేదు. తన జాతి శ్రేయం కోసం దేవుని మహిమార్థం ఇంకా విజయాలు సాధించటానికి ముందుకి దూకాడు.PPTel 508.1

    పిరికివాడు తిరుగుబాటుదారులు అరణ్యంలో మరణించారు. అయితే నీతిమంతులై ఆ యిద్దరు వేగులవారు ఎష్కోలు ద్రాక్షపండ్లు తిన్నారు. వారిద్దరూ తమ విశ్వాసాన్ని బట్టి లబ్ధిపొందారు. అవిశ్వాసుల విషయంలో వారి భయాలు వాస్తవమయ్యాయి. దేవుడు వాగ్దానం చేసినప్పటికి ఈ కనానును స్వాధీనపర్చుకోటం అసాధ్యమని వారన్నారు. అలాగే వారు కనానును పొందలేకపోయారు. కాని దేవుని పై నమ్మకముంచినవారు తమకెదుదైన కష్టాలవంక చూడక సర్వశక్తుడైన తమ సహాయకుని వంక మాత్రమే చూశారు. వారు ఆ రమ్యమైన దేశంలో ప్రవేశించారు. మన పితరులు విశ్వాసమూలంగా “రాజ్యములను జయించిరి... ఖడ్గధారను తప్పించుకొనిరి: బల హీనులుగా ఉండి బలపరచబడిరి: యుద్ధములో పరాక్రమశాలులైరి: అన్యుల సేనలను పారదోలిరి” హెబ్రీ 11:33,34. “లోకమును జయించిన విజయము మన విశ్వాసమే” 1 యెహోను 5:4.PPTel 508.2

    భూమి విభజన సందర్భంగా కాలేబు స్ఫూర్తిని భేదించిన స్వభావం ఒకటి బయటపడింది. అది యోసేపు సంతతి అనగా ఎఫ్రాయిము గోత్రం, మన షే సగం గోత్రం ప్రదర్మించిన స్వభావం. తమ సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈ గోత్రాలు రెండురెట్లు భూమి కావాలని డిమాండు చేశాయి. వారికి విభాగించిన భూమి ఆ దేశంలో అతి సారవంతమైన భూమి. అందులో సారవంతమైన షారోను వారి భూభాగంలో ఉన్నది. కాని లోయలోని ప్రధాన పట్టణాల్లో చాలా పట్టణాలు కనానీయుల చేతుల్లో ఉన్నాయి. వాటిని జయించి స్వాధీన పర్చుకోటం శ్రమతోను, అపాయంతోను కూడిన పని అని భావించి వెనుకాడారు. అప్పటికే ఇశ్రాయేలీయుల వశంలో వున్న భూభాగాన్ని తమకు అదనంగా ఇవ్వాల్సిందిగా కోరారు. ఎఫ్రాయిము గోత్రం గోత్రాలన్నిటిలోనూ పెద్దది. అది యెహోషువ గోత్రం కూడా. అందువలన ఆ గోత్రం వారు తమకు ప్రత్యేకమైన హక్కు కావాలని కోరారు. “మాకేల ఒక్క చీటితో ఒక్క వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితిని? మేము ఒక గొప్ప జనమేగదా?”అన్నరు. న్యాయానికి కట్టుబడి ఉండే ఆ నాయకుడు అందుకు సమ్మతించలేదు.PPTel 509.1

    యెహోషువ ఇలా బదులు పలికాడు, “మీరు గొప్ప జనము గనుక ఎఫ్రాయిమీయుల యొక్క మన్యము మీకు ఇరుకుగా నున్న యెడల మీరు అడవికి పోయి అక్కడి పెరిజ్జీయుల దేశములోను, రెఫాయీముల దేశములోను మీకు మీరే చెట్లు నరుకుకొనుడి”.PPTel 509.2

    వారి సమాధానం తమ ఫిర్యాదుకి అసలు కారణాన్ని బయట పెట్టింది. కనానీయుల్ని తరిమి వేయటానికి అవసరమైన విశ్వాసం, ధైర్యం వారికి లోపించింది: “ఆ మన్యము మాకు చాలదు, అదియును గాక పల్లపుచాటున నివసించు కనానీయులకందరికి... రథములన్నవి” అన్నారు.PPTel 509.3

    ఇశ్రాయేలీయుల దేవుడు తన ప్రజలకు తన బలాన్ని వాగ్దానం చేశాడు. ఎఫ్రాయిమీయులకు కాలేబుకున్న ధైర్యం, విశ్వాసం ఉండి ఉంటే వారి ముందు ఏ శత్రువులూ నిలువగలిగే వారు కారు. కష్టాల్ని, అపాయాల్ని ఎదుర్కోకూడదన్న వారి ప్రయత్నాకి యెహోషువ బలమైన అడ్డుకట్ట వేశాడు. “మీరు ఒక విస్తార జనము, మీకు అధిక బలము కలదు... కనానీయులకు ఇనుప రథములుండినను వారు బలవంతులై యుండినను మీరు వారి దేశమును స్వాధీనపరచుకొనగలరు”.. ఇలా తమ వాదనలతోనే వారిని తిప్పికొట్టాడు. తాము చెప్పుకొంటున్నట్లు వారు గొప్ప జనం కాబట్టి తమ సహోదరులకు మల్లే వారు కూడా తమ దారి వారు చూసుకోటానికి సమర్థులు. దేవుని అండ ఉన్నవాడు ఇనుప రథాలకు భయపడనవరంలేదు.PPTel 509.4

    అప్పటి వరకు గిల్గాలు దేశానికి ప్రధాన కార్యాలయం, గుడారానికి పీఠం. అయితే గుడారాన్ని ఇప్పుడు దాని శాశ్వత స్థలానికి తరలించాల్సి ఉంది. అది ఎఫ్రాయీము వాటాలో షిలోహు అన్న పేరు గల చిన్న పట్టణం. అది దేశం కేంద్రానికి దగ్గరలో ఉండి అన్ని గోత్రాలు సులభంగా వచ్చి పోవటానికి అనువుగా ఉంది. ఇక్కడ దేశంలో ఒక భాగం పూర్తిగా ఇశ్రాయేలీయుల స్వాధీనంలో ఉన్నందున భక్తులకు ఎలాంటి కష్టాలూ లేవు. “ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీన పరచుకొనిన తరువాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి”. గిల్గాలు నుంచి గుడారం స్థాన చలనం పొంది తర్వాత కూడా అక్కడే వున్న గోత్రాలు షిలోహుకు సమీపంలో గుడారాలు వేసుకొని తమ తమ స్వాస్థ్యాలన్నీ స్వాధీనం చేసుకొనే వరకూ అక్కడే ఉండిపోయారు.PPTel 510.1

    మందసం మూడువందల సంవత్సరాలు షిలోహులో ఉన్నది. ఏలీ సంతతి వారి పాపాలవల్ల ఫిలిప్తీయులకు పట్టుబడి షిలోహు నాశనమయ్యే తరుణం వరకూ అది షిలోహులోనే ఉన్నది. మందసం ఇక్కడున్న గుడారంలోకి మళ్లీ రాలేదు. గుడార సేనలు యెరుషలేములోని దేవాలయానికి బదలీ అయ్యాయి. దానితో షిలోహు ప్రాముఖ్యాన్ని కోల్పోయింది. ఆ స్థలంలో ఇప్పుడు శిథిలాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. చాలాకాలం తర్వాత దాని అనుభవం ఒక హెచ్చరికగా పరిగణ మించింది. యిర్మీయా ప్రవక్త పరిముఖంగా ప్రభువిలా అంటున్నాడు, “పూర్వము నేను నీ నామమములో నిలపిన షిలోహునందున్న నా స్థలమునకు పొయి విచారణ చేయుడి, ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడండి... నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామము పెట్టబడిన యీ మందిరమునకును మీకును మీ తల్లితండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను అలాగే చేయుదును” యిర్మీయా 7:12-14.PPTel 510.2

    భూమి పంపకం ముగిసినప్పుడు అన్ని గోత్రాల వారు తమ తమ స్వాస్థ్యం పొందాక యెహోషువ తన భాగం తీసుకొన్నాడు. కాలేబుకు మల్లే తనకు కూడా ప్రత్యేక స్వాస్థ్యం దేవుడు వాగ్దానం చేశాడు. అయినా యెహోషువ పెద్ద భూభాగం కోరక ఒక్క పట్టణాన్ని మాత్రమే కోరాడు. “వారు అతడు అడిగిన పట్టణమును.. అతనికిచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను. ఆ పట్టణం పేరు తిమ్మత్సెరహు. “మిగిలిపోయెన భాగం” అని దాని అర్థం. ఇది ఆ మహానుభావుడి ఉదాత్త ప్రవర్తనకు స్వార్థరహిత స్వభావానికి నిదర్శనం. ఓడిపోయిన శత్రువుల సొమ్మును పంచుకోటంలో ముందుండకుండా ప్రజల్లో అత్యల్పుడికిచ్చిన తదనంతరం తన భాగం తీసుకొన్న ఉత్తముడు యెహోషువ.PPTel 510.3

    లేవీయులికి వచ్చిన పట్టణాల్లో ఆరు ఆశ్రయ పురాలుగా నిర్దేశితమయ్యా యి. నరహంతకుడు ప్రాణరక్షణ నిమిత్తం ఈ పురాల్లోకి వెళ్లవచ్చు. ఈ ఆశ్రయ పురాలు యోర్దానుకి ఈ పక్క మూడు ఆ పక్క మూడు ఏర్పాటయ్యాయి. “పొరపాటున ఒకని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజము నెదుట ఉంచువరకు వాడు మరణశిక్ష నొందకూడదు గనుక ప్రతిహత్య చేయువాడు రాకుండా అవి మీకు ఆశ్రయ పురములుగా ఉండు” నిమిత్తం వాటి ఏర్పాటును మోషే ఆదేశించాడు. సంఖ్యా 35:11, 12. పూర్వం వ్యక్తిగత ప్రతీకార సంప్రదాయం సమాజంలో ఉండేది. దీని ప్రకారం హంతుకుణ్ని శిక్షంచే బాధ్యత మృతుడి దగ్గర బంధువుల మీద లేక వారసుడి మీద పడేది. ఈ కారణంగా దయతో కూడిన ఈ వెసులుబాటు అవసరమయ్యింది. అపరాధం స్పష్టంగా కనిపించే సందర్భాల్లో న్యాయాధిపతి శిక్ష విధించేవరకు ఆగనవసరం లేదు. ప్రతీకారం తల పెట్టే వ్యక్తి హంతకుణ్ని వెంటాడి ఎక్కడ దొరికే అక్కడ చంపవచ్చు. ఈ సంప్రదాయాన్ని ఆ సమయంలో అంతం చేయటం మంచిది కాదని భావించి పొరపాటున హత్యచేసి వారి క్షేమం కోసం ప్రభువు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. PPTel 511.1

    దేశంలో ప్రతీ ప్రాంతం నుంచి ఒక పూట ప్రయాణం చేసి చేరగలిగేటట్లు ఈ ఆశ్రమ పురాలు నిర్మితి అయ్యాయి. వాటికి వెళ్ళే రహదారులు మరమత్తులు అవసరం లేకుండా మంచి స్థితిలో కొనసాగాల్సి ఉన్నవి. పారిపోతున్న వ్యక్తి పొరపడకుండేందుకు “ఆశ్రయం” అన్న మాటను పెద్ద అక్షరాలతో రాసిన బల్లల్ని ఆ పట్టణాలకు వెళ్ళే మార్గం పొడవునా వేలాడ కట్టాలి. హెబ్రీయుడు, పరదేశి లేక యాత్రికుడు అన్న బేధం లేకుండా ఎవరైనా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. నిరపరాధులు హతులు కాకూడదు. అపరాధులు శిక్ష తప్పించుకోకూడదు. పారిపోయిన వారి కేసును అధికారులు పరీక్షించి అది కావాలని చేసిన హత్య కాదని తేలినప్పుడే హంతకులకు ఆశ్రయపురంలో పరిరక్షణ కల్పించేవారు. అపరాధుల్ని ప్రతిహత్య చేసే వారికి విడిచి పెట్టేవారు. ఆశ్రయపురంలో పరిరక్షణ కోరేవారు నిర్దిష్ట ఆశ్రయపురంలోపల ఉండటమన్న షరతు నెరవేర్పు ద్వారా మాత్రమే దాన్ని పొందేవారు. ఏర్పాటైన హద్దులు దాటి ఎవరైన సంచరించటం జరిగి ప్రతిహత్య చేసే వాడికి దొరికితే దేవుడు ఏర్పాటును నిర్లక్ష్యం చేసినందుకు అతడు తన ప్రాణంతో జరిమానా చెల్లించేవాడు. పోతే, ప్రధాన యాజకుడు మరణించాల్సినప్పుడు ఆశ్రయ పురాల్లో తల దాచుకొంటున్న వారందరు తమ తమ స్థలాలకు తిరిగి వెళ్ళిపోటానికి స్వేచ్ఛ పొందేవారు.PPTel 511.2

