Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    39—బాషానుపై విజయం

    ఇశ్రాయేలీయులు ఎదోముకు దక్షిణంగా సాగిన అనంతరం ఉత్తరానికి తిరిగి మళ్లీ వాగ్దత్త దేశం దిశలో ప్రయాణం చేశారు. వారి మార్గం ఎత్తున ఉన్న మైదన ప్రాంతం మీదుగా పోయింది. అది కొండల నుంచి వస్తున్న గాలులవల్ల చల్లని వాతావరణం గల ప్రదేశం. అప్పటి దాకా వారు ప్రయాణం చేసిన లోయల వాతావరణానికి ఇది భిన్నంగా ఉండి ఎంతో హాయి నిచ్చింది. వారు ఉత్సాహంగా, ఉల్లాసంగా ముందుకు సాగారు. జెరెదు ఏరుదాటి వారు మోయాబు దేశానికి తూర్పుదిశగా సాగారు. ఎందుకంటే దేవుని ఆజ్ఞ ఇలా ఉంది, “నేడు నీవు మోయాబునకు సరిహద్దుగానున్న వారి దేశము దాటబోవుచున్నావు.... వారిని బాధింపవద్దు. వారితో యుద్ధము చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చి” తిని. అమ్మోనీయుల విషయంలో కూడా ఇదే ఆదేశానినచ్చాడు. అమ్మోనీయులు కూడా లోతు సంతతివారే.PPTel 427.1

    ఉత్తరంగా కొనసాగుతూ ఇశ్రాయేలీయుల అమోరీయుల దేశం చేరుకొన్నారు. పోరాట పటిమ దైహిక శక్తిగల ఈ ప్రజలు ఆదిలో కనాను దక్షిణ భాగాన్ని ఆక్రమించుకొన్నారు. అయితే జనాభా పెరగటం వల్ల యోర్దాను దాటి మోయాబీ యుల్తో యుద్ధం చేసి వారి దేశంలో కొంత భాగాన్ని ఆక్రమించుకొన్నారు. ఇక్కడ వారు స్థిరపడ్డారు. అర్నోను ఏరు మొదలుకొని యబ్బోకు వరకు ఉన్న భూభాగాన్ని వారు స్వాధీనం చేసుకొన్నారు. యోర్థానుకి వెళ్లటానికి ఇశ్రాయేలీయులు ఎంచుకొన్న మార్గం నేరుగా ఈ దేశంలో నుంచే ఉన్నది. అమోరీయుల రాజైన సీహోనుకు మోషే స్నేహపూర్వక వర్తమానం పంపాడు. “నన్ను నీ దేశముగుండ దాటి పోనిమ్ము, కుడి యెడమలకు తిరుగక త్రోవనే నడిచిపోదును. నా యొద్ద రూకలు తీసికొని తినుటకు భోజన పదార్థములు నాకిమ్ము: నా యొద్ద రూకలు తీసికొని త్రాగుటకు నీళ్లిమ్ము... కాలినడక చేతనే నన్ను వెళ్లనిమ్ము”. సీహోను ఆ మనవిని నిర్ద్వందంగా తిరస్కరించి వారి పురోగమనాన్ని అడ్డుకొనేందుకు అమోరీయ సైన్యాన్ని మోహరిం చాడు. ఈ విస్తార సేవ ఇశ్రాయేలీయుల్లో భయాందోళనలు పుట్టించింది. సుశిక్షితమైన, క్రమశిక్షణగల సైన్యంతో యుద్ధం చేయటానికి ఇశ్రాయేలీయుల సిద్ధంగా లేరు. యుద్ధ నైపుణ్య పరంగా తమ శత్రువులిదే పై చేయి. మానవ దృష్టితో చూస్తే ఇశ్రాయేలీయుల అంతం దగ్గర పడ్డట్టు కనిపించింది.PPTel 427.2

    తన దృష్టిని మేఘ స్తంభంపై నిలపి తమతో దేవుని సముఖం ఇంకా ఉన్న దన్న నిదర్శనాన్ని చూపిస్తూ మోషే ఇశ్రాయేలు ప్రజల్ని ఉత్సాహపర్చాడు. అదే సమయంలో యుద్ధానికి సిద్ధబాటులో సాధ్యమైనంత మేరకు మానవ ప్రయత్నం చేయాల్సిందిగా వారిని ప్రోత్సహించాడు. శత్రువులు యుద్ధం చెయ్యటానికి తొందర పడ్తున్నారు. సిద్ధంగాలేని ఇశ్రాయేలు ప్రజల్ని భూమ్మీద లేకుండా తుడిచి వేయగల మన్న భీమాతో ఉన్నారు. అయితే సమస్తానికీ హక్కుదారుడైన యెహోవా వద్ద నుంచి ఇశ్రాయేలీయుల నాయకుడికి వచ్చిన ఆదేశం ఇది, “మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి. ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజగు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. దాని స్వాధీన పరచుకొన మొదలు పెట్టి అతనితో యుద్ధము చేయుడి. నేడు నేను నీవలని భయము, నీవలని వెరపు ఆకాశము క్రింద నన్ను సమస్త దేశములవారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారము విని నీ యెదుట వణికి మనోవేదన నొందుదురు.”PPTel 428.1

    కనాను పొలిమేర్లల్లో ఉన్న ఈ రాజ్యాలు దైవవాక్యాన్ని ధిక్కరిస్తూ ఇశ్రాయేలీయుల పురోగమనాన్ని అడ్డుకోకుండా ఉండి ఉంటే దేవుడు వారిని విడిచి పెట్టేవాడే. ఆ అన్యజనులపట్ల సయితం తాను దీర్ఘశాంతం దయ, కనికరాలు, ఔదార్యం కలిగి ఉన్నట్లు ప్రభువు నిరూపించుకొన్నాడు. తన సంతతివారు అనగా ఇశ్రాయేలు ప్రజలు పరాయి దేశంలో యాత్రికులు పరదేశులుగా నాలుగు వందల సంవత్సరాలు మనుగడ సాగిస్తారని అబ్రాహాముకి దర్శనం ద్వారా తెలియజేసినప్పుడు అతడికి ప్రభువు ఈ వాగ్దానాన్నిచ్చాడు “అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరము వారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుము”.ఆదికాండము 15:16 అమోరీయులు విగ్రహారాధకులు. తమ దుర్మార్గతను బట్టి వారు సర్వనాశనం అవ్వటం న్యాయం. అయినా తానే నిజమైన దేవుడని భూమ్యాకాశాల సృష్టికర్త అని వారు నిస్సంశయంగా తెలుసు కొనేందుకు గాను వారిని నాశనం చేయకుండా నాలుగు వందల సంవత్సరాలు ఊరుకున్నాడు. ఇశ్రాయేలీయులన్నీ ఐగుప్తు నుంచి విడిపించి తీసుకురావటంలో దేవుడు చేసిన అధ్భుత కార్యాలన్నీ వారికి తెలుసు. కావలసినంత నిదర్శనం ఉంది కూడా. విగ్రహారాధనకు అనైతిక ప్రవర్తనకు స్వస్తి చెప్పటానికి వారు సుముఖంగా ఉండి ఉంటే వారు సత్యాన్ని తెలుసుకొనేవారు. కాని వారు వెలుగును తిరస్కరించి తమ విగ్రహాలకు అతుక్కుపోయారు.PPTel 428.2

    ప్రభువు తన ప్రజల్ని కనాను సరిహద్దులకు రెండోసారి తీసుకొని వచ్చినప్పుడు ఆయన శక్తిని గూర్చి అన్యప్రజలకు మరింత నిదర్శనం లభించింది. ఆరాదు రాజు పైన కనానీయుల పైన ఇశ్రాయేలీయులు సాధించిన విజయంలోను విషస్పరాల కాటు లకు గురి అయిన వారిని బాగు చేయటానికి ఆయన చేసిన అద్భుతంలోను దేవుడు వారితో ఉన్నట్లు వీరు చూశారు. ఎదోము గుండా నడిచిపోవటానికి ఇశ్రాయేలీయులకి అనుమతి లభించకపోయినా అందుచేత వారు ఎర్ర సముద్రం పక్క నుంచి ఉన్న కష్టమైన చుట్టు మార్గాన్ని తీసుకోవాల్సి వచ్చినా తమ ప్రయాణాలు శిబిరాలు అన్నింటిలోను వారు ఎదోము, మోయాబు, అమ్మోను దేశాల్ని దాటుకొంటూ వెళ్లినప్పుడు ఎవరూ వారిపట్ల దౌర్జన్యంగా ప్రవర్తించటం గాని వారికి గాని వారి ఆస్తులకు గాని ఎలాంటి నష్టం కలిగించటం గాని చేయలేదు. అమోరీయుల పొలిమేరలకు వచ్చినప్పుడు తమ దేశం గుండా నేరుగా నడచిపోవటానికి అనుమతి ఇవ్వమని ఇశ్రాయేలీయులు కోరారు. ఇతర రాజ్యాలతో వ్యవహరించే సందర్భంలో తాము ఏ నియమ నిబంధనల్ని పాటిస్తారో వాటినే తామూ పాటిస్తామని వారికి తెలిపారు. వినయంగా చేసిన ఈ మనవిని అమోరీయుల రాజు తిరస్కరించి యుద్ధానికి తన సైనాన్ని ఆయత్తం చేసినప్పుడే ఆ ప్రజల దుర్మార్గపు పాత్ర నిండింది. వారిని నిర్మూలం చేసేందుకు దేవుడు తన శక్తి ప్రభావాల్ని ఉపయోగించాడు.PPTel 429.1

    ఇశ్రాయేలీయుల అర్నోను నది దాటి శత్రువుని ఎదుర్కోటానికి ముందుకు వెళ్లారు. రెండు సైన్యాల మధ్య యుద్ధం జరిగింది. ఇశ్రాయేలీయులకి విజయం కలిగింది. కొద్దికాలంలోనే అమోరీయుల దేశం వారి స్వాధీనంలోకి వచ్చింది. తన ప్రజల శత్రువుల వనికించింది. సైన్యములకధిపతి అయిన యెహోవాయే. ఇశ్రాయేలీయులు ఆయన్ని విశ్వసించి ఉంటే ముప్పయి ఎనిమిది సంవత్సరాలు ముందే ఆయన ఈ పనిచేసి ఉండేవాడు.PPTel 429.2

    ఇశ్రాయేలీయుల సైన్యంలో ధైర్యం, నిరీక్షణ వెల్లివిరిశాయి. వారు ఉద్రేకంతో ముందుకి పోయారు. ఇంకా ఉత్తర దిశగానే ప్రయాణిస్తూ ఒక దేశానికి వచ్చారు. అది వారి ధైర్యాన్ని వారికి దేవుని మీద వున్న విశ్వాసాన్ని పరీక్షించే స్థలం కావచ్చు. వారి ముందు బాషాను దేశం ఉంది. అది పెద్ద జనసంఖ్య కలిగిన, శక్తివంతమైన రాజ్యం . ఆ రాజ్యంలోని రాతి నగరాలు సంఖ్య పెద్దది. నేటికి కూడా వాటి కీర్తి లోకమంతా వ్యాపించివుంది. “అరువది పురములు... ఆ పురములన్నియు గొప్ప ప్రాకారములు, గవునులు, గడియలు గల దుర్గములు. ఆదియును గాక ప్రాకారములు లేని పురములు అనేకములు” ద్వితీ 3:1-11. ఇళ్లు నల్ల రాతితో కట్టారు. ఆ కాలంలో ఎవరూ పగుల గొట్టటానికి సాధ్యం కాకుండా ఉండేందుకు ఇళ్లను పెద్ద రాళ్లతో నిర్మించారు. భయంకరమైన గుహాలు, ఎత్తుగా నిటారుగా ఉన్న కొండలు, అఖాతాలు, రాతి దుర్గాలతో నిండిన దేశం అది. ఆ దేశంలోని ప్రజలు మహాకాయుల జాతికి చెందినవారు. వారు ఎత్తరులు. బలశాలురు. దౌర్జన్యం, క్రూరత్వం వారు ఉగ్గుతో నేర్చిన విద్య. వారంటే చుట్టుపట్ల ఉన్న రాజులకు సింహస్వప్పం. మహాకాయుల దేశంలో పరిమాణంలోను, బలశౌర్యాల విషయంలోను ఆ దేశపు రాజు ఓగు అఖండుడు. PPTel 429.3

    మేము స్తంభం కదిలింది. ఆ మేఘం నడుపుదల ననుసరించి హెబ్రీ ప్రజలు ఎట్రెయీకి వెళ్లారు. ఓగు తన సైన్యంతో ఇశ్రాయేలీయుల కోసం అక్కడ వేచి ఉన్నాడు. ఓగు యుద్ధ స్థలాన్ని తెలివిగా ఎంపిక చేసుకొన్నాడు. అగ్ని పర్వతం శిలలు వంకరటింకరగా అమరి వున్న పీఠభూమి అంచున ఎట్రెయీ పట్టణం నిర్మతమై వున్నది. దాని దిగువ భాగం మైదాన ప్రాంతం. ఆ పట్టణానికి వెళ్లాలంటే ఇరుకు మార్గాల గుండా కష్టమైన ఎత్తులు ఎక్కుకుంటూ వెళ్లాలి. యుద్ధాల్లో ఓటమి సంభవించినప్పుడు రాజు సైన్యం ఆ రాతిబండల ఆరణ్యంలో దాగి ఆశ్రయం పొందవచ్చు. అక్కడి అనుపానులు తెలియనివారు దాగివున్న వారిని పట్టుకోటం అసాధ్యం .PPTel 430.1

    విజయం తనదేనన్న ధీమాతో రాజు తన సైన్యంతో విశాల మైదానంలోకి రాగా ఎత్తులో వున్న ఉపరి స్థలం నుంచి ధిక్కారంతో కూడిన కేకలు వినవచ్చాయి. యుద్ధానికి సిద్ధంగా ఉండి ముందుకి దూకేందుకు ఆత్రంగావున్న వేలాది సైనికుల బళ్లాలు అక్కడ నుంచి స్పష్టంగా చూడవచ్చు. ఎత్తురులకన్నా ఎత్తుగా వుండి తన సైనికుల నడుమ కొట్టొచ్చినట్లు కనిపిస్తున రాజును హెబ్రీయులు చూసినప్పుడు: అతని చుట్టూ వున్న సైనికుల్ని, దుర్భేద్యంగా కనిపిస్తున్న కోటను, దాని వెనుక కనిపించకుండా నక్కివున్న వేలాది ప్రజల్ని చూసినప్పుడు ఇశ్రాయేలీయుల్లో అనేక మంది భయంతో వణికారు. మోషేమాత్రం జంకు కొంకు లేకుండా ప్రశాతంగా ఉన్నాడు. బాషాను రాజును గూర్చి ప్రభువిలా సెలవిచ్చాడు, “అతనికి భయపడకుము, అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించియున్నాను. హెషోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయవలెను”.PPTel 430.2

    దేవునిపై తమ నాయకుడి ధృఢవిశ్వాసం ప్రజల్లో నమ్మకం పుట్టించింది. సర్వశక్తుడైన ఆయన చేతికి వారు సర్వస్వాన్ని అప్పగించుకొన్నారు. ఆయన వారిని ఆశాభంగపర్చలేదు. సైన్యాలకధిపతి అయిన యెహోవాముందు బలశాలులైన ఎత్తరులు, సాయుధ సైనికులు నిలువలేకపోయారు. ప్రాకారాలుగల పట్టణాలు రాతి కోటలు నిరర్థకమయ్యాయి. ఇశ్రాయేలీయుల సైన్యాన్ని నడిపించింది. యెహోవాయే, శుత్రువుల వణికించింది యెహోవాయే: ఇశ్రాయేలీయులికి విజయం చేకూర్చింది యెహోవాయే. రాజు అతడి సైన్యం మట్టిగరిశారు. ఇశ్రాయేలీయుల ఆదేశాన్ని స్వాధీన పర్చుకొన్నారు. దుర్మార్గతకు, విగ్రహారాధనకు అంకితమైన ఆ వింత ప్రజలు లోకంలో లేకుండా ఇలా పూర్తిగా నాశనమయ్యారు. నలభై యేళ్ల వెనుక కాదేషులో జరిగిన సంఘటనల్ని, అవి ఇశ్రాయేలీయుల సుదీర్ఘ అరణ్య సంచారానికి దారి తీయటాన్ని, గిలాదు బాషానుల పై విజయ సాధన సందర్భంగా గుర్తు చేసుకొన్న వారు అనేకులున్నారు. వాగ్దత్త దేశం గురించి వేగులవారు తెచ్చిన నివేదిక అనేక విషయాల్లో వాస్తవమైనదేనని వారు భావిచారు. వారి పట్టణాలు చుట్టూ ప్రాకారాలున్న గొప్ప పట్టాణాలన్న మాట నిజమే. వాటిలో నివసించిన వారు మహాకాయులు, వారితో పోల్చితే హెబ్రీయులు మరుగుజ్జువారు అననదీ వాస్తవమే. కాని తమ తండ్రులు దేవుని శక్తిని నమ్మకపోటంలో గొప్ప తప్పిదం చేశారని వారు ఇప్పుడు చూడగలిగాం. వారు కనానులో వెంటనే ప్రవేశించకుండా చేసింది ఇదేనని గుర్తించారు.PPTel 431.1

    కనానులో ప్రవేశించటానికి మొట్టమొదటగా సిద్ధపడున్నప్పుడు ఆ కార్యం ఇప్పటికన్నా అప్పుడు తేలికగా ఉంది. తన ప్రజలు తన స్వరాన్ని విని నడుచుకొంటే తమ తరపున యుద్ధం చేయటానికి తమ ముందు నడుస్తానని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. ఆ దేశంలో నివసిస్తున్న వారిని బయటికి తరిమి వేయటానికి గాను కందిరీగల్ని పంపుతానని వాగ్దానం చేశాడు. ప్రజలు సామాన్యంగా భయంతో నిండి ఉన్నారు. ఇశ్రాయేలీయుల్ని అడ్డుకోటానికి ఎలాంటి సిద్ధబాటూ లేదు. ముందుకు సాగమంటూ ప్రభువు ఇశ్రాయేలీయుల్ని ఆదేశించినప్పుడు వారు శక్తిమంతమైన శత్రువుని ఎదుర్కోవాలి. తమ ఆగమనానిన ప్రతిఘటించటానికి సంసిద్ధులైన, సుశిక్షితులైన సైనికులతో పోరాడాలి.PPTel 431.2

    ఓగు సీహోనులో యుద్ధంలో తమ తండ్రులు ఎదుర్కొని పరాజయం పొందిన అదే పరీక్షను ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎదుర్కోవాల్సి ఉన్నారు. ముందుకి సాగండంటూ దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఆదేశించినప్పటికన్నా ఇప్పుడు ఆ పరీక్ష మరింత కఠినమయ్యింది. ప్రభువు పేరిట ముందుకు సాగమని దేవుడిచ్చిన ఆదేశాన్ని తిరస్కరించినందువల్ల వారి మార్గంలోని శ్రమలు అధికమయ్యాయి. తన ప్రజల్ని దేవుడు ఈ రకంగానే పరీక్షిస్తాడు. ఆ పరీక్షకు నిలువలేకపోతే ఆయన వారిని మళ్లీ అదే అంశం మీద పరీక్షిస్తాడు. రెండోసారి ఆయనిచ్చే పరీక్ష ముందటి పరీక్ష కన్నా కఠినంగా ఉంటుంది. ఆ శ్రమను వారు భరించే వరకు అది కొనసాగుతుంది. లేదా వారింకా తిరుగుబాటు చేస్తుంటే దేవుడు తన వెలుగును ఉపసంహరించుకొని వారిని చీకటిలో విడిచి పెడ్తాడు.PPTel 431.3

    గతంలో ఒకసారి తమ సైన్యం యుద్ధానికి వెళ్లినప్పుడు ఎలా ఓడిపోయిందో వేలాది మంది ప్రజలు ఎలా మరణించారో హెబ్రీయులికి ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. అయితే అప్పుడు దేవుడు వద్దన్నప్పటికి యుద్ధానికి వెళ్లారు. దేవుడు నియమించిన నాయకుడు మోషే లేకుండా వెళ్లారు. దైవ సముఖనికి చిహ్నం యిన మేఘ స్తంభం లేకుండా పరిశుద్ద మందసం లేకుండా వెళ్లారు. కాని ఇప్పుడు వారితో మోషే ఉన్నాడు. వారి హృదయాల్ని విశ్వాసంతోను, నిరీక్షణతోను పంపే మాటలతో బలపర్చు తున్నాడు. మేఘ స్తంభంలో వున్న దైవ కుమారుడు వారికి మార్గ నిర్దేశం చేశాడు. పరిశుద్ద మందసం వారితో వెళ్లింది. ఈ అనుభవంలో మనకో పాఠముంది. ఆయనను మనం నమ్మవచ్చు. ఆయన ధర్మ విధులను మనం ఆచరిస్తే పూర్వం తన ప్రజల నిమిత్తం ఆయన ఎంత ప్రత్యక్షంగా పనిచేశాడో మన నిమిత్తం కూడా అలాగే పనిచేస్తాడు. తమ ధర్మవిధుల్ని నిర్వహించటానికి ప్రయాస పడే ప్రతీ వారికి సందేహాలు అవిశ్వాసం ఎదురవుతాయి. కొన్నిసార్లు ప్రతిబంధకాలు మార్గానికి అడ్డుకట్టవేసాయి. అధైర్యపడే వారి గుండెను చెరువు చేస్తాయి. కాని ముందుకు వెళ్లమన్నది అట్టి వారికి దేవుని ఆదేశం. ఏది ఏమైనా మీ విధిని ఈ మారు నిర్వహించండి. మీరు దేవుని పై విశ్వాసముంచి విధేయత మార్గంలో ముందడుగు వేస్తుంటే భయం పుట్టించే కష్టాలూ, మీ ఆత్మను అధైర్యంతో నింపే సమస్యలు మాయమైపోతాయి.PPTel 432.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents