Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    26—ఎర్ర సముద్రం నుంచి సీనాయికి

    ఇశ్రాయేలు ప్రజలు ఎర్రసముద్రం ఒడ్డునుంచి మేఘ స్తంభం నడుపుదల కింద తమ ప్రయాణాన్ని కొనసాగించారు. పరిసరాలు నిరాశామయంగా ఉన్నాయి. మొక్కామోడులేని బోడి పర్వతాలు, పంట పైరేలేని పొలాలు, విశాల సముద్రం, శత్రు కళేబరాలు చెల్లా చెదురుగా పడివున్న తీరం, అయినా తాము స్వతంత్రులం అన్న స్పృహతో వారు ఉల్లాసంగా, ఉత్సాహంగా, చలాకీగా ఉన్నారు. ఎలాంటి అసంతృప్తి లేదు.PPTel 280.1

    అయితే తాము చేసిన మూడు రోజుల ప్రయాణంలోనూ నీళ్లు దొరకలేదు. కూడా తెచ్చుకొన్న నీళ్లు అయిపోయాయి. సూర్యతాపంతో మండిపోతున్న ఆ మైదానాల్లో వారి దాహార్తిని చల్లార్చేదేదీ లేదు. ఆ ప్రాంతమంతా బాగా ఎరిగిన మోషేకి ఇతరులికి తెలియని వాస్తవం ఒకటి తెలుసు. సమీపంలో వున్న మార్గాలోని నీళ్లు చేదవ్వటంవల్ల అవి తాగే నీల్లు కావని తెలుసు. తమను నడిపిస్తున్న మేఘాన్ని ఎంతో ఆదుర్దాగా పరిశీలించాడు. “నీళ్లు, నీళ్లు” అన్న కేకలు విన్నప్పుడు అతడి గుండెల్లో గుబులు పుట్టింది. స్త్రీలు, పరుషులు, పిల్లలు, పెద్దలు బారులు బారులుగా ఆనందంగా ఆ నీటి ఊటవద్దకు వెళ్లారు. అంతలోనే అది చేదు నీరని బాధాకరమైన నిట్టూర్పు వినిపించింది.PPTel 280.2

    తీవ్ర దిగ్ర్భాంతికి, నిస్పృహకు గురిఅయిన ఆ ప్రజలు ఆ విచిత్రమైన మేఘంలో ఉండి మోషేని తమనూ నడిపిస్తున్నది దైవ సన్నిధి అన్నది మర్చిపోయి ఆ మార్గన తమను నడిపిస్తున్నందుకు మోషేని నిందిచారు. తామున్న దుస్థితికి విచారిస్తూ వారు చేయటం మార్చిపోయిన పనిని మోషే చేశాడు. - సహయం కోసం దేవునికి మొర పెట్టకొవటం, “అంతట యెహోవా అతనికి ఒక చెట్టు చూ పెను. అది ఆ నిళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురము లాయెను.” ఇక్కడ దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఈ వాగ్దానం చేశాడు. “మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలక విధేయులై, ఆయన కట్టడలన్నింటిని ఆచరించిన యెడల నేన ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే”.PPTel 280.3

    మారా నుంచి వారు ఏలీముకు వెళ్లారు. అక్కడ “పండ్రెండు నీటి బుగ్గలును, డెబ్బది యీత చెట్లును ఉండెను” వారు సీను అరణ్యంలో ప్రవేశించకముందు ఇక్కడ కొన్ని దినాలు ఉన్నారు. వారి ఆహర నిల్వలు తరిగిపోటం మొదలయ్యింది. ఆ ఆరణ్యంలో పచ్చమేత తక్కువగా ఉండటంతో మందలు తగ్గిపోతున్నాయి. విస్తారమైన ఈ జనానికి ఆహరం సరఫరా ఎలా జరుగుతుంది? సందేహాలు చోటు చేసుకున్నాయి. ప్రజలు సణగటం మొదలు పెట్టారు. పాలకులు, పెద్దలు కూడా కలసి దేవుడు నియమించిన నాయకులకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయటం మొదలు పెట్టారు. “మేము మాంసము వండుకొను కుండలయొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు యెహోవా చేతివలన ఏల చావక పోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలిచేత చంపుటకు ఈ అరణ్యములోనికి అక్కడనుండి తోడుకొని వచ్చితివి” అన్నారు.PPTel 281.1

    వారింకా ఆకలి బాధకు గురికాలేదు. వారి ప్రస్తుత అవసరాలు తీరుతున్నాయి. కాని వారు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. ఆ అరణ్య ప్రయాణంలో అంత పెద్ద జన సమూహం ఏం తిని బతుకుతారు అని ఆలోచిస్తూ తమ బిడ్డలు ఆహారంలేక మరణిస్తారని ఊహించుకొన్నారు. తమను విమోచించుకొంటూ వస్తున్న తన తట్టువారి హృదయాలు తిరగాలన్న ఉద్దేశంతో వారి చుట్టూ కష్టాలు, బాధలు తలెత్తటాన్ని వారి ఆహర సరఫరాల్లో కొరతలు ఏర్పడటాన్ని ప్రభువు అనుమతించాడు. తమ లేమిలో ఆయనను వేడుకొన్నప్పుడు కూడా ఆయన తన ప్రేమకు, సంరక్షణకు నిదర్శనాలు ప్రదర్శిస్తాడు. తన ఆజ్ఞలకు విధేయులై నివసిస్తే వారికి వ్యాధులు రావని వాగ్దానం చేశాడు. వారుగాని వారి పిల్లలుగాని ఆహారం లేకుండా మరణిస్తారని ఊహించటం అపనమ్మకం వల్ల పాపం చేయటమే.PPTel 281.2

    వారికి దేవుడనై ఉంటానని వారిని తన ప్రజలకు ఎంపిక చేసుకొంటానని వారిని విశాలమైన మెరుగైన దేశానికి నడిపిస్తానని దేవుడ వాగ్దానం చేశాడు. కాగా ఆ దేశానికి వెళ్లే దిశలో ఏర్పడే ప్రతీ ఆటంకానికి సొమ్మసిల్లి పడిపోవటానికి వారు సిద్ధమౌతున్నారు. వారిని ఉద్దరించి ఉదాత్తమైన ప్రజల్ని చేసి లోకంలో వారు తనకు మహిమకరంగా నివసించేందుకుగాను వారిని యోగ్యులుగా తీర్చిదిద్దటానికి దేవుడు వారిని హీన స్థితి నుంచి బయటకి తీసుకొని వస్తున్నాడు. తమ నిమిత్తం ఆయన చేసినదంతా దృష్టిలో ఉంచుకొని ఆయనపై విశ్వాసం కలిగి ఉంటే, అసౌకర్యాన్ని లేమిని తుదకు నిజమైన బాధను వారు సంతోషంగా భరించి ఉండేవారు. కాని తాము చూడగలిగిన దానికి మించి ఆయన శక్తికి నిదర్శనాన్ని విశ్వసించటానికి వారు సంసిద్ధంగా లేరు. ఐగుప్తులో తమ కఠిన దాస్యాన్ని మర్చిపోయారు. తమను దాసత్వం నుంచి విడిపించటంలో దేవుడు ప్రదర్వించిన కృపను, శక్తిని మర్చిపోయారు. ఐగుప్తు ప్రజల ప్రథమ సంతానాన్ని సంహరక దూత నాశనం చేసినప్పుడు తమ బిడ్లలు ఎలా సురక్షితంగా ఉన్నారో దాని మర్చిపోయారు. ఎర్ర సముద్రం వద్ద అద్భుతమైన దైవ శక్తి ప్రదర్శనను మర్చిపోయారు. తమకోసం సముద్రం దాటడానికి ప్రయత్నించిన తమ శత్రువులు ఎలా మునిగి పోయారో మర్చిపోయారు. తమ ప్రస్తుత అసౌకర్యాల్ని, కష్టాల్నే వారు చూశారు. “దేవుడు మా నిమిత్తం గొప్ప కార్యాలు చేశాడు. మేము బానిసలమై ఉండగా ఆయన మమ్మల్ని గొప్ప జాతిగా తీర్చిదిద్దబోతున్నాడు” అనే బదులు మార్గం కష్టంగా ఉందని ఆయాసకరమైన ఆ ప్రయాణం ఎప్పుడు అంతమొందుతుంది అని గొణుకుకొన్నారు.PPTel 281.3

    అంత్యకాలం వరకు దేవుని ఇశ్రాయేలు ప్రజల ప్రయోజనార్థం ఇశ్రాయేలీయుల అరణ్య జీవిత చరిత్ర నమోదయింది. ఇశ్రాయేలీయుల అరణ్య సంచారాల్లో వారికి దేవుడు వ్వవహరించిన రీతిని గురించిన దాఖాలల్లో, వారి విమోచనలో దేవుని శక్తిని ప్రదర్శన దాఖాలల్లో అన్ని యుగాల్లోని దైవ ప్రజలకు హెచ్చరిక ఉపదేశం ఉన్నాయి. హెబ్రీయులకు వచ్చిన వివిధమైన అనుభవాలు, కనానుతో తమ వాగ్రత్త గృహానికి అవసరమైన పాఠాలు నేర్పే పాఠశాలలా ఉన్నాయి.PPTel 282.1

    వెనుక ఇశ్రాయేలీయులు ప్రదర్శించిన అవిశ్వాసం నిమిత్తం గణుగుడు నిమిత్తం విస్మయం వ్యక్తం చేస్తూ తామే అయితే అంత కృతజ్ఞలుగా వ్వవహరించే వారంకాదని అనేకులు భావిస్తారు. కాకపోతే చిన్న విషయంలో తమకు విశ్వాస పరీక్ష వచ్చినప్పుడు వారి విశ్వాసం, ఓర్పు, పూర్వం ఇశ్రాయేలీయుల విశ్వాసం, ఓర్పు కన్నా ఏమంత గొప్పవి కావని తేల్తుంది. కష్టాలు ఎదురైనప్పుడు తమను పవిత్రుల్ని చేయటానికి దేవుడు ఎంపిక చేసుకొన్న ప్రక్రియను గూర్చి సణుగుకొంటారు. తమ ప్రస్తుత అవసరాలు తీరినా అనేకులు తమ భవిష్యత్తు విషయంలో దేవున్ని విశ్వసించటానికి సిద్ధంగా ఉండరు. తమకు పేదరికం వస్తుందేమోనని తమ బిడ్డలు బాధలకు గురి అవుతారేమోనని వారు సర్వదా ఆందోళన చెందుతూ ఉంటారు. కొందరు ఎప్పుడూ తమకు చెడు సంభవిస్తుందని ఊహించుకొంటారు లేదా ఉన్న కష్టాల్ని పెద్దవి చేసి చెప్పుకొని తాము ఏ దీవెనలకు కృతజ్ఞులు కావాలో వాటిని విస్మరిస్తారు. తాము ఎదుర్కొనే ఆటంకాలు దేవుని సహాయన్ని కోరేందుకు నడిపించే బదులు అశాంతిని, చీకాకును పుట్టిస్తాయి గనుక వారిని దేవునికి దూరంగా నడిపిస్తాయి.PPTel 282.2

    ఇలా అవిశ్వాసులం కావటం మంచిదేనా? మనం దేనికని కృతఘ్నులం, అవిశ్వాసులం కావాలి? యేసు మన మిత్రుడు, మనం క్షేమంగా ఉండాలన్నది పరలోక నివాసుల ఆకాంక్ష. మన ఆందోళనలు, మన భయాలు పరిశుద్ధత్మను దు:ఖపర్చుతాయి. వేదన కలిగించి క్షీణింపజేసే ఆందోళనకు మనం తావీయకూడదు. శ్రమల్ని భరించటానికి అది మనకు తోడ్పడదు. తమ ఆనందం లౌకికి విషయాల మీదే ఆధారపడి ఉన్నట్లు భవిష్యత్తు విషయంలో దేవుని మీద అవిశ్వాసం చూపించకూడదు. తన ప్రజలు ఐహిక విచారాలతో కుంగిపోవటం దేవుని చిత్తంకాదు. అయినా మన మార్గంలో ప్రమాదాలు లేవని మన ప్రభువు చెప్పటం లేదు. తన ప్రజల్ని ఈ పాపలోకంలో నుంచి తీసుకువెళ్లిపోవటం ఆయన ఉద్దేశం కాదు. కాని మనల్ని ఎప్పుడూ సహాయం దొరికే ఆశ్రయ స్థానానికి నడిపిస్తాడు. అలసిన వారికి, విచారలతో కుంగినవారికి ఆయన ఈ ఆహ్వానాన్నందిస్తున్నాడు, “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనములారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును”. మీ మెడలమీద మీరే మోపుతున్న ఆందోళన, ఐహిక విచారాల కాడిని నెట్టివేసి, “నేను సాత్వికూడను. దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును” అంటున్నాడు. మత్తయి 11:28,29. మన సమస్త భారాల్ని, విచారాల్ని ఆయన మీద పెట్టి మనం విశ్రాంతి పొందవచ్చు. ఆయన మనల్ని సంరక్షిస్తాడు. 1 పేతురు 5:7 చూడండి.PPTel 282.3

    అపోస్తలుడైన పౌలు ఇలా అంటున్నాడు. “సహోదరులారా, జీవముగల దేవుని విడిచి పోవునట్టి విశ్వాసములేని దుష్ట హృదయము మీలో ఎవరియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి” హెబ్రీ 3:12. దేవుడు మన నిమిత్తం చేసిన సమస్తం దృష్ట్యా మన విశ్వాస బలంగా, క్రియాశీలంగా, స్థిరంగా ఉండాలి. సణుగుతూ ఫిర్యాదు చేసేకన్నా మన హృదయం మాట్లాడే భాష ఇలా ఉండాలి. ” నా ప్రాణమా, యెహోవాను నన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను నన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము” కీర్తనలు 103:1,2.PPTel 283.1

    దేవుడు ఇశ్రాయేలీయుల అవసరాల్ని మర్చిపోలేదు. వారి నాయకుడితో “ఇదిగో ఆకాశమునుండి ఆహారమును కురిపించెదను” అని చెప్పాడు. ప్రజలు తమ దినదిన ఆహారాన్నిబట్టి పోగుచేసుకోటానికి గాని పరిశుద్ధ సబ్బాతు ఆచరణ సవ్యంగా జరిగేందుకు ఆరోనాడు రెండు రెట్లు ఆహారం పోగు చేసుకోటానికి గాని ప్రజలకు సూచలను ఇవ్వటం జరిగింది.PPTel 283.2

    తమ అవసరాలకు సరిపడ్డ ఆహారం సరఫరా అవుతుందని ఇశ్రాయేలీయుల సమాజానికి మోషే తెలియజేశాడు. “సాయంకాలమున మాంసమును. ఉదయ కాలమున చాలినంత ఆహారమును యెహోవా మీకు” ఇచ్చాడు. మోషే ఇంకా ఇలా అన్నాడు. “మీరు ఆయన మీద సణుగు మీ సణుగులను యెహోవాయే వినుచుండగా మేము ఏపాటివారము?” వారితో ఇలా చెప్పమని ఆహరోనుని ఆదేశించాడు, “యెహోవా సన్నిధికి సమీపించుడి; ఆయన మీ సణుగులను వినెనని నీవు ఇశ్రాయేలీయుల సర్వ సమాహముతో చెప్పుము.” ఆహరోను తమతో మాట్లాడతుండగా “వారు అరణ్యమువైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను”. వారెన్నడూ చూడని ఆ ప్రకాశం దేవుని సన్నిధిని సూచించింది. పంచేంద్రియాలు గ్రహించే ప్రత్యక్షతల ద్వారా వారు దేవుని గూర్చిన జ్ఞానం పొందాల్సి ఉన్నారు. వారు తన నామానికి భయపడి తన స్వరానికి విధేయులయ్యేందుకుగాను సర్వోన్నతుడైన దేవుడే తమ నాయకూడని, మోషే కాదని వారిక బోధించాలి. PPTel 283.3

    రాత్రి అయ్యేసరికి శిభిరమంతా పూరేళ్లతో నిండింది. సమాజమంతటికి సరిపోయినన్ని పూరేళ్లు సరఫరా అయ్యాయి. ఉదయాన అరణ్య భూమి మీద “నూగు మంచువలె సన్నని కణములు” కనిపించాయి. “అది ధనియపు గింజల్లా తెల్లగా” ఉన్నది. ప్రజలు దాన్ని “మన్నా” అన్నారు. మోషే “ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము” అన్నాడు. ప్రజలు మన్నాను పోగు చేసుకున్నారు. అది అందరికీ సరిపడేటంత పడి ఉంది. ప్రజలు దాన్ని “తిరుగట విసిరి లేక రోట దంచి పెనముమీద కాల్చి రొట్టెలు చేసిరి” సంఖ్యాకాండము 11:8. “దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను”. మనిషికి ఒక ఓమెరు చొప్పున వారు ప్రతీరోజూ దాన్ని కూర్చుకోవాలన్నది ఆదేశం. దాన్ని ఉదయానికి ఉంచకూడదు. కొందరు మన్నాను మరుసటి ఉదయం వరకు ఉంచటానికి ప్రయత్నించారు గాని అది చెడిపోయినట్లు కనుగొన్నారు. దినానికి సరిపోయే ఆహారాన్ని ఉదయం సమకూర్చుకోవాల్సి ఉన్నారు. ఎందుకంటే నేలమీద మిగిలి ఉన్నదంతా సూర్యతాపానికి కరిగిపోయేది.PPTel 284.1

    మన్నాను కూర్చుకోటంలో కొందరు నిర్ణీత మొత్తంకన్నా ఎక్కువ పోగుచేసుకోటం కొందరు తక్కువ పోగుచేసుకోటం జరిగింది. కాని “వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువగా మిగులలేదు. తక్కువగా కూర్చుకొనిన వానిని తక్కువ కాలేదు”. ఈ లేఖనానికి వివరణను దాని పై గుణపాఠాన్ని ఇస్తూ కొరింథీ యులకు రాసిన రెండో పత్రికలో పౌలిలా అంటున్నాడు. “ఇతరులకు తేలికగాను, మీకు భారముగాను ఉండవలెనని ఇది చెప్పుట లేదుగాని - హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగులలేదనియు తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికి సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ది వారి అక్కరకును మరియొకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై యుండవలెనని ఈలాగు చెప్పుచున్నాను” 2 కొరింథీ 8:13-15.PPTel 284.2

    ఆరోనాడు ప్రజలు మనిషికి రెండు ఓమెరుల చొప్పున మన్నా కూర్చుకొన్నారు. జరిగినదంతా ప్రజాపాలకులు మోషేకి తెలియజేయటానికి త్వరపడి వెళ్లారు. మోషే సమాధానం ఇది : ” యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొన వలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి. ఉదయమున మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడి”. వారు అలాగే ఉంచుకోగా అది చెడిపోకుండా తాజాగా ఉన్నది. “మోషే - నేడు దాని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. ఆరు దినములు దాని కూర్చుకొనవలెను. విశ్రాంతి దినముగ అనగా ఏడవ దినమున అది దొరకదనెను”.PPTel 285.1

    ఇశ్రాయేలీయుల కాలంలో తన పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని ఎలాక్కోరాడో నేడు కూడా అలాగే పరిశుద్ధంగా ఆచరించాలని దేవుడు కోరుతున్నాడు. హెబ్రీయులకిచ్చిన ఆజ్ఞ క్రైస్తవులందరికీ యెహోవా ఇచ్చిన ఆజ్ఞగా క్రైస్తవులు పరిగణించాలి. ఆ పరిశుద్ధ ఘడియలకు సమస్తం సిద్ధంగా ఉండే నిమిత్తం సబ్బాతుకు ముందు రోజును సిద్ధబాటు దినంగా ఏర్పాటు చేసుకోవాలి. ఏ పరిస్థితిలోను మన సొంత వ్యాపారం దేవుని పరిశుద్ధ సమయాన్ని అతిక్రమించకూడదు. జబ్బుగా ఉన్న వారి విషయంలోను బాధపడుతున్నవారి విషయంలోను అవసరమైన శ్రద్ధ తీసుకోవల్సిందిగా దేవుడు ఆదేశించాడు. వారిని సదుపాయంగా ఉంచటానికి అవసరమయ్యే పని కారుణ్య సేవేగాని సబ్బాతు అతిక్రమణ కాదని ఆయన స్పష్టం చేశాడు. కాగా అవసరమైన పని కల్పించుకోకూడదు. సబ్బాతుకు ముందురోజు చేయగలిగిన చిన్నా చితక పనుల్ని కొందరు సబ్బాతు ప్రారంభం వరకు ఉంచుతారు. ఇలా చేయకూడదు. సబ్బాతు ప్రారంభం వరకు చేయకుండా ఉంచుకొన్న పనుల్ని సబ్బాతు ముగిసేవరకు ముట్టుకోకూడదు. ఈ ఆచరణ విధానం ఈ అజాగ్రత్త పరులు మనసుల్లో జ్ఞాపకం ఉండి ఆరుదినాల్లో తమ పనిని చేసుకోటానికి వారికి తోడ్పడవచ్చును.PPTel 285.2

    తమ సుదీర్ఘ అరణ్య ప్రయాణ కాలమంతా ఇశ్రాయేలీయులు మూడు రకాల అద్భుతాన్ని కళ్లారా చూశారు. అది సబ్బాతు పరిశుద్ధతను గూర్చి వారికి తెలపటానికి దేవుడు చేసిన సూచక క్రియ. వారంలో ఆరోనాడు రెండంతలు మన్నా పడేది. ఏడోనాడు పడేది కాదు. సబ్బాతుకు అవసరమైన ఆహారభాగం చెడిపోకుండా తాజాగా రుచికరంగా ఉండేది. మరే సమయంలోనైనా అదనంగా అట్టి పెట్టుకొన్న ఆహారం చెడిపోయి కంపుకొట్టేది. తినటానికి పనికివచ్చేది కాదు.PPTel 285.3

    సీనాయి కొండమీద దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చినప్పుడు సబ్బాతు ఆచరణ ప్రారంభమయ్యిందని అనేకులు భావిస్తున్నది సరికాదని ఇశ్రాయేలీయులకు దేవుడు మన్నాను ఇచ్చిన పరిస్థితుల్ని బట్టి తెలుస్తున్నది. ఇశ్రాయేలీయులు సీనాయికి రాక మునుపే సబ్బాతును వారు విధిగా ఆచరించారు. సబ్బాతుకు సిద్ధబాటులో భాగంగా సబ్బాతు నాటికి శుక్రవారం ఉదయమే రెండురెట్లు మన్నాను సమకూర్చుకోటంలో విశ్రాంతిదినం పరిశుద్ధమైందని వారికి నేర్పటం జరిగింది. మన్నాను సమకూర్చు కోటానికి కొందరు సబ్బాతు నాడు బయటికి వెళ్లగా “మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు?” అని ప్రభువు మందలించాడు.PPTel 286.1

    “ఇశ్రాయేలీయులు నివసించవలసిన దేశమునకు తాము వచ్చు నలువది ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరువరకు మన్నాను తినిరి”. తమపట్ల దేవుని శ్రద్ధను గూర్చి, ప్రేమానురాగాల్ని గూర్చి అద్భుతమైన ఈ ఏర్పాటు అనుదినం నలభై సంవత్సరాలు వారికి జ్ఞాపకం చేసింది. కీర్తన రచయిత మాటల్లో ఆయన “ఆకాశ ధాన్యము వారికనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి” (కీర్తనలు 78: 24, 25) -- అంటే దేవదూతలు సరఫరా చేసిన ఆహారం. “ఆకాశ ధాన్యంతో పోషణ పొందుతున్న ఆ ప్రజలు ధాన్యంతో నిండిన కనాను పొలాలు తమ కెంత భద్రత నియ్యగలవో అంత భద్రతను తన వాగ్దానం తమకిస్తుందని మన్నా కురిపించటం ద్వారా దేవుడు వారికి దినదినం నేర్పించాడు. ఇశ్రాయేలీయుల పోషణ నిమిత్తం ఆకాశం నుంచి పడుతున్న మన్నా, లోకానికి జీవం ఇవ్వటానికి దేవుని వద్దనుంచి వచ్చిన ప్రభువుకి సంకేతం. యేసిలా అన్నాడు, “మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే”. యోహాను 6:48-51.భవిష్యత్తు జీవితంలో దైవ ప్రజలకు కలిగే దీవెనల్లో ఒకదాన్ని గురించి యిలా ఉంది, “జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును”. ప్రకటన 2:17. PPTel 286.2

    సీను అరణ్యాన్ని విడిచి పెట్టిన తర్వాత ఇశ్రాయేలీయులు రెఫీదీములో శిబిరం వేశారు. ఇక్కడ నీళ్లు లేవు. మళ్లీ వారు దేవుని మీద అపనమ్మకం కనపర్చారు. గుడ్డితనంలో అహంతో వారు మోషే వద్దకు వచ్చి “త్రాగుటకు మాకు నీళ్లిమ్ము” అని డిమాండ్ చేశారు. మోషే సహనాన్ని కోల్పోలేదు. “నాతో వాదింపనేల, యెహోవాను శోధింపనేల?” అన్నాడు. “ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పికచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడకు తీసికొని వచ్చితిరి?’ అని కోపంగా ప్రశ్నించారు. తమకు ఆహారం సమృద్ధిగా ఉన్నప్పుడు వారు తమ అవిశ్వాసాన్ని, గొణుగుల్ని గుర్తు చేసుకొని సిగ్గుపడి భవిష్యత్తులో దేవున్ని విశ్వసిస్తామని వాగ్దానం చేశారు. కాని త్వరలోనే వారు తమ వాగ్దానాన్ని మర్చిపోయారు. మొదటి విశ్వాస పరీక్షలోనే అపజయం పొందారు. తమను నడిపిస్తున్న మేఘ స్తంభం ఒక భయంకర రహస్యాన్ని కప్పి ఉంచుతున్నట్లు కనిపించింది. నీవెవరివని మోషేని ప్రశ్నించారు. తమను ఐగుప్తు నుంచి తీసుకురావటం దేనికని ప్రశ్నించారు. అనుమానం, అపనమ్మకం మనసుల్లో పెట్టుకొని తమ ఆస్తులు కాజేయాలన్న దురుద్దేశంతో తమను, తమ బిడ్డల్ని శ్రమలకు, లేమికి గురిచేసి చంపాలనుకుంటున్నాడని మోషేని నిందించారు. కోపంతో రెచ్చిపోయి మోషేని రాళ్లతో కొట్టడానికి సిద్ధపడ్డారు.PPTel 286.3

    అంతట “ఈ ప్రజలను నేనేమి చేతును?” అని దు:ఖంతో మోషే దేవునికి మొర పెట్టుకొన్నాడు. ఇశ్రాయేలు పెద్దల్ని తీసుకొని ఐగుప్తులో తాను అద్భుతకార్యాలు చేసిన కర్రను చేతపట్టుకొని ప్రజల ముందుకి వెళ్లమని మోషేని దేవుడు ఆదేశించాడు. “ఇదిగో అక్కడ హో రేబులోని బండమీద నేను నీకు ఎదురుగా నిలిచెదను; నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరును” అని దేవుడు చెప్పాడు. మోషే అలా చేయగా నీళ్లు సెలయేరుగా ప్రవహించాయి. శిబిరమంతటికీ సమృద్దిగా నీళ్లు సరఫరా అయ్యాయి. తన కర్రను ఎత్తి ఐగుప్తు ప్రజలమీదికి రప్పించిన రీతిగా వారిమీదికి తెగుళ్లు రప్పించే బదులు అపార కృపగల దేవుడు ఆ కర్రను ఆ దుష్ట ప్రజల విడుదలకు సాధనంగా చేసుకొన్నాడు.PPTel 287.1

    “అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను. నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను” కీర్తనలు 18:15, 16. మోషే బండను కొట్టాడు. మేఘ స్తంభములో దాగి వున్న దేవుని కుమారుడే మోషే పక్కన నిలిచి జీవ జలాల్ని ప్రవహింపచేశాడు. మోషే అతడితో వున్న పెద్దలు మాత్రమేగాక అల్లంత దూరాన నిలిచివున్న సమాజంకూడా ప్రభువు మహిమను చూశారు. కాగా ఆయనను మరుగున వుంచిన మేఘాన్ని తొలగించి ఉంటే బ్రహ్మాండమైన ఆయన ప్రకాశానికి వారంతా హతులై ఉండేవారు.PPTel 287.2

    దాహం బాధతో ఉన్న ప్రజలు ” యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో” అని -- “దేవుడే మనల్ని ఇక్కడికి తీసుకొని వస్తే మనకు ఆహారం నీరు ఎందుకు ఇవ్వడూ?” అని ప్రజలు దేవుని శోధించారు. వారు ప్రదర్శించిన అవిశ్వాసాన్ని బట్టి దేవుని తీర్పులు వారి మీదికి వస్తాయేమోనని మోషే భయపడ్డాడు. ఆ ప్రజల పాపానికి జ్ఞాపకార్థంగా ఆ స్థలానికి మస్సా - “శోధన”, మెరీబా - “గద్దింపు” అని పేర్లు పెట్టాడు.PPTel 287.3

    ఇప్పుడు వారికి ఒక కొత్త అపాయం ఎదురయ్యింది. తన మీద వారి సణుగుడువల్ల వారి పై శత్రువుల దాడిని దేవుడు అనుమతించాడు. ఆ ప్రాంతం నివాసులైన అమాలేకీయులు కయ్యానికి కాలుదువ్వే క్రూరమైన ప్రజలు. వారు అలసివున్న ఇశ్రాయేలు ప్రజలమీదికి వచ్చి వెనుకబడి ఉన్నవారిని చంపారు. ఆ ప్రజలు యుద్ధానికి సిద్ధంగా లేరని ఎరిగి మోషే, యెహోషువను పిలిచి వివిధ గోత్రాల్లోనుంచి ఎంపిక చేసి ఒక సైన్యాన్ని తయారు చేసి మర్నాడు శత్రు సేనలతో యుద్ధం చేయమని, ఆ సమయంలో దేవుని కర్ర చేతపట్టుకొని తాను దగ్గర ఒక కొండమీద ఉంటానని మోషే చెప్పాడు. ఆ ప్రకారమే మరుసటి రోజు యెహోషువా అతడి సైన్యంతో యుద్ధం చేస్తుండగా మోషే, అహరోను, హూరలు యుద్ధ రంగానికి ఎదురుగా వున్న ఒక కొండమీద నిలబడ్డారు. ఆకాశంవైపు చేతులెత్తి దేవుని కర్ర చేతిలో పట్టుకొని ఇశ్రాయేలీయులికి విజయం చేకూర్చమంటూ మోషే ప్రార్థన చేశాడు. యుద్ధం సాగుతుండగా మోషే చేతులు పైకెత్తి ఉన్నంత సేపు ఇశ్రాయేలీయులికి జయం కలుగుతున్నట్లు, అవి కిందికి దిగి ఉంటున్నప్పుడు శత్రువుకి జయం వస్తున్నట్లు అర్ధమయ్యింది. మోషే అలసిపోయినప్పుడు అహరోను, పూరు, మోషే చేతులు ఎత్తి ఉంచారు. మోషే నిర్వహిస్తున్న పనిలో అతడికి మద్దతు ఇవ్వటం తమ విధి అని ప్రజలకు ఇలా చూపించారు. మోషే నిర్వహించిన చర్యకూడా ప్రాముఖ్యమైనదే. తమ భవిష్యత్తును దేవుడు తన చేతిలో ఉంచుకొన్నాడని వారాయన్ని నమ్మి ఆయన మీద ఆధారపడ్డప్పుడు ఆయన తమ పక్షాన పోరాడి తమ శత్రువుల్ని ఓడిస్తాడని అయితే వారు ఆయన చెయ్యిని విడిచి పెట్టి తమ సొంత శక్తిని నమ్ముకుంటే దేవుడంటే తెలియని వారికన్నా వారు బలహీనులవుతారని అందుకే తమ శత్రువులు తమను జయిస్తారని ఆ చర్య వక్తం చేసింది.PPTel 288.1

    చేతులు పైకెత్తి తమ నిమిత్తం దేవునితో విజ్ఞాపన చేస్తున్నప్పుడు హెబ్రీయులికి జయం కలిగినట్లే సర్వశక్తుడైన దేవుని మీద విశ్వాసం ద్వారా ఆధారపడినప్పుడు దేవుని ప్రజలు విజయం పొందుతారు. అయినా మానవుడు దేవుని శక్తితో కలిసి పనిచేయాలి. ఇశ్రాయేలీయులు చేతులు కట్టుకొని కూర్చుంటే తమ శత్రువుల్ని దేవుడు ఓడిస్తాడని మో షే విశ్వసించలేదు. ఆ మహానాయకుడు ప్రభువుతో విజ్ఞాపన చేస్తుండగా ఇశ్రాయేలీయుల శత్రువుల్ని ఎదుర్కోటంలో యెహోషువా అతడి అనుచరులు తమ శక్తి మేరకు కృషి చేస్తున్నారు.PPTel 288.2

    అమాలేకీయుల పరాజయం అనంతరం దేవుడు మోషేని ఇలా ఆదేశించాడు, “నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రిందనుండకుండ బొత్తిగా తుడిచి వేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంధములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము”. తన మరణానికి ముందు మహా నాయకుడు మోషే ప్రజలను ఈ విధంగా ఆదేశించాడు, “మీరు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకముంచుకొనము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసియున్నప్పుడు నీ వారిలో నీ వెనుక వున్న బలహీను లందరిని హతము చేసెను... ఆకాశము క్రిందనుండి అమాలేకీయుల పేరు తుడిచి వేయవలెను. ఇది మరిచిపోవద్దు” ద్వితియోపదేశ కాండము 25:17-19. దుర్మార్గులైన ఈ ప్రజల గురించి దేవుడిలా అన్నాడు, “అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి” నిర్గమకాండము 17:16.PPTel 288.3

    దేవుని గుణం గురించిగాని ఆయన సర్వశక్తాధికారం గురించిగాని అమాలే కీయులు ఎరుగనివారు కారు. కాని ఆయనపట్ల భయభక్తులు కలిగి ఉండే బదులు ఆయన అధికారాన్ని వ్యతిరేకించటానికి వారు పూనుకున్నారు. ఐగుప్తు ప్రజల మధ్య మోషే కనపర్చిన అద్భుత కార్యాల్ని అమాలేకీయులు ఎగతాళి చేశారు. చుట్టుపట్ల వున్న రాజ్యాలు వారికి భయపడటాన్ని గేలిచేశారు. హెబ్రీయుల్ని నాశనం చేస్తామని ఒక్కణ్ని కూడా తప్పించుకోనియ్యమని తమ దేవుళ్ల పేర వారు శపథం చేశారు. తమను ప్రతిఘటించటానికి ఇశ్రాయేలీయుల దేవుడు శక్తిహీనుడని ప్రగల్భాలు పలికారు. ఇశ్రాయేలీయులు వారిని భయ పెట్టలేదు. గాయపర్చలేదు. వారి దాడికి కవ్వింపులేదు. దేవునిపట్ల తమకున్న ద్వేషాన్ని ధిక్కార స్వభావాన్ని బట్టి వారు ఆయన ప్రజల్ని నాశనం చెయ్యటానికి పూనుకొన్నారు. చాలాకాలంగా అమాలేకీయులు ఎన్నో అతిక్రమాలకు, దౌర్జన్యాలకు ఒడిగట్టుకొన్న పాపులు. వారి నేరాలు ప్రతీకారంకోసం దేవునికి మొరపెట్టుకొన్నాయి. అయినా ఆయన కృపవారిని పశ్చాత్తాపపడమంటూ విజ్ఞప్తి చేసింది. కాగా అమాలేకీయులు అలసిపోయి నిస్సహాయులైన ఇశ్రాయేలీయుల పై పడి చంపినప్పుడు తమ జాతి సర్వనాశనాన్ని తామే కొని తెచ్చుకొన్నారు. తన బిడ్డల్లో బలహీనుల విషయంలో దేవుడు శ్రద్ధ వహిస్తాడు. వారికి ఎలాంటి హింస కలిగినా ఆయన గుర్తించకుండా ఉండడు. తనను ప్రేమించి తనకు భయపడేవారందరి పైన ఆయన తన అభయ హస్తాన్ని చాపుతాడు. ఆ హస్తంతోనే ఆయన తన న్యాయ ఖడ్గాన్ని తిప్పుతూ ఉంటాడు. PPTel 289.1

    ఇప్పుడు ఇశ్రాయేలీయులు శిబిరం వేసిన చోటుకి దగ్గర్లో మోషేమామ యిత్రో గృహం ఉంది. యిత్రో హెబ్రీయుల విముక్తిని గురించి విన్నాడు. యిత్రో మోషేను సందర్శించి తన భార్యను ఇద్దరు కుమారులను అతనికప్పగించటానికి సమాయత్త మయ్యాడు. యితో వస్తున్నట్లు అనుచరులు తెలిపినప్పుడు మోషే వారికి ఎదురుగా వెళ్లి కుశల ప్రశ్నల అనంతరం మోషే వారిని తన గుడారంలోకి తీసుకువెళ్లాడు. ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులోంచి బయటికి నడిపించటంలో ఉన్న శ్రమలు, అపాయాల దృష్ట్యా మోషే తన కుటుంబాన్ని మామ ఇంటికి పంపించాడు. ఇప్పుడు మళ్లీ కుటుంబంతో వుండి సంతోషించటానికి అవకాశం కలిగింది. ఇశ్రాయేలీయుల విడుదల విషయంలో దేవుడు వ్యవహరించిన తీరునుగూర్చి ఆయన చేసిన మహత్కార్యాల్ని గూర్చి యిత్రోకి మోషే వివరించాడు. ఆ సంగతులు విని ఆ పితరుడు ఎంతో ఆనందించి ప్రభువుని కొనియాడాడు. మోషే, పెద్దలు అర్పించిన బలిలో పాలుపొంది దేవుని కృపల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన విందును ఆరగించాడు. ఇశ్రాయేలీయుల శిబిరంలో వున్న తరుణంలో యిత్రో మోషే పై ఉన్న బాధ్యతలు ఎంత భారమైనవో కళ్లారా చూశాడు. జ్ఞానం, శిక్షణ లేని విస్తారమైన జనులతో కూడిన సమాజంలో క్రమం, క్రమశిక్షణ అమలు ఎంతో కష్టం. మోషే వారికి నాయకుడు. న్యాయాధిపతి. ప్రజల సామాన్య ఆసక్తులేగాక వారి మధ్య ఉత్పన్నమయ్యే వివాదాలు కూడా మోషే దృష్టికి వస్తుండేవి. ఆ కార్య విధానాన్ని మోషే అనుమతించాడు. ఎందుచేతనంటే వారికి ఉపదేశించటానికి ఆ విధంగా మోషేకి అవకాశం కలిగేది. అతడు ఇలా అన్నాడు, “దేవుని కట్టడలను, ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నాను”. అయితే యితో మోషేతో “ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడివే చేయజాలవు”. “నీవు... నిశ్చయముగా నలిగి” పోతావు అని చెప్పి వెయ్యిమంది మీద, వందమంది మీద, పదిమంది మీద సరియైన వారిని నాయకులుగా నియమించమని సలహా చెప్పాడు. “వారు సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి, లంచగొండులుకాని మనుష్యులు” అయి ఉండాలని చెప్పాడు. వీరు చిన్న విషయాల్లో తీర్పు తీర్చితే పెద్ద విషయాలు “మోషే ముందుకి తీసుకురావాలని చెప్పాడు. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖ మందు ఉండి వారి వ్యాజ్యెములను దేవునియొద్దకు తేవలెను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి, వారు నడువవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను” అని హితవు పలికాడు. ఈ హితవును మోషే అంగీకరించి అనుసరించాడు. అది మోషేకు చాలా భారాన్ని తగ్గించటమే కాదు సమాజం క్రమబద్ధం కావటానికి తోడ్పడింది.PPTel 289.2

    ప్రభువు మోషేని ప్రేమించి అతని ద్వారా అనేక మహత్కార్యాలు చేశాడు. ఇతరుల్ని ఉపదేశించటానికి తాను ఎంపికయ్యాడు గనుక తనకు ఉపదేశం అవసరం లేదన్న భావన అతనిలో పుట్టలేదు. ఇశ్రాయేలీయుల్ని నడిపించటానికి ఎంపికైన నాయకుడు భక్తుడు, మిద్యాను యాజకుడూ అయిన యితో సలహాను సావధానంగా విని అతడు ప్రతిపాదించిన ప్రణాళిక జ్ఞానయుతమైందిగా పరిగణించి దాన్ని అమలుపర్చాడు. PPTel 290.1

    మేఘస్తంభం కదలికను అనుసరించి ఇశ్రాయేలీయులు రెఫీదీము నుంచి తమ ప్రయాణాన్ని కొనసాగించారు. వారి ప్రయాణం బీడు భూముల్లోనుంచి మెట్టల మీద నుంచి పర్వతాల మధ్యనుంచి సాగింది. తరచు ఇసుక భూముల్లోంచి వెళ్లేటప్పుడు కొండలు పెద్ద కోటవల్లే ప్రత్యక్షంగా తమన మార్గంలో నిలిచి తమ ప్రయాణాన్ని ఆపివేస్తున్నట్లు కనిపించేవి. కాని దగ్గరకు వచ్చేసరికి అక్కడక్కడ ఆ కొండ గోడల్లో సందులు వాటిలోనుంచి మైదానాలు కనిపించేవి. ఆలాంటి ఒక సందులోనుంచి వారిప్పుడు సాగాల్సి ఉన్నారు. అది అతి రమ్యమైన దృశ్యం! ఆ సందుకి రెండు పక్కల వందల అడుగులు ఎత్తున నిలిచివున్న కొండలు. వాటి మధ్య కనుచూపు మేర దాకా గొర్రెల మందలు, పశువుల మందలతో మందంగా కదుల్తున్న ఇశ్రాయేలీయ ప్రజావాహిని. వారి ముందు గంభీరంగా హుందాగా నిలిచి వున్న సీనాయి పర్వతం. మేఘ స్తంభం ఆ కొండ శిఖరం పై నిలిచిపోయింది. కిందవున్న మైదానంలో ప్రజలు గుడారాలు వేసుకొన్నారు. ఇది వారికి దాదాపు ఒక ఏడాదిపాటు గృహమయ్యింది. రాత్రివేళ అగ్నిస్తంభం వారికి భద్రత కూర్చింది. వారు గాఢ నిద్రలో ఉండగా ఆ శిబిరం అంతా మన్నా కురిసేది.PPTel 291.1

    కొండ కొన చీకట్లను తరిమివేస్తున్న ఉదయ భానుడి అరుణారుణ కిరణాలు,చీకటి ద్రోణుల్ని వెలుగుతో నింపుతున్న సూర్యుడి సువర్ణ కిరణాలు అలసిన ఆ ప్రయాణికు లకు దేవుని సింహాసనం నుంచి ప్రకాశిస్తున్న కృపాకిరణాల్లా కనిపించాయి. ప్రతీ చోటా కనిపిస్తున్న ఎత్తయిన పర్వతాలు అనంతమైన ఓర్పును, ఔన్నత్యాన్ని వెలువరిస్తు న్నాయి. ఇక్కడ గంభీరతతో పరిశుద్ధ భయంతో మనసు పులకరిస్తుంది. “త్రాసులో పర్వతములను తూచినవాడు...తూనిక చేత కొండలను తూచినవాడు” అయిన ఆ ప్రభువు ముందు మానవుడు ఇక్కడ తన అజ్ఞానాన్ని, బలహీనతను గుర్తిస్తాడు. యెషయా 40:12. మానవుడు ఎన్నడూ పొంది ఎరుగని ప్రత్యక్షతను ఇశ్రాయేలీయులు ఇక్కడ పొందనున్నారు. తన పరిశుద్ధ ధర్మశాస్త్రాన్ని తన సొంత స్వరంతో ప్రకటించి తద్వారా తన ధర్మవిధుల పవిత్రతను, తన ప్రజలు గుర్తించేటట్లు చేయటానికి ప్రభువు వారిని ఇక్కడ సమావేశపర్చాడు. వారిలో గొప్ప మార్పులు సంభవించనున్నాయి. దాసత్వ నీచ ప్రభావాలు, విగ్రహారాధనతో ఎంతోకాలంగా సాగిన స్నేహం వారి అలవాట్ల మీద ప్రవర్తనమీద గట్టిపట్టు సాధించాయి. తనను గూర్చిన జ్ఞానాన్ని వారికి ఇవ్వటం ద్వారా వారి నైతిక స్థాయిని సమున్నత పర్చటానికి దేవుడ కృషి చేస్తున్నాడు.PPTel 291.2