    హత్య సంబంధిత శిక్ష విషయంలో బలమైన నిదర్శనం ఉన్నప్పటికీ నిందితుణ్ని ఒకే సాక్షి వాంగ్మూలం పై శిక్షించటానికి లేదు. దేవుని ఆదేశం ఇలాగుంది “ఎవడైనను ఒకని చావగొట్టిన యెడల సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతకునికి మరణ శిక్ష విధింపవలెను. ఒక సాక్షి మాట మీదనే యెవనికిని మరణశిక్ష విధింపకూడదు”. సంఖ్యా 35:30. ఇశ్రాయేలీయుల విషయంలో క్రీస్తే మో షేకి ఈ ఆదేశాలిచ్చాడు. లోకంలో వ్యక్తిగతంగా తన శిష్యులతో నివసించినప్పుడు తప్పుచేసిన వారితో ఎలా వ్యవహరించటమన్న అంశం పై బోధించినప్పుడు ఒక్క సాక్ష్యం పై నిందుతుణ్ని శిక్షించటం గాని విడిచి పెట్టెయ్యటం గాని చేయకూడదన్న పాఠం ఆ మహా భోధకుడు బోధించాడు. ఒకే వ్యక్తి భావాలు అభిప్రాయాల ఆధారం వివాదాంశాల్ని పరిష్కరించకూడదు. “ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచునట్లు” ఈ విషయాల్లో ఇద్దరు ఇద్దరికన్నా ఎక్కువ మంది సాక్షులు ఉండ టం వారందరు కలిసి బాధ్యత వహించటం మంచిది. మత్తయి 18:16.PPTel 512.1

    హత్యకు విచారణ ఎదుక్కొంటున్న వ్యక్తి నేరస్తుడని రుజువైతే అతణ్ని ప్రయాశ్చిత్తంగాని, బంధ విమోచన ధనం గాని రక్షించలేదు. “నరుని రక్తమును చిందించువాని రక్తము నరుని వలననే చిందింపబడును” ఆదికాండము 9:6. “చావతగిన నరహంతకుని ప్రాణము కొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణ శిక్ష విధింపవలెను”. “వాడు నా బలిపీఠము నాశ్రయించినను వాని లాగివేసి చంపవలెను” అన్నది దేవుని ఆజ్ఞ. “దేశములో చిందించిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేనివలనను కలుగదు” సంఖ్యా 35:31,33, నిర్గమ 21:14. జాతి క్షేమం, జాతి పవిత్రత హత్యాపాపాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండు చేస్తున్నాయి. దేవుడు మాత్రమే ఇవ్వగల మానవ ప్రాణాన్ని పవిత్రంగా కాపాడటం అవసరం.PPTel 512.2

    పూర్వం దేవుడు తన ప్రజలకు ఏర్పాటు చేసిన ఆశ్రయపురాలు క్రీస్తులో ఏర్పాటైన ఆశ్రాయానికి చిహ్నం. లోక జీవితంలో ఆశ్రయపురాల్ని ఏర్పాటు చేసిన దయామయ రక్షకుడే దైవ ధర్మవశాస్త్రాన్ని అతిక్రమించే వారికి తన రక్తం చిందించటం ద్వారా ఒక నిశ్చయమైన ఆశ్రయాన్ని ఏర్పాటు చేశాడు. రెండో మరణం నుంచి క్షేమంగా నివసించేందుకు వారు ఆ ఆశ్రయంలోకి పారిపోవచ్చు. క్షమాభిక్ష వేడుకొంటూ ఆయన వద్దకు వెళ్ళేవారిని ఏ శక్తి కూడా ఆయన నుంచి వేరుచేయలేదు. “కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియులేదు” “శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే” “మన యెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసిన వాగ్దానమును దృఢపరచెను”. రోమా 8:1, 31, హెబ్రీ 6:18.PPTel 512.3

    ఆశ్రయపురానికి పారిపోయే వ్యక్తి జాప్యం చేయటానికి లేదు. కుటుంబాన్ని ఉద్యోగాన్ని విడిచి పెట్టాలి. ఆత్యీయులికి జాగ్రత్తలు చెప్పేందుకు వ్యవధిలేదు. అతడి ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. సురక్షిత స్థలానికి చేరటం ప్రధానం. తక్కిన అంశాల్ని ఆసక్తుల్ని త్యాగం చేయక తప్పదు. పడ్డ శ్రమ జ్ఞప్తికిరాదు. కష్టాలు బాధలు లెక్కలోకి రావు. ఆశ్రయపురంలోపల అడుగు పెట్టే వరకూ శరణార్థి తన పరుగు వేగం తగ్గించటానికి సాహసించాడు.PPTel 513.1

    క్రీస్తులో ఆశ్రయం కొనుగొనే వరకూ పాపి మరణానికి గురి అయి నివసిస్తాడు. హంతకుడు ఇటూ అటూ తిరుగుతూండటం తాను బతికి ఉండే ఒకే ఒక అవకాశాన్ని భగ్నం చేసుకోటమే. జాప్యం , ఉదాసీనత ఆత్మకు నాశనం తెచ్చి పెడ్తాయి. ప్రజాశత్రువైన సాతాను ధర్మశాస్త్రాన్ని అతిక్రమించే ప్రతీ వారికి దాసులవుతాడు. పొంచి ఉన్న అపాయాన్ని గ్రహించి నిత్య ఆశ్రయం సమకూర్చే ప్రభువును ఆశ్రయం కోరకపోతే సాతాను వలలో పడి నాశనమవ్వటం ఖాయం.PPTel 513.2

    ఆశ్రయపుర బందీ ఎప్పుడైన ఆశ్రయం విడిచి పెట్టి బైటికి వెళ్తే అతణ్ని ప్రతి హత్య చేసే వాడికి విడిచి పెట్టటం జరిగేది. తమ భద్రత నిమిత్తం దేవుడు ఏర్పాటు చేసిన పద్దతుల్ని ఉపసంహరించాలని ప్రజలకు ఈ విధంగా నేర్పటం జరిగింది. పాప క్షమాపణ నిమిత్తం పాపి క్రీస్తును నమ్మటం మాత్రమే చాలదు. విశ్వాసం విధేయతల ద్వారా పాపి క్రీస్తులో నివసించాలి. “మనము సత్యమును గూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల పాపములకు బలియికను ఉండదు. గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును”. హెబ్రీ 10:26,27.PPTel 513.3

    ఇశ్రాయేలీయుల గోత్రాల్లో రెండు గోత్రాల ప్రజలూ, మన షే గోత్రంలో సగం మంది యోర్దాను దాటకముందే తమ స్వాస్యాన్ని పొందారు. మందల కాపరులైన ఆ ప్రజల్ని తమ మందలు మేపుకోటానికి విస్తారమైన గిలాదు, బాషాను మైదానపు భూములు, అడవి సంపద పచ్చిక బయళ్ళు ఆకర్షించాయి. అలాంటివి కనానులో లేవు. అక్కడే స్థిరపడటానికి తీర్మానించుకొన్న ఆ రెండున్నర గోత్రాల ప్రజలు తమ వంతు సైన్యాన్ని యోర్దాను దాటి వెళ్ళే తమ సోదరులో పంపి వారు తమ స్వాస్థ్యాన్ని స్వాధీనం చేసుకొనే వరకూ తమ యుద్ధాల్లో పాలు పొందుతామని ప్రమాణం చేశారు. ఈ విధిని వారు నమ్మకంగా నిర్వర్తించారు కూడా. ఆ పది గోత్రాల ప్రజలు కనానులో ప్రవేశించినప్పుడు నలభై వేల మంది “రూబేనీయులను, గాదీయులను మన ప్లే అర్థగోత్రపువారును.... యుద్ధ సన్నద్దులై యుద్ధము చేయుటకు యెరికో మైదానములను దాటి వచ్చిరి”. వారు కొన్ని సంవత్సరాలు తమ సహోదరుల పక్కన నిలిచి సాహసంతో యుద్ధం చేశారు. ఇప్పుడు తన సాస్థ్యమైన భూభాగానికి తిరిగి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. యుద్ధాల్లో తమ సహోదరులతో కలసి పోరాడారు గనుక వారి కొల్ల సొమ్మును వారితో పంచుకొన్నారు. వారు “మిక్కిలి కలిమిగలవారై... వెండితోను, బంగారముతోను, ఇత్తడితోను ఇనుముతోను అతి విస్తారమైన వస్త్రములతోను” తిరిగి వచ్చారు. అక్కడే ఉండి కుటుంబాన్ని మందల్ని చూసుకొన్న వారందరితోను వీటననిటిని పంచుకోవాల్సి ఉన్నారు.PPTel 514.1

    ఇప్పుడు వారు ప్రభువు మందిరం నుంచి దూరంగా నివసించాల్సి ఉంది. వెళ్ళిపోతున్న వారిని చూసినప్పుడు యెహోషువ హృదయం ఆందోళనతో నిండింది. అక్కడ తమంతట తాము నివసిస్తూ సంచరించే ఆ ప్రజల ఆచారాల్ని అనుసరించటానికి ఎంత బలమైన శోధనలు వస్తాయో అతడికి తెలుసు.PPTel 514.2

    యెహోషువ మనసు ఇతర నాయకుల మనసులు భయాందోళనలతో నిండి ఉండగా వింత వార్తలు వారి చెవినపడ్డాయి. ఇశ్రాయేలీయులు యోర్దానును దాటిన స్థలానికి సమీపంలో యోర్దాను నది పక్క ఆ రెండున్నర గోత్రాల ప్రజలు షిలోహులో ఉన్న బలిపీఠాన్ని పోలిన ఒక బ్రహ్మాండమైన బలిపీఠం కట్టారు. గుడారంలోని ఆరాధన తప్ప ఇంకొక ఆరాధనను దైవ ధర్మశాస్త్రం నిషేధిస్తున్నది. దాని అతిక్రమ పర్యవసానం మరణం. ఈ బలిపీఠం ఏర్పాటులోని ఉద్దేశం అదే అయి ఉండి అది కొనసాగినట్ల యితే అది ప్రజల్ని యధార్థ విశ్వాసం నుంచి దూరంగా నడిపిస్తుంది.PPTel 514.3

    దైవ జనుల ప్రతినిధులు షిలోహులో సమావేశమయ్యారు. అభ్యంతరంగా వ్యవహరించిన వారిపై వెంటనే దాడి చెయ్యాలని ఉత్సాహం ఉద్రేకం వేడిలో ఉన్నవారు ప్రతిపాదించారు. జాగరూకతతో వ్యవహరించే వారి ప్రభావం వల్ల మొదట ఒక ప్రతి నిధి బృందాన్ని పంపి ఆ రెండున్నర గోల వారి నుంచి తమ ప్రవర్తన విషయమై సంజాయిషీ కోరాలని తీర్మానించారు. ఒక్కో గోత్రం నుంచి ఒక ప్రధాని చొప్పున పదిమంది ప్రధానుల్ని ఎంపిక చేశారు. పెయోరు సంఘటనలో పేరుగాంచిన ఫీనెహాసు వారికి నాయకుడు.PPTel 514.4

    ఏమీ సంజాయిషీ లేకుండా తీవ్ర అనుమానాలకు తెరతీసే కార్యానికి పూనుకోటంలో ఆ రెండున్నర గోత్రాల వారు పొరపాటు చేశారు. సహోదరులు పొరపాటులో ఉన్నారని నిర్ధారించుకొన్న రాయబారులు వారిని కలిసి కఠినంగా మందలించారు. ప్రభువుకు ఎదురుతిరిగారంటూ నిందించారు. ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో ఏకమైందుకు వారిని ప్రభువు ఎలా శిక్షించాడో గుర్తుకు తెచ్చుకోమని హెచ్చరించారు. బలులు అర్పించటానికి బలిపీఠం లేకుండా అక్కడ ఉండటం తమకు ఇష్టం కాకుంటే యోర్దాను అవతల పక్క ఉన్న సహోదరులు తమతమ వారి స్వాస్థ్యాన్ని ఆధిక్యతల్ని పంచుకోటానికి సిద్ధంగా ఉన్నారంటూ ఇశ్రాయేలీయులందరి తరుపున ఫీనెహాసు గాదీయుల్ని, రూబేనీయుల్ని ఆహ్వానించాడు.PPTel 515.1

    తాము నిర్మించిన బలిపీఠం బలులర్పించటానికి కాదని, నది తమను విడదీస్తున్నప్పటికి నీ విశ్వాసపరంగా తామూ కనానులో నివసిస్తూ తమ సహోదరులూ ఒకటే అని సూచించటానికే దాన్ని నిర్మించామని నిందితులైన ఆ ప్రజలు విశదం చేశారు. భవిష్యత్తులో తమ పిల్లల్ని ఇశ్రాయేలీయుల జాతి వారు కాదని పరిగణించి ఆలయం నుంచి బహిష్కరించటం జరగవచ్చునని వారు భయపడ్డారు. షిలోహులో నిర్మితి అయిన బలిపీఠంలాగే నిర్మితమైన ఈ బలిపీఠం దీని నిర్మాతలు కూడా జీవం గల దేవుని భక్తులే అని అప్పుడు వారికి సాక్ష్యమిస్తుందన్నది వారి నమ్మకం.PPTel 515.2

    ఆ రాయబారులు ఈ వివరణను సంతోషంతో అంగీకరించి తిరిగి వెళ్ళి ఆ వార్తను తమ ప్రజలకు అందించారు. యుద్ధం చెయ్యాలన్న ఆలోచనిక లేదు. ప్రజలు ఆనందోత్సాహాలతో దేవుని సన్నుతించారు.PPTel 515.3

    గాదీయులు రూబేనీయులు ఏ ఉద్దేశంతో ఆ బలిపీఠాన్ని నిర్మించారో దాన్ని బలిపీఠం రాతి మీద ఇలా చెక్కారు, “యెహోవా మన దేవుడనటానికి ఇది మీకును మాకును మధ్య సాక్షిగా ఉంటుంది.” భవిష్యత్తులో తప్పుడు అభిప్రాయం కలగకుండా చేయటానికి, శోధనకు దారి తీయగల కారణాన్ని తొలగించటానికి ఆ విధంగా వారు ప్రయత్నించటం జరిగింది.PPTel 515.4

    ఉత్తమాశయాల్లో పనిచేసే వారి మధ్య సైత్యం చిన్న అపార్థం వల్ల తీవ్ర సమస్యలు ఎంత తరచుగా చోటుచేసుకోటం లేదు? మర్యాద సహనం ప్రదర్శితం కాపోతే ఎంత ఘోరమైన, ప్రాణాంతకమైన పర్యవసానాలు సంభవిస్తాయి! ఆకాను విషయంలో తమలోనే గూడుకట్టుకొని ఉన్న పాపాన్ని కనుగోటంలో అప్రమత్తులు కానందుకు దేవుడు తమను మందలించటాన్ని ఆ పదిగోత్రాల వారు గుర్తుచేసు కొన్నారు. ఇప్పుడు చిత్తశుద్ధితో జాప్యం లేకుండా చర్య తీసుకోవటానికి వారు పూనుకొన్నారు. అయితే తమ మొదటి పొరపాటును వదులుకోటానికి ప్రయత్నించ టంలో వారు అతిగా వ్యవహరించారు. నిజానిజాలు మర్యాదగా విచారణ చేసి తెలసుకొనే బదులు వారు తమ సహోదరుల్ని నిందాపూర్వకంగా ఖండన ధోరణితో కలిశారు. గాదీయులు రూబేనీయులు అదే స్వభావాన్ని ప్రదర్శిస్తే యుద్ధ: సంభవించి ఉండేది. పాప నివారణ విషయంలో సత్వర చర్య ప్రాముఖ్యమే అయినా ఆధారం లేని అనుమానం, తీవ్ర విమర్శ వెలిబుచ్చకుండా ఉండటం కూడా ప్రాముఖ్యమే.PPTel 516.1

    తమ వ్యవహరణ తీరును గూర్చి ఏ చిన్న నిందనూ సహించలేని పలువురు తప్పులో ఉన్నట్లు తాము భావిస్తున్న వారితో కఠినాతి కఠినంగా వ్యవహరిస్తారు. విమర్శలు నిందారోపణలు ద్వారా ఎవరి తప్పుల్ని సరిదిద్దటం అసంభవం. అవి అనేకుల్ని మంచి మార్గం నుంచి దూరంగా నడిపించి వాస్తవాన్ని అంగీకరించకుండా వారి హృదయాల్ని కఠిన పర్చుతాయి. కనికరం, వినయ స్వభావం సహన శీలం పాపుల్ని క్షమించి అనేక పాపాల్ని నివారించవచ్చు.PPTel 516.2

    రూబేనీయులు వారి సహచరులు ప్రదర్శించిన విజ్ఞత అనుసరణీయం. నిజమైన మతాన్ని ప్రోది చేయటానికి పాటుపడున్నప్పుడు వారు తీవ్ర విమర్శకు మందలింపునకు గురి అయ్యారు. అయినా వారు ద్వేషభావం ప్రదర్శించలేదు. తమ అభిప్రాయాల్ని ఉద్దేశాల్ని సహోదరుల ముందు పెట్టటానికి ప్రయత్నించకపూర్వం వారు చెప్పదలచుకొన్నది వినయంగా ఓర్పుతో విని ఆ తర్వాతనే తమ ఉద్దేశం ఏంటో వివరించి తమ నిర్దోషిత్వాన్ని ప్రదర్శించుకొన్నారు. తీవ్ర పర్యవసానాలకు దారీ తీయాల్సిన సమస్య ఇలా సమారస్యంగా పరిష్కారమయ్యింది. అపనిందలు పడుతున్నప్పుడు సయితం రుజువర్తనులు ప్రశాంతంగా దయగా వ్యవహరించవచ్చు. ప్రజలు ఏమేమి అపార్థం చేసుకొని ఏమేమి తప్పుడు ప్రచారం సాగిస్తున్నారో దేవునికి తెలుసు. మన కేసును ఆయనకు విడిచి పెట్టటం మంచిది. అది మనకు క్షేమం. ఆకాను పాపాన్ని వెదకి పట్టుకొన్న ఆ ప్రభువు తన పై విశ్వాసముంచేవారి నిర్దోషిత్వాన్ని నిరూపించి తీరుతాడు. క్రీస్తు స్పూర్తితో పనిచేసేవారందరూ దీర్ఘకాలం సహించి దయచూపించే ప్రేమను కలిగి ఉంటారు.PPTel 516.3

    తన ప్రజలు సహోదర ప్రేమతో కలిసి నివసించాలన్నది దేవుని చిత్తం. తనను దేవుడు పంపాడని లోకం నమ్మేటట్లు తాను తండ్రితో ఏకమై ఉన్నరీతిగా తన శిష్యులు కూడా ఏకమై ఉండాలని సిలువ మరణానికి కొంచెం ముందు క్రీస్తు ప్రార్థించాడు. హృదయాన్ని కదిలించే ఈ చక్కని ప్రార్థన యుగాల పొడవునా వినిపిస్తూ వస్తున్నది. ఈనాడూ వినిపిస్తున్నది. ఆయన మాటలు ఇవి, “వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరును ఏకమైయుండ వలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను” యోహాను 17:20. సత్యసూత్రాల్లో ఒక్కటి కూడా త్యాగం చెయ్యకుండా నివసిస్తూ ఈ ఐక్యతను సాధించటం మన లక్ష్యం కావాలి. ఇదే మనం ఆయన శిష్యులమనుటకు నిదర్శనం. “మీరు ఒకని యెడల ఒకడు ప్రేమగలవారైన యెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు” అన్నాడు యేసు. యోహాను 13:35. అపొస్తలుడైన పేతురు సంఘానికి ఈ హితవు పలుకుతున్నాడు, “తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదు:ఖములయందు ఒకరు పాలుపడి, సహోదర ప్రేమ గల వారును, కరుణ చిత్తులును, వినయమనస్కులునైయుండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి” 1 పేతురు 3:8,9.PPTel 517.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents