Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    73—దావీదు చివరి సంవత్సరాలు

    అబ్బాలోము పతనం దేశానికి శాంతి సమాధానాలు తేలేదు. ప్రజల్లో చాలామంది తిరుగుబాటులో పాల్గొన్నందు వల్ల గోత్రా నుంచి ఆహ్వానం లేకుండా దావీదు తన రాజ్యానికి తిరిగి వెళ్లి రాజ్యాధికారం చేపట్టటం సాధ్యపడలేదు. అబాలోము ఓటమి అనంతరము చోటు చేసుకున్న గందరగోళ పరిస్థితుల్లో రాజుని తిరిగి ఆహ్వానించటంలో నిర్దిష్ట చర్య చేపటటం జరగలేదు. తుదకు యూదా ప్రజలు ఆ చర్యకు పూనుకున్నప్పుడు ఇతర గోత్రాల ప్రజల్లో అసూయ నెగళ్ళు రాజుకున్నాయి. దేశంలో మరో విప్లవం లేచింది. దాన్ని వెంటనే అణిచివేయటంతో ఇశ్రాయేలులో శాంతి నెలకొల్పింది.PPTel 763.1

    మనుషులు ఎక్కువగా ఆశపడే అధికారం, ధనం, లోక ప్రతిష్ట వీటి వల్ల ఆత్మకు వాటిల్లే ప్రమాదాన్ని గురించిన సాక్ష్యాల్లో మిక్కిలి శక్తిమంతమైంది మనకు దావీదు చరిత్ర నుంచి లభిస్తుంది. అలాంటి పరీక్షలో నిలవగలగటానికి అనుభవ పూర్వకంగా సిద్ధపడ్డవారు బహు కొద్ది మంది చిన్నతనంలో గొర్రెల కాపరిగా తాను నేర్చుకున్న అణుకువ, సహనం., కఠిన పరిశ్రమ, గొర్రెల్ని గూర్చిన అలనపాలన, కొండల నడుమ ఒంటరిగా ప్రకృతితో సహనం ద్వారా సంగీత సాహిత్యాల పట్ల అభిరుచి, తద్వారా తన ఆలోచన సృష్టికర్త పై నిలవటం. తన సుదీర్ఘ అరణ్య జీవితం,న అది నేర్పిన క్రమశిక్షణ, సాహసం, మనో స్టెర్యం , ఓర్పు, దేవుని మీద విశ్వాసం ఇవన్నీ దావీదును ఇశ్రాయేలు సింహసనానికి అయత్త పర్చటనాఇకి దేవుడు నియమించిన సాధనాలు. దేవుని ప్రేమను అమితంగా పొందిన అనుభవాలు దావీదు జీవితంలో ఎన్నో ఉన్నాయి. దావీదు పరిశుద్దాత్మ వరాన్ని కూడా పొందాడు. కేవలం మానవ వివేకం నిరర్థకం. నిష్ప్రయోజనం అన్న వాస్తవాన్ని సౌలు చరిత్రలో దావీదు కళ్ళారా చూసాడు. అయినా లౌకిక విజయం లోక సంబంధమైన గౌరవ ప్రతిష్టలు దావీదు వర్తనను బలహీనపర్చినందు వలన అతని పై సాతాను పదే పదే విజయం సాధించగలిగాడు.PPTel 763.2

    అన్యులతో సన్నిహిత సంబందం వారి జాతీయ ఆచారాన్ని అవలంభించాలన్న కోర్కె పుట్టించి ఇశ్రాయేలీయుల్లో లోకసంబంధమైన ఔన్నత్యానికి వాంఛను రగుల్కోలిపింది. ఇశ్రాయేలీయులు దైవ ప్రజలుగా గౌవరం పొందారు. అయితే వారిలో అహంకారం ఆత్మ విశ్వాసం పెచ్చు పెరగటంతో తమ ప్రాధాన్యం వారికి తృప్తినియ్యలేదు. ఇతర రాజ్యాల అనుకరణకే వారు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ ధోబిణి వారిని శోధనకు గురి చేసింది. ఇతర రాజ్యాల్ని జయించి తన రాజ్యాన్ని విస్తరించుకోవాలన్న ఉద్దేశంతో దావీదు తన సైన్యాన్ని పెంచాలనుకొన్నాడు. అందుకు తగిన వయసులో ఉన్న వారందరిని నిర్బంధ సైన్య సేవకు ఎంపిక చెయ్యాలని భావించాడు. ఇందుకోసం జనాభా లెక్కలు వేయటం ఆగత్యమయ్యింది. రాజు ఈ చర్య చేపట్టటానికి హేతువు అహంభావం దురాశలే. దావీదు సింహాసనానికి వచ్చినప్పుడు దేశం ఎంత బలహీనంగా ఉన్నదో అతని పరిపాలన కింద దేశం ఎంత బలంగాను సుభిక్షంగాను ఉన్నదో అన్న తేడాల్ని ఈ జనాభా లెక్కలు వివరించనున్నాయి. ఇప్పటికే రాజులోను ప్రజల్లోను అతిగా ఉన్న ఆత్మ విశ్వాసాన్ని ఇంకా ఎక్కువ చేయటానికి ఇది తోడ్పడుతుంది. లేఖనం ఇలా అంటున్నది. “సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి, ఇశ్రాయేలీయులికి లెక్కించుటకు దావీదును” ప్రేరేపించాడు. దావీదు పరిపాలన కింద ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును” ప్రేరేపించాడు దావీదు పరిపాలన కింద ఇశ్రాయేలీయులికి కలిగిన అభివృద్ధిరాజు ప్రతిభవల్ల గాని ఇశ్రాయేలు సైన్య పటిమ వల్లగాని కలిగింది కాదు. దేవుని అశీర్వాదం వారి పై ఉండటం వల్లనే అది సాధ్యపడింది. దేశ భద్రతాదళాల పెంపుదల ఇశ్రాయేలీయులు తమ దేవుడైన యెహోవా మీద గాక తమ సైన్యం శక్తిసామార్థ్యాల మీద నమ్మకం పెట్టుకొన్నారన్న అభిప్రాయం చుట్టుపట్ల ఉన్న రాజ్యా లకు కలిగిస్తుంది.PPTel 763.3

    తమ జాతి గొప్పతనం గురించి ఇశ్రాయేలీయులు అతిశయ పడుతున్నప్పటికి సైన్యాన్ని అంత ఎక్కువగా పెంచాలన్న దావీదు యోచనను వారు ఆమోదించలేదు. రాజు ప్రతిపాదించిన జనాభా లెక్కింపు కార్యక్రమం తీవ్ర అసంతృప్తి కలిగించింది.ఫలితంగా యాజకులు న్యాయాధికారుల స్థానంలో సైనిక అధికారుల్ని నియమించారు. క్రితం యాజకులు న్యాయాధికారులే జనాభా లెక్కలు సేకరించే వారు. ఈ చర్య ఉద్దేశం దైవపరిపాలన నిబంధనకు విరుద్ధం. నియామలు లేని వ్యక్తిగా అప్పటి వరకు తన్నుతాను కనపర్చుకొన్న యోవాబు సయితం ఆ ఆలోచనను వ్యతిరేకించాడు. యోవాబు ఇలా అన్నాడు. “రాజా నీ యేలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే నూరంతలు ఎక్కువ మందిని చేయునుగాక; వారందరు నా యేలినవానికి ఈ విచారణ యేల? ఇది జరుగవలసిన హేతువేమి? జరిగిన యెడల ఇశ్రాయేలీయులకు శిక్షకలుగును... అయినను యోవాబు మాటచెల్లక రాజు మాటయే చెల్లను గనుక యోవాబు ఇశ్రాయేలు దేశమంతట సంచిరించి తిరిగి యెరూషలేమునకు ” వచ్చాడు. దావీదు తమ పాపాన్ని గుర్తించేసరికి జనులను లెక్కించటం పూర్తికాలేదు. “నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకొంటిని. నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొట్ట” పెట్టుకున్నాడు దావీదు. మరుసటి ఉదయం ప్రవక్త అయిన గాదు ద్వారా దావీదుకి దేవుడు ఈ వర్తమానం పంపాడు. “మూడేండ్ల పాటు కరువు కలుగుట., మూడు నెలలపాటు నీ శత్రువులు కత్తిదూసి నిన్ను తరుమగా నీవు వారి యెదుట నిలువలేక నశించిపోవుట, మూడు దినములపాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమందంతట నాశనము కలుగజేయుట అనువీటిల ఒక దానిని నీవు కోరుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నన్ను పంపినవానికి ఏమి ప్రత్యుత్తరమియ్య వలెనో దాని యోచించుము”.PPTel 764.1

    రాజు ఇచ్చిన జవాబు ఇది: “నేను మిక్కిలి యిరుకులో చిక్కియున్నాను. యెహోవా మహాకృపగలవాడు. నేను మనుష్యుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగాక”. కనుక దేవుడు దేశం మీదికి తెగులు పంపాడు. దాని వల్ల డెబ్బయి వేలమంది ఇశ్రాయేలీయులు నాశనమయ్యారు. తెగులు ఇంకా రాజధానిలో ప్రవేశించలేదు. అప్పుడు “దావీదును పెద్దలను గోనెపట్టలు కప్పుకొనినవారై సాష్టాంగ” పడ్డారు. ఇశ్రాయేలీయుల పక్షంగా ఇలా మొర పెట్టుకున్నాడు. “జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చినవాడను నేనేగదా? పాపము చేసి చెడుతనము జరిగించినవాడును నేనేగదా? గొట్టేలవంటి వారగు వీరేమి చేసిరి? నా దేవుడైన యెహోవా, బాధ పెట్టు నీ చెయ్యి నీ జనుల మీద నుండకుండా నా మీదను నా తండ్రి ఇంటివారి మీదను ఉండనిమ్ము”.PPTel 765.1

    జనాభా లెక్కించటం ప్రజల్లో అసమ్మతిని సృష్టించింది. అలాగని వాళ్లు నీతి వర్తమానులు కారు. దావీదు చేసిన పాపమే. వారిలోను దోబూచులాడుతున్నది. అబ్బాలోము పాపం ద్వారా దావీదుకి శిక్ష విధించిన రీతిగానే దావీదు అపరాధం మూలంగా దేవుడు ఇశ్రాయేలీయుల్ని శిక్షించాడు.PPTel 765.2

    విధ్వంసక దూత యెరూషలేము వెలుపల ఆగాడు. “యోబూ సీయుడైన ఒర్నాను కళ్ళమునొద్ద ” మోరీయా కొండమీద నిలబడ్డాడు. ప్రవక్త ఆదేశం మేరకు దావీదు ఆ కొండవద్దకు వెళ్ళి, అక్కడ ప్రభువుకి బలిపీఠం కట్టి “దహన బలులును, సమాధాన బలులును అర్పించి యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆకాశము నుండి దహనబలి పీఠము మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరమిచ్చెను. “యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను అలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను”.PPTel 765.3

    బలిపీఠం కట్టిన స్థలం అప్పటి నుండి పరిశుద్ధ స్థలమయ్యింది. ఒర్నాను దాన్ని రాజుకి బహుమానంగా ఇవ్వటానికి చూసినప్పుడు రాజు ఈ మాటలతో దన్ని నిరకారించాడు. “అట్లు కాదు నేను నీ సొత్తును ఊరక తీసుకొని యెహోవాకు దహన బలులును అర్పించను.న్యాయమైన క్రయధనిమిచ్చి దాని తీసుకొందునని ఒర్నానుతో చెప్పి ఆభూమికి ఆరువందల తుమలు బంగారము అతనికిచ్చెను.” అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి బలిపీఠం కట్టిన స్థలంగా ప్రసిద్ధికెక్కింది. ఇప్పుడు ఈ గొప్ప విడుదల వల్ల పరిశుద్ధత సంతరించుకొన్న ఈ స్థలం అనంతరము సాలొమెను నిర్మించనున్న ఆలయానికి ఎంపికయ్యింది.PPTel 766.1

    దావీదు చివరి సంవత్సరాల పై మబ్బులు ముసిరాయి. అతడు డెబ్బయి ఏళ్ళ వయసుకు చేరుకొన్నాడు. తన యౌవనంలోకి సంచారాలు, తాను చేసిన అనేక యుద్ధాలు, అనంతరము సంవత్సరాల్లో తాను అనుభవించిన శ్రమలు, భరించిన విచారాలు అతని ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. తన మనసు చురుకుగాను బలంగాను ఉన్నప్పటికి, బలహీనత, వయస్సు ఒంటరిగా ఉండాలన్న కోరిక వల్ల రాజ్యంలో జరగుతున్న కార్యాల్ని త్వరగా గ్రహించటం సాధ్యపడలేదు. తన సింహాసనం క్రీనీడలోనే మళ్ళీ తిరుగుబాటు ప్రారంభమయ్యింది. దావీదు పితృవాత్సల్య పరిణామం మళ్ళీ బయటపడింది. ఇప్పుడు సింహాసనాన్ని అధిష్టించాలని ఆశించిన వాడు ఆదోనియా, అతడు “బహు సౌందర్యము గలవాడు” కాని నియమ నిబంధనలు, అదుపాజ్ఞలు ఉన్నవాడు కాదు. యౌవనంలో నియంత్రణ లేకుండా పెరిగినవాడు. “అతని తండ్రి - నీవు ఈలాగు ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు.” అతదడిప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేశాడు. సాలొమెనును రాజుగా నియమించినందుకు, ఇశ్రాయేలు రాజు కావటానికి స్వాభావిక సమర్ధతలు మత వైరాగ్యాన్ని బట్టి చూస్తే తన అన్న కన్నా సాలొమెనే యోగ్యుడు. దేవుని ఎంపిక విస్పష్టంగా కనిపిస్తున్నా ఆదోనియాకు సానుభూతిపరులు కొదువ కాలేదు. యోవాబు ఎన్నో నేరాలకు పాల్పడ్డప్పటికీ అప్పటి దాకా రాజుకి నమ్మకంగానే ఉన్నాడు. కాని ఇప్పుడు సాలొమెనుకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో అతడూ యాజకుడైన అబ్యాతారు చేతులు కలిపారు.PPTel 766.2

    తిరుగుబాటు ముమ్మరంగా ఉంది. ఆదోనియాను రాజును చెయ్యటానికి కుట్రదారులు పట్టణం శివారులో గొప్ప విందు ఏర్పాటు చేసి అక్కడ సమావేశమయ్యారు. ఆ తరుణంలో కొంతమంది ప్రధానంగా యాజకుడు సాదోకు, ప్రవక్త నాతాను, సాలొమెను తల్లి బలైబ తక్షణ చర్య తీసుకోవటం వల్ల కుట్రదారుల ప్రయత్నాలకు చుక్కెదరయ్యింది. పరిస్థితుల్ని వారు రాజుకి వివరించారు. తన తర్వాత సాలొమోను రాజు కావడం దేవుని ఆదేశమని రాజుకి గుర్తు చేశారు. సాలొమోనకు బలి కలిగేటట్లుగా దావీదు వెంటనే సింహాసనాన్ని ఖాళీ చేసి సాలొమెనుని అభిషేకించి రాజుగా ప్రకటించాడు. తిరుగుబాటును అణిచివేశారు. అందులోని ప్రధాన పాత్రుదారులు మరణశిక్షకు గురి అయ్యారు. అబ్యాతారు సదాను దావీదుకు గతంలో అతడందించిన సేవల్ని మనసులో ఉంచుకొని అతణ్ణి చంపకుండా విడిచి పెట్టారు. కాని అతడి ప్రధాన యాజక సూదాను తీసివేసి దాన్ని సాదోకు వంశానికి బదలాయించారు. యోవాబు, అదోనీయాల్ని కూడా విడిచి పెట్టారు. కాని దావీదు మరణించిన తరువాత వారు తమ నేరానికి మూల్యం చెల్లించారు. దావీదు కుమారుడి విషయంలో అమలైన శిక్షతో తండ్రి పాపం పట్ల దేవుని ఏవగింపును సూచించే దేవుని నాలుగు అంశా తీర్పు పూర్తి అయ్యింది.PPTel 767.1

    రాజుగా దావీదు పరిపాలన మొదలు పెట్టినప్పటి నుండి తన మిక్కిలి ప్రియమైన ప్రణాళికల్లో ఒకటి ప్రభువుకి ఆలయం నిర్మించటం. దాన్ని నిర్మించటానికి తనకు అనుమతి లభించకపోయినా దానివిషయమై అతి ఉద్రే కంగాని ఉత్సాహం గాని, ఏమాత్రం తగ్గలేదు. బంగారం, వెండి, సులేమాని రాళ్ళు వివిధ రంగుల రాళ్ళు వంటి విలువైన వస్తువులు, పాలరాయి మిక్కిలి ప్రశస్తమైన కలపవంటి వస్తువుల్ని సమద్దిగా సమకూర్చాడు. అయితే తాను సమకూర్చిన ఈ వస్తువుల్ని అప్పగించాల్సి వచ్చింది. దైవ సముఖానికి చిహ్నమైన మందసానికి ఆలయాన్ని ఇతరులు నిర్మించాల్సి ఉన్నారు.PPTel 767.2

    తన అంతం సమీపించింది. గుర్తించిన రాజు ఈ విశ్వాస వారసత్వాన్ని అందుకోవటానికి గాను ఇశ్రాయేలు ప్రధానుల్ని దేశం అన్ని ప్రాంతాల నుంచి ప్రతినిధుల్ని సమావేశపర్చాడు. తన మరణానికి ముందు తన బాధ్యతను వారికి అప్పగించి తాము నిర్విహించాల్సిన పనిలో వారి ఆమోదాన్ని మద్దతను పొందాలని చూశాడు. కాని ఈ మార్పిడికి తన శారీరక బలహీనతల వల్ల తాను వ్యక్తిగతంగా అక్కడ హాజరుకావటం అవసరం లేదు. కాని అతని మీదికి దైవావేశం వచ్చింది. తన ప్రజలతో ఆఖరిసారిగా మాట్లాడటానికి శక్తి వచ్చింది. ఆలయాన్ని నిర్మించాలన్న కోరిక తనకున్నదని కాని ఆ పని తనకుమారుడు సాలొమోను నిర్వహించాల్సి ఉన్నట్లు ప్రభువు ఆదేశించాడని దావీదు వారితో చెప్పాడు. దేవుడు ఈ వాగ్దానం చేశాడు. “నీకుమారుడైన సాలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచు కొనియున్నాను. నేను అతనికి తండ్రినైయుందును అతడు నాకు మందిరమును నా ఆవరణహులను కట్టించును. మరియు నేటి దినమున చేయుచున్నట్లు అతడు ధైర్యము వహించి నా ఆజ్ఞలను నా న్యాయ విధులను అనుసరించిన యెడల నేనతని రాజ్యమును నిత్యము స్థిపరుచదును”. “కాబట్టి మీరు ఈ మంచి దేశము స్వాస్థ్యముగా అనుభవించి మీ తరువాత మీ సంతతి వారికి శాశ్వత స్వాస్థ్యముగా దానిని అప్పగించునట్లు మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన యాజ్ఞలన్నియు ఎట్టివో తెలిసికొని వాటిని గైకొనుడి అని యెహెూవా సమాజమునకు చేరిన ఇశ్రాయేలీయులందరు చూచుచుండగను నేను మిమ్మును హెచ్చరిక చేయుచున్నాను”. అన్నాడు దావీదు.PPTel 767.3

    దేవుని మార్గము నుండి వైదొలగే వారి మార్గం ఎంత కఠినమైందో దావీదు అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాడు. తాను ఉల్లంఘించిన ధర్మశాస్త్రం తాలూకు ఖండనను గుర్తించాడు. ఉల్లంఘన ఫలితాల్ని అనుభవించాడు. ఇశ్రాయేలు నాయకులు దేవునికి నమ్మకంగా ఉండాలని, సాలొమోను దైవ దర్మశాస్త్రానికి విధేయుడై జీవించాలని, తన తండ్రి అధికారాన్ని నిర్వీర్యం చేసి అతని జీవితాన్ని దు:ఖం పాలు చేసి దేవుణ్ణి అగౌరవపర్చిన పాపాల్ని అతడు త్యజించాలని దావీదు ఆత్మ నిండి ఆతురత నింపుకున్నాడు. తన ఉన్నత స్థానంలో తన్ను వేధించే శోధనల్ని జయించటానికి సాలొమోనుకు దీన మనసు, అనుక్షణం దేవుని పై నమ్మం, నిరంతర జాగృతి అవరమౌతాయని దావీదుకు తెలుసు. ఎందుకంటే అలాంటి ప్రముఖ వ్యక్తుల పై సాతాను తన బాణాల్ని ఎక్కు పెట్టి ఉంచుతాడు తన వారసుడిగా అప్పటికే గుర్తించిన తన కుమారుడి పక్కకు తిరిగి దావీదు ఇలా అన్నాడు. “సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించు వాడును. ఆలోచనలన్నింటిని సంకల్పములన్నింటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయ పూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన యెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరికొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము”.PPTel 768.1

    ఆలయ నిర్మాణం విషయంలో చిన్న చిన్న వివరాల్లో సయితం సూచను చేశాడు. ఆలయం ప్రతీ భాగానికి, ఆలయ సేవకు సంబంధిత ఉపకరణ తయారీకి దేవుడు తనకు కనపర్చిన విధంగా నమూనాలిచ్చాడు. సాలొమోను ఇంకా చిన్నవాడే. ఆలయ నిర్మాణం, దైవ ప్రజల్ని పరిపాలించటం అన్న బాధ్యతల్ని వహించేందుకు ఏమంత సుముఖంగా లేడు. దావీదు తన కుమారునితో ఇలా అన్నాడు, “నీవు బలము ఒపంది ధైర్యము తెచ్చుకొని యీ పనికి పునుకొనుము,. భయపడకుండుము, వెరవకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును... ఆయన నిను ఎంతమాత్రము విడువక యుండును”.PPTel 769.1

    మళ్ళీ దావీదు సమాజానికి ఇలా విజ్ఞప్తి చేసాడు. “దేవుడు కోరికొనిన నా కుమారుడైన సాలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై యున్నాడు.కట్టబోవు ఆలయము మనుష్యునికి కాదు దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన”వస్తువుల్ని పోగు చేశానంటూ తాను సమకూర్చిన వివిధ వస్తువుల్ని పేర్కొన్నాడు. దావీదు ఇంకా ఇలా అన్నాడు. “మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగియున్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్టితమైన మంరదిరము నిమిత్తము సంపాదించియుంచిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెంబడిని నా దేవుని మందరము నిమిత్తము నేనిచ్చెదను. గదుల గోడల రేకు మూతకును బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని పనివారు చేయు ప్రతివిధమైన పనికి ఆరువలే మణుగుల ఓఫీరు బంగారమును, పదునాలుగువేల మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. “”ఈ దినమును యెహోవాకు ప్రతిష్టితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా”? అని కానుకలు తెచ్చిన ఆ జన సమూహాన్ని ప్రశ్నించాడుPPTel 769.2

    సభ నుంచి తక్షణ ప్రతిస్పందన వచ్చింది. అప్పుడు పితరుల ఇండ్ల అధిపతులును ఇశ్రాయేలీయులు గోప్రతు అధిపతులును సహస్రాది, పతులును రాజు పని మీద నియమింపబడిన అధిపతులును కలసి మనఃపూర్వకముగా దేవుని మందరిపు పనికి పది వేల మణుగుల బంగారమును ఇరువది వేల మణుగుల బంగారపుద్రాములను ఇరువది వేల మణుగుల వెండిని ముప్పదియారువేల మణుగుల ఇత్తడిని రెండు లక్షల మణుగు యినుమను ఇచ్చిరి. తమ యొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసము(నకు.... ఇచ్చిరి. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు అలాగు మనఃపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషించిరి.PPTel 769.3

    “రాజైన దావీదు కూడను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు సోత్రము చెల్లించెను. మాకు తండ్రగానున్న ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా, నిరంతరమము నీవు సోత్రార్హుడవు. యెహోవా భూమ్యాకాశములందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకు చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదనున్న అధిపతిగా హెచ్చించు కొనియున్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలేవాడవు. బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే. మా దేవా, మేము మీకు కతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామార్ద్యము మాకుండుటకు నేనెంత మాత్రపువాడను? నా జనులెంత మాత్రపువారు? సమస్తమును నీవలననే కలిగెనుగదా?స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి యున్నాము.మా పితరులందరివలెను మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశు లమునైయున్నాము.మా భూ నివాస కాలము నీడయంత ఆస్థిరము.స్థిరముగా ఉన్న వాడొకడును లేడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ద నామము యొక్క ఘనతకొరకు మందరిమును కట్టించుటకై మేము సమకూర్చిన యీ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే. అంతయు నీదియైయున్నది. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యధార్ధవంతుల యందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును.PPTel 770.1

    “నేనైతే యద్దార్ద హృదయము గలవాడనై యివియన్నియు మన:శపూర్వక ముగా ఇచ్చియున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండు నీ జనులును నీకు మన:పూర్వక ముగా ఇచ్చట చూచి సంతోషించుచున్నాను. అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు అను మా పితరుల దేవా, నీజనులు హృదయపూర్వకముగా సంకల్పించినయీ ఉద్దేశమును నిత్యము కాపాడుము. వారి హృదయమును నీకు అనుకూలపరుచుము. నా కుమారుడైన సొలొమోను నీ యాజ్ఞను నీ నీ సనమును నీ కట్టడలను యీ ఆలయమునకు కట్టించునట్లును. నేను కట్టదలచిన యీ ఆలయమును కట్టించునట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయుము. ఈలాగు పలికి తరువాత దావీదు ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకు లందరితో చెప్పగా వారందరును తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని.. నమస్కారము చేసిరి”.PPTel 770.2

    అమితాసక్తితో దేవాలయము నిర్మాణానికి దేవాలయలాంకరణకు అవసరమైన విలువైన వస్తు సముదాయాన్ని రాజు సమకూర్చాడు. దావీదు అద్భుతమైన కీర్తనలు రచించాడు. అవి అనంతర సంవత్సరాల్లో ఆ ఆలయంలో ప్రతిధ్వనించనున్నాయి. తన విజ్ఞపి సమంజా అధిపతి. ఇశ్రాయేలీయలు ప్రధానులు అనుకూలంగా స్పందించి తమ ముందున్న ప్రాముఖ్యమైన పనికి తమ్మును తాము అంకితం చేసుకొన్నందుకు దేవుని పేర దావీదు బహుగా ఆనందించాడు. దైవ సేవ చేసే కొద్ది ప్రజలు మరెక్కువ సేవ చేయటానికి ఉద్రేకం పొందారు. ప్రజలు తమ ఆస్తుల్ని దేవునికి అర్పించటంతో కానుకలు విపరీతంగా పెరిగాయి. ఆలయ నిర్మాణం కోసం వస్తువులు సమకూర్చటానికి తాను అయోగ్యుడని దావీదు పరిగణించాడు. తన రాజ్యంలోని ప్రధానులు తమ విజ్ఞప్తి ప్రతిస్పందించి తమ ధనాన్ని మన:పూర్వకముగా దేవునికి సమర్పించి ఆయన సేవకు అంకితమవ్వటం ద్వారా ప్రదర్శించిన భక్తి విశ్వాసాలు రాజుకి అమితానందం కలిగించాయి. అయితే ప్రజలకు ఈ స్వభావాన్ని పుట్టించిది దేవుడే. మహిమ పొందాల్సింది ఆయనే. మానవుడు కాదు. ప్రజలకు ఫలసాయం ఇచ్చింది ఆయనే. ఆలయ నిర్మాణం నిమిత్తం ప్రజలు విలువైన కానుకలు తేవటానికి వారికి సిద్దమనసు ఇచ్చింది దేవుని ఆత్మ. ఆదంతా ప్రభువుదే. దైవ ప్రేమ ప్రజల హృదయాల్ని ప్రభావితం చేయకపోతే రాజు ప్రయత్నాలు నిరర్థకమయ్యేవి. ఆలయ నిర్మాణం జరిగేది కాదు.PPTel 771.1

    దేవుడు సమృద్ధిగా సమకూర్చిన వనరు నుంచి మానవుడు పొందే సమస్తం దేవునిదే. తన పట్ల మనుషుల ప్రేమ ఎంత గాఢమయ్యిందో ఆయన ఉపకారాల్ని వారు ఎంతవరకు అభినందిస్తున్నారో పరీక్షించటానికి భూమి మీద విలువైన సుందరమైన వస్తుజాలం రూపంలో దేవుడు సమస్తం మానవుల చేతుల్లో పెడుతున్నాడు. అవి ధనరాశులుగాని ప్రతిభా సంపద గాని వాటిని మన:పూర్వకమైన అర్పణగా యేసు పాదాల వద్ద ఉంచాల్సి ఉన్నాం. ఇచ్చేవారు దావీదుతో ఇలా గళం కలపాలి: “సమస్తము నీవలననే కలిగెను గదా? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చియున్నాము”.PPTel 771.2

    మరణం సమీపిస్తున్నట్లు గ్రహించినప్పుడు దావీదు సాలొమోను గురించి ఇశ్రాయేలు రాజ్యం గురించి ఆలోచించాడు. దేశ ప్రగతి రాజు నీతి నిజాయితీల మీద ఆధారపడి ఉంటుంది. “అతడు తనకుమారుడైన సాలొమెనుకును ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరు పోవలసిన మార్గమును నేను పోవుచున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహెూవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గము లననుసరించిన యెడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయవిధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా నుండి నా యెదుట తమ పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతోను సత్యముననుసరించి నడుచుకొనిన యెడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపర్చును” 1 రాజులు 2:1-4PPTel 771.3

    దావీదు చివరి మాటలు నమ్మకం వ్యక్తం చేసే కీర్తన సమున్నత నియమం. అచంచల విశ్వాసం వ్యక్తం చేసే గీతం :PPTel 772.1

    “దావీదు రచించిన చివరి మాటలు ఇవే; యెషయి
    కుమారుడగు దావీదు పలికి దేవోక్తి యిదే;
    యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము
    నొందినవాడును ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతము
    లను మధుర గానము చేసిన గాయకుడునగు దావీదు
    పలికిన దేవోక్తి ఇదే ;
    యెహోవా ఆత్మనా ద్వారా పలుకుచున్నాడు
    ఆయన వాక్కు నా నోట ఉన్నది
    ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు
    ఇశ్రాయేలీయులకు ఆశ్రయ దుర్గమగువాడు
    నా ద్వారా మాటలాడుచున్నాడు
    - మనుష్యులను ఏలునొకడు పుట్టును అతడు నీతిమంతుడై దేవునియందు భయభక్తులు గలిగి
    యేలును
    ఉదయకాలపు సూర్యోదయ కాంతివలెను
    మబ్బు లేకుండ ఉదయించిన సూర్యునివలెను
    వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత
    భూమిలో నుండి పుట్టిన లేత గడ్డివలెను
    అతడు ఉండును
    నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులేగదా
    ఆయన నాతో నిత్య నిబంధన చేసియున్నాడు
    ఆయన నిబంధన సర్వ సంపూర్ణమన నిబంధనే
    అది స్థిరమాయెను, దేవునికి పూర్ణానుకూలము
    అది నాకనుగ్రహించబడిన రక్షణార్థమైనది
    నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును”.
    PPTel 772.2

    దావీదు పాపం అతిఘోర పాపం. అయితే అతని పశ్చాత్తాపం కూడా గొప్పదే. అతని ప్రేమ ప్రగాఢమైనది. అతని విశ్వాసం బలమైంది. అతడు ఎక్కువ క్షమాపణ పొందాడు,.అందుకే అతడు ప్రభువుని ఎక్కువగా ప్రేమించాడు. లూకా 7:48PPTel 773.1

    దావీదు కీర్తనలు మానవుడి అనుభవవ పరిధి అంతటిని స్పృశిస్తున్నాయి. అపరాధ ఆగాదాల్ని విశ్వాస శిఖరాల్ని దేవునితో సహవాస సమున్నత శిఖరాగ్రాల్ని స్పృశిస్తున్నాయి. పాపం పరాభవం దుఃఖం కలిగిస్తుందని, అయితే దేవుని ప్రేమ కనికరాలు అగాధపు లోతులకు దిగి పశ్చాత్తాపం పొందే ఆత్మల్ని పైకి లేపి వారిని దేవుని కుమారులుగా రూపుదిద్దుతాయని దావీదు జీవిత చరిత్ర వెల్లడిచేస్తున్నది. దైవ వాక్యంలో ఉన్న వాగ్దానాలన్నిటిలోను ఇది దేవుని విశ్వసనీయతను, న్యాయశీలతను, కృపా నిబంధనలను గూర్చిన మిక్కిలి బలమైన సాక్ష్యం.PPTel 773.2

    “నీడ కనబడకపోవునుట్లు వాడు (నరుడ) నిలువక పారిపోవును” “మన దేవుని వాక్యము నిత్యము నిలుచును” “ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలననుసరించి నడుచుకొనువారి మీద యెహోవా యందు భయభక్తులు గలవారిమీద ఆయన కృప యుగములు నిలుచును. ఆయన నీతివారికి పిల్ల పిల్ల తరమున నిలుచును”. యోబు 14:2 యెషయా 40:8 కీర్తనలు 103:17, 18PPTel 773.3

    “దేవుడు చేయు పనులిన్నయు శాశ్వతములు” ప్రసంగి 3:14 దావీదుకి అతడి వంశానికి దేవుడు చేసిన వాగ్దానాలు అద్భుతమైనవి. అవి అంతులేని నిత్య జీవన యుగాలకు సంబంధించినవి. వాటి నెరవేర్పు క్రీస్తులో జరగనుంది. ప్రభువిలా అంటున్నాడు.PPTel 774.1

    “నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసియున్నాను.. నా చెయ్యి యెడతెగక అతనికి తోడైయుండును. నా బహుబలము అతని బలపరుచను. ఏ శత్రువును అతని మీద జయము పొందడు. దోషకారులు అతని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండ అతని విరోధులను నేను పడగొట్టెదను. అతని మీద పగపట్టువారిని మొత్తెదను. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడైయుండను. నా నామమును బట్టి అతని కొమ్మ హెచ్చింపబడును. నేను సముద్రము మీద అతని చేతిని నదుల మీద అతని కుడిచేతిని ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు. నా రక్షణ మార్గము అని నాకు మొఱ్ఱపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ట కుమారునిగా చేయుదును. భూరాజులో అత్యున్నతునిగా నుంచదెను. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజే సెదను నా నిబంధన అతనితో స్థిరముగా నుండును” కీర్తనలు 89:4-28 PPTel 774.2

    “శాశ్వత కాలము వరకు అతని సంతానమును
    ఆకాశమున్నంతవరకు అతని సింహాసనమును
    నిలిపెదను.”
    PPTel 774.3

    కీర్తనలు 89:29

    “ప్రజలలో శ్రమ నొందువారికి అతడు న్యాయము తీర్చును
    బీదల పిల్లలను రక్షించి బాధ పెట్టువారిని నలగగొట్టును
    సూర్యుడు నిలుచునంద కాలము
    చంద్రుడు నిలుచునంత కాలము తరములన్నిటను
    జనులు నీయందు భయభక్తులు కలిగియుందురు...
    సముద్రము నుండి సముద్రము వరకు
    యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును”.
    “అతని పేరు నిత్యము నిలుచును
    అతని నామము సూర్యుడున్నంతకాలము చిగుర్చు
    చుండును
    అతని బట్టి మనుష్యులు దీవింపబడుదురు
    అన్యజనులందరు అతదు ధన్యుడని చెప్పుకొందురు”.
    PPTel 774.4

    కీర్తనలు 72:4-8,17.

    “ఏలయనగా మనకు శిశువు పుట్టెను.మనకు కుమారుడు అనుగ్రహింప బడెను. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.” “ఆయన గొప్పవాడై సర్వన్నోతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులును యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లే నిదైయుండును”. యెషయా 9:6 లూకా 1:32,33.PPTel 775.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents