Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    45—కూలిన ఎరికో

    హెబ్రీయులు కనానులో ప్రవేశించారేగాని దాన్ని స్వాధీనపర్చుకోలేదు. ఆ దేశాన్ని స్వాధీనపర్చుకోటానికి సుదీర్ఘం కష్టభరితం అయిన పోరాటం అవసరమన్నట్లు మానవ దృష్టికి కనిపిస్తుంది. అక్కడ నివసించే వారు శక్తిమంతులైన ప్రజలు. తమ దేశం పై దండత్తే వారిని ఎందిరించటానికి వారు సర్వసన్నద్ధంగా ఉన్నారు. తమ ముందున్న ఉమ్మడి అపాయం వివిధ జాతుల్ని ఐక్యపర్చింది. తమ గుర్రాలు, ఇనుప యుద్ధ రథాలు, దేశం గురించి తమకున్న పరిజ్ఞానం, తమ యుద్ధ నైపుణ్యం, యుద్ధంలో వారికి గొప్ప లాభాన్ని చేకూర్చుతుంది. ఇంకా చెప్పాలంటే, ఆ దేశాన్ని కాపాటానికి రక్షిత పట్టణాలు ఆకాశమునంటు ప్రాకారములు గల గొప్ప పట్టణములు” ఉన్నాయి. ద్వితి 9:1.తమ ముందున్న పోరాటాల్లో ఇశ్రాయేలీయుల విజయం తమకులేని శక్తి మీద నిశ్చయత మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది.PPTel 484.1

    ఆ దేశంలోని మిక్కిలి శక్తివంతమైన రక్షిత పట్టణాల్లో విశాలమైన, భాగ్యవంతమైన పట్టణం ఎరికో. తాము శిబిరం వేసిన గిల్ట్లుకి అల్లంత దూరంలో తమ కళ్లముందే అది ఉంది. ఉష్ణమండల వివిధ ఉత్పత్తులు సమృద్ధిగా లభించే సారవంతమైన మైదానం అంచున ఉన్నది. ఈ పట్టణం. ఇందులోని రాజభవనాలు, దేవాలయాలు విలాస జీవితాలకు, దుర్నీతికి నిలయాలు. బలమైన, ఎత్తయిన ప్రాకారాలు గల ఆ పట్టణం ఇశ్రాయేలీయుల దేవుని అధికారాన్ని ప్రతిఘటించే పట్టణం . విగ్రహారాధన ప్రధాన కేంద్రాల్లో ఎరికో ఒకటి. ఇది ప్రధానంగా చంద్ర దేవత అయిన అస్తారోతు పూజకు అంకితమైన పట్టణం. కనానీయుల మతంలోని అతి దుర్మార్గం, నీచం అయిన పాపాలకు ఇది కేంద్రం. బేత్పయోరులో తమ పాపం భయంకర పర్యవసానం ఇంకా మరచిపోలేని ఇశ్రాయేలీయులకు ఈ అస్యమత పట్టణమంటే విసుగూ, భయమూ పుట్టాయి.PPTel 484.2

    కనానును జయించటానికి ఎరికోని కూల్చటం మొదటి మెట్టుగా యెహోషువ భావించాడు. కాని ముందుగా దేవుని నడుపుదల హామీ ఇచ్చి అర్థించాడు. దేవుడు తనకు హామీ ఇచ్చాడు. తన ప్రజల ముందు నడవలసిందంటూ దేవునికి మనవి చేస్తూ ప్రార్థన చేసేందుకు శిబిరం నుంచి బయటికి వెళ్లాడు యెహోషువ. అక్కడ ఆయుధాలు ధరించిన ఒక వీరుణ్ని చూశాడు. అతడు మహాకాయుడు, శక్తిమంతుడు. “దూసిన కత్తి చేతపట్టుకొని” ఉన్నాడు. “నీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధి పక్షమున నున్నవాడవా?”అన్న యెహోషువ ప్రశ్నకు అతడి సమాధానం ఇది, “యెహోవా సేనాధిపతిగా నేను వచ్చియున్నాను” ” నీవు నిలిచియున్న యీ స్థలము పరిశుద్ధమైనది, నీ పాద రక్షలను తీసివేయుము” అని హోరేబు పై మోషేకు వచ్చిన ఇదే ఆదేశం ఆ మర్మవ్యక్తి నిజ స్వరూపాన్ని బయలు పర్చుతుననది. ఇశ్రాయేలీయుల నాయకుడి ముందు నిలిచిన వ్యక్తి సర్వోన్నతుడైన క్రీస్తే. భయభీతితో నిండి యెహోషువ సాగిలపడి ఆయనకు నమస్కరించాడు. అప్పుడు ఆయన ఈ మాట లన్నాడు, “నేను యెరికోను దాని రాజును, పరాక్రమముగల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను”. అంతట ఆ పట్టణాన్ని పట్టుకోటానికి ఉపదేశం పొందాడు.PPTel 484.3

    దేవుని ఆదేశానుసారం యెహోషువ ఇశ్రాయేలు సైన్యాన్ని మోహరించాడు. అయితే వారు దాడి చేయకూడదు. వారు మందసాన్ని మోసుకొంటూ బూరలు ఊదుతూ పట్టణం చుట్టూ తిరగాలి. సైన్యం ముందు భాగంలో ప్రత్యేకంగా ఎంపిక అయిన యుద్దశూరులున్నారు. తమ శక్తి సామర్ధ్యాలచేత జయించటానికి కాదు, కాని దేవుని ఉపదేశానికి విధేయులై వ్యవహరించటానికి. వారి వెనుక బూరలు ధరించిన ఏడుగురు యాజకులున్నారు. తమ పరిశుద్ధ హోదాను సూచించే తెల్లని వస్త్రాలు ధరించిన యాజకులు దేవుని మహిమతో ప్రకాశిస్తున్న మందసాన్ని మోస్తూ ఆ తర్వాత ఉన్నారు. వారి వెనుక తమ తమ గోత్రాల ప్రకారం తమ తమ పతాకాల కింద ఇశ్రాయేలీయుల సైన్యం ఉంది. నాశనం కానున్న పట్టణం చుట్టూ వెళ్తున్న జనసమూహం ఈ విధమైంది. ఆ ప్రజా సమూహం అడుగుల సవ్వడీ, కొండల్లో ప్రతిధ్వనించి ఎరికో పట్టణ వీధిల్లో వినిపించే గంభీర బూర ధ్వనులూ తప్ప మరే శబ్దం వినిపించలేదు. పట్టణం చుట్టూ తిరిగిన తర్వాత సైనికులు తమ తమ గుడారాల్లోకి నిశ్శబ్దంగా వెళ్లేవారు. యాజకులు మందసానిన గుడారంలోని దాని స్థానంలో పెట్టేవారు.PPTel 485.1

    పట్టణాన్ని కావలి కాసేవారు ఆశ్చర్యంతో ఒకింత భయంతో వారి కదలికల్ని గుర్తించి అధికారులకి నివేధించేవారు. ఈ విన్యాసం అంతర్యం వారికి అంతు చిక్కలేదు. అయితే రోజూ ఒకసారి ఆ బ్రహ్మాండమైన ప్రజా సమూహం పరిశుద్ధ మందసం దాన్ని మోసే యాజకులతో తమ పట్టణం చుట్టూ ప్రదక్షణ చేయటంతో ఆ పట్టణ యాజకులు ప్రజల గుండెల్లో బాంబులు పేల్తున్నాయి. వారు తమ సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని పరీక్షించుకొని ఎంత బలమైన దాడినైనా తిప్పి కొట్టేందుకు తమకు సమర్థత ఉందని ధైర్యం తెచ్చుకొనేవారు. ఈ వింత విన్యాసం వల్ల తమకు ఎలాంటి హానీ వాటిల్లదంటూ పలువురు ఎగతాళి చేశారు. ప్రతిదినం తమ పట్టణం చుట్టూ జరిగే సైనిక ప్రదక్షిణాన్ని చూసి కొందరు భయపడేవారు. ఒకప్పుడు ఈ ప్రజలకు ఎర్ర సముద్రం రెండు పాయలై దారి ఇచ్చిందని ఇటీవలే యోర్డాను నదిలో నుంచి వీరికి మార్గం ఏర్పడిందని గుర్తు చేసుకొన్నారు. వీరి నిమిత్తం దేవుడు ఇంకేమి అద్భుతాలు చేయనున్నాడో అని తలపోసుకొంటున్నారు.PPTel 485.2

    ఇశ్రాయేలీయులు పట్టణం చుట్టూ ఇలా ఆరు రోజులు తిరిగారు. ఏడో రోజు వచ్చింది. ఆ దినం తెల్లవారగానే యెహోషువ యెహోవా సైన్యాన్ని పోగుచేసి ఎరికో చుట్టూ ఏడుసార్లు తిరిగాలని బూర ధ్వని ప్రబలమైనప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయాలని, ఎందుకంటే దేవుడు ఆ పట్టణాన్ని తమకు ఇచ్చాడని చెప్పాడు.PPTel 486.1

    విస్తారమైన ఆ సైన్యం, ఆ పట్టణం గోడల చుట్టూ తిరిగింది. అనేక పాదాలచప్పుడు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ ఉదయకాల ప్రశాంతతలో అప్పుడప్పుడు బూర ధ్వని మాత్రం వినిపించేది. బలమైన రాళ్లతో నిర్మతి అయిన ఆ పట్టణ ప్రాకారం ఆ మనుష్యుల ముట్టడికి లొంగనట్లు కనిపించింది. గోడల మీది కావలివారు అధికమవుతున్న భయంతో చూస్తునాష్ట్రరు. మొదటిసారి తిరగటం ముగిసిన వెంటనే రెండోసారి, మూడోసారి, నాసారి, అయిదోసారి, ఆరోసారి తిరగటం పూర్తి అయ్యింది. మర్మపూరితమైన ఈ ప్రదక్షిణాల ఆంతర్యం ఏమిటి? ఏ గొప్ప సంఘటన చోటు చేసుకోనుంది? వారు ఎక్కువ కాలం వేచి ఉండనక్కర లేదు. ఏడోసారి తిరగటం ముగిసిన తర్వాత ప్రస్థానం ఆగింది. కొంత సేపు ఆగిన బూరలు ఇప్పుడు గొప్ప శబ్దంతో ప్రారంభమయ్యాయి. ఆ శబ్దానికి భూమి దద్దరిల్లింది. బలమైన గోపురాలతో కూడిన రాతి గోడలు, ప్రాకారాలు పునాదుల్లో నుంచి కదలి గొప్ప శబ్దంతో కూలిపోయాయి. ఎరికో పట్టణ నివాసులు భయంతో వణుకుతుండగా ఇశ్రాయేలు సేనలు ఆ పట్టణాన్ని స్వాధీన పర్చుకోన్నాయి.PPTel 486.2

    ఇశ్రాయేలీయులు తమ సొంత శక్తివల్ల ఆ విజయం సాధించలేదు. అది పూర్తిగా దేవుడు సాధించిన విజయం. ఆ దేశ “ఫ్రథమ ఫలంగా ఆ పట్టణం దానిలోని సమస్తం దేవునికి అర్పణ కావాల్సి ఉంది. కనానుని జయించటంలో వారు పోరాడకతాము. కేవలం దేవునికి అర్పణ కావాల్సి ఉంది. కనానుని జయించటంలో వారు పోరాడక తాము కేవలం దేవుని చిత్తాన్ని నెరవేర్చే సాధనాలని ఇశ్రాయేలీయులు గుర్తించాలని, సిరుల్నిగాని, ఆత్మ ఔన్నత్యాన్ని గాని ఆశించక తమ రాజైన యెహోవాను మహిమ పర్చటానికి కాంక్షించాలని దేవుడు కోరాడు. ముట్టడికి ముందు ఆయన ఈ ఆజ్ఞ ఇచ్చాడు, “ఈ పట్టణమును దానిలో నున్నది యావత్తును యెహోవావలన శపించబడెను” “ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపించబడినదానిని మీరు ముట్టకూడదు”.PPTel 486.3

    ఆ పట్టణ వాసులందరినీ, దానిలోని సమస్తాన్ని “పురుషులనేమి, స్త్రీలనేమి, చిన్న పెద్దలందరినీ, ఎద్దులను, గొట్టెలను, గాడిదలను” సంహరించారు. వేగుల వారి వాగ్దానం మేరకు రాహాబు ఆమె ఇంటి వారు మాత్రమే మిగిలి ఉన్నారు. ఆ పట్టణాన్ని తగులబెట్టారు. అందులోని రాజ భవనాలు, దేవాలయాలు, నివాస గృహాలు, విలాస మందిరాలు, విలువైన అలంకరణలు, దుస్తులు, అన్నీ అగ్నికి అహుతి అయ్యాయి. అగ్నివల్ల నాశనం కాని “వెండియు, బంగారమును, ఇత్తడి పాత్రలును, ఇనుప పాత్రలును” వీటిని గుడార సేవకు ఉంచారు. ఈ పట్టణమున్న స్థలమే శాపగ్రస్తమైనది. అది కోటగా మరెన్నడు తిరిగి నిర్మితికాదు. దైవశక్తి వల్ల కూలిన దాని గోడల్ని పునరుద్ధరించటానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి దేవుని శిక్షకు గురి కావటం తథ్యం.ఇశ్రాయేలీయులందరి సమక్షంలోను ఈ గంభీర ప్రకటన వెలవ డింది,“ఎవడు ఎరికో పట్టణమును కట్టించ పూనుకొనునోవాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును”.PPTel 487.1

    ఎరికో ప్రజల సర్వనాశనం కనాను నివాసుల గురించి గతంలో మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ఆజ్ఞల నెరవేర్పు మాత్రమే. “నీవు వారిని హతము చేయవలెను: వారిని నిర్మూలము చేయవలెను”. ద్వితి 7:2. “ఈ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రదుకనియ్యకూడదు” ద్వితి, 2016, ప్రేమించాలి. దయ, కనికరాలు చూపించాలి అంటూ బైబిలులోని ఇతర స్థలాల్లో ఉన్న ఆదేశాలు నిజానికి అనంత జ్ఞాని అయిన దేవుని మంచితనం నుంచి ఆదేశాలు. ఇశ్రాయేలీయుల్ని కనానులో స్థాపించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వారిని ఒక జాతిగా వృద్ధిపర్చి ఆయన రాజ్యం ఎలాంటిదో భూనివాసులకు ప్రదర్శించే ప్రభుత్వాన్ని వారి ద్వారా నెలకొల్పాలని దేవుడు సంకల్పించాడు. నిజమైన మతానికి వారసులుగా ఉండటం మాత్రమే గాక దాని సూత్రాల్ని ప్రపంచమంతటా వారు ప్రచురించాల్సి ఉన్నారు. కనానీయులు నికృష్టమైన అన్యమత దురాచారాలు, దుష్కృతాల్లో కూరుకుపోయారు. కనుక కృపతో కూడిన దేవుని ఉద్దేశాల నెరవేర్పుకు అడ్డుతగిలే సమస్తాన్ని తొలగించటం అవసరం.PPTel 487.2

    పశ్చిత్తాపం పొందటానికి కానాను ప్రజలకు ఎంతో అవకాశం లభించింది. నలభై ఏళ్ల క్రితం ఎర్ర సముద్రం మార్గం తెరవటం, ఐగుప్తులో దేవుని తీర్పులు పడటం ఇవి ఇశ్రాయేలీయుల దేవుడు సర్వోన్నతుడని సాక్ష్యమిచ్చాయి. ఇప్పుడు మిద్యాను, గిలాదు, బాషాను రాజుల నాశనం యెహోవా అందరి దేవుడళ్లకన్నా ఉన్నతుడని నిరూపించింది. హేయమైన బయల్పెయోరు కర్మకాండలో ఇశ్రాయేలీ యులు పాల్గొన్నప్పుడు దేవుడు వారి మీదికి పంపిన తీర్పుల్లో ఆయన పరిశుద్ధ గుణశీలం, అపవిత్రతపట్ల ఆయన అసహనం ప్రధాన పాత్ర వహించాయి. ఈ ఘటనలన్నీ ఎరికో ప్రజలకు తెలుసు. రాహాబు నమ్మకాన్ని పంచుకొన్న వారెందరో ఉండగా వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా “పైన ఆకాశమందు, క్రింద భూమి పైన దేవుడు” అని నమ్మి విధేయులు కావటానికి నిరాకరించారు. దేవుని పై తిరుగుబాటు దారులు, మానవుడికి శత్రువులు అయిన వీరి సత్వర నాశనాన్ని ప్రేమ, న్యాయం రెండూ డిమాండు చేశాయి. నలభై ఏల్ల కిందట ఏ పట్టణం బురుజులు నమ్మికలేని వేగులవారి గుండెల్లో గుబులు పుట్టించాయో ఆ ఎరికో పట్టణ ప్రాకారాన్ని దేవుడు సైన్యాలు అలవోకగా కూలగొట్టాయి! ఇశ్రాయేలీయుల దేవుడిలా అన్నాడు, “నేను యెరికోను... నీ చేతికి అప్పగించుచున్నాను”. ఆ మాటకు వ్యతిరేకంగా ఏ మానవశక్తీ నిలువలేదు.PPTel 487.3

    “విశ్వాసమును బట్టి ... యెరికో గోడలు కూలెను”. హెబ్రీ 11:30. యెహోవా సైన్యాల కధికపతి యెహోషువతో మాత్రమే దేవుడు సంప్రదింపులు జరిపాడు. సర్వ సమాజానికి తన్నుతాను ప్రత్యక్ష పర్చుకోలేదు. యెహోషువ మాటలు నమ్మటం లేక నమ్మకపోవటం, దేవుని పేర అతడిచ్చిన ఆదేశాల్ని ఆచరించటం లేక ఆయన అధికారాల్ని తిరస్కరించటం అన్నది వారి మీదే ఆధారపడి ఉన్నది. దైవ కుమారుని నాయకత్వం కింద తమతో ఉన్న దూత సమూహాల్ని వారు చూడలేకపోయారు. “అర్ధం లేని ఈ కదలికలు దేనికి? గొర్రె కొమ్ము బూరలూదుకుంటూ రోజూ పట్టణం చుట్టూ ప్రదక్షిణం చేయటం ఎంత నవ్వులాట పని? బలీయమైన ఆ గోడల్ని, బురుజుల్ని ఇవి ఏమీ చెయ్యలేవు( అంటూ హేతువాదం చేయవచ్చు. చివరగా గోడలు కుప్ప కూలటానికి ముందు అంత దీర్ఘకాలం ఈ కర్మకాండను కొనసాగించే ప్రణాళిక ఇశ్రాయేలీయులలో విశ్వాసాన్ని వృద్ధిపర్చేందుకు ఏర్పాటయ్యింది. తమ బలం మానవ వివేకంలో గాని, మానవ శక్తిలో గాని కాక తమ రక్షణ కర్త అయిన దేవునిలోనే ఉన్నదని వారు గుర్తించాల్సి ఉన్నారు. ఆ విధంగా వారు తమ నాయకుడైన దేవుని మీద నిత్యం ఆధారపడి ఉండటం అలవర్చుకోవాల్సి ఉన్నారు.PPTel 488.1

    తనపై విశ్వాసముంచిన వారి నిమిత్తం దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని ప్రజలమని చెప్పుకోనేవారు ఏమంత శక్తి ప్రభావాలు లేకుండా నివసించటానికి కారణం వారు స్వీయ వివేకాన్ని నమ్ముకొని తమ పక్షంగా దేవుడు తన శక్తిని ప్రదర్శించటానికి ఆయనకు అవకాశం ఇవ్వకపోవటమే. తనను విశ్వసించేవారు తన పై అచంచల విశ్వాసముంచి తనకు విధేయులై ఉన్నట్లయితే ప్రతీ ఆపదలో ఆయన వారికి సహాయమందిస్తాడు. ఎరికోను స్వాధీనం చేసుకొన్న దరిమిల యెహోషువ హాయి పై దాడికి నిశ్చయించుకొన్నాడు. అది యోధాను లోయకు పశ్చిమంగా కొన్ని మైళ్ల దూరంలో ఉన్న కొండ ప్రాంతంలో ఉన్న చిన్న పట్టణం. అక్కడకు వెళ్లిన వేగులవారు ఆ పట్టణంలో ఎక్కువమంది ప్రజలు లేరని దాన్ని జయించటానికి చిన్న సైన్యం సరిపోతుందని నివేదించారు.PPTel 488.2

    దేవుడు తమకనుగ్రహించిన గొప్ప విజయం ఇశ్రాయేలీయుల్లో ఆత్మ విశ్వాసం పెంచింది. దేవుడు తమకు కనానుని వాగ్దానం చేశాడు గనుక తాము సురక్షితంగా ఉన్నామని భావించి తమకు విజయం కూర్చేది దేవుని అండ మాత్రమే అన్న వాస్తవాన్ని గుర్తించలేకపోయారు. యెహోషువ సయితం దేవునితో సంప్రదించకుండా హాయి ముట్టడికి ప్రణాళికలు రూపొందించుకొన్నాడు.PPTel 489.1

    ఇశ్రాయేలీయులు తమ బలం గురించి అతిశయిస్తూ తమ శత్రువుల్ని చులకనగా చూడటం మొదలు పెట్టారు. విజయం సులభంగా లభిస్తుందన్న నమ్మకంతో మూడు వేల మంది సరిపోతారని బేరీజు వేసుకొన్నారు. దేవుడు తమతో ఉంటాడన్న హామీ లేకుండా దాడికి బయల్దేరారు. దాదాపు ఆ పట్టణం గుమ్మం వద్దకు వెళ్లగా తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యింది. విస్తారమైన శత్రు సైన్యాన్ని, వారి సిద్ధబాటను చూసి భయభ్రాంతులై గందరగోళం చెంది లోతట్టు ప్రాంతానికి పారిపోయారు. కాననీయులు వారిని తరుముకొంటూ వెళ్లారు. “తమ గవిని యెద్ద నుండి... వారిని తరిమి.. వారిని హతము చేసిరి”. “సంఖ్యాపరంగా ముప్పయి ఆరుమంది హతులవ్వటం పెద్ద నష్టం కాకపోయినా ఆ పరాజయం సమాజమంతటికీ తీవ్ర నిరాశ, నిస్పృహాల్ని కలిగించింది. “జనుల గుండెలు కరిగి నీరై పోయెను” “కనానీయులతో యుద్ధంలో తలపడటం వారికి ఇదే ప్రథమం. ఈ చిన్న పట్టణ ప్రజల ముందు నిలువలేక పారిపోతే తమ ముందున్న పెద్ద యుద్ధాల్లో వారి పరిస్థితి ఎలాగుంటుంది? వారి పరాజయాన్ని దేవుని కోపానికి సూచనగా యెహోషువ గుర్తించాడు. దు:ఖంతోను, భయంతోను యెహోషువ “తన బట్ట చింపుకొని, తాననును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందసము నెదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలలమీద ధూళి” పోసుకొన్నారు.PPTel 489.2

    “అయ్యో, ప్రభువా యెహోవా, మమ్మును నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దానును నీవెందుకు దాటించితివి?... ప్రభువా కనికరించుము: ఇశ్రాయేలీయులు తమ శత్రువుల యెదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను కనానీయులును, ఈ దేశ నివాసులందరును విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండ తుడిచివేసిన యెడల, ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయుదువు?” అని ఏడ్చాడు.PPTel 489.3

    యెహోవా వద్ద నుంచి వచ్చిన జవాబు ఇది, “లెమ్ము, నీవేల యిక్కడ ముఖము నేల మోపికొందువు? ఇశ్రాయేలీయులు... నేను వారితో చేసిన నిబంధనను వారు మీరియున్నారు”. అది తక్షణ నిర్దిష్ట చర్యకు సమయం, నిస్పృహకు, నిట్టూర్పకు కాదు. శిబిరంలో రహస్య పాపం చోటు చేసుకొని ఉంది. దాన్ని వెదకి పట్టుకొని నిర్మూలించాలి. దేవుని సముఖం ఆయన ఆశీర్వాదాలు తమ ప్రజల మధ్యకు మళ్లీ రాకముందు ఇది జరగాలి. “శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండ మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై యుండను”. దేవుని తీర్పుల అమలుకు నియమితులైన వారిలో ఒకడు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. పాపి అపరాధానికి ఆ జాతి అంతా జవాబు దారి అయ్యింది. “శపితమైన దాని కొంత తీసికొని, దొంగిలించి తమ సామానులో దాని ఉంచు కొనియున్నారు”. దాన్ని వెదికితీసి అపరాధిని శిక్షించాల్సిందిగా దేవుడు యెహోషువను ఆదేశించాడు. పాపిని ప్రత్యక్షంగా పేర్కొనలేదు. తమ మధ్య వున్న పాపాల నిమిత్తం బాధ్యత వహించి తమ హృదయాలు పరిశోధించుకొని ప్రజలు ముందు వినయ విధేయతలతో నివసించేందు కోసం ఈ అంశాన్ని కొంత సేపు సందిగ్ధంలో ఉంచాడు దేవుడు.PPTel 490.1

    యెహోషువ ఉదయాన్నే ప్రజల్ని తమ తమ గోత్రాల వారీగా సమావేశపర్చాడు. అప్పుడు దర్యాప్తు ప్రక్రియ పకడ్బంధీగా ప్రారంభమయ్యింది. దర్యాప్తు అంచెలంచెలుగా సాగింది. వెన్నులో చలి పుట్టించే ఆ పరీక్ష దగ్గర పడుంది. మొదట గోత్రం, తర్వాత కుటుంబం, తర్వాత ఆ కుటుంబంలోని వారు, తర్వాత ఆ వ్యక్తి చొప్పున పరీక్ష జరిగింది. అప్పుడు ఇశ్రాయేలీయుల ఈతి భాదలకు కారకుడు కర్మీ కుమారుడైన ఆకాను అని దేవుని వేలు చూపించింది.PPTel 490.2

    అన్యాయంగా శిక్షించారు అన్న అపవాదుకు తావులేకుండా తన నేరాన్ని నిరూపించేందుకుగాను ఆకానుని పిలిచి తన తప్పుని ఒప్పుకోమని యెహోషువ నిలదీశాడు. అతడు తన పాపాన్ని సంపూర్తిగా ఒప్పుకొన్నాడు. “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు వస్త్రమును, రెండు వందల తులముల వెండిని, ఏబది తులముల యెత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి యున్నవి”. యెహోషువ పంపిన మనుష్యులు వెళ్లి ఆకాను పేర్కొన్న స్థలములో మట్టిని తొలగించి చూచినప్పుడు “అది ఆ డేరాలో దాచబడియుండెను. ఆ వెండి దాని క్రింద నుండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకు .. తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి”.PPTel 490.3

    శిక్ష విధింపు దాని అమలు వెంటనే జరిగాయి. “నీవేల మమ్మును బాధపరచితివి? నేడు యెహోవా నిన్ను బాధపరచును” అని యెహోషువ అన్నాడు. ఆకాను పాపానికి ప్రజలు జవాబుదారులై దాని పర్యవసానాల్ని అనుభవించారు గనుక వారు తమ ప్రతినిధుల ద్వారా ఆ శిక్ష అమలులో పాలు పంచుకోవాల్సి ఉన్నారు. “ఇశ్రాయేలీయులందరు వానిని రాళ్లతో చావగొట్టిరి”. ప్రజలు అతడి మీదకు విసిరిన రాళ్లు పెద్ద కుప్ప అయ్యాయి. అది అతడి పాపానికి దాని శిక్షకు చిహ్నంగా నిలచింది. “అందుచేత ... ఆచోటికి ఆకోరు లోయ అని పేరు”. దినవృత్తాంతముల గ్రంథంలో అతణ్ని గురించి “ఆకాను... ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టెను” అన్న మాటలు దాఖలయ్యా యి. 1 దిన. 2:7.PPTel 491.1

    ప్రత్యక్ష హెచ్చరికలు, గొప్ప దైవశక్తి ప్రదర్శనలు కోకొల్లలుగా ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా ఆకాను పాపం చేశాడు. “మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు” అన్నది ఇశ్రాయేలీయులకు చేసిన హెచ్చరిక. ఇశ్రాయేలీయులు యోర్దానును దాటిన అనంతరం, ప్రజలు సున్నతి పొందటం ద్వారా దైవ నిబందన గుర్తింపు జరిగిన అనంతరం పస్కా ఆచరణ ఆ తర్వాత యెహోవా సైన్యాలకధిపతి అయిన నిబంధన దూత దర్శనం అనంతరం దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది. ఈ హెచ్చరిక జారీ అయిన వెనువెంటనే ఎరికో నాశనం జరిగింది. దేవుని ఆదేశాన్ని అతిక్రమించే వారందరికీ నాశనం తప్పదని ఎరికో నాశనం విస్పష్టంగా సూచించింది. ఇశ్రాయేలీయులకి విజయం చేకూర్చింది దేవుడేనన్న వాస్తవం, వారు తమ స్వశక్తివల్ల ఎరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోలేదన్న వాస్తవం, వారు ఆ దోపుడు సొమ్ములో పాలుపంచుకో కూడదన్న నిషేదానికి బలం చేకూర్చాయి. బలమైన ఆ పట్టణాన్ని దేవుడు తన మాటచే కూల్చివేశాడు. ఆ విజయం దేవునిది. ఆ పట్టణం దానిలోని సర్వం ఆయనకే చెందాల్సి ఉంది.PPTel 491.2

    లక్షలాదిగా వున్న ఇశ్రాయేలీయుల్లో ఒక్కడు మాత్రమే ఆ గంభీర విజయం, తీర్పు సమయంలో దేవుని ఆజ్ఞను ఉల్లంఘించటానికి సాహసించాడు. విలువైన ఆ షీనారు వస్త్రాన్ని చూసినప్పుడు ఆకానులో దురాశ పెరిగింది. అది తనకు చావు తెచ్చి పెడుతన్నప్పటికీ దాన్ని ” మంచి షీనారు పై వస్త్రము” అంటున్నాడు. ఒక పాపం ఇంకోదానికి ప్రోత్సాహమిచ్చింది. దేవుని ధనాగారానికి చెందిన వెండిని, బంగారాన్ని కూడా దొంగిలించాడు. కనాను దేశములో నుంచి రావాల్సిన ప్రథమ ఫలాలు దేవునికి దక్కకుండా తానే అపహరించాడు.PPTel 492.1

    ఆకాను నాశనానికి దారితీసిన భయంకర పాపానికి మూలం దురాశ. ఇది సర్వ సాధరణ పాపం. ఇది ఎక్కువ మంది పట్టించుకోని పాపం. ఇతర దోషాల్ని కనుగోటం, శిక్షించటం సాధ్యపడుంటే పదో ఆ అతిక్రమం అయిన ఈ పాపాన్ని ఖండించటం అయినా జరగటం లేదు. ఈ పాపం దాని ఫలితాలు ఎంత తీవ్రమైనవో ఆకాను చరిత్ర నుంచి నేర్చుకోవచ్చు.PPTel 492.2

    దురాశ క్రమక్రమంగా పెరిగే పాపం. ఆకాను ఆక్రమ లాభాన్ని ఆశించాడు. అది రానురాను ఒక అలవాటుగా మారి ఛేదించలేని బంధాలతో అతణ్ని కట్టి పారేసింది. ఈ పాపాన్ని ప్రోది చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులమీదికి గొప్ప విపత్తును తెస్తున్నాను అన్న తలంపు అతడిలో భయం పుట్టించి ఉండాల్సింది. కాని ఆ సున్నిత భావనలు పాపంవల్ల నశించటంతో శోధన వచ్చినప్పుడు సులభంగా పడిపోయాడు.PPTel 492.3

    స్పష్టమైన హెచ్చరికలున్నప్పటికీ ఇలాంటి పాపాలు చోటు చేసుకోటం లేదా? ఎరికో కొల్ల సొమ్మును ముట్టకూడదని ఆకానుకి ఎంత స్పష్టంగా చెప్పాడు అంతే స్పష్టంగా దురాశకు పాల్పడకూడదని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడు దాన్ని విగ్రహారాధన అంటున్నాడు. “మీరు దేవునికిని, సిరికి దాసులుగా నుండనేరరు” అంటూ మనల్ని హెచ్చరిస్తున్నాడు”. మత్తయి 6:24. “మీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యాక జాగ్రత్త పడుడి”. లూకా 12:15. దీని “పేరైనను ఎత్తకూడదు” ఎఫెసీ 5:3. ఆకాను, యూదా, అననీయ, సప్పిరాల నాశనాన్ని గూర్చిన చరిత్ర మన ముందే ఉన్నది. వీటన్నిటి వెనుక ఇంకా ఉన్నత స్థాయిని ఆకాంక్షించి పరలోక మహిమను, ఆనందాన్ని నిరంతరంగా పోగొట్టుకొన్న “తేజో నక్షత్రము” అయిన లూసిఫర్ పతనం కూడా మన ముందున్నది. ఈ హెచ్చరికలన్నీ ఉన్నా పేరాశ ప్రబలుతూనే ఉన్నది.PPTel 492.4

    ఎక్కడ చూసినా దాని మురికి చాళ్లే కానవస్తున్నాయి. అది కుటుంబాల్లో అసంతృప్తిని, అసమ్మతిని సృష్టిస్తుంది. పేదల్లో ధనికుల పట్ల ద్వేషం పుట్టిస్తుంది. ఉన్నవారు లేని వారిని హింసించటానికి దారి తీస్తుంది. ఈ పాపం లోకంలోనే కాదు సంఘంలో కూడా చోటు చేసుకొంటుంది. స్వార్థం, పేరాశ, వంచన, పరోప కారం విషయంలో ఉదాసీనత, “పదియవ భాగమును ప్రతిష్టాతార్పణలను” ఇవ్వటంలో దేవున్ని దోచుకోటం సంఘంలో ఎంత సామాన్యమైపోయింది! “నమ్మకస్తులు, విశ్వసనీయులు” అయిన సంఘ సభ్యుల్లో కూడా ఎందరో ఆకానులు ఉండటం శోచనీయం. తమ ఆస్తిలో ప్రభువు శపించిన ఆక్రమ ఆర్జనలుంచుకొని గుడికి వచ్చి ఏమీ ఎరుగనట్లు ప్రభువు భోజన బల్లవద్ద కూర్చొనేవారు ఎందరో ఉన్నారు. మంచి షీనారు పై వస్త్రం కోసం అంతరాత్మ ప్రబోధాన్ని, పరలోక నిరీక్షణను త్యాగం చేసేవారు ఎందరో ఉన్నారు. తమ విశ్వసనీయతను, తమ ఉపకార సామర్థ్యాల్ని వెండి, బంగారాలకు అమ్ముకొనేవారు వేలాదిమంది. బీదల ఆర్తనాదాలు వారు వినిపించుకోరు. సువార్త వెలుగుకు అంతరాయం ఏర్పడుతుంది. క్రైస్తవులమని చెప్పుకొనేవారి పనులు లోకస్తుల అవహేళన మంటల్ని రగలిస్తాయి. అయినా పేరాశగల భక్తుడు కాసులు పోగు జేసుకొంటూనే ఉంటాడు. “మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలిరి” (మలాకీ 3:8) అంటున్నాడు ప్రభువు.PPTel 492.5

    ఆకాను పాపం జాతి మొత్తానికి విపత్తు తెచ్చి పెట్టింది. ఒక వ్యక్తి పాపం గురించి సంఘం అంతటి పై దేవుని కోపం రగులుతుంది. ఆ అతిక్రమాన్ని వెదకి పట్టుకొని నిర్మూలించేవరకు ఆయన కోపం చల్లారదు. సంఘం ఎక్కువగా భయపడా ల్సింది బహిర్గతంగా వ్యతిరేకించేవారు,నాస్తికులు,దేవ దూషకులు ప్రసరించే ప్రభావా నికి కాదు గాని క్రీస్తు అనుచరులమని చెప్పుకొంటూ అలా నివసించని క్రైస్తవుల ప్రభావానికి, దేవుని దీవెనల్ని అడ్డగించి దైవ ప్రజల్ని బలహీన పర్చే వారు వీరే. సంఘం కష్టాల్లో ఉన్నప్పుడు, సంఘం ఆధ్యాత్మికంగా చల్లబడి క్షీణావస్థకు దిగజారి దైవ విరోధులు విజయం సాధించటానికి అవకాశం ఇచ్చినప్పుడు చేతులు కట్టుకొని తమ దుర్దశ గురించి విలపించే కన్నా తమ శిబిరంలో ఆకాను ఉన్నాడేమో సంఘ సభ్యులు భోగట్టా చేయటం మంచిది, దీన హృదయంతో ఆత్మ పరిశోధన చేసుకొని దేవుని సముఖాన్ని దూరం చేస్తున్న పాపాలు తమలో దాగి ఉన్నాయేమో ప్రతీవారు తమ హృదయాల్ని పరీక్షించుకోవాలి. ఆకాను తన అపరాధాన్ని ఒప్పుకొన్నాడు. అయితే జాప్యం జరిగినందువల్ల ఆ ఒప్పుకోలు అతడికి సహాయ పడలేదు. ఇశ్రాయేలీయుల సైన్యం ఓడిపోయి అధైర్యం చెంది తిరిగి రావటం అతడు చూశాడు. అయినా ముందుకువచ్చి తన పాపాన్ని ఒప్పుకోలేదు. యెహోషువ, ఇశ్రాయేలీయుల పెద్దలు దు:ఖంతో నేలమీద పడి ఉండటం చూశాడు. ఆ సమయంలో తన పశ్చాత్తాపాన్ని కనపచ్చినట్లయితే యదార్థమైన మారమనస్సుకు అది కొంత రుజువుగా ఉండేది. అతడు అప్పుడు కూడా పెదవి విప్పలేదు. గొప్ప నేరం జరిగిందన్న ప్రకటన విన్నాడు. ఆ పాపం వివరణ కూడా విన్నాడు. కాని అతడు నోరు మెదపలేదు. అనంతరం దర్యాప్తు ప్రక్రియ మొదలయ్యింది.. తన గోత్రాన్ని, తన కుటుంబాన్ని, వంశాన్ని పేర్కొన్నప్పుడు అతడి గుండెల్లో గుబులు పుట్టి ఉండాలి.అయినా అతడు ఉలకలేదు పలకలేదు. దేవుని వేలు తనను సూచించే వరకు మాట్లాడలేదు. తన పాపాన్ని ఇక దాచటానికి వీలులేనప్పుడు నిజం చెప్పాడు. అలాంటి ఒప్పుకోళ్లు తరచు చోటు చేసుకొంటూ ఉంటాయి. రుజు వైన తర్వాత నిజం చెప్పటానికి, దేవునికీ మనకు మాత్రమే తెలిసిన పాపాల్ని ఒప్పుకోటానికి మధ్య చాలా వ్యత్యాసముంది. తన పాప పర్యవసానాలను తప్పించు కోగలనన్న ఆశాభావంతోనే ఆకాను తన నేరాన్ని ఒప్పుకొన్నాడు. లేకపోతే ఒప్పుకోనేవాడు కాదు. అయితే అతడి ఒప్పుకోలు తన శిక్ష న్యాయమైనదని వెల్లడించటానికి తోడ్పడింది. పాపం నిమిత్తం వాస్తవికమైన పశ్చాత్తాపం లేదు. విరిగి నలిగిన హృదయం లేదు. కార్యాచరణలో మార్పు లేదు. దుర్మార్గత పట్ల విముఖతలేదు.PPTel 493.1

    కనుక ప్రతీకేసు నిత్యజీవానికో నిత్య మరణానికో తీర్పు అయిన తర్వాత అపరాధులు దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు తమ పాపాలు ఒప్పుకొంటారు. తమకు కలిగి పర్యవసానాల్ని దృష్టిలో ఉంచుకొని వారు తమ పాపాల్ని ఒప్పుకోటం జరుగుతుంది. తీర్పును గూర్చిన భయం, శిక్ష కలుగుతుందన్న గుర్తింపవలన ఈ ఒప్పుకోలు వస్తుంది. అయితే అలాంటి ఒప్పుకోళ్లు పాపిని రక్షించలేవు. పక్క వారికి కనిపించకుండా తమ అపరాధాన్ని దాచి ఉంచగలిగినంత కాలం అనేకులు ఆకానువలె భద్రంగా ఉన్నామని ఊహించుకొని ఆ అపరాధం విషయంలో దేవుడు నిష్కర్షగా ఉండడని భావిస్తారు. క్రీస్తు ప్రాణ త్యాగం తమ పాపాల్ని కడగటానికి వీలులేని దినాన సమయం మించిపోయిన తరుణంలో తమ పాపాలు వారిని బయట పెడ్తాయి. పరలోక గ్రంథాలు తెరచినప్పుడు తన పాపం ఇది అని ఆ న్యాయాధిపతి మాటలతో చెప్పడు. ఒప్పింపజేసే ఒక్క చూపు చూస్తాడు.PPTel 494.1

    అంతే, జీవితంలో జరిగిన ప్రతీ క్రియం, వ్యవహరణ అపరాధికి అతి స్పష్టంగా జ్ఞాపకం వస్తుంది. అపరాధిని కనుగోటానికి యెహోషువ దినాల్లోలా గోత్రాలు, కుటుంబాల వారిగా వెదక నవసరం ఉండదు. నేరస్తుడి పెదవులే అతడి అపరాధాన్ని ఒప్పుకొంటాయి. మనుషులకు తెలియకుండా గోప్యంగా ఉన్న పాపాలు సర్వ ప్రపంచానికి వెల్లడి అవుతాయి.PPTel 494.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents